Search This Blog
Sunday, October 31, 2021
పులిని చంపిన వేటగాళ్లు
ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడులయింది. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇక తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది ఈసీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉండడంతో.. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి, తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో.. మెజారిటీ స్థానాలను ఆయా పార్టీలే గెలుచుకునే అవకాశముంది.
ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా?
బుడమ కాయ - ప్రయోజనాలు
మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కల గురించి మనకు పెద్దగా తెలీదు. వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బుడమ కాయ తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఉండి లోపల చిన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి. నులిపురుగుల సమస్య ఉన్నవారు ఈ పండ్లు తింటే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది. అలాగే మలబద్దకం సమస్యకు కూడా సహాయపడుతుంది. ఈ పండ్లను దసరా రోజు అమ్మవారి దగ్గర పెట్టి కొంతమంది తింటుంటారు. పొలాల్లో పని చేసే వారికి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాయలను తెచ్చి వాటినుండి వచ్చే పసరును గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఈ కాయలలోనే కాకుండా ఆకులలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది కీళ్ల నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్న చోట కట్టడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
తక్కువ బడ్జెట్లో 'నాయట్టు' రీమేక్ ?
ఈ ఏడాది మలయాళం నుంచి వచ్చిన మంచి చిత్రాల్లో 'నాయట్టు' ఒకటి. రాజకీయ నాయకులు.. ప్రభుత్వాధినేతలు ప్రజల మధ్య కులం కుంపట్లు పెట్టి వ్యవస్థలను తమ స్వార్థం కోసం ఎలా ఉపయోగించుకుంటారో అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు ప్రభుత్వం కోసం పని చేసేవాళ్లు ఎలా బలిపశువులు అయిపోతారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. కొవిడ్ నేపథ్యంలో ఈ హార్డ్ హిట్టింగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజై మలయాళీలనే కాక వివిధ భాషల వాళ్లను అమితంగా ఆకట్టుకుంది. మార్టిన్ ప్రకాట్ రూపొందించిన ఈ చిత్రంలో కుంచుకో బోబన్, నిమిష, జార్జ్ జోసెఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ఆ ముగ్గురి చుట్టూనే తిరుగుతుంది. కథాబలానికి తోడు కథనంలో ఉత్కంఠ ఈ ముగ్గురి అద్భుతమైన నటన దర్శకుడి ప్రతిభ తోడై సినిమా క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది. 'నాయట్టు' రిలీజై కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు అమ్ముడైపోయాయి. అల్లు అరవింద్ వారి జీఏ2 పిక్చర్స్ దీని హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రి ప్రొడక్షన్, కాస్ట్ అండ్ క్రూ ఎంపిక అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి షూట్‌కు రెడీ అయిపోయారు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ 'నాయట్టు' తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. బన్నీ వాసు, దివ్య మాధురి కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. తమిళంలో జార్జ్ జోసెఫ్ చేసిన కీలక పాత్రను ఇక్కడ రావు రమేష్ చేయబోతున్నారు. ఆయన కెరీర్లో ఈ పాత్ర ఒక మైలురాయిలా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఒరిజినల్లో కుంచుకో చేసిన పాత్రను ప్రియదర్శి, నిమిష కనిపించిన క్యారెక్టర్లో అంజలి కనిపించనున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ అందించబోతున్నాడు. తక్కువ బడ్జెట్లో శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి టీం రెడీ అయింది.
పోషకాహారంతో ఆయుర్దాయం పెంచుకోండి..!
మనం తీసుకునే ఆహారం, జీవనశైలి బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పోషకాహారం తీసుకోవడం, ఆకు కూరలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. ఈ ఆహార పదార్థాలను డైట్ లో తీసుకోవడం వల్ల ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవచ్చు. ఆకు కూరలు: ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయుర్దాయాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఆకుకూరలు సహాయపడతాయి. ముఖ్యంగా పాలకూరలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ సమస్యలు రాకుండా ఇదే చూసుకుంటుంది. అలానే ఆయుర్దాయాన్ని పెంపొందించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఓట్స్: ఓట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. పైగా వీటిని మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఒక సర్వే ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఆరు వారాల పాటు ఓట్స్ ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గాయని తేలింది. రోజుకి 100 గ్రాములు ఓట్స్ ని తీసుకుని వాళ్లలో కొలెస్ట్రాల్ తగ్గిందని బాడీ వెయిట్ కూడా తగ్గిందని తెలుస్తోంది. కాబట్టి ఓట్స్ ని మీ డైట్ లో తీసుకోవడం కూడా మంచిదే. దీని వల్ల ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. బ్లూ బెర్రీస్: ఓట్స్ తో పాటు బ్లూ బెర్రీస్స్ తీసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఓట్స్ తో బ్లూ బెర్రీస్ తీసుకోండి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం మంచిది. ఇలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలానే ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
గీతాంజలి రామకృష్ణ
సర్దార్ వల్లభ్ భాయి పటేల్
నీ మేలు కోరేవారు....!
పంచపాతకాలు....!
Saturday, October 30, 2021
కార్బన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ విడుదల
ఆ రాయి ఖరీదు 24 కోట్లు !
యూకేకి చెందిన 70 ఏళ్ల బామ్మ రకరకాల వస్తువులను తీసుకొచ్చే వాళ్ల దగ్గరి నుంచి ఓ స్టోన్ ను కొనుగోలు చేసినట్లు ఆమెకు గుర్తు. కొని చాలా రోజులు కావడంతో మరిచిపోయింది. ఓ రోజు అనవరమైన వస్తువులను డస్ట్ బిన్ లో పడేసేందుకు సిద్ధమైంది. అప్పుడు ఆ స్టోన్ దొరికింది. దీనిపై నార్త్ షీల్డ్స్ లోని ఫీటన్ బై వేలం పాటదారులకు చెందిన మార్క్ లేన్ మాట్లాడారు. ఆభరణాల బ్యాగులో దానిని పెట్టుకొని వచ్చిందని, ఒక పెద్ద రాయి వలే అనిపించిందన్నారు. డైమండ్ టెస్టర్ తో టెస్టు చేసేంత వరకు దానిని తాము గుర్తించుకోలేక పోయామన్నారు. బెల్జియంలో ఆంట్ వెర్ప్ లోని నిపుణులచే ధృవీకరించక ముందే..తాము దానిని లండన్ లోని తమ భాగస్వాములకు పంపామన్నారు. దీనిని రూ. 24 కోట్లు విలువ చేసే 34 క్యారెట్ల డైమండ్ గా నిర్ధారించారు. ఈ డైమండ్ రింగ్ ను నవంబర్ 30వ తేదీన వేలం వేస్తామని..అప్పటి వరకు లండన్ లోని డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్ లో ఉంచుతామన్నారు.
గోద్రేజ్ కుటుంబంలో చీలిక
సబ్బులు, గృహోపకరణాల నుంచి స్థిరాస్తి దాకా వివిధ రంగాల్లో విస్తరించిన దేశీయ దిగ్గజం గోద్రెజ్ గ్రూప్‌నకు గోద్రెజ్ కుటుంబం సారథ్యం వహిస్తోంది. అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఈ కుటుంబంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపార విభజన జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బయటి నుంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సలహాలు కోరినట్లు పేర్కొన్నాయి. 124 సంవత్సరాల క్రితం 1897లో న్యాయవాది నుంచి వ్యాపారవేత్త అవతారమెత్తిన అర్దెశిర్ గోద్రేజ్, గోద్రేజ్ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం గోద్రేజ్ గ్రూపునకు ఆది గోద్రేజ్ (79) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సోదరుడు నాదిర్.. గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ అగ్రోవెట్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. వీరి కజిన్ జంషీద్ ఎన్ గోద్రేజ్.. గోద్రేజ్ అండ్ బోయ్స్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. గ్రూపును రెండుగా విభజించాలని భావిస్తున్నారని సమాచారం. దీంట్లో ఒకదానికి ఆది, నాదిర్ నేతృత్వం వహిస్తారు. మరో దాన్ని జంషీద్, ఆయన సోదరి స్మితా గోద్రేజ్ కృష్ణా నిర్వహిస్తారు. ఈ వార్తలపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన గోద్రేజ్ కుటుంబం.. ''తమ గ్రూపు సంస్థల్లోని వాటాదార్లకు లబ్ధి చేకూరేలా దీర్ఘకాల వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నాం'' అని తెలిపింది. ఇందులో భాగంగా బయటి నుంచి కూడా సలహాలు కోరినట్లు పేర్కొంది. ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండే బ్యాంకర్లు నిమేశ్ కంపానీ, ఉదయ్ కొటాక్‌తో పాటు న్యాయపరమైన వ్యవహారాల్లో పేరుగాంచిన జియా మోదీ, సిరిల్ ష్రాఫ్ సైతం ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
కళ్ళ కింద వాపు వస్తుందా !
* ఒక టీ స్పూన్ ఉప్పు లో కొద్దిగా వేడినీటిని కలిపి అందులో కాటన్ ప్యాడ్ ని కానీ కాటన్ క్లాత్ ను కానీ ముంచి కళ్ళ మీద పెట్టాలి. ఇలా చేయడం వలన అలసిన కళ్ళకు స్వాంతన కలిగిస్తుంది.
* కోడిగుడ్డులోని తెల్లసొనను ఒక కప్పు లోకి తీసుకుని దానిని బాగా గిలకొట్టి కొండ చుట్టూ రాయాలి. ఇలా రాసిన తర్వాత కొంతసేపటికి ఆరిపోయి స్కిన్ టైట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి ఇలా చేస్తూ ఉంటే కళ్లకింద చర్మం సాగినట్లు ఉండటం వాపు వంటివి తగ్గుతాయి. * సాధారణంగా చాలా రకాల ఫేషియల్ ప్యాక్ లకు కళ్లచుట్టూ ఉన్న చర్మం నిర్వహించాల్సి ఉంటుంది.
తొక్కే కదా అని పారేయకండి..!
షుగర్, రక్తపోటుకి చెక్ - దాల్చిన చెక్క టీ
ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్య ఫలితమే బొగ్గు కొరత
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవటం కేవలం ప్రణాళికా లోపమే. పూర్తి నిర్లక్ష్యం, అసమర్ధత ఫలితమే. దేశంలో విద్యుత్ సరఫరా సజావుగా సాగాలంటే బొగ్గు, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. మోడీ ప్రభుత్వం ఈ సమన్వయం సాధించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతోంది. ఎవరిని బలి చేయాలా అని దిక్కులు చూస్తోంది.
జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్
Friday, October 29, 2021
ఇక నుండి మెటాగా గుర్తింపు..!
ఫేస్ బుక్ ఇప్పుడు తన అన్ని విభాగాలను లేదా సర్వీస్ లను ఒక్క గూటికి చేర్చడానికి పూనుకుంది. దీనికి గూగుల్ ని ఉదాహరణగా చెపుకోవచ్చు. గూగుల్ ఒకే బ్రాండింగ్ పేరుతో తన అన్ని సర్వీస్ లను నడిపిస్తోంది. అదే విధంగా, ఫేస్ బుక్ కూడా తన అన్ని సర్వీస్ లను ఒక పేరు పరిధిలోకి తీసుకువస్తుంది. అదే, ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న మెటా అంటే, ఫేస్ బుక్ సంస్థ తన ఫేస్ బుక్ , మెసెంజర్,వాట్సాప్,ఇంస్టాగ్రామ్ మరియు ఆక్యూల్స్ తో సహా అన్ని సోషల్ మీడియా సేవలను కవర్ చేసింది. ఇక రానున్న రోజుల్లో వాటన్నిటిని మెటా పరిధిలోకి తీసుకువస్తుంది. అయితే, ఫేస్ బుక్ మజమాన్యం క్లియర్ గా చెబుతున్న మరియు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫేస్బుక్, వాట్సాప్ మరియు ఇతర సర్వీస్ లు ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో ముందు కూడా అలానే పనిచేస్తాయి మరియు దీనిని రీబ్రాండ్ ప్రభావితం చేయదు.
ఈఎంఐ ఆప్షన్ లోనూ జియోఫోన్ నెక్స్‌ట్....!
ప్రపంచంలోనే అత్యంత చవకైనా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారి కోసం జియోఫోన్ నెక్స్‌ట్ వచ్చేసింది. రిలయన్స్ జియో, గూగుల్ సంయుక్తంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడం విశేషం. కేవలం రూ.1,999 ఎంట్రీ ప్రైస్ చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కేవలం రూ.300 నుంచే ప్రారంభం అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేవారికి డేటా, వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి బెనిఫిట్స్ మారుతుంటాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఎనిమిది రకాల ఈఎంఐ ఆప్షన్స్ ప్రకటించింది రిలయన్స్ జియో. రూ.300 నుంచి రూ.600 వరకు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్వేస్ ఆన్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.300 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.350 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి నెలకు 5జీబీ డేటా + 100 నిమిషాల కాల్స్ లభిస్తాయి, లార్జ్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.450 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.500 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 1.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.500 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.550 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎక్స్‌ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.550 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.600 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి., ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇలా ఈఎంఐ ఆప్షన్‌తో రావడం ఇదే మొదటిసారి. ఇందులో ఏ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ముందు రూ.1,999 ఎంట్రీ ప్రైస్ చెల్లించాలి. రూ.501 ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ వద్దనుకుంటే రూ.6,499 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. జియోమార్ట్ డిజిటల్ నెట్వర్క్‌లో 30,000 పైగా రీటైల్ పార్ట్‌నర్స్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. జియోమార్ట్ డిజిటల్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ కొనడానికి రిజిస్టర్ చేయొచ్చు. లేదా https://www.jio.com/next లింక్‌లో రిజిస్టర్ చేయొచ్చు. వాట్సప్‌లో 70182-70182 నెంబర్‌కు HI అని టైప్ చేసి రిజిస్టర్ చేయొచ్చు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత దగ్గర్లోని జియోమార్ట్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ కలెక్ట్ చేసుకోవచ్చు.
జియోఫోన్ నెక్స్‌ట్ లో ప్రగతి ఓఎస్
* మాట్లాడడం ద్వారా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు. (ఉదాహరణ: యాప్ లు ఓపెన్ చేయడం, సెట్టింగ్స్ మేనేజ్ చేయడం.) ఇంటర్నెట్ నుంచి సైతం సమాచారాన్ని కావాల్సిన భాషలో పొందొచ్చు.
* రీడ్ ఎలౌడ్ ఫీచర్ సహాయంతో యూజర్లు స్క్రీన్ పైన ఉన్న టెక్స్ట్ ను తమకు కావాల్సిన భాషలో చదివి వినిపించవచ్చు.
* ఇందులో ట్రాన్స్‌లేట్ నౌ అనే ఫీచర్ ఉంది. ఈ యాప్‌లో మొబైల్ స్క్రీన్ లేదా ఇమేజ్‌ను తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
* స్మార్ట్, పవర్ ఫుల్ కెమెరాను పొందుపర్చారు. పోట్రైట్ తో పాటు అనేక రకాల ఫొటోగ్రఫీ మోడ్స్ కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటోమోటిక్ బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ ఫీచర్ ద్వారా యూజర్లు ఆకట్టుకునే ఫొటోలను పొందవచ్చు. నైడ్ మోడ్ ద్వారా లైట్ తక్కువగా ఉన్న సమయంలోనూ యూజర్లు మంచి ఫొటోలను తీయవచ్చు.
* గూగుల్ ప్లే స్టోర్ లోని మిలియన్ల కొద్ది యాప్ లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో గూగుల్, జియో యాప్స్ కు సంబంధించిన ప్రీ లోడ్ యాప్ లు ఉంటాయి.
* సెక్యూరిటీ, నూతన ఫీచర్లకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందించేలా ఓఎస్ ను తీర్చిదిద్దారు.
* నియర్ బై షేర్ ఫీచర్ ద్వారా ఇంటర్ నెట్ లేకుండానే యాప్స్, ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ను ఇతరులకు షేర్ చేయొచ్చు.
దుమ్ము లేపుతున్న రెడ్‌మీ అమ్మకాలు !
మూడవ త్రైమాసికంలో మొత్తం భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 52 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే ఈ ఫలితాల్లో రెడ్‌మీ 9, రెడ్‌మీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ల అమ్మకాలతో 22 శాతం వాటాతో షావోమీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షిప్‌మెంట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 19శాతం షిప్‌మెంట్‌తో శాంసంగ్ భారత్‌లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. క్యూ3 భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లపై కౌంటర్‌పాయింట్ నివేదికలో షావోమీ, శాంసంగ్, వివో, రియల్‌మీ, ఒప్పో ఫోన్‌ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మీ9, రెడ్‌మీ9 పవర్, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్‌లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్‌మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో 19 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.10,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉన్న ఫోన్ అమ్మకాల మార్కెట్ వాటా 25 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం42, శాంసంగ్ గెలాక్సీ ఎం 52, శాంసంగ్ గెలాక్సీ ఏ 22, శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ మోడళ్లు 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ బ్రాండ్‌లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్‌లో భారత స్మార్ట్ ఫోన్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది.
8.5శాతం వడ్డీకి కేంద్రం ఆమోదం ?
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈపీఎఫ్)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ట్రస్టీల బోర్డుకు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ కూడా సమ్మతించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5కోట్లకు పైగా ఈపీఎఫ్ చందాదారులకు త్వరలోనే ఈ వడ్డీని జమ చేసే అవకాశాలున్నాయి. పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీరేటు.. గత ఏడేళ్లలో ఇదే తక్కువ కావడం గమనార్హం. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, ఖాతాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5శాతానికి తగ్గించారు.
ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా T20 ట్యాబ్లెట్ సేల్
భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే !
భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదేనని, రాష్ట్రంలో ప్రతీ 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా పన్ను రాయితీలు, తయారీదారులకు ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోందన్నారు. విద్యుత్ వాహనాల విషయంలో అతి పెద్ద ఛాలెంజ్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో 'ఈవీ ట్రేడ్ ఎక్స్ పో'ను మంత్రి జగదీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా..ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ద్వారా కాలుష్యం బారి నుంచి బయటపడవచ్చని, ఏర్పాటు చేసిన ఇలాంటి ఎక్స్ పోల ద్వారా…ఈవీ వాహనాల అమ్మకాలతో పాటు..మార్కెట్ లో ఎలాంటి ట్రెండ్ నెలకొందనే విషయంపై అవగాహన కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మంత్రి జగదీశ్ స్వయంగా నడిపి చూశారు.
పెట్రోల్ కన్నా విమానాల ఇంధనం ధరే తక్కువ!
కారే కాదు బైక్ బయటకు తీయాలన్నా జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఇక కారు బయటకు తీస్తే చెప్పనే అక్కర్లేదు. జేబులు కాదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి. బైకు, కార్ల పెట్రోల్ ధర లీటరు రూ.110కు చేరుకోగా అదే విమానం ఇంధనం మాత్ర కేవలం రూ..79 మహా అయితే రూ.80గా ఉంది. అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలతో బైకులు, కార్లను కొన్నాళ్లకు మూలనపడేయాలనే ఆలోచనలో కొందరు ఉండగా.. మరికొందరు తక్కువ ధరకే పెట్రోలు కావాలంటే విమానాలు కొనుక్కోవడం మేలంటూ సెటైర్లు వేస్తున్నారు. బైకు సామాన్యుడి వాహనం. కాస్త మెరుగైన ఆర్ధిక పరిస్థితి ఉంటే కారు ఇవే సర్వాసాధారణంగా ఉండే వాహనాలు. కానీ వాటికి కూడా ఇంధనం పోయించే పరిస్థితి లేదిప్పుడు. పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు చాలా చీప్‌గా లభిస్తుంది. తాజాగా పెరిగిన రేట్లతో ఢిల్లీలో సాధారణ పెట్రోలు లీటరు ధర రూ.108.64లు ఉండగా విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బో ఫ్యూయల్ (ఏటీఎఫ్)పెట్రోలు లీటరు ధర రూ.79.02లకే లభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయానికి వస్తే రెగ్యులర్ పెట్రోలు ధర రూ.114.47 ఉండగా విమానాలకు ఉపయోగించే ఇంధనం లీటరు పెట్రోలు ధర రూ.77.37లకే లభిస్తోంది. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని నగరాల్లో ఇంచు మించు ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామాన్యులు వినియోగించే పెట్రోలు కంటే విమానాలకు వాడే పెట్రోలు ధర కనీసం 30 శాతం తక్కువ ధరకే లభిస్తోంది.
ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం
సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలకు టోకరా వేసేందుకు జిత్తులమారి ట్రిక్కులు ప్రయోగిస్తున్నారు. ప్రముఖ కంపెనీల అధికారుల్లా మాట్లాడుతూ కేవైసీ, ఓటీపీ పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఈ మోసాల గురించి ఇప్పటికే పలు సంస్థలు జనాలను హెచ్చరించాయి. కానీ ఇప్పటికీ ఈ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారందరో! తాజాగా కేవైసీ ఫారమ్‌ను అప్‌డేట్ చేసే సాకుతో ఒక ఎయిర్‌టెల్ కస్టమర్‌ను బురిడీ కొట్టించారు. సదరు కస్టమర్ బ్యాంక్ వివరాలు సేకరించి అతడి అకౌంట్ నుంచి భారీ నగదును తస్కరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కేవైసీ, ఓటీపీ మోసాల గురించి తన కస్టమర్ లను మళ్లీ హెచ్చరించింది.
మోసగాళ్లు ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో యూజర్ల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ తరహా కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. "బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి కాల్ చేస్తున్నట్లు లేదా మెసేజ్‌లు పంపిస్తున్నట్లు మోసగాళ్లు కస్టమర్లను సంప్రదించవచ్చు. తరువాత ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాను అన్‌బ్లాక్ లేదా రెన్యువల్ చేస్తామని కస్టమర్ల ఖాతా వివరాలు లేదా ఓటీపీని అడగవచ్చు. కస్టమర్లు ఇచ్చే వివరాలు ఈ మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్ ఐడీ, ఎంపిన్(MPIN), ఓటీపీ మొదలైన ఆర్థిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో పంచుకోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం" అని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ హెచ్చరించారు. ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు చేసే కాల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను విట్టల్ కోరారు. ఫేక్ యూపీఐ వెబ్‌సైట్‌లు, ఫేక్ ఓటీపీల కారణంగా తరచూ జరిగే మోసాల గురించి కూడా అతను వివరించారు. మోసగాళ్ల బాధితులు అవ్వకుండా ప్రతి కస్టమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన పేర్కొన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి డెల్టా వ్యాప్తి !
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా విజయ వంతంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్ డోసులను కూడా ఇచ్చేశాయి. అయినప్పటికీ యూకే, రష్యా లాంటి దేశాల్లో కరోనా విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో డెల్టా రకం వైరస్ వ్యాప్తి విపరితంగా ఉంది. మరీ… వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ఉదృతికి కారణమేంటి ? అంటే వ్యాక్సిన్ వేసుకున్న వారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే అని ఓ అధ్యయనం లో తేలింది. కరోనా రకాల్లోనే అత్యంత ప్రమాదకరమైన వేగవంతమైన వేరియంట్ గా పిలుస్తున్న డెల్టా రకం వైరస్.. టీకా వేసుకున్న వ్యక్తి నుంచి కూడా సులువుగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. బ్రిటన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ 621 మందితో ఏడాది పాటు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం పడింది. 651 మందిపై ఈ అధ్యయనం జరపగా ఇందులో 205 మంది నుంచి వారి కుటుంబ సభ్యులకు డెల్టా వేరియంట్ సోకినట్లు తేలింది.
స్కిట్‌కి లక్ష ?
హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జబర్దస్త్ లో అతను వేసే పంచులు బాగా పేలుతుంటాయి. ఇక స్కిట్లు యూట్యూబ్‌లో ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటాయి. జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కనిపిస్తూ అలరిస్తుంటాడు. దీనితో హైపర్ ఆదికి మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే అతనికి అంతే రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా ఉంటుందని టాక్. ఈవెంట్‌ను బట్టి హైపర్ ఆది పారితోషికం డిమాండ్ చేస్తాడని సమాచారం. ఇక జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే అతన్ని ఏడాది ఆదాయం కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఇక బుల్లితెరతో పాటుగా సినిమాల్లో కూడా మెరుస్తూ అలరిస్తున్నాడు ఆది. కామెడీ షోలతో పాటుగా, సినిమాలతో కలిపి బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సొంత ఊర్లో 16 ఎకరాలు కొన్న ఆది.. హైదరాబాదులో తాజాగా ఓ ప్లాట్ తీసుకున్నట్టుగా సమాచారం.
ప్రకృతి..!
జాన్ గాడ్ అనే వ్యక్తి ఒక బ్యాంకు స్థాపించాడు. ఇందులో అందరూ మెంబర్లు కావచ్చు. ప్రవేశం ఉచితం. మీ అకౌంట్లో ప్రతి రోజూ 86400 జమ చేయబడుతుంది. మీ ఓపిక పట్టి ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే ఒక విషయం..!! బద్దకంతో గానీ, నిద్రపోయి గానీ మీరు కొంత ఖర్చు పెట్టకపొతే, ఆ మిగిలినదంతా మరుసటి రోజుకి ’మైనస్’ అయిపోతుంది. ఈ రోజు ‘అదా చేసి’ తరువాత ఖర్చు పెట్టుకుంటానూ అంటే కుదరదు. మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ ఎనభై ఆరువేల నాలుగు వందలు జమ చేయబడతాయి. దీన్ని ఇంకొకరి పేరు మీద ట్రాన్స్ ఫర్ చేయటానికి వీలు ఉండదు. ఎందుకంటే బ్యాంకు వారు ఎపుడైనా సరే ‘…నేటితో మీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాము’ అని నోటీసు ఇవ్వకుండానే చెప్పవచ్చు. వారసత్వం ప్రసక్తే లేదు. దీంట్లో మీరు మెంబర్ అయితే ఏం చేస్తారు? మీరు మరింత ఆనందంగా ఉండటం కోసం... మీరు ప్రేమించే వాళ్ళ కోసం... మరింత లాభదాయకంగా ఖర్చు పెట్టటానికి ప్రయత్నిస్తారు. మరింత ఫలవంతంగా ఎలా ఖర్చుపెట్టాలా అని ఆలోచిస్తారు..! ఎందుకంటే మరుసటి రోజు పొద్దున్నకి దాని విలువ సున్నా అయిపోతుంది కాబట్టి. అంతే కదా..!
నిజంగా ఇలాంటి బ్యాంకు ఉంది, నమ్మకం కలగటం లేదా? అవును, నిజంగానే ఉంది. ఈ బ్యాంకుని సృష్టించి, రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు మీ అకౌంట్లో వేసేది ప్రకృతి..! మీరు వాడుకోని సమయం అంతా వృథా. పైగా మరణంతో అకౌంటు క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంత ధనవంతులో ఆలోచించండి..! జీవితంలో విజయం సాధించాలంటే అన్నిటి కన్నా మొదటగా కావలసింది 'సమయం' విలువ గ్రహించటం ఈ విషయం గ్రహించి, ప్రతి క్షణాన్నీ ఆనందం కోసమో, ఆర్థిక లాభం కోసమో, చుట్టూ ఉన్న అనాధల కోసమో, ఆత్మీయుల ప్రేమ కోసమో ఖర్చు పెట్టిననాడు, మీరు విజయం సాధించినట్టే.
Thursday, October 28, 2021
నీరు ఎక్కువ తాగినా ప్రమాదమే !
ఎలక్ట్రిక్ కార్లపై ఉబర్ చూపు...!
ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నద్దమైన విషయం తెలిసిందే. సాంప్రదాయ శిలాజ ఇంధన వాహనాలకు చెక్ పెడుతూ, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. కాగా హెర్జ్ వంటి రెంటర్ కార్ ఆపరేటర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు సిద్దమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పేరొందిన టెస్లాతో అమెరికన్ రెంటల్ కార్ కంపెనీ హెర్జ్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. హెర్జ్ సుమారు లక్ష టెస్లా కార్లను ఆర్డర్‌ను చేసింది. తాజాగా మరో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ క్యాబ్ ఆపరేటర్ ఉబర్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించింది. అందులో భాగంగా హెర్జ్ కంపెనీ భాగస్వామ్యంతో ఉబర్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. హెర్జ్ రెంటల్ ఎలక్ట్రిక్ కార్లను ఉబర్ వాడనుంది. సుమారు 50 వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉబర్ ఆర్డర్ ఇచ్చింది. 2023 నాటికి 50 వేలకు ఎలక్ట్రిక్ కార్ల క్యాబ్ సర్వీస్‌లను ప్రవేశపెడతామని ఉబర్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా, యూరప్, కెనడాలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఎలక్ట్రిక్ క్యాబ్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఉబర్ వెల్లడించింది.
శీతాకాలం - మహిళలు - పోషకాహారం
మహిళలు పోషకాహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వయసు పైబడుతన్నా కొద్ది వారికి పోషకాల అవసరం అధికంగా ఉంటుంది. జీవనశైలిలో మార్పుల కారణంగా, చర్మం, జుట్టు, ఎముకలకు సంబంధించిన సమస్యలు మహిళలకు సాధారణం. తరచుగా మహిళలు వెన్ను, కాళ్ళలో నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
విటమిన్ సి కోసం, మీరు నారింజ, నిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు. వాటిలో విటమిన్ సి ఉంటుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చలికాలంలో వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది, ఆకుపచ్చని కూరగాయలలో మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, ఉదాహరణకు ఇందులో విటమిన్లు A , C అధికం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. శీతాకాలం కాలానుగుణ ఆకుపచ్చ ఆకు కూరలకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, కుంకుమపువ్వు, పసుపు, దాల్చినచెక్క , ఏలకులు వంటి భారతీయ మసాలా దినుసులు చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని అందిస్తాయి. ఇది కాకుండా జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడానికి పనిచేస్తాయి. మీరు ఈ మసాలా దినుసులను అనేక విధాలుగా తీసుకోవచ్చు. మీరు వీటిని రకరకాల పానీయాలలో కలుపుకొని తాగవచ్చు, డ్రై ఫ్రూట్స్ చల్లని వాతావరణంలో వేడిని పుట్టిస్తాయి. ఖర్జూరం, అత్తి పండ్లు శీతాకాలం లో తినే డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యమైనవి. ఈ రెండిటిలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. సాధారణంగా గోరువెచ్చని పాలతో తీసుకుంటే చాలా మంచిది. చలికాలంలో తీవ్రమైన చలి కారణంగా మన చర్మం జుట్టు పొడిబారుతుంది. కావున శరీర పోషణకు నెయ్యి తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారాన్ని కాపాడుకోవడానికి మీరు క్రమం తప్పకుండా నెయ్యిని తీసుకోవాలి. చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నెయ్యి పనిచేస్తుంది.
ట్రూకాలర్ తో రైల్వేస్ ఒప్పందం
ట్రూకాలర్‌తో భాగస్వామ్యం గురించి రజ్నీ హసిజా, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ - ఐఆర్‌సీటీసీ మాట్లాడుతూ '' ట్రూకాలర్‌తో కలిసి పనిచేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో, ఐఆర్‌సీటీసీ యొక్క కమ్యూనికేషన్ మాధ్యమాలను వినియోగదారులకు మరింత సురక్షితమైన రీతిలో ట్రూ కాలర్ భాగస్వామ్యంతో మార్చడంలో మరో అడుగు ముందుకు వేయడంతో పాటుగా మా వినియోగారుల నడుమ నమ్మకాన్ని వృద్ధి చేయనున్నాం'' అని అన్నారు. విస్తృత శ్రేణి ఉత్పత్తులు, సేవల పరంగా ఐఆర్‌సీటీసీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్‌లైన్ 139ను నిర్వహిస్తుంది. దీనిని ప్రతి రోజూ లక్షలాది మంది ప్రజలు తమ రోజువారీ ప్రయాణీకుల రైళ్ల సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ 139 ఎంక్వైరీ, హెల్ప్‌లైన్ సేవలను 2007లో భారత్ బీపీఓ సర్వీసెస్ లిమిటెడ్‌ను ఈ ప్రాజెక్ట్‌లో సాంకేతిక భాగస్వామిగా ప్రారంభించింది. ఈ హెల్ప్‌లైన్ ప్రతి రోజూ దాదాపు 2 లక్షల కాల్స్‌ను రైళ్ల సంబంధిత రిజర్వేషన్, ఆగమనం మరియు డిపార్చర్ తో పాటుగా భద్రత, వైద్య, ఇతర ప్రత్యేక అవసరాల కోసం అభ్యర్ధిస్తూ చేస్తున్నారు.
''ట్రూ కాలర్ ఫర్ బిజినెస్ సేవలను ఇప్పటికే వందలాది సంస్థలు వినియోగించుకుంటున్నాయి. మా పరిష్కారాలను అంతర్జాతీయంగా వినియోగించుకోవడం ద్వారా ఆధీకృత సంభాషణలు చేస్తున్నాము. ఐఆర్‌సీటీసీతో ఈ కార్యక్రమం కోసం కలిసి పనిచేయడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎన్నో పరిష్కారాలలో ఇది మొదటిది. కమ్యూనికేషన్ పరంగా నమ్మకం కలిగించేందుకు మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాము మరియు భారత దేశ డిజిటల్ ప్రయాణంలో మద్దతునందించేందుకు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాము'' అని ట్రూ కాలర్ ఇండియా ఎండీ రిషిత్ ఝుంఝుంవాలా అన్నారు. 2014 నుంచి, ప్రజల అనుభవాలను మెరుగుపరచడంలో గణనీయంగా ఐఆర్‌సీటీసీ వృద్ధి చెందింది. మరీ ముఖ్యంగా టిక్కెట్ల బుకింగ్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణాల పరంగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నూతన డిజిటల్ ఇండియా కింద, మరింత మంది ప్రజలు ఇప్పుడు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అందువల్ల ఐఆర్‌సీటీసీ ఇప్పుడు వారికి మరింత మెరుగైన సేవలను అందించడానికి తమ ప్రయత్నాలను మెరుగుపరుచుకుంటూ డెడికేటెడ్ యాప్స్, సురక్షిత ఈ-బుకింగ్ వెబ్‌సైట్ అందిస్తుంది.
కొడవటిగంటి కుటుంబరావు
దీపావళికి జియో కానుక !
దీపావళి సందర్భంగా కస్టమర్లకు రిలయన్స్ జియో అద్భుతమైన బహుమతి ఇవ్వబోతుంది. కంపెనీ 4G స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్‌ను మార్కెట్లోకి తీసుకుని రాబోతుంది. నవంబర్ 4వ తేదీన ఈ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. చాలా తక్కువ ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.3499గా ఉంటుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. గూగుల్ భాగస్వామ్యంతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తుండగా.. ఆండ్రాయిడ్ అనుకూలీకరించిన సాఫ్ట్‌వేర్‌తో ఫోన్ వస్తుంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, కెమెరా ఫిల్టర్‌లతో పాటు ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన జియో యాప్‌లు ఉండనున్నాయి. జూన్24న జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను అందించబోతున్నట్లు ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో తక్కువ ధరలోనే దీన్ని రూపొందించారు. దేశంలోని 30కోట్ల 2జీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చౌక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత 4G వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు.
రేషన్ షాపులో గ్యాస్ సిలిండర్ !
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం లాంటి ఆయిల్ కంపెనీలన్నీ చిన్న సిలిండర్లను కూడా అమ్ముతుంటాయి. కమర్షియల్ సిలిండర్ 19 కిలోలు, డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోల కెపాసిటీతో వస్తే ఈ చిన్న సిలిండర్లు కేవలం 5 కిలోల కెపాసిటీతో వస్తాయి. అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం అయినవారికి, బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఈ చిన్న సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిన్న సిలిండర్లను ఇకపై రేషన్ షాపుల్లో అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఛోటు పేరుతో, హిందుస్తాన్ పెట్రోలియం అప్పు పేరుతో, భారత్ పెట్రోలియం మినీ పేరుతో చిన్న సిలిండర్లను అమ్ముతున్నాయి. ఇవి ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లు. వీటిని ఎవరైనా కొనొచ్చు. ఈ చిన్న సిలిండర్లు కొనడానికి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఐడీ ప్రూఫ్ చూపించి ఈ సిలిండర్ తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా రీఫిల్ చేయొచ్చు. చిన్న సిలిండర్లను రేషన్ షాపుల్లో అమ్మేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తోందని ఫుడ్ సెక్రెటరీ సుధాన్షు పాండే తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రేషన్ షాపులు ఆర్థికంగా పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక భాగమని ఆయన అన్నారు. భారతదేశంలో మొత్తం 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ధరలకే ఆహారధాన్యాలను జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రేషన్ షాపుల ద్వారా చిన్న సిలిండర్లను అమ్మడంతో పాటు రుణాలు అందించడం లాంటి ఆర్థిక సేవల్ని కూడా ఈ నెట్‌వర్క్ ద్వారా అందించాలని భావిస్తోంది ప్రభుత్వం. రేషన్ షాపుల ఆర్థిక ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి బుధవారం వివిధ రాష్ట్రాల మంత్రులతో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించినట్టు సుధాన్షు పాండే తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం ప్రతినిధులు ఆసక్తి చూపిన రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. రేషన్ షాపుల ద్వారా చిరు వ్యాపారులకు ముద్ర రుణాలు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి.
బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!
ఐర్లాండ్‌కు చెందిన నలుగురు ఫ్రెండ్స్.. గెట్ టు గెదర్ ట్రిప్‌అడ్వైజర్ అనే పబ్‌లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నారు. పలు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు. నాలుగు గంటల పాటు సరదాగా గడిపారు. ఇక వెళ్ళిపోదామని అనుకున్న వాళ్లు వెయిటర్‌ను బిల్లు తీసుకురమ్మని కోరగా.. వచ్చిన ఆ బిల్‌ను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బిల్ సుమారు రూ. 50 వేలు కావడంతో ఆ స్నేహితులు నోరెళ్లబెట్టారు. ఈ చేదు అనుభవాన్ని వాళ్లు ఫేస్‌బుక్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ”ట్రిప్‌అడ్వైజర్ పబ్‌కి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్లాన్‌ను మార్చుకోండి. అక్కడ సర్వీస్ అధ్వాన్నంగా ఉంటుంది. అంతేకాకుండా సిబ్బంది తప్పుడు బిల్లులు వేస్తున్నారు. మనం ఆర్డర్ చేయని ఐటెమ్స్‌ను కూడా బిల్‌లో చేరుస్తున్నారు” అని పోస్ట్ చేశారు. వాస్తవానికి మేము పబ్‌కి వెళ్లిన రోజు.. ముందుగానే టేబుల్ బుక్ చేసుకున్నాం. అయితే ఆ పబ్ నిర్వాహకులు మాకు తెలియకుండానే బుకింగ్ రద్దు చేశారు. వారితో సుదీర్ఘ సంభాషణ తర్వాత టేబుల్ ఇచ్చారు. మేము ఆర్డర్ ఇచ్చిన మొదటి ఐటెమ్‌ను కూడా గంట సమయం అనంతరం తీసుకొచ్చారు. అలాగే అక్కడి సిబ్బంది సర్వ్ చేయడంలో చాలా సమయాన్ని వృథా చేశారు. తమ తర్వాత వచ్చిన వారికి ముందు సర్వీసు చేస్తూ తమను వెయిట్ చేయించారు. దీని తర్వాత, బిల్ అడగగా దాన్ని చూసి ఖంగుతిన్నాం. నాలుగు గంటలు గడిపి సాధారణ ఐటెమ్స్ ఆర్డర్ ఇచ్చినందుకు రూ. 50 వేల బిల్లు అందజేశారు. మేము ఆర్డర్ చేయని ఐటెమ్స్ కూడా బిల్‌లో జోడించారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
సూర్యకాంతం
సూర్యకాంతం సినీ నటి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది. నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు" సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది. మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించు కొంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది. అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది. సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపుల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. అయితే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూ వస్తే సరేసరి! షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్! అవుట్‌సైడ్’ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్ అవుట్ సైడ్ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు. మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.
Wednesday, October 27, 2021
క్రిప్టో మార్కెట్లో అగ్రగామి కాయిన్స్విచ్ కుబేర్ క్రిప్టో
భారతదేశంలో అత్యంత పెద్ద అలాగే విలువైన క్రిప్టో ప్లాట్‌ఫారం కాయిన్‌స్విచ్ కుబేర్ భాకరతీయులకు ఆర్థిక సౌఖ్యం, సమానంగా నగదు సంపాదించేందుకు మద్ధతు ఇచ్చే నిరంతర ప్రయత్నాల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్‌తో కలిసి కొత్త వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. ఇటీవలి వాణిజ్య ప్రకటనలో కాయిన్‌స్విచ్ కుబేర్ ఆవిష్కారాత్మక ఆఫర్ వినియోగదారులకు క్రిప్టోలో పెట్టుబడులను కేవలం రూ.100తో ప్రారంభించేందుకు సాధ్యమయ్యేలా చేసింది. కుచ్‌తోబద్లేగా ఈ వాణిజ్య ప్రకటనలో భాగంగా, కాయిన్ స్విచ్ కుబేర్ కొత్త 360-డిగ్రీ వాణిజ్య ప్రకటన వివిధ ఆన్‌లైన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో టెలివిజన్, ముద్రణ, ఓటీటీ ప్లాట్‌ఫారం డిస్నీ+హాట్‌స్టార్‌లలో ప్రసారమవుతుంది.కాయిన్‌స్విచ్ కుబేర్ పోర్టల్ సరళమైన, వినియోగదారుల-స్నేహి ఇంటర్‌ఫేస్ వినియోగదారులకు బిట్‌కాయిన్, ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ తరహాలో పెట్టుబడి చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. క్రిప్టో యూనికార్న్ చెయిన్ అనాలసిస్‌తో పని చేస్తుండగా, అన్ని క్రిప్టో లావాదేవీలను ఎటువంటి తరహా భద్రత ఉల్లంఘనల నుంచి అలాగే ఆర్థిక అక్రమాల నుంచి స్వచ్ఛంగా అలాగే సురక్షితంగా ఉంచుతుంది. ఇతర క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్‌ల తరహాలోనే కాకుండా, కాయిన్‌స్విచ్ కుబేర్ భారతదేశంలోని అగ్రగామి క్రిప్టో ఎక్ఛేంజ్‌లతో నగదుగా మార్చుకునేందుకు, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ ధరల్లో లావాదేవీలను నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాయిన్‌స్విచ్ కుబేర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరణ్ నాయర్ మాట్లాడుతూ, ''వినియోగదారులకు కొనుగోలు దశలో లోతైన వివరాలను అందించేందుకు శ్రమిస్తుండగా, వారికి సమాచారయుక్తమైన నిర్ణయాలను తీసుకునేందుకు మద్ధతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. క్రిప్టో కరెన్సీల గురించి జాగృతిని వృద్ధి చేసే మా నిరంతర ప్రయత్నంలో భాగంగా మేము బాలీవుడ్ సూపర్‌స్టార్ అలాగే అల్టిమేట్ యూత్ ఐకాన్ రణ్‌వీర్ సింగ్ భాగస్వామ్యానికి చాలా సంతోషిస్తున్నాము. మా 60%కు పైగా వినియోగదారులు టైయర్ 2-3 నగరాల్లో ఉన్నారు. వారిలో సగం మంది 28 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారు ఉన్నారు. రణవీర్ తన సాటిలేని శక్తి, ఆకాంక్ష, విశ్వసనీయత మనకు క్రిప్టో విప్లవం గురించి ఎక్కువ మంది భారతీయులు క్రియాశీలకంగా ఉంచేందుకు, సమాచారాన్ని అందించేందుకు, ఉత్సుకత కలిగించేందుకు మద్ధతు ఇస్తారు'' అని వివరించారు. కాయిన్‌స్విచ్ కుబేర్ సెప్టెంబరు 2021లో కాయిన్ బేస్ వెంచర్స్, ఆండ్రిసెన్ హోరోబవిట్జ్ (ఎ16జడ్) నుంచి సిరీస్ సి ఫండింగ్‌లో 0 మిలియన్ డాలర్ల పెట్టుబడి సేకరించగా, భారతదేశంలో అత్యంత విలువైన యూనికార్న్‌గా గుర్తింపు దక్కించుకోగా, .9 బిలియన్ డాలర్ విలువ కలిగి ఉంది. ఇప్పుడు తన వృద్ధి చెందుతున్న వినియోగదారులకు విస్తృత స్థాయిలో పెట్టుబడి ఎంపికలను అందించాలని ప్రణాళికలు రూపొందించింది.
పెట్రోల్ రూ.120 దాటేసింది...!
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...