Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, February 28, 2023

ఐటీలో క్వైట్‌ హైరింగ్‌ ?


కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, యూరో జోన్‌లో ఆర్థిక కష్టాల వల్ల ఐటీ ఒక్కసారిగా నేల చూపులు చూస్తోంది. ఫలితంగా గ్రేట్‌ రెసిగ్నేషన్‌, క్వైట్‌ క్విట్టింగ్‌, మూన్‌ లైటింగ్‌, రేజ్‌ అప్లయింగ్‌ తాజాగా క్వైట్‌ హైరింగ్‌.. ఇలా ఐటీ సమూల మార్పులకు లోనయింది. ప్రస్తుతం చాలా కంపెనీలు క్వైట్‌ హైరింగ్‌ వైపు మళ్లుతున్నాయి. దీనివల్ల ఐటీ కంపెనీలపై ఒత్తిడి తగ్గుతోంది. ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతున్నాయి. అవసరాలు ఎలా ఉంటాయో తెలియదు? ముఖ్యంగా ఐటీ కంపెనీల అవసరాలు ఒక పట్టాన అంతు పట్టవు. ఆ అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరులను ఉపయోగించుకోవడమే క్వైట్‌ హైరింగ్‌ ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఉదాహరణకు ఓ ఐటీ కంపెనీకి డాటా బేస్‌లో ఉద్యోగుల అవసరం పడింది. అప్పటికప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో మరో విభాగంలో ఉన్న ఉద్యోగులతో ఆ స్థానాలు భర్తీ చేస్తుంది. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. అక్కడ ఏర్పడిన ఖాళీలను మరో ఉద్యోగులతో భర్తీ చేస్తుంది. అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అనే సామెతను ఇప్పుడు ఐటీ కంపెనీలు పాటిస్తున్నాయి. అంతే కాదు కొత్త లక్ష్యాలను సాధించే క్రమంలో ఉద్యోగులకు ఆశించినంత వేతనాలు ఇస్తున్నాయి. మరోవైపు బోనస్‌లు కూడా ప్రకటిస్తున్నాయి.

ధర తక్కువ - ఫీచర్లు ఎక్కువ !


స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసరం వస్తువైంది. బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటోంది. దీంతో దానికి ప్రాధాన్యత పెరిగింది. మార్కెట్లో వందల కొద్దీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.  రూ. 15,000 నుంచి రూ. 20,000 లోపు బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్లు :

రియల్ మీ 10 ప్రో 5జీ  అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120హెచ్జెడ్ బౌండ్‌లెస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 16ఎంపీసెల్ఫీ కెమెరాతో 108ఎంపీ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది నెబ్యులా బ్లూ, హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మేటర్‌ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. 6జీబీ+128జీబీ ధర రూ. 18,999 8జీబీ+ 128జీబీ ధర రూ.19,999. రియల్ మీ అధికారిక వైబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

పొకో ఎక్స్4 ప్రో ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ, డిజైన్ చాలా బాగుంటాయి. బ్యాక్ ప్యానెల్ పూర్తిగా గ్లాస్‌తో కవర్ చేసి ఉంటుంది. గత ఏప్రిల్ ఐదో తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించారు. పొకో ఎక్స్‌4 ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. దీని డిస్‌ప్లే 6.67 అంగుళాలు ఉంటుంది. 64 ఎంపీ, 8ఎంపీ, 2 ఎంపీ సామర్థ్యం గల మూడు కెమెరాలు ఫోన్ బ్యాక్‌లోనూ, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్‌లో మరో కెమెరా ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. దీని ధర రూ.16,999. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రరూ. 18,999ల కు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ నొర్డ్ సీఈ 2 లైట్ 5జీ రూ.20 వేల లోపు క్యాటగిరీలో వన్‌ప్లస్ తీసుకొస్తున్న తొలి స్మార్ట్ ఫోన్‌. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమరా, రెండు 2-ఎంపీ సెన్సర్ కెమెరాలు ఉంటాయి. ఇన్‌ఫ్రంట్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌, ఓక్టాకోర్ సీపీయూ (2.2గిగా హెర్ట్జ్, డ్యుయల్ కోర్‌), 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ చార్జర్ లభిస్తుంది. 6జీబీ /128జీబీ, 8జీబీ/128జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ధరలు రూ.18999, రూ. 20,999. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

రెడ్ మీ నోట్ 12 5జీ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో వస్తుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ సెట్ తో వస్తుంది. 6.67 ఫుల్ హెచ్ డీ, సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తోంది. 48ఎంపీ ప్రధాన కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఇది ఫ్రాస్టెడ్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, మిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తోంది. రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో రెడ్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ ధర రూ.17,999, 6జీబీ+128జీబీ ధర రూ.19,999 గా ఉంది.

Monday, February 27, 2023

నెక్ట్స్ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఈ బాలుడే !


ఆనంద్ మహీంద్ర మండే మోటివేషన్ పోస్ట్‌తో నెటిజన్ల ముందుకొచ్చారు. ఈసారి చెస్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌లా కావాలని కోరుకునే చిన్నారి వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. హోసూర్‌లో ఇటీవల జరిగిన చెస్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న చిన్న బాలుడి స్టోరీని నెట్టింట షేర్ చేశారు. ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రాత్రంతా బస్‌లో (రెండు బస్‌లు మారి) ప్రయాణించాడు. ఆపై వేదిక వద్దకు చేరుకుని పోటీ ప్రారంభమయ్యేలోగా కొద్దిసేపు కునుకుతీశాడు. మాగ్నస్ అంతటివాడు కావాలని ఈ చిన్నారి కోరుకుంటున్నాడు. ఇతడిలాంటి చిన్నారులే దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతారని ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆనంద్ మహీంద్రాతో పాటు పలువురు యూజర్లు యువ చెస్ ఆటగాడిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆల్ ది బెస్ట్ చాంపియన్ అంటూ ఐక్యూఓఓ ఇండియా సీఈఓ నిపుణ్ మౌర్య కామెంట్ చేయగా, క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ డబ్బు, సమయాన్ని వెచ్చిస్తే భారత్‌కు ప్రతిష్ట తీసుకువచ్చే యువ అంకితభావం కలిగిన యువత నైపుణ్యాలతో సిద్ధంగా ఉందని మరో యూజర్ రాసుకొచ్చారు.

గూగుల్ పీపుల్ కార్డు !


డిజిటల్ వరల్డ్‌లో మీకంటూ ఒక ఐడెంటిటీ కావాలా? అయితే గూగుల్ పీపుల్ కార్డుని క్రియేట్ చేసుకోండి. యూజర్ల ఆన్‌లైన్ ఐడెంటిటీని ఇంప్రూవ్ చేసేందుకు గూగుల్ కొత్తగా పీపుల్ కార్డ్‌ను తీసుకొచ్చింది. ఇదెలా ఉపయోగపడుతుందంటే సెలబ్రిటీల గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే బోలెడు సెర్చ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అదే ఒక మామూలు వ్యక్తి గురించి సెర్చ్ చేస్తే.. ఎలాంటి రిజల్ట్స్ చూపించకపోవచ్చు. అయితే చిన్న చిన్న బిజినెస్‌లు చేసేవాళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆన్‌లైన్ ఐడెంటిటీ అవసరం ఉంటుంది. తమ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసినప్పుడు సరైన వివరాలు రావడం ద్వారా వాళ్ల కొత్త బిజినెస్‌లకు కు కొంత మేలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇలాంటివాళ్లకోసం గూగుల్ పీపుల్ కార్డుని తీసుకొచ్చింది. ఇదొక డిజిటల్‌ బిజినెస్‌ కార్డులాంటిది. సెర్చ్‌ రిజల్ట్స్‌లో సరైన సమాచారాన్ని చూపించడానికిది ఇది హెల్ప్ అవుతుంది. ఈ పీపుల్‌ కార్డు ఫీచర్‌ మనదేశంతో పాటు కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల్లో అందుబాటులో ఉంది. దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి 'యాడ్‌ మీ టు సెర్చ్‌' అని టైప్‌ చేయాలి. 'యాడ్‌ యువర్‌సెల్ఫ్‌ టు గూగుల్‌ సెర్చ్‌' రిజల్ట్‌లో 'గెట్‌ స్టార్టెడ్‌' ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి. మీ వివరాలు, ఇ-మెయిల్‌ అడ్రెస్, సోషల్ మీడియా అకౌంట్స్ లాంటివి ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఒకసారి ప్రివ్యూను చెక్‌ చేసుకోవాలి. తర్వాత కార్డును సేవ్‌ చేసుకోవాలి. వెంటనే మీ గూగుల్‌ పీపుల్‌కార్డు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. మీ పేరుతో ఎవరైనా గూగుల్‌ సెర్చ్ చేస్తే మీ వివరాలన్నీ కనిపిస్తాయి.

స్మార్ట్ ఫోన్ ‪తోనే ఆరోగ్య పరీక్షలు !


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై కి చెందిన పూర్వ విద్యార్థులు అనురాగ్ మీనా, నికుంజ్ మల్పానీ, ప్రతీక్ లోథా నియోడాక్స్ అనే హెల్త్ స్టార్టప్ ను నెలకొల్పారు. దాని నుంచి ఓ హెల్త్ కిట్ ని అభివృద్ధి చేశారు. ఇది సెల్ ఫోన్ సాయంతో పనిచేస్తుంది. ఇది రోగి మూత్రం ద్వారా కేవలం 30 సెకన్లలో ఫలితాలను అందిస్తుంది. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో జరిగిన ప్రదర్శనలో నియోడాక్స్ టెస్ట్ కిట్‌ను ప్రదర్శించారు. స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరైన నికుంజ్ మల్పానీ మాట్లాడుతూ, కోవిడ్ లాక్‌డౌన్ సమయంలోనే ఆరోగ్యానికి డయాగ్నోస్టిక్స్ ప్రాముఖ్యతను గ్రహించి దీనిని తయారు చేశామన్నారు. ఈ కిట్ లో ఐదు ప్రాథమిక ఇన్‌స్టంట్ యూరిన్ టెస్ట్ కిట్‌లు ఉంటాయన్నారు. అలాగే నియోడాక్స్ క్రానిక్ కిడ్నీ వ్యాధి, వృద్ధుల టెస్ట్ కిట్‌, గర్భధారణ సమయంలో ఉపయోగించే మహిళల కోసం మెటర్నిటీ కేర్ కిట్ కూడా అభివృద్ధి చేశామన్నారు. స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరైన అనురాగ్ మీనా మాట్లాడుతూ ఈ టెస్ట్ కిట్‌లు ప్రతి ఇంటికీ ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడతాయని చెప్పారు. అంతేకాక సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా మొత్తం పరీక్ష ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయన్నారు. మరో సభ్యుడు ప్రతీక్ లోథా మాట్లాుడూ ఈ స్టార్టప్ రక్తం, యోని ఉత్సర్గ, వీర్యం మొదలైన వివిధ మానవ బయో-ఫ్లూయిడ్‌ల కోసం తక్షణ పరీక్ష కిట్‌లను రూపొందించేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు స్టార్టప్ వ్యూహాత్మక భాగస్వామ్య మేనేజర్ మనస్వి షా మాట్లాడుతూ.. హెల్త్ కిట్ లోని ఓ కార్డును రోగి మూత్రంలో ఒక సెకను పాటి ఉంచి.. దానిని సెల్ ఫోన్ అప్పటకే ఇన్ స్టాల్ చేసిన నియోడాక్స్ యాప్ సాయంతో ఫొటో తీయాలన్నారు. ఇది తమ క్లౌడ్ సర్వర్ లో అప్ లోడ్ అయ్యి అక్కడ ఉన్న అల్గా రిథమ్ కార్డ్ ని స్కాన్ చేసి, కేవలం 30 సెకన్లలోనే ఫలితాలను ఇస్తుందని వివరించారు. త్రయంబక్ తాలూకాలోని తమ పబ్లిక్ హెల్త్ సెంటర్లలో (పిహెచ్‌సి) ఈ ఇన్‌స్టంట్ టెస్ట్ కిట్‌లను ఉపయోగించడం కోసం నియోడాక్స్‌తో తాము అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశామని నాసిక్ జిల్లా పరిషత్ ఆరోగ్య అధికారి డాక్టర్ హర్షల్ నెహెటే తెలిపారు. తమ ఏడు పీహెచ్ సీలలో తల్లుల సంరక్షణ కోసం ఈ ఇన్‌స్టంట్ టెస్ట్ కిట్‌లను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నిర్ధారిస్తున్నామని చెప్పారు.

ఒక్క మెయిల్‌తో రూ.90 లక్షలు రాబట్టిన చాట్ జీపీటీ !


ఓ వ్యక్తి తనకు రావాల్సిన మొండి బాకీని వసూలు చేసుకునేందుకు చాట్‌జీపీటీ సహాయం తీసుకున్నాడు. ఇక రాదు అనుకున్న డబ్బును ఒక్క మెయిల్‌తో తిరిగి వచ్చేలా చేసి ఔరా అనిపించింది చాట్‌జీపీటీ. గ్రెగ్‌ ఐసెన్‌బర్గ్‌కు ఒక డిజైన్‌ కంపెనీ ఉంది. దాని ద్వారా ఓ ప్రముఖ బ్రాండ్‌కు డిజైన్‌ వర్క్‌ చేసిచ్చారు. ఆ డిజైన్‌ వారికి బాగా నచ్చింది. అయితే దానికి వారి నుంచి డబ్బు రాలేదు. ఎన్ని మెయిల్స్‌ పంపినా స్పందన లేదు. 'ఇక చేసేది ఏం లేక మా ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ టీం నన్ను రంగంలోకి దిగాలని కోరారు. ఇంకెన్ని మెయిల్స్‌ పంపినా ప్రయోజనం లేదనిపించింది. డబ్బు వసూలు కోసం ఖరీదైన లాయర్‌ను పెట్టుకోవడం కన్నా చాట్‌ జీపీటీ సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. మా డబ్బు చెల్లించేలా ఆ క్లయింట్‌కు ఓ మెయిల్‌ రాసివ్వాలని చాట్‌జీపీటీని కోరగా అది చాలా చక్కగా రాసిచ్చింది. ఆ మెయిల్‌కు వెంటనే క్లయింట్‌ దగ్గర నుంచి స్పందన వచ్చింది. మీకు రావాల్సిన డబ్బును వెంటనే చెల్లిస్తామని వారు బదులిచ్చారు' అని ఐసెన్‌బర్గ్ చెప్పుకొచ్చారు. ఐసన్‌బర్గ్ చేసిన డిజైన్‌కు తన క్లయింట్‌ 1,09,500 డాలర్లు (రూ.90,80,331) ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ క్లయింట్ డిజైన్ చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకోవడం ఐసన్‌బర్గ్ వంతైంది. క్లయింట్ నుంచి డబ్బులు రాబట్టుకోవడం కోసం మంచి లాయర్‌ను పెట్టుకుందామనుకున్నారు. కానీ, ఒకసారి చాట్‌జీపీటీ సహాయం తీసుకోవాలనుకున్నాడు ఐసన్‌. దీంతో ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా క్లయింట్‌ నుంచి రావాల్సిన 1,09,500 డాలర్లు వచ్చేశాయి.

50 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ 13 ప్రో !


దేశీయ మార్కెట్లో షావోమీ 13 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించడంతో ఇవి అందరి దృష్టిని ఆకర్షించాయి. దీని ధర ఐఫోన్ 14 ప్రో రేంజ్ లో ఉంది. ఆ మోడల్ కు పోటీగానే షావోమీ ఈ మొబైల్ ను లాంచ్ చేసింది. యూరోప్ లో 1,299 యూరోల నుంచి ప్రారంభం కానుంది. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.1.13 లక్షల పైమాటే. సెరామిక్ బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అయితే మన దేశంలో ఈ ఫోన్ ధర రూ. లక్ష లోపే ఉండవచ్చు. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 4820 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ ను షావోమీ 13 ప్రో సపోర్ట్ చేయనుంది. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ ఫీచర్ ను ఈ ఫోన్లో అందించారు. లెయికా బ్రాండెడ్ కెమెరాలు ఈ ఫోన్లో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్గా ఉంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ ఫ్లోటింగ్ టెలిఫొటో సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.73 అంగుళాల ఓఎల్ఈడీ 2కే డిస్ప్లేను అందించారు. డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 ఇన్బిల్ట్ స్టోరేజ్ను కూడా అందించారు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.

భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో నెల జీతం రూ.15వేలు !


భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' అంటూ నెటిజన్లతో  కునాల్‌ షా ముచ్చటించారు. ఈ చర్చ సందర్భంగా నెటిజన్లు ఆయనకి అనేక ప్రశ్నలు వేశారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన  'నా శాలరీ నెలకు రూ.15 వేలే అని సమాధానం ఇచ్చారు. కంపెనీ లాభాలబాట పట్టేవరకూ నేను భారీ స్థాయిలో జీత భత్యాలు తీసుకోవడం సబబు కాదని భావిస్తున్నానన్న ఆయన, గతంలో నా కంపెనీ ఫ్రీ ఛార్జ్‌ను అమ్మేయగా వచ్చిన డబ్బు నాకు సరిపోతోంది అంటూ బదులిచ్చారు. మొత్తంగా సీఈవో కునాల్‌ షా. ఆ నెటిజన్‌తో చేసిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు సారు అంత తక్కువ జీతంతో మీరు ఎలా బతుకుతున్నారు అని అడిగేస్తున్నారు. కొందరు సీఈవోపై ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు ఈ ప్రకటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




Sunday, February 26, 2023

ఆరు నెలల్లో లక్షలకు పైగా బైకులు విక్రయం !


'రాయల్ ఎన్ ఫీల్డ్' వింటేజ్ లుక్ తో పేరుకు తగ్గట్టే రాయల్ గా ఉంటాయి ఎన్ ఫీల్డ్ బైక్ లు. అందుకే రేటు ఎక్కువైనా ఈ బైక్ నే కొనాలి అని అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. గత ఏడాది మార్కెట్ లో లాంచ్ అయిన 'రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్' బైక్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఎన్ ఫీల్డ్ బైక్ లకు ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. దేశీయ మార్కెట్లో 'హంటర్ 350' రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికి వరకు లక్షకు పైగా బైకులను కంపెనీ విక్రయించినట్టు ప్రకటించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ల సెగ్మెంట్ లో హంటర్ 350 చౌకైంది. గత ఆగష్టులో రూ. 1.5 లక్షల ప్రారంభ ధరలో విడుదల అయి అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ లలో రాయల్ ఎన్ ఫీల్డ్ ఒకటిగా నిలిచింది. హంటర్ 350 రెండు వేరియంట్లో లభిస్తోంది. ఒకటి హంటర్ 350 రెట్రో కాగా, మరొకటి హంటర్ మెట్రో. రెండు వేరు వేరు రంగులు, ఎక్విప్ మెంట్ ఆప్షన్లతో వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో హంటర్ రెట్రో వినియోగదారులను ఆకర్షిస్తుండగా, మెట్రో వేరియంట్ లో మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. రెట్రో ధర రూ. 1.50 లక్షలగా ఉండగా, మెట్రో ధర 1.64 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ఉంది. క్లాసిక్ 350 తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ తర్వాత ఎక్కువగా సేల్ అయిన మోడల్ హంటర్ 350. రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 పలు రంగుల్లో లభిస్తోంది. రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ , డాపర్ వైట్, డాపర్ గ్రే, రెబల్ బ్లాక్, డాపర్ యాష్ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ 2,055 మీమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్ బేస్ లతో 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొంది ఉంది. ఇది 181 కేజీలు మాత్రమే ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో మిగతా టూవీలర్లతో పోలిస్తే 10 నుంచి 14 కేజీల బరువు తక్కువ. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 114 కిలోమీటర్లు కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. ఇది 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్, 102 mm రేర్ సస్పెన్షన్ ఈ బైక్ లో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో క్లాసిక్ 350లో అందించిన సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, SOHC ఇంజిన్‌నే ఇచ్చారు. ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. ఈ బైక్ లుక్ లో మాత్రం చూడటానికి స్పోర్ట్స్ మోడల్ తరహాలో ఉంటుంది. దీని మ్యాక్స్ పవర్ 20.2 బీహెచ్‌పీ కాగా.. పీక్ టార్క్ 27 ఎన్ఎంగా ఉంది. 349 సీసీ ఇంజిన్‌ను ఇందులో అందించారు. రౌండ్ టర్న్ ఇండికేటర్స్, రౌండ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంది. దీని లుక్ రెట్రో తరహాలో ఉండటం మరో ప్లస్ పాయింట్. తక్కువ ధరలో రెట్రో లుక్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అందరినీ ఆకర్షిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది.

లేఆఫ్స్‌లో పెర్ఫామెన్స్‌నూ పట్టించుకోని గూగుల్ !


మెరుగైన పనితీరు కనబరిస్తే లేఆఫ్స్ భయం ఉండదని, సరైన సామర్ధ్యం కొరవడిన వారిపైనే వేటువేస్తారనే అభిప్రాయం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. గూగుల్ ఇండియా  ఉద్యోగి లింక్డిన్ పోస్ట్ ఇదే విషయం స్పష్టం చేస్తోంది. ఆ పోస్ట్ వివరాల ప్రకారం సామర్ధ్యం ఆధారంగా లేఆఫ్స్ చోటుచేసుకోలేదు. అత్యధిక సామర్ధ్యం కనబరిచి హయ్యస్ట్ రేటింగ్ కలిగిన వారిని కూడా కంపెనీ విధుల నుంచి తొలగించింది. గూగుల్ లేఆఫ్స్ సామర్ధ్యం ప్రాతిపదికన జరగలేదని ఆ ఉద్యోగి స్పష్టం చేశారు. గూగుల్ ఇండియా భారత్‌లో ఇటీవల 450 మందిని తొలగించగా ఈ లేఆఫ్స్ పెర్ఫామెన్స్ ఆధారంగా జరగలేదని చెప్పుకొచ్చారు. కొలువులు కోల్పోకుండా కంపెనీలో కొనసాగగలిగిన (నాతో సహా) వారంతా లేఆఫ్స్ బాధితుల కంటే మెరుగైన సామర్ధ్యం కలిగిఉండాల్సిన అవసరం లేదని లింక్డిన్ పోస్ట్‌లో సదరు ఉద్యోగి రాసుకొచ్చారు. అధిక రేటింగ్స్‌తో ఇటీవల పదోన్నతులు పొంది తనకు పరిచయమున్న వారు సైతం ఇటీవలి లేఆఫ్స్‌లో కొలువులు కోల్పోయారని ప్రస్తావించారు. 15 ఏండ్లకు పైగా గూగుల్‌లో పనిచేస్తున్న మహిళ ఓ రోజు ఉదయం లేస్తూనే అనూహ్యంగా  తన ఉద్యోగం కోల్పోయిన విషయం తెలుసుకున్నట్టు వెల్లడించారు. 

చాట్ జీపీటీ సాయంతో వాట్సాప్ మెసేజ్ ?


చాట్ జీపీటీ సాయంతో వాట్సాప్ మెసేజ్ కూడా చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ లో మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే చాట్ జీపీటీ దానికి రిప్లై ఇస్తుంది. అంటే మీ బదులు అదే మీ లాగా రిప్లై ఇస్తుందన్నమాట. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని చాట్ జీపీటీని ప్రవేశపెట్టిన ఓపెన్ ఏఐ గానీ, లేదా వాట్సాప్ యాజమాన్యం మెటా గానీ ధ్రువీకరించలేదు. ఈ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ చాట్ బాట్‌ గత నాలుగు నెలలుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ లో కూడా చాట్ జీపీటీ రాబోతోందని చెబుతున్నారు. పైగా మీ తరఫున మెసేజ్ లకి రిప్లై కూడా చాట్ జీపీటీనే ఇచ్చేస్తుందని చెప్పడంతో అంతా షాకవుతున్నారు. అయితే నేరుగా చాట్ జీపీటీ మీ వాట్సాప్ లోకి రాదు. కానీ, డానియల్ గ్రాస్‌ అనే డెవలపర్‌ రాసిన ఓ పైథాన్‌ స్క్రిప్ట్ సాయంతో చాట్ జీపీటీని వాట్సాప్ లో పొందవచ్చని చెబుతున్నారు. అలా చేసి.. మీరు ఏఐ చాట్ బాట్ కి పర్మిషన్ ఇచ్చేస్తే మీ తరఫున అదే రిప్లై ఇస్తూ ఉంటుంది. ఈ పైథాన్ స్క్రిప్ట్ ని వాడుకుని చాట్ జీపీటీని వాట్సాప్ లో వినియోగించాలి అంటే.. ఓ వెబ్ పేజ్‌ నుంచి మీరు ముందు లాంగ్వేజ్‌ లైబ్రరీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లాంగ్వేజ్ లైబ్రరీని డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు 'వాట్సాప్-జీపీటీ-మెయిన్' అనే ఫైల్ ని ఓపెన్ చేసి.. 'సర్వర్.పీవై' డాక్యుమెంట్ ఎక్జిగ్యూట్ చేయాలి. తర్వాత మీ వాట్సాప్ లోకి చాట్ జీపీటీ వస్తుంది. సర్వర్ రన్ అవుతున్న సమయంలో 'IS' అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. తర్వాత 'పైథాన్ సర్వస్.పీవై' పై క్లిక్ చేయాలి. ఓపెన్ ఏఐ చాట్ పేజ్ లో మీ నంబర్ ను ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మీరు రోబో కాదని నిరూపించుకోవడానికి 'కన్ఫన్ ఐయాన్ నాటే రోబో' క్లిక్ చేయాలి. ఇంక వాట్సాప్ లో చాట్ జీపీటీ మీ తరఫున మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనికి  సంబంధించిన అధికారిక ప్రకటన ఏది లేదు. అటు చాట్ జీపీటీ నుంచి కానీ.. లేదా వాట్సాప్ యాజమాన్యం నుంచి గానీ దీనికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ లేదు. కాబట్టి దీనిని డోన్ లోడ్ చేసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాట్సాప్ ఇంటిగ్రేషన్ అసలైనది కాదని గుర్తిస్తే, మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

'ఎవ్రీడే రోబోట్స్' ప్రాజెక్ట్‌ను మూసివేత !


గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గ్లోబల్ మార్కెట్ మాంద్యం మధ్య 'ఎవ్రీడే రోబోట్స్' ప్రాజెక్ట్‌ను మూసివేసింది. ఎవ్రీడే రోబోట్స్ అనేది ఫలహారశాలలను శుభ్రం చేయడానికి రోబోట్‌లను అభివృద్ధి చేయడం మరియు శిక్షణ ఇవ్వడంపై పని చేస్తున్న యూనిట్. గ్లోబల్ మాంద్యం కారణంగా గూగుల్ ఖర్చు తగ్గించుకోవడంతో లేఆఫ్ వార్తలు వచ్చాయి. రోబోట్ విభాగం ఇప్పుడు మూసివేయబడినందున కొంత భాగాన్ని ఇతర విభాగాలకు ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్ట్ కింద గూగుల ఫలహారశాలలను శుభ్రపరచడంలో సహాయపడటానికి 100 రోబోట్‌లకు శిక్షణ ఇవ్వబడింది. ఈ రోబోట్ బే ఏరియా సౌకర్యాలలో విధులను నిర్వహిస్తున్నాయి. ఈ రోబోట్‌లు ఫలహారశాల పట్టికలను శుభ్రం చేయడానికి, చెత్తను మరియు రీసైక్లింగ్‌ను వేరు చేయడానికి మరియు ఇతర పనులతో పాటు తలుపులు తెరవడానికి రూపొందించబడ్డాయి. మహమ్మారి సమయంలో సమావేశ గదిని శుభ్రం చేయడానికి సాయపడ్డాయి.ఈ రోబోలు చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ వాటిని నిర్వహించడానికి ఖర్చు చాలా ఖరీదైనది. కంపెనీ యాప్ స్టోర్‌లో విక్రయించే యాప్‌లు మరియు సేవల కోసం కస్టమర్‌లకు బిల్ చేయడానికి ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను ఉపయోగించవచ్చని గూగుల్ ప్రకటించింది. కంపెనీ జనవరి 25న ప్లే స్టోర్ లో థర్డ్-పార్టీ యాప్ స్టోర్ కొనుగోళ్లను అనుమతించడంతోపాటు పాలసీ మార్పుల జాబితాను విడుదల చేసిన దాదాపు నెల తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది.భారతదేశంలో ఇటీవలి శాసన మార్పులకు ప్రతిస్పందనగా, మేము ఇప్పుడు డెవలపర్‌లందరికీ భారతదేశంలోని వారి మొబైల్ మరియు టాబ్లెట్ కస్టమర్‌ల కోసం గూగుల్ ప్లేతో పాటు ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థను అందించే సామర్థ్యాన్ని అందిస్తున్నాము. ఒక వినియోగదారు ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి చెల్లిస్తే గూగుల్ ప్లే సర్వీస్ ఛార్జ్ 4 శాతం తగ్గించబడుతుందని కంపెనీ తెలిపింది.


అధిక లాభాలను చేకూర్చే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ !


106 నుండి 500 రూపాయల లోపు ఎక్కువ లాభాలను అందించే బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్ : రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు. రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 ఎస్ఎంఎస్ లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది. రూ.249 అన్ లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను కూడా తీసుకువస్తుంది. రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ముందు నుండే అందుబాటులో వుంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్ మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు ఎస్ఎంఎస్ సర్వీస్ లు మాత్రం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

యూట్యూబ్ లో మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ !


యూట్యూబ్ యూజర్ల కోసం మల్టీ లాంగ్వేజ్ పేరుతో సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.  ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు తమకు నచ్చిన భాషలో ఇతర భాషల వీడియోలను చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. యూట్యూబ్ వేరే భాషలో ఉన్న కొన్ని వీడియోలు అందరీ అర్థం కావు. అలాంటి వాటిని అర్థం చేసుకునేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఈ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు యూట్యూబ్ తెలిపింది. మల్టీ లాంగ్వేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు, సెట్టింగ్స్ లోకి వెళితే ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో నచ్చిన లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకుంటే .. ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది. అయితే వీడియోకు మెయిన్ ఏ భాషలో ఆడియో ఉండాలనేది కంటెంట్ క్రియేటర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. డెస్క్ టాప్, టీవీ, యూట్యూబ్, మొబైల్ వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ పనిచేయనుంది. ప్రస్తుతం సెలెక్ట్ చేసిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. త్వరలో యూజర్లు అందరికీ పరిచయం చేయనున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని భాషల్లో ఈ ఫీచర్ వస్తుందనే అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే 40 పైగా భాషల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. మొదటిసారి ఇలాంటి ఫీచర్ ను నెట్ ఫ్లిక్స్ పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వీక్షకులను ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' గేమ్ ను వీక్షకులకు అర్థమయ్యేలా సబ్ టైటిల్స్ ను అందించింది అదేవిధంగా స్థానిక భాషల్లో డబ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇపుడు యూట్యూబ్ సైతం మల్టీ లాంగ్వేజ్ వీడియోను నచ్చిన భాషలో చూసేందుకు యూజర్లకు అవకాశం కల్పించింది.

Saturday, February 25, 2023

గ్రేవీటోన్ మోటార్స్ కంపెనీ ఏ ఆర్ క్యూ ఎలక్ట్రిక్ బైక్ !


హైదరాబాద్ లోని చెర్లపల్లిలో ఉన్నగ్రేవీటోన్ మోటార్స్ కంపెనీ ఏ ఆర్ క్యూ ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసింది. ఈమధ్యే ఈ బైక్‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్.. హైటెక్స్‌లో జరిగిన ఈ మోటర్ షోలో తెలంగాణ ప్రభుత్వం తరపున లాంచ్ చేశారు. దీని మోడల్ చాలా కొత్తగా ఉంటుందనీ, దీనికి ఉన్న బ్యాటరీని తొలగించుకునే వీలు ఉంది. పైగా దీనికి రెండు బ్యాటరీలు ఉంటాయి.  యువతను దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. దీన్ని ఫాస్ట్ స్పీడ్ బైక్‌గా తెలిపింది. దీని మోడల్ చాలా కొత్తగా ఉంటుందనీ, దీనికి ఉన్న బ్యాటరీని తొలగించుకునే వీలు ఉంది. ఈ బైక్‌లో హెల్మెట్ పెట్టుకునేందుకు వీలుగా 16 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. హెల్మెట్‌తోపాటూ ఇంకా చాలా సామాన్లను అందులో ఉంచుకోవచ్చు. ఇండియాలో అన్ని రకాల ప్రదేశాలకూ సెట్ అయ్యే విధంగా ఈ బైక్‌ని తయారుచేసినట్లు కంపెనీ ప్రకటించింది. దీని ఫీచర్స్ గమనిస్తే... ఈ బైక్ మాగ్జిమం 252Nm టార్క్ ఇస్తోంది. దీనికి BLDC హబ్ మోటర్ ఉంది. మోటర్ కెపాసిటీ 6kw ఉంది.  లిథియం అయాన్ NMC బ్యాటరీ ఉంది. బ్యాటరీ కెపాసిటీ 4.2Kwగా ఉంది. ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 140 కి.మీ వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీ మెయింటెనెన్స్‌కి రూపాయి కూడా ఖర్చవ్వదని చెబుతున్నారు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. ఈ బైక్‌లో 3 రకాల వేగాలు ఉన్నాయి. అవి 40 కిలోమీటర్ల స్పీడ్ కోసం ఎకో, 65 కిలోమీటర్ల స్పీడ్ కోసం సిటీ, 110 కిలోమీటర్ల స్పీడ్ కోసం స్పోర్ట్ ఉన్నాయి. దీనికి DRLతో కూడిన LED హెడ్ ల్యాంప్ ఉండగా.. టైల్ ల్యాప్ LEDతో ఉంది. ముందు డిస్క్ బ్రేక్ ఉండగా.. వెనక డ్రమ్ బ్రేక్ ఉంది. అలాయ్ వీల్స్ ఉన్నాయి. బయోనిక్ డిజైన్‌తో తయారుచేసిన ఈ బైక్‌పై ఇద్దరు ప్రయాణించేందుకు వీలుంది. ఇది 150 కేజీల బరువు మొయ్యగలదు. ఈ బైక్ ఇతర ఫీచర్స్, ధర ఎంత, బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే వివరాల్ని కంపెనీ త్వరలోనే చెబుతామని అంటోంది. 

సహచర ఉద్యోగుల డెస్క్‌లు వినియోగించుకోండి !


ఇప్పటికే కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగుల్ని తొలగించిన గూగుల్‌, తాజాగా క్లౌడ్‌ ఉద్యోగులు వారి సహచర ఉద్యోగులు డెస్క్‌లు వినియోగించుకోవాలని కోరింది. తద్వారా నిర్వహణ ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తోంది. 'రియల్‌ ఎస్టేట్‌ ఎఫిషెన్సీ' (హాల్‌ తరహాలో డెస్క్‌లు) పేరుతో గూగుల్‌ ఆఫీస్‌లో డెస్క్‌ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రస్తుతం ఉద్యోగులు హైబ్రిడ్‌ వర్కింగ్‌ విధానంలో వారంలో 2 రోజులు ఇంటిలో, 3 రోజులు ఆఫీసులో పనిచేస్తున్నారు. వారంతంలో శని, ఆదివారాలు సెలవులే. ఇప్పుడు ఈ విధానంలో గూగుల్‌ మార్పులు చేస్తుంది. ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీస్‌లో వర్క్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోవాలని తెలిపింది. తదనుగుణంగా కార్యాలయాల్లో డెస్క్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్నల్‌ మీటింగ్‌లో పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగులకు విడివిడిగా డెస్క్‌లు లేవని, ఒకరి డెస్క్‌లు మరొకరు వాడుకోవాలని సూచించింది. అయితే, డెస్క్‌ అందుబాటులో లేనప్పుడు ఉద్యోగులు ఆఫీస్‌కు రావొచ్చని .. ఆఫీస్‌లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని పనిచేసుకోవాలని స్పష్టం చేసింది.

యాపిల్ స్మార్ట్ వాచ్‌లో రక్తం లేకుండానే షుగర్ పరీక్ష ?


యాపిల్ వాచ్‌ల్లో ఈసీజీ ఫీచర్‌ను జోడించిన కంపెనీ తాజాగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే విధంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ పుకార్లు చాలా కాలం నుంచి వినిపిస్తున్నా తాజా వాటికి బలం చేకూర్చేలా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సపోర్ట్‌తో, త్వరలో ఆపిల్ వాచ్ డయాబెటిక్, నాన్-డయాబెటిక్ పేషెంట్లకు రక్తం తీసుకునే అవసరం లేకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించడంలో సహాయపడుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రక్తం లేకుండా గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించడానికి, ఆపిల్ ఆప్టికల్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించే సిలికాన్ ఫోటోనిక్స్ చిప్‌ను అభివృద్ధి చేస్తుందని, అలాగే శరీరంలోని గ్లూకోజ్ సాంద్రతను గుర్తించడానికి చర్మం కింద లేజర్ నుంచి కాంతిని ప్రకాశింపజేసి గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకునే ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ నో-ప్రిక్ గ్లూకోజ్ మానిటరింగ్ ఇప్పుడు ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ స్టేజ్‌లో ఉంది. దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ధరించడానికి సరిపోయాలే దీన్ని డిజైన్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం, ప్రోటోటైప్ పరికరం ఐఫోన్‌కు సమానమైన పరిమాణంలో ఉందని, త్వరలోనే మనిషి చేతికి ధరించేలా స్మార్ట్ వాచ్‌లో ఈ ఫీచర్‌ను యాపిల్ అందుబాటులోకి తీసుకువస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ కంపెనీ ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. అయితే యాపిల్ కంపెనీ చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తుందని మాత్రం తెలుస్తోంది. 2010లో యాపిల్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ స్టార్టప్ రేర్‌లైట్‌ని కొనుగోలు చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. అప్పటి నుంచి కంపెనీ చాలా రహస్యంగా ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. ప్రస్తుతం వస్తున్న ఈ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతుంది. అయితే రక్తం అవసరం లేకుండా రక్త పరీక్ష చేయడం అంటే దాన్ని వాస్తవికతపై చాలా పరిశోధనలు జరగాలి కాబట్టి యాపిల్ ఈ వాచ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇతర టెక్ కంపెనీలు గతంలో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ టెక్‌పై పనిచేశాయి, అయితే ఇంకా నిజమైన ఉత్పత్తులు మాత్రం తీసుకురాలేకపోయాయి. 

విద్యారంగంలో డిజిటల్‌ విప్లవం !


దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో 2022 సెప్టెంబర్‌లో 'AIoT ఇంటిగ్రేషన్ ఇన్ స్కూల్ కరిక్యులమ్'ను ప్రవేశపెట్టారు. ఈ ప్రోగ్రామ్‌లో కొత్త టెక్నాలజీని ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా నేర్చుకుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో సబ్జెక్ట్‌ ప్లాన్‌ తయారు చేస్తారు. దీనిపై కంప్యూటర్‌ టీచర్లకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లకు నేర్పించడంతో పాటు తరగతి గదుల్లో పూర్తిస్థాయిలో బోధిస్తారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టింకరింగ్ ల్యాబ్‌లలో పిల్లలను ప్రోత్సహిస్తారు. వారితో కొత్త ప్రాజెక్టులు చేయిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా క్లీనింగ్, ప్రోటోటైపింగ్, సర్క్యూట్ బిల్డింగ్, ప్రోగ్రామింగ్ బోధించడం ద్వారా పిల్లల్లో డిజిటల్‌ నైపుణ్యాలు పెరుగుతాయని APJ, గవర్నమెంట్ పార్ట్నర్‌షిప్‌ & ఇనీషియేటివ్స్‌, ఇంట్‌లోని గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ సీనియర్‌ డైరెక్టర్‌ శ్వేతా ఖురానా పేర్కొన్నారు. NEP సైతం వీటిని ప్రోత్సహిస్తోందని ఆమె అన్నారు. అయితే వీటి అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడం, భారీ నిధుల రూపంలో సవాళ్లు కూడా ఎదురవుతాయని ఆమె అన్నారు. వీటిని అధిగమించి AI, IoTను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. అప్పుడే ప్రపంచంలో భారత్‌ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. ఈ డిజిటల్‌ సాంకేతికత దుర్వినియోగం కాకుండా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. 2019 నుంచే ఇంటెల్, CBSE పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. 20,000 మంది ఉపాధ్యాయులు, 3,50,000 మంది విద్యార్థులకు బూట్‌, మెంటరింగ్‌ క్యాంపులు నిర్వహించారు. 2021లో AI స్టూడెంట్‌ కమ్యూనిటీని, 2022లో టీచర్స్‌ కమ్యునిటీని ప్రారంభించారు. అలాగే 2020లో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖలో భాగమైన నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగం ఆధ్వర్యంలో 'రెస్పాన్సిబుల్‌ AI ఫర్ యూత్' కార్యక్రమాన్ని ప్రారంభించి 50,000 విద్యర్థులను చేర్చుకున్నట్లు ఖురానా తెలిపారు. 2021లో మోదీ ప్రారంభించిన 'ఏఐ ఫర్ ఆల్'లో భాగంగా 11 భారతీయ భాషల్లో ఏడాదిలో ఒక మిలియన్‌ మందికి AIపై అవగాహన పెంచేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు రెండేళ్లల్లో 3 మిలియన్ల మందిని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022లో ఇంటెల్, ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో కలిసి ఇన్‌స్పైర్-అవార్డ్స్ మనక్ స్కీమ్లో అవార్డు సాధించిన వారికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం పెంపొందించేలా కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 10,000 మంది ఇందులో శిక్షణ పొందారు.

అమెజాన్ లో గూగుల్ పిక్సెల్ 6 ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ !


గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్‌ ధర మార్కెట్‌లో రూ.95,990గా ఉంది. అయితే ఈ డివైజ్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ సహాయంతో ఈ ఫోన్‌ను రూ.20వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ కిండా కోరల్ కలర్‌ పిక్సెల్ 6 ఫోన్‌ను అమెజాన్‌లో ఇప్పుడు రూ.19,949 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై అమెజాన్ 60 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో ఫోన్ ధర రూ. 95,990 నుంచి రూ. 37,999కు తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను మరింత తగ్గించుకునే ఆఫర్లు కూడా ఇప్పుడు అమెజాన్‌లో ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పిక్సెల్ 6 ఫోన్‌పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌పై రూ.18,050 ఎక్స్ఛేంజ్ వాల్యూను అమెజాన్ అందిస్తోంది. ఈ ఆఫర్ అందిపుచ్చుకుంటే.. గూగుల్ పిక్సెల్ 6 ఫోన్ ధర రూ.19,949కి తగ్గుతుంది. పిక్సెల్ 6 ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు అమెజాన్ రెండు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. HSBC క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌పై 7.5 శాతం అదనపు డిస్కౌంట్ (రూ.2వేల వరకు) ఉంది. కనీస కొనుగోలు విలువ రూ. 8000 ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌పై 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ.1500 వరకు) లభిస్తుంది. కనీస కొనుగోలు విలువ రూ.10,000 ఉండాలి. అమెజాన్‌లో ఈ ఆఫర్స్ యాక్సెస్ చేసుకొని బెస్ట్ డీల్ సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో 'గూగుల్ పిక్సెల్ 6' ఫోన్‌ను 2021 అక్టోబర్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ 6.40-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. 2.8GHz ఆక్టా కోర్ Google Tensor ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13కు ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో 4614mAh బ్యాటరీ ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది.

రూ.1,299కే ట్రూక్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ !


ఇండియాలో ట్రూక్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్, ఆడియో ఎక్విప్‌మెంట్, యాక్సెసరీస్ రిలీజ్ చేస్తూ మార్కెట్ షేర్ క్రమంగా పెంచుకుంటోంది. ఈ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ తాజాగా మన దేశంలో సరికొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది. 'ట్రూక్ బడ్స్ A1' పేరుతో లేటెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాలో వీటి ధర రూ.1499గా పేర్కొంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ప్రొడక్ట్‌ను రూ.1299కే సొంతం చేసుకోవచ్చు. ట్రూక్ బడ్స్ A1.. బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో, స్పెషల్ క్లాసిక్ కేస్ డిజైన్‌తో లభిస్తుంది. ఈ ఇయర్‌ బడ్స్‌కు ఒక సంవత్సరం వారంటీ ఉంది. కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా 250+ యాక్టివ్ సర్వీస్ సెంటర్లను కంపెనీ నెలకొల్పింది.  ప్రీ ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. అయితే వీటి సేల్ మార్చి 3న ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ట్రూక్ బడ్స్ A1 రూ.1299కి అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ పీరియడ్ ముగిసిన తర్వాత ఇవి రూ.1499కి లభిస్తాయి. A1 హైబ్రిడ్-యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో వస్తుంది. దీంట్లోని 10mm రియల్ టైటానియం స్పీకర్ డ్రైవర్స్ మంచి సినిమాటిక్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. Quad-MIC ENCతో పాటు, 30dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ANC) కెపాసిటీ దీని సొంతం. బడ్స్ A1లో డైనమిక్ ఆడియో, బాస్ బూస్ట్ మోడ్, మూవీ మోడ్ వంటి మూడు EQ మోడ్స్ ఉన్నాయి. ఇవి స్మూత్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 48 గంటల ప్లేటైమ్‌ అందిస్తాయి. డివైజ్‌లోని 300mAh బ్యాటరీని USB-Cతో ఛార్జ్ చేయవచ్చు. ట్రూక్ బడ్స్ A1 బ్లూటూత్ 5.3తో బెస్ట్ కనెక్షన్ కంపాటబిలిటీని అందిస్తుంది. వన్ స్టెప్ ఇన్‌స్టంట్ పెయిరింగ్ టెక్నాలజీతో ఇయర్‌బడ్స్‌ను ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. గేమర్స్ కోసం 50ms వరకు అల్ట్రా-లో లేటెన్సీతో బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది.


Friday, February 24, 2023

త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 విడుదల !


దేశీయ మార్కెట్లోకి ప్రీమియం వన్‌ప్లస్ 11 5జీ, మిడ్‌-ప్రీమియం వన్‌ప్లస్ 11 ఆర్ విడుదల చేసిన తర్వాత నార్డ్ సిరీస్‌లో భాగంగా అందుబాటు ధరలో లభించే వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. వన్‌ప్లస్ నార్డ్ 3ని వన్‌ప్లస్ జూన్‌లో లాంఛ్ చేయనుందని మైస్మార్ట్‌ప్రైస్ వెల్లడించింది. ఈ ఫోన్ రూ. 30,000లోపు ఉండవచ్చని  ఈ పబ్లికేషన్ అంచనా వేసింది. ఇక వన్‌ప్లస్ నార్డ్ 3 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు బ్యాక్ ప్యానెల్‌లో 50 ఎంపీ మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ షూటర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. గ్లాసీ ఫినిష్‌తో 6.72 ఇంచ్ డిస్‌ప్లేతో ఈ హాట్ డివైజ్ ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ చిప్‌సెట్ కలిగిఉంటుంది. యూజర్లు లౌడ్‌, సైలెంట్ వాల్యూమ్ మోడ్స్ మధ్య స్విచ్ అయ్యేందుకు వీలుగా నార్డ్ 3 డిస్టింక్ట్ అలర్ట్ స్లైడర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.

జూలై 13న చంద్రుని మీదకు మూన్ లాండ్ లూనా -25 ను పంపనున్న రష్యా !


చంద్రుడి మీదకు రష్యా మూన్ లాండల్ లూనా -25 ను పంపనుంది. ఆ ప్రయోగ తేదీనీ రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కన్ మస్ ప్రకటించింది. లూనా-25 స్పేస్ క్రాఫ్ ను జులై 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు రాస్కన్ మస్ తెలిపింది. నిజానికి గతేడాది సెప్టెంబర్ లో ఈ ప్రయోగం జరగాల్సివుంది. కానీ, సాంకేతిక కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. స్పేస్ క్రాఫ్ లోని ఏవియాన్సిక్ లో లోపాలు ఉన్నట్లు రాస్కన్ మస్ చీప్ యూరిబోరిస్సో తెలిపారు. 1976 తర్వాత చంద్రుడి మీదకు రష్యా లూనా – 25 పంపిస్తోంది. ఎన్ని అవంతరాలు వచ్చినా ఈ ప్రయోగాన్ని సమర్థవంతంగా చేపట్టనున్నట్లు రాస్కన మస్ తెలిపారు. 30 పేజీల సైంటిఫిక్ ఎక్విప్ మెంట్ తో లూనా నింగికి ఎగరనుంది. చంద్రుడిపై అనేక పరీక్షలు, ఆ తర్వాత మిషన్ చేపట్టనున్నారు. చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్న బొగ్ సన్ విస్ కి కేటర్ అకాశాలు ఉన్నాయి. మరోవైపు 2025లో చంద్రుడిపై అమెరికా తన వ్యోమగాములను దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల చైనా కూడా వరుసగా కొన్ని లూనా ప్రయోగాలను చేపట్టింది. ఇక ఇండియా కూడా ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టనుంది.

ఫోన్‌లోనే టీవీ ?


ఫోన్‌లో టీవీ ప్రోగ్రామ్స్‌ చూడాలంటే డిస్నీ హాట్‌స్టార్ లేదా సన్ నెక్స్ట్ లాంటి యాప్స్‌కు సబ్ స్క్రిప్షన్ ఉండాలి. అందులో కూడా కొన్ని ఛానెల్స్ మాత్రమే వస్తాయి. అలా కాకుండా అన్ని ఛానెల్స్ చూడాలంటే మాత్రం ఇంట్లో టీవీ, దానికో డీటీహెచ్ లేదా కేబుల్ కనెక్షన్ ఉండాలి. అయితే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా నేరుగా మొబైల్‌లోనే టీవీ చూసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. రీసెంట్‌గా జరిగిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ సొసైటీ ఎక్స్‌పోలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ సెక్రటరీ అపూర్వ చంద్ర కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల వేలంతో పాటు కొన్ని దేశీయ ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించడం, మొబైల్స్‌లోనే టీవీ ప్రోగ్రామ్స్ వచ్చేలా కొన్ని ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఎఫ్‌ఎం రేడియోను టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. మన దేశంలో పెద్ద సంఖ్యలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఉన్నప్పటికీ అందులో 60 శాతం మాత్రమే సేవలు అందిస్తున్నాయని, అలాగే దేశంలోని అన్ని సరిహద్దు ప్రాంతాలకు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సేవలను అందిచడం కోసం మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం నాలుగేండ్ల కాలంలో రూ. 2,500 కోట్లు కేటాయించిందనీ చెప్పారు. దీంతోపాటు ఐఐటీ-కాన్పూర్, సాంఖ్య ల్యాబ్‌లు కలిసి టెలివిజన్ సిగ్నల్స్‌ను నేరుగా మొబైల్ ఫోన్స్‌లో ప్రసారం చేసేలా కొత్త ట్రాన్స్‌మిటర్‌లను తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో నేరుగా మొబైల్స్‌లోకి టీవీ సిగ్నల్స్‌ను పంపొచ్చు. అయితే దీనికోసం మొబైల్ ఫోన్ యూజర్లు తమ మొబైల్‌కు ప్రత్యేక డాంగిల్‌ను లింక్ చేసుకోవాలి . అలాకాకుండా టీవీ సిగ్నల్స్ కోసం ఫోన్‌లలో ప్రత్యేక చిప్‌ను ఇన్‌స్టాల్ చేసేలా మొబైల్ కంపెనీ వాళ్లను ప్రోత్సహించగలిగితే డాంగిల్ లేకుండానే మొబైల్‌లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ చూడొచ్చు.

తగ్గిన నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ధరలు !


నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి ఈజిప్టు, యెమెన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజును భారీగా తగ్గించింది. 30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి. ఇండియాలో గత కొంతకాలంగా ఓటీటీలు ఆదరణ పొందుతున్నా.. భారత్ లో మాత్రం ఛార్జీలను తగ్గించకపోవడం గమనార్హం కొన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ఆదరణ కోల్పోతోంది. చందాదారులు భారీగా తగ్గిపోతుండటంతో సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా , మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ , ఏసియా పసిఫిక్ లాంటి రీజియన్స్‌లో ఛార్జీలను బాగా తగ్గించింది. ఖాతాదారుల సంఖ్య పెంచుకోవడానికి సబ్ స్క్రిఫ్షన్ ఫీజుపై దాదాపుగా 20 శాతం నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్స్ ఇస్తోంది. అందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'ప్రతి నెల నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను 28 మలేసియన్ రింగిట్స్‌కే అందివ్వనున్నాం. ఈ ఆఫర్ ప్రస్తుత చందాదారులతో పాటు కొత్తగా చేరాలనుకునే వారికి అందుబాటులో ఉంటుంది' అని నెట్ ఫ్లిక్స్ చెప్పింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ బేసిక్ ధర 35 మలేసియన్ రింగిట్స్ ఉండేది. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను లాటిన్ అమెరికాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అక్కడ విజయవంతం కావడంతో మరికొన్ని దేశాలకు విస్తరించింది. కెనడా, న్యూజిలాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో ఈ స్కీం ను అమలు చేసింది. ప్రస్తుతం ఆ దేశంలోని చందాదారులకు పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను నెట్ ఫ్లిక్స్ తీసివేసింది. అయినా, వారు తమ నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్ అకౌంట్‌ను మాత్రం ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. వినియోగదార్లు అకౌంట్‌ను బదిలీ చేస్తే వారి రికమండేషన్స్, హిస్టరీ, మై లిస్ట్, సేవ్డ్ గేమ్స్‌తో సహా మరికొన్ని కొత్త అకౌంట్స్ హోల్డర్స్ చూసే అవకాశం ఉంది.

యాపిల్ వాచ్ లుక్ తో pTron Force X12N స్మార్ట్ వాచ్ !


యాపిల్ ప్రీమియం ధర పరిధిలో మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ కొత్త యాపిల్ వాచ్ అల్ట్రా దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 89,900. ఇంత ఖరీదు పెట్టి స్మార్ట్ వాచ్ కొనాలంటే సామాన్యులవల్లకాదు కానీ, యాపిల్ వాచ్ అల్ట్రా మాదిరిగానే కనిపించే మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ని సొంతం చేసుకోవచ్చు. అదే pTron Force X12N స్మార్ట్ వాచ్. దీన్ని రూ. 1,499 ధరతో ప్రారంభమైంది. ప్రస్తుతం రూ. 1,199కే అందుబాటులో ఉంది. ఆపిల్ వాచ్ అల్ట్రాతో పొలిస్తే మీరు ఈ PTron వాచ్‌ని 20-30 రెట్లు తక్కువ ధరకు పొందుతారు. ఈ స్మార్ట్‌వాచ్ pTron Force X12N దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉంటుంది.1.85-అంగుళాల TFT LCD డిస్‌ప్లేను రౌండబుల్ క్రౌన్ కలిగి ఉంది. సిలికాన్ బెల్ట్‌తో ప్రీమియం అల్లాయ్ మెటల్ కేసింగ్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ 100 కన్నా ఎక్కువ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లతో వస్తుంది. IP68 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో 10 మీటర్ల వైర్‌లెస్ రేంజ్‌తో బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. ForceX12N బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, కాంటాక్ట్ సింక్‌తో స్పీకర్, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. డయల్ ప్యాడ్‌తో కూడా వస్తుంది. వాచ్ Android 8.0 అంతకన్నా ఆపై OS వెర్షన్, iOS 9.1, అంతకంటే ఎక్కువ OS వెర్షన్ సపోర్టు ఉన్న డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుంది. 3 గంటల మాగ్నెటిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ని అందిస్తామని pTron హామీ ఇచ్చింది. స్మార్ట్‌వాచ్‌లో 5 బిల్ట్-ఇన్ గేమ్‌లు, స్మార్ట్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్లు, హార్ట్ రేట్ చెక్, SpO2 బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ ప్రెజర్ చెక్, స్లీప్ మానిటర్, సెడెంటరీ అలర్ట్, స్టెప్ కౌంట్, బర్న్డ్ క్యాలరీలు & 8 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా, మెసేజ్ పుష్, రిస్ట్ సెన్స్, డోంట్ డిస్టర్బ్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ఒక ఏడాది వారంటీతో వస్తుంది. బ్లేజింగ్ బ్లూ, గోల్డ్ బ్లాక్, కార్బన్ బ్లాక్ , మరియు షాంపైన్ పింక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఈ-కామర్స్ సైట్ అమెజాన్  నుంచి ఈ కొత్త స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. 

ఐఫోన్‌ 14పై యాపిల్‌ బంపర్‌ ఆఫర్‌ !


యాపిల్‌ స్టోర్‌ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఇప్పుడు ఐఫోన్‌ 14పై మాత్రం భారీ డిస్కౌంట్‌ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్‌ ఎక్సేంజ్‌, రెండోది బ్యాంక్‌ ఆఫర్‌.  అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్‌ స్టోర్‌లో ఐఫోన్‌ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్‌ను యాపిల్‌ ప్రాథమిక ఆఫర్‌తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్‌లో ఉన్న మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్‌ లభిస్తుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్‌ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్‌ 14 మీ సొంతం అవుతుంది.

Thursday, February 23, 2023

ట్విటర్ లో మళ్లీ ఉద్యోగాల కోతలు ?


ట్విటర్ ఉద్యోగులపై మరోసారి వేటు పడినట్టు తెలుస్తోంది. సేల్స్ , ఇంజనీరింగ్ విభాగంలోని ఉద్యోగులను తొలిగించినట్టు తెలుస్తోంది. దీనిపై కొందరు ఉద్యోగులు నేరుగా ఎలాన్‌ మస్క్‌కే ఫిర్యాదు చేశారు. సంస్థ ఆదేశాలతో ట్విటర్‌ యాడ్స్ కోసం పని చేస్తున్నా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఎలాన్ తో మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ యాడ్స్‌పై ఉద్యోగులు వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, సరైన పరిష్కారాన్ని కనుక్కోవాలని ఉద్యోగులపై హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే, తాజాగా ఉద్యోగుల్లో కోత విధించడానికి గల కారణం మాత్రం స్పష్ట లేదు. ట్విటర్‌ యాడ్స్‌కు ఓ పరిష్కారం కనుకొనాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుందని, ఒక వారంలో చేయడం సాధ్యం కాకపోవచ్చని గతంలో ట్విటర్‌లో మానిటైజేషన్‌ మేనేజర్‌గా పనిచేసిన మార్సిన్‌ కల్దుల్క్సా ట్విటర్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ట్విటర్‌ యాడ్స్‌, మానిటైజేషన్‌ ఇన్‌ఫ్రాలో పని చేస్తున్న వారంతా ఎంతో అనుభవం ఉన్నవారు అని, పరిస్థితులను చక్కదిద్దడంలో వారికున్న నైపుణ్యం, అనుభవం ఈ సమయంలో ఉపయోగపడతాయని అన్నారు. ట్విటర్‌లో అనసవరమైన, అభ్యంతరకరమైన యాడ్స్ రావడంపై ఎలాన్‌ మస్క్‌ యూజర్లకు క్షమాపణలు చెప్పారు. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ట్విటర్‌లో యూజర్‌ టాపిక్స్‌, కీవర్డ్స్‌ ఆధారంగా ప్రకటనలు కనిపించేలా మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై మరింత భారం పెడుతున్నట్లు తెలుస్తోంది.

మెసేజ్ లు సవరణ చేయడానికి కొత్త ఫీచర్ ?


ఆపిల్  ఐ మెసేజ్ యాప్‌లో ఎడిట్ బటన్ ఎలా పని చేస్తుందో, అలాగే మెసేజ్ లను పంపిన 15 నిమిషాల వరకు ఎడిట్ చేయడానికి వినియోగదారులను అనుమతించే విధంగా ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ పరీక్షిస్తోంది. ఏదైనా స్పెల్లింగ్ లేదా గ్రామర్ తప్పులను సరిచేయాలనుకుంటే లేదా కొంత సమాచారాన్ని జోడించాలనుకుంటే లేదా తీసివేయాలనుకుంటే మెసెజ్ ను సవరణ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఫీచర్ ఇంకా అభివృద్ధిలో ఉన్నట్లు కనిపిస్తోంది కానీ ఇటీవల iOS 23.4.0.72 కోసం వాట్సాప్ బీటాలో గుర్తించబడింది. ఇది టెస్ట్ ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న వారి కోసం ఇది విడుదల చేయబడింది. ప్రస్తుతం, మీరు వాట్సాప్ యొక్క పాత వెర్షన్‌ను వాడుతున్నట్లైతే, సవరించిన ఈ మెసేజ్ ఫీచర్ కనిపించదు కానీ వినియోగదారులు వారి వాట్సాప్ యొక్క కొత్త అప్డేట్ ఫీచర్‌కు ఇది వస్తుందని వారికి తెలియజేసే హెచ్చరికను పొందుతారు. డెవలపర్‌లు మీడియా క్యాప్షన్‌లను ఎడిట్ చేయడానికి అనుమతించే మరొక ఫీచర్‌పై కూడా పని చేస్తున్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఎడిట్ మెసేజ్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్‌లో ఉన్నందున, ఇది వినియోగదారులందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే సమాచారం ఇప్పటివరకు తెలియదు. వినియోగదారులు తమ ఫోటోలను ఒరిజినల్ క్వాలిటీ తో ఇతరులతో పంచుకోవడానికి వీలుగా ఉండే కొత్త ఫీచర్ ను కూడా బీటా వెర్షన్ లో పరీక్షిస్తున్నసంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం, వాట్సాప్ లో ఫోటోలను షేర్ చేసే సమయంలో ఆటోమేటిక్ గా కంప్రెస్ చేయబడి, తక్కువ రిజల్యూషన్‌ లో ఫోటోలు షేర్ అవుతుంటాయి. ఇప్పుడు రాబోయే ఈ కొత్త ఫీచర్ తో ఈ సమస్య పరిష్కారం కానుంది. WABetaInfo సమాచారం ప్రకారం, ఈ ఫంక్షనాలిటీ ఫీచర్ భవిష్యత్తులో వాట్సాప్ అప్‌డేట్‌లో చేర్చబడే అవకాశం ఉంది, ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది అని సమాచారం. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు వాట్సాప్ "సెట్టింగ్‌లు" విభాగంలో, వినియోగదారులు ఇతర వ్యక్తులకు పంపే చిత్రాల కోసం నాణ్యత ప్రీసెట్‌ ఫంక్షన్ ను "ఆటోమేటిక్," కు బదులుగా "ఉత్తమ నాణ్యత" లేదా "డేటా సేవర్" ఆప్షన్ ని ఎంచుకోవడానికి వీలు కలిగి ఉంటారు. అయినప్పటికీ, ఒరిజినల్ క్వాలిటీ కాన్ఫిగరేషన్‌లో పంపే ఫోటోలు కూడా వాటి అసలు నాణ్యతతో పంపబడవు ఎందుకంటే అవి ఆటోమేటిక్ గా కంప్రెస్ చేయబడతాయి. ఆండ్రాయిడ్ 2.23.2.11 అప్‌డేట్ లో ఈ సరికొత్త వాట్సాప్ బీటా ఫీచర్‌ని పరీక్షిస్తోంది, ఇది వినియోగదారులు తమ ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలను షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది.


5,000 మందికి వేతన పెంపు ఉండదు !


ఫ్లిప్‌కార్ట్‌  సిబ్బందిలో 70 శాతం మందికి మాత్రమే ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. దాదాపు 5,000 మందికి ఈసారి వేతన పెంపు ఉండదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఇ-మెయిల్‌ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ తమ ఉద్యోగులకు బుధవారం తెలియజేసింది. గ్రేడ్‌ 10 ఆపై స్థాయి ఉద్యోగుల వేతనాల్లో పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, బోనస్‌లు, స్టాక్‌ ఆప్షన్స్‌ కేటాయింపులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. ఇప్పటికే ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు ముగిసినట్లు కంపెనీలోని ఓ కీలక వ్యక్తి తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇంక్రిమెంట్లు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో తమ వనరులను జాగ్రత్తగా వాడుకోవాలనుకొంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

జియో నుంచి 12 జీబీ ఉచిత డేటా ఆఫర్ !


రిలయన్స్ జియో కొత్తగా తీసుకువచ్చిన రూ.899 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ 12GB ఉచిత డేటా ఆఫర్ ను యాడ్ చేసింది. రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు వాట్సాప్ సర్వీస్ !


హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సర్వీస్ ను మరింత సులభతరం, పారదర్శకంగా అందరికీ  అందించే దిశగా కొత్త సేవలను హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్ ప్రారంభించింది. అదేమిటంటే, జనరంజక మెసేజింగ్ యాప్ వాట్సాప్ తో హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త సర్వీస్ ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా  వాట్సాప్  లో హైదరాబాద్ మెట్రో రైల్ కోసం చాట్ బాట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా, చాలా ఈజీగా టికెట్ బుకింగ్, మెట్రో ట్రైన్ టైమింగ్ మరియు షెడ్యూల్స్ తో పాటుగా మరిన్ని వివరాలను మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ లోనే పొందవచ్చు. అంతేకాదు, టికెట్ రేట్స్, టాప్ అప్ మరియు టికెట్ కొనుగోళ్లు కూడా ఈ వాట్సాప్ చాట్ బాట్ తో చేసుకోవచ్చు. మెట్రో సర్వీస్ ల కోసం ఈ వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు బెంగుళూరు, పూణే మరియు ముంబై నగరాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. మెట్రో  వాట్సాప్  చాట్ బాట్ సర్వీస్ లను ఉపయోగించడానికి +918105556677 నంబర్ ను ముందుగా మీ ఫోన్ లో సేవ్ చేసుకొని చాటింగ్ కొనసాగించవచ్చు. ఈ చాట్ బాట్ సర్వీస్ నుండి చాలా ఈజీగా టికెట్ బుకింగ్, మెట్రో ట్రైన్ టైమింగ్ మరియు షెడ్యూల్స్, టికెట్ రేట్స్, టాప్ అప్ మరియు టికెట్ కొనుగోళ్లను కూడా చేయవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ కొత్త వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ లను తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఎస్సెల్ ఎనర్జీ కంపెనీ ఎలక్ట్రిక్ బైసైకిల్ !


మార్కెట్లోకి ఎస్సెల్ ఎనర్జీ కంపెనీ గెట్ 1 అనే ఎలక్ట్రిక్ బైసైకిల్ ని తీసుకొచ్చింది.  దీనికి  రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని లేదు. దీన్ని నడపడానికి లైసెన్స్ కూడా ఉండాల్సిన అక్కర్లేదు. ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. బ్యాటరీ కెపాసిటీ మారుతుంది. ఒక దానిలో 48 వీ 13 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే మరో దానిలో 48 వీ 16 ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 13 ఏహెచ్ బ్యాటరీ ఉన్న వేరియంట్ ధర రూ. 41,500గా ఉంది. అదేవిధంగా 16 ఏహెచ్ బ్యాటరీ ఉన్న వేరియంట్ ధర రూ. 43,500గా ఉంటుంది. అంటే ధర అందుబాటులోనే ఉందని చెప్పుకోవచ్చు. కేవలం 10 పైసల ఖర్చుతో కిలోమీటర్ వెళ్లొచ్చని కంపెనీ చెబుతుంది.  ఇందులో రియర్ డబుల్ షాకర్, టెయిల్ లైట్ విత్ ఇండికేటర్స్, ఎక్స్‌ట్రా స్టోరేజ్ బాక్స్, ప్రొజెక్టర్ లెన్స్ హెడ్ లైట్, ఫ్రంట్ బాస్కెట్, ఫ్రంట్ డబుల్ షాకర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.  ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. వాటర్ ప్రూఫ్ కేబుల్. ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్లు వెళ్లొచ్చు. చార్జింగ్ టైమ్ 5 నుంచి 6 గంటలు పడుతుంది. బ్యాటరీ బ్యాకప్ ఇండికేటర్, డ్రమ్ బ్రేక్స్, లిథియం అయాన్ బ్యటరీ, పార్కింగ్ లైట్, ఫ్రంట్ అండ్ రియర్ బ్రేక్ సెన్సార్ టు కట్ ఆఫ్ మోటార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనిపై రెండేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. బ్యాటరీకి ఇది వర్తిస్తుంది. అదే ఇతర భాగాలపై అయితే ఏడాది పాటు వారంటీ లభిస్తుంది. ఇందులో కంపెనీ 250 వాట్ 48 వోల్ట్ బీఎల్‌డీసీ మోటార్‌ను అమర్చింది. దీని బరువు 39 కేజీలు.


Wednesday, February 22, 2023

6000mAh బ్యాటరీతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 !


ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,299 ధరలో 6000mAh బ్యాటరీని కలిగివుంది. అంతేకాదు, ఎంటర్టైన్మెంట్ ఉపయోగం కోసం అవసరమైన అన్ని వనరులను ఈ స్మార్ ఫోన్ కలిగివున్నట్లు ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెషల్ లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.7,299కే విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 26వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల నుండి Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.  6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని చిన్న వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc ఆక్టా కోర్ ప్రోసెసర్ Spreadtrum SC9863A1 తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో 3GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ను అందించడం విశేషం. 13MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ . ఈ ఫోన్ Android 12 OS ఆధారిత XOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ 6000 mAh హెవీ బ్యాటరీని టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది.

50MP కెమెరాతో పోకో సి-55 స్మార్ట్ ఫోన్ !


పోకో c-55 మొబైల్ ని అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియంగా కనిపించే లేథరేట్ బ్యాక్ ఉన్నప్పటికీ మీడియా టెక్ హీలియం G85 SOC,6GB ram మరియు 128 GB స్టోరేజ్ మెమొరీ కలదు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి..6.71 అంగుళాలు కలదు. ఈ నెల చివరిన ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ రెడ్మీ 12 -C మొబైల్ కు రీ బ్రాండెడ్ వర్షన్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది . రెడ్మీ మొబైల్ ఈ నెలలో ఇండియాలో లాంచ్ చేయబడుతుందని వార్తలు వినిపించాయి. redmi 12-C మొబైల్ ఇప్పటికే చైనాలో అనేక మార్కెట్లలో ఈ మొబైల్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. POCO C-55 స్మార్ట్ మొబైల్ 1650X720 పిక్సెల్ తో కలదు. అలాగే 5MP ఫ్రంట్ కెమెరాతో పాటు ఫేసింగ్ కెమెరా కూడా కలిగి ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో 50 mp ప్రైమరీ కెమెరా కలదు. ఈ మొబైల్ రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది. బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది అలాగే బ్యాటరీ విషయానికి వస్తె..5000 MAH సామర్థ్యంతో కలదు. ఈ మొబైల్ పోకో C-55 కనెక్టివిటీ ఎంపికలోని 3.5 MM ఆడియో జాక్ డ్యూయల్ ఫోర్ జి ఓల్ట్, బ్లూటూత్ జిపిఆర్ఎస్ కలదు. 

జాప్ ఐ 300 సీసీ బైక్ !


కొత్త స్టార్టప్ కంపెనీ న్యూలుక్ ఓ బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జాప్ ఐ 300 సీసీ బైక్ ఎలక్ట్రిక్ స్టెప్ త్రూ స్కూటర్‌లా కంపెనీ చెబుతుంది. ఈ లండన్, యూకే ఆధారిత సంస్థను 2017లో స్థాపించారు. ఈ బైక్‌ జెడ్ ఆకారంలో ఉంటుంది. ఎస్కోస్కెలిటిన్ ఫ్రేమ్ చుట్టూ స్కూటర్ వంటి స్టెప్ త్రూ డిజైన్‌తో ఉంటుంది. ఈ ఐ 300 బైక్ యాక్సలరేషన్, డైనమిక్స్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకుంటోంది అలాగే బ్యాటరీలు లేకుండా ఈ స్కూటర్ బరువు 92 కిలోలుగా ఉండనుంది. ఈ బైక్ తేలికగా ఉన్నా 150 కిలోల లోడ్ పరిమితి ఉంది. అలాగే 14 అంగుళాల చక్రాలతో ఫ్రంట్ ఫోర్క్స్, మార్చుకోదగిన ఫ్రంట్ ఫెండర్, సర్దుబాటు చేయగల పుష్ రోడ్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఈ జాప్ బైక్ 14 కెడబ్ల్యూ పవర్, 587 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే ఐపీఎం ఎలక్ట్రిక్ మోటర్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది కార్బన్ ఫైబర్ బెల్ట్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తుంది. 2.2 సెకన్లలోనే 30 కిలో మీటర్ల స్పీడ్ అందుకోవడం ఈ బైక్ ప్రత్యేకత. అలాగే 5 సెకన్ల కంటే తక్కువలో 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 720 డబ్ల్యూహెచ్‌ సామర్థ్యంతో రెండు తొలగించగల 72 వీ లిథియం ఐయాన్ బ్యాటరీలతో ఈ బైక్ వస్తుంది. కేవలం 40 నిమిషాల్లోనే 80 శాతం వరకూ చార్జ్ చేసుకునే అవకాశం ఈ బైక్ సొంతం. అయితే ఈ బైక్ ప్రస్తుతం రిజర్వ్‌లో ఉంది. ఎంట్రీ లెవెల్ మోడ్ 7400 డాలర్లుగా కాగా అలాగే పరిమిత లాంచ్ ఎడిషన్ మోడలైతే 10140 డాలర్లుగా కంపెనీ ధర నిర్ణయించింది. ఈ బైక్‌ను నేరుగా జాప్ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. 

'ఫర్జీ' ప్రమోషన్ కోసం స్విగ్గీ పార్శిల్‌లో నకిలీ రూ.2,000 నోట్లు !


ఓటీటీలో రిలీజ్ అయిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' ప్రమోషన్ కోసం కొత్తగా ఆలోచించింది. ఫర్జీ వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా తమ కస్టమర్లకు నకిలీ రూ.2,000 నోట్లను పార్శిల్‌లో పంపించింది. దీంతో కస్టమర్లు అవాక్కయ్యారు. ఫర్జీ అంటే తెలుగులో నకిలీ, చెల్లనిది, కృత్రిమం అని అర్థం. ఆ అర్థానికి సరిపోయేలా నకిలీ రూ.2,000 నోట్లను పార్శిల్‌లో పంపించింది స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. పార్శిల్ ఓపెన్ చేయగానే రూ.2,000 నోట్లు చూసి కస్టమర్లు ఖంగుతిన్నారు. తమకు స్విగ్గీ పార్శిల్‌లో రూ.2,000 నకిలీ నోట్లు వచ్చాయంటూ కస్టమర్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. ముంబై, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, కోల్‌కతా, బెంగళూరు, పూణె, చెన్నై, హైదరాబాద్‌లోని కస్టమర్లకు స్విగ్గీ పార్శిల్‌లో ఇలా రూ.2,000 నకిలీ నోట్లు వచ్చాయి.  నకిలీ రూ.2,000 నోట్లపై ఫర్జీ వెబ్ సిరీస్‌లో నటించిన షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల ఫోటోలు ఉన్నాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ప్రైమ్ వీడియో లోగోలు కూడా ఉన్నాయి. వీటితోపాటు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా ఉంది. ఆ కోడ్ ఉపయోగించి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు డిస్కౌంట్ పొందొచ్చు.  ఫర్జీ వెబ్ సిరీస్ కూడా రూ.2,000 నకిలీ నోట్ల చుట్టూ ఉంటుంది. అందుకే ఫర్జీ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఇలా రూ.2,000 నకిలీ నోట్లను ఉపయోగించారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఫర్జీ వెబ్ సిరీస్ ప్రమోషన్‌ను  చేశారు. 


మెకిన్సీలో 2000 మంది తొలగింపు ?


2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు మెకిన్సీ సన్నాహాలు చేపట్టిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దీనిలో 45 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్లైంట్స్‌తో నేరుగా సంప్రదింపులు జరపని అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులను తొలుత టార్గెట్ చేయవచ్చని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. క్లైంట్స్‌తో సంప్రదింపులు జరిపే ఉద్యోగుల హైరింగ్ యధావిధిగా కొనసాగుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. వందేండ్ల కిందట చికాగోలో ఏర్పాటైన మెకిన్సీ ప్రస్తుతం 130 దేశాల్లో తన సేవలను విస్తరించింది. 2021లో కంపెనీ 15 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. రానున్న రెండు వారాల్లో లేఆఫ్స్‌పై కంపెనీ అధికారిక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఆర్ధిక మందగమనంతో అమెరికాలోని పలు దిగ్గజ కంపెనీలు ఇటీవల లేఆఫ్స్‌ను చేపట్టాయి. 

ఓలా ఎస్ ప్రో బ్యాటరీ మార్చడం తలకుమించిన భారం ?


ఓలా స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే ముక్కున వేలుసుకుంటారు. ఈ ధరలో మీరు కొత్త ఓలా స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. ఆ రేంజ్‌లో ధరలు ఉన్నాయి. ఓలా ఎస్ ప్రో బ్యాటరీ మార్చడానికి ఏకంగా రూ. 87,298 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓలా స్కూటర్లల్లో ఉండే బ్యాటరీలు 2 కేడబ్ల్యూ, 3 కేడబ్ల్యూ, 4 కేడబ్ల్యూ కెపాసిటీతో ఉంటాయి. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ ఎయిర్ బ్యాటరీల ధర రూ. 66,549గా ఉంది. 3 కేడబ్ల్యూ బ్యాటరీకి ఈ రేటు వర్తిస్తుంది. అదే 4 కేడబ్ల్యూ బ్యాటరీకి అయితే రేటు రూ. 87 వేలకు పైగా ఉంది. అందువల్ల ఈ రేంజ్‌లో డబ్బులు పెట్టి కొత్త బ్యాటరీ వేసుకోవాలంటే అది కష్టమనే చెప్పుకోవాలి. అందువల్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే బ్యాటరీల ధర ఎంత ఉందనే విషయాన్ని చెక్ చేసుకోండి. కేవలం ఓలా మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ , ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నా కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాల. ముందుగా బ్యాటరీ ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే బ్యాటరీ ధర రూ.లక్షల్లో ఉండే అవకాశం ఉంది.


Tuesday, February 21, 2023

ఎరిక్సన్ లో 1400 మంది ఉద్యోగుల తొలగింపు


ప్రపంచవ్యాప్తంగా ఎరిక్సన్ 1400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ, కార్మిక సంఘాలతో సంప్రదింపుల అనంతరం లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నామని టెలికాం నెట్‌వర్కింగ్ కంపెనీ ఎరిక్సన్ తెలిపింది. ఉద్యోగులను తొలగించడం సులభం కాదని, ఇది సంక్లిష్ట నిర్ణయమని ఉద్యోగుల పట్ల గౌరవం, ప్రొఫెషనలిజంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. సంబంధిత సిబ్బందికి తొలుత పూర్తి వివరాలు తెలియచేస్తామని ఎరిక్సన్ తెలిపింది. కన్సల్టంట్ల తగ్గింపు, వివిధ ప్రాసెస్‌ల క్రమబద్ధీకరణ, సౌకర్యాల్లో కోత వంటి పలు వ్యయ నియంత్రణ చర్యలు ఉంటాయని పేర్కొంది. గతంలో వెల్లడించిన విధంగా ఉద్యోగుల తగ్గింపూ తప్పదని ఎరిక్సన్ స్పష్టం చేసింది. స్వీడన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఇతర దేశాలపైనా ఉంటుందని భావిస్తున్నారు. స్వీడన్ కేంద్రంగా ఎరిక్సన్‌లో 14,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

లావా యువ 2 ప్రో కొత్త బడ్జెట్ ఫోన్ విడుదల !


లావా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. భారత్‌లో యువ 2 ప్రో ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ. 7999లకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో కూడా వస్తుంది.లావా యువ 2 ప్రో ఫోన్ గ్లాస్ వైట్, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అందులో అదనపు 3GB వర్చువల్ ర్యామ్‌కు సపోర్టు వస్తుంది. దీని ధర రూ. 7999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లావా రిటైల్ నెట్‌వర్క్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు డౌట్‌నట్ కోర్సు మెటీరియల్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీ-లోడ్ చేసుకోవచ్చు. 6.5-అంగుళాల HD+ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. MediaTek Helio G37 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయంలో ఫోన్ ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన బ్లోట్‌వేర్‌తో ఫోన్ రాలేదని కంపెనీ పేర్కొంది. కొత్తగా లాంచ్ చేసిన ఫోన్ ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ అవుతుందని, రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తుందని లావా వెల్లడించింది. 13-MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది. ముందు భాగంలో, ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5-MP కెమెరాను కలిగి ఉంది. బ్యూటీ, HDR, నైట్, పోర్ట్రెయిట్, AI, ప్రో, పనోరమా, స్లో మోషన్, ఫిల్టర్‌లు, GIF, టైమ్‌లాప్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి కెమెరా ఫీచర్‌లను కూడా ఫోన్ అందిస్తుంది. టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు కూడా యూజర్లకు ‘Free Home Service’ను అందిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్ల ఇంటి వద్దకే సర్వీసులను అందించనుంది.

గూగుల్ క్రోమ్ మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ !


గూగుల్ క్రోమ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ పేరుతో వీటిని విడుదల చేస్తోంది. క్రోమ్ బ్రౌజర్ పని తీరును మెరుగు పరచడంతో పాటు బ్యాటరీ  లైఫ్ ను పొడిగించేందుకు వీటిని రూపొందించింది. గత ఏడాది డిసెంబర్ లో గూగుల్ వీటిని పరిచయం చేసింది. ఆపిల్ మాక్, విండోస్, లైనక్స్, క్రోమ్ బుక్ లో మెమరీ, ఎనర్జీ సేవర్ లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఫీచర్లను యూజర్ల కోసం రిలీజ్ చేస్తోంది. అంతేకాదు, మెమరీ, ఎనర్జీ మోడ్ లను అవసరం కొద్ది ఆన్ , ఆఫ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన క్రోమ్ మెమరీ సేవర్ ఫీచర్ ఆటోమాటిక్గా ఇనాక్టివ్ ట్యాబుల నుంచి మెమరీ యూసేజ్ను తగ్గిస్తుందని గూగుల్ వెల్లడించింది. ఈ మెమరీ యూజర్లకు కంప్యూటర్ లోని ఇతర పేజీలు, యాప్ వినియోగానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ ఫీచర్ కారణంగా బ్రౌజర్లో పలు ట్యాబ్లను ఓపెన్ చేసి అలాగే ఉంచినా, కొంత సేపు వాటిని వాడకపోతే కంప్యూటర్ మెమరీ నుంచి ఆటోమాటిక్గా డిలీట్ అవుతాయి. మళ్లీ అదే ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఆటో మేటిగ్ గా రీలోడ్ అవుతుంది. అయితే, ఈ ఫీచర్ ను ఆన్, ఆఫ్ చేసుకునే అవకాశాన్ని సైతం గూగుల్ కల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ పనితీరు మరింత మెరుగు పడటంతో పాటు మెమరీ వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ తాజా ఫీచర్ ద్వారా క్రోమ్ 30 శాతం తక్కువ మెమరీని ఉపయోగించనుంది. డివైజ్ కు సంబంధించి బ్యాటరీని ఆదా చేసుకునేందుకు కొత్త ‘ఎనర్జీ సేవర్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. బ్రౌజర్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగే యాక్టివిటీస్ ను కంట్రోల్ చేయడం ద్వారా యానిమేషన్లు, వీడియో ఫ్రేమ్ రేట్లను ఆటోమేటిక్ గా డిసేబుల్ చేస్తుంది. ఈ కారణంగా మరింత పవర్ సేవ్ అవుతుంది. ఎనర్జీ సేవర్ మోడ్ కోసం గూగుల్ రెండు ఆప్షన్లను తీసుకొచ్చింది. ఎనర్జీ సేవర్ మోడ్ని ఆన్, ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఆరుగురితో కలిసి కొత్త కంపెనీ మొదలుపెట్టిన హెన్రీ కిర్క్


ఇటీవల గూగుల్ తీసేసిన సీనియర్ మేనేజర్‌, మరో ఆరుగురు ఎక్స్-గూగులర్స్‌తో కలిసి సొంత కంపెనీ ప్రారంభించాడు.ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి బయట పడేందుకు సెర్చింజన్ గూగుల్ ఇటీవల 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అలా లే-ఆఫ్స్ నోటీసు అందుకున్న వారిలో వర్కింగ్ సీనియర్ మేనేజర్ కూడా ఉన్నాడు. ఉద్యోగం వదులుకోవడం సంగతి పక్కనబెట్టి మాజీ గూగుల్ ఉద్యోగులతో కలిసి సొంత కంపెనీ ప్రారంభించాడు. అతడి పేరు హెన్రీ కిర్క్‌. కిర్క్‌కు బాసటగా నిలిచిన ఆరుగురు ఎక్స్‌-గూగులర్స్ కూడా అలా లే-ఆఫ్ నోటీసులు అందుకున్న వారే. హెన్రీ కిర్క్ గత ఎనిమిదేండ్లుగా గూగుల్‌లో పని చేస్తున్నాడు. సీనియర్ మేనేజర్‌గా పని చేసిన కిర్క్‌, అతడి స్నేహితులు.. తమ భవిష్యత్‌పై ఆరు వారాల పాటు స్టడీ చేశాక.. సొంతంగా న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో `డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ స్టూడియో` ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు. కిర్క్ తన సొంత కంపెనీ గాధను లింక్డ్ ఇన్‌లో షేర్ చేసుకున్నాడు. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులు ఉద్యోగం కోల్పోతే.. లే-ఆఫ్ నోటిఫికేషన్ ప్రకారం 60 రోజుల్లోపు కొత్త కొలువు సంపాదించుకోవాలి. దాని ప్రకారం వచ్చే మార్చి నెలాఖరుతో గడువు పూర్తవుతుంది. ఆ గడువు పూర్తయ్యేలోపు తమ కంపెనీని సెటప్ చేయాలని కిర్క్ భావిస్తున్నాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెడింగ్‌లో ఉంది.`నాకు మరో 52 రోజుల గడువు మాత్రమే ఉంది. నాకు మీ సాయం అవసరం. కష్టపడి పనిచేసిన వారి జీవితంలో సత్ఫలితాలు వస్తాయని ఎల్లవేళలా నమ్మే వారిలో నేనొక్కడిని. స్టూడియో ఏర్పాటు చేయాలన్న నిర్ణయం నా నమ్మకంలో సందేహం కలిగించవచ్చు. ప్రస్తుత విశ్వజనీనమైన అవకాశాల మధ్య జీవితం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదొక ప్రయోగం అవుతుంది` అని కిర్క్ తన లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన వెంచర్‌లో కలిసి పని చేయడానికి ఆరుగురు ఎక్స్ గూగుల్ ఉద్యోగులు ముందుకొచ్చాడని కిర్క్ తెలిపాడు. `ఈ విపత్కర పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకుని ముందడుగు వేయాలని భావిస్తున్నా. నేను ఆరుగురు ఎక్స్‌-గూగులర్స్ #xooglersతో కలిసి మా సొంత భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు టీంగా ఏర్పడ్డాం. అందుకోసం న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో `డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ స్టూడియో` ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇది మా జీవితంలో అద్వాన్నమైన సమయం కావచ్చు. కానీ, ఉత్తేజకరమైన, సవాళ్లతో కూడిన టైం` అని పేర్కొన్నారు కిర్క్‌. కిర్క్ ప్రారంభించిన స్టార్టప్.. ఇతర కంపెనీల యాప్‌లు, వెబ్‌సైట్లకు వివిధ సంస్థల ఇంజినీరింగ్ ప్రాజెక్టులకు డిజైనింగ్ అండ్ రీసెర్చ్ టూల్స్ ఆఫర్ చేస్తోంది. ఆయా రంగాల పట్ల ఎటువంటి పరిజ్ఞానం లేకున్నా.. ఆయా రంగాల స్టార్టప్ కంపెనీలు ఎదిగేందుకు, డబ్బు సంపాదించేందుకు సహాయం అందిస్తాం అంటున్నది. `ఉద్వాసనకు గురైన ఏడుగురు ఎక్స్‌-గూగులర్స్.. ప్రతిష్టాత్మకమైన సాఫ్ట్‌వేర్ సంస్థల డెవలప్‌మెంట్‌కు రీసెర్చ్‌, డిజైనింగ్ చేయాలని ఆతృత పడుతున్నారు` అని కిర్క్ పేర్కొన్నాడు.

నాన్‌ బ్లూ ట్విట్టర్‌ యూజర్లకు టూ-ఫాక్టర్ సెక్యూరిటీ ఫీచర్‌ ఉండదు !


మార్చి 20 నుంచి నాన్‌- బ్లూ సబ్‌స్క్రైబర్లు అందరూ టూ-ఫాక్టర్ సెక్యూరిటీ ఫీచర్‌ను కోల్పోతారని ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్‌ బ్లూ సేవల కోసం ఇండియాలో నెలకు రూ.900 చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించని వారు ఎస్.ఎం.ఎస్  టూ- ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ద్వారా ట్విట్టర్‌ అకౌంట్‌ను సెక్యూర్‌ చేసుకోలేరు. ఎలాన్‌ మస్క్‌ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే చాలా మంది భద్రతా నిపుణులు ఈ విషయాన్ని మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులకు అంత భారమేమీ కాదని భావిస్తున్నారు. ట్విట్టర్‌ బ్లూ సేవల పొందడానికి సబ్‌స్క్రైబ్‌ చేసుకునే ఉద్దేశం లేని వారు ఇతర మార్గాలలో ట్విట్టర్‌ అకౌంట్‌ను సెక్యూర్‌ చేసుకోవచ్చు. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను అందించే వివిధ ఆప్షన్‌లు ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయి. అత్యంత సురక్షితమైన ఆప్షన్‌ కాని SMS ఉపయోగించే బదులు, మీరు మీ అకౌంట్‌లకు మెరుగైన భద్రతను అందించే అథెంటికేటర్‌ యాప్‌కి మారవచ్చు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, Authy వంటి దిగ్గజ కంపెనీల యాప్‌లతో కనెక్ట్‌ కావడానికి ఈ యాప్‌పై ఆధారపడవచ్చు. వినియోగదారులు తమ అకౌంట్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ట్విట్టర్‌లో బెదిరింపులు వంటివి రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. SIM కార్డ్‌లను క్లోనింగ్ చేయడం లేదా మార్పిడి చేయడం ద్వారా SMS అథెంటికేషన్‌ మార్చగల వ్యక్తులు కూడా ఉన్నారని, వారిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ ఎగుమతిలో వృద్ధి !


2022లో టిడబ్ల్యుఎస్ (ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్) ఎగుమతిలో దేశం 85 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 'బోట్' కంపెనీ వరుసగా మూడోసారి మార్కెట్‌లో అగ్రగామిగా ఉందని మంగళవారం తాజా నివేదిక వెల్లడించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం 'బోట్' 89 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల్లో ఐదింట రెండు వంతుల వాటాను అందించింది. టిడబ్ల్యుఎస్ మార్కెట్‌లో ఎయిర్‌డోప్స్131 ఎగుమతి 10 శాతం వాటాతో వరుసగా రెండో సంవత్సరం అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్‌గా నిలిచింది. అంతేకాకుండా టిడబ్ల్యుఎస్ మార్కెట్‌లో స్థానిక బ్రాండ్‌లు టాప్ ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. 'వన్ ప్లస్ ఫీచర్‌రిచ్ పరికరాలైన నార్డ్ బడ్స్, నార్డ్ బడ్స్ సిఈ చక్కని పనితీరుతో చైనా బ్రాండ్‌లు 13 శాతం వాటాను పొందాయి. చైనా బ్రాండ్‌లు వృద్ధి సాధించడానికి రియల్‌మీ, ఒప్పో బాగా మద్దతునిచ్చాయి. ఇక గ్లోబల్ బ్రాండ్‌లైన యాపిల్, శాంసంగ్, జెబిఎన్ ఎనిమిది శాతం వాటాను కైవసం చేసుకున్నాయి' అని సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అన్షిక జైన్ తెలిపారు. టిడబ్ల్యుఎస్ ఎగుమతుల్లో 'బోట్' ప్రథమ స్థానంలో ఉంటే 'నాయిస్' ద్వితీయ స్థానంలో నిలిచింది. కాగా 'బౌల్ట్ ఆడియో' మూడో స్థానంలో నిలిచింది. 'మివీ' నాలుగో స్థానంలో నిలిచింది. పిట్రోన్ ఐదో స్థానంలో ఉంది. దేశీయ బ్రాండ్‌లైన బోట్, మివీ, పిట్రోన్ తమ స్థానిక ఉత్పత్తిని 73 శాతం మేరకు పెంచాయి.

Monday, February 20, 2023

4K ప్రొజెక్టర్లతో ఇంట్లోనే థియేటర్ అనుభూతి !


XGIMI ఆరా అల్ట్రా షార్ట్ త్రో 4కే ప్రొజెక్టర్  : ఈ ప్రొజెక్టర్ 3840 x 2160-పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 150 అంగుళాల స్క్రీన్ పరిమాణంపై 4K చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తుంది. దీనిలో ఎనిమిది పాయింట్ల కీస్టోన్ కరెక్షన్ టెక్నాలజీని ఉంది.  గోడలు లేదా స్క్రీన్‌కు అనుకూలం అయ్యేలా నిలువుగా, అడ్డంగా సమలేఖనం చేస్తుంది. అలాగే దీనిలోని హార్మాన్ కార్డాన్ స్పీకర్‌లతో మంచి బేస్ తో కూడిన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. 150-అంగుళాల స్క్రీన్ ను కలిగిఉన్న ఈ ప్రొజెక్టర్ 2800 ల్యూమన్‌ల కాంతిని ప్రొజెక్ట్ చేస్తుంది. 80 నుంచి 150 అంగుళాల వరకు ప్రొజెక్షన్ పరిమాణాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4K UHD, స్పెక్కిల్ ఎలిమినేషన్ టెక్నాలజీతో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు. వేగంగా కదిలే వస్తువులు సైతం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకోసం ఎంఈఎంసీ సాంకేతికత ఈ ప్రొజెక్టర్ లో ఇచ్చాు. తద్వారా ఇది క్రీడలను వీక్షించేందుకు మంచి ఆప్షన్. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

BenQ V6000 4K లేజర్ టీవీ ప్రొజెక్టర్ : ఈ ప్రొజెక్టర్ 3000 ల్యూమెన్‌ల కాంతితో చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది 120-అంగుళాల పెద్ద స్క్రీన్ పరిమాణాన్ని అందిస్తుంది. 2,000,000:1 కాంట్రాస్ట్ రేషియో కూడా కలిగి ఉంది. 8.3 మిలియన్ విభిన్న పిక్సెల్‌లతో 4K UHD 3840×2160 రిజల్యూషన్ తో క్వాలిటీ పిక్చర్ ను అందిస్తుంది. ప్రొజెక్టర్ పైన ఆటోమేటిక్ సన్‌రూఫ్ స్లయిడర్ ఉంటుంది. ఇది ప్రొజెక్టర్ వినియోగంలో లేనప్పుడు దానిని సంరక్షిస్తుంది. ట్రెవోలో స్పీకర్‌లతో మంచి సౌండ్ క్వాలిటీ అందిస్తుంది.

Mi 4K లేజర్ ప్రొజెక్టర్ : 150 అంగుళాల స్క్రీన్ పరిమాణం కలిగిన ఎంఐ 4కే లేజర్ ప్రొజెక్టర్ 0.233:1 అల్ట్రా-త్రో నిష్పత్తిని కలిగి ఉంది. దీనికి అదనపు వైరింగ్ అవసరం లేదు. ప్రొజెక్టర్ 3000:1 కాంట్రాస్ట్ రేషియోతో పాటు1600 ల్యూమెన్‌ల కాంతితో చిత్రాన్ని ప్రోజెక్ట్ చేస్తుంది. ల్లో ఉపయోగించే లేజర్ లైట్ టెక్నాలజీని కలిగి ఉన్నందున మీరు థియేటర్ వీక్షణ అనుభవాన్ని పొందుతారు. డ్యూయల్ ఫుల్ రేంజ్, డ్యూయల్ హై-ఫ్రీక్వెన్సీ ఆడియో సిస్టమ్ కలయికతో హై-ఫై సౌండ్ సిస్టమ్ మంచి సౌండింగ్ ను అందిస్తుంది.

AAO YG650 4K ప్రొజెక్టర్ : ఇది గేమింగ్ కు అనువైన ప్రొజెక్టర్ 2.4G/5G కనెక్టివిటీతో రు ఆండ్రాయిడ్ లేదాఐఓఎస్ ఫోన్ ద్వారా కంటెంట్‌ను సజావుగా ప్రసారం చేయవచ్చు. 1920×1080 రిజల్యూషన్ తో 7000 ల్యూమన్‌ కాంతితో చిత్రాలను ప్రదర్శించగలుగుతుంది. స్క్రీన్ పరిమాణాన్ని 40 అంగుళాల నుంచి 300 అంగుళాల వరకు సర్దుబాటు చేయవచ్చు. ఇది 8000:1 నుండి 10,000:1 వరకు కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. ఇది హైఫై స్టీరియో స్పీకర్‌ను కూడా కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లో మార్చి 1న వివో వీ 27 విడుదల !


వివో వీ 27 సిరీస్‌ను మార్చి 1న భారత్‌లో విడుదల చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. మెరుగైన కెమెరా ఫీచర్లను కోరుకునే కస్టమర్లు లక్ష్యంగా రానున్న వివో వీ 27 పిక్సెల్ 6ఏకు దీటైన పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. రూ. 30,000 ధరలో పిక్సెల్ 6ఏ మెరుగైన కెమెరా ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. ఇక వివో వీ27 సిరీస్‌లో భాగంగా వివో వీ27, వీ27ప్రొను కంపెనీ విడుదల చేయనుంది. అధికారిక ఈవెంట్‌కు ముందు లేటెస్ట్ 5జీ ఫోన్ డిజైన్‌తో పాటు కొన్ని ఫీచర్లనూ కంపెనీ వెల్లడించింది. వి సిరీస్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఈ సిరీస్‌లో ఇతర ఫోన్లతో పోలిస్తే ఖరీదైనవిగా చెబుతున్నారు. వివో వీ27 సిరీస్‌లో 5జీ ఫోన్ వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఆకట్టుకోనుంది. రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్‌లో సెన్సర్లను అమర్చారు. వివో లేటెస్ట్ డివైజ్‌లు స్లిమ్, లైట్‌వెయిట్ డిజైన్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. పంచ్ హోల్ డిజైన్‌తో ముందు భాగంలో కర్వ్‌డ్ డిస్‌ప్లే కనిపిస్తుంది. వివో ఫోన్లలో మెరుగైన కెమెరా ఫీచర్లు ప్రత్యేకత కావడంతో వివో వీ 27 సిరీస్‌లోనూ ఈ ఫీచర్ ఆకట్టుకునేలా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డివైజ్‌లు మెరుగైన పోర్ట్రయిట్ షాట్స్ ఆఫర్ చేస్తాయని టీజర్‌లో వెల్లడైంది. వివో వీ27 సిరీస్ ఫోన్లు గ్రేడియంట్ ఫినిష్‌లతో ఆకట్టుకోనున్నాయి. వివో వీ 27 స్మార్ట్‌ఫోన్ రూ. 30,000లోపు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Popular Posts