Ad Code

అసూస్ నుంచి 'జెన్‌ఫోన్ 11 అల్ట్రా' స్మార్ట్‌ఫోన్ విడుదల !

సూస్ 'జెన్‌ఫోన్ 11 అల్ట్రా' పేరుతో ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను యూరప్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర యూరోలు 999 (రూ. 90,550) గా ఉంది. డిస్కౌంట్ పోనూ సుమారు రూ. 74,490/- కి లభిస్తుంది. ఏప్రిల్ నాటికి ఈ ఫోన్ ఏసియన్ మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ చాలావరకు అసూస్ గతంలో లాంచ్ చేసిన 'ROG ఫోన్ 8' సిరీస్ తరహా డిజైన్, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. అయితే, AI కాల్ అనువాదాలు, ట్రాన్‌స్క్రిప్ట్‌లు, వాల్‌పేపర్‌లు, నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు అదనంగా అందిస్తున్నారు. ఇది అసూస్ బ్రాండ్ నుంచి వచ్చిన ఒక హై ఎండ్ స్మార్ట్‌ఫోన్, అందువల్ల ఫీచర్లు కూడా స్థాయికి తగినట్లు ఉంటాయి. ఈ హ్యండ్ సెట్ లో 5-మాగ్నెట్ స్టీరియో స్పీకర్లు, అసూస్ ASUS నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో ట్రై-మైక్రోఫోన్‌లు ఉన్నాయి. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోన్ ఎటర్నల్ బ్లాక్, మిస్టీ గ్రే, స్కైలైన్ బ్లూ మరియు డెసర్ట్ శాండ్ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే, 12 GB/16 GB RAM, 256 GB/512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం,క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, వెనకవైపు 50MP +32MP+13MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 5500mAh బ్యాటరీ సామర్థ్యం, 65W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్, అదనంగా కనెక్టివిటీ కోసం, Asus Zenfone 11 Ultraలో 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్లు, ఇన్- డిస్ల్పే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7 802.11 be, బ్లూటూత్ 5.4, GPS/GLONASS/Beidou, గెలీలియో(E1+E5a), USB టైప్-C, NFC ఉన్నాయి.


Post a Comment

0 Comments

Close Menu