Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, March 31, 2023

ఎల్‌జీ కన్వర్టబుల్ 6-ఇన్-1 ఏసీలు


దేశీయ మార్కెట్లో ఎల్‌జీ కంపెనీ కొత్తగా 2023 రేంజ్‌ డ్యూయల్‌ కూల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్‌లను ఇండియాలో లాంచ్‌ చేసింది. లేటెస్ట్‌ రేంజ్‌ ఏసీలను మొత్తం ఇండియాలో అందుబాటులో ఉంచినట్లు కంపెనీ పేర్కొంది. ఎల్‌జీ కన్వర్టబుల్ 6-ఇన్-1 ఎయిర్ కండీషనర్‌లో AI+, ప్లాస్మాస్టర్ అయోనైజర్++, హాట్‌ & కోల్డ్, LG ThinQ (WiFi AC) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏసీలను వాయిస్ కమాండ్‌ల ద్వారా ఆపరేట్ చేయవచ్చు. కంపెనీ కంప్రెసర్‌పై 10 సంవత్సరాలు, ACల PCBలపై 5 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. లేటెస్ట్‌ రేంజ్‌ LG డ్యూయల్‌కూల్ ఇన్వర్టర్ ACలు AI+ టెక్నాలజీ ద్వారా వినియోగదారుల యూజేప్‌ ప్యాటర్న్‌ ఆధారంగా చల్లదనాన్ని అందిస్తాయి. కన్వర్టబుల్ టెక్నాలజీ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. వేగంగా చల్లదనాన్ని ఇస్తుంది. ప్లాస్‌మాస్టర్ ఐయోనైజర్++ మోడళ్లు రెండు అందుబాటులో ఉన్నాయి. అవి అయాన్ డిఫ్యూజర్ & ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఆధారంగా ఎయిర్ ప్యూరిఫికేషన్‌ను అందిస్తాయి. లేటెస్ట్‌ రేంజ్‌లో దాదాపు 17 ACలు LG ThinQ (WIFI AC's) టెక్నాలజీతో వస్తాయి. ఇవి ఫైవ్ స్టార్ రేటింగ్‌తో వస్తాయి. ఈ ACలను LG ThinQ యాప్ ద్వారా కంట్రోల్‌ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఏసీని ఆపరేట్‌ చేయవచ్చు. యాప్ స్మార్ట్ యాప్, అమెజాన్ అలెక్సా & గూగుల్ అసిస్టెంట్ AI వంటి వాయిస్ అసిస్టెంట్‌లకు కంపాటబుల్‌గా ఉంటుంది, ACలను వాయిస్ కమాండ్‌ల ద్వారా కూడా కంట్రోల్‌ చేసే సదుపాయం ఉంది. ACలు ఫిల్టర్‌ను ఎప్పుడు క్లీన్ చేయాలో కూడా యాప్ తెలియజేస్తుంది. ఈ ACల్లో 99.76% వైరస్, 99.99% వరకు బ్యాక్టీరియాను నాశనం చేసే కాటినిక్ సిల్వర్ అయాన్లు (AgNPs)తో పూసిన ఫిల్టర్ మెష్ ఉంటుంది. ACలను భారతీయ ప్రాంతాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి, ఇసుక, ఉప్పు, పారిశ్రామిక పొగ & కాలుష్య కారకాల నుంచి రక్షించే ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్‌ని LG అందించింది. ఇవి 110%, 100%, 80%, 60% లేదా 40% వంటి 5 విభిన్న మోడ్స్‌లో పని చేస్తాయి. బయట ఉష్ణోగ్రత 52 డిగ్రీలు ఉన్నప్పటికీ, ఈ ఏసీలు గదిని చల్లబరుస్తాయి. రిమోట్‌లోని మ్యూట్ బటన్‌ను నొక్కితే ఈ ఏసీలు సైలెంట్‌గా పనిచేస్తాయి. LG లేటెస్ట్‌ డ్యూయల్‌కూల్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్లలో 81 మోడళ్లు ఉన్నాయి. లేటెస్ట్‌ రేంజ్‌ స్ప్లిట్ AC వివిధ కెపాసిటీలల, స్టార్ రేటింగ్‌లో అందుబాటులో ఉంది. దీని ధర యూనిట్‌కు రూ.33,490 నుంచి రూ.72,990 మధ్య ఉంటుంది. యూజర్లు విండో ఇన్వర్టర్ ఏసీలను యూనిట్‌కు రూ.43,990 నుంచి రూ.61,490 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి LG కంపెనీ ఈ ఏసీలను ఎప్పుడు, ఎలా కొనుగోలు చేయవచ్చనే వివరాలు వెల్లడించలేదు.

మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఏఐ ఫొటోలు వైరల్‌ !


బిజినెస్ మీటింగ్స్‌తో బిజీబిజీగా గడిపే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫ్యాషన్ షోల్లో ర్యాంప్‌వాక్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లూయిస్ విట్టన్ అవుట్‌ఫిట్‌తో జుకర్‌బర్గ్ అదరగొట్టిన ఇమేజ్‌లు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మెటాలో వేలాది మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టించిన తర్వాత ఆయన కెరీర్‌ను ఏమైనా మార్చాడా అని ఈ ఫొటోలు చూసిన వారు విస్తుపోతున్నారు. అయితే మరీ ఎక్సైట్ అవకండి..ఇవి నిజమైన ఫొటోలు కాదు..మిడ్‌జర్నీఇమేజ్ జనరేటర్ వాడుతూ ఏఐ ఆధారంగా రూపొందించిన ఇమేజ్‌లే. ఇక ఈ వైరల్ ఫొటోల్లో మార్క్ జుకర్‌బర్గ్ యల్లో కలర్ అవుట్‌ఫిట్‌లో ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో మెరిశారు. మరో ఫొటోలో పింక్ అవుట్‌ఫిట్ లూయిస్ విట్టన్‌లో జుకర్‌బర్గ్ కనిపించారు. జుకర్‌బర్గ్ మోడలింగ్ కెరీర్‌ను ఏమీ ఎంచుకోలేదు. ఈ ఫొటోలన్నీ ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లు మాత్రమే. ఈ ఫొటోల్లో మోడల్స్‌ను పోలిన ఎక్స్‌ప్రెషన్స్‌తో మార్క్ జుకర్‌బర్గ్ కనబరిచిన హావభావాలు ఆకట్టుకున్నాయి. లినస్ అనే ట్విట్టర్ యూజర్, ఏఐ క్రియేటర్ లేటెస్ట్‌గా జుకర్‌బర్గ్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మూడు విభిన్న యాక్సెస్ స్థాయిల ఆఫర్‌ !


ట్విట్టర్ లో గతంలో ఫ్రీగా ఉన్న వాటిని ఇప్పుడు పెయిడ్ సర్వీసులగా మారుస్తోంది. తాజాగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం పెయిడ్ API ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ట్విట్టర్ సమాచారం, ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు, వాటిని ఉపయోగించవచ్చు. కొత్త API ప్లాట్‌ఫామ్ ఫ్రీ, బేసిక్, ఎంటర్‌ప్రైజ్ అనే మూడు విభిన్న యాక్సెస్ స్థాయిల (Access Tiers)ను ఆఫర్‌ చేస్తుంది. ప్రతిదీ సొంత ఫీచర్లు, ప్రయోజనాలతో వస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు ఏ స్థాయి యాక్సెస్‌ సరిపోతుందో ఎంచుకోవచ్చు. అయితే ఎంటర్‌ప్రైజ్ టైర్ అత్యంత సమగ్రమైన, అధునాతన ఫీచర్లను అందిస్తుందని ట్విట్టర్ తెలిపింది. ట్విట్టర్ API సర్వీస్ కోసం కొత్త యాక్సెస్ స్థాయిలను ప్రారంభించినట్లు ట్విట్టర్ దేవ్ ఖాతా ద్వారా ప్రకటించింది. వీటిని డెవలపర్లు ట్విట్టర్ ఫీచర్లు, డేటాను యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. ట్విట్టర్ ఫిబ్రవరి 9న API సర్వీస్‌కు ఫ్రీ యాక్సెస్‌ను అందించడాన్ని నిలిపివేయాలని ప్లాన్ చేసింది, కానీ ఆ గడువును ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది. తర్వాత మళ్లీ పొడిగించింది. ట్విట్టర్ కొత్త API ఫ్రీ బేసిక్ లెవెల్, నెలకు 100 డాలర్లతో బేసిక్ లెవెల్, అంతకన్నా ఖరీదైన ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌ను తీసుకొచ్చింది. ఫ్రీ బేసిక్ లెవెల్‌ను ప్రధానంగా కంటెంట్ పోస్టింగ్ బాట్‌ల కోసం వినియోగించవచ్చు. ఏ లెవెల్‌కి సబ్‌స్క్రైబ్ అయినా, వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యాడ్స్ APIకి యాక్సెస్‌ను పొందవచ్చు. V2 అని పిలిచే API కొత్త ఫ్రీ యాక్సెస్ ట్విట్టర్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేయాల్సిన వినియోగదారులకు లేదా ట్విట్టర్ APIని పరీక్షించాలనుకునే వారికి ఉత్తమంగా నిలుస్తుంది. ఈ ఫ్రీ యాక్సెస్ లెవెల్ వినియోగదారులు యాప్ లెవెల్‌లో నెలకు గరిష్ఠంగా 1,500 ట్వీట్‌లను పంపడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, మీడియా అప్‌లోడ్ ఎండ్ పాయింట్లు, లాగిన్ విత్ ట్విట్టర్‌ వంటి ఫీచర్లకు యాక్సెస్‌ను ఇస్తుంది. ట్విట్టర్ లో గతంలో ఫ్రీగా ఉన్న వాటిని ఇప్పుడు పెయిడ్ సర్వీసులగా మారుస్తోంది. తాజాగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం పెయిడ్ API ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ట్విట్టర్ సమాచారం, ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు, వాటిని ఉపయోగించవచ్చు. కొత్త API ప్లాట్‌ఫామ్ ఫ్రీ, బేసిక్, ఎంటర్‌ప్రైజ్ అనే మూడు విభిన్న యాక్సెస్ స్థాయిల (Access Tiers)ను ఆఫర్‌ చేస్తుంది. ప్రతిదీ సొంత ఫీచర్లు, ప్రయోజనాలతో వస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు ఏ స్థాయి యాక్సెస్‌ సరిపోతుందో ఎంచుకోవచ్చు. అయితే ఎంటర్‌ప్రైజ్ టైర్ అత్యంత సమగ్రమైన, అధునాతన ఫీచర్లను అందిస్తుందని ట్విట్టర్ తెలిపింది. ట్విట్టర్ API సర్వీస్ కోసం కొత్త యాక్సెస్ స్థాయిలను ప్రారంభించినట్లు ట్విట్టర్ దేవ్ ఖాతా ద్వారా ప్రకటించింది. వీటిని డెవలపర్లు ట్విట్టర్ ఫీచర్లు, డేటాను యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. ట్విట్టర్ ఫిబ్రవరి 9న API సర్వీస్‌కు ఫ్రీ యాక్సెస్‌ను అందించడాన్ని నిలిపివేయాలని ప్లాన్ చేసింది, కానీ ఆ గడువును ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేసింది. తర్వాత మళ్లీ పొడిగించింది. ట్విట్టర్ కొత్త API ఫ్రీ బేసిక్ లెవెల్, నెలకు 100 డాలర్లతో బేసిక్ లెవెల్, అంతకన్నా ఖరీదైన ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌ను తీసుకొచ్చింది. ఫ్రీ బేసిక్ లెవెల్‌ను ప్రధానంగా కంటెంట్ పోస్టింగ్ బాట్‌ల కోసం వినియోగించవచ్చు. ఏ లెవెల్‌కి సబ్‌స్క్రైబ్ అయినా, వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యాడ్స్ APIకి యాక్సెస్‌ను పొందవచ్చు. V2 అని పిలిచే API కొత్త ఫ్రీ యాక్సెస్ ట్విట్టర్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేయాల్సిన వినియోగదారులకు లేదా ట్విట్టర్ APIని పరీక్షించాలనుకునే వారికి ఉత్తమంగా నిలుస్తుంది. ఈ ఫ్రీ యాక్సెస్ లెవెల్ వినియోగదారులు యాప్ లెవెల్‌లో నెలకు గరిష్ఠంగా 1,500 ట్వీట్‌లను పంపడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, మీడియా అప్‌లోడ్ ఎండ్ పాయింట్లు, లాగిన్ విత్ ట్విట్టర్‌ వంటి ఫీచర్లకు యాక్సెస్‌ను ఇస్తుంది. API కొత్త బేసిక్ (v2) యాక్సెస్ ట్విట్టర్ నుంచి నెలకు 10,000 సార్లు సమాచారాన్ని పొందడం, అలానే కంటెంట్‌ను నెలకు 50,000 సార్లు వరకు ట్విట్టర్‌కి పోస్ట్ చేయడం కోసం APIని వాడేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ యాక్సెస్ లెవెల్ ఉన్న వినియోగదారులు రెండు యాప్ IDలను పొందవచ్చు. వారు లాగిన్ విత్ ట్విట్టర్‌ ఫీచర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ యాక్సెస్ లెవెల్ కోసం నెలకు 100 డాలర్లు చెల్లించాలి. వ్యాపారాలు, పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్‌లు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సేవలను పొందడానికి ఎంటర్‌ప్రైజ్ టైర్ యాక్సెస్ లెవెల్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది మేనేజ్డ్ సర్వీసులు, ఫుల్ స్ట్రీమ్‌లను కలిగి ఉంటుంది, ఇవి ట్విట్టర్ నుంచి వచ్చే డేటా కలెక్షన్స్‌ కాగా ఎంటర్‌ప్రైజ్ టైర్‌కు సబ్‌స్క్రయిబ్ చేయడం ద్వారా, ఇతర యాక్సెస్ లెవెల్స్‌లో అందుబాటులో లేని ఫీచర్‌లను వ్యాపారాలు యాక్సెస్ చేయవచ్చు. ట్విట్టర్ తన పాత యాక్సెస్ టైర్‌లు అయిన స్టాండర్డ్, ఎసెన్షియల్, ఎలివేటెడ్, ప్రీమియంలను వచ్చే 30 రోజుల్లో దశలవారీగా తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించింది.

మరో ఫీచర్ ను అప్ డేట్ చేయనున్న వాట్సాప్ ?


మరో ఫీచర్ ను అప్ డేట్ చేసేందుకు వాట్సాప్ సిద్ధమైంది. డిస్ అప్పీయరింగ్ మెసేజ్ ల ఫీచర్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోన్న వాట్సాప్ మరోసారి ఈ ఫీచర్ లో ఛేంజెస్ చేయనుంది. ఈ ఫీచర్ లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లను యూజర్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మార్పుల ద్వారా యూజర్స్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం.. ఇతరులు చూడకుండా త్వరగా డిలీట్ అవుతాయని వాట్సాప్ భావిస్తోంది. డిస్‌ అప్పియరింగ్‌ ఫీచర్‌లో ప్రస్తుతం 24 గంటలు, 7 రోజులు, 90 రోజుల టైమ్‌ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అంటే యూజర్‌ డిస్‌అప్పియరింగ్ ఆప్షన్‌ను ఆన్‌ చేసి ఈ 3 టైమ్‌ లిమిట్స్ ఏదైనా ఒకదాన్ని ఎంచుకునే వీలు ఉంది. 7 రోజుల టైమ్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే మెసేజ్‌ చూసిన 7 రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్‌ అవుతాయి. ప్రస్తుతం ఉన్న మూడు టైమ్‌ ఆప్షన్లకు మరో 15 ఆప్షన్లను యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా రాబోయే ఆప్షన్లలో ఒక గంట నుంచి ఒక ఏడాది వరకు ఉంటాయని సమాచారం. డిస్‌ అప్పియరింగ్‌ మెసేజెస్‌ ఆన్‌ చేసిన తర్వాత అందులో మోర్‌ ఆప్షన్‌లో కొత్తగా తీసుకురానున్న టైమ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

మై బైక్ నుంచి బైక్ లాంటి సైకిల్ !


దేశీయ మార్కెట్లోకి  మై బైక్ అనే ఒక కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లను లాంచ్ చేసింది. మై బైక్ ఎలక్ట్రిక్ మై బైక్ ఎలక్ట్రిక్ కార్గో పేర్లతో రెండు సైకిళ్ళను ఆవిష్కరించింది.. మై బైక్ ఎలక్ట్రిక్ సైకిల్ టూరిస్టుల కోసం డిజైన్ చేశారు. ఎలక్ట్రిక్ కార్గో సైకిల్ వర్కర్ల  డెలివరీ కష్టాలను తీర్చేందుకే తీసుకువచ్చినట్లుగా తెలియజేశారు. ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ బ్యాటరీ కి అన్ లాకింగ్ సదుపాయాలు కూడా కలవు.. పరిస్థితులను బట్టి 80 -100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది..0.54 KWH సామర్థ్యం గల స్వాపబుల్ బ్యాటరీ ఉంటుందట. ఆరోగ్యంతో పాటు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన పెడల్లు కూడా తయారు చేశారు అలాగే దూరం వెళ్లడానికి స్కూటర్ లాగా కూడా వినియోగించుకోవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉపయోగపడుతుందని కంపెనీ తెలియజేస్తోంది.

సూపర్‌ ఫాస్ట్ ఫ్యాన్ తో 65 శాతం కరెంటు ఆదా !


కెంట్ RO సిస్టమ్స్ లిమిటెడ్ KUHL బ్రాండ్ పేరుతో ప్రైమా A3 స్టైలిష్ BLDC ఫ్యాన్‌ని తెచ్చింది. ఈ ఫ్యాన్‌ ఎక్కువ గాలి ఇస్తుందనీ, 28W కరెంటు మాత్రమే వాడుకుంటుందని చెబుతున్నారు. పవర్ సేవింగ్‌కి సంబంధించి దీనికి 5 స్టార్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్‌కి ఏరోడైనమిక్ బ్లేడ్స్ ఉండటం వల్ల గాలి బాగా రావడమే కాక.. సౌండ్ పెద్దగా రాదని అంటున్నారు. ఈ సీలింగ్ ఫ్యాన్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, డైనింగ్ రూమ్‌కి బాగా సెట్ అవుతుందని తెలిపారు. ఇది 24 సెంటీమీటర్ల పొడవు, 21 సెంటీమీటర్ల వెడల్పు కలిగివుంది. బ్లేడ్స్ 1200 మిల్లీమీటర్లు పొడవు ఉన్నాయి. ఈ ఫ్యాన్ బ్లేడ్లను అల్యూమినియంతో తయారుచేశారు. ఫ్యాన్ రెక్కలు చాలా పెద్దవి కావడం వల్ల గాలి విశాలంగా ఎక్కువ దూరం వస్తుందని చెబుతున్నారు. రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసుకునే వీలు ఉంది. ఈ ఫ్యాన్ బరువు 4.12 కేజీలు. 212 CMMతో 1200 MM గాలి డెలివరీ చేస్తుందనీ.. నిమిషానికి 330 సార్లు తిరుగుతుందని తెలిపారు. 65 శాతం కరెంటును ఆదా చేస్తుందని ప్రత్యేకంగా తెలిపారు. చాలా ఫ్యాన్లు 70 నుంచి 80 వాట్స్ వాడుకుంటూ ఉంటే.. ఈ ఫ్యాన్ మాత్రం 28 వాట్లే వాడుకుంటుందని చెప్పారు. ఈ ఫ్యాన్‌మోటర్ BLDC టెక్నాలజీ మోటర్ అని తెలిపారు. ఈ ఫ్యాన్‌కి ISI అధికారిక గుర్తింపు కూడా ఉందని తెలిపారు. ఈ ఫ్యాన్ అసలు ధర రూ.6,350... అమెజాన్‌లో దీన్ని 35 శాతం డిస్కౌంట్‌తో 4,149కి అమ్ముతున్నారు.


Thursday, March 30, 2023

వచ్చే ఏడాది హొండా నుంచి రెండు ఎలక్ట్రిక్ వేరియంట్స్ !


2024లో హొండా నుంచి రెండు ఎలక్ట్రిక్ వేరియంట్ ద్విచక్ర వాహనాలను విడుదల కానున్నాయి. వాటిల్లో ఎంతో కాలంగా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉండనుంది. ఈ మేరకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ మ్యాప్ ను ప్రకటించింది. 2024 పూర్తయ్యే నాటికి రెండు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు స్వాపబుల్ బ్యాటరీ సదుపాయాన్ని కూడా తీసుకురానున్నట్లు పేర్కొంది. అలాగే 2030 కల్లా 10లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. హోండా నుంచి ముందుగా రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు మిడ్ రేంజ్‍లోనే ఉంటాయని అంచనాలు ఉన్నాయి. తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా యాక్టివా ఎలక్ట్రిక్‍ను హోండా తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోల్ స్కూటర్ విభాగంలో అమ్మకాల పరంగా హోండా యాక్టివా టాప్‍లో ఉంది. అందుకే యాక్టివా పేరుతోనే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది అందుబాటు ధరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫిక్స్డ్ బ్యాటరీతోనే రావొచ్చు. యాక్టివా తర్వాత స్వాపబుల్ బ్యాటరీ సదుపాయంతో మరో ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను హోండా తీసుకొస్తుందని సమాచారం. ఇది హోండా ఈఎం1ఈ అయ్యే ఛాన్స్ ఉంది. స్వాపబుల్ సదుపాయం ఉంటే.. చార్జ్ అయిపోయిన బ్యాటరీని బయటికి తీసి.. దాన్ని చార్జ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే సపోర్ట్ చేసే వేరే బ్యాటరీని కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ప్లాట్‍ఫామ్‍పై ఎలక్ట్రిక్ టూ-వీలర్లను హోండా తయారు చేయనుంది. దీనికి 'ప్లాట్‍ఫామ్‍ ఈ' అనే పేరు పెట్టింది.

త్వరలో ట్రిపుల్ కెమెరాతో మోటో జీ స్టైలిష్ ఫోన్ 2023


మోటోరోలా నుంచి త్వరలో మోటో జీ స్టైలిష్ ఫోన్ 2023 లాంచ్ కానుంది. గతేడాదిలో లాంచ్ చేసిన  మోటో జీ స్టైలిష్ 2022కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. రాబోయే ఫోన్ ఇటీవల 'Geneva' అనే కోడ్‌నేమ్‌తో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్‌లలో రానుందని లీక్ డేటా సూచిస్తోంది. అంతేకాదు.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని టిప్‌స్టర్ తెలిపింది. ఈ కొత్త ఫోన్ గత వెర్షన్ల కన్నా అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. లీకైన రెండర్‌లు స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయని సూచిస్తోంది. ఈ ఫోన్‌లోని వివరాలు ఇంకా అధికారికంగా వెరిఫై చేయలేదు. లీకైన రెండర్‌లను పరిశీలిస్తే.. రాబోయే మోటో G ఫోన్‌ బ్లాక్, బ్రాంజ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చిన్‌తో పంచ్-హోల్ స్క్రీన్‌తో వస్తుందని రెండర్‌లు సూచిస్తున్నాయి. అయితే, వాల్యూమ్ బటన్‌లు, పవర్ బటన్‌లు కుడి వైపున ఉన్నట్టుగా కనిపిస్తాయి. రాబోయే Moto G Stylus 5G 2023లో స్టైలస్ స్లాట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌తో వస్తుందని లీక్ డేటా సూచిస్తోంది.

ఏప్రిల్ 11న సూపర్ సెడాన్ విడుదల !


ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ  మెర్సిడెస్-బెంజ్ పర్ఫార్మెన్స్ అనుబంధ సంస్థ నుంచి అత్యంత శక్తివంతమైన హైబ్రిడ్ మోడల్ GT 63 SE పర్ఫార్మెన్స్ కారు ఏప్రిల్ 11న దేశీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది.ఈ సూపర్ సెడాన్, బ్రాండ్ నుంచి ఫస్ట్ హైబ్రిడ్ మోడల్ అని చెప్పవచ్చు. 637bhp శక్తిని, ఎలక్ట్రిక్ మోటార్ నుంచి అదనంగా 202 bhpని ఉత్పత్తి చేసే 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ని కలిగి ఉంటుంది. 841bhp, 1,400 Nm కన్నా ఎక్కువ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ GT 63 SE మోడల్ పర్ఫార్మెన్స్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 100 kmph వరకు 316 kmph టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లగలదు. వాహనం ఎలక్ట్రిక్ మోటారుపై కంపెనీ ప్రకారం.. ఈ హైబ్రిడ్ మోడల్ కారు కేవలం 89 కిలోల బరువున్న 6.1kWh, 400V బ్యాటరీతో నడుస్తుంది. మెర్సిడెస్ ప్రకారం.. PHEV విద్యుత్-మాత్రమే 12కిమీ పరిధిని కలిగి ఉంది. అదనంగా, ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే గరిష్టంగా 130 kmph వేగాన్ని అందుకోగలదు. కొన్ని డ్రైవింగ్ పరిస్థితులలో కారు 4 లెవల్స్‌లో రీజనరేటివ్ బ్రేకింగ్‌తో పాటు వన్-పెడల్-డ్రైవింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. GT 63 SE పెర్ఫార్మెన్స్ ఎక్స్‌టీరియర్ డిజైన్ రెండు-డోర్ల GT, కొత్త బ్యాడ్జింగ్, స్పెషల్ కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, కొత్త ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌ల ద్వారా ఫ్రంట్ బంపర్‌తో వస్తుంది. ఈ కారు వెనుక బంపర్‌పై ఫ్లాప్‌ను ప్రదర్శిస్తుంది. ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ PHEV GT 4-డోర్ కూపే మోడల్ ఒకే మాదిరిగా ఉంటాయి.

సముద్రంలో పడినా చెక్కు చెదరని ఆపిల్ వాచ్ !


బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలో రోచా ఈత కొట్టేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఆపిల్ వాచ్‌ని నీళ్లలో పొగొట్టుకున్నాడు. ఈత కొడుతుండగా చేతికి ధరించిన ఆపిల్ వాచ్ నీళ్లలో పడిపోయింది. రోచా వెంటనే తన ఆపిల్ వాచ్‌ని కనుగొనేందుకు ప్రయత్నించాడు, కానీ సాధ్యపడలేదు. అతను తన గడియారాన్ని గుర్తించడానికి ఫైండ్ మై యాప్‌ని ఉపయోగించాడు. ఆసక్తికరంగా నీటి అడుగున ఉన్న తన ఆపిల్ వాచ్ గుర్తించాడు. ఎందుకంటే.. ఈ ఆపిల్ వాచ్‌లో GPS ఉంది. నీటి-నిరోధకత కలిగిన వాచ్ అని సంగతి అతడికి తెలియదు. వాచ్ పనిచేయదని భావించాడు. కానీ, రోచాకు ఫైండ్ మై యాప్ నుంచి వాచ్ ఆన్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది. రోచా లాస్ట్ మోడ్‌ను ఆన్ చేసి.. ఆపై సంబంధించిన కొంత డేటాను రిజిస్టర్ చేసింది. వెంటనే అతను ఆపిల్ వాచ్‌ను కనుగొన్నట్లు తెలిపాడు. ఆపిల్ వాచ్‌ను కనుగొన్న వ్యక్తి కుమార్తె మెసేజ్ చేసింది. బిజియోస్‌లో ఉన్నానని, తమకు వాచ్ దొరికిందని, ఆమె తండ్రి వాచ్ తిరిగి ఇవ్వాలని కోరిందని రోచా చెప్పారు. ఈ వాచ్ 50 ఏళ్ల డైవర్ కనుగొన్నాడు, అతను 16 ఏళ్ల అమ్మాయి తండ్రి.. అతను కోరల్ పార్క్‌ను చూసుకుంటాడు. అంతేకాదు.. పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి యజమానులకు తిరిగి ఇస్తుంటాడు. ఫిహో అనే డైవర్ ఆపిల్ వాచ్‌ను కనుగొన్నప్పుడు అది బాగానే పనిచేస్తుందని చెప్పాడు. అయితే, అతని కుమార్తెకు కూడా ఆపిల్ వాచ్ ఉంది. దాంతో అతడు ఆ డివైజ్ ఛార్జర్‌ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆపిల్ వాచ్ ఆన్ అయింది. వెంటనే ఫైండ్ మై యాప్ మెసేజ్ చూపించింది. నెల రోజుల పాటు సముద్రంలో ఉన్నా ఆపిల్ వాచ్ వర్కింగ్ కండిషన్‌లో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చివరికి ఆపిల్ వాచ్‌ను రోచాకు తిరిగి ఇచ్చాడు.

Wednesday, March 29, 2023

దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ EV స్టేషన్లు !


దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్, స్కూటర్స్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ EV స్టేషన్లను ఏర్పాటు చేయడానికి మూడు PSU చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ. 800 కోట్లు మంజూరు చేసింది. FAME ఇండియా ఫేజ్ 2 స్కీమ్ ఈ నిధులను మంజూరు చేసినట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లకు మంత్రిత్వ శాఖ ₹560 కోట్లు లేదా మొత్తంలో 70 శాతం ఫండ్స్ ను ఇప్పటికే విడుదల చేసింది. తొలి విడతగా దేశంలోని ఆయా చమురు మార్కెటింగ్ కంపెనీల రిటైల్ అవుట్‌ లెట్‌లలో EV పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల అప్‌స్ట్రీమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ పరికరాలను అమరుస్తారు. వీటి ఇన్‌స్టాలేషన్ మార్చి 2024 నాటికి పూర్తవుతుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,586 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. కొత్త 7,432 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల జోడింపు EV ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌కు గణనీయమైన పుష్ అవుతుంది. ఎలక్ట్రిక్ 2-వీలర్స్, 4-వీలర్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, మినీ వెహికల్స్ ఛార్జింగ్ కు అవాంతరాలు తొలగిపోతాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్ ఎకోసిస్టమ్‌కు ఈ చర్య ఊతం ఇస్తుంది. దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారేలా ప్రోత్సహిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేలపై 19 EV ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ఇప్పటికే ప్రకటించింది. ఒక్కో కారిడార్‌లలో దాదాపు ప్రతి 100 కి.మీకి ఒక EV ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. కేరళలో 19 ఇంధన కేంద్రాలతో మూడు కారిడార్లు, కర్ణాటకలో 33 ఇంధన కేంద్రాలతో 6 కారిడార్లు, తమిళనాడులో 58 ఇంధన కేంద్రాలతో 10 కారిడార్‌లను ప్రారంభించినట్లు తెలిపింది. BPCL ఇంధన స్టేషన్ల వద్ద 125 కి.మీల వరకు డ్రైవింగ్ పరిధిలో ఒక్కో EVని ఛార్జ్ చేసేందుకు కేవలం 30 నిమిషాలు పడుతుంది. రెండు ఛార్జింగ్ స్టేషన్ల మధ్య 100 కి.మీల దూరం ఉంటుందని చెప్పారు. ఫాస్ట్ ఛార్జర్లు వినియోగానికి చాలా ఈజీగా ఉంటాయని తెలిపారు. అవసరమైతే సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

చాట్‌జీపీటీకి ఇంటర్నెట్ యాక్సెస్ !


ఓపెన్‌ ఏఐ పరిచయం చేసిన చాట్‌జీపీటీ  అత్యంత అధునాతన ఫీచర్లతో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతోంది. అయితే ఈ ఏఐ చాట్‌బాట్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. దీని లిమిటెడ్ డేటాసెట్ అనేది మారాలి. ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తూ అప్-టు-డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తే దీనికిదే పోటీ అవుతుంది. అందుకే ఈ దిశగా ఓపెన్‌ ఏఐ సంస్థ అడుగులు వేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓపెన్‌ ఏఐ అధికారికంగా చాట్‌జీపీటీ కోసం కొన్ని ప్లగిన్‌లను లాంచ్ చేసింది. ఒక ప్లగిన్‌తో ఇంటర్నెట్‌ యాక్సెస్‌ను కూడా అందించింది. ఈ ప్లగిన్స్‌తో చాట్‌జీపీటీ ద్వారా క్షణాల్లోనే ఎన్నో విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. అనేక పనులను ఈజీగా పూర్తి చేయవచ్చు. చాట్‌జీపీటీ ఇప్పుడు ఎంచుకున్న థర్డ్-పార్టీ డేటాబేస్‌లు, సమాచార మూలాలను కూడా యాక్సెస్ చేయగలదు. ఇది ఎంచుకున్న వెబ్‌సైట్‌లతో ఇంటరాక్ట్ అవుతూ సమాచారాన్ని సేకరించగలదు. ప్రస్తుతానికి, వివిధ కంపెనీలు అభివృద్ధి చేసిన 11 ప్లగిన్లను ChatGPT కోసం OpenAI విడుదల చేసింది. వీటిలో Slack, Zapier, Expedia, FiscalNote, Instacart, Milo, OpenTable వంటి ప్రముఖ కంపెనీల ప్లగిన్లు ఉన్నాయి. ఈ ప్లగిన్‌ల ద్వారా వినియోగదారులు ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించి అపారమైన రియల్-టైమ్ సమాచారాన్ని చిటికెలో పొందవచ్చు. అప్-టు-డేట్ ఇన్ఫర్మేషన్‌తో ట్రిప్‌లను ప్లాన్ చేసుకోవచ్చు. బెస్ట్ రెస్టారెంట్స్‌ గురించి రికమండేషన్స్ అందుకోవచ్చు. ఓపెన్ టేబుల్ ప్లగిన్‌తో రెస్టారెంట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాకార్ట్ ప్లగిన్‌తో ప్రొడక్ట్స్ షాపింగ్ చేయవచ్చు. స్థానిక కిరాణా దుకాణాల నుంచి కావలసిన వాటిని చాట్‌బాట్ నుంచే ఆర్డర్ చేయవచ్చు. ఇష్టపడే రెసిపీలను వెతికి, చాట్‌బాట్ నుంచే నేరుగా వాటిని ఆర్డర్ చేయవచ్చు. పైథాన్‌ని ఉపయోగించే ఇంటర్‌ప్రెటింగ్ కోడ్స్‌తో అప్‌లోడ్‌లు, డౌన్‌లోడ్స్‌ చేసుకోవచ్చు. ఫైల్ ఫార్మాట్‌లను మార్చవచ్చు. ఇంకా ఎన్నో పనులను చేసుకోవచ్చు. స్లాక్, జాపియర్‌తో గూగుల్ షీట్స్‌, జీమెయిల్, Trello వంటి అప్లికేషన్‌లతో కనెక్ట్ కావచ్చు. ఓపెన్‌ ఏఐ ChatGPT కోసం వెబ్ బ్రౌజర్, కోడ్ ఇంటర్‌ప్రెటర్ అనే రెండు ప్లగిన్‌లను కూడా అభివృద్ధి చేసింది. వెబ్ బ్రౌజర్ ప్లగిన్ Bing AI APIని ఉపయోగించి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడానికి, సమాచారాన్ని పొందడానికి చాట్‌జీపీటీకి వీలు కల్పిస్తుంది. 2021 వరకు మాత్రమే ప్రస్తుతానికి చాట్‌జీపీటీ ట్రైనింగ్ డేటా పరిమితం అయింది. అయితే వెబ్ బ్రౌజర్ ప్లగిన్‌ను చాట్‌జీపీటీ వినియోగిస్తూ ఇంటర్నెట్ సమాచారాన్ని సేకరించి లేటెస్ట్ ఈవెంట్స్‌కి సంబంధించిన డేటాను కూడా అందించగలదు. అంతేకాకుండా, వివిధ రకాల సోర్సుల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా యూజర్‌లకు తెలియజేస్తుంది. పైన పేర్కొన్న ప్లగిన్‌లన్ని ప్రస్తుతం పరిమిత ఆల్ఫా టెస్టింగ్ దశలో మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ మందికే ఇవి రిలీజ్ అయ్యాయి. సైన్-అప్ చేయగల వెయిట్‌లిస్ట్ ద్వారా ChatGPT ప్లగిన్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. ముందు తక్కువ సంఖ్యలో డెవలపర్లు, ChatGPT ప్లస్ వినియోగదారులకు మాత్రమే ఇవి రిలీజ్ అవుతాయి. ఈ ప్లగిన్‌లతో చాట్‌జీపీటీ మరింత శక్తివంతంగా మారి, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బాట్స్‌ అందుకోలేని రేంజ్‌కి వెళ్తుందని చెప్పవచ్చు.

బోనస్ చెల్లింపుల్లో కోత !


రెండో దశ మాస్ లేఆఫ్స్‌లో భాగంగా మెటా ఇటీవల 10,000 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా పలువురు ఉద్యోగుల బోనస్ చెల్లింపుల్లో కోత విధించేందుకు కంపెనీ సన్నహాలు చేపట్టింది. 2022 నవంబర్‌లో ఫేస్‌బుక్ మాతృ సంస్ధ మెటా ఏకంగా 11,000 మందిని తొలగించింది. ఆర్ధిక మందగమనం, మాంద్య భయాలతో ఈ ఏడాది పలువురు ఉద్యోగులకు తక్కువగా బోనస్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. రెండేండ్లకు ఒకసారి ఉద్యోగుల సామర్ధ్యాన్ని సమీక్షించేందుకు సన్నద్ధమవుతోంది. గత ఏడాది ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా తమ సామర్ధ్య సమీక్ష ప్రక్రియలో మార్పులు చేపట్టామని, ఈ మార్పులకు ఉద్యోగుల పునర్వ్యవస్ధీకరణతో సంబంధం లేదని మెటా ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నెల ఆరంభంలో మెటా ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత, కంపెనీలో నియామకాలు,అంతర్గత బదిలీలు తిరిగి ప్రారంభమవుతాయని లేఆఫ్స్ సమయంలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇక మెటాతో పాటు అమెజాన్, గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు మారిన స్ధూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో లేఆఫ్స్‌కు తెగబడ్డాయి.

యాపిల్ నుంచి పే లేటర్ లాంఛ్‌


యాపిల్ పే లేటర్‌ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం పొందే వెసులుబాటు కలుగుతోంది. ఈ సర్వీస్ ద్వారా ప్రొడక్ట్స్ కొనుగోలుపై యూజర్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఆరు వారాల్లో నాలుగు వాయిదాల రూపంలో ఈ రుణాలను యూజర్లు తిరిగి చెల్లించవచ్చు. యాపిల్ పే పేమెంట్ పద్ధతిని ఆమోదించిన వ్యాపారుల నుంచి యూజర్లు ఈ లోన్స్‌ను ఆన్‌లైన్‌, యాప్ కొనుగోళ్ల కోసం తమ ఐఫోన్‌, ఐప్యాడ్‌లపై పొందవచ్చు. ఈ చెల్లింపులను యూజర్ యాపిల్ వాలెట్ పర్యవేక్షిస్తుండటంతో యూజర్లు తాము ఎంత ఖర్చు చేస్తున్నామనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వీలుంది. యాపిల్ పే ల్యాటర్ ప్రీ-రిలీజ్ వెర్షన్‌ను యాక్సెస్ చేసుకునేందుకు ఎంపిక చేసిన యూజర్లను యాపిల్ ఆహ్వానిస్తుందని కంపెనీ ప్రకటించింది. మరో రెండు నెలల్లో అర్హులైన యూజర్లందరికీ ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోంది.

టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు !


కాల్స్‌, మెసేజ్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న స్కామర్లను నియంత్రించే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తోంది. తాజాగా ఏదైనా నెట్‌వర్క్ అంతరాయాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లకు ట్రాయ్ ఆదేశించింది. నెట్‌వర్క్‌ సమస్యకు గల మూల కారణాలు, పరిష్కరించేందుకు తీసుకున్న చర్యల గురించి పూర్తి సమాచారం అందించాలని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు నాలుగు గంటల కంటే ఎక్కువ కాలం పాటు నిరంతరాయంగా సర్వీస్‌లో అంతరాయాలు ఏర్పడితే తప్పనిసరిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి నివేదించాలి. ఘటన చోటుచేసుకున్న 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలి. దీనికి సంబంధించి టెలికాం అథారిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో  'టెలికాం నెట్‌వర్క్‌ల విషయంలో ప్రధాన నెట్‌వర్క్ అంతరాయాలు సాంకేతిక కారణాల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవిస్తున్నాయి. అలాంటి సమస్యలను ఆపరేటర్లు మా దృష్టికి తీసుకురావడం లేదు. ఇప్పుడు ఇచ్చిన తాజా ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. దేశంలోని ఈ ప్రధాన నెట్‌వర్క్ అంతరాయాలు, ముఖ్యంగా బార్డర్‌, కొండ ప్రాంతాలలో చోటు చేసుకుంటున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సర్వీస్‌ అవైలబిలిటీ, క్వాలిటీ సమస్యగా మారుతోంది.' అని ట్రాయ్‌ తెలిపింది. ప్రధాన నెట్‌వర్క్ అంతరాయాలకు మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి, స్థానిక అధికారుల నుంచి సంబంధిత సహాయాన్ని పొందాలని ట్రాయ్‌ సూచించింది. జిల్లా స్థాయిలో అలాంటి ఏదైనా అంతరాయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. ట్రాయ్ ఛైర్మన్ పి డి వాఘేలా, సెక్రటరీ వి రఘునందన్ అన్ని టెలికాం ఆపరేటర్‌లను కలిసి ఇబ్బందికరమైన కాల్స్‌, అన్‌వాంటెడ్‌ టెక్స్ట్‌ మెసేజ్‌లను ఆపడానికి గల మార్గాల గురించి చర్చించారు. టెలికాం కంపెనీలు డిటెక్ట్‌ సిస్టమ్‌ అమలును సమీక్షించడానికి మే 1ని గడువుగా ట్రాయ్‌ పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి అన్‌సొలిసిటెడ్‌ కమర్షియల్‌ కమ్యునికేషన్స్‌, అన్‌వాంటెడ్‌ టెక్స్ట్ మెసేజ్‌లు, కాల్స్‌ బెడదను ఎదుర్కోవడం లక్ష్యమని సూచించింది. ట్రాయ్ ప్రిన్సిపల్ ఎంటిటీలు, టెలి-మార్కెటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని పిలుపునిచ్చింది. అన్‌వాంటెడ్‌ టెక్స్ట్‌ మెసేజ్‌లు, కాల్స్‌ను గుర్తించడం కోసం శాండ్‌బాక్స్ డ్రిల్ అమలును సమీక్షించాలని రెగ్యులేటరీ టెల్కోలను కోరింది. అదే విధంగా అన్‌యూజ్డ్‌ హెడర్‌ను బ్లాక్ చేయాలని ట్రాయ్ పీఈలను ఆదేశించింది. ట్రాన్సాక్షన్‌లు లేదా సేవా సంబంధిత నోటిఫికేషన్‌ల కోసం ముఖ్యమైన వాయిస్ కాల్‌లను పంపడం కోసం కొత్త నంబర్ సిరీస్‌ని ఉపయోగించాలని రెగ్యులేటర్ టెల్కోలను ఆదేశించింది. అనుమానిత స్కామర్‌ల జాబితాను టెల్కోలు ఉమ్మడి ప్లాట్‌ఫారమ్‌లో పంచుకోవాలని, మెసేజ్‌ ట్రాన్సాక్షన్‌లను ముందస్తుగా నిరోధించాలని సూచించింది. ఇబ్బందికరమైన కాల్స్‌, అన్‌వాంటెడ్‌ మెసేజ్‌లను ప్రభావవంతంగా పర్యవేక్షించడం కోసం అన్ని వాయిస్-బేస్డ్‌ టెలిమార్కెటర్‌లను ఉమ్మడి DLT ప్లాట్‌ఫారమ్ కిందకు తీసుకురావాలని పేర్కొంది. ఆపరేటర్లు AI/ML బేస్డ్‌ యాంటీ-ఫిషింగ్ సిస్టమ్‌లను చురుకుగా ఉపయోగించాలని, ప్రొమోషనల్‌ వాయిస్ కాల్స్‌ను ఎదుర్కోవడానికి DLT ప్లాట్‌ఫారమ్‌లో సాంకేతిక పరిష్కారాలను అమలు చేయాలని కోరింది.

చంద్రుని ఉపరితలంపై నీరు !


చంద్రునిపై వెళ్లడానికి దాదాపు అన్ని దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో చంద్రునిపై సుదీర్ఘకాలం మానవులు నివసించడానికి కావలసిన వనరులున్నాయన్న అంశాలు కొత్తగా వెలుగు లోకి వచ్చి ఆసక్తిని కలిగిస్తున్నాయి. చంద్రుని ఉపరితలంపై విస్తరించి ఉన్న గాజు పూసల్లో కొన్ని లక్షల టన్నుల నీరు నిక్షిప్తమై ఉందని, ఆ పూసల నుంచి నీటిని సేకరించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చంద్రునిపై చిన్నపాటి ఉల్కలు దాడి చేయగా, వాటి వేడికి చంద్రుని ఉపరితలం కరిగి వెలువడిన పదార్ధం , తరువాత చల్లబడడంతో గాజు పూసలుగా ఏర్పడిందని అంటున్నారు. చైనా చాంగే 5 మిషన్ తీసుకొచ్చిన చంద్రుని మట్టి నమూనాలను శాస్త్రవేత్తలు పరిశోధించగా ఈ విషయం బయటపడింది. అయితే నీరు తయారు కావాలంటే హైడ్రొజన్ అవసరం. ఆ హైడ్రొజన్ కణాలు సౌర వాయువుల నుంచి భారీ ఎత్తున వెలువడ్డాయి. మొత్తం సౌర వ్యవస్థకే ఈ హైడ్రొజన్ నలుసులు వ్యాపించాయి. నీటికి అవసరమైన ఆక్సిజన్ చంద్రునిలోని శిలలు, ఖనిజాల్లో ఇరుక్కుని ఉన్నప్పటికీ చంద్రుని ఉపరితలంపై సగానికి సగం విస్తరించి ఉంది. ఈ విధమైన నీటి పొర చంద్రుని లోతైన మట్టి పొరల్లో ఉందని పేర్కొన్నారు. హైడ్రొజన్ ఐసొటోప్ సమ్మేళనం, భూమి లోపలి భాగం (కోర్) నుంచి పైన అంచు వరకు వ్యాపించి ఉందని గాజు పూసలలో ఉన్న దీన్ని చంద్రుని మట్టి నుంచి వడపోయడమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రునిపై కావలసినంత నీరు నిల్వ ఉందని అర్థం చేసుకోడానికే ఈ ప్రక్రియగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో చాంగె5 మిషన్ సేకరించిన చంద్రుని ప్రభావిత గాజు పూసలను అధ్యయనం చేశామని చెప్పారు. దీనివల్ల గత అధ్యయనానికి భిన్నంగా సౌర గాలుల నుంచి భారీ మొత్తంలో చంద్రుని ఉపరితలం పైకి నీరు వచ్చి చేరిందని ఇప్పుడు అర్థమైందని ప్రకటించారు. ఈ పూసల సైజు ఒక వెంట్రుక నుంచి అనేక వెంట్రుకల పరిమాణంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవి ఒకటి రెండు కావు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయని, అందువల్ల నీటవనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పవచ్చని అధ్యయనంలో పాలుపంచుకున్న నాన్‌జింగ్ యూనివర్శిటీకి చెందిన హెజియు వివరించారు. అయితే చంద్రుని ఉపరితలంపై తవ్వకం అన్నది చాలా కష్టం. సౌరగాలుల్లోని హైడ్రొజన్ నిత్యం చంద్రునిపై దాడి చేస్తుండటంతో ఈ పూసలు నీటితో నిండి ఉంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ పూసలు అంతలెక్కా ఉన్నాయి. వీటిని 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిలో కరిగించి నీటిని సేకరించుకోవచ్చు. బహుశా భవిష్యత్తులో రోబోలే వ్యోమగాములుగా చంద్రుని పైకి వచ్చి ఈ పనులన్నీ చేస్తాయేమో. ఇది సాధ్యమౌతుందా? ఈనీరు తాగడానికి పనికి వస్తుందా ? అని నిర్ణయించడానికి మరిన్ని పరిశోధనలు చేపట్టవలసిన అవసరం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు అర్ధశతాబ్దం క్రితం అపోలో చంద్రయాత్రలో సేకరించి తెచ్చిన చంద్ర శిలలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చంద్రునిపై అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్లనే గాజు పూసలు నీటితో ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. చంద్రుని ఉపరితలంపై ఆవరించిన పూసలను వేడి చేసి నీటిని తీసుకోవడం, ఈమేరకు ఇతర పదార్థాలను ప్రాసెస్ చేయడం రేపటి వ్యోమగాములకు నీరు , ఆక్సిజన్ సరఫరా చేయడానికి దారి చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Tuesday, March 28, 2023

బోట్ నుంచి 'వేవ్ ఆర్మర్' స్మార్ట్‌వాచ్


బోట్ సరసమైన ధరలకు టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌కు భారత్‌లో డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్‌ను మరింత విస్తరించే ప్లాన్‌లో భాగంగా సంస్థ వరుసగా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తోంది. వేవ్ లైనప్‍లో తాజాగా రగెడ్ స్మార్ట్‌వాచ్ 'బోట్ వేవ్ ఆర్మర్'ను రిలీజ్ చేసింది.  వేవ్ ఆర్మర్ అనేది boAt నుంచి వచ్చిన మొట్టమొదటి రగెడ్ స్మార్ట్‌వాచ్. ఇది డిజైన్ పరంగా యాపిల్ వాచ్ ఆల్ట్రాను పోలి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ బాడీని జింక్ అల్లాయ్‌బిల్ట్ చేశారు. IP68 డస్ట్, స్వెట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. దీని 1.83 అంగుళాల HD డిస్‌ప్లే, 550 నిట్స్ మ్యాగ్జిమం బ్రైట్‌నెస్, 240 x 284 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాచ్ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి ఉండే టూ-టోన్ పట్టీ సౌకర్యవంతంగా ఉంటూ మంచి పట్టును అందిస్తుంది. దీంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ స్మార్ట్‌వాచ్‌ను ధరించవచ్చు. బోట్ వేవ్ ఆర్మర్ స్మార్ట్‌వాచ్.. హార్ట్ బీట్ రేటు, SpO2, డైలీ యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ అండ్ సెడెంటరీ అలర్ట్‌ వంటి ట్రాకింగ్ ఫీచర్స్‌తో వస్తుంది. దీంట్లో మైక్, స్పీకర్ ఇన్- బిల్ట్‌గా ఉంటాయి. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 10 కాంటాక్ట్‌లను సేవ్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 ప్రోటోకాల్‌ను డివైజ్ ఉపయోగిస్తుంది. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేసెస్‌ను కంపెనీ దీంట్లో ఇంటిగ్రేట్ చేసింది. ఇది క్రికెట్, హైకింగ్‌ సహా మొత్తం 20కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 410 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఏడు రోజుల పాటు ఉంటుంది. అయితే బ్లూటూత్ కాలింగ్‌ను నిరంతరయంగా ఉపయోగిస్తే బ్యాటరీ లైఫ్ కేవలం రెండు రోజులు మాత్రమే వస్తుంది. ఛార్జింగ్ పెట్టిన రెండు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ ప్రొడక్ట్‌ రూ.1899 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. 

50 గంటల బ్యాకప్ తో బ్యాటరీతో ఇయర్ బడ్స్!


వింగ్స్ భారతదేశంలో తమ ఆడియో పరికరాల సిరీస్ ని విస్తరించింది. ఈ బ్రాండ్ నుండి తాజాగా వింగ్స్ ఫాంటమ్ 380గా పిలువబడే వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇండియా లో లాంచ్ అయ్యాయి. ఇది సరసమైన ధర ట్యాగ్‌లో ANC వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. నాయిస్, బోట్, బౌల్ట్ ఆడియో పరికరాలు మరియు మార్కెట్‌లోని మరిన్ని బ్రాండ్‌ల నుండి ఇతర TWS ఇయర్‌ఫోన్‌లతో ఈ ఆడియో పరికరం పోటీపడుతుంది. ఈ వింగ్స్ ఫాంటమ్ 380 ఇయర్ బడ్స్ స్టెమ్ మరియు సిలికాన్ ఇయర్ టిప్స్‌తో ఇన్ ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది IPX5 రేటింగ్ ను కలిగి ఉంది. అంటే నీరు మరియు చెమట నిరోధకత కలిగి ఉంటుంది.ఈ ఇయర్ బుడ్లు టచ్ కంట్రోల్ లు కూడా కలిగి ఉన్నాయి, ఇయర్‌బడ్‌ల మొదలు పై టచ్ చేయడం ద్వారా వినియోగదారులు వివిధ పనులను చేయవచ్చు. ఆడియో పరంగా, ఈ వింగ్స్ ఫాంటమ్ 380 బోల్డ్ బాస్ మరియు స్ఫుటమైన హైస్ కోసం హై ఫిడిలిటీ 13mm కాంపోజిట్ డ్రైవర్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 30 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంది. స్పష్టమైన-నాణ్యత కాల్‌ల కోసం క్వాడ్ మైక్‌లు మరియు పర్యావరణ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు గేమింగ్ ప్రయోజనాల కోసం 40ms అల్ట్రా తక్కువ లేటెన్సీని కలిగి ఉంటాయి. అవి గూగుల్ అసిస్టెంట్ మరియు ఆపిల్ సిరి కి కూడా మద్దతునిస్తాయి. వింగ్స్ ఫాంటమ్ 380 బడ్స్ ANC ఫీచర్ ఆఫ్ చేసి ఉంటే 50 గంటల బ్యాటరీ జీవితాన్ని మరియు ANC ఫీచర్ ఆన్ చేసి ఉంటే 35 గంటల పాటు బ్యాటరీ జీవితాన్ని అందించబడుతుందని పేర్కొంది. ఇది USB C పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.ఈ ఆడియో పరికరం బ్లూటూత్ 5.3కి మద్దతు ఇస్తుంది మరియు స్మార్ట్‌ఫోన్‌కి త్వరగా కనెక్ట్ అవ్వడానికి ఓపెన్ అండ్ ఆన్ ఫీచర్‌తో వస్తుంది. లాంచ్ గురించి వింగ్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు విజయ్ వెంకటేశ్వరన్ మాట్లాడుతూ, "ఫాంటమ్ 380 ఇయర్‌బడ్స్ స్టైల్‌కు విలువనిచ్చే మరియు సమాన స్థాయిలో పనిచేసే వ్యక్తుల కోసం తయారు చేయబడింది. ఈ ఉత్పత్తి USP అనేది ANC మరియు పారదర్శకత మోడ్‌లు కలిగిన మా మొదటి ఉత్పత్తి. మా వినియోగదారుల మాదిరిగానే, మేము ఒక బ్రాండ్‌గా మా విలువను పెంచుతూనే ఉంటాము మరియు ఈ ఉత్పత్తి ఈ ప్రయత్నం లో మంచి ఫలితాలు సాధిస్తుంది." వింగ్స్ ఫాంటమ్ 380 ఇయర్ బడ్స్ రిటైల్ ధర రూ. 1,799 గా ఉంది, అయితే ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా, ప్రస్తుతం మీరు రూ. 1,299కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఇయర్ బడ్స్ ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవి, నలుపు మరియు తెలుపు రంగులలో అందుబాటులో ఉంటాయి.

ఏప్రిల్ 13న అసూస్ రోగ్ 7 విడుదల !


దేశీయ మార్కెట్లోకి  ఏప్రిల్ 13న అసూస్ సంస్థ అత్యంత శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్, అసూస్ రోగ్ 7ని విడుదల చేయనున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. సంస్థ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లో సాయంత్రం 5:30  గంటలకి లైవ్ ఈవెంట్‌ను చూడవచ్చని కంపెనీ వెల్లడించింది. ఫోన్ కి సంబంధించి అసూస్ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌ను వెల్లడించలేదు, అయితే ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి, ఇది మెరుగైన దృశ్యమాన అనుభవం కోసం రే ట్రేసింగ్‌కు మద్దతు ఇస్తుంది. అధికారిక ప్రకటన కంటే ముందుగానే, ROG 7గా భావించే అసూస్ ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. అలాగే, స్మార్ట్ ఫోన్ విభాగంలో లీక్‌లతో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ట్విట్టర్ వినియోగదారు అభిషేక్ యాదవ్ కూడా కొన్ని లీకులు ద్వారా స్పెసిఫికేషన్‌లను పంచుకున్నారు. గీక్ బెంచ్ జాబితా ప్రకారం, అసూస్ ఫోన్, ROG 7గా అంచనా వేయబడిన ఈ ఫోన్, 16GB RAM మరియు ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్ ని కలిగి ఉంటుంది. ఇది గీక్‌బెంచ్ పరీక్షలో ఈ ఫోన్ అద్భుతమైన సింగిల్-కోర్ మరియు మల్టీ కోర్ పాయింట్‌లను పొందింది. ఈ ఫోన్ వరుసగా 1,958 మరియు 5,238 పాయింట్ లను స్కోర్ చేసింది.ఈ ప్రాసెసర్ గరిష్టంగా 3.19GHz గడియారాన్ని కలిగి ఉంది మరియు ఒక ప్రాథమిక కోర్, నాలుగు పనితీరు కోర్లు మరియు మూడు సామర్థ్య కోర్లను కలిగి ఉంటుంది.  ROG 6 ఫోన్ 18GB RAM, 256GB నిల్వ మరియు స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో, 1,289 పాయింట్ల "సింగిల్-కోర్" స్కోర్ మరియు 4,189 "మల్టీ-కోర్" స్కోర్‌ను స్కోర్ చేసింది. ROG 7 అల్టిమేట్ 512GB వరకు స్టోరేజీ తో వస్తుందని యాదవ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లు కెమెరాలు విషయం లో పెద్దగా ఫోకస్ చేయనప్పటికీ, ROG 7 అల్టిమేట్‌లో 50-మెగాపిక్సెల్ IMX766 కెమెరా సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్ మరియు 8-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉండవచ్చు. ఈ ఫోన్ 239 గ్రాముల బరువు మరియు 10.3 మందంతో ఉంటుంది. ఇది దాదాపు గత సంవత్సరం విడుదలైన ROG 6 ప్రో స్మార్ట్ ఫోన్ మాదిరిగానే డిజైన్ ఉంటుంది.

ఒకే వరుసలోకి ఐదు గ్రహాలు !


వినీలాకాశంలో నేటి రాత్రి అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఐదు గ్రహాలు ఒకే రోజు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు ఒకే కక్షలోకి దగ్గరగా రానున్నాయి. ఆ గ్రహాలతో పాటు చంద్రుడు సైతం కలిసి కనువిందు చేయనున్నాయి. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు చూస్తే.. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నారు. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూసే అవకాశం ఉండగా.. బుధగ్రహం, యురేనస్ గ్రహాలను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూసేందుకు అవకాశం ఉందని నాసాకు శాస్త్రవేత్త బిల్‌కూక్‌ తెలిపారు. వీలైతే పవర్ ఫుల్ బైనాక్యులర్ వెంట ఉంచుకోవాలని సూచించారు. సమాంతర రేఖలో అన్నింటికంటే దిగువన బుధగ్రహం కనిపిస్తుంది. దానిపై బుధుడు, శుక్రుడు, యురేనస్, చంద్రుడు, మార్స్, జూపిటర్‌ గ్రహాలు సమాంతరంగా కనిపించనున్నాయి. సాధారణంగా మిగతా గ్రహాలన్నీ అప్పుడప్పుడు ఇలా కనిపించినా.. యురేనస్ కనిపించడం అరుదైన విషయమైని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అరుదుగా సంభవించే ఖగోళ వింతలను తప్పకుండా వీక్షించాలని సూచించారు.

గిట్‌హబ్ నుంచి భారత్‌ ఇంజనీరింగ్ టీం తొలగింపు !


మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ గిట్‌హబ్ భారత్‌లోని ఇంజనీరింగ్ టీం అంతటినీ విధుల నుంచి తొలగించింది. లేఆఫ్స్‌తో భారత్‌లో గిట్‌హబ్ ఇండియన్ ఆపరేషన్స్‌లో పనిచేసే 142 మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ రెండు నెలల వేతనంతో కూడిన పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల సంఖ్యను కుదించాలని ఫిబ్రవరిలో చేపట్టిన పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గిట్‌హబ్ ఓ ప్రకటనలో పేర్కొంది. లేఆఫ్స్‌కు సంబంధించి కంపెనీ సీఈవో థామస్ డోమ్కి ఉద్యోగులకు ఈమెయిల్ పంపుతూ కంపెనీ చేపట్టిన చర్యలను సమర్ధించారు. కొందరు ఉద్యోగులను తప్పించడం వంటి కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని, దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా కంపెనీ పెట్టుబడుల సామర్ధ్యాన్ని కాపాడుకునేందుకు, సంస్ధ బలోపేతానికి ఈ చర్యలు చేపట్టక తప్పలేదని పేర్కొన్నారు.

దిశ మార్చిన కృష్ణబిలం !


నక్షత్ర మండలం లోని  కృష్ణబిలం తన దిశను ఇప్పుడు భూమి వైపు మార్చుకోవడంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఆ నక్షత్ర మండలాన్ని తిరిగి వర్గీకరించారు. 657 మిలియన్ కాంతి సంవత్సరాలకు దూరంగా ఈ నక్షత్రమండలం కనబడింది. దీనికి పిబిసి జె 2333.92343 అని పేరు పెట్టారు. ఈ నక్షత్ర కూటమి ప్రత్యేకమైన లక్షణాలు ప్రదర్శించడంతో దీన్ని అధ్యయనం చేయడం మొదలు పెట్టామని రాయల్ అస్ట్రానమికల్ సొసైటీ (ఆర్‌ఎఎస్)కు చెందిన డాక్టర్ లోరెనా హెర్మాండెజ్ పేర్కొన్నారు. ఈ కృష్ణబిలం తన సాపేక్షదట్టమైన పొగవంటి వెల్లువ దిశ మారిందన్నది తమ సిద్ధాంతమని, దీన్ని నిర్ధారించుకోడానికి తాము అనేక విధాలైన పరిశోధనలు సాగిస్తున్నామని పేర్కొన్నారు. పరిశోధకులు తమ అధ్యయనంలో ఈ మార్పును వివరించారు. ప్రథమంగా ఈ గెలాక్సీని రేడియో గెలాక్సీగా వర్గీకరించారు. కానీ అంతరిక్ష దృగ్విషయాలు 90 డిగ్రీల కోణంలో పరిభ్రమిస్తూ ఇప్పుడు తన కేంద్రాన్ని భూమి వైపు లక్షంగా పెట్టుకుందని అంటే దీని జెట్ ప్రవాహం భూమి దిశగా ఉంటోందని పరిశోధకులు వివరించారు. కృష్ణబిలం నుంచి జెట్ వెల్లువ పదార్థం గెలాక్సీకి ఇరువైపులా రెండు భారీ ఖండాలను ఏర్పర్చిందని, రేడియో ధార్మిక తరంగాలతో అధ్యయనం చేసినప్పుడు వీటిని తక్షణం గుర్తించవలసి ఉంటుందని చెప్పారు. ఈ విధంగా దిశ మారడానికి ఏది దోహదం చేసిందో తాము చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే మరికొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నక్షత్రమండలం (పిబిసి జె 2333.9 2343) వేరే నక్షత్రమండలం ( గెలాక్సీ)తో ఢీకొనడం వల్లనే దిశ మారిందని అంచనా వేస్తున్నారు.

Monday, March 27, 2023

ప్రస్తుత ఉద్యోగంలో మెరుగైన సామర్థ్యం కనబరచాలి !


ఉద్యోగులందరూ మరో ఉద్యోగంపై దృష్టి సారించడం బదులు వారి ప్రస్తుత ఉద్యోగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సూచించారు. ఉద్యోగులు తమ సత్తా చాటేందుకు తదుపరి ఉద్యోగాల కోసం వేచిచూడకుండా ప్రస్తుత ఉద్యోగంలోనే మెరుగైన పనితనం కనబరచాలని అన్నారు. 1992లో తాను తొలిసారి ఆఫీస్‌లో అడుగుపెట్టిన సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగం తనకు ఉందని, ఇంతకు మించి తనకేదీ అవసరం లేదని అనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యేవరకూ సత్య నాదెళ్ల కంపెనీలోని వివిధ విభాగాల్లో పలు హోదాల్లో పని చేశారు. కంపెనీ సీఈఓగా నియమితులైనప్పటి నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పనిచేసే విధానాన్ని సమూలంగా మార్చివేశారు. న్యూ బింగ్ ఆవిష్కరణతో ఏఐ టెక్నాలజీపై మైక్రోసాఫ్ట్ సరికొత్తగా దృష్టి సారించింది. మీరు ఏం చేస్తారనే దానిపై మీ వృద్ధి ఆధారపడి ఉంటుందని ఆలోచించనంత వరకూ మీరు ఎదగలేరని లింక్డిన్ సీఈఓ ర్యాన్ రోలన్‌స్కీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్‌లో తన 30 ఏండ్ల ప్రస్ధానంలో తన పనిని ఎన్నడూ తేలికగా తీసుకోలేదని, తాను పనిచేసే ఉద్యోగం ఎంతో కీలకమైనదని భావించే వాడినని చెప్పుకొచ్చారు.

త్వరలో నథింగ్ ఫోన్ 2 విడుదల ?


దేశీయ మార్కెట్లో గత సంవత్సరం నథింగ్ ఫోన్1 తో సంచలనం సృష్టించిన కార్ల్ పేయి, త్వరలో తన రెండవ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  భారతీయ టిప్‌స్టర్ సుధాన్షు అంభోర్ పంచుకున్న సమాచారం ప్రకారం, ఈ ఫోన్ మోడల్ నంబర్ AIN065తో BIS వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే, ఈ ఫోన్ ఏ లక్షణాలను కూడా ఈ లిస్ట్ లో లీక్ చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో స్పష్టంగా సమాచారం లేదు. ఇటీవల జరిగిన MWC 2023లో, నథింగ్ ఫోన్ (2) క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ ద్వారా అందించబడుతుందని నథింగ్ సీఈఓ కార్ల్ పీ ధృవీకరించారు. ప్రస్తుత నథింగ్ స్మార్ట్‌ఫోన్ కంటే నథింగ్ ఫోన్ (2) 'ఎక్కువ ప్రీమియం'గా ఉంటుందని కార్ల్ పీ గతంలో చెప్పారు. ఈ ఏడాది చివర్లో ఈ హ్యాండ్‌సెట్ యుఎస్‌కి వస్తుందని కూడా అతను ధృవీకరించాడు. స్మార్ట్‌ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో ఒకే వేరియంట్‌లో అందించబడుతుందని పుకారు ఉంది. ఇది 256GB నిల్వతో జత చేయబడవచ్చు.ఇంకా,ఈ పరికరం 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉండవచ్చు. నథింగ్ ఫోన్ (2) ఫోన్ నథింగ్ ఫోన్ (1)కి సక్సెసర్ కాదు. ఈ స్మార్ట్‌ఫోన్ వినూత్నమైన ప్రత్యేకమైన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. ఇది స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో వినియోగదారులకి సహాయపడటానికి ఇది కమ్యూనికేట్ చేయడానికి కొత్త మార్గం. 900 LED లతో రూపొందించబడిన ప్రత్యేక కాంతి నమూనాలు ఎవరు కాల్ చేస్తున్నారో సూచిస్తాయి మరియు యాప్ నోటిఫికేషన్‌లు, ఛార్జింగ్ స్థితి మరియు మరిన్నింటిని ఇవి సూచిస్తాయి. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వెనుకవైప సోనీ IMX766 ద్వారా ఆధారితమైన ప్రధాన కెమెరాతో రెండు అధునాతన 50 MP సెన్సార్‌లను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరాతో ఇది అమర్చబడింది. ఈ ఫోన్ నైట్ మోడ్ మరియు సీన్ డిటెక్షన్‌ను కూడా కలిగి ఉంది, వీటిలో రెండోది స్వయంచాలకంగా ఒకరు ఏమి షూటింగ్ చేస్తున్నారో గుర్తించి, షాట్ కోసం ఉత్తమ సెట్టింగ్‌లను సూచిస్తుంది. నథింగ్ ఫోన్ (1) ఫోన్ 60Hz నుండి 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వెనుక మరియు ముందు HDR10+ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. మిడ్-రేంజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778+ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఏదీ స్మార్ట్‌ఫోన్ అందించబడలేదు.క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoC, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.నథింగ్ ఫోన్ 1 33W వైర్డ్ ఛార్జింగ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. 

కంటి వ్యాధులను పసిగట్టే యాప్ !


దుబాయ్‌కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్‌లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్  వైరలవుతోంది. 9 ఏండ్ల వయసులోనే యాప్‌ను క్రియేట్ చేసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రశంసలు పొందిన హనా రఫీక్ సోదరే లీనా రఫీక్‌. 11 ఏండ్లకే దుబాయ్‌కు చెందిన భారతీయ బాలిక లీనా కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సొంతంగా కోడింగ్ నేర్చుకున్న లీనా ఆగ్లర్ ఐస్కాన్ పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొబైల్ యాప్ వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా కంటి వ్యాధులు, కంటి పరిస్ధితిని ఇట్టే పసిగట్టేస్తుంది. ఆర్కస్‌, మెలనొమా, శుక్లాలు వంటి వ్యాధులు, పరిస్ధితులను గుర్తించేందుకు ఆగ్లర్ ట్రైన్‌డ్ మోడల్స్‌ను వినియోగిస్తుంది. ఏఐ మొబైల్ యాప్ ఆగ్లర్ ఐస్కాన్‌ను సబ్‌మిట్ చేస్తున్నందుకు ఉద్వేగంగా ఉంది. నేను పదేండ్ల వయసులో ఈ యాప్‌ను క్రియేట్ చేశా..మీ ఐఫోన్‌తో వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా ఆగ్లర్ పలు కంటి వ్యాధులు, పరిస్ధితులను పసిగడుతుందని లింక్డిన్ పోస్ట్‌లో లీనా రాసుకొచ్చింది. అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ విజన్‌, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఆల్గర్ యాప్ పనిచేస్తుంది.

భూమికి చేరుకొనున్న బెన్నూ గ్రహశకలం నమూనా


బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాను నాసా వ్యోమనౌక ఒసైరిస్‌ఎక్స్ భూమి మీదకు తీసుకు వస్తోంది. వచ్చే సెప్టెంబర్ 23 నాటికి ఈ నమూనా చేరుకోవచ్చు. 1999 rq36 అన్న పేరుతో బెన్ను గ్రహ శకలాన్ని వ్యవహరిస్తున్నారు. గ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? జీవం ఎలా పుట్టింది ? తదితర పుట్టు పూర్వోత్తరాలను ఈ నమూనా ద్వారా తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇది కీలక ఘట్టం కానున్నది. విజయవంతంగా గ్రహశకలం నమూనా భూమికి చేరుకోబోతుండటం చెప్పుకోదగిన విషయం. ఇంతవరకు ఎన్నడూ చేపట్టని మిషన్. 2016 సెప్టెంబర్ 8 న ఒసైరిస్ వ్యోమనౌక ప్రయోగం జరిగింది. బెన్నూ గ్రహ శకలాన్ని ఈ వ్యోమనౌక 2018 లో చేరుకుంది. దాదాపు ఏడేళ్లు ఈ నౌక అంతరిక్షంలో గడిపింది. నమూనాను తీసుకు రావడం అన్న ది ఒక ఛాలెంజ్ . ఎందుకంటే అత్యధిక వేడి వాతావరణం,ప్రకంపనలు, భౌగోళిక చిక్కుల నుంచి ఆ శకలం నమూనాను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ నమూనా కాప్సూల్ భూమికి చేరుతుందో అప్పుడే దాన్ని భద్రపర్చడానికి శాస్త్రవేత్తల బృందం ప్రయత్నిస్తుంది. ఆ నమూనా ఉటా ఎడారిలో దిగగానే అక్కడి నుంచి కొత్త లేబొరేటరీకి తరలిస్తారు. హోస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ వద్ద వద్ద కొత్త లేబొరేటరీ నిర్మించారు. కొత్త లేబొరేటరీలో నమూనాలను పరిశీలించడం ప్రారంభిస్తారు. దానిలో నాలుగో వంతు వివిధ ప్రాంతాల శాస్త్రవేత్తలకు అందించి పరిశోధన ముమ్మరం చేస్తారు. గ్రహాలు ఏర్పడేటప్పుడు కొన్ని ప్రాచీన అవశేషాలు మూలం నుంచి మిగిలిపోయాయి. ఈ అవశేషాలే గ్రహ శకలాలు. వీటిలో పూర్వగాముల జీవి తాలూకు పరమాణువులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

జీపీటీ-4ని ఫ్రీగా ఉపయోగించే ఆప్షన్స్ !


OpenAI కొద్ది రోజుల క్రితం పరిచయం చేసిన లేటెస్ట్ లాంగ్వేజ్ మోడల్ జీపీటీ-4 అత్యంత అధునాతన సామర్థ్యాలతో అందర్నీ ఆకట్టుకుంటోంది. సాధారణ చాట్‌జీపీటీ చేయలేని టాస్కులను కూడా సులభంగా చేస్తూ మానవుల సృజనాత్మక శక్తికి దీటుగా నిలుస్తోంది. జీపీటీ-4 కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇమేజ్‌లను కూడా ప్రాసెస్ చేస్తోంది. కష్టమైన పరీక్షలలో అత్యధిక మార్కులు సంపాదిస్తూ వావ్ అనిపిస్తోంది. ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు మాత్రమే జీపీటీ-4 అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ప్రోమేథియస్ అని పిలిచే మైక్రోసాఫ్ట్ బింగ్ కొత్త AI మోడల్‌ అయిన GPT-4ని ఉపయోగిస్తోంది. బింగ్ చాట్‌బాట్ ఫ్రీ కాబట్టి జీపీటీ-4 సేవలను దీని ద్వారా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఉచితంగా జీపీటీ-4 మోడల్‌ను వినియోగించడానికి ఒక్క బింగ్ చాట్‌ మాత్రమే సులభమైన మార్గంగా కనిపిస్తోంది. ఇక Bing AI చాట్‌బాట్ చాట్‌జీపీటీ 4 అందిస్తున్న ఫీచర్లే కాకుండా కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్లను కూడా ఆఫర్ చేస్తోంది. Bing AIకి సాధారణ సూచనలు ఇస్తే చాలు ఇమేజ్‌లను క్రియేట్ చేసి ఇస్తోంది. అంతేకాదు, సమాచారం ఎక్కడి నుంచి తీసుకుంటుందో కూడా మీకు తెలియజేస్తుంది. నిజమైన వ్యక్తిలా సమాధానాలు ఇచ్చేలా దీనిని మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసింది.

స్టెప్ 1: మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge)ని ఉపయోగిస్తుంటే.. bing.com/new కి వెళ్లాలి. ఆండ్రాయిడ్మొబైల్ యూజర్లు https://play.google.com/store/apps/details?id=com.microsoft.bing క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్ 2: తరువాత టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న "చాట్ (Chat)"పై క్లిక్ చేయాలి. అంతే, మీరు జీపీటీ-4 ఫీచర్లను ఉచితంగా అందించే ఏఐ చాట్‌బాట్‌ని ఉపయోగించొచ్చు.

స్టెప్ 3: ఒకవేళ మీరు వేరే వెబ్ బ్రౌజర్‌ ఉపయోగిస్తుంటే.. బింగ్ చాట్ ఫర్ ఆల్ బ్రౌజర్స్‌ (Bing Chat for All Browsers) ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.

స్టెప్ 4: తర్వాత bing.com/new కి వెళ్లాలి.

స్టెప్ 5: టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న "చాట్ (Chat)"పై క్లిక్ చేయాలి. అంతే, మీరు జీపీటీ-4 ఫీచర్లను ఉచితంగా అందించే ఏఐ చాట్‌బాట్‌ని ఉపయోగించొచ్చు.

ఉద్యోగులకు మస్క్ బంపర్ ఆఫర్ !


సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇప్పుడు షాకింగ్ వార్తను వినిపించారు. అనూహ్యంగా వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువచేసే స్టాక్స్‌ను ఉద్యోగులను ఇస్తానని ట్విట్టర్ సిఇఒ మస్క్ ప్రకటించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. ఇప్పుడు ఉద్యోగులకు దానిలో సగం ఆఫర్ చేస్తుండండం గమనార్హం. మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని, ఇప్పటికే ఉద్యోగులను తొలగించగా, అనేక మంది నిపుణులు కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. వీరిని అడ్డుకునేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంతమేరకు స్టాక్స్‌ను ఇస్తారు అనేది స్పష్టంగా చెప్పలేదు.

Sunday, March 26, 2023

టిక్ టాక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లపై ఫ్రాన్స్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది !


టిక్ టాక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ సహా పలు యాప్స్ పై ఫ్రాన్స్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు వీటిని ఫోన్ లో కూడా వాడొద్దని ఆదేశించింది. ఈ యాప్ లలోని భద్రతా లోపాల కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నామని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఫ్రెంచ్ మంత్రి స్టానిస్లాస్ గెరిని ఈవిషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాన్ని ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పర్యవేక్షిస్తుందన్నారు. నిషేధ జాబితాలో ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, నెట్‌ఫ్లిక్స్, గేమింగ్ యాప్‌ క్యాండీ క్రష్, డేటింగ్ యాప్‌లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే యుఎస్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఇయు) కూడా ప్రభుత్వ సిబ్బంది ఫోన్‌లలో టిక్‌టాక్‌ను నిషేధించాయి. ఒక అధికారి పబ్లిక్ కమ్యూనికేషన్ వంటి వృత్తిపరమైన ప్రయోజనాల కోసం నిషేధిత యాప్‌ను ఉపయోగించాలనుకుంటే, వారు అలా చేయడానికి అనుమతిని కోరవచ్చు. చైనా అధికారులు TikTok ద్వారా ఫోన్లను హైజాక్ చేస్తాయనే ఆందోళన యూరప్ దేశాలు, అమెరికాకు ఉంది. 2017లో చైనా అమలు చేసిన చట్టం ప్రకారం దేశ జాతీయ భద్రతకు సంబంధించిన ఏదైనా వ్యక్తిగత డేటాను చైనా కంపెనీలు చైనా ప్రభుత్వానికి అందించాలి. TikTok అటువంటి డేటాను మార్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కానీ అది సేకరిస్తున్న విస్తారమైన వినియోగదారు డేటా కారణంగా భయాలు ఎక్కువగా ఉన్నాయి.

మొదటి రోజే 400 యూనిట్లను డెలివరీ చేసిన మహీంద్రా !


మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు తన XUV400ఎలక్ట్రిక్ డెలివరీలు ప్రారంభించింది. మహీంద్రా నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇది. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజే ఏకంగా 400 యూనిట్లను డెలివరీ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త ఎలక్ట్రిక్ SUV ఎక్స్‌యూవీ 400 మొత్తం EC (3.2kw), EC (7.2kw), EL (7.2kw)అనే మూడు వేరియంట్లలో విడుదలైంది. వీటి ధరలు వరుసగా రూ. 15. 99 లక్షలు, రూ.16.49 లక్షలు, రూ. 18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహింద్రా లో ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం జనవరిలోనే బుకింగ్స్ తీసుకుంది. ఈ కారులో ప్రయాణికుల భద్రతను ద్రుష్టిలో పెట్టుకుని 6 ఎయిర్ బ్యాగులను ఇస్తున్నారు. 7 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్ , స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, సన్ రూఫ్ , రియర్ పార్కింగ్ కెమెరా, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వేరియంట్లలో ఎలక్ట్రిక్ మోటార్ 100 కిలోవాట్ శక్తిని, 310 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 150 కిలో మీటర్ల వేగంతో కేవలం 8.3 సెకన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. మొదటి దశలో దేశంలోని 34 నగరాల్లో ఈ కార్లు అందుబాటులో ఉంటాయి. ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, ఇన్ఫినిటీ బ్లూ, నాపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే వంటి 5 రంగుల్లో లభ్యమవుతుంది. అయితే ఈఎల్ వేరియంట్ లో పైన డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంది. ఎక్స్‌యూవీ400 ఐదు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. అవి ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్‌ రూఫ్‌తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు ఉన్నాయి. ఎక్స్‌యూవీ 400 రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి ఒకటి 34.5kWh బ్యాటరీ కాగా, మరొకటి 39.4kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 హెచ్‌పి, 310 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిమీ. ఈ ఎలక్ట్రిక్ కారులోని 34.5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌తో 375 కిమీ రేంజ్, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్‌తో 456 కిమీ రేంజ్ అందిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఫాస్ట్ ఛార్జర్‌ (50kW DC)ద్వారా 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది, అదే సమయంలో 7.2kW ఛార్జర్‌ ద్వారా 6 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఇక చివరగా 3.3kW AC ఛార్జర్‌ ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 13 గంటల సమయం పడుతుంది.

వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలి !


అమెజాన్‌, గూగుల్‌, ట్విట్టర్‌, మెటా వంటి పలు టెక్ దిగ్గజాలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అనే ఆందోళన నెలకొంది. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ ఉద్యోగులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. వారానికి మూడు రోజులైనా ఆఫీసు నుంచి పనిచేయని ఉద్యోగులపై వేటు తప్పదని హెచ్చరించింది. ఉద్యోగుల అటెండెన్స్‌ను ట్రాక్ చేస్తున్న యాపిల్ ఇటీవల ఉద్యోగులను హెచ్చరించినట్టు సమాచారం. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని, ఇలా చేయని ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. పని విధానాలను అతిక్రమించే వారిని తొలగిస్తామని కంపెనీ పేర్కొందని ప్లాట్‌పామర్ మేనేజింగ్ ఎడిటర్ జో షిఫర్ ట్వీట్ చేశారు. అయితే ఇది కంపెనీ అంతటికీ వర్తించదని పేర్కొన్నారు. యాపిల్ మేనేజర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులు మంగళ, బుధ, గురువారాల్లో ఆఫీసుకు రావాలని కోరినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ఇటీవల వెల్లడించింది. కంపెనీ ఆదేశాలను బేఖాతరు చేస్తే తమ ఉద్యోగాలు ఊడతాయని యాపిల్ ఉద్యోగులు పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇక చాలా పొజిషన్స్‌కు యాపిల్ నియామకాలను పూర్తిగా నిలిపివేసిందని, మరికొన్ని పొజిషన్స్ నియామకాలను పరిమితంగా చేపడుతోందని ఈ రిపోర్ట్ తెలిపింది.

హోండా యాక్టివా నుంచి సరి కొత్త బైక్ !


దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టూ వీలర్ బైక్స్ లలో హోండా యాక్టివా కూడా ఒకటి. ఇప్పుడు మరొక కొత్త అప్డేట్ ను ఈ సంస్థ ప్రకటించడం జరిగింది. హోండా యాక్టివా 125 H స్మార్ట్ పేరిట దీనిని తీసుకురావడం జరిగింది. దీని గురించి ఒక టీజర్ కూడా విడుదల చేసింది.. స్కూటర్లలో హోండా యాక్టివా తిరుగులేని స్టార్ డమ్ అందుకుందని చెప్పవచ్చు. చాలామంది ఈ బ్రాండెడ్ బైక్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇందుకు పోటీగా చాలా కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టడం జరిగింది. మరొక వైపు యాక్టివా తన మోడల్స్ ను అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తోంది. తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన 6G మోడల్ స్కూటర్ ను రిమోట్ కి లాంచ్ సూపర్ ఫీచర్ తో తీసుకురావడం జరిగింది. హోండా యాక్టివా 125 H స్మార్ట్ పేరిట దీనిని తీసుకువచ్చినట్లు తెలియజేస్తోంది ఆ సంస్థ. ఇంకా ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇటీవలే.. విడుదలైన 6G బైకుకు ఇవి దగ్గర పోలికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బైక్ లో కూడా ఎలక్ట్రిక్ కి, పుష్ బటన్స్, స్మార్ట్ వంటి ఫీచర్స్ కూడా కలవు. అలాగే పార్కు చేసిన బైక్ ని కనుగొనేందుకు వీలుగా సిగ్నల్ ఇండికేటర్ కూడా కలదు. ఇక ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న బైకు ధరల కంటే రూ.10 వేల రూపాయలు అదనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ మూడు రకాల వేరియంట్ లో యాక్టివ్ గాను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక దీని ధర ప్రారంభం నుంచే రూ.81,411 పైనుంచి ప్రారంభమవుతుంది అలాగే డిస్క్ బ్రేక్ కు అదనంగా 2000 రూపాయలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో హోండా యాక్టివా 125 H బైక్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి మరి.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ?


గత సంవత్సరం WhatsApp ఫోటోలు, వీడియోల కోసం ‘View Once’ ఫీచర్ ను తీసుకువచ్చింది. మీరు పంపిన ఏదైనా ఫోటో లేదా వీడియోను ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఇప్పుడు ఆడియో విషయంలో కూడా అలాంటిదే చేయబోతుంది. Wabetainfo వెబ్ సైట్ కథనం ప్రకారం కంపెనీ ఒక కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. దీని కింద వ్యక్తులు ఆడియోను కూడా ‘View Once’గా పంపగలరు. అంటే ఇప్పటి వరకు ఒక్కసారి ఫోటో, వీడియోలకు అందుబాటులో ఉన్న ఫీచర్ ఆడియోలో కూడా రానుంది. ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా ఆడియో ‘View Once’ ద్వారా పంపిస్తే మీరు ఈ ఆడియోను సేవ్ చేయలేరు, ఫార్వర్డ్ చేయలేరు, ఆ ఆడియోను రికార్డ్ చేయలేరు. ఈ ఫీచర్ ప్రైవసీని కాపాడుకోవడంలో వ్యక్తులకు మరింత సహాయం చేస్తుంది. ఈ రోజుల్లో ప్రజలు వాట్సాప్ లో వచ్చే ఆడియోలను రికార్డ్ చేసి, వాటిని అనేక విధాలుగా మానిపులేట్ చేయడాన్ని మీరు చూస్తూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ ఫీచర్ సహాయంతో మీరు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. డెస్క్ టాప్ వినియోగదారుల కోసం కొంతకాలం క్రితం కొత్త అప్డేట్ ను విడుదల చేసింది. కొత్త యాప్ ద్వారా గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. యూజర్లు ఎనిమిది మందికి ఆడియో కాల్స్, 32 మందికి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కొత్త యాప్ ఇంటర్ఫేస్ను కూడా కంపెనీ మార్చింది. సందేశాల లోడ్ వేగాన్ని కూడా పెంచింది. ఇది కాకుండా, వినియోగదారులు నాలుగు వేర్వేరు గాడ్జెట్లు, ఒక మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు. మొబైల్ ఫోన్లోని బ్యాటరీ లేదా డేటా అయిపోయినప్పటికీ, మీరు ఇతర పరికరాల్లో వాట్సాప్ ను ఉపయోగించగలరు.


10000mAh భారీ బ్యాటరీతో ఔకిటెల్ డబ్ల్యూపీ 22


ఔకిటెల్ డబ్ల్యూపీ 22  ఫోన్ ధర $200 అంటే దాదాపు రూ.16,469.  60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 FHD+ IPS డిస్‌ప్లేను, 8GB LPDDR4 RAM, 256GB స్టోరేజ్‌తో MediaTek Helio P90 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. Oukitel WP22  ప్రత్యేకత ఏమిటంటే ఇది 125dB  స్పష్టమైన స్పీకర్‌ను కలిగి ఉంది. స్పీకర్ పాటలు వినడానికి, గేమ్‌లు ఆడటానికి, పాడ్‌కాస్ట్‌లు వినడానికి, హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియోలను చూడటానికి చాలా బాగుంది. ఈ స్పీకర్‌లో 36mm పూర్తి స్థాయి నియోడైమియమ్ మాగ్నెట్ డ్రైవర్ ఇవ్వబడింది. ఇది బేలెన్స్డ్ సౌండ్ అందిస్తుంది.  ఫోటోగ్రఫీ కోసం, దాని వెనుక భాగంలో 48MP సోనీ IMX582 ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ మరియు 20MP సోనీ IMX350 ఆటోఫోకస్ నైట్ విజన్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16MP కెమెరా ఉంది. 10000mAh భారీ బ్యాటరీ ఇవ్వబడింది. దీంతో 52 రోజుల పాటు నడపొచ్చు. ఇందులో రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ సందర్భంలో, ఇది నీరు, దుమ్ము మరియు షాక్ ప్రూఫ్ ఉంటుంది. ఇది 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాలు ఉండగలదని కంపెనీ చెబుతోంది. (Image- AliExpress)

Saturday, March 25, 2023

ఎల్‌వీఎం3 రాకెట్ ప్రయోగానికి ఇస్రో కౌంట్ డౌన్ ప్రారంభం !


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది.  సైంటిస్టులు ఈ నెల 26న షార్ నుండి ఎల్వీఎం 3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఎల్‌వీఎం3 వాహక నౌక ద్వారా 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇవాళ ఉదయం 8.30 కి కౌంట్ డౌన్ మొదలైంది. ముందుగా గురువారం నిర్వహించిన రిహార్సల్స్‌ విజయవంతం కావడంతో మార్చి 26వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు ఇస్రో రాకెట్ ను నింగిలోకి పంపనుంది. గతేడాది అక్టోబరు 23న మొదటి విడతలో 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. ఇప్పుడు 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం3 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి పంపనుంది. 5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉప గ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.

భూమి అతి చెరువుగా భారీ గ్రహ శకలం !


భూమికి చంద్రుడికి మధ్యలోకి ఓ భారీ గ్రహ శకలం శనివారం రానుంది. చంద్రుడి కంటే రెండు రెట్లు భూమికి దగ్గర వస్తుందని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇది 107,500 మైళ్ల (173004 కిలోమీటర్ల) దూరంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ గ్రహ శకలానికి 2023 డీజెడ్2 అని నాసా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ గ్రహశకలాన్ని ఫిబ్రవరి 27న తొలిసారిగా కనిపెట్టారు. యూరోపియన్ నియర్ ఎర్త్ ఆస్ట్రరాయిడ్స్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు. ఆ సమయంలో అది భూమికి 159 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 3.16 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఈ గ్రహశకలం మళ్లీ 2026లో భూమికి దగ్గరగా రానుంది. అప్పుడు గనుక ఢీకొట్టకపోతే.. 2029లో భూమికి మరింత దగ్గరగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు పదేళ్లకోసారి ఏదైనా గ్రహశకలం ఇంత దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ వాటి సైజ్ 140 నుంచి 310 అడుగులు ఉన్నవి దగ్గరగా వస్తూ ఉంటే.. దాన్ని గమనించడం అరుదైన అవకాశంగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ గ్రహ శకలాన్ని కళ్లారా చూసే వీలు ఉంది. ఐతే.. ఆగ్నేయ ఆసియా దేశాల వారికి మాత్రమే ఇది కనిపిస్తుంది. భారత్‌లో ప్రజలకు ఇది కనిపించదు. ఈ 200 అడుగుల వెడల్పు ఉన్న రాయిని నాసా ఆస్ట్రరాయిడ్ టీమ్ పరిశీలిస్తోంది. ఇవాళ వచ్చే గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవు. కానీ.. దగ్గరగా వస్తోంది కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి గ్రహశకలాల్ని అంతరిక్షంలోనే పేల్చి వేసే టెక్నాలజీని మనం మరింతగా డెవలప్ చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఆమధ్య నాసా ఓ చిన్న గ్రహశకలాన్ని విజయవంతంగా పేల్చివేసింది.

వాట్సాప్ లో కొత్త వీడియో మెసేజ్ ల ఫీచర్ ?


వాట్సాప్ కొత్త షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వాట్సాప్ అంచనా వేయబడిన 2.24 బిలియన్ వినియోగదారులు వారి చాట్‌లలోని కాంటాక్ట్ లతో పంచుకోవడానికి 60 సెకన్ల వరకు చిన్న వీడియో సందేశాలను రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. వాట్సాప్ బీటా అప్‌డేట్ ట్రాకర్ ఛానెల్‌లోని వినియోగదారులు దీనిని పరీక్షించలేరు. కానీ, వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ రాబోయే ఫీచర్ వివరాలను, అది విడుదలైన తర్వాత ఎలా పని చేస్తుందనే ప్రివ్యూ ను కూడా విడుదలచేస్తుంది. ఈ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ద్వారా విడుదల చేయబడిన వివరాల ప్రకారం, వాట్సాప్ లో ఇప్పుడు ఉన్న ప్రస్తుత లాంగ్-ఫార్మాట్ వీడియోల మాదిరిగా కాకుండా, ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు వీడియో సందేశాలను సేవ్ చేయకుండా లేదా అసలు సంభాషణలలో భాగం కాని ఇతర పరిచయాలకు ఫార్వార్డ్ చేయకుండా నిరోధిస్తుంది. ఈ చిన్న వీడియో షేరింగ్ ఫీచర్ ప్రస్తుతం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యొక్క తాజా iOS బీటా వెర్షన్‌లో అభివృద్ధి దశలో ఉంది. WABetaInfo సమాచారం ప్రకారం, ఈ వీడియో మెసేజ్ లు అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి, వాట్సాప్ మరియు దాని పేరెంట్ మెటా కూడా వీటిని చూడటానికి వీలు ఉండదు. ప్రస్తుతానికి, ఈ వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందో వివరాలు స్పష్టంగా తెలియరాలేదు.

శామ్‌సంగ్ బ్లూ ఫెస్ట్ 2023 ఈవెంట్ !


శామ్‌సంగ్‌ కంపెనీ వినియోగదారుల కోసం భారీ డిస్కౌంట్లతో బ్లూ ఫెస్ట్ 2023 పేరుతో కొత్త ప్రమోషనల్ ఈవెంట్ స్టార్ట్ చేసింది.  ప్రస్తుతం కొనసాగుతున్న ఈవెంట్ ఏప్రిల్ 30, 2023 వరకు ఉంటుంది. ఈ ఈవెంట్‌లో వినియోగదారులు శామ్‌సంగ్‌ ఎయిర్ కండిషనర్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, సౌండ్‌బార్లు, డిష్‌వాషర్ల వంటి వివిధ వస్తువులపై అదిరిపోయే డీల్స్‌, డిస్కౌంట్స్‌ పొందవచ్చు. బ్లూ ఫెస్ట్ 2023లో వినియోగదారులు The Frame TV మోడల్ కొనుగోలు చేస్తే.. రూ.9,990 విలువైన బెజెల్‌/ఫ్రేమ్ కవర్‌ ఫ్రీగా లభిస్తుంది. కొనుగోలు చేసిన ఫ్రేమ్ టీవీ సైజుతో సంబంధం లేకుండా ఈ ఫ్రేమ్ కవర్‌ను కంపెనీ ఉచితంగా అందజేస్తుంది. అలానే ఎంపిక చేసిన 75-అంగుళాల, అంతకన్నా ఎక్కువ సైజు ఉన్న నియో QLED, QLED ఫ్రేమ్ టీవీలతో రూ.99,990 విలువైన సౌండ్‌బార్‌ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ సమయంలో శామ్‌సంగ్ ప్రీమియం సిరీస్‌లోని Neo QLED, QLED, The Frame TVలను కొనుగోలు చేసే వినియోగదారులు Samsung Axis క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. డిష్‌వాషర్లను కూడా ఇదే క్యాష్‌బ్యాక్‌తో దక్కించుకోవచ్చు. ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు చేసే వారు ఐదేళ్ల PCB కంట్రోలర్ వారంటీని, 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను, శామ్‌సంగ్ Axis క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వారు రూ.990 నుంచి జీరో డౌన్ పేమెంట్‌తో సులభమైన EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. బ్లూ ఫెస్ట్ సందర్భంగా, శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లపై కూడా ప్రత్యేక డీల్‌లను అందిస్తోంది. ఈ డీల్స్‌తో 12కేజీ కెపాసిటీ కలిగిన AI EcoBubble ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ.40,000కే అందుబాటులోకి వచ్చాయి. కస్టమర్లు వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై 20% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలానే వీటిని కొనుగోలు చేయడం ద్వారా 28L మైక్రోవేవ్‌ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను ఇష్టపడే కస్టమర్‌ల కోసం ఇన్వర్టర్ రేంజ్ ప్రత్యేక ధర రూ.19,000 అందుబాటులో ఉంటుంది. అలాగే కస్టమర్లు 17.5% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. శామ్‌సంగ్ Wi-Fi సపోర్ట్‌తో బెస్పోక్ మైక్రోవేవ్‌తో వచ్చే బెస్పోక్ సైడ్-బై-సైడ్.. ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్‌ల కొత్త సిరీస్‌ను కూడా పరిచయం చేసింది. ఈ ఆఫర్ సమయంలో బెస్పోక్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.1,03,500 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు 10% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ.2,490 నుంచి ప్రారంభమయ్యే జీరో డౌన్ పేమెంట్, EMI వంటి ఆప్షన్స్ సైతం పొందవచ్చు. Curd Maestro Frost ఫ్రీ మోడల్స్ కొనే కస్టమర్లు 15% వరకు క్యాష్‌బ్యాక్, రూ.990 నుంచి EMIలు, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను పొందవచ్చు.

ఫోల్డింగ్ ఫ్యాన్ !


మడతపెట్టుకునేందుకు వీలుగా ఉన్న ఫ్యాన్‌ని డివైస్ కంపెనీ తయారుచేస్తోంది. దీనిని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌లో రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫ్యాన్ 360 డిగ్రీస్‌లో తిరగగలదు. కరెంటుపోయినప్పుడు బ్యాటరీ ద్వారా  పనిచేస్తుంది. ఈ ఫ్యాన్ రెక్కలు నిమిషానికి 3,800 సార్లు తిరుగుతాయి. 1600 mAh లిథియం అయాన్ బ్యాటరీని USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చెయ్యడానికి 5, 6 గంటలు పడుతుందని తెలిపారు. ఇది టేబుల్ ఫ్యాన్. మనకు నచ్చిన విధంగా దీన్ని మడత పెట్టుకోవడం ద్వారా ఎక్కడైనా వాడుకునేందుకు వీలుగా తయారుచేశారు. దీన్ని కిచెన్, లాండ్రీ రూమ్, లివింగ్ రూమ్, హోమ్ ఆఫీస్‌లో వాడుకోవచ్చని తెలిపారు. ఈ ఫ్యాన్ 44 సెంటీమీటర్ల ఎత్తు, 18 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుందని తెలిపారు. దీన్ని గోడకు కూడా సెట్ చేసుకోవచ్చని వివరించారు. ఈ ఫ్యాన్‌కి ప్రత్యేక LED లైట్ ఉంది. అందువల్ల రాత్రి వేళ.. బెడ్ లైట్ లాగా ఈ లైట్ వేసుకొని హాయిగా నిద్రపోవచ్చు. ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఈ ఫ్యాన్‌కి బటన్ కంట్రోల్ ఉంటుంది. ఈ ఫ్యాన్‌కి 5 స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 2 వాట్ల వాటేజ్, 5 వోల్ట్‌ల వోల్టేజ్ కలిగివుంది. బరువు 842 గ్రాములు.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న బైక్స్, స్కూటర్స్ ధరలు


ఇప్పటికే టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీని వల్ల కొత్తగా హీరో బైక్ లేదా స్కూటర్ కొనే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. బైక్స్, స్కూటర్ల ధర దాదాపు 2 శాతం వరకు పెరుగుతుందని హీరో మోటొకార్ప్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ఓబీడీ 1కు బదిలీ కావడం ద్వారా వ్యయాలు పెరుగుతున్నాయని, అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొందని కంపెనీ వివరించింది. కాగా దేశంలో ఏప్రిల్ 1 నుంచి విక్రయించే అన్ని టూవీలర్లు ఓబీడీ 1 నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. అయితే ధరల పెంపు అనేది బైక్ , స్కూటర్ మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతుందని కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు నేపథ్యంలో కంపెనీ మాత్రం కస్టమర్లకు ఫైనాన్స్ విషయంలో భరోసా ఇస్తోంది. ఆకర్షణీయ ఫైనాన్స్ సదుపాయం అందిస్తామని పేర్కొంటోంది. అందువల్ల హీరో బైక్, స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బెనిఫిట్ పొందొచ్చని తెలిపింది. హీరో మోటొకార్ప్ ధరల పెంపు నేపథ్యంలో ఇతర టూవీలర్ తయారీ కంపెనీలు కూడా వాటి బైక్స్, స్కూటర్ల ధరలను పెంచే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త రూల్స్ అన్ని టూవీలర్లకు వర్తిస్తాయి. ఈ లెక్కన చూస్తే.. కేవలం హీరో మోటొకార్ప్ మాత్రమే కాకుండా ఇతర టూవీలర్ తయారీ కంపెనీలు కూడా వాటి మోడళ్ల ధరలను పెంచే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.

Friday, March 24, 2023

'లెగసీ' ట్విట్టర్ బ్లూ టిక్ కు గుడ్ బై !


బ్లూ టిక్‌ను ఉచితంగా పొందిన వ్యక్తులు ఇప్పుడు దాన్ని నిలుపుకోవడానికి ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఎవరైనా దీన్ని చేయకపోతే ఏప్రిల్ 1 తర్వాత ఖాతా నుండి బ్లూ టిక్ తీసివేయబడుతుందని పేర్కొంది. అంటే అప్పుడు ఆ వినియోగదారు ఖాతాలో చెక్‌మార్క్ కనిపించదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కంపెనీలో చాలా పెద్ద మార్పులు జరిగాయి. మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రమే ట్విట్టర్ బ్లూను ప్రకటించారు. Twitter బ్లూలో సాధారణ వ్యక్తులతో పోల్చితే వినియోగదారులకు కంపెనీ నుండి అనేక ప్రీమియం సేవలు అందించబడతాయి. ఇందులో ట్వీట్ అన్‌డూ, ఎడిట్, లాంగ్ ట్వీట్, బుక్‌మార్క్ ఫోల్డర్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. ట్విట్టర్ బ్లూ సేవ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. ట్విట్టర్ బ్లూ వ్యక్తిగత వినియోగదారుల కోసం భారతదేశంలో సంవత్సరానికి రూ.9,400 ఖర్చు అవుతుంది. మీ ఖాతాలో లెగసీ చెక్‌మార్క్ (ఉచిత బ్లూ టిక్)ని ఉంచుకోవాలనుకుంటే దీని కోసం మీరు ఏప్రిల్ 1లోపు Twitter బ్లూకు సభ్యత్వాన్ని పొందాలి. భారతదేశంలోని వెబ్ వినియోగదారులు ట్విట్టర్ బ్లూ కోసం రూ.650 చెల్లించాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ప్రతి నెలా రూ.900 చెల్లించాలి. ఈ నిర్ణయం తర్వాత ఇంతకుముందు బ్లూ బ్యాడ్జీని ఉచితంగా పొందిన ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, సాధారణ ప్రజలు దాని కోసం చెల్లించవలసి ఉంటుంది. గత సంవత్సరం డిసెంబర్‌లోనే ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. లెగసీ చెక్‌మార్క్ ఇచ్చే విధానం తప్పు అని, అవినీతితో కంపెనీ మారుతుందని ఆయన అన్నారు. ట్విట్టర్‌లో ఇప్పుడు నీలిరంగు బ్యాడ్జీలే కాదు బంగారం, బూడిద రంగు బ్యాడ్జీలు కూడా యూజర్లకు అందజేస్తున్నారు. ట్విట్టర్ బ్లూను సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారికి బ్లూ బ్యాడ్జ్ ఇవ్వబడుతుంది. ప్రభుత్వ ప్రజలకు గ్రే బ్యాడ్జీ ఇస్తారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్నవారు అని అర్థం. అదేవిధంగా, కంపెనీ వ్యాపారాలకు గోల్డ్ చెక్‌మార్క్ ఇస్తుంది. ట్విట్టర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్‌లను 4,000 అక్షరాల పొడవు వరకు ట్వీట్‌లను సృష్టించడానికి కూడా అనుమతించింది.

కూ యాప్ కి పెరిగిన ఆదరణ !


ట్విట్టర్ నచ్చని భారత యూజర్లు ఎక్కువగా ఆశ్రయించే మైక్రోబ్లాగింగ్ సైట్ యాప్ కూ. ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా దేశీయ కూ ప్లాట్‌ఫామ్ సూపర్ పాపులర్ అయింది. దీని యూజర్ బేస్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. అయితే యూజర్ల సంఖ్యను ఇంకా పెంచుకునేందుకు, ఉన్న యూజర్లను కాపాడుకునేందుకు ఈ యాప్ నిత్యం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా తాజాగా యూజర్ల సేఫ్టీనే లక్ష్యంగా కొత్త కంటెంట్ మోడరేషన్ ఫీచర్లను పరిచయం చేసింది. ఈ సరికొత్త ఫీచర్లు నగ్నత్వం, పిల్లల లైంగిక వేధింపుల వంటి అనుచితమైన కంటెంట్‌ను ఐదు సెకన్లలో కనుగొని యాప్ నుంచి తొలగిస్తాయి. కూ యాప్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్లు హానికరమైన లేదా అవాస్తవమైన నోట్స్, కామెంట్స్ గుర్తించి వాటిని యూజర్ల నుంచి దాస్తుంది. ద్వేషపూరిత మెసేజ్‌లు పోస్ట్ కాకుండా ఆపగలవు. కూ రీసెంట్‌గా లాంచ్ ఒక్కో సెక్యూరిటీ ఫీచర్ ఒక్కో ప్రత్యేకమైన పనిని చేస్తూ ప్లాట్‌ఫామ్‌ను అత్యంత సురక్షితంగా ఉంచుతుంది. కూ యూజర్లు లైంగిక కంటెంట్ లేదా పిల్లల వేధింపుల దృశ్యాలు ఉన్న వీడియో లేదా ఫొటోలను అప్‌లోడ్ చేయకుండా గుర్తించి బ్లాక్ చేసే "No Nudity Algorithm" వ్యవస్థను ప్లాట్‌ఫామ్‌కు జోడించింది. ఈ సిస్టమ్ ఆ తరహా కంటెంట్‌ను ఐదు సెకన్లలోపు గుర్తించి బ్లాక్ చేయగలదు. ఒక వినియోగదారు అనుచితమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే, వారు పోస్టింగ్ చేయకుండా కొత్త ఫీచర్ ఆపుతుంది. అంతేకాకుండా వారు అకౌంటు, పోస్టులు ఇతరులకు కనిపించకుండా చేస్తుంది. వారి పోస్టులు ట్రెండింగ్ పోస్ట్‌లలో అసలు కనిపించవు. అలాగే వారు ఇతరులతో ఇంటరాక్ట్ కావడం కూడా కష్టం అవుతుంది. ఈ ఫీచర్‌ హానికరమైన వారికి కళ్లెం వేస్తుంది. ఇక ఏదైనా పోస్ట్‌లో హింస ఎక్కువగా ఉంటే, వినియోగదారులు దానిని చూసే ముందు ఒక హెచ్చరిక మెసేజ్‌ను చూస్తారు. తద్వారా వినియోగదారులు చూడవద్దు అనుకున్న హింసాత్మక పోస్టులను చూడకుండా జాగ్రత్త పడొచ్చు. కూ "Misinfo & Disinfo అల్గారిథమ్" టూల్‌ను సైతం పరిచయం చేసింది. ఈ ఫీచర్ పబ్లిక్, ప్రైవేట్ సోర్స్‌లను ఉపయోగించి తన ప్లాట్‌ఫామ్‌లో ఉన్న అన్ని వైరల్, రిపోర్ట్ ఫేక్ న్యూస్‌లను నిరంతరం చెక్ చేస్తుంది. పోస్ట్‌లలో నకిలీ సమాచారాన్ని కనుగొంటుంది. వాటిని లేబుల్ చేస్తుంది, ఇది ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తిని ఆపుతుంది. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు లేదా వివరణలతో సెలబ్రిటీగా కనిపించడానికి ప్రయత్నించే ఖాతాలకు కూడా కూ యాప్ చెక్ పెట్టనుంది. ఇలాంటి పనులు చేసే వారిని వెతకడానికి "MisRep అల్గారిథమ్" అనే సాధనాన్ని యాప్ ఉపయోగిస్తుంది. ఈ అల్గారిథమ్  ఫేక్ అకౌంట్స్‌ కనుగొన్నప్పుడు, అది వాటి నుంచి పాపులర్ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను చాలా వేగంగా తొలగిస్తుంది. భవిష్యత్తులో ఈ ఖాతాలు ఏ తప్పు చేయకుండా వాటిని ఫ్లాగ్ చేసి పర్యవేక్షిస్తుంది.  కూ కొత్త ఫీచర్ ద్వేషపూరితమైన స్పీచ్ లేదా విషపూరితమైన కామెంట్లను త్వరగా కనుగొని తొలగిస్తుంది. కాబట్టి వాటిని ఇతర వ్యక్తులు చూడలేరు. తొలగించడం అనేది కేవలం 10 సెకన్లలోపు జరుగుతుంది.

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు సవాలు విసురుతున్న బింగ్‌ !


ఈ రోజుల్లో ఏదైనా సందేహం వస్తే, ఠక్కున పక్కవారు ఇచ్చే సలహా గూగుల్‌ లో సెర్చ్ చేయమని, ఇంటర్నెట్‌కి గూగుల్‌ మరో పేరులా మారిపోయింది. అంతలా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ యూజర్లకు దగ్గరైంది. కానీ OpenAI, మైక్రోసాఫ్ల్ కలయికలో వచ్చిన చాట్‌జిపిటి గూగుల్‌కు సవాలు విసురుతోంది. మైక్రోసాఫ్ట్‌ తమ బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు చాట్‌జిపిటి సపోర్ట్‌ను యాడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పు తర్వాత బింగ్‌కి యూజర్ల ట్రాఫిక్‌ పెరిగిందని సిమిలర్‌వెబ్‌ అనలిటిక్స్‌ డేటా చెబుతోంది. గూగుల్‌కు గట్టిపోటీ ఇస్తోందని పేర్కొంది. మార్చి 20వ తేదీ వరకు ఉన్న డేటా ప్రకారం.. మైక్రోసాఫ్ట్ ఫిబ్రవరి 7న AI- పవర్డ్ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. అప్పటి నుంచి బింగ్‌ పేజీ విజిట్స్ 15.8 శాతం పెరిగాయి. మరోవైపు Alphabet Inc యాజమాన్యంలో ఉన్న గూగుల్‌ పేజీ విజిట్స్ అదే కాలంలో దాదాపు ఒక శాతం తగ్గాయి. ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవడంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. చాట్‌జిపిటి లాంచ్‌ అయిన వెంటనే గూగుల్‌ తన బార్డ్‌ చాట్‌బాట్‌ గురించి రివీల్‌ చేసింది. రెండు కంపెనీలు ఏఐ టెక్నాలజీపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. అయితే తాజా గణాంకాలు గూగుల్‌తో జరుగుతున్న పోటీలో మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించిందని చెబుతున్నాయి. చాట్‌జిపిటి టెక్నాలజీ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ తన ప్రొడక్టులకు యాడ్‌ చేస్తోంది. ఏఐ రంగంలో చాట్‌జిపిటిని నిపుణులు 'ఐఫోన్ మూమెంట్‌'తో పోలుస్తున్నారు. 120 బిలియన్ల డాలర్లకు పైగా విలువైన సెర్చింగ్‌ మార్కెట్‌లో చాలా సంవత్సరాలుగా 80 శాతానికి పైగా వాటాని గూగుల్‌ శాసిస్తూ వచ్చింది. తాజా గణాంకాలు మైక్రోసాఫ్ట్ ప్రాబల్యాన్ని సంపాదించడానికి అరుదైన ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. డీఏ డేవిడ్‌సన్ & కో అనలిస్ట్ గిల్ లూరియా ప్రకారం.. బింగ్ రాబోయే నెలల్లో సెర్చ్ మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందే అవకాశం ఉంది. గూగుల్ తాను అందిస్తున్న సేవల్లో ఏఐ టెక్నాలజీని చేర్చడం ఆలస్యమవుతున్న కొద్దీ మైక్రోసాఫ్ట్‌ ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏఐ పవర్డ్‌ బింగ్‌ ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. గూగుల్‌ తన చాట్‌బాట్ బార్డ్‌కు గత మంగళవారం లిమిటెడ్‌ యాక్సెస్‌ అందించింది. గూగుల్ మార్కెట్ షేర్‌లో బింగ్‌ పదో వంతు కంటే తక్కువగా ఉంది. ఒక శాతం లేదా రెండు శాతం వినియోగదారులు చేరినా మైక్రోసాఫ్ట్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. AI టెక్నాలజీని యాడ్‌ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బింగ్ యాప్ డౌన్‌లోడ్‌లు ఎనిమిది రెట్లు పెరిగాయని యాప్ రీసెర్చ్‌ కంపెనీ Data.ai పేర్కొంది. అదే సమయంలో గూగుల్‌ సెర్చ్‌ యాప్ డౌన్‌లోడ్‌లు రెండు శాతం తగ్గాయి. సెర్చ్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ ఇటీవల లాభాలు పొందినప్పటికీ, 2000ల ప్రారంభంలో టాప్‌ సెర్చ్‌ ఇంజిన్‌ యాహూను అధిగమించిన గూగుల్, త్వరగా కోలుకోగలదని కొందరు అభిప్రాయపడ్డారు. చాలా కాలంగా గూగుల్‌ టాప్‌ ప్లేస్‌ నిలబెట్టుకున్న తీరును గుర్తు చేస్తున్నారు. ఇతరుల కంటే గూగుల్ ర్యాంకింగ్ అల్గోరిథం పోటీతత్వాన్ని కలిగి ఉంటుందని దక్షిణ కొరియాలోని మిరే అసెట్ సెక్యూరిటీస్‌లో అనలిస్ట్‌ యోంగ్‌జీ జియోంగ్ చెప్పారు. యాహూని దాటడంలో గూగుల్ అల్గారిథం సహాయపడిందని పేర్కొన్నారు.

6జీ ఆర్ & డీ టెస్ట్ బెడ్‌ ఆవిష్కరణ !


న్యూఢిల్లీలో కొత్త ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏరియా ఆఫీస్ మరియు ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ 6G R&D టెస్ట్ బెడ్‌ను ఆవిష్కరించారు. ఇండియాలో 6G R&D టెస్ట్ బెడ్ దేశంలో కొత్త టెక్నాలజీని వేగంగా స్వీకరించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. భారతదేశం 4Gకి ముందు టెలికాం రంగంలో టెక్నాలజీ ని దిగుమతి చేసుకుని మాత్రమే ఉపయోగించేదని, కానీ నేడు, అది ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం టెక్నాలజీని ఎగుమతి చేసే దిశగా పయనిస్తున్నదని ఆయన ఉద్ఘాటించారు. 6G విజన్ డాక్యుమెంట్ అంటే ఏమిటి? డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం  విడుదల చేసిన 6G విజన్ డాక్యుమెంట్ ప్రకారం, 5G టెక్నాలజీ వేగం 40-1,100 Mbps నుండి గరిష్టంగా 10,000 Mbps వరకు వేగాన్ని తాకే సామర్థ్యంతో పనిచేస్తుంది.అదే, 6G టెక్నాలజీ అయితే సెకనుకు 1 టెరాబిట్ వేగంతో అల్ట్రా తక్కువ జాప్యాన్ని అందిస్తుంది. ఇది 5G టాప్ స్పీడ్ కంటే 1,000 రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. 6G టెస్ట్ బెడ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? భారత ప్రధానమంత్రి ఆవిష్కరించిన భారత్ 6G విజన్ డాక్యుమెంట్‌ను వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు, పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు, విద్యాసంస్థలు, స్టాండర్డైజేషన్ బాడీలు, టెలికాం సర్వీస్‌ల సభ్యులతో నవంబర్ 2021లో ఏర్పాటైన 6G (TIG-6G)పై టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ తయారు చేసింది. భారతదేశంలో 6G కోసం రోడ్‌మ్యాప్ మరియు కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి ప్రొవైడర్లు మరియు పరిశ్రమకు ఇది దోహదం చేస్తుంది. భారత్ 6G విజన్ డాక్యుమెంట్ మరియు 6G టెస్ట్ బెడ్ దేశంలో ఆవిష్కరణలు, సామర్థ్యాల పెంపుదల మరియు వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది అని ప్రభుత్వం తెలిపింది. "5G శక్తితో మొత్తం ప్రపంచం యొక్క పని సంస్కృతిని మార్చడానికి భారతదేశం అనేక దేశాలతో కలిసి పని చేస్తోంది" అని PM అన్నారు. "దేశంలోని 100 కొత్త ల్యాబ్‌లు భారతదేశ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా 5G అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. 5G స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, వ్యవసాయం, తెలివైన రవాణా వ్యవస్థలు లేదా హెల్త్‌కేర్ అప్లికేషన్‌లు వంటివి కావచ్చు, భారతదేశం ప్రతి దిశలో వేగంగా పని చేస్తోంది" అని ఆయన తెలిపారు. భారతదేశం యొక్క 5G ప్రమాణాలు గ్లోబల్ 5G సిస్టమ్స్‌లో భాగమని, భవిష్యత్ టెక్నాలజీల ప్రామాణీకరణ కోసం భారతదేశం కూడా ITUతో కలిసి పని చేస్తుందని అన్నారు. భారతదేశం 127 6G పేటెంట్లు పొందింది, ఇంకా కొనసాగుతోంది. భారతదేశం ప్రస్తుతం 6G టెక్నాలజీ విభాగంలో 127 గ్లోబల్ పేటెంట్లను కలిగి ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన ప్రకటనల ప్రకారం, ఈ దశాబ్దం చివరి నాటికి భారత దేశంలో 6Gని లాంచ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ప్రధాని మోడీ చెప్పారు.

Popular Posts