Search This Blog
Monday, November 29, 2021
ఉపాధ్యాయులు....!
"అప్రశిఖ"
మాళవ దేశము లోని ఒక గ్రామములో యిద్దరు బాలురు చిన్నతనమునుండీ ఒకే చోట చదువుకుంటూ స్నేహంగా వుండేవారు. వారిద్దరూ యింకా చదువుకోవాలనే ఆశతో కాశీకి వెళ్లి అక్కడ యిద్దరూ ఒక గురువు దగ్గరనే విద్యాభ్యాసము చేస్తూండేవారు. చాలా కాలము విద్య నేర్చుకున్న తర్వాత తమ గ్రామమునకు పోదామనుకున్నారు. వారిద్దరిలో ఒకడు మేధావి, మరొకడు మందబుద్ధి. ఇద్దరూకలిసి స్వదేశ మునకు బయల్దేరారు. మార్గమధ్యం లో అనేక రాజాస్థానములలొ తమ విద్య ప్రదర్శించి చాలా డబ్బు గడించారు. మేదావినే అందరూ ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము యిచ్చేవారు. మందబుద్దికి తక్కువ ధనము దొరికేది. దానితో వాడిలో అసూయ మొదలైంది. ఈ మేధావి తమ గ్రామమునకు పోయిన తర్వాతకూడా అందరూ వాడినే ఎక్కువ గౌరవించి ఎక్కువ ధనము యిస్తారు. వీడినేలాగైనా మార్గ మధ్యములొ చంపేసి తానొక్కడే గ్రామమునకు వెళ్లాలని నిశ్చయించుకుని అవకాశము కోసము ఎదురు చూడ సాగాడు. ఒకనాడు వారి వూరికి దగ్గరగానున్న అరణ్య మార్గములో నడచుచూ అలసిపోయి ఒక చెట్టు నీడలో ఇద్దరూ విశ్రమించారు. మందబుద్ధి కుతంత్రము తెలియని మేధావి హాయిగా నిద్రపోయాడు. మందబుద్దికి నిద్ర రాలేదు. తామిద్దరూ వూరికి పోయిన తర్వాత అందరూ మేధావినే గౌరవిస్తారు. వాడే ఎక్కువ ధనము సంపాదిస్తాడు. నన్నెవరూ గౌరవించరు. వీడిని ఎలాగైనా చంపెయ్యాలి మరీ ఒకసారి వీడు నాకు చిన్ననాటి స్నేహితుడు కదా! నన్ను నమ్మి హాయిగా నిద్ర పోతున్నాడు. వీడిని చపుట అధర్మము కదా! యింటికి వెళ్లి వీడి తల్లిదండ్రులకు, బంధువులకూ యేమని చెప్పాలి ? అని ద్వైదీ భావనతో ఆలోచిస్తున్నాడు. చివరకు అధర్మమే గెలిచింది. ఆ మందబుద్ధి వీడిని యిక్కడే చంపివేసి పులి వాడిని చంపి వేసినదని చెప్తామనుకుని మేధావి తలను తన కాళ్ళ మధ్య యిరికించుకొని కత్తి తీసి మేధావిని చంప బోయాడు. మేధావికి మెలుకువ వచ్చి నన్ను చంపవద్దు అని బ్రతిమాలాడు. నీకు నేనేమి అపకారము చేశాను? నిన్ను నా తమ్ముని వలె ప్రేమగా చూసుకున్నాను. వూరికి వెళ్ళిన తర్వాత యీ ధనము నీకే యిచ్చివేసి నేను నా తల్లిదండ్రులను తీసుకొని వేరే దేశమునకు వెళ్ళిపోతాను నీకు నేను అడ్డురాను నన్ను చంపవద్దు. మా తల్లిదండ్రులకు నేనొక్కడే కొడుకును అని పరి పరి విధములుగా బ్రతిమలాడాడు కానీ మందబుద్ధి మనసు కరగలేదు. సరే వీడు నన్ను చంపక మానడు అనుకోని మేధావి మా తల్లిదండ్రులకు నా ఆఖరు మాటగా "అప్రశిఖ"అని మాత్రము చెప్పుఅన్నాడు. మందబుద్ధి సరేయని చెప్పి మేధావి గొంతును ఖడ్గముతో నరికి చంపివేశాడు. తర్వాత వూరు చేరుకొని దొంగ ఏడుపు ఏడుస్తూ మేధావి తల్లిదండ్రులతో మీ వాడిని పులి అడవిలోకి లాక్కొని పోయి చంపి వేసినదని చెప్పాడు పులి లాక్కొని వెళ్ళేటప్పుడు మీ కొడుకు మీకు తన ఆఖరు మాటగా "అప్రశిఖ" అనే పదం చెప్పమన్నాడు.అని చెప్పాడు. మేధావి తల్లిదండ్రులకు అనుమానము వచ్చింది. వీడే తమ కొడుకును ఏదో చేసేసి అపద్ధము చెప్తున్నాడు అని అనిపించింది. కానీ రుజువు లేదు కదా! వారికి ఆ 'అప్రశిఖ' అనేది మాత్రం అర్థం కాలేదు.వారు భోజరాజు దగ్గరకు వెళ్లి విషయము చెప్పి మీ ఆస్థానము లో ఎవరైనా ఈ 'అప్రశిఖ' అనే మాటకు అర్థమేమిటని చెప్పగలరేమో నని వచ్చినాము అని అడిగారు. రాజు పండితుల వైపు చూశాడు.ఎవరూ జవాబు చెప్పలేదు.కాళిదాసు మాత్రము మీ కొడుకును మానవ మృగమే చంపినది. పులి కాదు. అతని వెంటవున్న అతని స్నేహితుడు మీ కొడుకు ఔన్నత్యము చూసి ఓర్వలేక అతన్ని చంపివేసి అపద్దాలాడు తున్నాడు. మీ కొడుకు మీకు తన తుది సందేశము గా'అప్రశిఖ' అనే ఈ పదము పంపినాడు అని క్రింది శ్లోకమును చదివాడు.
శ్లోకము:- అనేన తవపుత్రస్య
ప్రస్తుప్త వనాంతరే
శిఖా మాక్రమ్య పాదేన
ఖడ్గే నాభి హతం శిరః
అర్థము:-అడవి మధ్యలో ఈ మందబుద్ధిచే మీకొడుకు నిద్రించు చున్నప్పుడు కాలితో గొంతు నదిమి పట్టి ఖడ్గముతో తల నరికి వేసినాడు అన్ని పాదములలోని మొదటి అక్షరాలు కలిపితే 'అప్రశిఖ'అని వస్తుంది. దానినే మీకు సందేశము గా మీకొడుకు పంపించినాడు అని వివరించాడు కాళిదాసు. ఆ వృద్ధులు గోడు గోడున ఏడువ సాగారు. భోజరాజు మందబుద్ధి ని పిలిపించి నీవు చేసిన పాప కార్యము బయట పడినది నీవు మిత్రద్రోహము చేసి మేధావిని చంపినావు. యిప్పుడయినా తప్పు ఒప్పుకోమని గద్దించాడు.వాడు, మరీ ఆస్థానము లోని పండితులూ దానికి రుజువేమున్నదని వాదించారు. మేధావి అదే శ్లోకమును చెప్పినాడని మీరు నిరూపించండి అని పట్టు బట్టారు. అంతట కాళిదాసు రాజా! అడవినుండి ఆ శవ ఖండములను తెప్పించిన రుజువు చేయగలను అన్నాడు. రాజు అందులకు అంగీకరిచి భటులను పంపించి ఆ శవ ఖండములను తెప్పించాడు. కాళిదాసు భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తలను మొండెమునకు అతికించగానే మేధావి పునర్జీవితు డయ్యెను. అప్పుడు అందరూ అతనిని ఆ "అప్రశిఖ" అను ఆ సాంకేతిక మాటకు అర్థమేమిటని అడిగారు.మేధావి కాళిదాసు చెప్పిన శ్లోకము నే చెప్పినాడు. మందబుద్ధి ఏ తనను చంపినాడని చెప్పెను. అప్పుడు భోజరాజు మందబుద్ధిని కఠినము గా శిక్షించి మేధావిని తనకొలువులో ఆస్థాన కవులలో ఒకనిగా నియమించాడు.
Sunday, November 28, 2021
చిన్నపిల్లలకు సోకుతుంది అనే అపోహ వీడండి
బంగ్లాదేశ్‌లో పౌల్ట్రీల్లో సూపర్ బగ్స్?
యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం వల్ల కోళ్ల పెంపకంలోనూ పలు సమస్యలు ఎదురవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో పౌల్ట్రీ పెంపకంలో మితిమీరిన యాంటీబయాటిక్‌ల వినియోగం వల్ల “సూపర్ బగ్స్” ఏర్పడుతున్నాయి. దీనిని సంప్రదాయ చికిత్సా పద్ధతులతో నివారించడం అసాధ్యం. బంగ్లాదేశ్ లైవ్‌స్టాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనంలో ఢాకాలోని 29 మాంసం మార్కెట్‌ల నుంచి సేకరించిన చికెన్ శాంపిల్స్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. వీటి ఇమ్యూనిటీ పవర్ 6.7 నుంచి100 శాతం వరకు ఉంటుంది. ఇది చాలా డేంజర్. ప్రజారోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. పౌల్ట్రీ, జంతువుల పేగులలో నివసించే ఇటువంటి బ్యాక్టీరియా మానవుల కడుపులోకి చేరుతుందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. డబ్ల్యూ హెచ్ ఓ ప్రకారం సాల్మొనెల్లా మానవులలో అతిసార వ్యాధిని కలిగించే కారకాలలో ఒకటి. బాయిలర్ చికెన్ ఉత్పత్తిలో యాంటీ బయాటిక్స్ అత్యధికంగా వాడుతున్నారు. ఆ తర్వాత సోనాలి చికెన్ ఉత్పత్తిలో వాడుతున్నారు. దీనివల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా విస్తరిస్తోంది. ఫిబ్రవరి, డిసెంబర్ మధ్య కాలంలో అనేక రకాల సాల్మొనెల్లా బ్యాక్టీరియా విస్తరించింది. పౌల్ట్రీ ఫామ్‌లలో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల సూపర్‌బగ్స్ ఏర్పడుతున్నాయి. వాస్తవానికి ప్రజల ప్రాణాలను కాపాడటంలో యాంటీ బయాటిక్స్ కీలకపాత్ర పోషిస్తాయి.1940లో అందుబాటులోకి వచ్చిన పెన్సిలిన్ మొదలు అనేక రకాల యాంటీ బయాటిక్స్ నేడు వైద్య చికిత్సలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి రోగి శరీరంలో వ్యాధి కారకాలైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితరాలను గుర్తించి నాశనం చేస్తాయి. కాలక్రమంలో కొన్ని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు మార్పు చెందుతూ ఈ మందులకు ఎదురొడ్డి నిలిచేలా శక్తిమంతమౌతాయి. కొంత కాలానికి చికిత్సకు లొంగని స్థాయికి చేరతాయి. వైద్యానికి తలవంచని అలాంటి మొండి ఘటాలను 'సూపర్‌బగ్స్'గా వ్యవహరిస్తున్నారు.
డయబెటిస్-రాజ్మా-ఉపయోగాలు
చిక్కుడు జాతికి చెందిన రాజ్మా కిడ్నీలను పోలి ఉండటం వలన కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. వీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాజ్మాను ప్రోటీన్ మరియు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. మాంసాహారం తిన లేనివారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. రాజ్మా లో రాగి, ఐరన్, పాస్పరస్, మాంగనీస్, విటమిన్ బి 1, పోలెట్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది. వీటిలో విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే ఇసో ప్లేవొన్, .ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా అకస్మాత్తుగా వచ్చే రక్తపోటును మరియు గుండె కండరాల పనితీరు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్త ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది. నరాల బలహీనత, అలసట, నీరసం అనేవి ఉండవు. రాజ్మాలో ఉండే కరిగే ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క సమ్మేళనం బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలు గుళ్ల బారటం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాజ్మాలో ఉండే పోలేట్ శరీరంలో అసమానతలను క్రమబద్ధీకరణ చేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటికి కాస్త దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు రాజ్మా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు విరివిగానే లభ్యమవుతున్నాయి. రాజ్మా ను మసాలా కర్రీ గా చేసుకోవచ్చు. ఉడికించి తినవచ్చు. అలాగే కూరలు చేసు కున్నప్పుడు వాటిలో వేసుకోవచ్చు. రాజ్మాను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు వండుకోవాలి. లేదా ఉదయం సమయంలో నానబెట్టి సాయంత్రం సమయంలో వండుకోవాలి. రాజ్మాను దాదాపుగా 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టాలి.
తమిళ సినీ మీడియాకి రాజమౌళి క్షమాపణలు
ఓమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్ జారీ
మూత్రం వాసన వస్తే జాగ్రత్త!
* యూరినరి ట్రాక్ట్ ఇంఫెక్షన్. మూత్రం వాసన చెడుగా మారడానికి ఈ ఇంఫెక్షన్ ఒక కారణం. ఇలాంటి కండీషన్ లో కేవలం మూత్రం యొక్క రంగు, వాసన మారడమే కాదు, మూత్రంలో బాగా మంటగా ఉంటుంది. దురదగా కూడా ఉండొచ్చు. ఈ ఇంఫెక్షన్ యురెత్రా, బ్లాడర్ మరియు కిడ్నీలమీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. డాక్టర్ ని సంప్రదిచండి. మంచినీళ్ళు బాగా తాగడం అలవాటు చేసుకోండి.
* లివర్ వ్యాధులు వస్తే కూడా మూత్రం యొక్క వాసన తేడా కొడుతుంది. ఈ కండీషన్ లో మూత్రం వాసన మరీ భయంకరంగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మలీనాలు సరిగా శుభ్రం కాకపోవడం వలన. సాధారణంగా ఈ సమస్య వచ్చినప్పుడు వాంతులు కూడా అవుతాయి. కడుపులో నొప్పిగా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రొటీన్స్ ఎక్కువ తీసుకోని, మద్యం మానేసి, డాక్టర్ ని కలుస్తూ ఉండాలి.
* డయాబెటిస్ ఉన్నవారి మూత్రం ఏదో తీపి పదార్థం వచ్చిన వాసన రావొచ్చు. ఇలా చాలామందికి జరుగుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ లో తేడాలొచ్చి బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో లేకపోవడం వలనే ఇలా జరుగుతుంది. ఈ షుగర్ సమస్య తీసుకొచ్చే నష్టాల గురించి మీకు తెలియనిది కాదు. డైట్, డాక్టర్ ఈ రెండు చాలా ముఖ్యం.
* ఇంటెస్టైనల్ ఫిస్టులా అనేది మరో ప్రధాన సమస్య. ఇందులో భయంకరమైన వాసన రావడంతో పాటు, మూత్రంలో బుడగలు కనిపిస్తాయి. కడుపులో నొప్పిగా ఉంటుంది. బ్లాడర్ కి ఇంటెస్ట్ టైన్స్ మధ్య సమన్వయం లోపించడం వలన ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య కోసం కొలొస్టోమి అనే సర్జరీ అందుబాటులో ఉంది. డాక్టర్ ని అడిగి సర్జరీ మీద మరింత సమాచారం పొందండి.
గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకపోవడం మేలు!
గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకపోవడం మేలు!
బొప్పాయిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అంతేకాదు పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది చాలా తీయగా, వైబ్రెంట్ కలర్లోఉంటుంది. దీన్ని చాలా మంది సలాడ్ రూపంలో తీసుకుంటారు. బొప్పాయిలో అనేక ఆరోగ్య లాభాలు ఉంటాయి. దీన్ని తరచూ ఉదయాన్నే, లేదా లంచ్ టైమ్ లో తింటే గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కేన్సర్, బీపీని తగ్గిస్తుంది. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, కొంత మంది ఈ ఫ్రూట్ తినకపోవడమే మేలు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం మంచిది. కానీ, బొప్పాయిని ఆ జాబితాలో నుంచి తీసివేయడమే మేలు. ఎందుకంటే ఈ పండులో లేటెక్స్, ఉంటుంది. దీంతో యూరినరీ సమస్యలు వస్తాయి. ఇందులో పాపైన్ ఉంటుంది. ముఖ్యంగా ప్రసవాన్ని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు. ఇది పిండానికి కవచంలో ఉండే పొరను బలహీనపరుస్తుంది. సగం పండిన బొప్పాయితో ఇది ఎక్కువగా జరుగుతుంది. గుండె సంబంధిత రోగులకు మేలు చేస్తుంది. కానీ, ఇప్పటికే హార్ట్ బీట్ సమస్యతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలో తక్కువ మొత్తంలో గ్లైకోసైడ్స్, మానవ జీర్ణవ్యవస్థలో హైడ్రోజన్ సైనైడ్ ను ఉత్పత్తి చేసే అమినో యాసిడ్ ఉందని ఒక అధ్యయనం సూచిస్తుంది. దీనివల్ల మొత్తం ఆరోగ్యానికి హానికరం కానప్పటికీ క్రమరహిత గుండె స్పందన సమస్యతో బాధపడేవారిలో దాని కంటే ఎక్కువ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వ్యక్తులపై కూడా ఇదే ప్రభావం కలిగి ఉంటుంది. లేటెక్స్ అలర్జీ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఈ పండులో చిటినాసెస్ అనే ఎంజైమ్ లేటెక్స్ కలిగి ఉన్న ఆహారం మధ్య పరస్సర చర్యకు కారణమవుతుంది. ఇది తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దగ్గు, కళ్లలో నీరు కారడానికి దారితీస్తుంది.
శ్రయద్వాలు
పేదరికాన్ని పెంచుతున్న అసమానతలు
- అత్యంత ధనికులకు అధిక ఆదాయం, సంపద
- పేదలు, మధ్య తరగతిపై పరోక్ష పన్నుల మోత
- ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత్‌లో పేదరికం :
కరోనా రెండో వేవ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని ప్రధాన మీడియా తెగ ప్రచారం చేస్తోంది. పేదరికంలో కూరుకుపోయిన వారి జీవితాలు ఏమేరకు బాగుపడ్డాయో చెప్పటం లేదు. మనదేశంలో అసమానతలు, పేదరికం మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఉదాహరణకు ముకేశ్ అంబానీ లాంటి శతకోటీశ్వరుల (బిలియనీర్లు) సంపద కరోనా సమయంలో భారీగా పెరిగింది. ఒక గంటలో ఆయన సంపాదన..ఒక సాధారణ కార్మికుడికి 10000ఏండ్లు పడుతుంది. మనదేశంలో శతకోటీశ్వర్లకు, ధనికులకు పన్ను ప్రయోజనాలు. పేదలు, మధ్య తరగతిపై పరోక్ష పన్నుల మోత. అందువల్లే వీరు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారని ఐరాస తాజా నివేదిక (యుఎన్‌డీపీ) అభిప్రాయపడింది. కరోనా సంక్షోభం, మోడీ సర్కార్ విధించిన ఏకపక్ష లాక్‌డౌన్ దేశ ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల ఆర్థిక స్థితిగతులు దారుణంగా దెబ్బతిన్నాయి. కరోనాకు ముందు కూడా వారి పరిస్థితి ఏమంత బాగోలేదు. గత మూడు దశాబ్దాలుగా దేశంలో నెలకొన్న తీవ్రమైన అసమానతలు, అవి మరింత ముదిరి సంక్షోభంతో బయటపడ్డాయని కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విభిన్న కోణాల్లో విస్తరించిన (ఆకలి, పౌష్టికాహార లోపం, విద్య, వివక్ష..మొదలైనవి) పేదరికంపై ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇందులో భారత్‌కు సంబంధించి ఐరాస ముఖ్యమైన విషయాలు పేర్కొన్నది. పేదల్లో అత్యధికం ఎస్సీ, ఎస్టీ, ఓబీలే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 139కోట్లమంది పేదరికంలో కూరుకుపోయారు. అందులో 22.7కోట్లమంది భారత్‌లోనే ఉన్నారని నివేదిక తెలిపింది. మనదేశంలో ప్రతి ఆరుగురు పేదల్లో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు చెందినవారున్నారు. పౌష్టికాహారం కోసం, ఆకలి సమస్యను తీర్చుకోవటానికి పోరాడుతున్న ప్రజలు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నారు. విద్య అందుబాటులో లేనివారు, కుల, మత వివక్షను ఎదుర్కొనేవారు ఈ దేశంలోనే అత్యధికంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. అత్యధికమంది శతకోటీశ్వరులు (బిలియనీర్లు) ఉన్న మూడో అతిపెద్ద దేశం భారత్. ఇదే దేశంలో మరోవైపు దశాబ్దాలుగా అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అందువల్లే కరోనా సంక్షోభం తర్వాత పేదరికం 60శాతం పెరిగింది. దేశంలో అసమానతల్ని కరోనా సంక్షోభం మరింత పెంచిందని 'ప్యూ రీసెర్చ్ సెంటర్' నివేదిక (మార్చి, 2021)కూడా తెలిపింది. అదనంగా మరో 7.5కోట్లమంది పేదరికంలోకి కూరుకుపోయారని, మధ్య తరగతి ప్రజల్లో 3.2కోట్లమంది ఉన్నారని పేర్కొన్నది. అయితే భారత్‌లో ప్రధాన మీడియా ఏదీ కూడా ఈ విషయాల్ని ప్రస్తావించటం లేదని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయా? అనేది ప్రధాన మీడియా చూపటం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 'ద ఇండియా ఫోరం' వారి నివేదిక ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్య 'అసమానతలే'. తీవ్రమైన, కఠినమైన కరోనా సంక్షోభం సమయంలో భారత్‌లో శతకోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 140కి పెరిగింది. వీరి మొత్తం సంపద రెట్టింపైంది. అమెరికా, చైనా తర్వాత శతకోటీశ్వరులు అత్యధికంగా ఉన్న మూడో దేశం భారత్. మరోవైపు భారత్‌లో పేదరికం 60శాతం వరకు పెరిగింది. ప్రపంచబ్యాంక్ 2020 లెక్కల ప్రకారం, ప్రపంచ జనాభాలో భారత్ దేశం వాటా 17.8శాతంగా ఉంది. తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్న వారు 6.89కోట్లమంది (20.17శాతం) భారత్‌లో ఉన్నారు. జాతీయ సంపదలో వాటా వివరాల్ని కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. 60 ఏండ్ల క్రితం(1961లో) జాతీయ సంపదలో శతకోటీశ్వరుల వాటా 11.9శాతం. ధనికుల వాటా 43.2శాతం. పేదరికంలో దిగువన ఉన్న 50శాతం ప్రజల వాటా 12.3శాతం. 60ఏండ్ల తర్వాత (2020లో) శతకోటీశ్వరుల సంపద వాటా 42.5శాతానికి చేరుకుంది. ధనికుల వాటా 74.3శాతానికి పెరిగింది. అదే పేదరికంలో ఉన్న 50శాతం ప్రజల వాటా 2.8శాతానికి పడిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన అసమానతల్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా మనదేశంలో భూపంపిణీ పూర్తిగా ఆగిపోయింది. భూపరిమితి చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాటిని పట్టించుకునేవాడే లేడు. పాలకులంతా పట్టణీకరణపై దృష్టిసారించారు. కేంద్రంలో పాలకుల విధానాలు రైతుల్ని అప్పుల్లోకి నెడుతున్నాయి. రుణాల బాధ, పంట నష్టాలతో రైతు మరింతగా కుంగిపోతున్నాడు. గంటకు వంద మంది రైతులు..రైతు కూలీలుగా మారుతున్న దేశమిది. పన్ను విధానాలు శతకోటీశ్వర్లుకు, ధనికులకు అనుకూలంగా ఉండటం పేదరికం పెరడానికి కారణమైంది. మోడీ సర్కార్ వచ్చాక కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించింది. మరోవైపు పరోక్ష పన్నుల్ని(నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్) భారీగా పెంచింది.
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్
Saturday, November 27, 2021
ఎలన్ మస్క్‌కు భారత్ షాక్
టన్నుల కొద్దీ ట్యూనా చేపలు!
ఉద్దానం మత్స్యకారుల వలలో వరాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అరుదుగా దొరికే ట్యూనా చేపలు నాలుగు రోజులుగా ఇక్కడి గంగపుత్రులకు దండిగా దొరుకుతున్నాయి. టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్ట్రాలకు తరలించి వారు సంబరపడుతున్నారు. జిల్లాలో అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఉద్దానం తీరాల్లో తక్కువ మొత్తంలోనే ట్యూనా దొరికేది. ఎవరికో గానీ ఆ అదృష్టం వరించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా వేటకు వెళ్లిన అన్ని వలలకు ట్యూనా చేపలు పడటం విశేషం. జిల్లాలో సోంపేట, కవిటి మండలాల పరిధిలోనే ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయని స్థానిక మత్స్యకారులు, అధికారులు చెబుతున్నారు. బారువ, ఇసుకలపాలెం, ఉప్పలాం, గొల్లగండి తదితర తీర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా ట్యూనా చేపలు లభ్యమయ్యాయి. ఈ చేపల లభ్యత సమాచారాన్ని తెలుసుకున్న చేపల వ్యాపారస్తులు స్థానికులతో ఫోన్లలో బేరాసారాలు చేసుకుని రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజుల్లో సుమారు 200 టన్నుల ట్యూనా చేపలు కేరళ, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలించారు. తొలి రెండు రోజుల్లో కిలో చేపల ధర రూ.30 వరకు ఉంటే, ఇప్పుడు రూ.38 నుంచి రూ.45కి చేరింది. ఇదే ధరలతో కేరళకు భారీగా చేపలు విక్రయాలు జరిగినట్లుగా మత్స్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇక ఈ చేపలకు జపాన్ తదితర నార్త్ ఈస్ట్ దేశాల్లో గిరాకీ అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి చేపలను ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. ట్యూనా చేపలను స్థానికంగా సూరలని పిలుస్తుంటారు. ఇక్కడి వారి కంటే ఇతర దేశస్తులు అధికంగా ఆహారంగా తీసుకుంటారు. గతంతో పోల్చితే ఈసారి అధికంగా చేపల సంతతి బయటపడటంతో అక్కడి వలలకు చిక్కాయి. దేశంలోనే చేపల అభివృద్ధిలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. అలాగే ఇందులో మన జిల్లా కూడా ప్రాధాన్యతను పొందడం విశేషం.
డెంగూ దోమ ప్రత్యేకతలు !
అధిక వడ్డీ ఆశ - కోట్లల్లో మునక!
అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి ప్రముఖుల నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్లను ఆమె మోసం చేసినట్లు గుర్తించారు. బాధితుల్లో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు టాలీవుడ్ హీరోలను శిల్ప మోసం చేసినట్లు సమాచారం. ఫేజ్ త్రీ పార్టీ లు ఇచ్చి పలువురు సెలబ్రిటీలను ఆకర్షించి, రూ.100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కుచ్చు టోపీ పెట్టిందని బాధితులు ఈ కిలేడీపై నార్సింగి పీఎస్‌లో కంప్లయింట్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరితో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈమె బాధితుల నుంచి కోట్లాది రూపాయల వసూలు చేసిందని ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా ఈమెకు పలు చీటింగ్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. శిల్పా చౌదరి బాధితుల్లో నటులు మాత్రమే కాదు బ్యూరోక్రాట్‌లతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు.
నోబల్ బహుమతికి 126 ఏళ్లు..!
ప్రపంచంలో శాస్త్రవేత్తలంతా ఆ బహుమతి కోసం తహ తహలాడి పోతారు. జీవితంలో ఎన్ని సాధించినా ఆ బహుమతి వస్తే దాని దారి వేరే అని భావిస్తారు. అదే నోబెల్ ప్రైజ్. వివిధ రంగాల్లో అభివృద్ధికోసం అవిరాళ కృషి చేసి.. ప్రపంచ ప్రజల జీవితానికి ఉపయోగపడే అద్భుత ఆవిష్కరణలు చేసిన వారికి ప్రతి ఏటా ఈ నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. ఇంత ప్రఖ్యాతి గాంచిన ఈ బహుమతి 1895 నవంబర్ 27న ప్రారంభించారు. అప్పట్లో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ మనసులో వచ్చిన ఆలోచనకు ప్రతిరూపం నోబెల్ ప్రైజ్. ఆయన సంకల్పానికి ప్రతీకగా ఈ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. మొదట్లో, నోబెల్ భౌతిక శాస్త్రం, వైద్యం, రసాయన శాస్త్రం, సాహిత్యం అలాగే శాంతి రంగాలలో మాత్రమే ప్రదానం చేసేవారు. తర్వాత ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్‌ను ప్రదానం చేయడం మొదలు పెట్టారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 21 అక్టోబర్ 1833 న జన్మించాడు. 1842లో తన తండ్రి, ఇమాన్యుయేల్ నోబెల్ దివాలా తీసిన తర్వాత, తొమ్మిదేళ్ల వయసులో, నోబెల్ తన తల్లి ఆండ్రీటా ఎల్సెల్‌తో కలిసి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన తల్లిదండ్రుల అమ్మమ్మ తాతయ్యల ఇంటికి మారాడు. ఇక్కడ అతను కెమిస్ట్రీతో పాటు , స్వీడిష్, రష్యన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలను నేర్చుకున్నాడు. మైనింగ్ పరిశ్రమలో ఉపయోగించే పేలుడు పదార్ధం డైనమైట్ ను కనుగొన్నది ఈయనే. డైనమైట్‌ను కనుగొన్న తర్వాత, ఇది నిర్మాణ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించేవారు. ఆల్ఫ్రెడ్ 90 ప్రదేశాలలో డైనమైట్ ఫ్యాక్టరీలను ప్రారంభించాడు. ఇవి 20 కంటే ఎక్కువ దేశాలలో ప్రారంభం అయ్యాయి. ఆయన అప్పట్లో ‘యూరప్‌లోని అత్యంత ధనవంతుడు’గా నిలిచారు. డైనమైట్ తరువాత ఆయన చాలా ఆవిష్కరణలు చేశారు. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుమీద 355 పేటెంట్లు ఉన్నాయి. అంటే ఆయన ఎన్నిరకాలైన ఆవిష్కరణలు ప్రపంచానికి అందించారో అర్ధం చేసుకోవచ్చు. వీటన్నిటిలోనూ డైనమైట్ కారణంగానే ఆయన ప్రజలకు ఎక్కువగా పరిచయం అయ్యారు. నిర్మాణ పనుల కోసం తాను కనిపెట్టిన డైనమైట్‌ను దుర్వినియోగం కావడం చూసి ఆల్‌ఫ్రెడ్ తన ఆవిష్కరణకు బాధపడ్డాడని చెబుతారు. దీంతో తన వీలునామాలో, తన ఆస్తి నుండి మానవాళికి ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులకు బహుమతి ఇవ్వాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి వీలునామాను 27 నవంబర్ 1895న రాశాడు. ఈ వీలునామా ఆధారంగానే నోబెల్ బహుమతులు ఏర్పాటు చేశారు. నోబెల్ బహుమతులు మొదటిసారిగా 1901లో అందించారు. ఇప్పటివరకు 975 మంది వ్యక్తులు, సంస్థలకు 609 నోబెల్ బహుమతులు లభించాయి.
మొక్కపాటి నరసింహశాస్త్రి
Friday, November 26, 2021
వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది?
ఈ పెద్దోళ్లున్నారే అన్నీ ఇలాగే చెబుతారు అనుకుంటారు కానీ వాళ్లు చెప్పిన ప్రతివిషం వెనుకా ఓ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అయితే సైన్స్ అనే కన్నా దేవుడు, వాస్తు అంటే సరిగ్గా పాటిస్తామనే ఉద్దేశంతో అలా చెప్పారని గ్రహించాలి. కొందరు నిద్రలేచిన మొదలు మళ్లీ నిద్రపోయేవరకూ అడుగుడుగునా వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తుంటారు. చివరకు ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా ఏ దిక్కుగా ముందు అడుగేయాలని చూసుకుంటారు. మిగిలిన విషయాల్లో అంతో ఇంతో తగ్గినా ఏ దిక్కున తలపెట్టుకోవాలనే దానిని తప్పకుంటా పాటించేవారి సంఖ్య చాలా ఎక్కువ.
వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కు ఇంద్ర స్థానం, కుబేర స్థానం. అందుకే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిదని చెబుతారు. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. అందుకే దేవతలుండేవైపు తలబెట్టి పడుకుంటే వారి అనుగ్రహం కలుగుతుందంటారు. ఈ దిక్కువైపు తలపెట్టి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందట. ఇక పడమర దిశలో ఎప్పుడూ తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్లు తూర్పు దిక్కులో ఉంటాయి. తూర్పు దిక్కు దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశగా కాళ్లు పెట్టడం దోషం అంటారు. దక్షిణం ఇది యమ స్థానం. దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటు వైపు కాళ్ళు కాకుండా తలపెట్టుకోవాలని చెబుతారు. ఆరోగ్యానికి, ఆయుష్షుకి చాలా మంచిదని చెబుతారు. ఉత్తరం దిక్కుకి అధిపతి కుబేరుడు కానీ మనుషులు ఆ దిక్కుగా తల పెట్టుకోరాదు. ఎందుకంటే కేవలం శవాన్ని మాత్రమే ఉత్తరం వైపునకు పెడతారు. మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెడితే దక్షిణ దిశ యముడి స్థానం కావడంతో చావుకి ఎదురెళ్లినట్టే అంటారు వాస్తు నిపుణులు. ఈ దిశలో నిద్రపోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉండటమే కాదు మనస్సు కూడా నియంత్రణలో ఉండదంటారు.
గ్రహాలు, నక్షత్రాలు అన్నీ పడమటి నుంచి తూర్పువైపు పయనిస్తుంటాయి. అందుకే తూర్పు, దక్షిణం వైపు శిరస్సుంచి పడుకోవడం మంచిదంటారు.
సైన్స్ ప్రకారం మనదేశం ఉత్తరార్ధ గోళంలో ఉండడం వలన సైన్ ప్రకారం అయస్కాంత తరంగాలు ఉత్తరంవైపు నుంచి పడమర మీదుగా దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు రావడమే కాక, రక్తప్రసరణలో మార్పు వస్తుందంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలా చేస్తే వారిలో పెద్దగా ప్రమాదం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ వాళ్లు కూడా నిద్రలేస్తూనే ఆందోళనగా కనిపిస్తారు. పెద్దలు మాత్రం చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం తప్పదంటారు. మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే తలనొప్పి, గందరగోళం, మెదడు చురుకుదనం తగ్గడం వంటి ప్రభావాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
వాట్సాప్ స్టిక్టర్స్!
'చ'కారకుక్షి
కాళిదాసు కు వ్యాసు డంటే చాలా గౌరవం. అయన శ్లోకాలలో 'చ' (మరియు) అనేది ఎక్కువగా వస్తూ వుంటుంది. కాళిదాసు ఆయన తన మిత్రులతో ఈయన చకార కుక్షి అని తమాషాగా అంటూ వుండే వాడు. వ్యాసుడు పంచమ వేదమైన భారత యితిహాసాన్నీ, అష్టాదశ పురాణాలను వ్రాసినవాడు.మొత్తం 4 లక్షలకు పైన శ్లోకాలు వ్రాసినవాడు. పోలిక చెప్పాలంటే కాళిదాసు రచనలన్నింటి లో కలిపి 6 వేల శ్లోకాలకు మించి వుండవు. అంత ఎక్కువ సంఖ్యలో గ్రంథాలు వ్రాసేటప్పుడు వాటిలో అవసరాన్ని బట్టీ, ఒక్కోకప్పుడు ఛందస్సు పాత్న్చడం కోసం 'తు' (అంటే అయితే) 'చ' (అంటే మరియు)లాంటి మాటలు వాడక తప్పదు. వంశ చరిత్రలూ, రాజుల పేర్లూ, ఋషుల పేర్లు, దేశచరిత్రలు, చెప్పేటప్పుడు 'చ'కారం వాడడం తప్పనిసరి. ఈ విషయాలు కాళిదాసు ఎరుగానివి కాదు. కాళిదాసు వ్యాసుడిని 'చ'కారకుక్షి అనడం ఆ మహానుభావుడిని కించపరచాలనే ఉద్దేశ్యం తో కాదు. వ్యాసుడి రచనా వ్యాసంగం లో వున్న కష్టము, పాండితీ ప్రకర్ష , ప్రతిభ కాళిదాసు గుర్తించినట్లు సామాన్యులు గుర్తించ లేరు. మునిమనుమడిని (అలా కాళిదాసు చెప్పుకునేవాడు) అనే చనువుతోమా తాతగారి పొట్టలో అన్నీ 'చ'కారాలే ఈయన 'చ'కార కుక్షి అని తమాషాగా అనేవాడు. ఒకసారి కాశీ లోకాళిదాసుకు వ్యాసుడి విగ్రహం కనిపించింది. సాష్టాంగ నమస్కారం చేసి ఆయన బొడ్డులో వేలు పెట్టి ఈయన కడుపులో అన్నీ 'చకారాలే' చకార కుక్షి.కాసిని తీసుకొని నేను నా గ్రంథాల్లో వాడుకుంటాను. అన్నాడు. మరీ తీసుకుండా మంటే వేలు రాలేదు అలాగే అతుక్కు పోయింది యెంత లాగినా రాలేదు. అప్పుడు కాళిదాసు తాతగారూ ఏదో ముని మనుమడిని కదా చనువుతో అలా అన్నాను. మీరంటే నాకు ఎంతో భక్తి, గౌరవము క్షమించి వదిలి వేయండి అని అన్నాడు. అప్పుడు వ్యాసుడి విగ్రహము లోనుంచి నీకు చాలా గోప్పకవినని అహంకారం ఎక్కువై విర్రవీగి పోయి పెద్దవాళ్ళని యెగతాళి చేస్తున్నావు. నేను ఎన్నో పురాణాలు వ్రాసి వేలకొలది పాత్రలతో వందలకొద్దీ చరిత్రలు వర్ణించిన వాడిని. నీలాగా ఏ పురాణం లోనుంచో ఒక చిన్న ఘట్టం తీసుకొని దాన్నే సాగదీసి గ్రంథాలు గా వ్రాయలేదు. అనేక పాత్రల గురించి చెప్పాలంటే 'చ'కారం వాడడం తప్పనిసరి. దాన్ని పట్టుకొని నన్ను గేలి చేసినందుకు నీ కీ శిక్ష.అప్పుడు కాళిదాసు మీరు చెప్పింది నిజమే నాది తప్పే చెంపలేసుకుంటాను. నన్ను క్షమించి వదిలేయండి అని బ్రతిమాలాడు. శిక్ష తప్పించుకోవాలంటే నేను ఒక ఘట్టాన్ని చెప్తాను దానిలో 'చ'కారాలు లేకుండా శ్లోకం చెప్పగలిగితే వదిలేస్తాను. అన్నాడు. చెప్పండి తాతగారూ! నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను.అన్నాడు కాళిదాసు. ద్రౌపదికి ఐదుగురు భర్తలు, ధర్మరాజు తమ్ముళ్ళు ఆమెకు మరిది వరుస అవుతారు. అలాగే చిన్నావాడైన సహదేవుడి అన్నలు నలుగురు బావ వరుస అవుతారు. ధర్మరాజు ఆమెకు మరిది కాడు, సహదేవుడు ఆమెకు బావ కాడు. ఇలాగ చెప్పాలంటే 'చ'కారాలు లేకుండా సాధ్యమవుతుందా? 'చ'కారాలు లేకుండా శ్లోకం చెప్పు అన్నాడు. కాళిదాసు ప్రయత్నిస్తాను తాతగారూ అని కింది శ్లోకం చెప్పాడు.
"ద్రౌపద్యా:పాండు తనయా: పతి దేవర భావుకాః
న దేవరో ధర్మరాజః సహదేవో భావుకః
అని 'చ'కారాలు లేకుండా చెప్పాడు. యిలా చెప్తే మీరడిగిన భావం వస్తుందనుకుంటాను తాతగారూ! అన్నాడు.
అర్థము:-- ద్రౌపదికి పాండుపుత్రులు భర్తలు. మరిది బావ వరుస కూడా. కానీ ధర్మరాజు మరిది కాడు సహదేవుడు బావ కాడు. వ్యాసుడు శభాష్ మనవడా! చక్కగా చెప్పావు.అని మెచ్చుకొని నీవు నీ ప్రతిభ వుపయోగించి మరిన్ని మహా కావ్యాలు వ్రాయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. వేలు వదిలేశాడు. వ్యాసుడు కాళిదాసు గొప్పతనం లోకానికి తెలియాలనే యిదంతా చేశాడు.అని అంటారు. కాళిదాసు వేలు తీసేసుకొని మహా ప్రసాదం ఋషీ శ్వరా! యింక ముందు పరిహాసానికి కూడా మీ లాంటి మహానుభావులను కించపరిచే పొల్లు మాటలు మాట్లాడను.అని చెంప లేసుకొని సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. కాళిదాసు కవిత్వం లో .'చ'కారాలు తక్కువగా కనిపిస్తాయి.'హి' 'ఖ' లు కనిపిస్తాయి.అవి అయన వాడే ఊత పదాలు.
మంచి కర్మలకి మంచి, చెడు కర్మలకు చెడు
ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె సంచిని చేతికిచ్చి అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు, ఫలాలను అందులో నింపి సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు. మొదటి మంత్రి ఆలోచించాడు రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి. కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి. అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు. రెండో మంత్రి ఆలోచన రాజు గారికి పండ్లకి కొదవ లేదు. అయినా పంపారు. సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా, వాడిన, పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు. ఇక మూడో మంత్రి చాలా చతురంగా ఆలోచించాడు. రాజు గారికి చాలా పనులు. పండ్ల అవసరం ఆయని కి లేదు. పై పైన చూస్తే చూడొచ్చు. బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు. చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు.. సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు.
మూడో మంత్రి ఊహించినట్లే..రాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు. కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు. "ఈ ముగ్గురినీ చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి. తినడానికి ఏమి ఇయ్యరాదు. వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం." ముగ్గురిని చెరసాలలో బంధించారు. మొదటి మంత్రి చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలిబాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు. రెండవ మంత్రి. కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా కుళ్ళిన, వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు శాశ్వతంగా. మూడవ మంత్రి పైపైన అలంకరించిన పండ్లతో రెండు రోజులు గడిపి ఆకులు, అలములతో మరో వారం పాటు మాత్రమే గడిపి పై లోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లోపే..
కర్మ : మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. మంచి కర్మలకి మంచి, చెడు కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు. 1000 గోవుల మంద ఉన్నా దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో మంచి,చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.
గీతా దత్
గీతా దత్ నేపథ్య గాయని, శాస్త్రీయ కళాకారిణి. ఈమె అసలు పేరు గీతా ఘోష్ రాయ్ చౌదరి. ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఇదిల్ పూర్ అనే గ్రామంలో ఒక జమీందారీ కుటుంబంలో 10వ సంతానంగా జన్మించింది. 1953 లో ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు గురుదత్ ని వివాహం చేసుకుంది. తర్వాత ఈమె పేరు గీతా దత్ గా మారింది. 1959 లో ఈవిడ పాడిన ‘వక్త్ నే కియా క్యా హసీ సితమ్ ... హమ్ రహేన హమ్ తుమ్ రహేన హమ్’... అనే పాట కాగజ్ కే ఫూల్ చిత్రంలో చాలా ప్రజాదరణ పొందింది. మంచినీటి వంటి గొంతు కలిగిన ఈ గాయని లతా మంగేష్కర్ కంటే ముందు సురయ్యా, షంషాద్ బేగంల జమానాలో సూపర్‌స్టార్. అప్రమేయంగా పాట పాడటం ఆమెకు వచ్చు. గొంతు సవరించుకోవడం, ఈ శృతి ఎక్కువో తక్కువో అని నసగడం ఆమె ఎరగదు. కోల్‌కతా నుంచి పాటను తన జడపువ్వుగా ధరించి ముంబై చేరుకుంది. ఎన్నో పాటలను సువాసనలుగా వెదజల్లింది. అయితే ఇంకొన్నాళ్లు నిలిచి ఉండకుండా ఎండి తొందరగా రాలిపోయింది. మేరా సుందర్ సప్‌నా బీత్ గయా’ అనేది ఆమె ‘దో భాయ్’ (1947) లో పాడిన చాలా పెద్ద హిట్ పాట. అందమైన కల గడిచిపోయిందని ఆ పల్లవికి అర్థం. అందమైన కలను కనడం అది తొందరలోనే గడిచిపోవడం గీతాదత్ జీవితంలో కూడా జరిగింది. ఆమె గురుదత్ స్టార్ డైరెక్టర్ కాక మునుపే, చిన్న స్థాయి నటుడిగా ఉండగానే అతణ్ణి ఇష్టపడి వివాహం చేసుకుంది. ఆ సమయానికి ఇండస్ట్రీలో ఆమె అధికురాలు. గురుదత్ ఆమెను నిజంగానే ప్రేమించారు. వారిది ప్రేమపూర్వక జంటగా ఉంది. అతడు నట దర్శకుడిగా, ఆమె గాయనిగా ఇండస్ట్రీలో పెద్ద ప్రభావం చూపారు. గీతా దత్ ఓ.పి.నయ్యర్, ఎస్.డి.బర్మన్‌లతో గొప్ప పాటలు ఇచ్చింది. నయ్యర్ సంగీతంలో గీతా పాడిన ‘బాబూజీ ధీరే చల్‌నా’ (ఆర్ పార్), ‘ఠండి హవా కాలి ఘటా’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘మేరా నామ్ చిన్‌చిన్‌చు’ (హౌరా బ్రిడ్జ్) ప్రేక్షకులను అత్యంత ప్రీతిపాత్ర మయ్యాయి. గీతా పాడిన ‘చిన్ చిన్ చు’తో హెలెన్ డాన్సింగ్ స్టార్ అయ్యింది. ఇక ఎస్.డి, బర్మన్‌తో గీతాది తిరుగులేని జోడి. ఆయన కోసం ఆమె పాడిన ‘తద్‌బీర్ సే బిగ్‌డీ హుయీ’ (బాజీ), ‘జానే క్యా తూనే కహీ’ (ప్యాసా) యాభై ఏళ్లు గడిచిపోయినా నేటికీ శ్రొతల ఆదరణను చూరగొంటున్నాయి. ‘ఏలో మై హారీ పియా’ (ఆర్ పార్), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘పియా ఐసో జియా మే సమా గయేరే’ (సాహిబ్ బీవీ ఔర్ గులామ్)... లాంటి ఎన్నో సుప్రసిద్ద పాటలని ఆలపించింది. ఇన్ని పాటలు పాడిన ఈ సుమధుర గాయని, తన జీవిత చరమాంకంలో ఆర్థిక బాధలనుండి గట్టెక్కడానికి స్టేజీ షోలు చేయవలసి వచ్చింది. భర్త గురుదత్ 1964లో మరణించారు. అతడిది ఆత్మహత్య అని అంటారు. ఆ తర్వాత గీతా దత్ 1972 వరకూ జీవించి మరణించింది. మరణించే నాటికి ఆమె వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే.
జానే క్యా తూనే కహి
జానే క్యా మైనే సునీ
బాత్ కుఛ్ బన్ హీ గయి
జానే క్యా తూనే కహి .....
ఆమె 1930 నవంబర్ 23 న జన్మించారు .ఆమె జన్మించిన ప్రదేశం ప్రస్తుతం బాంగ్లాదేశ్ లో ఉన్నది .కుటుంబం 1940 లో కలకత్తా షిఫ్ట్ అయింది. తనకు 12 సం వయసులో ముంబై లోని బెంగాల్ హైస్కూల్ లో ప్రాథమిక మాధ్యమిక విద్యను పూర్తిచేశారు . సంగీత దర్శకుడు కే హనుమాన్ ప్రసాద్ ఆమెకు సంగీతం లో మెళకువలు నేర్పించారు .1946 లో అతని సంగీత దర్శకత్వం లో భక్త ప్రహ్లాద చిత్రంతో గీతాదత్ సినీ రంగ ప్రవేశం చేశారు. బాజి చిత్రం కోసం పాటలు రికార్డింగ్ చేస్తున్న సమయంలో వర్ధమాన దర్శకుడు శ్రీ గురుదత్ తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వారిరువురు 1953 మే 26 న వివాహం చేసుకున్నారు .వారికి ముగ్గురు సంతానం .1957 లో గురుదత్ నిర్మించిన గౌరి చిత్రంలో గాయనిగా నటిగా ఈమెకు అవకాశం ఇచ్చారు. ఇది మొదటి సినిమాస్కోప్ చిత్రం. కానీ చిత్ర నిర్మాణం మధ్యలో ఆగిపోయింది .గురుదత్ వహీదా తో ప్రేమాయణం సాగించడంతో గీత తాగుడుకు బానిస అయింది . గురుదత్ తో వివాహం విచ్ఛిన్నం కావడంతో ఆమె కెరీర్ దెబ్బతిన్నది .1958 లో సంగీత దర్శకుడు ఎస్ డి బర్మన్ గాయని లత తో విభేదాల కారణంగా గీతాదత్ తో పాటలు పాడించారు .1964 లో గురుదత్ తాగుడుకు బానిసై మరణించడంతో గీతాదత్ అనారోగ్యం పాలై ఆర్ధిక పరిస్థితులు తలకిందులవడంతో గాయనిగా కెరీర్ కు తెరపడింది. తనకు 41 సం.వయసులోనే 1972 జులై 20 న మరణించారు .
పప్పు తింటే చీము పడుతుందా?
పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి. నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.
యూఎస్ఎస్‌డీ చార్జీల తొలగింపు ?
ఐటీలో 4.5 లక్షల ఉద్యోగాలు?
ఎవరు ఈ సరిత ?
వెంకటేష్, మీనా ప్రధానపాత్రలో వచ్చిన తాజా చిత్రం దృశ్యం2. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముగిసిన కేసును పోలీసులు రీ ఓపెన్ చేస్తే రాంబాబు మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవటం అన్నది సినిమా కథ. మలయాళంలో ఒరిజినల్ కథని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమాలో సరిత అనే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది నటి సుజా వరుణీ. ఈమె ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సుజా వరుణి అసలు పేరు సుజాత. ఆమె తమిళం , కన్నడ , తెలుగు, మలయాళ చిత్రాలలో నటించింది. 2002లో తమిళ్‌లో వచ్చిన ప్లస్ 2 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ఇక తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి సినిమాలో హేమ అనే చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, అలీ బాబా ఒక్కడే దొంగ సినిమాలు చేసింది. కానీ ఇవేమీ ఆమెకి అంతగా పేరును తీసుకురాలేదు. కానీ తాజాగా రిలీజైన దృశ్యం 2 ఆమెకి మంచి బ్రేక్ ఇచ్చింది. పక్కంట్లో ఉండే ఇల్లాలుగా, అండర్ కవర్ కాప్‌గా ఆకట్టుకుంది సుజా వరుణి. ఇక తమిళ్‌లో కమలహసన్ హోస్ట్ గా 2017లో వచ్చిన బిగ్ బాస్ లో ఈమె పాల్గొంది. 91 రోజులు హౌజ్ లో ఉండి ఎలిమినేట్ అయింది. ఇక సుజా వరుణి వ్యక్తిగత జీవితానికి వస్, నటుడు శివాజీ దేవ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ శివాజీ దేవ్ ఎవరో కాదు ఒకప్పటి తమిళ స్టార్ హీరో శివాజీగణేశన్ మనవడు. ఇతను సుజా వరుణి కంటే ఐదేళ్ళు చిన్నవాడు కావడం విశేషం. వీరికి అధ్వైత్ అనే కుమారుడు ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా సుజా వరుణీ మంచి యాక్టివ్ గా ఉంటుంది.
లార్డ్ మెకాలే
అప్పటి దాకా భారతదేశంలో చదువు అంటే...
1. వేద పాఠశాల (హిందువులకు అంటే కేవలం బ్రాహ్మణ మగపిల్లలకు)
2. ఇస్లామిక్ మదరసా (ముస్లిం పిల్లలకు)
3. క్రైస్తవ మిషనరీల కాన్వెంట్ (క్రైస్తవ పిల్లలకు)
పై మూడూ కూడా, కేవలం మతాలకు సంబందించిన విషయాలను మాత్రమే భోదించేవి. భారతదేశంలో విద్య కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బులు సామాన్య జనానికి అందడం లేదనీ మత మూఢ నమ్మకాలను పెంచటానికి ఉపయోగ పడుతున్నాయని చెప్పి మొట్టమొదటిసారి "ఇంగ్లీషు, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రం, మాతృభాష", అనే ఈ ఐదు పాఠ్యాంశాలతో... సాధారణ సెక్యులర్ విద్యా విధానాన్ని అమలు చేసినవాడు లార్డ్ మెకాలే. దీని తర్వాత ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ ఇంకా గొప్పది. అప్పటిదాకా ముస్లింలకు షరియా చట్టం, హిందువులకు మనుస్మృతి అని ఉండేవి. వాటి స్థానంలో అందరికీ వర్తించే విదంగా "భారత శిక్షాస్మృతి "ని అమల్లోకి తెచ్చింది కుడా ఈ లార్డ్ మెకాలేనే. లార్డ్ మెకాలే పెళ్లి చేసుకోలేదు. ఆయనకు జెనెటిక్ వారసులు లేరు. మనమంతా ఆయన మెమెటిక్ వారసులం. మనకు విద్యను, చట్టాలను ఇచ్చిన జ్ఞాన ప్రదాత ఆయన. ఆయనను మగ సరస్వతిగా మనం చెప్పుకోవచ్చు. మహా గొప్ప మనిషి మన మెకాలే. ఆ మహానీయుడికి మనమందరం, కృతజ్ఞతలు నిండిన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి.
- -శాలిని (డాక్టర్ శాలిని చెన్నైలో ప్రముఖ సైకియాట్రిస్ట్)
రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటీ?
26 నవంబర్ న రాజ్యాంగ దినోత్సవం. 2015 నుంచి ఏటేటా ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అసలు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకొంటారన్న అనుమానాలు, సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి వెళ్లాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్ట్ 15న. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమంటే అంత సులువు కాదు. అందుకే రెండేళ్లకు పైనే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు. అంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం 'జనగణమన'ను స్వాతంత్ర్య సమరయోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే ప్రసంగాలు, ఉపన్యాసాలు, వ్యాసరచన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వాఫీసుల్లో నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు.
Thursday, November 25, 2021
సముద్రంలో నీటి మీద తేలే నగరం
సూర్యుడు - సౌర శక్తి - మన వేదాలు
అంబుజ బాంధవాన్వయ నృపాగ్రణి బోనము నేడు సూర్య పా
కంబున నాయితనంబయిన కబ్జము భోజన శాల లోన బ
ల్యం బిడినారు. పంకజదళాక్షులు రెండవ ఝాము ఘంట వ్రే
యంబడి నారగింప సమయంబని చెచ్చెర విన్నవించినన్
వేల్పు లొనరించినట్టి దుర్వృత్తి యగుట
నెరిగి యింతియె గాక యొండేమి యనుచు
నారగించె దివోదాసుదారక కిరణ
తాప పక్వంబులగు పదార్థంబు లెలమిన్
అర్థము:--పరిచారికలు వచ్చి సూర్యవంశ ప్రభువుల్లో గొప్పవాడా రిపుంజయ మహా రాజా! ఈ రోజు భోజనం సూర్య కిరణాల వేడితో తయారయింది. భోజనశాలలో పద్మ దళాలవంటి కన్నులు గల భామినులు పళ్ళెం లో పెట్టినారు రెండో ఝాము ఘంట మ్రోగింది త్వరగా తినడానికి రండి అని పిలుస్తారు. అప్పుడు రిపుంజయుడు (దివోదాసు) దేవతలు అగ్నిని నిరోధించడం కంటే యింకేమి చేయగలరు అంటూ సూర్య కిరణాల వేడిమి తో తయారైన పదార్థాలు తిన్నాడట. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం యిప్పుడు ఆవిష్కరించిన ఇలాంటి విషయాలేన్నింటికో మన సాహిత్యం లో తార్కాణాలున్నాయి. పరిశోదించాలనే ఉత్సుకత ఉన్నవారికి పెన్నిధి మన తెలుగు సాహిత్యం.
"కాశీఖండ మయః పిండం నైషధం విద్వదౌషధం" కాశీఖండము" అను శ్రీనాథుడు రచించిన కావ్యము
యినుపముద్దవలె గట్టిగా వుంటుంది.(అంటే అంత త్వరగా అర్థం కాదు అని) ఇంక నైషధం విద్వాంసులకు ఔషధము వంటిది.
మనవాళ్ళు వేరే దేశం వాళ్ళు చెప్తేనే కానీ నమ్మరు కదా! మన వేదాల్లో ఎన్నో ఇలాంటివి వున్నాయి.వాటిని చదివే వాళ్ళే కరువైనారు.అది మన దురదృష్టం
పాత వాహనాలను తుక్కుకిస్తే....!
జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ పాలసీని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చడానికి ఇచ్చేసి, కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి పన్నుపరంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రభుత్వం ఆమోదం పొందిన మారుతీ సుజుకీ టొయొట్సు ఇండియాకి చెంది తొలి స్క్రాపింగ్, రీసైక్లింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా స్క్రాపేజీ పాలసీ ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. పన్నుల పరంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వచ్చు అన్నదానిపై ఆర్థిక శాఖతో చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే తుక్కు విధానం కింద ఇంకా ఏయే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి వీలుంటుందో పరిశీలించాలని జీఎస్‌టీ మండలిని కూడా కోరారు. స్క్రాపేజీ విధానంతో కేంద్రం, రాష్ట్రాలకు జీఎస్‌టీ ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి వివరించారు. రెండింటికి చెరో రూ.40,000 కోట్ల వరకూ ఆదాయం లభించగలదని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తయారీకి, ఉద్యోగాల కల్పనకు ఊతం లభించగలదని ఆయన చెప్పారు. 'కొత్త కార్లతో పోలిస్తే పాత కార్లతో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని దశలవారీగా తప్పించాలి. స్క్రాపేజీ విధానం కారణంగా అమ్మకాలు 10-12 శాతం పెరిగే అవకాశం ఉంది' అని గడ్కరీ తెలిపారు. స్క్రాపింగ్ వల్ల ముడి వస్తువులు తక్కువ ధరకే లభించగలవని, దీనితో తయారీ వ్యయాలూ తగ్గుతాయని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 3-4 వాహనాల రీసైక్లింగ్, స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు కావాలని ప్రభుత్వం భావిస్తోందని గడ్కరీ చెప్పారు. రెండేళ్లలో మరో 200-300 స్క్రాపింగ్ కేంద్రాలు రాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం వార్షిక టర్నోవరు రూ. 7.5 లక్షల కోట్లుగా ఉండగా, దీన్ని వచ్చే అయిదేళ్లలో రూ. 15 లక్షల కోట్లకు చేర్చాలన్నది తమ లక్ష్యంగా మంత్రి చెప్పారు. మరోవైపు, మిగతా దేశాల తరహాలోనే భారత్‌లో కూడా 15 ఏళ్ల వరకూ ఆగకుండా.. వాహనాల ఫిట్‌నెస్‌ను 3-4 ఏళ్లకోసారి పరిశీలించే విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని మారుతీ ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. టొయోటా సుషో సంస్థ భాగస్వామ్యంతో మారుతి సుజుకి నోయిడాలో ఏర్పాటు చేసిన స్క్రాపింగ్ కేంద్రం దాదాపు 10,993 చ.మీ. విస్తీర్ణంలో ఉంది. ఏటా 24,000 పైచిలుకు కాలపరిమితి తీరిపోయిన వాహనాలను (ఈఎల్‌వీ) తుక్కు కింద మార్చి, రీసైకిల్ చేయగలదు. దీనిపై సుమారు రూ. 44 కోట్లు పెట్టుబడి పెట్టారు.
Gocolors IPO Allotment Status
Bombay Stock Exchange (BSE) official website:
- Take a step towards the Issue Application page i.e. www.bseindia.com.
- Now fill the empty boxes with the relevant information asked like: Issue Type, Issue Name, Application Number, PAN Number and then tick on the I’m not a robot box.
- After entering the information tap on the ‘Search’ box.

- The fresh page will be showcasing your IPO Allotment Status.
- Note down the details and bookmark the page for future use.
(b) KFintech Pvt Ltd (registrar’s) official website:
- Go to KFintech Pvt Ltd official website (https://karisma.kfintech.com/).
- Go down little bit and tap on ‘Check IPO Allotment’ box.
- You’ll see multiple options to check the IPO Allotment.
- Choose any one of them and then enter the details like: Select IPO, Query By, Application Type, Application Number, Application Number and captcha code.
- Then tap on ‘Submit’ option.

- A new web page will present your company’s IPO Allotment Status.
- Check all the details and save the page.
You can also check the Gocolors IPO Allotment Status from different apps like: Groww, Upstox etc.
Gocolors IPO Allotment Status Links
Official Website | gocolors.com |
BSE’s official website | Click Here |
KFintech Pvt Ltd website | Click Here |
Gocolors IPO Allotment Status Links | Link 1 | Link 2 |
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...