ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను రిమోట్ పద్ధతిలో నియంత్రించటం సర్వసాధారణమైన విషయంగా మారింది. వీటిని నియంత్రించే ఈ రిమోట్ కంట్రోలర్‌లన్నీ బ్యాటరీలు ఆధారంగా పనిచేసేవే.

ఇప్పుడు ఛార్జింగ్ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీలను ఉపయోగిస్తే మహా అయితే వారం పాటు ఉపయోగించుకోవచ్చు. తిరిగి బ్యాటరీలను రీ-ఛార్జ్ చేసుకోవాల్సిందే. ఈ బెడద నుండి తప్పించుకునేందుకు వీలుగా గిజూ సంస్థ యూనివర్శల్ రిమోట్ కంట్రోల్‌ను ప్రవేశపెట్టింది. ఇది బ్యాటరీలు లేకుండానే పనిచేయటం విశేషం. పైగా ఇది మల్టీ బ్రాండ్ (శాంసంగ్, సోనీ, ఫిలిప్స్, పానాసోనిక్ తదితర) పరికరాలన్నింటినీ నియంత్రించగలదు. ఈ రిమోట్ కంట్రోల్‌కు బ్యాటరీలను వినియోగించటానికి బదులుగా దానిపై వుండే డయల్‌ను 30సార్లు తిప్పితే చాలు. ఇది పూర్తి స్థాయిలో ఛార్జింగ్ అయిపోతుంది. పూర్తిగా ఛార్జ్ అయితే అది మరో వారం పాటు పనిచేస్తుందన్న మాట.