Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label science. Show all posts
Showing posts with label science. Show all posts

Saturday, September 16, 2023

ఐఫోన్15లో NavIC టెక్నాలజీ !


ఫోన్15  ప్రో, ఐఫోన్15 ప్రో మాక్స్  ఫోన్లలో దేశీయ టెక్నాలజీ అయిన నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ ని తీసుకువస్తుంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్  అనేది ఇండియా స్వతహాగా రూపొందించుకున్న జీపీఎస్ లాంటి నావిగేషస్ టెక్నాలజీ. దేశీయ టెక్నాలజీని ఐఫోన్లలో తీసుకురావడం ఇదే తొలిసారి. అయితే ఐఫోన్ 15, ఐపోన్ 15 ప్లస్ వెర్షన్లలో మాత్రం ఈ టెక్నాలజీ పనిచేయదు. ఐఫోన్ 15లో NavIC తో పాటు గెలీలియో, GLONASS వంటి జీపీఎస్ సిస్టమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అమెరికా, రష్యా, చైనాలకు ఉన్నవిధంగానే భారత్ కు కూడా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అవసరం ఉందని ఇస్రో భావించి NavIC వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఇది ఇండిపెండెంట్ స్టాండ్-లోనే నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. 2006లో ప్రారంభమైన నావిక్, 2011లో ప్రారంభమవుతుందని అంచనా వేసినప్పటికీ, 2018లో ప్రారంభమైంది. ఇది ఇండియా కొరకు పనిచేసే ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ. నావిక్ శాటిలైట్ వ్యవస్థని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం చాలా దేశాలు అమెరికా నావిగేషన్ వ్యవస్థ అయినటువంటి GPSని కలిగి ఉంటుంది. ఇదే విధంగా భారత్ కూడా తన దేశ అవసరాలకు, రక్షణకు ఉద్దేశించి నావిక్ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం 7 శాటిలైట్లు పనిచేస్తాయి. ప్రస్తుతం నావిక్ దేశంలో పబ్లిక్ వెహికిత్ ట్రాకింగ్‌లో ఉపయోగించబడుతోంది. ఇది కాకుండా, సముద్రంలో వెళ్లే మత్స్యకారులకు అత్యవసర హెచ్చరికలు అందించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. నావిక్ ప్రకృతి విపత్తులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 7 శాటిలైట్లు, గ్రౌండ్ స్టేషన్లు 24/7 పనిచేస్తాయని ఇస్రో తెలిపింది. ఈ 7 శాటిలైట్లలో 3 'జియో స్టేషనరీ ఆర్బిట్(భూస్థిర కక్ష్య)'లో, మరో 4 జియో సింక్రోనస్ కక్ష్యలో ఉన్నాయి. నావిక్ శాటిలైట్ వ్యవస్థ రెండు రకాల సేవల్ని అందిస్తోంది. SPS (స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్) పౌర సేవల కోసం, RS (నియంత్రిత సేవ) వ్యూహాత్మక ప్రయోజనాల కోసం. ఈ వ్యవస్థ దేశంతో పాటు దేశ సరిహద్దుల నుంచి 1500 కి.మీ వరకు కవరేజ్ చేస్తుంది. నావిక్ 20 మీటర్ల కంటే మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. 50 ns కంటే మెరుగైన టైమ్ ఆక్యురసీని అందిస్తుంది. నావిక్ SPC సిగ్నల్స్ జీపీఎస్, GLONASS, గెలీలియో, బీడౌ అనే ఇతర గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్‌లతో పరస్పరం పనిచేయగలవు

స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి !


చిన్నారులు స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నారని సంతోషించే పేరెంట్స్‌ అనారోగ్యాన్ని పంచుతున్నారని తెలుసుకోలేక పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పిల్లలు గంటల తరబడి టీవీ చూడడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంది. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. చిన్నతనంలో అధికంగా ఫోన్‌ చూసే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 5ఏళ్ల లోపు చిన్నారులు రోజులో ఒక గంట కంటే ఎక్కువ ఫోన్‌ చూడకూడదని చెబుతున్నారు. పిల్లలకు స్క్రీన్‌ టైమ్‌ను వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు. రేడియేషన్‌ ప్రభావం కూడా పిల్లలపై నెగిటివ్‌ ఇంపాక్ట్ చూపుతుందని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌ల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌ వారి కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చిన్నారుల నిద్రపై కూడా దుష్ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారి, ఎవరితో మాట్లాడకుండా ఉండే చిన్నారుల మానసిక ప్రవర్తనలోనూ భయంకరమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు. పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీని పెంచాలని, స్మార్ట్ ఫోన్‌ల వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే 43 విడుదల !


దేశీయ మార్కెట్లోకి షియోమీ సంస్థ రెడ్ మీ సిరీస్ లో  43-అంగుళాల రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4కే 43ని ఈ రోజు విడుదల చేసింది. ఈ సరికొత్త స్మార్ట్ టీవీ బడ్జెట్ ధరలో ప్రత్యేకమైన డిజైన్ మరియు నాణ్యమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ డిస్‌ప్లే 3840 x 2160 పిక్సెల్‌లు, ఆటో తక్కువ లేటెన్సీ మోడ్, 6.5ఎంఎస్ రెస్పాన్స్ టైమ్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. అలాగే, ఈ రెడ్‌మీ టీవీలో వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉంది. థియేటర్ అనుభూతిని అందిస్తుంది. మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌ తో పాటు  క్వాడ్-కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు గేమింగ్ ప్రియులను ఆకర్షించేందుకు Mali-G52 MC1 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఇవ్వబడింది. Fire OS 7 పై పనిచేస్తుంది. అలాగే ఈ TV 2GB RAM మరియు 8GB స్టోరేజీ సౌకర్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, డిస్నీ+ హాట్ స్టార్, Zee5, సోనీ లైవ్, యూట్యూబ్ మొదలైన వివిధ యాప్‌లను ఈ సరికొత్త స్మార్ట్ టీవీలో ఉపయోగించవచ్చు. 43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ అలెక్సా వాయిస్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్‌ను కలిగి ఉంది. కాబట్టి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో కూడిన ఈ రిమోట్‌తో మీరు టీవీని అందంగా ఆపరేట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ స్మార్ట్ రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కోసం షార్ట్‌కట్ బటన్‌లు ఉన్నాయి. వై-ఫై 802.11 AC, ఎయిర్‌ప్లే 2, మిరాకాస్ట్, బ్లూటూత్ 5.0, HDMI పోర్ట్, USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఈథర్‌నెట్, యాంటెన్నా వంటి బహుళ కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. 43-అంగుళాల రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీని రూ. 26,999కి విడుదల చేశారు. అయితే, పరిమిత సమయం వరకు, 43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ రూ.24,999 ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ సేల్ తేదీని ఇంకా పేర్కొనలేదు. అయితే, ఈ టీవీ రాబోయే పండుగ సీజన్‌లో Mi.com మరియు అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Friday, September 15, 2023

రివార్డు 360 వెబ్‌సైట్‌ హ్యాక్ చేసి గిఫ్ట్ వోచర్లు చోరీ చేసిన టెకీ !


బొమ్మలూరు లక్ష్మీపతి అనే యువ టెకీ ఓహెచ్డీఎఫ్సీ  బ్యాంక్‌, స్టాండర్డ్ ఛార్టర్డ్‌ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరియు పేబ్యాక్‌ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న రివార్డు 360 వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ చేశాడు. ఏకంగా రివార్డులు, గిఫ్ట్‌ వోచర్లు ఇచ్చే సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసి వాటితో బంగారం, బైక్‌లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్య సుమారు 5 లక్షల గిఫ్ట్‌ వోచర్లను దొంగలించినట్లు పోలీసులు చెబుతున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో రూ.4.16 కోట్ల విలువైన వస్తువుల కోసం ఈ గిఫ్ట్‌ వోచర్లను రీడిమ్‌ చేసినట్లు తెలిపారు. నిందితుడు లక్ష్మీపతి నుంచి 5.269 కిలోల స్వచ్ఛమైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ.3.4 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లక్ష్మీపతి కాలేజీ రోజుల్లోనే ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల నుంచి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను పొందేవాడని, అప్పటి నుంచే ఇదంతా ప్రారంభమైందని బెంగళూరు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌ సీకే బాబా తెలిపారు. రివార్డు పాయింట్లు ఇచ్చేందుకు బ్యాంకు అంగీకరించని నేపథ్యంలో వారి సర్వర్‌లను దోపిడీ చేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేశాడని పోలీసులు తెలిపారు. వెబ్‌సైట్‌ హ్యాక్‌చేసి వోచర్లతో అధిక మొత్తాన్ని డిజిటల్‌ కరెన్సీగా మార్చాడని గుర్తించామని పోలీసులు తెలిపారు. అనంతరం బంగారం, వెండి వంటి వాటిపై పెట్టుబడి పెట్టినట్లు గుర్తించినట్లు తెలిపారు. రివార్డులు, గిఫ్ట్‌ వోచర్లు పొందిన యజమానులు వాటిని వినియోగించకముందే, లక్ష్మీపతి వాటిని దొంగలించి ఖర్చుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. జూన్‌ 24న రివార్డు360 డైరెక్టర్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. వినియోగదారులకు ఇచ్చిన గిఫ్ట్‌ వోచర్‌లను ముందుగానే ఎలా రీడీమ్‌ చేశారో పోలీసులకు వివరించారు. ఈ హ్యాకింగ్‌ కారణంగా తమకు ఎలా నష్టం జరిగిందో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని సైబర్‌ ఎటాక్‌గా అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. రివార్డు360 డైరెక్టర్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు లక్ష్మీపతిని పట్టుకున్నారు. కేవలం బంగారం సహా ఇతర ఖరీదైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రభుత్వ వెబ్‌సైట్లను టార్గెట్ చేయలేదని వెల్లడించారు. లక్ష్మీపతికి కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యూడిషియల్‌ రిమాండ్ విధించింది. నిందితుడు లక్ష్మీపతి ఏపీలోని చిత్తూరుకు చెందినవాడని తెలుస్తోంది. ఒంగోలులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ సంస్థలో కొంతకాలం పనిచేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌ మధ్య కాలంలో రివార్డు360 వెబ్‌సైట్‌ను హ్యాక్‌చేసినట్లు గుర్తించారు. లక్ష్మీపతి నుంచి సుమారు రూ.3.4 కోట్లు విలువైన 5269 కిలోల 24 క్యారెట్ల బంగారం, 21.8 లక్షల విలువైన 27.2 కిలోల వెండి, 11.3 లక్షల డబ్బు, 12 లక్షల విలువైన 7 ద్విచక్రవాహనాలు, ఫ్లిప్‌కార్ట్‌ వాలెట్‌లో రూ.26 లక్షలు, అమెజాన్‌ వాలెట్‌లో రూ.3.5 లక్షలు, రూ. 1.3 లక్షల విలువైన 2 ల్యాప్‌టాప్‌లు, రూ.90,000 విలువైన 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నోకియా జీ42 5జీ సేల్ ప్రారంభం !


నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.560 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్, 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ అయింది. నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,599. అమెజాన్‌లో సేల్ ప్రారంభం అయింది. బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్‌తో కొంటే 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.560 ఈఎంఐతో ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. సో పర్పుల్, సో గ్రే కలర్స్‌లో లభిస్తుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. గొరిల్లాగ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉండగా వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ లభిస్తాయని నోకియా వెల్లడించింది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + రెండు 2మెగాపిక్సెల్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో నైట్ మోడ్, డార్క్ విజన్, ట్రైపాడ్ మోడ్, AI పోర్ట్రెయిట్, HDR, 50MP మోడ్, వాటర్‌మార్క్స్, OZO 3D ఆడియో రికార్డింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుందని నోకియా చెబుతోంది. జీపీఎస్, టైప్ సీ పోర్ట్, బ్లూటూత్ 5.1 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

వొడాఫోన్‌ ఐడియా నుంచి రూ.701 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌ !


వొడాఫోన్‌ ఐడియా పోస్ట్‌పెయిడ్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్లాన్స్‌ ఎక్కువగా రూ.701 ప్లాన్‌ ఆదరణ పొందింది. వొడాఫోన్‌ ఐడియా రూ. 701 ప్లాన్ వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌గా నిలుస్తుంది. ఈ ప్లాన్‌ అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒక వినియోగదారు ఒక బిల్లింగ్ వ్యవధిలో ఎంత డేటా వినియోగించవచ్చనే దానిపై పరిమితులు లేవు. ఇది ఖరీదైన ప్లాన్ అయినప్పటికీ చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో చేసే దాదాపు ప్రతిదానికీ మొబైల్ డేటాపై ఎక్కువగా ఆధారపడే వారు ఈ ప్లాన్‌ వాడుకోవచ్చు. అలాగే వారి మొబైల్ హాట్‌స్పాట్‌తో ఎక్కువ పరికరాలను కనెక్ట్‌ చేసుకోవచ్చు. వీఐ రూ.701 ప్లాన్‌తో వినియోగదారులు నిజంగా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు నెలకు 3000 ఎస్‌ఎంఎస్‌లను పంపే వీలు ఉంటుంది. అలాగే అపరిమిత మ్యూజిక్ డౌన్‌లోడ్‌లతో 6 నెలల పాటు హంగామా మ్యూజిక్, వీఐ మూవీస్‌ & టీవీ, వీఐ గేమ్స్‌, ఆరు నెలల పాటు అమెజాన్‌ ప్రైమ్‌, ఓ ఏడాది డిస్నీ + హాట్‌ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, సోనీ ఎల్‌ఐవీ ప్రీమియం, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ సబ్‌స్క్రిప్షన్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈజీ డినర్‌ ప్రైమ్‌కు కూడా త్రైమాసిక సభ్యత్వాన్ని పొందవచ్చు. అలాగే ఈజ్‌మైట్రిప్‌ ద్వారా రిటర్న్ ఫ్లైట్‌ బుక్‌ చేసుకోవడానికి రూ.750 తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా ఒక సంవత్సరం నార్టన్‌ 360 మొబైల్ సెక్యూరిటీ కవర్ లభిస్తుంది. 

గూగుల్ కు భారీ జరిమానా !


గూగుల్ లొకేషన్ డేటాపై వినియోగదారులను మోసం చేసిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా ఈ పిటిషన్ దాఖల చేశారు. లొకేషన్ ఆఫ్ చేయడం ద్వారా వారి స్థానాన్ని ట్రాక్ చేయమని గూగుల్ చెబుతోందని, కానీ దానికి విరుద్ధంగా, సొంత వాణిజ్య లాభం కోసం దాని వినియోగదారుల కదలికలను ట్రాక్ చేస్తోందని బొంటా పిటిషన్ లో పేర్కొన్నారు. తమ దర్యాప్తులో గూగుల్ వినియోగదారుల లొకేషన్ వివరాలను ఎప్పటిప్పుడు సేకరిస్తున్నట్లు తేలిందన్నారు. ఇది వినియోగదారులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. గూగుల్ యూజర్ లొకేషన్ డేటాను ఎలా మేనేజ్ చేస్తుందో అటార్నీ జనరల్ కార్యాలయం దానిని ఉదాహరణలతో వివరించింది. లొకేషన్ హిస్టరీని నిలిపివేయడానికి వినియోగదారులను గూగుల్ అనుమతించిందని, అలా చేయడం ద్వారా ఆచూకీని ట్రాక్ చేయదని హామీ ఇచ్చిందన్నారు. కానీ గూగుల్ ఇప్పటికీ వినియోగదారుడి వెబ్, యాప్ యాక్టివిటీ ద్వారా లొకేషన్ ఈ డేటాను సేకరించి, సేవ్ చేసిందని అటార్నీ జనరల్ వాదించారు. అంతేకాకుండా ఈ టెక్ దిగ్గజం లొకేషన్-టార్గెటెడ్ ప్రకటనల ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు అయితే ఈ ఆరోపణలను గూగుల్ అంగీకరించలేదు. కానీ ఇతర అభ్యంతరాలను సెటిల్ చేయడానికి 93 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా లొకేషన్ ట్రాకింగ్ ప్రాక్టీసులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, టార్గెట్ చేసిన యాడ్ ప్రొఫైల్లను రూపొందించడానికి లొకేషన్ డేటాను ఉపయోగించే ముందు వినియోగదారులకు ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వడం, ఏదైనా గణనీయమైన గోప్యత సంబంధిత మార్పులను అమలు చేయడానికి ముందు గూగుల్ అంతర్గత గోప్యతా వర్కింగ్ గ్రూప్ నుంచి ఆమోదం పొందడం వంటివి ఉన్నాయి. గూగుల్ ప్రతినిధి జోస్ కస్టనెడా మాట్లాడుతూ ఇటీవలి సంవత్సరాలలో చేసిన మార్పులకు అనుగుణంగా సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్ తో పాటు చాలా కంపెనీలు డేటాను సేకరించి ఉపయోగిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంది. 1.2 బిలియన్ యూరోలు జరిమానా చెల్లించాలని, అలాగే యూరప్ లోని ఫేస్ బుక్ వినియోగదారుల నుంచి సేకరించిన డేటాను యునైటెడ్ స్టేట్స్ కు తరలించడం నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు సోషల్ మీడియా దిగ్గజానికి భారీ జరిమానా పడింది. 

భారత్‌లో ఐఫోన్‌ 15 ఫోన్ల ధరలు అధికం !


యాపిల్‌ 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్‌ 15 సిరీస్ ధరల గురించే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా, దుబాయ్‌తో పోలిస్తే భారత్‌లోనే ఐఫోన్‌ 15 సిరీస్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. భారత దేశంలో తయారయ్యే ఐఫోన్ల ధరలు ఆయా దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడే అధికంగా ఉండడం విశేషం. ఐఫోన్‌ 15 మోడల్‌ ఆరంభ ధర అమెరికాలో 799 డాలర్లు. అదే భారత్‌లో రూ. 79,900గా ఉంది. 799 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 66,353 వేలు అవుతుంది. అయితే ఈ మోడల్ ధర దాదాపు 20 శాతం అధికంగా ఉండడం గమనార్హం. అరబ్‌ ఎమిరేట్స్‌లో దీని ధర 3,399 కాగా.. భారత కరెన్సీ (22 రూపాయలు = 1 దిర్హమ్‌) ప్రకారం రూ. 76 వేలు అవుతుంది. దుబాయ్‌తో పోల్చినా భారత్‌లోనే ధర ఎక్కువ. ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ బేస్‌ మోడల్‌ ధర అమెరికాలో 1,199 డాలర్లుగా ఉంది. దీన్ని భారత కరెన్సీలో రూ. 99 వేలు అవుతుంది. అయితే భారత్‌లో ప్రో మ్యాక్స్‌ బేస్‌ మోడల్‌ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది. అంటే దాదాపు 50 శాతం అధికం. దుబాయ్‌లో ఈ మోడల్‌ ధర 5,099 దిర్హమ్‌లు. దిర్హమ్‌లను భారత కరెన్సీలో 1.15 లక్షలు. ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌దీ అదే పరిస్థితి. 

ఫ్లిప్ కార్ట్ లో యాడ్సన్ 32 ఇంచుల స్మార్ట్ స్మార్ట్ టీవీపై 71% తగ్గింపు !

                                              

ఫ్లిప్ కార్ట్ లో యాడ్సన్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ 71% తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 29,999. అయితే దీనిని 8,500 కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో వైడ్ వ్యూయింగ్ యింగిల్, హై రిఫ్రెష్ రేటు వంటి పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ పై లో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలవారి ఈఎంఐ 413 నుంచి ప్రారంభం అవుతుంది. అదే 24 నెలలు అయితే నెలకు ఈ మేరకు వడ్డీ పడుతుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు 530 చెల్లించాలి. 12 నెలల టెన్యూర్ అయితే నెలకు 764 రూపాయలు చెల్లించాలి. 9 నెలల టెన్యూర్ అయితే 1500 వరకు చెల్లించాలి. ఆరు నెలలకు అయితే నెలకు 1000 కట్టాలి. మూడు నెలల టెన్యూర్ అయితే నెలకు 2,900 చెల్లించాలి. ఇలా ఎంచుకునే టెన్యూర్ ను బట్టి వచ్చే రాబడి మారుతుంది. సాధ్యమైనంతవరకు తక్కువ టెన్యూర్ నుంచి ఎంచుకోవాలి లేదంటే ఒకేసారి మొత్తం కట్టడం అంటే భారం అవుతుంది. అందుకే టీవీ కొనే సమయంలో అన్ని వివరాలను చెక్ చేసుకొని కొనుగోలు చేయడం మంచిది. లేదంటే ఇబ్బందులు పడతారు.  ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అద్భుతమైన ఆఫర్లు ఉంటాయి. 

Thursday, September 14, 2023

జునో మిషన్‌ తీసిన అద్భుత చిత్రం !


నాసా గతంలో గురుగ్రహంపై అధ్యయనం కోసం పంపిన జునో మిషన్‌ తన కెమెరాలో ఓ అద్భుతమైన చిత్రాన్ని తీసింది. జూపిటర్‌ (గురుడు), దాని చందమామ ‘లో (Lo)’ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న దృశ్యాన్ని తన కెమెరాతో క్లిక్‌ మనిపించింది. జునో తీసిన చిత్రాన్ని నాసా షేర్‌ చేసింది. జునో మిషన్‌ ఈ ఏడాది జూలై 31వ తేదీన 53వ సారి బృహస్పతి (జూపిటర్‌) సమీపంగా ప్రయాణించింది. అందుకు కొన్ని నిమిషాల ముందే జునో మిషన్‌లోని కెమెరాకు జూపిటర్‌, దాని చందమామ 'లో' ఒకే ఫ్రేమ్‌లో ఉన్న దృశ్యాలు చిక్కాయి. కాగా, జూపిటర్‌ చంద్రుడు 'లో' ఉపరితలం పూర్తిగా అగ్ని పర్వతాలతో నిండి ఉంది. దానిపై ఎప్పుడూ అగ్నిపర్వతాల విస్ఫోటనం, పాస్ఫరస్‌ గ్యాస్‌ల విడుదల జరుగుతుంది.

ఏఐ ఇరువైపులా పదునైన కత్తి !


ఏఐ ఇరువైపులా పదునైన కత్తి వంటిదని, దీన్ని సురక్షితంగా వాడేందుకు ఏఐపై నియంత్రణ ఉండాలని ట్విట్టర్ అధిపతి మస్క్ సూచించారు. ఏఐని స్పోర్ట్స్‌తో పోలుస్తూ మనకు ఓ రిఫరీ ఉండటం కీలకమని పేర్కొన్నారు. ఆవిష్కరణ, భద్రతలకు మద్దతు ఇచ్చేలా అమెరికన్ కాంగ్రెస్ ఏఐపై అడుగులు వేయాలని అన్నారు. ఇది ఎదుగుతున్న టెక్నాలజీ అన్న మస్క్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. కంపెనీలు తీసుకునే చర్యలు సురక్షితంగా, సాధారణ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ఉండేలా రెగ్యులేటర్ వ్యవహరిస్తుందని మీడియాతో మాట్లాడుతూ మస్క్ వ్యాఖ్యానించారు. కాగా, ఏఐ నియంత్రణ కోసం పట్టుబడుతున్న టెక్ దిగ్గజ సీఈవోలు క్యాపిటల్ హిల్‌లో చట్టసభ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలన్ మస్క్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌, ఎన్‌విడియా సీఈవో జెన్సెన్ హుంగ్‌, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్‌, ఎఎఫ్ఎల్‌-సీఐఓ లేబర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లిజ్ షులర్ తదితరులు పాల్గొన్నారు.

తొలిసారిగా బయటపడ్డ ఏలియన్స్ మృతదేహం !


గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? లేక అది కేవలం కుట్ర సిద్ధాంతంలో భాగమా? ఈ ప్రశ్నల మధ్య, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇది ప్రజలను మరింత ఆలోచనలో పడేసింది. వాస్తవానికి శాస్త్రవేత్తలు ఇద్దరు గ్రహాంతరవాసుల మృతదేహాలను ప్రపంచం ముందు ఉంచడం పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం మెక్సికో పార్లమెంటులో కలకలం సృష్టించారు. పెరూలోని కుజ్కో నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గ్రహాంతరవాసుల మృతదేహాలు వేల సంవత్సరాల నాటివని చెబుతున్నారు. స్పానిష్ న్యూస్ వెబ్‌సైట్ మార్కా నివేదిక ప్రకారం మెక్సికో సిటీలోని శాస్త్రవేత్తలు ఒక అధికారిక కార్యక్రమంలో ఇద్దరు గ్రహాంతరవాసుల శవాలను ప్రపంచానికి చూపించారు. ఈ కార్యక్రమానికి మెక్సికన్ జర్నలిస్ట్, యూఫాలజిస్ట్ జైమ్ మౌసన్ నాయకత్వం వహించారు. ఈయన దశాబ్దాలుగా పారానార్మల్ దృగ్విషయాలను పరిశోధిస్తున్నాడు. అదే సమయంలో, మెక్సికన్ శాస్త్రవేత్తలు సహ-హోస్ట్‌లుగా ఉన్నారు. వైరల్ అయిన క్లిప్‌లో, రెండు వేర్వేరు చెక్క పెట్టెల్లో రెండు 'నాన్-హ్యూమన్' శవాలు కనిపిస్తాయి. ఈ సమయంలో, సేఫ్ ఏరోస్పేస్ కోసం అమెరికన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మాజీ అమెరికా నేవీ పైలట్ ర్యాన్ గ్రేవ్స్ కూడా ఉన్నారు.

ఈ రెండు మృతదేహాలు భూమికి సంబంధించినవి కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. యూఎఫ్ఓ  శిధిలాల నుండి వారు కోలుకున్న జీవులు ఇవి. రెండూ శిలాజాలుగా మారాయి. ఈ మమ్మీ నమూనాలను పెట్టెలో ఉంచారు. మాసన్ తన పరిశోధనల గురించి సమాచారాన్ని ఇస్తూ యూఎఫ్ఓ నమూనాలను ఇటీవల అటానమస్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో అధ్యయనం చేశారు. రేడియోకార్బన్ డేటింగ్ సహాయంతో శాస్త్రవేత్తలు డీఎన్ఏ ఆధారాలను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో, హార్వర్డ్ ఖగోళ శాస్త్ర విభాగం డైరెక్టర్, ఓయిమువామువా సిద్ధాంత రచయిత ప్రొఫెసర్ అబ్రహం అవి లోబ్, శాస్త్రవేత్తలు గ్రహాంతర జీవుల ఉనికి అవకాశాలను అధ్యయనం చేయడానికి అనుమతించాలని వీడియో కాల్ ద్వారా మెక్సికన్ ప్రభుత్వాన్ని కోరారు.

సాఫ్ట్‌వేర్‌ను క్రియేట్ చేసిన ఏఐ చాట్‌బాట్స్‌ !


చాట్‌బాట్స్ టెక్ట్స్ రాయడం, సమాచారం షేర్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్‌, ప్రోగ్రామింగ్ టాస్క్‌లకు సాయపడటం, వ్యాసాలు రాయడం వంటి ఎన్నో టాస్క్‌లను ఇట్టే పూర్తిచేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. టెక్నాలజీ మెరుగవుతున్న కొద్దీ ఏఐ ఆధారిత చాట్‌బాట్స్ సామర్ధ్యాలు కూడా కొత్తపుంతలు తొక్కుతున్నాయి. క్లిష్టమైన పనులను కూడా చాట్‌బాట్స్ క్లియర్ చేస్తూ యూజర్లకు సౌకర్యవంతంగా మారాయి. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్స్ తక్కువ మ్యాన్‌పవర్‌తో సాఫ్ట్‌వేర్ కంపెనీని సమర్ధంగా నడపగలవని, కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. చాట్‌జీపీటీ వెర్షన్ 3.5ని వాడుతూ అదనపు శిక్షణ లేకుండా కంప్యూటర్ ప్రోగ్రాం సాఫ్ట్‌వేర్‌ను సృష్టించగలదా అని పరీక్షించేందుకు బ్రౌన్ యూనివర్సిటీ, చైనీస్ యూనివర్సిటీల పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. దీనికోసం వీరు చాట్‌దేవ్ అనే కాల్పనిక కంపెనీని క్రియేట్ చేశారు. ఆపై వారు టాస్క్‌ను ప్లానింగ్‌, కోడింగ్‌, టెస్టింగ్‌, రైటింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో నాలుగు భాగాలుగా విభజించారు. టాస్క్‌ను పూర్తిచేసేందుకు కీలక సూచనలను కంప్యూటర్ ప్రోగ్రామ్స్‌కు ఇచ్చారు. చాట్‌దేవ్‌కు 70 టాస్క్‌లను ఇవ్వగా ఏడు నిమిషాల్లోపే అది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను పూర్తిచేసింది. ఇందుకు డాలర్‌లోపే ఖర్చు కావడం విశేషం. కంప్యూటర్ ప్రోగ్రాం సొంతగానే సమస్యలను గుర్తించి పరిష్కరించినట్టు పరిశోధనలో వెల్లడైంది. చాట్‌దేవ్ క్రియేట్ చేసిన సాఫ్ట్‌వేర్‌లో 86.66 శాతం పర్‌ఫెక్ట్‌గా ఉందని పరిశోధకులు గుర్తించారు.

విక్రమ్‌ ల్యాండర్‌ ను ఫొటోలు తీసిన దక్షిణ కొరియా లూనార్‌ ఆర్బిటర్‌ దనూరి !


క్షిణ కొరియాకు చెందిన లూనార్‌ ఆర్బిటర్‌ దనూరి ఇటీవల చంద్రుడి ఉపరితలంపై దిగిన చంద్రయాన్‌-3 మిషన్‌లోని విక్రమ్‌ ల్యాండర్‌ చిత్రాన్ని తీసింది. శివశక్తి పాయింట్‌లో ఉన్న ల్యాండర్‌ ఫొటోలు కనిపిస్తున్నది. చంద్రుడి ఉపరితలంపైనున్న విక్రమ్‌ ల్యాండర్‌ను లూనార్‌ ఆర్బిటర్‌ గుర్తించడం దక్షిణ కొరియా అంతరిక్ష కార్యక్రమానికో అతి పెద్ద విజయం. దక్షిణ కొరియా ఆర్బిటర్‌ మిషనర్‌ అక్టోబర్‌ 2022లో ప్రారంభమైంది. ఆర్బిటర్‌లో హైరిజల్యూషన్‌ కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇందులో చిన్న రోవర్‌ సైతం ఉన్నది. రాబోయే రోజుల్లో చంద్రుడి ఉపరితలంపై దింపేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం లూనార్‌ ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్య తిరుగుతూ చంద్రుడి ఉపరితలంపై కన్నేసి ఉంచింది. ఈ ఆర్బిటర్ తన కెమెరాతో ల్యాండర్ విక్రమ్‌ను గుర్తించి, ఆ చిత్రాలను తీసి పంపింది. దక్షిణ కొరియా సైతం చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్నది. ఆ దేశం 2030 నాటికి మానవుడిని చంద్రుడిపైకి పంపాలని యోచిస్తున్నది. 

వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్‌ !


వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఛానెల్స్ పేరుతో ఈ ఫీచర్ విడుదల చేయబడింది. వాట్సాప్ ఛానెల్స్ లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వన్‌-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ అయిన ఈ ఛానెల్స్ ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అయి వారు అందించే అప్‌డేట్‌లను పొందవచ్చు. అంతేకాదు వారు పెట్టే మెసేజ్ లకు రియాక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా వుంటుంది. ఈ వాట్సాప్ ఛానెల్స్ భారత్‌తో సహా 150 దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయని, ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్స్ ఆప్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ఫీచర్ డెవలపింగ్ మోడ్‌లో ఉందని ప్రకటించారు. రాబోయే వారాల్లో వినియోగదారులందరికీ విడుదల చేయబడుతుంది. మెటా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఛానెల్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఫీచర్లు, కొత్త అప్‌డేట్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి వినియోగదారులు అధికారిక వాట్సాప్ ఛానెల్‌లో కూడా చేరవచ్చని వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను మొదలుపెట్టగా ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్  ఛానెల్స్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అప్డేట్స్ ట్యాబ్‌లో కనిపించనున్నాయి. ఈ ట్యాబ్‌లో వాట్సాప్ స్టేటస్ మెసేజ్‌లతో పాటు కొత్త వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్ కూడా ఉంటుంది. వినియోగదారులు తమ దేశం ఆధారంగా ఫిల్టర్ చేయబడిన మెరుగైన డైరెక్టరీని కూడా యాక్సెస్ చేయవచ్చు, వాట్సాప్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉన్న, కొత్త ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా ఫేమస్ అయిన ఛానెల్స్ ను కూడా చూడవచ్చు. 

Wednesday, September 13, 2023

గూగుల్ స్టైఫండ్ నెలకు రూ. 83 వేలు !


కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.  అప్లై చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి.https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్‌లో రెజ్యూమ్ అప్‌లోడ్‌ చేయాలి. హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఇంగ్లీష్ ట్రాన్‌స్క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్‌ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2023 అక్టోబర్ 01. ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python). ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్‌ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌, నెట్‌వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని. ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది.

టీమ్‌ కుక్‌తో సెల్ఫీ దిగిన పీవీ సింధు


మెరికా లోని కుపెర్టినోలో యాపిల్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐఫోన్ 15 సిరీస్‌ విడుదల  కార్యక్రమంలో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సింధు యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌తో సెల్ఫీలను కూడా పోస్ట్‌ చేసింది. దీంతో ఈ పిక్స్‌ వైరల్‌గా మారాయి.

''యాపిల్‌ కుపెర్టినోలో సీఈవో టిమ్ కుక్‌ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం ! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్‌ని , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!'' అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్‌లు, కామెంట్‌లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, యాపిల్‌ కుపెర్టినోలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది.

ఆడి క్యూ8 స్పెషల్‌ ఎడిషన్‌ ధర రూ. 1,18,46,000


ఆడి ఇండియా స్పెషల్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. తాజాగా క్యూ8లో స్పెషల్‌ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,18,46,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మైథోస్‌ బ్లాక్, గ్లేషియర్‌ వైట్, డేటోనా గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. పరిమిత సంఖ్యలోనే ఈ ఎస్‌యూవీల విక్రయాలు ఉంటాయని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ తెలిపారు.  3.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్‌ను పొందుతుంది ఇది కేవలం 5.9 సెకన్లలో సున్నా నుండి 100kmph వరకు వేగవంతం చేస్తుంది మరియు గరిష్టంగా 250kmph వేగాన్ని అందుకోగలదు. ఎక్ట్సీరియర్‌లో, S-లైన్ ఎక్స్‌టీరియర్ ప్యాకేజీ , బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో Q8 స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించింది. క్యాబిన్ 'ఏరో-అకౌస్టిక్స్'ని కలిగి ఉన్న అధిక-నాణ్యత క్యాబిన్‌తో, 4 జోన్‌ ఏసీ, ప్రీమియం సౌండ్‌ సిస్టమ్, 21 అంగుళాల అలాయ్‌ వీల్స్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్‌ మొదలైన ప్రత్యేకతలు ఈ ఎస్‌యూవీలో ఉన్నట్లు ధిల్లాన్‌ తెలిపారు. తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఇది విశిష్టమైన ఎస్‌యూవీ అని ఆయన పేర్కొన్నారు.

జీబ్రానిక్స్ 2023 ఎడిషన్ LED స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్ ఆఫర్‌ !


జీబ్రానిక్స్ 2023 ఎడిషన్ LED స్మార్ట్ టీవీలు ఇప్పుడు షాపింగ్ వెబ్‌సైట్‌లో కనీసం 50శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. జీబ్రానిక్స్ నుంచి 4 స్మార్ట్ టీవీలు అద్భుతమైన ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో Zeb-32P1, Zeb-32P2, Zeb-43P1, Zeb-55W2 అనే టీవీ మోడల్‌లు ఉన్నాయి. Zeb-32P1 అనేది 1366 x 768 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్, 260 నిట్స్ బ్రైట్‌నెస్ రేట్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 32 HD స్మార్ట్ టీవీ సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ క్లౌడ్ టీవీతో ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఆడియో ఎక్స్‌పీరియన్స్ 20W అవుట్‌పుట్‌తో స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. వివిధ కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్రారంభ జాబితా ధర రూ. 22,999 ఉండగా డివైస్ ఆఫర్ ధర రూ. 10,999కు అందుబాటులో ఉంది. Zeb-32P2 32" HD స్మార్ట్ టీవీ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ఫ్రేమ్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 1366 x 768 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. మల్టీ కనెక్టివిటీ పోర్ట్‌లతో 20W అవుట్‌పుట్ స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. మునుపటి మాదిరిగానే, స్మార్ట్ టీవీ రూ. 11,999, ధరలో సగం (రూ. 23,999) ఇప్పుడు Zeb-43P1 20W స్పీకర్ యూనిట్‌తో కూడిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత 43 ఫుల్ HD LED స్మార్ట్ టీవీగా చెప్పవచ్చు. ఈ డివైజ్ ఫ్రేమ్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. గోడకు మౌంట్ చేయగలదు. ఎంటర్‌టైన్మెంట్ కోసం క్లౌడ్ టీవీని కలిగి ఉంది. మల్టీ కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. 55శాతం తగ్గింపుతో డివైజ్ కేవలం రూ. 18,999కే సొంతం చేసుకోవచ్చు.  Zeb-55W2కి సంబంధించి 3840 x 2160 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్, 20W సౌండ్ అవుట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో అతిపెద్ద 55 అల్ట్రా HD (4K) LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇతర మూడింటిలా కాకుండా Zeb-55W2 WebOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. మల్టీ OTT ప్లాట్‌ఫారమ్ సపోర్టుతో వస్తుంది. తక్కువ డిజైన్‌ను కలిగి ఉంది. డివైజ్‌లో వివిధ కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా ఉన్నాయి. రూ. 72,999 విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ. 34,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ ఆఫర్లతో పాటు, స్మార్ట్ టీవీలతో పాటు అనేక ఇతర బ్యాంక్ ఆఫర్‌లు, పార్టనర్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, EMI బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 

యాపిల్ వాచ్ సిరీస్ 9 విడుదల


యాపిల్ వాచ్ సిరీస్ 9ను యాపిల్ తన 'వండర్లస్ట్' ఈవెంట్లో లాంచ్ చేసింది. 2015లో యాపిల్ మొట్టమొదటి వాచ్ ను లాంచ్ చేయగా, ఇది ఆ సిరీస్ లో 10వ వాచ్. ఈ వాచ్ లో జీపీఎస్, సెల్యులార్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మనదేశంలో రూ.41,900 నుంచి ప్రారంభం కానుంది. అమెరికాలో 399 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.33,000) నుంచి దీని ధర ప్రారంభం కానుంది. మిడ్ నైట్, స్టార్ లైట్, పింక్ (కొత్త కలర్), సిల్వర్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో ఈ వాచ్ను కొనుగోలు చేయవచ్చు. 41 మిల్లీమీటర్లు, 45 మిల్లీమీటర్ల ఆప్షన్లు ఉన్నాయి. యాపిల్ వాచ్ 7,8 తరహాలోనే ఇందులో కూడా ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్ ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్ నెస్ 2000 నిట్స్ గా ఉండనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 18 గంటల పాటు ఈ వాచ్ సిరీస్ 9 పనిచేయనుంది. ఫాస్ట్ చార్జింగ్ను ఇది సపోర్ట్ చేయనుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కూడా ఈ వాచ్ సిరీస్లో అందించారు. కొత్త యాపిల్ ఎస్9 ఎస్ఐపీ (సిస్టం ఇన్ ప్యాకేజ్) ఉన్న సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్సెట్తో ఈ వాచ్ సిరీస్ లాంచ్ అయింది. యాపిల్ వాచ్ సిరీస్ 8 కంటే 60 శాతం వేగంగా సిరీస్ 9 పని చేయనుందని కంపెనీ పేర్కొంది. హెల్త్ డేటాను సిరి ద్వారా యాక్సెస్ చేసే ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఈ వాచ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ డబుల్ ట్యాప్ జెస్చర్ ఫీచర్. దీని ద్వారా యూజర్లు కాల్స్ ఆన్సర్ చేయవచ్చు. ఎండ్ చేయవచ్చు. టైమర్ స్టాప్ చేయడం, అలారం ఆపడం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం, కెమెరా యాక్సెస్ చేయడం వంటి పనులు కూడా చేయవచ్చు. ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ వాచ్ పని చేయనుంది. ఇందులో ఎన్నో ముఖ్యమైన హెల్త్, ఫిట్ నెస్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. హైకింగ్, సైక్లింగ్ ఫీచర్లు కూడా అందించారు. మెంటల్ హెల్త్ సపోర్ట్ టూల్స్ కూడా ఉన్నాయి. 

Popular Posts