Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, June 30, 2022

మార్స్‌ డస్ట్‌పై అధ్యయనం చేస్తున్న పర్సవరెన్స్ రోవర్ !

 

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ  గతేడాది మార్స్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఇందులో మార్స్ పర్సవరెన్స్ రోవర్ కూడా ఉంది. ఈ రోవర్ 2021లో ల్యాండింగ్ అయినప్పటి నుండి రాక్ శాంపిల్స్‌ను సేకరిస్తోంది. మార్స్‌పై డస్ట్ తో కూడిన కఠినమైన వాతావరణం ఉన్నప్పటికీ పర్సవరెన్స్ రోవర్ దాని పరిశీలనకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. పర్సవరెన్స్‌ రోవర్ అంగారకుడిపై దిగి 200 రోజులకు పైగా గడిచింది. మార్స్‌పై కఠినమైన వాతావరణం ఉన్నట్లు సమాచారం. మార్స్ పై పర్సవరెన్స్ రోవర్ ల్యాండ్ అయిన జెజెరో బిలంలో భారీ సుడుగాలులు, డస్ట్ డెవిల్స్ తో కూడిన కఠిన వాతావరణం ఉంది. ప్రస్తుతం రోవర్ ఈ డస్ట్ డెవిల్స్ పై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఇది శాస్త్రవేత్తలకు పలు విషయాలను అందించింది. దీనికి సంబంధించి రోవర్ యొక్క 216 రోజుల ప్రయాణం మరియు దాని ఆవిష్కరణలను డాక్యుమెంట్ చేస్తూ, సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఓ అబ్జర్వేషన్ ప్రచురించబడింది. గ్రహంపై ఉన్న డస్ట్ ప్రాసెసర్‌ను బాగా అర్థం చేసుకోవడానికి, వాటిని అంచనా వేయడంలో కూడా ఈ రోవర్ చేసిన ఆవిష్కరణలు బాగా సహాయపడుతున్నట్లు నాసా  పేర్కొంది.  పర్సవరెన్స్ రోవర్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అనేక సెన్సార్లు మరియు పరికరాలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఈ సెన్సార్ లు మార్స్ వాతావరణంలోని గాలి, మరియు చుట్టూ ఉన్న సుడిగుండాలను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. పర్సవరెన్స్ రోవర్ మార్స్ గ్రహం మీద కనీసం నాలుగు సుడిగుండాలను ఎదుర్కొన్నట్లు నాసా నివేదిక పేర్కొంది. ఈ గాలుల వల్ల ఏర్పడిన కొన్ని ధూళి మేఘాలు 4 చదరపు కిలోమీటర్ల మేర పెద్దగా ఉన్నాయి. ఈ పరిస్థితులు శాస్త్రవేత్తలకు పలు ప్రత్యేకమైన విషయాలపై అవగాహన కల్పించేందుకు వీలు కల్పిస్తుందని నాసా నివేదిక వెల్లడించింది. "మేం అంగారకుడిపై కొత్త ప్రదేశంలో దిగిన ప్రతిసారీ, గ్రహం యొక్క వాతావరణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశంగా అది ఉపయోగపడుతుంది. జనవరిలో దుమ్ముతో కూడిన తుఫాను ను ఎదుర్కొన్నాం. కానీ మేము ఇప్పటికీ దుమ్ము తో కూడిన సీజన్ కొనసాగుతోంది. కాబట్టి మరిన్ని దుమ్ము తో కూడిన తుఫానులను ఎదుర్కొనే అవకాశం ఉంది" అని రోవర్ అధ్యయనానికి సంబంధించిన కీలక సభ్యుడు క్లైర్ న్యూమాన్ చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో అంగారక గ్రహం మీదికి నాసా పర్సవరెన్స్ రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే. మార్స్‌పై ఉన్న రాక్ నమూనాలను సేకరించడం, భూభాగాన్ని విశ్లేషించడం మరియు రెడ్ ప్లానెట్‌లో పూర్వపు సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆధారాలను కనుగొనడమే ప్రాథమిక లక్ష్యంగా NASA రోవర్ ను పంపింది. జెజెరో బిలంలో ల్యాండ్ అయిన కొద్ది రోజులకే ఈ రోవర్ పలు అద్భుతాలను సృష్టించింది. అంగారక గ్రహంపై ఇన్‌జెన్యూనిటీ హెలికాప్టర్‌ను నడిపించి అద్భుతాన్ని సృష్టించి రోదసి పరిశోధనల్లో కొత్త చరిత్రను సృష్టించింది. భూమిపై నుంచి నియంత్రిస్తూ భూమిపై కాకుండా మరో గ్రహంపై హెలికాప్టర్‌ను నడపడం చరిత్రలో ఇదే ప్రథమం. ఇన్‌జెన్యువిటీ అంగారక గ్రహం ఉపరితలానికి 3 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న దృశ్యాలను పర్సవరెన్స్‌ రోవర్‌ 65 మీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసి నాసాకు పంపించింది. ఇన్‌జెన్యునిటీ తొలిసారి ఎగిరినపుడు 30 సెకండ్ల పాటు విహరించింది. దీంతో అప్పట్లో నాసా తమ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇన్‌జెన్యునిటి బరువు 1.8 కిలోలు. పర్సవరెన్స్‌తో పాటే దీనిని 28.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్‌ మీదకు పంపించారు. ఇప్పటికే ఈ రోవర్ చాలా వరకు మార్స్‌పై అరుదైన చిత్రాలను పంపింది. అంతేకాకుండా రోవర్ మార్స్ గ్రహం మీద నీటి మంచు ప్రదేశాలను కనుగొన్నట్లు పరిశోధన తెలిపింది. అంగారక గ్రహం మీద చాలా ప్రదేశాలలో నీటి మంచు నిక్షేపాలు ఉపరితలానికి కొంచెం తక్కువలో ఉన్నట్లు కనుగొన్నారు.

ఆంబ్రేన్ నుంచి భారీ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ !


ఆంబ్రేన్ మొట్టమొదటి హెవీ-డ్యూటీ, పవర్-ప్యాక్డ్ 50000mAh స్టైలో మ్యాక్స్ పవర్ బ్యాంక్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనితో డిజిటల్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటి పెద్ద డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి భారీ పవర్‌బ్యాంక్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను అనేకసార్లు ఫుల్ ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ బ్యాకప్ సొల్యూషన్ టెక్ ఎక్స్‌పర్ట్స్‌ను సైతం ఆకర్షిస్తోంది. ఇది బ్లూ, బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్రొడక్ట్ 180 రోజుల వారంటీతో వస్తుంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆంబ్రేన్ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ ధర రూ.3,999 మాత్రమే కావడం విశేషం. స్టైలో మ్యాక్స్ 50k mAh పవర్ బ్యాంక్‌ను టఫ్ ఎక్స్‌టీరియర్ అవుటర్ బాడీతో రూపొందించారు. తొమ్మిది లేయర్‌ల సుపీరియర్ చిప్‌సెట్ ప్రొటెక్షన్‌తో తీర్చిదిద్దారు. ఇది వేడెక్కడం, షార్ట్ సర్క్యూట్‌ వంటి ప్రమాదాల నుంచి అదనపు రక్షణ అందిస్తుంది. ఇండియాలోనే తయారు చేసిన ఈ లోకల్ పవర్‌బ్యాంక్‌ను హై గ్రేడియంట్ మాట్టే మెటాలిక్ కేసింగ్‌లో నిక్షిప్తం చేశారు. ఇది కాంపాక్ట్‌గా, దృఢంగా ఉంటుంది. ఈ డివైజ్‌ను ఎవరైనా ఎక్కడికికైనా తీసుకెళ్లవచ్చు. ఈ భారీ పవర్‌బ్యాంక్‌కు 20W పవర్ అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుంది. అద్భుతమైన ఛార్జింగ్ స్పీడ్, క్విక్ ఛార్జ్ 3.0 కోసం ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఈ హై-డెన్సిటీ పవర్ బ్యాంక్.. హై-స్పీడ్ టూ-వే ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి కనెక్ట్ చేసిన ప్రతి డివైజ్‌ను సురక్షితంగా ఛార్జ్ చేయడానికి పవర్ అవుట్‌పుట్‌ను ఆటోమెటిక్‌గా కంట్రోల్ చేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌తో ఈ పవర్‌బ్యాంక్‌ను ఎక్స్‌పోనెన్షియల్ రేటుతో ఛార్జ్ చేయవచ్చు. దీని గరిష్ట అవుట్‌పుట్ కరెంట్ 5V/2.4A. పవర్ బ్యాంక్ అధిక సామర్థ్యాన్ని (high efficiency) ఎనేబుల్ చేస్తుంది. 20W క్విక్ ఛార్జింగ్‌ కన్వర్షన్ రేట్‌తో ఛార్జ్ చేస్తుంది. దీనికి రెండు USB, ఒక టైప్-C కనెక్షన్‌ పోర్ట్‌ ఉన్నాయి. ఈ కెపాసిటీతో పవర్‌బ్యాంక్ ఒకే సమయంలో అనేక డివైజ్‌లను ఛార్జ్ చేయగలదు. ఈ పవర్‌బ్యాంక్ లాంచ్‌పై ఆంబ్రేన్ ఇండియా డైరెక్టర్ సచిన్ రైల్‌హాన్ మాట్లాడారు. కస్టమర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ ప్రొడక్ట్‌ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'కొంతమంది ప్రయాణాలు, క్యాంపులను ఎక్కువగా ఇష్టపడతారు. వారికి మా 50k mAh స్టైలో మాక్స్‌ ఎంతో ఉపయోగపడుతుంది. దీని భారీ సామర్థ్యంతో ప్రయాణాల్లో ఊహించని ఛార్జింగ్ సర్వీస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు.' అని సచిన్ తెలిపారు 

వోడాఫోన్ జీపీఎస్ ట్రాకింగ్ కొత్త ప్రోడక్ట్ 'కర్వ్' !


వోడాఫోన్ తన వినియోగదారులకు 'కర్వ్' అనే ట్రాకింగ్ కొత్త ప్రొడెక్టుని తీసుకొచ్చింది.  ఈ స్మార్ట్ జీపీఎస్ ట్రాకర్ అనేది దాదాపు దేనికైనా జోడించడానికి వీలుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. జీపీఎస్  ట్రాకింగ్ ప్రోడక్ట్ అనేది తరచుగా తమ వస్తువులను పోగొట్టుకునే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఉత్పత్తితో వినియోగదారులు అన్ని రకాల విషయాలను ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మీ యొక్క పెంపుడు జంతువులను కూడా ట్రాక్ చేయగలదు. ఇది అంతర్నిర్మిత జీపీఎస్ వ్యవస్థను కలిగి ఉంటుంది. దీని యొక్క ఫీచర్‌లలో ముఖ్యమైనది పోగొట్టుకున్న ఏదైనా వస్తువులను కనుగొనడానికి వీలుగా ఇది శీఘ్ర హెచ్చరిక మరియు బీప్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ట్రాకర్ వాటర్ రెసిస్టెన్స్ ని కూడా కలిగి ఉంటుంది. ఇది బ్యాటరీతో రన్ అవుతూ ఉంటుంది. దీని యొక్క బ్యాటరీ ఆన్‌లో ఉన్నత కాలం విభిన్న ట్రాకింగ్ మోడ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఇది కీరింగ్ యాక్సిస్సోరీతో జోడించబడి ఉంటుంది. ఇది కీరింగ్‌ను ఒక ముఖ్యమైన వస్తువుతో లేదా మీ పెంపుడు జంతువు కాలర్‌తో జోడించడం ద్వారా ట్రాకింగ్ చేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ ట్రాకర్‌ని ఉపయోగించడానికి మీకు సబ్‌స్క్రిప్షన్ అవసరం. ఈ కొత్త ప్రోడక్ట్ అనేది స్మార్ట్ సిమ్‌ని కలిగి ఉంటుంది. ఇది నిరంతరం కంపెనీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. తద్వారా స్మార్ట్ డివైస్ అన్ని రకాల ఫీచర్‌లను ఉపయోగించగలదు మరియు మీ ఫోన్‌కి ఎప్పటికప్పటి అప్‌డేట్‌లను పంపగలదు. SIM ప్రమేయం ఉన్నందున ఫోన్ మరియు ట్రాకర్ మధ్య అధిక దూరం ఉన్నప్పటికీ కూడా డేటా బదిలీ చేయబడుతుంది. ట్రాకింగ్ డేటాను చూడటానికి వినియోగదారులు వోడాఫోన్ స్మార్ట్ యాప్‌ను మీ యొక్క ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది వోడాఫోన్ యొక్క స్మార్ట్ SIMకి మద్దతు లేని దేశంలో ఉపయోగించగల ఉత్పత్తి కాదు. ఇండియాలో వోడాఫోన్ నెట్ వర్క్ అందుబాటులో ఉన్నకారణంగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ఈ పరికరాన్ని కొనుగోలు చేసి దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో వంటి ఇతర ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు వోడాఫోన్ వెబ్‌సైట్‌లో కర్వ్ ప్రోడక్ట్ పేజీని సందర్శించవచ్చు. తరచుగా అడిగే ప్రశ్నల విభాగంలో వోడాఫోన్ కర్వ్‌కు సంబంధించి మీకు అవసరమైన దాదాపు ప్రతి సమాధానాన్ని మీరు పొందుతారు. జీపీఎస్  ట్రాకింగ్ 'కర్వ్' ప్రోడక్ట్ అనేది రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఉత్తమ మార్గం కాదు. ఎందుకంటే ఇది బ్యాటరీతో పనిచేస్తుంది కావున బ్యాటరీ అనేది చాలా వేగంగా ఖాళీ చేయబడుతుంది. కానీ వినియోగదారులు వారి యొక్క ముఖ్యమైన వస్తువులను తరచూ ట్రాక్ చేయడం కోసం మార్కెట్ లో లభించే ఆపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు మరిన్ని ఇతర ఉత్పత్తులను ఉపయోగించుకోవచ్చు.

అంతరిక్షంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు ?


సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసిపట్టాలని చైనా భావిస్తోంది. స్పేస్‌లోనే సోలార్‌ పవర్ ప్లాంట్‌ నిర్మించేందుకు సిద్ధం అయింది. కరెంట్ లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. అందుకే విద్యుత్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. పునరుత్పాదక విద్యుత్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యరశ్మి ఆధారంగా సోలార్ ఎనర్జీ క్రియేట్‌ చేస్తున్నారు. ఐతే సోలార్‌ పవర్ ప్లాంట్లను ఇప్పటివరకు భూమిపైనే చూశాం కదా.. 2028లోగా అంతరిక్షంలోనూ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే డ్రాగన్.. ఇప్పుడు ప్రయోగంతో మరోసారి చర్చకు దారి తీసింది. స్పేస్‌లో సూర్యరశ్మిని ఉపయోగించుకొని… భూమ్మీదకు ఎలా పంపుతారు.. అసలీ ప్రయోగం వెనక చైనా అసలు వ్యూహం వేరే ఉందా అన్న అనుమానం మొదలైంది. భూమిపై ఉండే సోలార్ ప్లాంట్‌లో తయారయ్యే విద్యుత్‌ను మానవ అవసరాలకు వినియోగిస్తున్నారు. ఐతే అంతరిక్షంలో పెట్టే సోలార్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ను.. వివిధ కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాల కరెంటు అవసరాలను తీర్చేందుకు ఉపయోగిస్తారు. సౌర విద్యుత్‌ను ముందు సాధారణ కరెంట్‌గా.. ఆ తర్వాత మైక్రోవేవ్‌లుగా మార్చి భూమికి పంపే పరిజ్ఞానం కూడా చైనా ఏర్పాటు చేయనున్న అంతరిక్ష సోలార్ ప్లాంట్‌లో ఉంటుంది. ఒకవేళ ఈవిధంగా సోలార్ ప్లాంట్ పనిచేయగలిగితే… అది పెద్ద అద్భుతమే అవుతుంది. ఎండ ఉన్నంత వరకు మాత్రమే భూమ్మీద సోలార్‌ ప్లాంట్‌లు పనిచేస్తాయ్. స్పేస్‌లో అలా కాదు.. 24 గంటలు సూర్యరశ్మి అందుబాటులోనే ఉంటుంది. ఇప్పుడు చైనా ప్రయోగం సక్సెస్ అయితే.. అంతరిక్ష ప్రయోగాల్లో మరో మెట్టు ఎక్కినట్లే ! చైనా స్పేస్ సోలార్‌ ప్రాజెక్ట్.. ఇప్పటికే ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 2028నాటికి ఈ ప్లాంట్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అంచనా సమయం కంటే రెండేళ్ల ముందే పూర్తి చేయాలని భావిస్తోంది. సౌర అంతరిక్ష కేంద్రంలో సౌర శక్తిని చైనా విద్యుత్ మైక్రోవేవ్‌లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ ద్వారా స్థిరమైన ప్రదేశాల్లో పవర్ లేజర్స్ భూమికి పంపించే అవకాశం ఉంది. అంతరిక్ష సోలార్ ప్లాంట్ సామర్ధ్యం 10 కిలోవాట్లు. దీనికి సంబంధించిన నమూనా ప్లాంట్‌ను చైనాలోని శిడియన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసి పనితీరును పరీక్షించారు. ఈ సోలార్ స్టేషన్… భూమికి సౌరశక్తిని రవాణా చేయగలదని గుర్తించారు. సోలార్‌ పవర్ స్టేషన్ అనేది 75 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతరిక్ష జియో స్టేషనరీ ఆర్బిట్‌లో ఈ సోలార్ ప్లాంట్‌ను చైనా ఏర్పాటు చేయనుంది. చైనాలోని చొంగ క్వీన్గ్ నగరంలో 33 ఎకరాల విస్తీర్ణంలో అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్ నమూనాను ఏర్పాటు చేసి అధ్యయనం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అంతరిక్షం నుంచి భూమికి మైక్రో వేవ్ రూపంలో విద్యుత్ ను పంపితే ఏవైనా అనర్ధాలు ఉంటాయా ? మైక్రోవేవ్‌ రేడియేషన్ సంభవిస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సోలార్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి జనరేట్ అయ్యే విద్యుత్.. కృత్రిమ ఉపగ్రహాల కరెంట్‌ అవసరాలను తీర్చగా.. మిగిలే విద్యుత్‌ను సోలార్‌ బీమ్‌ రూపంలో భూమిపైకి ప్రసరింపజేస్తారు. భూమిపై నిర్మించిన ప్రత్యేక కేంద్రాలు వాటిని ఒడిసిపట్టి కరెంట్‌ రూపంలో నిక్షిప్తం చేస్తాయి. అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా వంటి మేటి దేశాలకు దీటుగా చైనా అనేక ఘనవిజయాలు సాధించింది. చంద్రుడి నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకురావడంలో సక్సెస్ అయింది. అత్యంత కఠినమైన అంగారక గ్రహంపై… మొదటి ప్రయత్నంలోనే ల్యాండ్ అవడమే కాదు.. రోవర్‌ను నడిపించి పరిశోధనలు చేపట్టడం.. రోదసి పరిశోధన రంగంలో డ్రాగన్ అభివృద్ధికి నిదర్శనం. ఇలాంటి సమయంలో మరో కీలక ప్రయోగానికి, ప్రయత్నానికి చైనా సిద్ధం అయింది. 

దేశీయ మార్కెట్లో అతి త్వరలో రానున్న ఒప్పో రెనో 8 ?


ఒప్పో సబ్ బ్రాండ్ రెనో నుంచి 8 సిరీస్ వచ్చేస్తోంది. దేశీయ మార్కెట్లో అతి త్వరలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ కొత్త సిరీస్‌లో Oppo 8, Oppo 8 Pro రెండు వేరియంట్లు ఉండనున్నాయి. అయినప్పటికీ చైనాలో అందుబాటులో Oppo Reno 8 Pro+ సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దేశంలో ఒప్పో రెనో 7 సిరీస్‌ను లాంచ్ చేసిన దాదాపు 4 నెలల తర్వాత Reno 8 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. Oppo అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. లాంచింగ్ ముందే.. Oppo అధికారిక వెబ్‌సైట్‌లో రెనో 8 సిరీస్‌కి మైక్రోసైట్‌ను లైవ్ చేసేసింది. Oppo Reno 8 Pro వీడియో స్టిల్ ఫొటోలకు MariSilicon X చిప్‌తో వస్తోందని కంపెనీ వెల్లడించింది. Oppo Reno 8 స్పెసిఫికేషన్‌లు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయని తెలిపింది. రెనో 8 ప్రో, ఇతర ఫీచర్ల వివరాలను కూడా త్వరలో రివీల్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే, Oppo Reno 8, Oppo Reno 8 Pro రెండూ చైనాలో అందుబాటులో ఉన్నాయి. కానీ, భారత మార్కెట్లోకి మాత్రం నిర్దిష్ట మోడల్స్ అదే స్పెసిఫికేషన్‌లతో లాంచ్ కానున్నాయి. Oppo Reno 8 రెగ్యులర్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుందని ఆశించవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC, 50-MP ప్రైమరీ సెన్సార్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్, 80W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని అందించే 4,500mAh బ్యాటరీ ఉంటుందని నివేదిక తెలిపింది. Reno 8pro మోడల్ 6.62-అంగుళాల పూర్తి-HD+ AMOLED E4 డిస్‌ప్లే, Qualcomm Snapdragon 7 Gen 1 SoCతో వచ్చే అవకాశం ఉంది. ఇతర ముఖ్య ఫీచర్లలో గరిష్టంగా 256GB వరకు UFS 2.2 స్టోరేజ్, 50-MP ప్రైమరీ సెన్సార్, 80W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో రానుంది. ఇంకా ధర వివరాలను రివీల్ చేయనేలేదు ఒప్పో. అయితే Oppo Reno 8 రెగ్యులర్ బేస్ వేరియంట్‌కు రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ రెనో ప్రో ధర రూ. 35,000 నుంచి రూ. 40,000 వరకు ఉండవచ్చు. ప్రస్తుతం, రెనో 7 ప్రో 5G సింగిల్ 8GB RAM, 258GB స్టోరేజీకి రూ.39,999 వరకు ఉండవచ్చు. Reno 7 5G వేరియంట్ ధర రూ. 28,999గా ఉండనుంది.

Wednesday, June 29, 2022

ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి


ఆంధ్రప్రదేశ్ లోని కడప ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి శాస్త్ర, సాంకేతిక రంగంలో అత్యుత్తమ పరిశోధనలు చేసినందుకుగాను ఏడీ సైంటిఫిక్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ పరిశోధకుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఏ) లో భౌతికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన సాధించిన విజయానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ రవీంద్రనాథ్, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఏజీ సైంటిఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌ ప్రకారం డాక్టర్‌ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి అంతర్జాతీయంగా 19,034వ ర్యాంక్, ఆసియా స్థాయిలో 4,302, జాతీయ స్థాయిలో 972 వ, కళాశాలల వారీగా మొదటి స్థానంలో నిలిచారు. ఎస్‌సీఐ పరిశోధన పత్రాలు, స్కోపస్ హెచ్‌-ఇండెక్స్, ఐ-10 సూచిక, సిటేషన్స్‌, ఓఆర్‌సీఐడీ, వెబ్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, గూగుల్‌ స్కాలర్ డాటా బేస్ ఆధారంగా ర్యాంకింగ్‌లు నిర్ణయిస్తారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి.. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ నుంచి 1992 లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివారు. 2005 లో ఎంఫిల్‌, 2008 లో పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. సాలిడ్ స్టేట్ స్పెక్ట్రోస్కోపీ అండ్‌ మెటీరియల్ సైన్స్‌పై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందారు. అతను 25 సంవత్సరాల కంటే ఎక్కువ బోధనా అనుభవం, 15 సంవత్సరాల పరిశోధన అనుభవం కలిగి ఉన్నారు. ఎస్వీ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం అధిపతిగా ఐదేండ్లపాటు పనిచేశారు. 2008 లో రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2017 లో ఎన్‌ఈఎస్‌ఏ నుంచి ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు. 2005 లో ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ఫెలోగా గుర్తింపు పొందారు. దక్షిణ కొరియా, స్వీడన్, ఫిన్‌లాండ్, హాంకాంగ్, దక్షిణాఫ్రికాలో విజిటింగ్ సైంటిస్ట్‌గా పనిచేశారు. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు.

ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు రోజులు వస్తుంది నోకియా G11 ఫోన్ !


నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. నోకియా G11 ఫోన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది.  బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఈ ఫోన్ రెండు ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందించనుంది. అంతేకాదు.. అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో రానుంది. ఒకసారి చార్జింగ్ పెడితే.. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ బ్యాకప్‌ను అందిస్తుంది. యూజర్లు మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందవచ్చు. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. నోకియా అంతర్జాతీయ వెబ్‌సైట్‌లో Nokia 11 స్మార్ట్‌ఫోన్‌ లిస్టు చేసింది. దీని ధర భారత మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఈ ఫోన్‌లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. చార్‌కోల్ గ్రే లేక్ బ్లూ కలర్స్. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే పొందవచ్చు. ఈ ఫోన్ నోకియా G11 కన్నా ఖరీదైనదిగా చెబుతారు. ఫిబ్రవరిలో AED 499 వద్ద లాంచ్ అయింది. దీని ధర దాదాపు రూ. 10,700గా ఉంటుంది. నోకియా G11 ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్‌, 6.51-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. Nokia G11 Plus Nokia ఫోన్ ప్రాసెసర్ అందిస్తోంది. ఈ ఫోన్ 4GB RAM 64GB స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌తో 512GB వరకు పెంచుకోవచ్చు. Nokia G11 Plus 50-MP ప్రైమరీ సెన్సార్, 2-MP సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. కెమెరా మాడ్యూల్‌లో LED ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం.. 8-MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ప్రామాణిక కనెక్టివిటీ ఆప్షన్లతో వచ్చింది. 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ ఉంది. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. Nokia G11 Plus 8.55mm, 192 గ్రాముల బరువు ఉంటుంది.

డ్రైవర్ ను అలర్ట్ చేసే పరికరం !


తమ కళ్లెదుటే సైకిల్ పై వెళ్తున్న ఓ విద్యార్థి మీది నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన తర్వాత ఆ స్టూడెంట్స్ ఒక టీమ్ గా ఏర్పడ్డారు. దానికి “హిఫాజత్” అని పేరు పెట్టుకున్నారు. పాఠశాల యాజమాన్యం కూడా వారికి వెన్నుదన్నుగా నిలిచింది. దీంతో రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు దోహదం చేసే ఓ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణను గురుగ్రామ్ లోని శివ నాడార్ స్కూల్ కు చెందిన స్టూడెంట్స్ దియా సరీన్, అర్జున్ శెలట్, లక్షయ్ బజాజ్, అనావీ శర్మ ఆక్షిత అగర్వాల్, గౌరీ కపూర్ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు.. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం. విరామం తీసుకోకుండా గంటల తరబడి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా డ్రైవర్లకు నిద్రమత్తు కమ్ముకొస్తుంది. నిద్రమత్తు లో డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పోయే పెనుముప్పు ఉంటుంది.సరిగ్గా ఇటువంటి సమయాల్లో డ్రైవర్లను అప్రమత్తం చేయడమే విద్యార్థుల కొత్త పరికరం ప్రత్యేకత. విద్యార్థులు తయారు చేసిన ఈ పరికరంలో Raspberry Pi 4 అనే సాఫ్ట్ వేర్ ఉంటుంది. దీని సాయంతో అది మినీ కంప్యూటర్ లా పనిచేస్తుంది. Raspberry Pi 4 అనే సాఫ్ట్ వేర్ కోడింగ్ లో ఉండే అల్గారితం ఎంతో ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇది వాహన డ్రైవర్ మొహాన్ని నిరంతరం వీడియో తీస్తుంది. డ్రైవర్ నోరు, కళ్ల కదలికల్లో వచ్చే తేడాలను అతి సూక్ష్మ స్థాయిలో గుర్తిస్తుంది. ఇందులో నైట్ విజన్ కెమెరాలు కూడా ఉంటాయి. ఒకవేళ డ్రైవర్ నోటితో గురక పెట్టినట్టు అనిపించినా.. కళ్ళు మూసుకుపోతున్నట్లు కనిపించినా వెంటనే అలారం మోగించి అలర్ట్ చేస్తుంది. ఈ సమాచారాన్ని ఆ వాహన యజమానికి కూడా మెసేజ్ రూపంలో పంపుతుంది. జీపీఎస్ టెక్నాలజీ తో లొకేషన్ వివరాలను కూడా షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పరికరం ధర 4వేల రూపాయల ధర ఉంటుందని అంటున్నారు. భవిష్యత్ లో దీన్ని పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తే 2వేలకే లభిస్తుందని చెబుతున్నారు.

Infinix నుంచి180W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మొబైల్స్?



యూజర్లు తమ మొబైల్స్‌లో ఫాస్ట్‌ ఛార్జింగ్ విధానాల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో యూజర్ల అవసరానికి అనుగుణంగా పలు కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించి కొత్త మోడల్స్‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభించాయి. తాజాగా Infinix కంపెనీ అత్యధికంగా 180వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తోనట్లు ఇటీవల అందుకు సంబంధించిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించడం విశేషం. Infinix సంస్థ Facebook వేదికగా ఒక చిన్న క్లిప్ ద్వారా కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన దృశ్యాన్ని విడుదల చేసింది. 180W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రేటింగ్ కలిగిన, దీనిని "థండర్ ఛార్జ్ సిస్టమ్" అని పేరు పెట్టింది. Infinix సాధించిన వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ అని అందులో పేర్కొంది. OnePlus మరియు Realme వంటి ఇతర ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లను 150W వరకు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో షిప్పింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇన్ఫినిక్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కు సంబంధించి ఈ అప్‌డేట్ చేయడం విశేషం. మరోవైపు, ఇప్పటికే Vivo సబ్-బ్రాండ్ iQoo కూడా 200W ఛార్జింగ్ టెక్నాలజీ తో iQoo 10 ప్రోని ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని పలు రూమర్స్ వచ్చాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బెంజమిన్ జియాంగ్ 10-సెకన్ల చిన్న వీడియోను పంచుకున్నారు, దీనిలో స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కనిపిస్తుంది. జియాంగ్ మాట్లాడుతూ, "థండర్ ఛార్జ్" అనేది కంపెనీ ఇప్పటివరకు చేసిన అత్యంత వేగవంతమైన ఛార్జ్ అని చెప్పారు. గత సంవత్సరం రూపొందించిన Infinix కాన్సెప్ట్ ఫోన్ 2021లో గరిష్టంగా 160W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు కేవలం 10 నిమిషాల్లో 4,000mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. కాగా, ఇప్పటికే OnePlus మరియు Realme వంటి ఇతర ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు  ఇప్పటికే తమ స్మార్ట్‌ఫోన్‌లను 150W వరకు ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో షిప్పింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇన్ఫినిక్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కు సంబంధించి ఈ అప్‌డేట్ చేయడం విశేషం.

పెద్ద స్మార్ట్ టీవీ లాంచ్ చేయనున్న వన్ ప్లస్ ?


ఏప్రిల్ లో బడ్జెట్ ధరలో Y1S Pro సిరీస్ 4K టీవీ ని తీసుకొచ్చిన వన్ ప్లస్, మరొక పెద్ద టీవీని ఈ బడ్జెట్ సిరీస్ నుండి విడుదల చేయడానికి సిద్దమవుతోంది. OnePlus 50 Y1S Pro  ఈ స్మార్ట్ టీవీని అతి త్వరలో లాంచ్ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ ని ఇంకా ప్రకటించనప్పటికీ ఈ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం టీజర్ ద్వారా బయటపెట్టింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ని అమెజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. స్మార్ట్ టీవీ వివరాల్లోకి వెళితే, వన్ ప్లస్ ప్రస్తుతానికి ఈ స్మార్ట్ టీవీ లాంచ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ టీవీ యొక్క కీలకమైన వివరాలను మాత్రం వెల్లడించింది. ఈ వెల్లడించిన ఫీచర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ దాదాపుగా దీనికి ముందుగా వచ్చిన 43 Y1S Pro మాదిరిగా కనిపిస్తోంది. అయితే, మరిన్ని కొత్త ఫీచర్లను జత చేసినట్లు కూడా కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ HDR 10 Decoding మరియు అతిసన్నని అంచులు (బెజెల్ లెస్) డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ AI-Powered విజువల్స్ ను అందిస్తుంది. అంటే, MEMC, డైనమిక్ కాంట్రాస్ట్, కంటెంట్ ఆప్టిమైజేషన్ వంటి వాటి సహాయంతో గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ని మరింత పెంచడానికి స్మార్ట్ మేనేజ్మెంట్ అప్షన్ ను కూడా జతచేసినట్లు చెబుతోంది. ఈ OnePlus స్మార్ట్ టీవీ, వన్ ప్లస్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ మరియు బ్లూటూత్ డివైజ్ లకు ఎటువంటి అంతరాయం లేని సీమ్ లెస్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 24W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుందని వన్ ప్లస్ టీజర్ ద్వారా వేల్లడించింది.

Tuesday, June 28, 2022

ఎలాన్ మస్క్ బర్త్ డే స్పెషల్ !


2022 జూన్ 28కి ఎలాన్‌ మస్క్‌ 51 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎలాన్‌ మస్క్‌ కొంత కాలంగా ట్విట్టర్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ట్విట్టర్ నుంచి విరామం తీసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఆయనకు ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టెక్నాలజీ ప్రపంచంలో మస్క్ తన వినూత్న ఆలోచనలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే మస్క్, 100 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న గోల్డెన్ ఫిగర్‌ను చేరుకున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఆయన వ్యాఖ్యలను చాలా మంది ఫాలో అవుతుంటారు. ఆయన ట్వీట్‌ చేసిన కొటేషన్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఏదైనా స్టార్టప్‌ కంపెనీలోకి అడుగుపడితే అక్కడి టెకీల నోటి వెంట 'అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం' అనే ఎలాన్‌ మస్క్‌ కొటేషన్స్ వినిపిస్తాయి. మీకు కూడా ఎలాన్‌ మస్క్‌ను, ఆయన వర్క్ స్టైల్‌ను ఫాలో అవుతుంటే.. కొత్త ప్రొడక్ట్‌ను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా వెంచర్‌ను ప్రారంభించేటప్పుడు ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని పొందడానికి గుర్తు చేసుకోగల ఎలాన్‌ మస్క్‌ బెస్ట్‌ కొటేషన్స్ ఇవే..

* వ్యవస్థాపకుడిగా ఉండటం అంటే గ్లాస్‌ తినడం, మరణం అగాధంలోకి చూస్తూ ఉండటం లాంటిది

* మీరు సహ-వ్యవస్థాపకులు లేదా సీఈవో అయితే, మీరు చేయకూడదనుకునే అన్ని రకాల పనులను మీరు చేయాల్సి ఉంటుంది.. మీ పనులను చేయకపోతే, కంపెనీ విజయం సాధించదు.. ఏ పనీ తక్కువ కాదు

* నేను కంపెనీలను సృష్టించాలనే కోరికతో వాటిని ఏర్పాటు చేయడంలేదు. పనులను పూర్తి చేయడం కోసం చేశాను.

* వ్యాపారాన్ని ప్రారంభించడం, అభివృద్ధి చేయడం అనేది విక్రయించే ప్రొడక్ట్‌ వెనుక ఉన్న వ్యక్తుల ఆవిష్కరణ, నియంత్రణ, సంకల్పం.

* నరకంలా పని చేయండి. నా ఉద్దేశంలో ప్రతి వారం 80 నుంచి 100 గంటలు పని చేయాలి. ఇది విజయం అసమానతలను మెరుగుపరుస్తుంది. ఇతర వ్యక్తులు వారానికి 40 గంటలు పని చేస్తుంటే.. మీరు 100 గంటలపాటు పని చేస్తుంటే.. అదే పని చేస్తున్నప్పటికీ, వారు సాధించడానికి సంవత్సరానికి పట్టే దానిని మీరు నాలుగు నెలల్లో సాధిస్తారని తెలుసుకుంటారు.

* ఎప్పుడూ నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌పై శ్రద్ధ వహించండి, దానిని అభ్యర్థించండి, ముఖ్యంగా స్నేహితుల నుంచి.. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

* మీరు ఒక కంపెనీని క్రియేట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటే, అది కేక్ తయారు చేయడం లాంటిది. మీరు అన్ని పదార్థాలను సరైన నిష్పత్తిలో ఉపయోగించాలి.

* సాధ్యమైనంత వరకు, MBAలను నియమించుకోవడం మానుకోండి. MBA ప్రోగ్రామ్‌లు కంపెనీలను ఎలా సృష్టించాలో ప్రజలకు బోధించవు.

* ఇంటర్నెట్‌లోని చాలా ముఖ్యమైన అంశాలు నిర్మించారని భావిస్తున్నాను. కచ్చితంగా ఆవిష్కరణ కొనసాగుతుంది, కానీ ఇంటర్నెట్‌తో గొప్ప సమస్యలు తప్పనిసరిగా పరిష్కారమయ్యాయి.

* ప్రతిభ చాలా ముఖ్యమైనది. ఇది స్పోర్ట్స్ టీమ్ లాంటిది, అత్యుత్తమ వ్యక్తిగత ఆటగాడు ఉన్న జట్టు తరచుగా గెలుస్తుంది, అయితే ఆ ఆటగాళ్లు ఎలా కలిసి పని చేస్తారు, వారు ఉపయోగించే వ్యూహం ఏంటనే దాని ఆధారంగా విజయాలు రెట్టింపు అవుతాయి.

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు


హర్యానాలోని అమిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఎన్‌95 మాస్కును తయారు చేశారు. నాలుగు పొరలతో కూడిన ఈ మాస్కును తిరిగి వినియోగించవచ్చు. ఉతకవచ్చు. దుర్వాసన రాదు. సూక్ష్మజీవి రహితమైనది. నాన్‌ అల్లర్జిక్‌. బయటి పొరను సిలికాన్‌తో తయారు చేశారు. ఇది ఐదేళ్ల వరకు పాడవకుండా ఉంటుంది. అమెరికాలోని నెబ్రాస్కా యూనివర్సిటీతో కలిసి ఈ మాస్కును తయారు చేశారు.

జులై 1న నార్డ్ 2 టి విడుదల ?


మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తున్న వన్‌ప్లస్.. నార్డ్ 2T  పేరుతో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ నార్డ్ సిరీస్ ఫోన్‌ లాంచింగ్‌ను కంపెనీ అధికారికంగా దృవీకరించింది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన టీజర్‌ను యాడ్ చేసింది. ఈ డివైజ్‌ను త్వరలో దేశంలో ఆవిష్కరిస్తామని అందులో పేర్కొంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ 2T లాంచ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు. కానీ తాజా డివైజ్‌ను జులై 1న మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో నార్డ్ 2T ఫీచర్లను వెల్లడించింది. దీని స్పెసిఫికేషన్లు యూరోపియన్ మోడల్‌ను పోలి ఉంటాయి. ఇది ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ AMOLED ప్యానెల్‌తో లాంచ్ కానుంది. ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్‌తో వస్తుంది. తాజా మిడ్ రేంజ్ డివైజ్‌లో స్టీరియో స్పీకర్లతో పాటు అలర్ట్ స్లైడర్ కూడా ఉంది. 5,000mAh యూనిట్‌కు బదులుగా 4,500mAh బ్యాటరీతో రానుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ సామర్థ్యం ప్రస్తుతం OnePlus 10Rలో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX766 సెన్సార్, 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ దీని సొంతం. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను అందించారు. వన్‌ప్లస్ నార్డ్ 2T ప్రారంభ ధర రూ. 28,999గా (8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌) ఉంటుంది. ఈ ఫోన్ గ్రే, జేడ్ ఫాగ్‌ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్‌గా దీనిపై కంపెనీ రూ. 4,000 డిస్కింట్‌ ఆఫర్‌ అందిచే అవకాశం ఉంది.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ ఐకూ Z6 5G పైన ఆఫర్లు !


ఈరోజు నుండి మొదలైన అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్ ద్వారా ఐకూ Z6 5G మంచి ఆఫర్లతో లభిస్తోంది. మార్చి 2022 లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ రూ.15,999 రూపాయల ధరతో ప్రకటించించగా ఈ సేల్ నుండి 500 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ తో రూ.15,499 రూపాయల ధరతో లభిస్తోంది. అలాగే, అమెజాన్ కూపన్ అఫర్ మరియు బ్యాంక్ అఫర్ వంటి ఇతర లాభాలను కూడా పొందవచ్చు. ఐకూ జెడ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ఈ సేల్ నుండి కేవలం రూ.15,999 రూపాయల ధరతో లభిస్తోంది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర. అలాగే, ఈ ఫోన్ పైన 500 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI అప్షన్ తో కొనేవారికి 1,000 రూపాయలు, EMI అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయల తగ్గింపు అఫర్ వర్తిస్తుంది. ఈ ఐకూ జెడ్ 6 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.58 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ IPS LCD డిస్ప్లే ని కలిగి వుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. అలాగే, ఫోన్ ను నిరంతరం చల్లగా ఉంచడానికి 1445 mm² 5-లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విభాగంలో, ఈ లేటెస్ట్ ఐ కూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ ట్రిపుల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP Eye AF ప్రధాన కెమెరాకి జతగా 2MP మ్యాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12 పైన నధిస్తుంది.

దేశీయ మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో-ఎన్


దేశీయ మార్కెట్లోకి  మహీంద్రా నుంచి న్యూ జనరేషన్ స్కార్పియో విడుదలైంది.  మహీంద్రా స్కార్పియో-ఎన్ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ధర రూ.11.99 లక్షలు ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది. కాగా, ఈ మోడల్ కు సంబంధించి ఓపెనింగ్స్ 2022 జులై 30న మొదలవుతాయని, 4X4 వేరియంట్లలో జులై 21న రివీల్ చేస్తామని తెలిపారు. మహీంద్రా స్కార్పియో-N ప్రారంభ-స్థాయి పెట్రోల్ MT Z2 వేరియంట్ ధర రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. స్కార్పియో-ఎన్ డీజిల్ ధర రూ.12.49 లక్షలు. టాప్-ఎండ్ మహీంద్రా స్కార్పియో-N డీజిల్ MT 4×2 Z8 L వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహీంద్రా స్కార్పియో-ఎన్‌ని పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్‌లలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందిస్తుంది. ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లు డీజిల్ పవర్‌ట్రెయిన్‌కు మాత్రమే పరిమితం చేస్తారు. మహీంద్రా స్కార్పియో-N డీజిల్ 2.2-లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను 175bhp మ్యాగ్జిమం పవర్, 400Nm గరిష్ట టార్క్‌తో రూపొందించారు. పెట్రోల్ వేరియంట్ 203bhp, 380Nm ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ మోటార్‌తో అమర్చారు. Z2, Z4, Z6, Z7, Z8, Z8 Lఐదు చాయీస్ లను విడుదల చేస్తుంది. వీటిలో టాప్ ఎండ్ Z8 L మాత్రమే ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్ ఉంటుంది. మిగిలిన వాటికి ఏడు సీట్లు స్టాండర్డ్ గా అమర్చి ఉంటాయి. కొత్త మహీంద్రా స్కార్పియో-N 4,662mm పొడవు, 1,917mm వెడల్పు, 1,857mm ఎత్తుతో డిజైన్ చేశారు. ఇది 2,750ఎమ్ఎమ్ వీల్ బేస్ కలిగి ఉంది. SUV కొత్త ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 57 లీటర్లు. మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్ సందర్భంగా , M&M లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ, "ఆల్-న్యూ స్కార్పియో-ఎన్ గేమ్-ఛేంజర్‌గా రూపొందించాం. దాని డిజైన్, అధునాతన రైడ్, హ్యాండ్లింగ్, థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ, భరోసానిచ్చే భద్రత మహీంద్రా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఇది గ్లోబల్ ప్రొడక్ట్. ఇండియాలో లాంచ్‌తో పాటు దక్షిణాఫ్రికా, నేపాల్‌లో ఏకకాలంలో లాంచింగ్ చేయనున్నారు. ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లలోనూ త్వరలోనే లాంచ్‌ చేసే ఆలోచనలో ఉన్నారు.

Monday, June 27, 2022

ఇంటర్నెట్ లేకున్నా జీమెయిల్ సేవలు !


జీమెయిల్ లో ఆఫ్‌లైన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు  ఇక తమ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, సిగ్నల్ సరిగా లేకపోయినా కూడా మెయిల్స్ పంపవచ్చు, తమకు వచ్చిన మెయిల్స్‌ను కూడా చూసుకోవచ్చు. ఈ మేరకు కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మౌంటెన్ వ్యూ వెల్లడించింది. మౌంటెన్ వ్యూ వెల్లడించిన వివరాల ప్రకారం.. గూగుల్ Google సంస్థ జీ మెయిల్‌లో ఆఫ్‌లైన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా Gmail వినియోగదారులు ఇంటర్నెట్ లేకపోయినా తమకు వచ్చిన మెయిల్స్‌ను చూసుకోవచ్చు.. వాటికి ప్రతిస్పందించవచ్చు. ఈ Gmail ఆఫ్‌లైన్ ఫీచర్‌ను మీరు కూడా సులువుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. అందుకు ఈ కింది స్టెప్స్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా జీ మెయిల్ లోకి సైన్ ఇన్ అవ్వాలి. అయితే ఈ ఆఫ్‌లైన్ ఫీచర్ అనేది కేవలం గూగుల్ క్రోమ్‌లో మాత్రమే పనిచేస్తుందని గూగుల్ వెల్లడించింది. అది కూడా క్రోమ్ నార్మల్ మోడ్‌లోనే పనిచేస్తుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పనిచేయదు. జీమెయిల్ Gmail ఇన్‌బాక్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత సెట్టింగ్స్ లేదా కాగ్ వీల్ బటన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత "See All Settings" ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అనంతరం "ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్‌లో సేవ్ ఛేంజెస్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత మీరు జీ మెయిల్ ఆఫ్‌లైన్‌ సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. గూగుల్‌కు చెందిన జీ మెయిల్ సేవల్ని దాదాపు 1.8 బిలియన్ మంది వినియోగిస్తున్నారు. ఈ మెయిల్ క్లయింట్ మార్కెట్‌లో గూగుల్ మెయిల్ 18 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. జీమెయిల్ ను వినియోగిస్తున్న వారిలో దాదాపు 75శాతం మంది మొబైల్స్ లోనే వినియోగిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకునే జీ మెయిల్ ఈ ఆఫ్‌లైన్‌ ఫీచర్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలు !


నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇటీవల యూజర్లను ఎక్కువగా కోల్పోతున్న నెట్‌ఫ్లిక్స్ దీనికి తగ్గట్లు దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఒకవైపు ఉన్న యూజర్లను కాపాడుకుంటూనే... కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను తీసుకురానుంది. సాధారణ ప్లాన్‌ల కంటే వీటి సబ్‌స్క్రిప్షన్ ధర మరింత తక్కువగా ఉండనుంది. అయితే ఈ తక్కువ ధర ప్లాన్స్‌లో వినియోగదారులు యాడ్స్‌ను భరించాల్సి ఉంటుంది. ఈ యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌లను నెట్‌ఫ్లిక్స్ తీసుకురానుందని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అధికారికంగా ప్రకటించారు. కేన్స్ లయన్స్ అడ్వర్టైజింగ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్ ఒక ఇంటర్వ్యూలో నెట్‌ఫ్లిక్స్ వ్యూహాల గురించి మాట్లాడారు. యాడ్ సపోర్టెడ్ ప్లాన్స్ ఎందుకు తీసుకురావాలి, దానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. తాము చాలా పెద్ద వినియోగదారుల విభాగాన్ని విస్మరించామని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఖరీదు ఎక్కువగా ఉందని, అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నా ఇబ్బంది లేదనుకునే వినియోగదారులను ఇంతకాలం పట్టించుకోలేదన్నారు. అందుకే యాడ్స్ కూడా ఉన్న కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లకు యాడ్స్ తీసుకురావడం లేదని, కేవలం కొత్తగా వచ్చే తక్కువ ధర ప్లాన్‌లకు మాత్రమే యాడ్స్ ఉంటాయనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రెండు లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో కంపెనీ ఆదాయం భారీగా పడిపోవడంతో పాటు విలువ కూడా తగ్గింది. దీంతో కాస్ట్ కటింగ్ కోసం ఆరునెలల్లోనే 600 మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేందుకు ఏం చేయాలనే ఆలోచల నుంచే ఈ యాడ్ సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ పుట్టాయి. ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాడ్ సపోర్టెడ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలను తీసుకువస్తున్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ బాటలోనే నడవనుంది.

దేశీయ మార్కెట్‌లోకి వివో వీ25 ఆగస్ట్‌లో గ్రాండ్ ఎంట్రీ ?


వివో వీ 25 లాంఛ్ ఈవెంట్ ఆగస్ట్‌లో జరగనుంది. వివో తన న్యూ అప్పర్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ మూడో వారంలో భారత్‌లో లాంఛ్ చేయనుందని పరిశ్రమ వర్గాల సమాచారం. భారత్‌లో వివో వీ25 సిరీస్‌లో లాంఛ్ అవుతున్న తొలి స్మార్ట్‌ఫోన్ వివో వీ25 కావడం గమనార్హం. వివో వీ25 భారత్‌లో ఆగస్ట్ 17 లేదా 18న లాంఛ్ కావచ్చని భావిస్తున్నారు. అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం, సప్లయి చైన్ పరిస్ధితులకు అనుగుణంగా ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. వివో వీ25ప్రొతో పాటు వనిలా వివో వీ25 స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా భారత్‌లో లాంఛ్ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. వివో వీ25 ప్రొ, వివో వీ25 స్పెషల్ ఎడిషన్ లాంఛ్ తేదీలు ఇంకా వెల్లడి కాలేదు. సెప్టెంబర్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు భారత్ మార్కెట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాయని అంచనా. వివో ఇండియా ప్రతినిధి కంపెనీ ప్రణాళికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక వివో వీ25 6.62 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ప్రీమియం డిజైన్‌తో ఈ స్మార్ట్‌పోన్ ఆకట్టుకోనుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో రానుంది. 66డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.

విండోస్ 8.1కి సపోర్టు ఆపేయనున్న మైక్రోసాఫ్ట్ !


మైక్రోసాఫ్ట్ విండోస్ 8.1కి సపోర్టును నిలిపివేయనుంది. విండోస్ 8.1 వెర్షన్‌ని ఉపయోగిస్తున్న యూజర్లు జనవరి 10, 2023 నుంచి కొత్త అప్‌డేట్‌లను అందుకోలేరని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత  విండోస్ 8.1 వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ రిమైండర్‌లను పంపుతోంది. జనవరి 10 తర్వాత, మైక్రోసాఫ్ట్ 365ని రన్ చేస్తున్నట్టయితే.. ఇకపై Office యాప్‌లకు అప్‌డేట్‌లను అందుకోలేరని అంటోంది. అందులోని ఫీచర్లు, సెక్యూరిటీ, ఇతర క్వాలిటీ అప్‌డేట్స్ అని నిలిచిపోనున్నాయి. మైక్రోసాఫ్ట్ 365 ప్రోడక్ట్ అప్‌డేట్‌లను కొనసాగించాలంటే.. Windows 8 లేదా 8.1ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ కావాలని సిఫార్సు చేస్తోంది. ఈ మేరకు టెక్ దిగ్గజం తమ సపోర్టు పేజీలో పేర్కొంది. గతంలో జనవరి 12, 2016న Windows 8కి Microsoft సపోర్టు నిలిపివేసింది. పర్ఫార్మెన్స్ లేదా సెక్యూరిటీ పరమైన సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు Windows కొత్త వెర్షన్‌కు అప్ గ్రేడ్ కావాలని కంపెనీ వినియోగదారులకు సూచిస్తోంది.

సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 విడుదల !


iPhone 14 : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 14 సిరీస్ వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. Apple iPhone 14 సిరీస్ వివరాలపై ఆపిల్ ఇంకా ఏం వెల్లడించలేదు. ఆన్‌లైన్‌లో iPhone 14 ధర ఎంత ఉంటుంది? అనేది వివరాలు లీక్ అయ్యాయి. సెప్టెంబర్ లో ఏ తేదీన ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అవుతుంది అనేది తెలియదు. కానీ, సెప్టెంబర్ రెండవ వారంలో iPhone 14 మోడల్స్ అధికారికంగా అందుబాటులోకి వస్తాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆపిల్ iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Max Pro సహా 4 కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించాలని భావిస్తున్నారు. iPhone SE సిరీస్ అమ్మకాలపై ప్రభావం పడటంతో ఈ ఏడాదిలో ఐఫోన్ మినీ ఫోన్ ప్రవేశపెట్టే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. నివేదికల విషయానికొస్తే.. iPhone 13 సిరీస్‌తో పోలిస్తే.. iPhone 14 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు అద్భుతంగా ఉండనున్నాయి. అధికారిక లాంచ్‌కు ముందు.. iPhone 14 ధరపై అనేక అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 14 ధర ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటుందని ఇంటర్నెట్‌లో చాలా నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే ఐఫోన్ మోడల్ ఐఫోన్ 13 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iPhone 13 గత ఏడాదిలో రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. iPhone 13 ఫోన్ 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్, 512GB స్టోరేజ్ అనే 3 వేరియంట్‌లలో వస్తుంది. ధర పరంగా చూస్తే.. iPhone 13 128GB, రూ. 79,900, 256GB, 512GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ. 89,900 రూ. 1,09,900 ఉండనున్నాయి. అమెరికాలోనూ iPhone 14 (iPhone 13 మాదిరిగానే) $799తో ప్రారంభమవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. iPhone 14 Max, iPhone 14 Pro iPhoneతో సహా ఇతర iPhone 14 మోడళ్ల విషయంలో iPhone 14 Pro Max ధర మరోలా ఉండొచ్చు. iPhone 13 మాదిరిగానే.. iPhone 14 కనీసం 128GB స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. హైఎండ్ స్టోరేజీ 1TB వరకు ఉండే అవకాశం ఉంది. అదే నిజమైతే.. iPhone 1TB స్టోరేజీతో రావడం ఇదే మొదటిసారి కానుంది. డిజైన్ పరంగా.. ఐఫోన్ 14 స్పెసిఫికేషన్ల పరంగా కొంచెం అప్‌గ్రేడ్‌లతో రానుంది. రాబోయే iPhone 14 చూసేందుకు డిజైన్.. లుక్ మొత్తం ఐఫోన్ 13 లాగానే కనిపిస్తుంది. AMOLED డిస్‌ప్లే, A16 బయోనిక్ చిప్‌సెట్, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ కెమెరాలు, పెద్ద సెన్సార్‌లు, iPhone 13 కన్నా పెద్ద బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.

Sunday, June 26, 2022

ప్లాన్ల ధరను పెంచిన జియో!


జియో తన జియోఫోన్ రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచాక ఇప్పుడు రూ.155, రూ.185 ప్లాన్ల ధరను కూడా పెంచింది. ఈ రెండు ప్లాన్ల ధరలూ రూ.30కి పైగా పెరిగాయి. జియోఫోన్‌కు అందుబాటులో ఉన్న చౌకైన ప్లాన్లలో ఈ రెండూ ఉన్నాయి. జియోఫోన్ రూ.155 ప్లాన్ ధరను రూ.186కు పెంచారు. అంటే దీని ధర రూ.31 పెరిగిందన్న మాట. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్రతిరోజూ 1 జీబీ 4జీ డేటా లభించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 50 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు కూడా యాక్సెస్ లభించనుంది. జియోఫోన్ రూ.185 ప్లాన్ ధర రూ.222కు పెరిగింది. అంటే దీని ధరను ఏకంగా రూ.37 పెంచారన్న మాట. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులే. అయితే రోజుకు 2 జీబీ అన్‌లిమిటెడ్ డేటా ఈ ప్లాన్ ద్వారా లభించనుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి లాభాలు కూడా ఈ ప్లాన్‌తో లభించనున్నాయి. ఇక మిగతా లాభాలన్నీ పై ప్లాన్ తరహాలోనే ఉన్నాయి. రూ.749 ప్లాన్ ధరను జియో రూ.150 పెంచింది. అంటే ఇప్పుడు దీనికి రూ.899 పెట్టాల్సిందే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉండనుంది. నెలకు 2 జీబీ చొప్పున మొత్తంగా 24 జీబీ హై స్పీడ్ డేటాను జియో రూ.849 ప్లాన్ ద్వారా అందించనున్నారు. ఈ డేటాను అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 ఎస్ఎంఎస్‌లు కూడా లభించనున్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచితంగా యాక్సెస్ లభించనుంది.

ఇస్రోపై మాధవన్ వ్యాఖ్యలకు నెటిజన్ల ఆగ్రహం !


"ఇస్రో చేపట్టిన అంగారక యాత్రకు పంచాంగం తోడ్పడింది. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించగలిగింది. గ్రహగతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయి" అని నటుడు మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. మాధవన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. 'సైన్స్ గురించి తెలియకపోవడం తప్పేమీ కాదు. మాధవన్ చెత్తవాగుడును కట్టిపెట్టాలి. వాస్తవాలు తెలియకుండా మాధవన్ మాట్లాడిన మాటలు వింటుంటే ఓ మూర్ఖుడిలా అనిపించాడు. మాధవన్ ఇకపై అధికారికంగా చాక్లెట్ బాయ్ నుంచి వాట్సాప్ అంకుల్ అయ్యాడు. మాధవన్ మాట్లాడకుండా ఉంటేనే ముద్దొస్తుంటాడు' అని కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్‌లో తలక్రిందులుగా టైప్ చేయడం ఎలా ?


వాట్సాప్ ను నిత్యం కోట్లాది మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ వాట్సాప్ లో మెసేజ్ లను టైపింగ్ చేసి పంపించడం కోసం విభిన్నమైన ఫాంట్ శైలులు అలాగే ఫార్మాట్లను చాలా మంది ప్రయత్నించి ఉండకపోవచ్చు. కొందరు వాట్సాప్ లో అన్ని రకాల ఫీచర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాట్సాప్లో మనం పంపించే టెక్స్ట్ మెసేజ్ ను పూర్తిగా తిప్పి, రివర్స్ లో కూడా పంపవచ్చు. ఇందుకోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్ అలాగే ఇతర యాప్ ల కోసం దీన్ని ఉపయోగించవచ్చు. ఫ్లిప్ టెక్స్ట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. అందుకోసం ముందుగా, ప్లే స్టోర్‌కి వెళ్లి, అప్‌సైడ్ డౌన్ (ఫ్లిప్ టెక్స్ట్) డౌన్‌ లోడ్ చేసిన తర్వాత, అప్లికేషన్‌ను తెరవగా అప్పుడు అది తాజా సంస్కరణను డౌన్‌లోడ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు సరే అనే ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. అలా చేసిన తర్వాత, స్క్రీన్ రెండు భాగాలుగా విభజించబడిందని చూపించగా అందులో మొదటి విభాగంపై క్లిక్ చేసి తలక్రిందులుగా (రివర్స్) లో పంపాలనుకుంటున్న మెసేజ్ ను టైప్ చేసిన తర్వాత దిగువ విభాగంలో నొక్కితే, మీరు విలోమ వచనాన్ని చూస్తారు.అప్పుడు మెసేజ్ ని పూర్తి చేసిన తర్వాత దిగువన రెండు స్క్రీన్ ఎంపికలు కనిపిస్తాయి, అవి క్లియర్ లేదా కాపీ మీరు వచనాన్ని కాపీ చేసి, వాట్సాప్ , టెలిగ్రామ్ లేదా జిమెయిల్ తో సహా మీకు కావలసిన అప్లికేషన్‌లో అతికించవచ్చు.

ఒకసారి ఫుల్‌ చార్జింగ్‌తో 1000 కి.మీ !


చైనాకు చెందిన లిథియం బ్యాటరీ తయారీదారు అయిన కాంటెంపరరీ టెక్నాలజీ కో-లిమిటెడ్‌ (సీఏటీఎల్‌) కంపెనీ నెక్ట్స్‌ జనరేషన్‌ కారు బ్యాటరీ తయారు చేసింది. ఈ బ్యాటరి ఒకసారి ఫుల్‌ చార్జీ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ బ్యాటరీలను త్వరలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తెస్తామని సీఏటీఎల్‌ తెలిపింది. బ్యాటరికి పురాణ పురుషుడైన 'క్విలిన్‌' పేరు పెట్టినట్లు తెలిపింది.

నెట్‌ఫ్లిక్స్ నుంచి 300 మంది ఉద్యోగుల తొలగింపు !


ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ 300 మంది ఉద్యోగులను తొలగించింది. గతంలో 150 మందిని తొలగించింది. రాబడి తగ్గడంతో  ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపింది. తమ వినియోగదారులలో గణనీయమైన తగ్గుదల వల్ల ఆదాయం కోల్పోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తొలగించిన ఉద్యోగులంతా అమెరికా బేస్‌గా పని చేస్తున్నవారే కావడం గమనార్హం. భారీగా పెట్టుబడులు పెట్టి కొనసాగిస్తున్నపుడు సంస్థ అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ కోసం వారు చేసిన సేవకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం నాటి తొలగింపులు నెట్‌ఫ్లిక్స్ వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందిని ప్రభావితం చేశాయి, ఇందులో 11,000 మంది పూర్తి సమయం ఉద్యోగులు ఉన్నారు. తొలగింపులు కూడా ఎక్కువగా అమెరికాలోనే జరుగుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్‌లో భారీ సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. వాల్ స్ట్రీట్ లో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ క్యాప్ నుండి ఈ ఏడాది కంపెనీ స్టాక్ దాదాపు 70% క్షీణించింది. గత నెలలో, నెట్‌ఫ్లిక్స్ 150 మంది కార్మికులను తొలగించింది, ఆదాయ వృద్ధి మందగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు గత నెల చివరిలో, నెట్‌ఫ్లిక్స్ తన మార్కెటింగ్ శాఖ పునర్నిర్మాణంలో భాగంగా స్ట్రీమింగ్ సేవ కోసం చలనచిత్రాలు, టీవీ షోలను ప్రమోట్ చేసే వెబ్‌సైట్ 'టుడమ్'లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది. 2022 మొదటి త్రైమాసికంలో 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్టాక్ 20 శాతం మేర పడిపోయిందని మేలో ఒక నివేదికలో పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ దాదాపు 221.6 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం. దీనిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ద్రవ్యోల్బణానికి తోడు, రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంస్థపై ప్రభావం చూపిస్తోంది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో చందాదారులను కోల్పోవడం ఎప్పుడూ లేదు. దీంతో చందాదారులను ఆకర్షించేందుకు నెటిఫ్లిక్స్ వివిధ చౌక ప్లాన్లను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది.

Saturday, June 25, 2022

దేశీయ మార్కెట్లోకి HP Omen సిరీస్ ల్యాప్‌టాప్‌లు


దేశీయ మార్కెట్లోకి హెచ్‌పీ  సరికొత్త ల్యాప్‌టాప్ మోడల్స్‌ను విడుదల చేసింది. 2022 మోడల్ HP Omen 16, Omen 17 ల్యాప్‌టాప్‌లతో పాటుగా Victus 15, మరియు Victus 16 నోట్‌బుక్ డివైజ్‌లను విడుదల చేసింది. ఈ డివైజ్‌ల ప్రారంభ ధర రూ.67,999 గా ఉన్నాయి. అదేవిధంగా ఈ డివైజ్‌లు Intel Core 12 and AMD Ryzen ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి. ఈ డివైజ్‌లు అద్భుతమైన గేమింగ్ పెర్ఫార్మెన్స్‌ను కనబరుస్తాయి. గేమింగ్ సమయంలో ఏర్పడే వేడిని తగ్గిస్తాయి. HP Omen 16 ల్యాప్‌టాప్‌లో ఎక్కువ మంది గేమర్‌లను ఆకర్షించే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు 16:9 యాస్పెక్ట్ రేషియోతో 16.1-అంగుళాల క్వాడ్ HD డిస్‌ప్లే రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తాయి. ఈ డివైజ్ లు 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డివైజ్‌లు 32జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఎస్ఎస్‌డీ ని కలిగి ఉన్నాయి. ఇది 720 పిక్సెల్ క్వాలిటీ తో వెబ్‌క్యామ్ కలిగి ఉంది. దీనికి 150వాట్ స్మార్ట్ పవర్ అడాప్టర్ ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ 9 గంటల పాటు పని చేయడానికి వీలు కల్పిస్తుంది. గేమింగ్ సమయంలో హీట్‌ను తగ్గించేందుకు ఈ ల్యాప్‌టాప్స్ హీట్ పైప్స్‌ను కలిగి ఉన్నాయి. రెండు మెమోరీ స్లాట్స్ అందిస్తున్నారు. ఇది 5.2కాంబో బ్లూటూత్ వర్శన్ కలిగి ఉంది. అదనపు డిస్‌ప్లే ఫీచర్‌లో ఐసేఫ్ ఫ్లికర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ మైకా సిల్వర్ కలర్‌లో అందుబాటులో ఉంది. HP Omen 17 ల్యాప్‌టాప్‌లు 17.3-అంగుళాల సాఫ్టర్ ఎడ్జ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తాయి. ఇది ఇంటెల్ Core i5 లేదా i7 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో ఎక్కువ మంది గేమర్‌లను ఆకర్షించే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. గేమింగ్ సమయంలో హీట్‌ను తగ్గించేందుకు ఈ ల్యాప్‌టాప్స్ హీట్ పైప్స్‌ను కలిగి ఉన్నాయి. ఇది 4.2 బ్లూటూత్ వర్శన్ కలిగి ఉంది. HP Victus 15 నోట్‌బుక్ 15.6-అంగుళాల ఎడ్జ్ టూ ఎడ్జ్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తాయి. ఇది ఇంటెల్ Core i7 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇక Victus 16 విషయానికి వస్తే 16.1-అంగుళాల హెచ్‌డీ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేతో వస్తాయి. ఇవి 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటు కలిగి ఉంటాయి. ఇవి 32 జీబీ ర్యామ్ కలిగి ఉన్నాయి. దీనికి 200వాట్ స్మార్ట్ పవర్ అడాప్టర్ ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ 08.45 గంటల పాటు పని చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది 720 పిక్సెల్ క్వాలిటీ గల వెబ్ క్యామ్ కలిగి ఉంది. HP Omen 16 ప్రారంభ ధరను రూ.1,09,999 గా నిర్ణయించారు. అదేవిధంగా HP Omen 17 ప్రారంభ ధరను రూ.1,99,999 గా నిర్ణయించారు. ఇక విక్టస్ డివైజ్‌ల విషయానికి వస్తే.. మన దేశంలో HP Victus 15 ప్రారంభ ధరను రూ.67,999 గా నిర్ణయించారు. అదేవిధంగా HP Victus 16 ప్రారంభ ధరను రూ.84,999 గా నిర్ణయించారు. వీటితో పాటుగా హెచ్‌పీ భారత మార్కెట్లో Omen 45L, 40L మరియు 25L డెస్క్‌టాప్‌లను కూడా విడుదల చేసింది. ఇవి ప్రారంభ ధర రూ. 1,49,999గా ఉన్నాయి.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో !


ఆపిల్ అందించే ప్రొడక్టుల్లో ఎయిర్ పాడ్స్ ఒకటి. ఇప్పటికే అనేక రకాల జనరేషన్లతో కొత్త ఎయిర్ పాడ్ మోడల్స్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. తమ ప్రొడక్టుల్లో ప్రతి జనరేషన్ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రో ప్రవేశపెడుతోంది. ఈ ఎయిర్ పాడ్స్‌లో ఆరోగ్యకరమైన ఫీచర్లు అనేకం ఉండనున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సంబంధమైన ఫీచర్లను ఎక్కువగా అందించనుంది. ఇప్పటికే ఈ ఎయిర్ పాడ్స్ ప్రో ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అందులో ఒకటి ఆపిల్ హియరింగ్ ఎయిడ్ ఫంక్షన్, మరొకటి హార్ట్ రేట్ డిటెక్షన్. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ యాడ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. రాబోయే AirPods ప్రో 2వ జనరేషన్ ఫీచర్లు కూడా లీకయ్యాయి. గత వెర్షన్ల మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కొత్త జనరేషన్ ఎయిర్‌ పాడ్స్ ప్రో స్టెమ్‌లెస్ డిజైన్‌తో రానుందని గతంలో నివేదికలు పేర్కొన్నాయి. 52Audio నివేదిక ప్రకారం.. Apple AirPods ఆరోగ్య ఫీచర్లతో రానుంది. శక్తివంతమైన చిప్‌సెట్‌తో ఆపిల్ 2జనరేషన్ ఎయిర్ పాడ్స్ రానున్నాయి. ఆటో-అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, మెరుగైన ఫైండ్ మై ఫంక్షన్‌కు సపోర్టు చేస్తాయి. H1 SoC నుంచి ఇయర్‌బడ్‌లకు కనెక్ట్ అవుతాయని నివేదిక పేర్కొంది. AirPods ప్రో రెండో జనరేషన్‌లో పెద్ద మార్పు ఏమిటంటే.. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ని చేర్చనుంది. AirPods ప్రో వినికిడి ఎయిడ్ ఫంక్షనాలిటీతో కూడా రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఇయర్‌ఫోన్‌లను వినికిడి సమస్యకు పరిష్కారంగా కూడా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ జనరేషన్), బాడీ టెంపరేచర్, హార్ట్ రేటును డిటెక్ట్ చేయడంతోపాటు ఇన్నర్ ఇయర్ డేటాను కూడా ట్రాక్ చేస్తుంది. AirPods Pro 2mf జనరేషన్ స్పేషియల్ ఆడియోకి కూడా సపోర్ట్ చేస్తుంది. USB టైప్-C పోర్ట్‌ను కలిగిన ఛార్జింగ్ ఫొటోను 52Audio షేర్ చేసింది. చివరకు Apple యూజర్లకు ఛార్జింగ్ సమస్యల నుంచి రిలీఫ్ ఇవ్వనుంది. కేస్ స్పీకర్ గ్రిల్స్‌ను కూడా కలిగి ఉంది. మీరు కేస్ నుంచి ఇయర్‌బడ్‌లను తీయనప్పుడు కూడా మ్యూజిక్ ప్లే చేయగలదు. ఇక డిజైన్ విషయానికొస్తే.. ఎయిర్‌పాడ్స్ ప్రో ముందున్న డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. అందులో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. కొద్దిపాటి మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. AirPods ప్రో స్టెమ్ డిజైన్‌తో రానుందని నివేదిక తెలిపింది.

మైక్రాన్ 1.5టీబీ స్టోరేజ్‌తో ఓ మైక్రో ఎస్‌డీ కార్డ్‌ విడుదల !


మెమరీ కార్డ్స్ వినియోగం ఇటీవల ఎక్కువయిందనే విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్, డ్రోన్, గేమ్ కన్సోల్స్, డిజిటల్ కెమెరా వంటి డిజిటల్ డివైజ్‌ల్లో మైక్రోఎస్‌డీ కార్డ్స్ బాగా వినియోగిస్తుంటారు. అయితే ఈ మెమరీ కార్డ్ హైయ్యెస్ట్ స్టోరేజ్ 1 టీబీ (1024జీబీ)గా ఇప్పటి వరకు ఉండేది. ఇప్పుడు దానిని మించిన మెమరీ కార్డ్ అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ చిప్‌మేకర్ మైక్రాన్ 1.5టీబీ స్టోరేజ్‌తో ఓ మైక్రో ఎస్‌డీ కార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ కార్డు అందుబాటులోకి వస్తే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజ్‌ కెపాసిటీ గల మైక్రోఎస్‌డీ కార్డు గా చరిత్ర సృష్టిస్తుంది. మైక్రాన్ ఐ400 పేరుతో లాంచ్ కానున్న ఈ ఎస్‌డీ కార్డు మునుపటి అతిపెద్ద మైక్రో ఎస్‌డీ కార్డ్ కంటే 50 శాతం ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఈ కార్డ్ ప్రత్యేకతలు చూస్తే.. మైక్రాన్ తన 176-లేయర్ 3D NAND టెక్నాలజీని ఉపయోగించి హైయ్యెస్ట్ స్టోరేజ్ కార్డును తయారు చేయగలిగింది. ఇందులో వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. 1.5టీబీ స్టోరేజ్ స్పేస్ ఉండే ఈ మైక్రో ఎస్‌డీ కార్డ్ చౌకగా లేదా సులభంగా లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఈ కార్డుని ఉపయోగించి యూజర్లు ఐదు ఏళ్ల పాటు 24×7 హైక్వాలిటీ కంటెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. సుమారు 228 సంవత్సరాలు ఈ కార్డు ఫెయిల్యూర్ అవ్వదు. ప్రధానంగా ఈ కార్డును వీడియోల స్టోరేజ్ కోసం రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సెక్యూరిటీ డివైజ్‌లతో పాటు మరిన్ని డివైజ్‌లలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఐ400 మైక్రో ఎస్‌డీ కార్డ్ సెకనుకు 4జీబీ వరకు డేటా ట్రాన్స్‌ఫర్‌కు సపోర్ట్ చేయనుంది. 

మారుతి బ్రాండ్ నుంచి సరికొత్త కారు బ్రెజ్జా !


మారుతి సుజుకి తాజాగా SUV బ్రౌజర్ ను సరికొత్త లుక్ లో త్వరలోనే విడుదల చేస్తోంది. బ్రెజ్జా, ఇంటీరియల్ లుక్ లో పలు మార్పులు చేశారు.కొత్త బ్రెజ్జా కు సంబంధించి రెండు ఫోటోలు విడుదల చేసింది ఈ సంస్థ. దానికి సంబంధించి ఇంటీరియర్ డిజైన్ గురించి పలు విశేషాలను తెలియజేసింది మారుతి సుజుకి బ్రెజ్జ న్యూ వెర్షన్ ను త్వరలో విడుదల చేయబోతోంది.. బుకింగ్ ఇప్పటికే మొదలయ్యాయి రూ.11000 వేల రూపాయలతో ఈ కారు ని బుకింగ్ చేసుకోవచ్చు. కొత్త మారుతి బ్రేజ్జా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్మార్ట్, ప్రో ప్లస్ గా ఉండబోతోంది. ఇందులో డేట్ అండ్ టైం తో పాటు వేగాన్ని డ్రైవింగ్ టైం గురించిన సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. సరికొత్త SUV సుజుకి బ్రేజ్జ లో ఎలక్ట్రిక్ సన్ రూప్ కూడా వుంది.  మారుతి కార్ల లో ఇదే మొదటి సన్ రుప్ కావడం విశేషం. అలాగే స్పీడ్ ట్రాన్స్మిషన్ హైబ్రిడ్ ఇంజన్ మొదలగునవి ఇందులో ఉన్నాయి. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కూడా వుంది. దీని ధర దాదాపుగా రూ.8 నుండి రూ.12 లక్షల లోపు ఉండవచ్చని నిపుణులు అంచనా. 

పెళ్లయిన మహిళలు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు ?


పెళ్లయిన మహిళలు ఎక్కువగా గూగుల్ లో ఎలాంటి వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారనే అంశంపై తాజగా ఓ అధ్యాయనం నిర్వహించారు. దీంతో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ డేటా ప్రకారం వివాహిత మహిళలు తమ భర్తకు ఏది ఇష్టమో తెలుసుకునే మార్గాలను గూగులో వెతుకుతున్నారు. భర్తలకు కావాల్సినవి మరియు వారు ఇష్టపడేవి, ఇష్టపడనివి తెలుసుకోవాలనే కోరికతో ఇలాంటి వివరాలను సెర్చ్ చేస్తున్నారు. పెళ్లయిన ఆడవాళ్లు తమ భర్త మనసు గెలుచుకుని వాళ్లను ఎలా సంతోషపెట్టాలి అనే ప్రశ్నను కూడా అనేక సార్లు గూగుల్‌లో చాలాసార్లు వెతికినట్లు తేలింది. ఇంకా పెళ్లయిన మహిళలు తమ భర్తను తమ పిడికిలిలో ఎలా ఉంచుకోవాలి? అందుకు మార్గం గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు కూడా అధ్యాయనంలో తేలింది. ఇంకా బిడ్డను కనడానికి సరైన సమయం ఎప్పుడు అని కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నట్లు అధ్యాయనం వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొత్త ఇంట్లో ఎలా ప్రవర్తించాలి ? ఆ కుటుంబంలో ఎలా ఉండాలి ? అత్తగారితో ఎలా సంతోషంగా ఉండాలి ? అని పెళ్లయిన మహిళలు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలను ఎలా చూసుకోవాలి ? పెళ్లయ్యాక సొంతంగా వ్యాపారం ఎలా సాగించాలి ? కుటుంబ వ్యాపారాన్ని ఎలా నడిపించాలో తెలుసుకోవడానికి కూడా గూగుల్ నే ఆశ్రయిస్తున్నట్లు అధ్యాయనం వెల్లడించింది..

Friday, June 24, 2022

చనిపోయిన వారి వాయిస్‌తో మాట్లాడేలా సరికొత్త టెక్నాలజీ..!


ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలు డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెజాన్ అలెక్సా, అమెజాన్ ఏకో, గూగుల్ హోమ్ వంటివి ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. ఈ వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ రోజురోజుకూ మరింత అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు వస్తున్న డివైజ్‌లు రోబో లాగా కాకుండా అచ్చం నిజమైన వ్యక్తిలా మాట్లాడుతూ ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ అలెక్సా (Amazon Alexa) అమితాబ్ బచ్చన్‌ వంటి పలువురు సెలబ్రిటీల వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ యూజర్లను ఫిదా చేస్తోంది. అయితే తాజాగా అలెక్సా సాధారణ వ్యక్తులను కూడా అనుకరించే ఫీచర్‌ను అప్‌డేట్ చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది. దీంతో యూజర్లు తమకు ఇష్టమైన వారి వాయిస్‌లో అలెక్సా మాటలను వినడం సాధ్యం అవుతుంది. చనిపోయిన వారి గొంతును కూడా అలెక్సా అనుకరించేలా అమెజాన్ కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టబోతోంది. ఇదెలా వర్క్ అవుతుంది? ప్రస్తుతం అమెజాన్ వాయిస్ టెక్నాలజీని వేరే లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఇందులో భాగంగా అలెక్సా చనిపోయిన వారి వాయిస్‌ను అచ్చు గుద్దినట్లు మిమిక్రీ చేసేలా ఒక అదిరిపోయే టెక్నాలజీని తీసుకొస్తోంది. ప్రియమైన వారి వాయిస్ లేదా చనిపోయినవారి వాయిస్‌ను ఒక నిమిషం కంటే తక్కువసేపు రికార్డ్ చేస్తే.. ఆ శాంపిల్‌ను అలెక్సా విని.. ఆ వాయిస్‌ను చాలా పర్ఫెక్ట్‌గా అనుకరిస్తుంది. తద్వారా యూజర్లు అలెక్సా నుంచి వినిపించే అన్ని మాటలను తమకు ఇష్టమైన వారి వాయిస్‌లో లేదా చనిపోయిన వారి స్వరంలో వినగలుగుతాయి. ఇలా వినడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పవచ్చు. అమెజాన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్ఫరెన్స్ Re:MARS 2022 లాస్ వెగాస్‌లో జూన్ 21 నుంచి జూన్ 24 వరకు జరిగింది. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా అమెజాన్‌ అలెక్సా ఏఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ ఒక డెమో ప్రదర్శించారు. ఈ డెమోలో అలెక్సా డివైజ్ చనిపోయిన వ్యక్తి వాయిస్‌ని అద్భుతంగా మిమిక్రీ చేసింది. ఈ డెమో ప్రదర్శించడానికి ఒక చిన్న పిల్లాడు, చనిపోయిన అతని అమ్మమ్మ వాయిస్ శాంపిల్‌ని అమెజాన్ ఉపయోగించింది. ఈ డెమోలో పిల్లాడు అమ్మమ్మ గొంతులో ది విజార్డ్ ఆఫ్ Oz వినిపించాలని అలెక్సాని కోరాడు. అప్పుడు, అలెక్సా "సరే" అని అమ్మమ్మ గొంతులో ఆ నవల చదివింది. మరణించిన వారి వాయిస్ మళ్లీ వింటుంటే ఒక స్వీట్ ఎక్స్‌పీరియన్స్ పొందినట్లు అవుతుందని ఇది అద్భుతమైన ఫీచర్లు అని పొగుడుతున్నారు. ప్రస్తుతానికి, అలెక్సా పరికరాల్లో అమెజాన్ ఈ ఫీచర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అనే దానిపై అధికారిక సమాచారం లేదు.

జూలై 1 నుంచి హీరో బైక్ ల ధరలు పెంపు !


జూలై 1 నుంచి అన్ని ప్రొడక్ట్స్ ధరలు పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. సంస్థ నుంచి వచ్చిన అన్ని రేంజ్‌ల మోటార్ బైక్స్, స్కూటర్ల ధరలను రూ. 3,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. కమోడిటీ ధరలతో సహా క్రమంగా పెరుగుతున్న కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ప్రభావాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. మోడల్, మార్కెట్ ఆధారంగా పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో 'కమోడిటీ ధరలతో సహా స్థిరంగా పెరుగుతున్న ఓవరాల్ కాస్ట్ ఇన్‌ఫ్లేషన్‌ను ఆఫ్‌సెట్ చేయడానికి ధరలు పెంచడం అవసరం' అని కంపెనీ పేర్కొంది. హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ఇంతకు ముందు కూడా ధరలను పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పుడు కూడా పెరుగుతున్న కమోడిటీ ధరల ప్రభావాన్ని భర్తీ చేయడానికి ప్రొడక్ట్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో వివిధ బైక్‌లు, స్కూటర్లపై రూ. 2,000 వరకు ధరలు పెరిగాయి. హీరో మోటోకార్స్ ఎంట్రీ-లెవల్ HF100 మోటార్ సైకిల్ నుంచి అనేక రకాల మోడళ్లను విక్రయిస్తుంది. దీని ధరలు రూ. 51,450 నుంచి ప్రారంభమవుతాయి. హీరో ఎక్స్‌ పల్స్ 200 4V బైక్ ధర రూ. 1.32 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల తయారీదారు. 2022 మే నెలలో కంపెనీ 4,86,704 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 418,622 యూనిట్లను విక్రయించింది. అంటే ఒక నెలలో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ కేవలం 1,83,044 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కోవిడ్-19 కేసుల పెరుగుదల, లాక్‌డౌన్ల ప్రభావం అప్పట్లో అమ్మకాలపై ఏర్పడింది. హీరో మోటోకార్ప్ ఇటీవల ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. EV వెంచర్ 'Vida - Powered by Hero' పేరుతో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV)తో సహా మొబిలిటీ సొల్యూషన్స్ కోసం బ్రాండ్-న్యూ ఐడెంటిటీని స్థాపించింది. హీరో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్‌ను 2022 జూలై 1న అధికారికంగా ఆవిష్కరించనుంది. ఎమెరిటస్ ఛైర్మన్ డాక్టర్ బ్రిజ్‌మోహన్ లాల్ జన్మదినోత్సవం సందర్భంగా కంపెనీ ఈ తేదీని ఎంచుకుంది. హీరో బ్రాండ్ పేరును నిలుపుకునే విషయంలో హీరో ఎలక్ట్రిక్‌తో విభేదాలు రావడంతో హీరో మోటోకార్ప్ కొత్త బ్రాండ్ పేరును పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కోర్టుకు కూడా వెళ్లింది. కోర్టు తీర్పుతో హీరో ఎలక్ట్రిక్ హీరో ట్యాగ్‌పై హక్కులను పొందింది. 

రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను !


దేశీయ టెలికం  జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా అనేక బెనిఫిట్స్‌తో కస్టమర్‌లకు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో రూ. 500లోపు అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. టెలికాం ఆపరేటర్ కూడా 60 రోజుల వ్యాలిడిటీతో పూర్తి ప్లాన్‌లను అందించడం లేదు. 2 నెలల్లో 56 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్యాక్‌లను అందిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాలిడిటీ కావాలంటే.. రూ. 500 కన్నా తక్కువ ప్లాన్లను ఎంచుకుంటే.. డేటా బెనిఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. 

జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : రిలయన్స్ Jio నుంచి రూ. 479 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMSలను పొందవచ్చు. 1.5GB డెయిలీ డేటా అందిస్తుంది. అంటే యూజర్లు నెలవారీ ప్రాతిపదికన మొత్తం 84GB డేటాను పొందవచ్చు. Reliance Jio ప్లాన్లలో 2 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 500 ధర పరిధిలో 2GB రోజువారీ డేటాతో రీఛార్జ్ ప్లాన్ లేదు. రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే.. 56 రోజుల పాటు వ్యాలిడిటీ పొందవచ్చు. JioTV యాప్, JioCinema యాప్‌కి ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : భారతీ Airtel కూడా జియో లాంటి ప్లాన్‌ను అందిస్తుంది. కానీ Reliance Jio కన్నా ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుంది. రూ. 479 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉంది. 1.5GB రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అపోలోకి మూడు నెలల ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇతర బెనిఫిట్స్ Wynk Music యాప్, HelloTunesకి ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Vi ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : Vi (వోడాఫోన్ ఐడియా) బెనిఫిట్స్ రూ. 479 ప్రీపెయిడ్ ప్యాక్‌తో వచ్చింది. 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. 12:00AM నుంచి 6:00AM వరకు అన్ లిమిటెడ్ డేటా, ఫ్రీగా నైట్ డేటాను పొందవచ్చు. వారపు రోజుల డేటా కూడా శనివారం-ఆదివారం వరకు ఫార్వార్డ్ అవుతుంది. అదనంగా.. Vodafone ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాను అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు.

సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా !


ఆస్ట్రేలియాలో 2016 మార్చి నెల నుంచి 2018 అక్టోబర్ మధ్య  సామ్‌సంగ్‌ ఎస్‌7, ఎస్‌8 సిరీస్‌కు చెందిన 31 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ల ప్రకటనలో భాగంగా సామ్‌సంగ్‌ వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌లు అంటూ ప్రచారం చేసుకుంది. అయితే తీరా మొబైల్‌ ఫోన్‌లను ఉపయోగించిన తర్వాత నీళ్లలో తడిచిన తమ ఫోన్‌లు పనిచేయడం లేదంటూ వందలాది మంది సామ్‌సంగ్‌ యూజర్లు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 2019లో పలు కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల పాటు విచారణ జరిగన తర్వాత తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో సంబంధిత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించిన యూజర్లు తమను సంప్రదించాలని సామ్‌సంగ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. వాటర్‌ రెసిస్టెంట్స్‌ విషయంలో యూజర్లను సామ్‌సంగ్‌ తప్పుదోవ పట్టించదన్న కారణంతో ఆస్ట్రేలియన్‌ కాంపిటీషన్‌ అండ్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ సామ్‌సంగ్‌పై దావా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఏకంగా రూ. 75 కోట్ల జరిమానా విధించింది.

పోకో F4 5G: Dolby Vision విడుదల


POCO F4 5G స్మార్ట్ ఫోన్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Dolby Vision డిస్ప్లే మరియు Atmos సౌండ్ సపోర్ట్ తో సహా గొప్ప ఫీచర్లతో అందించింది. అంతేకాదు, ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన లాంచ్ బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. POCO F4 5G స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే Dolby Vision సపోర్ట్ కలిగిన E4 సూపర్ AMOLED డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో కలిగి వుంటుంది. అధనంగా, ఈ డిస్ప్లే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు MEMC టెక్నాలజీతో కూడా వుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది.  గరిష్టంగా 3.2GHz క్లాక్ స్పీడ్ అందించ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ROM వరకూ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఇది ఎర్గోనామిక్ ఫ్లాట్ సైడ్స్ తో ప్రీమియం డిజైన్ తో కూడా ఉన్నట్లు పోకో తెలిపింది. పోకో F4 5G కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 64MP మైన్ కెమెరాని జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంటుంది. అలాగే, ఈ ఫోన్ లో కెమెరాలు బ్లర్ ను తగ్గించే విధ్దంగా రూపొందించబడినట్లు కూడా చెబుతోంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబర్చడానికి 7 లేయర్ గ్రాఫైట్ షీట్స్ కలిగిన 3112mm వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 4500mAh బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

POCO F4 5G (6GB + 128GB) ధర: రూ.27,999

POCO F4 5G (8GB + 128GB) ధర: రూ.29,999

POCO F4 5G (12GB + 256GB) ధర: రూ.33,999


Thursday, June 23, 2022

సంవత్సర కాలం పెయిడ్ లీవ్ ప్రకటించిన మీషో


మీషో ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా పాపులర్ అవుతోంది. మీషో సంస్థ తమ ఉద్యోగులకు అన్‌లిమిటెడ్ లీవ్ పాలసీని ప్రకటించింది. ఉద్యోగులు 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగులకు 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే లభిస్తుంది. మీషో మీకేర్ ప్రోగ్రామ్ ద్వారా 365 రోజుల వరకు పెయిడ్ లీవ్స్ పొందొచ్చు. తమ కుటుంబ సభ్యులు ఎవరైనా క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఇది తరచుగా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటే, ఎక్కువకాలం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటే ఉద్యోగులు లీవ్ తీసుకోవచ్చు. వ్యక్తిగత అభిరుచులు లేదా లక్ష్యాల కోసం కొంత సమయం తీసుకోవాలని కోరుకునే ఉద్యోగులకు కూడా ఈ విధానం వర్తిస్తుంది. వాళ్లు కూడా 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగులు అనారోగ్యంతో ఉన్నా పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. సెలవు కాలంలో పూర్తి జీతం లభిస్తుంది.  అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం తీసుకున్న సెలవుల కోసం, ఉద్యోగులకు సెలవు సమయంలో జీతంలో 25 శాతం వరకు లభిస్తుంది. పరిహారంతో పాటు, ప్రావిడెంట్ ఫండ్, బీమా, అదనపు మెడికల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఒకవేళ నాన్ మెడికల్ కారణాలతో లీవ్ తీసుకుంటే ఆ సెలవులకు జీతం లభించదు.  మీషో మీకేర్ ప్రోగ్రామ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంపూర్ణ శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమం. ఈ పాలసీ కింద అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వెల్‌నెస్ కార్యక్రమాలు కూడా ఇందులో కవర్ అయి ఉంటాయి. బెంగళూరుకు చెందిన మీషో సంస్థలో ప్రస్తుతం 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడానికి ఉద్యోగులకు దీర్ఘకాల సెలవులు అవసరమయ్యే సందర్భాలను తాము చూస్తున్నామని, ఉద్యోగులు అనారోగ్యంతో ఉండటం లేదా వారి కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యంతో ఉన్న సందర్భాల్లో ఎక్కువ సెలవులు అవసరం అవుతున్నాయని తాము గుర్తించామని, అందుకే ఈ పాలసీ ప్రకటించామని మీషో సీహెచ్ఆర్‌ఓ ఆషిష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ కింద ఉద్యోగులు చురుకుగా పని చేసిన కాలంలో అప్రైజల్ ప్రోగ్రామ్‌కు కూడా అర్హులు అవుతారు. ఉద్యోగులు సెలవు తర్వాత తిరిగి విధుల్లోకి వచ్చినప్పుడు వారు గతంలో ఏ హోదాలో పనిచేశారో అదే హోదా లభిస్తుంది. ఒకవేళ ఆ హోదా అందుబాటులో లేకపోతే అదే స్థాయి హోదా ఉన్న ఉద్యోగం ఇస్తారు.

ఆపిల్ నుంచి శాంసంగ్ కు 80 మిలియన్ల డిస్‌ప్లే పానెల్స్‌ ఆర్డర్ ?


ఐ ఫోన్ 14 మొబైల్స్ తయారీకి శాంసంగ్ సంస్థ 80 మిలియన్ల OLED డిస్‌ప్లే పానెల్స్‌ను సరఫరా చేయనున్నట్లు కొరియాకు చెందిన ఓ మీడియా న్యూస్ నివేదిక లీకులిచ్చింది. ఈ ఏడాది యాపిల్‌కు శాంసంగ్ భారీ స్థాయిలో OLED డిస్‌ప్లే పానెల్స్‌ను సరఫరా చేస్తుంది. ఇందు కోసం శాంసంగ్ సంస్థ భారీ స్థాయిలో OLED డిస్‌ప్లే పానెల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది మూడో త్రైమాసికానికి వాటిని యాపిల్‌కు డెలివరీ ఇవ్వనున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ డిస్‌ప్లేలు ఐ ఫోన్ 14 ప్రోతో పాటుగా ఐఫోన్ రెగ్యులర్ సిరీస్‌లకు కూడా వినియోగించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది యాపిల్ ఐ ఫోన్ 14 సిరీస్‌లో నాలుగు మొబైల్స్ ను విడుదల చేయాలని కసరత్తులు చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో రెండు ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 14 Max రెగ్యులర్ మోడల్స్ ఉండగా, మరో రెండు ప్రో మోడల్స్ ఐ ఫోన్ 14 Pro, ఐ ఫోన్  14 Pro Max లు ఉండనున్నాయి. ఈ రెండు రెగ్యులర్ మరియు ప్రో మోడల్ మొబైల్స్ 6.1 అంగుళాలు , 6.7 అంగుళాల డిస్‌ప్లే సైజులను కలిగి ఉండనున్నాయి. మొత్తం 80 మిలియన్ డిస్‌ప్లే పానెల్స్‌లో 38.17 మిలియన్ పానెల్స్ రెగ్యులర్ ఐఫోన్ మోడల్స్‌కు వినియోగించనున్నట్లు నివేదికలోని సమాచారం ద్వారా తెలిసింది. ఈ ఐ ఫోన్ 14 సిరీస్‌కు వినియోగించే డిస్‌ప్లే పానెల్స్ తయారీలో శాంసంగ్ TFT-based లో టెంపరేచర్ పాలిక్రిస్టలైన్ ఆక్సైడ్ , TFT-based లో టెంపరేచర్ పాలి సిలికాన్  ను ఉపయోగించనుంది. ఈ డిస్‌ప్లే పానెల్స్ తయారీ ప్రాజెక్ట్ చైనా కు చెందిన బీఓఈ సంస్థ చేపట్టాల్సి ఉందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, డిజైన్ మార్పిడి సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి బీఓఈ సంస్థ ను తప్పించారు. ఐఫోన్ 14 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌లో విడుదల కానున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి గొప్ప డిస్‌ప్లే పానెల్స్‌తో రానున్నట్లు అంచనాలు వేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత యాపిల్ ఐఫోన్‌లో డిజైన్‌లో మార్పు చేస్తున్నట్లు సమాచారం.

రియల్‌మీ సీ30 విడుదల


రియల్‌మీ సీ30 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించారు. 1 టీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో పెంచుకునే అవకాశం ఉంది. రెడ్‌మీ 10ఏ, టెక్నో స్పార్క్ 2022, శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్‌లతో ఈ ఫోన్ పోటీ పడనుంది. ఇందులో రెండు వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.8,299గా నిర్ణయించారు. బాంబూ గ్రీన్, డెనిమ్ బ్లాక్, లేక్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జూన్ 27వ తేదీన దీని సేల్ జరగనుంది. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత రియల్‌మీ యూఐ గో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా... స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీ మీటర్లు, బరువు 182 గ్రాములుగా ఉంది.

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ విడుదల !


దేశీయ మార్కెట్లో అలెక్సా ఫైర్ టీవీ స్టిక్, కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్  విడుదలైయ్యాయి. ఈ కొత్త రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లకు ప్రత్యేకమైన కంట్రోల్ బటన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఇతర యాప్స్‌కు కూడా ప్రత్యేకమైన బటన్స్ ఉన్నాయి. 2020లో అసలైన ఫైర్ టీవీ స్టిక్ లాంచ్ అయ్యాక ఇప్పుడు అలెక్సా వాయిస్ రిమోట్‌ను కూడా అమెజాన్ తీసుకురావడం విశేషం. దీని ధర  రూ.2,999గా నిర్ణయించారు. అమెజాన్ ఇండియా సైట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఒరిజినల్ ఫైర్ టీవీ స్టిక్ ఇదే ధరతో మనదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు ఆ పాత మోడల్ రూ.2,499కు అందుబాటులో ఉంది. 8 జీబీ స్టోరేజ్ అందించారు. ఫుల్ హెచ్‌డీలో కంటెంట్ స్ట్రీమ్ చేయవచ్చు. అయితే కొత్తగా లాంచ్ అయిన బండిల్డ్ అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ మాత్రం గతంలో లాంచ్ అయిన రిమోట్ కంటే కొంచెం భిన్నంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మ్యూజిక్‌లకు ఇందులో ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి. దీంతోపాటు ఫైర్ టీవీ స్టిక్‌లో అందుబాటులో ఉన్న అన్ని యాప్స్‌కు షార్ట్‌కట్స్ ఈ రిమోట్‌లో అందించారు. వాయిస్ బటన్ ద్వారా వినియోగదారులు అలెక్సాను కూడా యాక్సెస్ చేయవచ్చు. రిమోట్‌కు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీని మందం 1.6 సెంటీమీటర్లు కాగా, బరువు 42.5 గ్రాములుగా ఉంది. మొత్తంగా కొత్త అలెక్సా వాయిస్ రిమోట్ లైట్‌లో గతంలో లాంచ్ అయిన ఫైర్ టీవీ స్టిక్ వాయిస్ రిమోట్ తరహాలోనే పవర్, వాల్యూమ్ బటన్లు ఉన్నాయి. అమెజాన్ గతేడాది మనదేశంలో ఫైర్ టీవీ స్టిక్ 4కే మ్యాక్స్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.6,499గా ఉంది. మీడియాటెక్ ఎంటీ8696 ప్రాసెసర్‌పై ఈ స్టిక్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఈ ఫైర్ టీవీ స్టిక్‌లో ఉన్నాయి. వైఫై 6 కనెక్టివిటీని ఇందులో అందించారు. బ్లూటూత్ వీ5.0ని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. అంటే బ్లూటూత్ స్పీకర్లు, హెడ్ ఫోన్లు, వీడియో గేమ్ కంట్రోలర్లు వంటివి కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చన్న మాట. హెచ్ డీఆర్, హెచ్ డీఆర్10+ ఫార్మాట్లతో పాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లను కూడా ఈ స్టిక్ సపోర్ట్ చేయనుంది. ఈ స్టిక్ మందం 1.4 సెంటీమీటర్లుగా కాగా, బరువు 48.4 గ్రాములు మాత్రమే. లైవ్ వ్యూ అనే ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు టీవీ చూస్తూనే.. తమ ఇంట్లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ను పీఐపీ ఫీడ్ ద్వారా చూసే అవకాశం లభిస్తుంది.

ట్వీట్‌లో అక్షరాల పరిమితి పెంపు ?


ట్విటర్‌లో ఏదైనా రాసి పోస్ట్ చేయాలనుకుంటే కేవలం 280 అక్షరాలు మాత్రమే రాయగలం. అంతకు మించి క్యారెక్టర్లు రాయాలనుకుంటే మరో ట్వీట్ చేయాల్సిందే. అయితే, అక్షరాల పరిమితిని 280 నుంచి 2,500కు పెంచాలని ట్విటర్ యోచిస్తోంది. ఈ మేరకు నోట్స్ పేరిట కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే యూజర్లు తమ సుదీర్ఘ సందేశాలను పోస్టు చేయొచ్చు. దాంతో పాటు ఫొటోలు, వీడియోల వంటివి కూడా జోడించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ట్విటర్ టైమ్ లైన్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు చేసే ఈ సుదీర్ఘ ట్వీట్‌ ప్రివ్యూను కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఘనాల్లో ప్రయోగాత్మకంగా ట్విటర్‌ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోట్‌ను షేర్ చేసుకోవాలనుకునేవారి కోసం అందుకోసం ప్రత్యేకంగా లింక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. 2017 కంటే ముందు ట్విటర్‌లో క్యారెక్టర్ల పరిమితి 140గా ఉండేది. అయితే, అనంతరం ఆ పరిమితిని 280కి పెంచారు.

Wednesday, June 22, 2022

ట్వీట్ ఎడిట్‌కు ఆప్షన్....!


ట్వీట్ ఎడిట్ ఫీచర్ తీసుకొస్తామని ట్విట్టర్ గతంలోనే ప్రకటించింది. ఈ ఫీచర్ కోసం యూజర్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఎడిట్ ట్వీట్ ఫీచర్‌ను ట్విట్టర్ లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతానికి కేవలం కొంతమంది యూజర్లకు మాత్రమే ఎడిట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెగ్యులర్ యూజర్లందరికీ లాంచ్ చేసే ముందు టెస్టింగ్‌లో భాగంగా సెలక్టెడ్ యూజర్లకు పరిచయం చేసింది. ఎడిట్ బటన్‌కి సంబంధించి ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్‌లో ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేశారు. ఈ స్క్రీన్‌షాట్‌లో.. ట్వీట్‌లో అసభ్యకర, హానికర టెక్స్ట్ ఉంటే, దాన్ని ఎడిట్ చేసుకునేందుకు ఎడిట్ బటన్ ఆప్షన్ అందుబాటులో ఉన్నట్లు కనిపించింది. కాగా ఈ ఫీచర్ మరికొద్ది వారాలు లేదా నెలల్లో యూజర్లందరికీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఎడిట్ బటన్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై యూజర్ ట్వీట్ చేసినప్పుడు అందులో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయా లేదా అనేది ప్రస్తుత ఎడిట్ టూల్‌లోని ఒక అల్గారిథమ్‌ చెక్ చేస్తుంది. ఒకవేళ అందులో హానికర లేదా అభ్యంతరకర, బెదిరింపు వంటి పదాలు ఉన్నట్లయితే "మోస్ట్ ట్వీటర్స్‌ డోంట్ పోస్ట్ రిప్లయిస్ లైక్ థిస్" అనే ఒక పాపప్‌ కనిపిస్తుంది. ఈ విండో దిగువన ట్వీట్, ఎడిట్ , డిలీట్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. యూజర్ అలాంటి పదాలతోనే ట్వీట్ చేయాలనుకుంటే ట్వీట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తద్వారా అసభ్యకర పదాలతోనే ట్వీట్ పోస్ట్ అవుతుంది. లేదంటే ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి తాము పంపిన ట్వీట్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. లేదా డిలీట్ ఆప్షన్‌పై నొక్కి దానిని పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు. హానికరమైన లేదా అసభ్యంగా కనిపించే ట్వీట్‌ను చేసినప్పుడు ట్విట్టర్ ఆ ట్వీట్‌ను సింపుల్‌గా ఇగ్నోర్ చేస్తుంది లేదా డిలీట్ చేయమని అడుగుతుంది. కానీ రాబోయే ఎడిట్ ఫీచర్ వల్ల మొత్తం ట్వీట్‌ను కాకుండా దానిలోని కంటెంట్‌ను ఎడిట్ చేయడం వీలవుతుంది. అయితే కేవలం అసభ్యకర భాష ఉంటే మాత్రమే కాదు మిగతా అన్ని ట్వీట్స్‌కు ఎడిట్ ఫీచర్ వర్క్ అయ్యేలా ఎడిట్ బటన్‌ను కంపెనీ తీసుకురావచ్చు ఎడిట్ బటన్‌తో పాటు, ట్విట్టర్ నోటిఫికేషన్‌లలో లైక్ లేదా డిస్‌లైక్ ఆప్షన్ యాడ్ చేయనున్నట్లు ముకుల్ వెల్లడించారు. ఈ ఫీచర్ వల్ల యూజర్లు నోటిఫికేషన్‌ ప్యానెల్‌లోనే ఒక ట్వీట్‌కు వచ్చిన లైక్స్, కామెంట్స్, రిట్వీట్స్ చూడవచ్చు. అంతేకాదు, వోట్/లైక్‌, డౌన్‌వోట్/డిస్‌లైక్ వంటి ఆప్షన్లను కూడా చూడవచ్చు. అలానే, నోటిఫికేషన్‌లలోనే ట్వీట్‌లకు రిప్లై ఇవ్వచ్చు, లైక్ చేయవచ్చు లేదా రీట్వీట్ చేయవచ్చు. ట్విట్టర్ ఈ లైక్ ఫీచర్‌ని ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Popular Posts