గూగుల్ మ్యాప్స్‌ను అందరూ తమకు కావాల్సిన ప్రాంతాలు, అడ్రస్‌ల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. గూగుల్ మ్యాప్స్ స్పీడోమీటర్‌లా పనిచేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. వాహనం నడిపేవారు స్పీడ్ పెంచితే వెంటనే గూగుల్ అలర్ట్ చేస్తుంది. మీరు స్పీడ్ మిలిట్ దాటినట్టైతే గూగుల్ మ్యాప్స్ స్పీడోమీటర్ కలర్ కూడా మారుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడోమీటర్ ఫీచర్ ఆన్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లో స్పీడోమీటర్ గుర్తు కనిపిస్తుంది. అందులో గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వాహనం వెళ్తుందో తెలుసుకోవచ్చ. గూగుల్ మ్యాప్స్ తొలిసారిగా 2019 లో ఆన్ స్క్రీన్ స్పీడోమీటర్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. మొదట ఆసియా, యూరప్, యూకే లాంటి దేశాల్లో రిలీజైన ఈ ఫీచర్... ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. మీరు కూడా గూగుల్‌లో స్పీడోమీటర్ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయడానికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను అప్‌డేట్ చేయండి. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్‌లో టాప్ రైట్ కార్నర్‌లో మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత navigation settings ఓపెన్ చేయండి. Driving Options లో స్పీడోమీటర్ ఆప్షన్ ఉంటుంది. స్పీడోమీటర్ ఎనేబుల్ చేయండి. ఇక మీరు ఎక్కడికైనా వెళ్లేప్పుడు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లాలో మ్యాప్‌లో సెర్చ్ చేయాలి. ఆ తర్వాత మ్యాప్‌లో Start ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ వివరిస్తుంది. మ్యాప్‌లోనే స్పీడోమీటర్ కనిపిస్తుంది. బైక్‌పై, కారులో వెళ్లేప్పుడు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. మీరు బండి నడిపే సమయంలోనే కాదు... ఇతరుల వాహనాల్లో వెళ్తున్నప్పుడు కూడా ఆ బండి ఎంత స్పీడ్‌లో ఉందో తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్‌లోని స్పీడోమీటర్ ఫీచర్ చూపించే స్పీడ్ ఒక్కోసారి సరైనది కాకపోవచ్చు. స్పీడ్ ఎంత ఉందో ఓ అంచనాకు రావడానికి మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలి. ఇందులో కనిపించే స్పీడ్ 100 శాతం సరైనదిగా భావించకూడదు.