Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, September 30, 2022

బీఎస్ఎన్ఎల్ నుంచి సూపర్ ప్లాన్ !

తక్కువ ధరలో ప్రీపెయిడ్ సిమ్ ప్లాన్‌లు కావాలంటే బీఎస్ఎన్ఎల్‌ లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని ప్లాన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఐతే బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్ అందుబాటులో లేదు. ఒకవేళ మీరు ఉండే ప్రదేశంలో 3జీ నెట్‌వర్క్ ఉంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్‌ మంచిగా ఉన్నాయి. అలా తక్కువ ధరలోనే మంచి బెనిఫిట్స్‌తో వచ్చే ప్లాన్స్ వివరాలు ఇవే. రోజుకు రూ.5.70 ఖర్చుతో అన్‌లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ మన ముందుకు వచ్చింది. రోజుకు సుమారు రూ.6.67 ఖర్చుతో 2gb డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, sms లు లభించే ఏకైక ప్లాన్ రూ.187.ఈ ప్లాన్ రూ.187 తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ప్రతీ రోజు 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100sms లు ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఐతే బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ బెస్ట్‌గా ఉన్న ప్రదేశాల్లో ఈ ప్లాన్స్ మనకి ప్రయోజనకరంగా ఉంటాయి. మరోవైపు బీఎస్ఎన్ఎల్ 4జీ లాంచ్ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు తెలిసిన సమాచారం. ఈ ఏడాదిలో 4జీ నెట్‌వర్క్ మన ముందు తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ భావించినప్పటికీ కానీ సాధ్యం కాలేదు. ఇక దీంతో 2023లోనే సాధ్యమయ్యేలా కనిపిస్తుంది.

టీవీ కొంటే శాంసంగ్ గెలాక్సీ ఏ 32 స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్రీ..!


శాంసంగ్ కంపెనీ స్మార్ట్ టీవీ కొనుగోలుపై స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందిస్తుంది. శాంసంగ్ ఈ సంవత్సరం పలు రకాల కొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేసింది. శాంసంగ్ స్మార్ట్ టీవీల ధరలను పరిశీలిస్తే , 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.61,990 /-గా ఉంది. 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 73,990.55/- గా మరియు 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.91,990/- మరియు 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.1,27,990/- ఇక చివరిగా 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ.2,99,990/- గా ఉన్నాయి . ఈ కొత్త స్మార్ట్ టీవీలు అమెజాన్ ,ఫ్లిప్ కార్ట్ , శాంసంగ్.కమ్ లో అందుబాటులో ఉన్నాయి అయితే శాంసంగ్ కంపెనీ నోమోఫోమో సేల్ కింద స్మార్ట్ టీవీ కొన్నవారికి స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తుంది.శాంసంగ్ అధికారిక స్టోర్ లేదా శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ లో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే బ్యాంక్ కార్డులపై 22 శాతం ఆఫర్ ఇస్తుంది.బ్యాంక్ ఆఫర్లు మారుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. ఇంకా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీలపై 43 శాతం,స్మార్ట్ టీవీలపై 48 శాతం , స్మార్ట్ ఫోన్లపై 52 శాతం మరియు ల్యాప్ టాప్స్ పై 30 శాతం ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఏ ఏ ఫ్రేమ్ టీవీలకు స్మార్ట్ ఫోన్ ఆఫర్ వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం 75 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొన్నవారికి శాంసంగ్ గాలక్సీ ఏ 32 స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది . దీని విలువ రూ.21.490 /- గా ఉంది. అలాగే 62 ఇంచెస్ టీవీ కొన్నవారికి శాంసంగ్ గెలాక్సీ ఏ 03 స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది. దీని ధర రూ.9.499 /- గా ఉంది . అలాగే 8కే టీవీపై గెలాక్సీ ఎస్22 ఫోన్ ఉచితంగా పొందవచ్చు.

షావోమీ సీవీ 2 స్మార్ట్ ఫోన్ విడుదల


షావోమీ సీవీ 2 స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. వెనకవైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. వీటిలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగా (సుమారు రూ.27,000) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,499 యువాన్లుగానూ (సుమారు రూ.28,500) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా (సుమారు రూ.28,500) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ ఎప్పుడు జరుగుతుందో తెలియరాలేదు. షావోమీ 12 లైట్ 5జీ ఎన్ఈ లేదా షావోమీ 13 లైట్ బ్రాండింగ్‌లతో గ్లోబల్‌గా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై షావోమీ సీవీ 2 పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.72 సెంటీమీటర్లుగానూ, బరువు 171.8 గ్రాములుగానూ ఉంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు సెన్సార్లు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 20 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 32 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌లను అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హీట్ డిస్‌పాషన్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ వీసీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అందించారు.

ఇన్​స్టాగ్రామ్​లో నోట్స్​ ఫీచర్​ !


ఇన్​స్టాగ్రామ్​ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ లను తీసుకు వస్తూనే ఉంది.  తాజాగా ఇన్​స్టాగ్రామ్​ సంస్థ వారు నోట్స్ అనే ఒక సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చారు.  ఇన్​స్టాగ్రామ్​ యూజర్స్ నోట్స్ తో తమకు నచ్చింది రాసి ఇతరులతో పంచుకోవచ్చు. ఈ ఫీచర్ అన్నది స్టేటస్ మాదిరిగానే ఉంటుంది. స్టేటస్ అనేది న్యూస్ ఫీడ్ లో కనిపిస్తే నోట్స్ మాత్రం డీఎం లో ఉంటుంది. మనం రాసిన నోట్స్ 24 గంటల తర్వాత డిలీట్ అయిపోతుంది. అంతే కాకుండా ఈ నోట్స్​ ఫీచర్​కు 60 క్యారెక్టర్​ లిమిట్​ కూడా ఉంది. కాగా తాజాగా తీసుకువచ్చిన ఈ ఫీచర్ కు యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ముందుగా మీ ఇన్​స్టాగ్రామ్​ యాప్​ని అప్డేట్​ చేసి ఇన్​స్టాగ్రామ్​ యాప్​ని ఓపెన్​ చేయండి. ఆ తరువాత డీఎం సెక్షన్​ లోకి వెళ్లండి. తరువాత పైన కనిపిస్తున్న యువర్​ నోట్​ అనే ఆప్షన్ పై క్లిక్​ చేయండి. అప్పుడు మీరు ఏం టైప్ చేయాలి అనుకుంటున్నాది అక్కడ టైప్ చేయండి. అనంతరం ఫాలోవర్స్​, క్లోజ్​ ఫ్రెండ్స్​ ఎవరికి మీ నోట్స్ కనిపిచాలి అన్నది సెలక్ట్​ చేసుకోండి. ఇక చివరగా షేర్​ బటన్​ ప్రెస్​ చేస్తే మీ నోట్స్​ షేర్​ అవుతుంది.

కొత్త మాల్వేర్ పై ఎస్ బి ఐ హెచ్చరిక !


దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్ బి ఐ   సోవా ట్రోజన్  వైరస్ గురించి జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ' మాల్వేర్ లు మీ విలువైన డేటాని దొంగిలించకుండా చూసుకోండి. దీని కోసం, మీరు ఎల్లప్పుడూ విశ్వసనీయ మూలాల నుండి వచ్చిన యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేయండి' అని చెబుతోంది. SBI 9 ప్రకారం, SOVA అనేది Android-ఆధారిత ట్రోజన్ మాల్వేర్, ఇది పర్సనల్ డేటాను దొంగిలించడానికి నకిలీ బ్యాంకింగ్ యాప్లను ఉపయోగించే వారిని టార్గెట్ చేస్తుంది. ఈ మాల్వేర్ వినియోగదారుల విలువైన డేటా మరియు సమాచారాన్ని దొంగిలిస్తుంది. net-banking Apps ద్వారా వినియోదారులు వారి అకౌంట్ లను లాగిన్ చేసినప్పుడు ఈ మాల్వేర్ యూజర్ల సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. మీ ఫోన్లో ఈ మాల్వేర్ కలిగిన యాప్స్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ను తీసివేయడానికి మార్గం ఉండదు. ఈ మాల్వేర్ ను మీ ఫోన్ లో ఇక్కసారి ఇన్స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు, ఇక దాన్ని తీసివెయ్యడం కష్టం. కానీ, దీన్ని నివారించడానికి ఒకే ఒక్క మార్గం వుంది. మీకు తెలియని లేదా గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే Links పైన ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చెయ్యవద్దు. మీకు కావాల్సిన యాప్స్ ను డౌన్లోడ్ చేయడానికి ఎల్లప్పుడూ విశ్వసనీయమైన యాప్ స్టోర్ మాత్రమే ఉపయోగించండి. ముఖ్యంగా, ఒక యాప్ డౌన్లోడ్ ముందుగా ఆ యాప్ యొక్క రివ్యూలను చెక్ చెయ్యండి. అలాగే, యాప్స్ కు అనుమతులను ఇచ్చేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాదు, మీ ఫోన్ లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. 

Thursday, September 29, 2022

గూగుల్ మ్యాప్స్‌లో ఇమ్మర్సివ్ వ్యూ !


ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన గూగుల్ మ్యాప్స్  సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. 'ఇమ్మర్సివ్ వ్యూ' ఫీచర్‌. సెర్చ్, మ్యాప్స్ అంతా త్రిడి వ్యూగా మార్చాలని గూగుల్ ప్లాన్ చేస్తోంది. బుధవారం జరిగిన ఈవెంట్‌లో టెక్ దిగ్గజం ఈ విషయాన్ని ప్రకటించింది. ఇకపై వినియోగదారులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యేలా ఫీచర్ తీసుకొస్తోంది. కొత్త ఫీచర్లు సెర్చ్ రిజల్ట్స్‌లో “vibe” ద్వారా “visual forward”ని అందిస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న “Around Me” అనే Google సెర్చ్ ఫీచర్‌పై “Vibe” రూపొందించింది. దాంతో యూజర్లు తమ చుట్టూ ఉన్న రెస్టారెంట్ లేదా రియల్ టైమ్ డేటా లొకేషన్ వంటి వాటిని లైవ్‌లో చూడవచ్చు. ఈ డేటా పరిసరాల్లోని స్థలాల ఫోటోలు, రివ్యూలను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు వెళ్లబోయే లొకేషన్ ముందుగానే చూడవచ్చు.Google రిలీజ్ చేయబోయే మరో పెద్ద ఫీచర్‌ను సెర్చ్ రిజల్ట్స్‌లో “visual forward” అంటారు. పేరు సూచించినట్లుగా.. ట్రావెల్ డెస్టినేషన్స్ హాలిడే స్పాట్‌ల విషయంలో యూజర్లు సెర్చ్ టెర్మ్ ద్వారా లైవ్ వ్యూ ఫీల్ పొందేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌లో భాగంగా.. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లోని ఫోటో స్టోరీల మాదిరిగానే ఫోటోగ్రాఫ్‌లతో చేసిన టైల్స్‌ను గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో చూపుతుంది. మీరు ఏదైనా ప్రయాణ గమ్యస్థానం కోసం సెర్చ్ చేస్తే.. బ్రౌజర్ మీకు సంబంధిత లింక్‌లు, ట్రావెల్ సైట్‌లు, ఫొటోలతో పాటు గైడ్‌లను కూడా చూపిస్తుంది. కొత్త ఫీచర్లు రాబోయే కొద్ది నెలల్లో యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని చోట్ల యూజర్లు మెరుగైన సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ కోసం యాక్సెస్‌ను పొందవచ్చు. ఆ తర్వాత Google Mapsలో కొత్త Immersive View ఫీచర్ అందిస్తుంది. మొదట Google I/Oలో లాంచ్ అయింది. ఈ కొత్త ఫీచర్ యూజర్లకు సెర్చ్ చేసిన ఏరియా లేదా లొకేషన్ 3D ఏరియల్ వ్యూ అందిస్తుంది. Google ఇమ్మర్సివ్ వ్యూ ద్వారా యూజర్లకు వాతావరణం, ట్రాఫిక్, భవనాలను కూడా చెక్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ Google Maps యాప్‌లో లైవ్ వ్యూ టూల్ కూడా అందిస్తుంది. ప్రస్తుతం.. లైవ్ వ్యూ అనేది డైరెక్షన్లను చూపడానికి.. వాకింగ్ డైరెక్షన్ల వంటి డేటాను చూసేందుకు ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగిస్తుంది. కొత్త ఇమ్మర్సివ్ ఫీచర్‌తో వినియోగదారులు ఫోన్ స్క్రీన్‌పై ATMలు లేదా రెస్టారెంట్‌ల వంటి వాటిని కనుగొనవచ్చు. తద్వారా సులభమైన నావిగేషన్ ఇంటర్‌ఫేస్‌కు యాక్సెస్‌ పొందవచ్చు. లాస్ ఏంజిల్స్, లండన్, న్యూయార్క్ సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యోలలో రాబోయే నెలల్లో గూగుల్ ఇమ్మర్సివ్ వ్యూ ని లాంచ్ చేయనుంది. అదే సమయంలో యూజర్లు నేరుగా ఫొటోలు, టెక్స్ట్ ద్వారా సెర్చ్ చేసేందుకు Google Lens టూల్‌ను యాక్సస్ అందిస్తుంది.


హువావే లక్ష రూపాయల ఫోన్ విడుదల


హువావే మేట్ 50 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీనికి ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కావడం విశేషం. దీని ధరను 1,299 యూరోలుగా (సుమారు రూ.1,02,000) నిర్ణయించారు. బ్లాక్, సిల్వర్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2616 x 1212 పిక్సెల్స్‌గా ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ వైడ్ లెన్స్ అందుబాటులో ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా, 66W సూపర్ చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. డ్యూరబులిటీ కోసం ఐపీ68 రేటింగ్‌ను కూడా అందించారు. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. గూగుల్ యాప్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. హువావే యాప్ గ్యాలరీ ద్వారా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. హువావే నోవా 10 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే దక్షిణాఫ్రికాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఇది కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హువావే నోవా 10 ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

స్మార్ట్‌ఫోన్లలో ఇక GPS ఉండదు?


ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం 'గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(GPS)ను వినియోగిస్తున్నాయి. అయితే భారత్ లో దీని స్థానంలో కొత్తగా దేశీయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్‌ సిస్టమ్‌ (NavIC)ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట!. ఈ మేరకు మొబైల్‌ తయారీ కంపెనీలతోనూ సమావేశాలు నిర్వహించిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకు అనుకూలంగా ఫోన్లను తయారు చేయాలని ఆయా కంపెనీలకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతమున్న గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టంకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ నావిగేషన్‌ సిస్టమ్‌ను ఇండియా తీసుకొస్తోంది. ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్’ (NavIC) పేరుతో కొత్త నావిగేషన్‌ సిస్టమ్‌ను పరిచయం చేయనుంది. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఈ నావిగేషన్ సిస్టంను అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. ఆయా మొబైల్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహించినట్టు వార్తలొస్తున్నాయి. ఇక మీదట తయారయ్యే ఫోన్లను కొత్తగా తీసుకొస్తున్న నావిగేషన్ సిస్టమ్‌కు అనుకూలంగా మార్చాలని భారత ప్రభుత్వం కోరిందట. NavIC అనేది GPSకి ఇండియన్‌ వెర్షన్. ఈ సాఫ్ట్ వేర్ తయారీ కోసం ఇస్రో, క్వాల్‌కామ్‌ తో కలిసి పని చేసింది. ప్రస్తుతం సైనిక కార్యకలాపాల కోసమే ఈ సిస్టంను ఉపయోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ లొకేషన్‌ ట్రాకింగ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌, ఫుడ్ డెలివరీ, ట్యాక్సీ బుకింగ్ సర్వీస్‌.. ఇలా అన్ని సర్వీసులను ఈ కొత్త సిస్టంపైనే వర్క్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇస్రో డెవలప్ చేసిన నావిక్ సిస్టం 7 శాటిలైట్స్‌పై ఆధారపడి పని చేస్తుంది. వీటిలో 3 జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్‌ కాగా, మిగిలిన 4 జియోసింక్రోనస్ ఆర్బిట్ శాటిలైట్స్‌ ఉన్నాయి. సొంతంగా నావిగేషన్ సిస్టం ఏర్పాటుచేసుకోవాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు. 1990లోనే అందుకు అడుగులు పడ్డాయి. అందుకు కారణం అమెరికా చర్యలే. 1999లో కార్గిల్ యద్ధంలో పాక్ సైనిక దళాలు ఎక్కడ కచ్ఛితంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవటానికి భారత సైన్యానికి నావిగేషన్ వ్యవస్థ అవసరమైంది. ఈ క్రమంలో అలాంటి సాంకేతికత అందుబాటులో ఉన్న అమెరికాను భారత్ సాయం కోరింది. కానీ, భారత్ కు సాయం చేయటానికి అమెరికా నిరాకరించింది. దీన్నో గుణపాఠంగా భావించిన ఇస్రో, అప్పటి నుంచి దేశీయంగా రూపొందించే నావిగేషన్ వ్యవస్థ మీద దృష్టి పెట్టింది. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలకు పైగా పనిచేశాక.. ప్రయత్నాలు ఫలించి సొంత నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ ఏర్పడింది.







హానర్ నుండి కొత్త ట్యాబ్లెట్‌ !


హువావే నుంచి ఇండిపెండెంట్ బ్రాండ్‌గా మారిన హానర్ మనదేశంలో చాలా కాలం తర్వాత కొత్త ఉత్పత్తిని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అదే హానర్ ప్యాడ్ 8 అనే ట్యాబ్లెట్. ఇది అంతర్జాతీయ మార్కెట్లో జులైలో లాంచ్ అయింది. భారతీయ ట్యాబ్లెట్ మార్కెట్లో ఇది కూడా త్వరలో అడుగు పెట్టనుందని సమాచారం. హానర్ ప్యాడ్ 8 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. అయితే సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పని చేయనుంది. ఈ ట్యాబ్‌లో చైనాలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,499 యువాన్లుగా (సుమారు రూ.17,700) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ (సుమారు రూ.21,240), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగానూ (సుమారు రూ.23,600) నిర్ణయించారు. మింట్ గ్రీన్, డాన్ బ్లూ, డాన్ గోల్డ్ రంగుల్లో ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో కూడా ఇదే ధరతో ఈ ట్యాబ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ ట్యాబ్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది కాబట్టి స్పెసిఫికేషన్ల విషయంలో ఎటువంటి రహస్యం లేదు. దీని చైనా వేరియంట్లో 12 అంగుళాల 2కే ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2000 x 1200 పిక్సెల్స్‌ గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 87 శాతం గానూ ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ హానర్ ప్యాడ్ 8లో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ట్యాబ్లెట్ వెనకవైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ముందువైపు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7250 ఎంఏహెచ్ కాగా, 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను హానర్ ప్యాడ్ 8 సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఎనిమిది స్పీకర్లను హానర్ ప్యాడ్ 8లో అందించారు. వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.69 సెంటీమీటర్లు కాగా, బరువు 520 గ్రాములుగా ఉంది.

అక్టోబర్ 5 నుండి ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్


ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 8 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ నాలుగు రోజుల సేల్ సమయంలో, కొనుగోలుదారుల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లను ఉపయోగించడంపై కొనుగోలుదారులు 10% తక్షణ తగ్గింపును పొందుతారు. ఆన్‌లైన్ రిటైలర్ ప్రకారం, ICICI బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించే వారికి 10% instant డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే లావాదేవీలకు అపరిమిత క్యాష్‌బ్యాక్ ఉంటుంది. కొనుగోలుదారులు సులభమైన EMI మరియు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ వంటి తక్షణ క్రెడిట్ నుండి ప్రయోజనాలను పొందగలరు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు 24 గంటల ముందుగానే ఈ సేల్‌ను యాక్సెస్ చేయగలరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే అక్టోబర్ 4 అర్ధరాత్రి నుండి. ఈ విధంగా, ప్లస్ సభ్యులు చేయగలరు ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13 విషయంలో ఇన్వెంటరీ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా డీల్‌లు మరియు ఆఫర్‌లను ఇతరుల కంటే ముందుగా పొందేందుకు వీలుంది. ప్రస్తుతానికి,ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో అందుబాటులో ఉండే ఖచ్చితమైన ఆఫర్లు, డీల్స్‌పై ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ కొన్ని ఒప్పందాలను బహిర్గతం చేయడానికి ముందుగానే టీజర్‌లను వదలడానికి అదే వ్యూహాన్ని అనుసరిస్తుందని మేము ఆశించవచ్చు. ఐఫోన్ 13 రిటైల్ దాదాపు రూ.50,000 లకే బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో మీరు పొందవచ్చు. ఈ సేల్ సమయంలో కూడా మనము ఇలాంటి డీల్‌లను ఆశించవచ్చు. అదనంగా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు మరియు ఇతర ఉత్పత్తులపై కూడా ఆఫర్‌ల ను పొందవచ్చు.

Wednesday, September 28, 2022

నథింగ్ ఫోన్ 1కు న్యూ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ !


నథింగ్ ఫోన్ 1 బుధవారం నుంచి నథింగ్ ఓఎస్ వెర్షన్ 1.1.4 అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. జులైలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన తర్వాత ఇది నాలుగో అప్‌డేట్ కావడం గమనార్హం. ఈ ఓఎస్ వెర్షన్ అప్‌డేట్‌లో భాగంగా కెమెరాను అప్‌గ్రేడ్ చేశారు. కెమెరా యాప్‌లో నథింగ్ థీమ్డ్ వాటర్‌మార్క్‌ను న్యూ ఓఎస్ వెర్షన్ తీసుకువచ్చింది. మెయిన్‌, అల్ట్రావైడ్ సెన్సర్ల మధ్య కలర్ కన్సిస్టెన్సీని అప్‌డేట్ మెరుగుపరిచింది. మూవింగ్ ఆబ్జెక్ట్స్‌ను షూట్ చేసే క్రమంలో స్టెబిలిటీ ఇంప్రూవ్‌మెంట్ కోసం న్యూ మోషన్ డిటెక్షన్ అల్గారిథమ్‌ను తాజా అప్‌డేట్ ముందుకుతెచ్చింది. అల్ట్రవైడ్ మోడ్‌లో హెచ్‌డీఆర్ వాడే క్రమంలో షూటింగ్ వేగం పెరుగుతుంది. మెరుగైన కలర్ ఆక్యురసీతో నైట్ మోడ్ షాట్స్ షార్ప్‌గా తీసేందుకు న్యూ అప్‌డేట్ ఉపకరిస్తుంది. 2023 ఆరంభంలో నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ 13పై నథింగ్ ఓఎస్ అప్‌డేట్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ 29,999కి అందుబాటులో ఉండగా 8జీబీ 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ 32,999కి, 12జీబీ 265జీబీ మోడల్ రూ 35,999కి లభిస్తోంది.

డ్రోన్ కెమెరాకు ఆర్డరిస్తే పొటాటోలు !


ఆర్డర్ ఒకటిస్తే మరోటి డెలివరీ చేసినందుకు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ తర్వాత మరో ఈ కామర్స్ ప్లాట్‌పాం మీషో టార్గెట్‌గా మారింది. తాను మీషో వేదికగా డ్రోన్‌కు ఆర్డర్ ఇస్తే ఓ బాక్సులో కిలో బంగాళదుంపలు పంపారని బిహార్‌కు చెందిన వ్యక్తి వెల్లడించారు. ఈ ఘటనను అతడు రికార్డు చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలందలోని పర్వాల్‌పూర్‌కు చెందిన చేతన్‌కుమార్‌కు మీషో సైట్‌పై ఎదురైన అనుభవాన్ని రికార్డు చేశారు. అన్‌సీన్ ఇండియా అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో అందుబాటులో ఉంది. మీషో నుంచి తనకు వచ్చిన ప్యాకేజ్‌పై అనుమానంతో దాన్ని అక్కడే ఓపెన్ చేయాలని డెలివరీ బాయ్‌ను కుమార్ కోరడం ఈ వీడియోలో కనిపించింది. ఆపై బాక్స్‌లో పొటాటోలు ఉండటంతో వారిద్దరూ షాక్ తిన్నారు. డ్రోన్ ఆర్డర్ చేస్తే మీషో పొటాటోలు పంపిందని డెలివరీ బాయ్‌, కుమారతో పాటు అక్కడ గుమికూడిన వారు ఈకామర్స్ సంస్ధ నిర్వాకాన్ని ఎండగట్టారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు చేపడతామని, కస్టమర్‌కు తాము డబ్బు రిఫండ్ చేశామని మీసో వెల్లడించింది. కస్టమర్ విశ్వాసాన్ని ప్రభావితం చేసే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించేది లేదని, దీనిపై తీవ్ర చర్యలు చేపడతామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈకామర్స్ సైట్లలో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు. తాను ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇస్తే ఫ్లిప్‌కార్ట్ తనకు డిటర్జెంట్ సోప్‌లు డెలివరీ చేసిందని ఇటీవల ఓ ఐఐఎం విద్యార్ధి ఆరోపించాడు. ఈ ఘటనతో ఇక నుంచి కస్టమర్లు డెలివరీ ఎగ్జిక్యూటివ్ సమక్షంలోనే బాక్స్‌లను ఓపెన్ చేయాలని ఫ్లిప్‌కార్ట్ సూచించింది.

వాట్సాప్‌లో అవతార్ ?


వాట్సాప్  యూజర్ల ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. త్వరలోనే 'అవతార్' అనే మరొక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము నిజజీవితంలో ఎలాంటి స్కిన్ టోన్, హెయిర్ స్టయిల్, ఔట్‌ఫిట్స్, యాక్సెసరీలు కలిగి ఉంటారో ఆ లక్షణాలతో ఒక అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్లు తమని ప్రతిబింబించేలా ఒక త్రీడీ అవతార్ క్రియేట్ చేసుకొని దానిని స్టిక్కర్‌గా సెండ్ చేసుకోవచ్చు. అలానే ప్రొఫైల్ పిక్‌గా సెట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వాట్సాప్ యూజర్లు తమను పోలిన స్టిక్కర్స్‌ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి పంపించాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతానికి ఆ సదుపాయం వాట్సాప్‌లో రాలేదు. అయితే త్వరలోనే ఆ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో  తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. ఈ ఫీచర్‌తో మీరు మీ రూపాన్ని బట్టి ఒక అవతార్‌ క్రియేట్ చేసుకుని దానిని వాట్సాప్‌లో స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. వాట్సాప్ మీ అవతార్‌తో ఏకంగా ఒక స్టిక్కర్ ప్యాక్‌నే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇందులో మీ అవతార్‌ ఏడ్చినట్లు, నవ్వినట్లు, బుంగమూతి పెట్టుకున్నట్లు, ఇంకా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టిక్కర్స్ ఉంటాయని సమాచారం. వాట్సాప్ సెట్టింగ్స్‌లోనే అవతార్‌ను మీకు నచ్చినట్లు క్రియేట్ చేసుకోవచ్చు. అవతార్‌ను కాన్ఫిగర్/ క్రియేట్ చేశాక వాట్సాప్ మీరు ఎంచుకున్న కాన్ఫిగరేషన్ ఆధారంగా పర్సనాలైజ్డ్ స్టిక్కర్ ప్యాక్‌ను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది.

మార్కెట్లోకి త్వరలో రియల్ మీ 10


రియల్ మీ నుంచి త్వరలోనే మరో కొత్త మోడల్ మొబైల్ రానున్నట్లు తెలుస్తోంది. రియల్ మీ 10 పేరుతో రాబోయే ఈ కొత్త మోడల్ మొబైల్ ఇప్పటికే వివిధ సర్టిఫికేషన్‌ సైట్‌లలో కనిపిస్తూ విస్తృతంగా వార్తల్లోకెక్కుతోంది. గతంలో వచ్చిన నివేదికల ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ RMX3630 మోడల్ నంబర్‌ను కలిగి ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. ఇది ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), ఇండోనేషియా టెలికాం మరియు NBTC సర్టిఫికేషన్ సైట్‌లలోకి కనిపించినట్లు నివేదికలు వెల్లడించాయి. Realme 10 CB టెస్ట్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. తాజాగా, ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కూడా కనిపించింది. Realme RMX3630 మోడల్ 2.2GHz ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ప్యాక్ చేస్తున్నట్లు జాబితా చేయబడింది. కాగా, దీనికి MediaTek Helio G99 SoC ప్రాసెసర్ అందిస్తున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది. Geekbench జాబితా ప్రకారం, Realme 10 సింగిల్-కోర్ పనితీరు స్కోర్ 483 పాయింట్లు నమోదు కాగా.. మరియు మల్టీ-కోర్ పనితీరు స్కోరు 1,668 పాయింట్లుగా నమోదు అయింది.అయితే, ఇది ఇటీవలి కాలంలో ఇతర ధృవీకరణ సైట్‌లలో కూడా కనిపించింది. Realme RMX3630 మోడల్ Geekbench డేటాబేస్లో జాబితా చేయబడింది. ఈ మోడల్ ప్రామాణిక 4G వేరియంట్ అని తెలుస్తోంది. ఇది Mali-G57 GPUతో జత చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoCని ఫీచర్ చేస్తుందని జాబితా చేయబడింది. హ్యాండ్‌సెట్ 8GB RAMని కలిగి ఉంటుంది. మరియు ఇది Android 12లో రన్ అవుతుంది. మోడల్ నంబర్ RMX3630తో కూడిన Realme 10 BIS, ఇండోనేషియా టెలికాం మరియు NBTC సర్టిఫికేషన్ సైట్‌లలో కూడా గుర్తించబడింది. ఈ జాబితాల ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ భారతదేశం, ఇండోనేషియా మరియు థాయ్‌లాండ్ మార్కెట్లలో త్వరలోనే విడుదల కావచ్చని తెలుస్తోంది. Realme 10 మోడల్ CB టెస్ట్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. CB టెస్ట్ సర్టిఫికేషన్‌లో జాబితా చేయబడిన స్మార్ట్‌ఫోన్‌లో 4,880mAh రేట్ సామర్థ్యంతో Li-ion బ్యాటరీ ఉంది. దీని కన్నా ముందు ప్రారంభించబడిన Realme 9 4G కూడా 5,000mAh బ్యాటరీతో వచ్చింది.

డిమాండ్ లేకపోవడంతో ప్రొడక్షన్‌లో కోత !


ఐఫోన్ 14 సేల్స్ డిమాండ్ తగినంతగా లేకపోవడంతో న్యూ ఐఫోన్ ప్రొడక్షన్ పెంచడంపై కంపెనీ పునరాలోచనలో పడిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఐఫోన్ 14 దాదాపు ఐఫోన్ 13 తరహాలోనే ఉండటంతో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఐఫోన్ 13 కొనుగోలుకే కస్టమర్లు మొగ్గుచూపుతుండటంతో ఐఫోన్ 14కు డిమాండ్ మందగించిందని చెబుతున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ రూ 20,000 వరకూ డిస్కౌంట్ ఇస్తుండటంతో ఈ స్మార్ట్‌ఫోన్ స్టాక్ అయిపోయింది. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్‌లోనూ ఐఫోన్ 13కు అనూహ్య డిమాండ్ ఏర్పడటంతో స్టాక్ అందుబాటులో లేని పరిస్ధితి నెలకొంది. అధిక ధరకు న్యూ మోడల్ కొనుగోలు చేసేందుకు బదులు కస్టమర్లు తక్కువ ధరకు దాదాపు అదే డిజైన్‌, ఫీచర్లతో లభిస్తున్న ఓల్డర్ వెర్షన్‌కు మొగ్గుచూపుతున్నారు. ప్రొ మోడల్స్ కాకుండా ఇతర ఐఫోన్ 14 మోడల్స్ తయారీని తగ్గించాలని యాపిల్ ఇప్పటికే సరఫరాదారులను కోరినట్టు తెలిసింది. 9 కోట్ల లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ లక్ష్యంగా గత ఏడాది నిర్ధేశించిన యాపిల్ తాజాగా కేవలం 60 లక్షల ఫోన్ల ప్రొడక్షన్‌కే మొగ్గుచూపుతోందని తెలిసింది. మరోవైపు ఐఫోన్ 14 ప్రొ ప్రొడక్షన్‌ను పది శాతం పెంచాలని ఫాక్స్‌కాన్‌ను యాపిల్ కోరింది. దీంతో కస్టమర్లు ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 ప్రొ మోడల్స్‌ను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు వెల్లడైంది. ప్రొ మోడల్స్‌లో యాపిల్ కొన్ని కీలక మార్పులను చేపట్టడంతో ఈ మోడల్స్‌కు ప్రజల నుంచి డిమాండ్ నెలకొంది.

Tuesday, September 27, 2022

ఒకేరోజు 12 లక్షల ఫోన్లు విక్రయం !


సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్, బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్ మొదలపెట్టాయి. ఈ సేల్స్‌లో అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులో వచ్చాయి. అందులోనూ శాంసంగ్ బ్రాండ్ కు చెందిన పాపులర్ మోడళ్లతో పాటు లేటెస్ట్ ఫోన్‌లు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు శాంసంగ్ ప్రొడక్టులను విపరీతంగా కొనేశారు. ఈ కారణంగా శాంసంగ్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సేల్స్ తొలి రోజున సునామీ సృష్టించింది. సేల్స్ తొలి రోజున అంటే.. ఆదివారం ఒక్కరోజే 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయని శాంసంగ్ వెల్లడించింది. వీటి విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. ఈ సేల్స్‌లో గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై 17 నుంచి 60% వరకు డిస్కౌంటుతో శాంసంగ్ అందుబాటులో ఉంచింది. ఆపై బ్యాంక్ కార్డు ఆఫర్లతో మరింత తక్కువ ధరకే కస్టమర్లకు దక్కాయి. దీంతో కొనుగోలుదారులు ఎడా పెడా కొనేశారు. “సేల్స్ తొలి రోజు.. 1.2 మిలియన్‌ల కంటే ఎక్కువ గెలాక్సీ డివైజ్‌లను శాంసంగ్ అమ్మింది. ఇండియాలో ఇది సరి కొత్త రికార్డ్. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఈసారి ఆఫర్లు ప్రకటించాం. అందువల్లనే ఇది సాధ్యమైంది. 24 గంటల్లో రూ.1,000 కోట్ల విలువైన శాంసంగ్ గెలాక్సీ డివైజ్‌లు అమ్ముడయ్యాయి” అని శాంసంగ్ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఎస్ఈ 5జీ, గెలాక్సీ ఎస్ 22, గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా, గెలాక్సీ ఎం53, గెలాక్సీ ఎం33, గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ ఎం13 మోడల్స్ ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో ఉన్నాయి. వీటిలో గెలాక్సీ ఎం13 బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచిందని కంపెనీ తెలిపింది. సేల్స్ ఈ నెల ఆఖరి వరకు జరగనున్నాయి. అప్పటివరకు 50 లక్షలకు పైగా అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మార్కెట్లోకి వివో వై 16


వివో తాజాగా వై-సిరీస్ నుంచి వై 16 ఫోన్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.9,999 (3జీబీ +32జీబీ) అలాగే రూ.12,499 (4జీబీ+64 జీబీ) గా వుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ కలర్ ల విషయానికి వస్తే.. స్టెల్లార్‌ బ్లాక్, డ్రిజ్లింగ్‌ గోల్డ్‌ రంగుల్లో లభించనుంది. అదేవిధంగా కోటక్, ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్, బీవోబీ, ఫెడరల్, ఏయూ బ్యాంక్‌ లకు సంబంధించిన కార్డులతో రూ. 1,000 వరకు పొందవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌,క్రెడిట్‌ కార్డులపై రూ. 750 మేర క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే ,6.51 అంగుళాల స్క్రీన్, అదేవిధంగా ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్, ఫేస్‌ వేక్‌ ఫీచర్, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ట్రిపుల్‌ కార్డ్‌ స్లాట్, 13 ఎంపీ మెయిన్‌ 2 ఎంపీ మాక్రో కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా,తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివో సంస్థ వెల్లడించింది.

ట్విట్టర్‌‭లో కొత్త ఫీచర్ సర్కిల్స్‌


ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా ట్విట్టర్‌ కూడా సన్నిహితులతో మాట్లాడుకునేందుకు వీలుగా సర్కిల్స్‌కు శ్రీకారం చుట్టుంది. సర్కిల్‌లో ఉండే వ్యక్తులు లేదా స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ యూజర్‌కే ఉంటుంది. తద్వారా వారందరితో సన్నిహిత సంభాషణలు జరుపుకొనే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో ఒక గ్రూపును ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సర్కిల్స్‌ ప్రస్తుతం ఐఔస్‌, ఆండ్రాయిడ్‌, ట్విటర్‌.కామ్‌ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంది. అయితే పోస్టు చేసే ముందు అది అందరికీ ఉద్దేశించా లేక సర్కిల్‌కే పరిమితమా అన్నది యూజర్‌ చూసుకోవాలి. సర్కిల్‌ కిందకు 150 మంది వరకు చేర్చుకోవచ్చు. సర్కిల్‌ నుంచి కొందరిని యూజర్‌ తొలగించుకోవచ్చు. మరి కొందరిని కలుపుకోవచ్చు. తొలగించినట్టు సదరు వ్యక్తికి కూడా తెలియదు. తీసేసినట్టు నోటిఫికేషన్‌ వంటిది ఏదీ కూడా వెళ్ళదు. సర్కిల్‌కు పంపిన ట్వీట్లు గ్రీన్‌ బ్యాడ్జి కలిగి ఉంటాయి. సర్కిల్‌లో ఉన్న వ్యక్తులకే అవి కనిపిస్తాయి. అయితే వాటిని రీట్వీట్‌ లేదా షేర్‌ చేసేందుకు అవకాశం మాత్రం ఉండదు. రిప్లయ్‌లన్నీ ప్రైవేటుగానే ఉంటాయి. ఒక్కో యూజర్‌కి ఒక సర్కిల్‌కే అనుమతి ఉంటుంది.

ధరకే రానున్న జియో 5G ఫోన్ రూ.12 వేల లోపే !

రిలయన్స్ జియో  నుంచి అత్యంత సరసమైన ధరకే 5G ఫోన్ రాబోతోంది. ఈ జియో 5G ఫోన్ ధర రూ. 12వేల లోపు ఉండవచ్చు. అయితే కచ్చితమైన ధరపై క్లారిటీ లేదు. అదే నిజమైతే.. రిలయన్స్ జియో 5G ఫోన్‌గా దేశంలోనే సరసమైన ధరకు వచ్చిన 5G ఫోన్ కానుంది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన 5G-స్మార్ట్‌ఫోన్‌లలో రిలయన్స్ జియో ఒకటి. గతంలో, ఈ డివైజ్ దేశంలో రూ. 10వేల లోపు ఉంటుందని భావించారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. డేటా అనలిటిక్స్ సంస్థ కౌంటర్ పాయింట్ నుంచి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారిక సైట్ నుంచి సమాచారం కూడా తొలగించినట్టు నివేదిక తెలిపింది. JioPhone 5G ధర రూ. 8వేల నుంచి రూ. 12వేల మధ్య ఉండవచ్చని పేర్కొంది. 2024లో ఏదో ఒక సమయంలో జియో సరసమైన 5G mmWave + sub-6GHz స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెండింటి మధ్య ధర మొత్తం BoM (మెటీరియల్‌ల బిల్లు) గణనీయంగా తగ్గాయి. జియో ఫోన్ స్పెసిఫికేషన్లపై ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. JioPhone 5G గత నెలలో రిలయన్స్ AGM (వార్షిక సాధారణ సమావేశం)లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావించారు. ఇప్పటికే జియో 5G ప్రారంభించేందుకు ప్లాన్లను ప్రకటించింది. Jio Air Fiber 5G హాట్‌స్పాట్‌ను ప్రారంభించింది. గత నెలలో JioPhone 5G ముఖ్య స్పెసిఫికేషన్‌లను సూచించింది. ఈ ఫోన్ HD+ క్వాలిటీతో 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ప్యానెల్ ఇండస్ట్రీ-ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుందని తెలిపింది. 4GB RAM, 32GB ఎక్స్‌పాండెడ్ స్టోరేజీతో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 5G ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. JioPhone Next మాదిరిగానే JioPhone 5G Android ఆధారిత PragatiOSలో రన్ కావచ్చు. ఈ ఫోన్ Jio సొంత యాప్‌లతో పాటు Gmail, Meet, మరిన్ని వంటి Google ఇంటర్నల్ యాప్‌లతో వచ్చే అవకాశం ఉంది. Jio 5G ఫోన్ 13-MP ప్రైమరీ కెమెరా, 2-MP మాక్రో కెమెరాతో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను అందించనుంది. బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రానుంది. జియో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ ఎప్పుడు అనేది రిలయన్స్ కూడా ఇంకా ధృవీకరించలేదు.

వాట్సాప్‌లో కాల్ లింక్స్‌ ఫీచర్‌ !


జూమ్, గూగుల్ మీట్, ఫేస్‌టైమ్ వంటి కాలింగ్ యాప్స్‌ వీడియో కాల్స్‌లో యూజర్లు ఈజీగా జాయిన్ అయ్యేందుకు కాల్ లింక్స్‌ ఫెసిలిటీని ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్  కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఈ వారంలోనే అందుబాటులోకి రానున్న కాల్ లింక్స్ ఫీచర్‌తో ఒకే ఒక ట్యాప్‌తో వాట్సాప్‌ కాల్‌లో జాయిన్ అవ్వచ్చని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. వాట్సాప్ హెడ్ విల్ క్యాథ్‌కార్ట్ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఫీచర్ ఈ వారంలోనే రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు కాల్ లింక్‌ను ఉపయోగించి ఆన్ గోయింగ్ కాల్‌లో చేరవచ్చు. ఈ ఫెసిలిటీ ఈ వారం నుంచి ఆడియో, వీడియో కాల్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. కాల్ లింక్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఒకే ఒక్క క్లిక్‌తో మీ ఆడియో/వీడియో కాల్స్‌లో జాయిన్ అవ్వడం సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ మీకింకా రాకపోతే వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ న్యూ అప్‌డేట్ ఇప్పటికీ రాకపోతే ఈ వారం చివరి వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వారు కాల్స్ ట్యాబ్‌పై క్లిక్ చేసి "క్రియేట్ కాల్ లింక్ ఆప్షన్‌పై నొక్కి కాల్ లింక్‌ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కాల్ లింక్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మాత్రమే కాదు మీ కాంటాక్ట్స్‌లో లేని వారితో కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్‌ను ఉపయోగించని వారికి లింక్ పంపితే, వారు యాప్‌ డౌన్‌లోడ్ లింక్‌కి రీడైరెక్ట్ అవుతారు. వాట్సాప్‌లో గరిష్ఠంగా 32 మంది ఒకేసారి సేఫ్ & ఎన్‌క్రిప్టెడ్ గ్రూప్ వీడియో కాల్స్‌ చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్ టెస్ట్ చేయడం ప్రారంభించినట్లు జుకర్‌బర్గ్ తాజాగా తెలిపారు. ప్రస్తుతానికి వాట్సాప్‌లో గ్రూప్ కాలింగ్‌తో ఎనిమిది మంది ఒకేసారి వీడియో కాల్స్ చేయడం కుదురుతుంది. ఈ లిమిట్‌ను 32కి పెంచుతామని ఏప్రిల్‌లోనే మెటా ప్రకటించింది. అయితే ఇప్పుడు దీనిని కొందరికే టెస్ట్ చేస్తున్నట్లు మెటా సీఈవో వెల్లడించారు. ఏప్రిల్ నెలలో కంపెనీ కేవలం వాయిస్ కాల్ లిమిట్ మాత్రమే పెంచింది. వాట్సాప్‌లో కమ్యూనిటీల ఫీచర్‌లను టెస్ట్ చేయడం కూడా మెగా కంపెనీ మొదలెట్టింది. దీని సహాయంతో చాలా గ్రూప్స్‌ అడ్మిన్లు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకొని అక్కడ అనేక విషయాలపై చర్చించవచ్చు. పంపించిన వాట్సాప్ మెసేజ్‌లను ఎడిట్ చేసేందుకు కూడా ఒక ఫీచర్‌ను మెటా తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ టెస్టింగ్‌ను కూడా ఆరంభించింది. ఓన్ చాట్, కెమెరా షార్ట్‌కర్ట్, వీడియో కాల్ డిజిటల్ అవుతార్‌ లాంటి మరెన్నో ఫీచర్లను కూడా వాట్సాప్ త్వరలోనే పరిచయం చేయనుంది.

Popular Posts