Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, December 31, 2022

5G క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న స్కామర్


రిలయన్స్ జియో, ఎయిర్టెల్ టెలికం కంపెనీలు ఇప్పటికే దేశంలోని ముఖ్యమైన నగరాల్లో తమ 5G సర్వీస్ లను ప్రారంభించాయి. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాలలో మాత్రమే 5G నెట్ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. అయితే, 4G కంటే చాలా రేట్ల వేగంతో ఇంటర్నెట్ స్పీడ్ అందుకునే అవకాశం ఉండటంతో, ప్రజల్లో 5G పైన బాగా క్రేజ్ పెరిగింది. అయితే, ఇదే అదునుగా స్కామర్లు 5G క్రేజ్ ని క్యాష్ చేసుంటున్నారు. టెలికం కంపెనీలు 5G నెట్ వర్క్ ను దశల వారీగా ఒక్కొక్క నగరంలో లాంచ్ చేస్తున్నాయి మరియు త్వరలోనే దేశవ్యాప్తంగా తమ సర్వీస్ లను అంధుబాటులోకి తీసుకువచ్చే దిశగా సాగుతున్నాయి. కానీ, ప్రజల్లో అతిగా ఉన్న 5G క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో స్కామర్లు కొత్త మోసాలకు తెరలేపుతుతున్నారు. స్కామర్లు, 5G సర్వీస్ ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేసే ఈ మోసాలకు పాల్పడుతున్నారు. 5G నెట్ అవిర్క్ కు అప్ గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి, అని టెలికం కంపెనీల మాదిరిగా నమ్మబలుకుతూ లింక్స్ తో కూడిన SMS లను పంపిస్తున్నారు. ఈ లింక్ పైన క్లిక్ చేసే అమాయక ప్రజల పర్సనల్ డేటాతో పాటుగా బ్యాంక్ అకౌంట్ విరాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇంకేముంది, మీ వివరాలు అందుకున్న స్కామర్లు మీ అకౌంట్ మొత్తం ఖాళి చేసేస్తారు. వాస్తవానికి, మీరు 5G నెట్ వర్క్ కు మారాలంటే ఎటువాంటి లింక్ లేదా కొత్త SIM కార్డ్ ను ఆశ్రయించాల్సిన పనిలేదు. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న 4G SIM కార్డ్ పైన మీరు 5G నెట్ వర్క్ ను పొందవచ్చు. అంతేకాదు, 5G నెట్ వర్క్ లాంచ్ చేస్తున్న మరియు చేయనున్న ప్రాంతలలో వివరాలను కూడా టెలికం కంపెనీలు ప్రకటిసున్నాయి. అందుకే, ఇటువంటి మోసపూరితమైన మెసేజీలను నమ్మకండి.

గూగుల్‌ వాయిస్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌


ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. చాలా మంది మోసగాళ్లు మాటలు నమ్మి డబ్బులు నష్టపోతున్నారు.తాజాగా స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్‌ దిగ్గజం గూగుల్ కంపెనీ రీసెంట్‌గా గూగుల్‌ వాయిస్‌ ఫీచర్‌ని అప్‌డేట్‌ చేసింది. దీనికి వార్నింగ్‌ ఫీచర్‌ని యాడ్‌ చేసింది. ఇది ఇన్‌కమింగ్ స్పామ్ కాల్‌ల గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. గూగుల్‌ లేటెస్ట్‌ వార్నింగ్‌ ఫీచర్‌ వినియోగదారులు అన్‌వాంటెడ్‌ కాల్స్‌ను నివారించడంలో సహాయపడుతుంది. హానికరమైన స్కామ్‌ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది. స్పామ్ కాలర్‌లను గుర్తించడానికి గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగిస్తుంది. గూగుల్‌ వాయిస్‌ ఫీచర్‌ అమెరికా లోని గూగుల్‌ అకౌంట్‌ కస్టమర్‌లకు, కెనడాలోని గూగుల్‌ వర్క్‌స్పేస్‌ కస్టమర్‌లకు అందుబాటులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు కాల్ చేయవచ్చు, టెక్స్ట్‌ మెసేజ్‌, వాయిస్‌ మెయిల్‌ పంపవచ్చు. ఈ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కంప్యూటర్‌లలో కూడా పనిచేస్తుంది. వర్క్‌స్పేస్ బ్లాగ్ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్‌ గురించి గూగుల్ ప్రకటించింది. అన్‌వాంటెడ్‌ కాల్స్‌, పొటెన్షియల్లీ హార్మ్‌ఫుల్‌ స్కామ్‌ల నుంచి వినియోగదారులను రక్షించడానికి, గూగుల్‌ వాయిస్‌ 'సస్పెక్టెడ్‌ స్పామ్‌ కాలర్‌' అనే లేబుల్‌ను చూపుతుంది. గూగుల్ కాలింగ్ ఎకోసిస్టమ్‌లో ప్రతి నెలా బిలియన్ల కొద్దీ స్పామ్ కాల్‌లను గుర్తించే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా స్పామ్‌ అలర్ట్‌ పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త స్పామ్ కాల్స్ లేబుల్ ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్‌తో పాటు కాల్ హిస్టరీలో కనిపిస్తుందని గూగుల్ తెలిపింది. వినియోగదారులకు ఇక్కడ రెండు ఆప్షన్‌లు ఉంటాయి. మొదటి ఆప్షన్‌లో.. వినియోగదారులు స్పామ్ కాల్‌ను నిర్ధారించగలరు. దీంతో భవిష్యత్తులో ఆ నంబర్ నుంచి వచ్చే కాల్స్‌ నేరుగా వాయిస్‌మెయిల్‌కి వెళ్లి కాల్ హిస్టరీ ఎంట్రీలను స్పామ్ ఫోల్డర్‌లో ఉంచుతాయి. రెండో ఆప్షన్‌లో లేబుల్ చేసిన కాల్‌ని స్పామ్ కాదని గుర్తించవచ్చు. ఆ తర్వాత ఆ నంబర్‌ నుంచి కాల్‌ వస్తే సస్పెక్టెడ్‌ స్పామ్ లేబుల్ మళ్లీ కనిపించదు. ఈ ఫీచర్ దశలవారీగా రోల్ అవుట్ అవుతుంది. ఇది ఇప్పటికే డిసెంబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ గూగుల్ వాయిస్ కస్టమర్‌లందరికీ అందుబాటులో ఉంది. అలాగే వాయిస్ స్పామ్ ఫిల్టర్ ఆఫ్‌లో ఉంటే సస్పెక్టెడ్‌ స్పామ్ లేబులింగ్ స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. సస్పెక్టెడ్‌ స్పామ్ కాల్‌ని ఆటోమేటిక్‌గా వాయిస్‌మెయిల్‌కి పంపడానికి..సెట్టింగ్స్‌> సెక్యూరిటీ > ఫిల్టర్ స్పామ్ > టర్న్‌ ఇట్‌ ఆన్‌ స్టెప్స్‌ ఫాలో కావాలి. స్పామ్ ఫిల్టరింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, గూగుల్‌ స్పామ్‌గా గుర్తించే అన్ని కాల్స్‌ ఆటోమేటిక్‌గా వాయిస్‌మెయిల్‌కి వెళ్తాయి. కాల్ ఎంట్రీ స్పామ్ ఫోల్డర్‌లో ఉంటుంది.

కర్ణాటక రోడ్లపైకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు


కర్ణాటక  రాష్ట్రంలోని రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. పర్యావరణ హితం కోరుతూ ..కాలుష్య నివారణతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు కర్నాటక స్టేట్‌ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కొత్తగా ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్ లిమిటెడ్‌ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తీసుకొచ్చింది. కర్ణాటక  రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ బి.శ్రీరాములు శనివారం 12మీటర్ల పొడవైన ఏసీ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ముందుగా బెంగుళూరు, మైసూరు, షిమోగా, దావణగెరె, చిక్‌మంగుళూరు, విరాజపేటతో పాటు మడికెరె మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ బస్సులను ఒలెక్ట్రా సంస్థ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. మేక్ ఇన్‌ ఇండియా చొరవతో ఫేమ్‌-2 పథకం ద్వారా 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను సరఫరా చేస్తుందని మంత్రి శ్రీరాములు తెలిపారు. కేంద్రం భారీ పరిశ్రమలశాఖ సహాకారంతో కర్నాటక ప్రభుత్వం, కేఎస్‌ఆర్టీసీ ఒలెక్ట్రో ఇ- బస్సులను అతి త్వరలోనే రాష్ట్రంలోని అన్నీ డిపోల్లో ఉపయోగించబోతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఏడు డిపోల నుంచి బయల్దేరుతాయని పేర్కొన్నారు. ఈ ఎయిర్‌ కండీషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు అత్యాధునిక టెక్నాలజీతో పాటు జీరో పర్సంట్ పొల్యూషన్‌ కలిగినట్లు మంత్రి తెలిపారు. కర్నాటకలో ప్రయాణికులు త్వరలో శబ్ధ, వాయు కాలుష్యం లేని ఏసీ ఎలక్ట్రిక్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తారని చెప్పారు. అంతే కాదు ప్రజా రవాణా సంస్థలో ఒలెక్ట్రో సంస్థ ఒప్పందం మరింత బలపడుతుందన్నారు. డ్రైవర్ సీటుతో పాటు 43 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఒలెక్ట్రా ఇ బస్ ప్రయాణికులకు పూర్తి సౌకర్యవంతంగా, సుఖమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది. అంతే కాదు ప్రతి ఇ-బస్సులో సీసీ కెమెరాల మానిటరింగ్‌తో పాటు ఎమర్జెన్సీ బటన్, ఫైరింజన్ ఎక్వీప్‌మెంట్, ఫస్ట్ ఎయిడ్‌ కిట్‌తో కూడిన మెడికల్ సర్వీస్‌ అందుబాటులో ఉంటాయి. అలాగే ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు సేఫ్‌గా బయటపడేందుకు తగిన వస్తు సామాగ్రిని బస్సులో ఏర్పాటు చేయడమైంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ బస్సులు బ్రేకింగ్ సమయంలో కోల్పోయిన గతిశక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందేందుకు అనుమతిస్తుంది. అధిక-పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ 2-3 గంటల మధ్య బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది, ట్రాఫిక్ ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఇ-బస్సులు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 300 కి.మీ వరకు ప్రయాణించేలా ఈ ఎలక్ట్రిక్ బస్సులు పని చేస్తాయి. ఇ-బస్సులలో సౌకర్యవంతమైన లగ్జరీ పుష్-బ్యాక్ సీట్లు ఉన్నాయి. అదనంగా, తాజా టీవీ & ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రతి సీటుకు అంతర్నిర్మిత USB ఛార్జర్‌లు మరియు విశాలమైన లగేజీ స్థలం సంతోషకరమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తాయి. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు మన దేశంలోని రోడ్లపై 8.5 కోట్ల కి.మీ పూర్తి చేశాయి. ఇప్పటి వరకు దాదాపు 75,000 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గించాయి. ఈ బస్సుల వాడకం ద్వారా ఇంధన ఖర్చు దాదాపు రూ. 300 కోట్లు ఆదా చేయడమైంది. ఏపీ , గుజరాత్‌ వంటి రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలను కలుపుకొని వెయ్యి బస్సులను పంపిణి చేయడం జరిగింది. ఒలెక్ట్రా బస్సు కొండ భూభాగం, మనాలి నుండి రోహ్‌తంగ్ పాస్‌లో ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరిన రికార్డును కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల తయారి సంస్థ ఒలెక్ట్రా 2000సంవత్సరంలో స్థాపించబడింది. ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా మారింది.

స్పాటిఫై న్యూ ఇయర్ ఆఫర్ !


కొత్త సంవత్సరం సందర్భంగా స్పాటిఫై మూడు నెలల ప్రీమియం సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తుంది. కేవలం డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రాబోయే మూడు నెలలకు దీన్ని ఉచితంగా అందించనున్నారు. ఇప్పటి వరకు స్పాటిఫై ప్రీమియం ఉపయోగించని వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఒకవేళ మీరు గతంలో స్పాటిఫై ప్రీమియం వాడి ఉంటే ఈ ఆఫర్ మీకు వర్తించదు. దీన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అయితే మీరు మూడు నెలల పాటు దీన్ని ఉచితంగా ఉపయోగించాక ప్రారంభంలో అందించిన పేమెంట్ మెథడ్ను రిమూవ్ చేయండి. లేకపోతే నాలుగో నెలకు సబ్స్క్రిప్షన్ రుసుము మీ ఖాతా నుంచి ఆటో డెబిట్ అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లో స్పాటిఫై యాప్ను తెరవండి. కింద భాగంలో కుడివైపు ఉన్న ప్రీమియంపై క్లిక్ చేయండి. GET 3 MONTHS FOR ₹0 పై క్లిక్ చేయండి. కంటిన్యూ చేయడానికి లాగిన్ లేదా సైన్ అప్ చేయాలి. మీ కార్డు యాడ్ చేసి ఆఫర్ ను పొందండి.

రూ.797 ధరకే 365 రోజుల వ్యాలిడిటీ !


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ధమాకా అఫర్  అందిస్తుంది. ప్రయివేట్ టెలికం కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా లకు గట్టి పోటీనిచ్చే ఈ ప్లాన్ ను బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా కూడా చెప్పవచ్చు. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న  రూ. 797 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని నెటవర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు.  రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్ కూడా లభిస్తాయి. రోజూ 2GB హై స్పీడ్ డేటా అందించబడుతుంది. ఈ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది.ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు వరకూ మాత్రమే వర్తిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఉచిత SMS మరియు 2GB హై స్పీడ్ డేటా లాభాలు మీకు కేవలం 60 రోజులు మాత్రమే అందుతాయి. కానీ, వ్యాలిడిటీ మాత్రం పూర్తిగా 365 రోజులకు వర్తిస్తుంది. Freebies కాల పరిమితి ముగిసిన తరువాత లోకల్ కాల్ కోసం రూ.1/min మరియు STD కాల్ కోసం రూ.1.3/min ఛార్జ్ చేయబడుతుంది. అలాగే, లోకల్ SMS కోసం రూ.80p/SMS, నేషనల్ మెసేజ్ కోసం రూ.1.20p/SMS మరియు ఇంటర్నేషనల్ మెసేజ్ కోసం రూ.5/SMS చెల్లించవలసి వస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ప్రతీ 1MB డేటా వినియోగం పైన 25 పైసలు ఛార్జ్ చేయబడుతుంది.

యాపిల్ వాచ్‌పై వర్ణవివక్ష కేసు !


యాపిల్ వాచ్ వర్ణవివక్షకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీపై కేసు కూడా బుక్ చేశారు. న్యూయార్క్‌కు చెందిన అలెక్స్ మోరెల్స్ అనే వ్యక్తి ఆ కేసు దాఖలు చేశారు. వాచ్‌లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ రీడర్ తప్పుడు ఫలితాలు చూపిస్తున్నట్లు కేసులో పేర్కొన్నారు. చర్మ వర్ణం మారినప్పుడు ఆ వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ రీడర్ సరైన రీతిలో రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వాచ్‌లో ఉన్న ఆక్సీమీటర్ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేయడంలేదన్న ఆరోపణలు ఉన్ఆనయి. రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిల్ని సరైన రీతిలో ఆ మీటర్ లెక్కించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ లెవల్స్ చూసుకున్న పేషెంట్లు హైరానాకు గురయ్యారని, కాస్త నలుపు వర్ణం ఉన్నవారిలో మీటర్ సరైన రీతిలో స్పందించలేదని తెలుస్తోంది. దీని వల్లే ఆ సమయంలో అనేక మంది పేషెంట్లు.. కంగారలో హాస్పిటళ్ల చుట్టూ పరిగెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ మీటర్ రోగుల్ని తప్పుదారి పట్టించినట్లు కూడా ఓ స్టడీ రిపోర్ట్‌ను కేసులో ఫైల్ చేశారు. 

Friday, December 30, 2022

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇంటి వద్దకే డెలివరీ !


ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2వ జనరేషన్ ఇప్పుడు 20 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో మీ ఇంటి వద్దకే డెలివరీ అవుతుంది. ప్రస్తుతానికి, ఢిల్లీ, నోయిడా, ముంబైలోని కొనుగోలుదారులు మాత్రమే Blinkit నుంచి AirPodలను ఆర్డర్ చేసే వీలుంది. ఆపిల్ కాకుండా, బోట్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, వైర్డ్ ఇయర్‌ఫోన్‌లను కూడా కిరాణా వస్తువులతో పాటు బ్లింకిట్‌లో ఆర్డర్ చేయవచ్చు. కొన్ని నెలల క్రితమే బ్లింకిట్ ఆపిల్ యాక్సెసరీలను నిమిషాల వ్యవధిలో డెలివరీ చేసేందుకు Apple అధీకృత విక్రేత యునికార్న్ స్టోర్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ప్రస్తుతం, మీరు Apple iPhone ఒరిజినల్ కేసులు, magsafe ఛార్జర్‌లు, iPhone ఛార్జింగ్ కేబుల్‌లు, AirPodలను పొందవచ్చు. నిమిషాల్లో Apple iPhone 14, అప్లియన్సెస్ గాడ్జెట్లను Blinkit కస్టమర్‌లకు నిమిషాల్లోనే అందించడానికి @UnicornAPRతో భాగస్వామ్యం చేసుకుంది. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబైలలో మాత్రమే ఈ యాప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసేందుకు iOS, Android ఫోన్‌లలో లేటెస్ట్ @letsblinkit యాప్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు అభినవ్ ధింద్సా తెలిపారు. మీరు బోట్ హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్‌లతో సహా ఇతర టెక్నో ప్రొడక్టులను కూడా ఆర్డర్ చేయవచ్చు. వీటిని బ్లింకిట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు బ్లింకిట్ నుంచి Mi ప్యూరిఫైయర్‌లను కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే, ఈ సర్వీసులు ఢిల్లీ NCRలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బ్లింకిట్‌లో, Apple AirPods ప్రో 2వ జనరేషన్ రూ. 26,900కి అందుబాటులో ఉంది. AirPods Pro 2వ జనరేషన్ భారత మార్కెట్లో iPhone 14 సిరీస్, Apple Watch 8తో పాటు 2022లో ప్రారంభించబడింది. ఫస్ట్ జనరేషన్ Airpods 2019లో అధికారికంగా లాంచ్ అయింది. కొత్త AirPods Pro 2వ జనరేషన్ డిజైన్‌లో చాలా మార్పులతో రాలేదు. మెరుగైన చిప్‌సెట్‌లతో వస్తుంది. కొత్త జనరేషన్ ఎయిర్‌పాడ్‌లు మెరుగైన బ్యాటరీ పనితీరుతో కొత్త H2 చిప్‌తో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను మెరుగుపరుస్తాయని ఆపిల్ పేర్కొంది. ఇయర్‌బడ్‌లు ఒకే ఛార్జ్‌పై 6 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తాయని, ఒరిజినల్ ఎయిర్‌పాడ్స్ ప్రో కన్నా 33 శాతం మెరుగ్గా ఉన్నాయని కంపెనీ తెలిపింది. Apple ఎయిర్‌పాడ్‌లను Apple వాచ్ ఛార్జర్ లేదా ఏదైనా Qi-సపోర్టు ఛార్జర్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు.

రెండు లేటెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లు లాంచ్‌ చేసిన రెడ్‌మీ !

షావోమీ అనుబంధ సంస్థ రెడ్‌మీ ప్రొడక్ట్స్‌కు ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తొలుత స్మార్ట్‌ఫోన్‌ తయారీకి పరిమితమైన రెడ్‌మీ బ్రాండ్‌ క్రమంగా ఇతర సెగ్మెంట్‌లకు విస్తరిస్తోంది. ఇటీవల సరికొత్త ఫీచర్స్‌తో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను లాంచ్ చేస్తోంది. హెల్త్ మానిటర్‌ ఫీచర్స్‌తో తాజాగా రెండు సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్స్‌ను చైనాలో లాంచ్ చేసింది. రెడ్‌మీ వాచ్ 3, రెడ్‌మీ బ్యాండ్ 2 పేరిట వీటిని తీసుకొచ్చింది. Redmi బ్యాండ్ 2 స్మార్ట్‌వాచ్, 172×320 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.47-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఇది 450 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్‌తో వచ్చే కాంపాక్ట్ స్మార్ట్ బ్యాండ్. ఈ స్మార్ట్‌వాచ్ 210mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. రెడ్‌మీ బ్యాండ్ 2 వంద వరకు బ్యాండ్ ఫేస్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫిక్చర్‌ను బ్యాండ్ ఫేస్‌గా సెట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ 30 స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా అందిస్తోంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్‌టెన్స్‌కి 5ATM సర్టిఫికేట్ కూడా పొందింది. ఈ డివైజ్ హార్ట్ రేట్‌ను కూడా మెజర్ చేయగలదు. స్లీపింగ్‌ను ట్రాక్ చేస్తుంది. పీరియడ్స్‌ సైకిల్‌ను కూడా మానిటర్ చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఇది బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ అయింది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.75-అంగుళాల OLED స్క్రీన్‌తో లభిస్తుంది. ఇందులో 289mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 12 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 390×450 పిక్సెల్స్ నేటివ్ రిజల్యూషన్‌తో 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్‌తో బ్రైట్ డిస్‌ప్లే అందిస్తుంది. లార్జ్ డిస్‌ప్లే ఉన్నప్పటికీ, స్ట్రాప్‌తో కలిపి 37 గ్రాముల బరువు ఉంటుంది. రెడ్‌మీ వాచ్‌ 3 దాదాపు 121 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ బ్యాండ్ 2 మాదిరి ఇది కూడా హార్ట్ రేట్, SpO2ను మెజర్ చేస్తుంది. స్లీప్ ప్యాట్రన్స్ కూడా మానిటర్ చేస్తుంది. ఇంప్రూవ్డ్ వర్క్‌ఔట్ ట్రాకింగ్ కోసం ఈ స్మార్ట్‌వాచ్ GPS, GLONASS, Beidou, QZSS, GALILEO వంటి నావిగేషన్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.


నిమిషాల వ్యవధిలోనే పూర్తి చార్జ్!


మొబైల్ ను అతిగా వాడటం వల్ల బ్యాటరీ కూడా త్వరగా ఖర్చవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు వేగంగా ఛార్జింగ్ అయ్యే లేదా మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారు. ఈ సంవత్సరం షావోమీ 120W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ని పరిచయం చేసింది. ఇది ప్రవేశపెట్టిన వెంటనే, ఈ ఛార్జింగ్ టెక్నాలజీకి Oneplus, Realme పోటీని ఇచ్చాయి. ఈ రెండు కంపెనీలు తమ ఫోన్లను 150W ఛార్జింగ్ స్పీడ్ తో విడుదల చేశాయి. ఇప్పుడు 150W ఛార్జింగ్ వేగం కూడా వెనుకబడింది. 240W ఛార్జింగ్ స్పీడ్తో ఫోన్ను తీసుకురావడానికి కొన్ని కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. Oppo త్వరలో 240W ఛార్జింగ్ స్పీడ్ తో ఫోన్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. Oppo గత సంవత్సరమే 240W ఛార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. త్వరలో ఒక మొబైల్ తయారీదారు తన ఫోన్ను 240W ఛార్జింగ్తో లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆ నివేదికలో ఏ కంపెనీ పేరు అని స్పష్టంగా చెప్పలేదు. 240W ఛార్జింగ్ స్పీడ్తో ఫోన్ను తీసుకొచ్చే కొత్త కంపెనీ Realme అని కూడా వార్తలు వస్తున్నాయి. Realme త్వరలో లాంచ్ చేయనున్న రియల్ మీ జీటీ నియో 5కి 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం కొత్త 240W ఛార్జర్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన ఛార్జర్ కంటే 20 శాతం వేగంగా ఛార్జ్ చేస్తుంది. ఐకూ 10 ప్రో 200W ఫాస్ట్ ఛార్జింగ్తో వచ్చింది. ఈ ఫోన్ 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు కొత్త ఛార్జర్ ఫోన్ను 0 నుంచి 100 శాతం వరకు 20 శాతం వేగంగా ఛార్జ్ చేయగలదు.

శాంసంగ్ గెలాక్సీ ఏ34 త్వరలో విడుదల


శాంసంగ్ గెలాక్సీ ఏ14, గెలాక్సీ ఎఫ్‌04, గెలాక్సీ ఎం54 రాబోయే నెలల్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కావడంతో లేటెస్ట్ 5జీ ఫోన్ త్వరలోనే లాంఛ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 డిజైన్ మార్పులతో కస్టమర్లను ఆకట్టుకోనుందని లేటెస్ట్ లీక్స్ వెల్లడించాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో కూడిన శాంసంగ్ గెలాక్సీ ఏ34 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌ను కలిగిఉంటుంది. 6.5 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది. బిగ్ బ్యాటరీతో అందుబాటు ధరలో శాంసంగ్ గెలాక్సీ ఏ14 మిడ్ రేంజ్ ఫోన్‌ల కస్టమర్లను ఆకట్టుకోనుంది.

బ్రాడ్ కాస్టింగ్ మెసేజ్ ద్వారా ఒకేసారి 250 మందికి మెసేజ్‌లు !


న్యూ ఇయర్ రోజున మొబైల్ ఫోన్లో అందరి మెసేజ్ లు ఒక్కొక్కటిగా వస్తుంటాయి. వీటన్నింటికీ రిప్లై ఇస్తూ కూర్చుంటే ఎక్కువ సమయం పడుతుంది. WhatsAppలో ఈ కొత్త ఫీచర్ని ఉపయోగిస్తే ఒకే క్లిక్ తో 250 మందికి పైగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపచ్చు. వాట్సాప్ లో అద్భుతమైన ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు చిటికెలో చాలా మందికి మెసేజ్ లు పంపవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కేవలం టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే కాకుండా ఫొటోలు కూడా పంపవచ్చు. WhatsApp బ్రాడ్కాస్ట్ మెసేజ్ ఫీచర్ ఈ సంవత్సరం చాలా సహాయపడనుంది. దీంతో ఒకేసారి చాలా మందికి మెసేజ్ లు పంపే అవకాశం ఉంది. మొబైల్లో వాట్సాప్ ని ఓపెన్ చేసి, తర్వాత, పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు New Broadcast ఆప్షన్ ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు న్యూ ఇయర్ మెసేజ్ లేదా మరేదైనా సందేశాన్ని పంపాలనుకుంటున్న వ్యక్తులను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీరు వారికి ఏ మెసేజ్ పంపాలనుకుంటున్నారో టైప్ చేయండి. దానిని ఈ గ్రూప్ ను ఎంపిక చేసి పంపండి. ఉదాహరణకు మీరు 'హ్యాపీ న్యూ ఇయర్' అని రాస్తే ఆ మెసేజ్ గ్రూప్ లోని 256 మంది వ్యక్తులకు  అందుతుంది. 

గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ?


బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అతి త్వరలో తిరిగి రానుంది. దాదాపు 5 నెలల కింద గూగుల్ App Store యాప్ జాబితా నుంచి బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను తొలగించాయి. డిజిటల్ యాప్ స్టోర్‌లపై భారత ప్రభుత్వ ఆదేశాలనుసరించి భద్రత, ప్రైవసీ సమస్యలపై బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాపై నిషేధాన్ని విధించింది. భారత్‌లో గేమింగ్ పరిశ్రమ నిషేధం ఎత్తివేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. గేమర్ల నుంచి ఎస్‌పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ల వరకు ప్రతి ఒక్కరూ బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా తిరిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలా మంది గేమింగ్ కంటెంట్ క్రియేటర్లు బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా 2023 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. AFKGaming BGMI గేమింగ్ కంటెంట్ క్రియేటర్ల ప్రకారం.. వచ్చే నెలలో Android ప్లే స్టోర్‌లోకి తిరిగి రానుంది. ప్రతీక్ 'Alpha Clasher' జోగియా ఇటీవలి లైవ్ స్ట్రీమ్‌లో ‘predatorsasuke’ అనే గేమర్ Googleలో వర్క్ చేస్తున్నారు. BGMI తాత్కాలిక రీలాంచ్ తేదీని షేర్ చేశారు. BGMI జనవరి 15న Google Play Storeలో తిరిగి అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్లేయర్ సోహైల్ 'Hector' ద్వారా మరొక లైవ్ స్ట్రీమ్‌లో BGMI జనవరిలో తిరిగి రాబోతోంది. ముఖ్యంగా, BGMI సంబంధించి క్రాఫ్టన్ లేదా Google ఏదీ ధృవీకరించలేదు. జూలైలో BGMI నిషేధించిన అప్పటినుంచి గేమ్ కంపెనీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని క్రాఫ్టన్ హామీ ఇస్తోంది. యాప్ స్టోర్‌లలో BGMI వాపసుపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ చేయలేదు. క్రాఫ్టన్ గేమ్ సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నివేదిక తెలిపింది. ఏ ఇతర అప్‌డేట్ అధికారికంగా షేర్ చేయలేదు. జనవరి విషయానికొస్తే.. BGMI గురించి కచ్చితంగా తెలియదు. BGMI, PUBG మొబైల్ తయారీదారు క్రాఫ్టన్ భారతీయ మార్కెట్ కోసం రెండు కొత్త గేమ్‌లను ధృవీకరించింది. దక్షిణ కొరియాలోని సియోల్‌లో క్రాఫ్టన్ వారు రెండు గేమ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు.

శామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫ్రిజ్‌


శామ్‌సంగ్‌ సంస్థ సరికొత్త స్మార్ట్‌ ఫ్రిజ్‌ను ఆవిష్కరించింది. ఇందులో 32 అంగుళాల పరిమాణంలో ఉండే భారీ తెరను అమర్చటం చెప్పుకోదగ్గ విషయం. ఈ వర్టికల్‌ టచ్‌ స్క్రీన్‌లో టిక్‌టాక్‌ వీడియోలు, అమేజాన్‌ ఆర్డర్లు తదితరాలను చూడొచ్చు. తద్వారా వంట గదిని హోం థియేటర్‌లా ఫీలవ్వొచ్చన్నమాట. ఈ ఫ్రిజ్‌ను ''బిస్పోక్‌ రిఫ్రిజిరేటర్‌ ఫ్యామిలీ హబ్‌ ప్లస్‌'' అని పేర్కొంటారు. డిస్‌ప్లేలో వీడియోలను మినిమైజ్‌ చేసుకోవటం లాంటి మల్టీ టాస్క్‌లను కూడా నిర్వహించొచ్చు. శామ్‌సంగ్‌ టీవీ పస్ల్‌ సర్వీస్‌ సైతం అందుబాటులో ఉంది. అమెరికాలో 190 ఛానల్స్‌, సౌత్‌ కొరియాలో 80 ఛానల్స్‌ ఉచితంగా వీక్షించొచ్చు.

Thursday, December 29, 2022

రూ.1,337 కోట్ల పెనాల్టీ !


దేశంలో గూగుల్ చేస్తున్న అనైతిక వ్యాపార కార్యకలాపాల కారణంగా వ్యాపార పర్యవేక్షణ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్‌పై రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ ఈ జరిమానాపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ దాఖలు చేయలేదు. సీసీఐ ద్వారా జరిమానా విధించిన తర్వాత 60 రోజులలోపు ఎన్‌సీఎల్‌ఏటీలో తమ అప్పీల్‌ను దాఖలు చేసే హక్కు కంపెనీలకు ఉంది. కానీ గూగుల్‌e అలా చేయలేదు. అక్టోబర్ 25న అనైతిక వ్యాపారం చేస్తున్నందుకు గూగుల్‌పై జరిమానా విధించాలని సీసీఐ నిర్ణయించిందిన. దీనిని డిసెంబర్ 25 వరకు ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్‌కు అవకాశం ఉండేది. ఈ కేసులో రూ.1,337 కోట్ల పెనాల్టీ కోసం గూగుల్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. దీంతో పాటు పెనాల్టీ డబ్బులు కూడా జమ చేయలేదు. అటువంటి పరిస్థితిలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్వరలో గూగుల్‌పై చర్యను ప్రారంభించి, రూ. 1,337 కోట్ల రికవరీ కోసం డిమాండ్ లేఖను పంపనుంది. దీని తర్వాత గూగుల్‌పై మరో రూ.937 కోట్ల జరిమానా విధించారు. ఇప్పుడు ఈ విషయంలో సీసీఐ ముందుగా గూగుల్‌కి డిమాండ్ లేఖను పంపనుంది. దీని తర్వాత కంపెనీ జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ అలా చేయని పక్షంలో కంపెనీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులను అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గత వారం సమాచారం ఇస్తూ సీసీఐ విధించిన పెనాల్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము అప్పీల్ చేయబోతున్నామని గూగుల్‌ తెలిపింది.

ఎయిర్‌టెల్ న్యూఇయర్ ఆఫర్ !


ఎయిర్‌టెల్ న్యూ ఇయర్ ఆఫర్ గా ఉచితంగానే 50 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎవరైతే వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారో, వారికే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ కంపెనీ ఎవరైనా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారో వారికి 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాల్ ట్యూన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇలా వివిధ రకాల ప్రయోజనాలు పొందొచ్చు. నెల రోజుల పాటు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని భావిస్తే.. మీకు 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ విలువ రూ. 149గా ఉంది. అయితే ఇప్పుడు మీరు కేవలం రూ. 98కే ఈ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఇకపోతే ఏడాది వరకు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం.. రూ. 301 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఏడాది సబ్‌స్క్రిప్షన్ పొందిన వారికి 50 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. కొత్త కస్టమర్లు అయితే వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మొదటి నెల ఉచితంగానే పొందొచ్చు. ఇకపోతే వింక్ మ్యూజిక్ ప్రీమియం ద్వారా ఆఫ్‌లైన్‌లో సాంగ్స డౌన్‌లోడ్ చేసుకొని పెట్టకోవచ్చు. యాడ్ ఫ్రీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. పాడ్‌కాస్ట్స్, లైవ్ షోస్ చూడొచ్చు. అపరిమిత స్ట్రీమింగ్ బెనిఫిట్ ఉంది. ఎక్స్‌క్లూజివ్ ప్లేలిస్ట్స్ ఉంటాయి. అందువల్ల మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లు అయితే ఈ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఉచితంగానే 50 జీబీ వరకు డేటాను సొంతం చేసుకోవచ్చు. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా కస్టమర్ల కోసం కొత్త డేటా ప్లాన్స్ తీసుకువచ్చింది. వీటి ధర రూ. 25 నుంచి ప్రారంభం అవుతోంది. 1.1 జీబీ డేటా వస్తుంది. దీని వాలిడిటీ ఒక్క రోజు మాత్రమే అలాగే బేస్ ప్లాన్ ఉంటేనే ఈ డేటా ప్లాన్ పని చేస్తుంది. లేదంటే లేదు. అలాగే వారం రోజుల వాలిడిటీతో కంపెనీ మరో డేటా ప్లాన్ కూడా తెచ్చింది. ఇది రూ. 55 ప్లాన్. 3.3 జీబీ డేటా వస్తుంది. కంపెనీ అలాగే పలు ప్లాన్స్‌పై 5 జీబీ వరకు డేటాను ఉచితంగా అందిస్తోంది.

2025లో లేటెస్ట్ ఫీచర్లతో ఐఫోన్ ఎంట్రీ !


ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాలు పలు న్యూ ఫీచర్లతో ఐఫోన్ ఫోల్డ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించనుంది. ప్రస్తుతం ఫోల్డబుల్ మార్కెట్‌లో శాంసంగ్ దీటుగా రాణిస్తుండగా మొటొరొలా సైతం పలు ఫోల్డబుల్ ఫోన్లను లాంఛ్ చేయగా 2023లో రేజర్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు గూగుల్ పిక్సెల్ సైతం త్వరలోనే మార్కెట్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెడుతోంది. ఇక యాపిల్ ఐఫోన్ ఫోల్డ్ 2025లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్‌ను పోలిన డిజైన్‌పై యాపిల్ కసరత్తు సాగిస్తోందని సమాచారం. యాపిల్ ప్రస్తుతం డివైజ్ మన్నికను పరీక్షిస్తోంది. ఫోల్డింగ్ ఐఫోన్‌కు ఓఎల్ఈడీ వాడాలా లేక మైక్రోలెడ్ మెటీరియల్‌ను ఉపయోగించాలా అని యాపిల్ యోచిస్తోందని ఎకనమిక్ డైలీ పేర్కొంది. ఫోల్డబుల్ ఫోన్లు ఊపందుకున్నా ఈ మార్కెట్‌లో ప్రస్తుతం శాంసంగ్‌, మొటొరొలా, ఎల్‌జీ, హువై వంటి కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. యాపిల్ ఫోల్డ్ కూడా ఈ సెగ్మెంట్‌లో ఎంటరైతే పోటీ నెలకొనడం ద్వారా ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

టయోటా ఇన్నోవా హైక్రాస్‌ జనవరి నుంచి డెలివరీలు


వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌.. హైబ్రిడ్‌ మల్టీపర్పస్‌ వెహికిల్‌ ఇన్నోవా హైక్రాస్‌ పెట్రోల్‌ వర్షన్‌ ధరను వేరియంట్‌ను బట్టి రూ.18.3- 19.2 లక్షలుగా నిర్ణయించింది. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. సెల్ఫ్‌చార్జింగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వర్షన్‌ ధర వేరియంట్‌ను బట్టి రూ.24-29 లక్షలుగా ఉంది. ఈ-డ్రైవ్‌ సీక్వెన్షియల్‌ షిఫ్ట్‌ సిస్టమ్‌తో 2.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 23.24 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో 2.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ ఆప్షన్‌లోనూ లభిస్తుంది. మైలేజీ లీటరుకు 16.13 కిలోమీటర్లు. బుకింగ్స్‌ నవంబర్‌ 25 నుంచే ప్రారంభం అయ్యాయి. 2005లో భారత్‌లో అడుగుపెట్టిన ఇన్నోవా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా యూనిట్లు రోడ్డెక్కాయి. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్‌ వాటా ఏకంగా 50 శాతం పైమాటే.

మొరాయించిన ట్విట్టర్ !

 

ట్విట్టర్ మరోసారి మొరాయించింది. గురువారం ఉదయం ట్విట్టర్ డౌన్ అయింది. ట్విటర్ లో ఎర్రర్ మెసేజ్ కనిపించి, ఆ తరువాత ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయ్యారు. దీనిపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ డౌన్ కావడం ఇది మూడోసారి. ఆటోమెటిక్ గా లాగ్ అవుట్ అయిన తర్వాత.. ''సంథింగ్ వెంట్ రాంగ్, బట్ డోంట్ వర్రీ- ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, లెట్స్ ట్రై అగైన్'' అంటూ మెసేజ్ కనిపించింది. మళ్లీ ప్రయత్నించినా వినియోగదారులు ట్విట్టర్ లాగిన్ కాలేకపోయారు. డౌన్‌డెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ, నాగ్‌పూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మరియు కోల్‌కతాతో సహా పలు నగరాల్లో ఈ సమస్య ఏర్పడింది. పలుమార్లు యూజర్లు రిఫ్రెష్ చేసిన లాగిన్ కాలేకపోయారు. డెస్క్ టాప్ తో పాటు మొబైల్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. 

Wednesday, December 28, 2022

ఐఫోన్ యూజర్లకు ఈ యాప్స్ తో భూకంపం ఎలర్ట్స్


భూకంపం అనేది ప్రకృతి సృష్టించే విధ్వంసకర విపత్తు. ఈ విపత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే ప్రజలు ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతారు. తుఫాన్ హెచ్చరికలు వస్తుంటాయి కానీ ఎప్పుడు భూకంప హెచ్చరికలు రావు అని మనలో చాలా మందికి అనిపిస్తుంటుంది. అయితే మీరు ఐ ఫోన్ యూజర్లు అయితే మీకు భూకంప హెచ్చరికలు కూడా వస్తాయి. ఐ ఫోన్ యూజర్లు కొన్ని యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా భూకంపం ఎక్కడ వస్తుందని మనం మానిటర్ చేయవచ్చు. తద్వారా విదేశాల్లో ఉన్న మన బంధువులను కూడా అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పని చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ ను మార్చాల్సి ఉంటుంది. ఐఓఎస్ లోని కొన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ ను యాక్సెప్ట్ చేస్తే ఈ యాప్స్ ఐ ఫోన్స్ లో పనిచేస్తాయి. ఐ ఫోన్స్ లో ఉపయోగపడే కొన్ని యాప్స్ ను ష్టార్ట్ లిస్ట్ చేశాం. ఈ యాప్స్ కచ్చితత్వంతో ఆకట్టుకోవడమే కాకుండా యూఎస్ జీఎస్ వంటి సంస్థలకు చెందిన డేటాను ఓపెన్ యాక్సెస్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది.

క్వేక్ ఫీడ్ : భూకంప హెచ్చరికలు, ట్రాకింగ్ కోసం ఐ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉన్న అద్భుతమైన యాప్ ఇది. ఈ యాప్ యూఎస్ జీఎస్ నుంచి డేటాను సోర్స్ చేయడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భూకంపాల జాబితాను అందిస్తుంది. డీఫాల్ట్ గా తేదీ మారుతూ భూకంప తీవ్రత, ఎంత దూరంలో వచ్చిందో చూపుతుంది. అలాగే మనకు డైలీ అలర్ట్ కూడా వస్తాయి.

మై షేక్ : మైషేక్ యాప్ కెనడా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన యాప్. ఇది యూఎస్ జీఎస్ ద్వారా షేక్ అలర్డ్ ను వినియోగించుకుంటుంది. భూకంపం సంభివించబోతున్నపుడు ఈ యాప్ ద్వారా వాయిస్ అలర్ట్ వస్తుంది. మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉన్నా వాయిస్ కమాండ్ రావడం ఈ యాప్ ప్రత్యేకత.

మై ఎర్త్ క్వేక్ అలర్ట్స్ అండ్ ఫీడ్ :  ఈ యాప్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలను మానిటర్ చేసే అవకాశం ఉంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాల భూకంప హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. గతంలో ఆ ప్రాంతంలో ఎంత స్థాయిలో భూకంపం వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్ లో ఉండే ప్రో వెర్షన్ యాపిల్ స్మార్ట్ వాచ్ లకు కూడా ఎలర్ట్ పంపేలా డిజైన్ చేశారు.

ఎర్త్ క్వేక్ ప్లస్ :  ఈ యాప్ చాలా సరళమైన యాప్. యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, సీఎన్ డీసీ వంటి సంస్థల ద్వారా డేటాను సోర్స్ చేస్తుంది. ఈ యాప్ హోం స్క్రీన్ లో లేబుల్ చేసిన ఫిల్టర్ల ఆధారంగా భూకంప ప్రాంతం, పరిమాణం వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వచ్చే ఎలర్ట్స్ ఐ ఫోన్ వాచ్ ద్వారా కూడా మానిటర్ చేయవచ్చు.

ఎర్త్ క్వేక్స్- లేటెస్ట్ అండ్ అలర్ట్ : ఈ భూకంప ట్రాకింగ్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన కార్యకలాపాల కోసం 22 విభిన్న మూలాధారాలను ఎంచుకోవాలని కోరుతుంది. ఈ యాప్ యూఎస్ జీఎస్, ఈఎంఎస్సీ, బీజీఎస్ వంటి ఫీచర్లు ఉండడంతో వీటిని ఆన్ చేయడంలో అయోమయానికి గురవుతాం. ఈ యాప్ లో కూడా ప్రాంతం, తేదీ ఆధారంగా డేటాను చూసుకోవచ్చు. లోకేషన్ కోసం యాపిల్ మ్యాప్స్ ను ఉపయోగించడంతో కచ్చితమైన సమాచారం వస్తుంది.

లాస్ట్ క్వేక్ : ఈ యాప్ చాలా పాతది. అయినా కచ్చితమైన సమాచారం ఇవ్వడంతో చాలా మంది వినియోగదారులు ఈ యాప్ ను ఇష్టపడుతున్నారు. భూకంప కార్యకలాపాల ప్రతి ప్రవేశం, తేదీ, ప్రాంతం వంటి విషయాలను కచ్చితంగా పేర్కొంటుంది. ఈ యాప్ లో భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలను కూడా మానిటర్ చేయవచ్చు. ఆ సమయంలో మనం పొందిన అనుభూతిని ఈ యాప్ నుంచే డైరెక్ట్ గా ట్విట్టర్ లో పోస్టో చేయవచ్చు.

ఎర్ట్ క్వేక్ ప్లస్, అలెర్ట్స్, మ్యాప్స్ అండ్ ఇన్ ఫో :  ఈ యాప్ కూడా ఇతర యాప్ ల మాదిరిగా అన్ని ఫీచర్లను కలిగి ఉంది. కానీ ఈ యాప్ లో ఉన్న ఇండివిడ్యువల్ ఎంట్రీస్ అనే ఆప్షన్ ద్వారా ఎంత మంది ఈ యాప్ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారో? చూడవచ్చు. 

అల్జీమర్స్‌ను గుర్తించే మరో కొత్త రక్త పరీక్ష


ఆల్జీమర్స్‌ మతిమరుపు కంటే భయంకరమైన వ్యాధి. ఇది నెమ్మదిగా ప్రారంభమై కాలం గడిచేకొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకసారి వచ్చిందంటే మెదడుకు సమస్యే. ప్రతి క్షణం నరకంగా ఉంటుంది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి. ప్రస్తుతం 30 నుంచి 50 ఏండ్లలోపు వారిలో కూడా వస్తున్నది. ఈ వ్యాధికి గురైన వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. అల్జీమర్స్ వ్యాధికి మెరుగైన చికిత్సా వ్యూహాలను కనుగొనడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. నాడీ సంబంధ పరిస్థితులను నిర్ధారించడంలో తొలి దశల్లో సహాయపడే పరీక్షలను కొత్త అధ్యయనం గుర్తించింది. రోగనిర్ధారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు, వ్యాధి పురోగతిని తగ్గించగల సంబంధిత చికిత్స ప్రభావాలను గుర్తించడానికి సరైన మరొక రక్త పరీక్షను పరిశోధకులు కనుగొన్నారు. తేలికపాటి జ్ఞాపకశక్తి కోల్పోవడం మొదలుకొని సంభాషణలను కొనసాగించే సామర్థ్యం కోల్పోవడం వరకు ఎన్నో లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. లండన్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ ఆస్కర్ హాన్సన్, గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాజ్ బ్లెనో నేతృత్వంలోని పరిశోధకుల బృందం 575 మంది రక్త పరీక్షలను విశ్లేషించి.. అల్జీమర్స్ వ్యాధి పాథాలజీని గుర్తించడంలో సరిపోయే మల్లిపుల్‌ బ్లడ్‌ బయోమార్కర్లను కనుగొన్నారు. దాదాపు 242 మందిలో కాగ్నిటివ్‌ టెస్టింగ్‌, మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌ ఇమేజింగ్‌తోపాటు ప్లాస్మా పరీక్షలను ఆరేండ్ల పాటు చేపట్టారు. ఈ ఆరేండ్లలో కేవలం ఫాస్ఫో-టౌ 217 మాత్రమే ఆల్జీమర్స్‌ వ్యాధి పాథాలజీకి సంబంధించినదని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన విషయాలు నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

2023 సంవత్సరంలో సూర్య, చంద్ర గ్రహణాలు

 

ప్రతి ఏడాది సూర్య గ్రహణాలు, చంద్రగ్రణాలు సంభవిస్తుంటారు. ఇలాంటి గ్రహణాలపై అందరు దృష్టి సారిస్తుంటారు. వాటి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు ఏడాదిలో ఎప్పుడు, ఏ సమయంలో సూర్య, చంద్ర గ్రహణాలు సంభవిస్తుంటాయో తెలుసుకుంటారు. ఈ ఏడాది కూడా గ్రహణాలు సంభవించనున్నాయి. భారతదేశంలో ఎన్ని గ్రహణాలు కనిపిస్తాయో అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్ర వివరాల ప్రకారం.. 2023 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు, ఎప్పుడు ఏర్పడతాయో తెలుసుకుందాం. వచ్చే ఏడాదిలో వచ్చే భారతదేశంలో 4 గ్రహణాలు సంభవించనున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు.

మరో 2 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు


ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. Airtel 5G సర్వీసులను ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ 5Gకి ఇప్పటికే సపోర్టు కలిగిన నగరాల జాబితాలో కొత్తగా మరో రెండు నగరాలు చేరాయి. టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసును జమ్మూ, శ్రీనగర్‌లో ప్రారంభించింది. ఈ రెండు భారతీయ నగరాల్లో నివసిస్తున్న అన్ని అనుకూల 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎయిర్‌టెల్Airtel 5Gని ఉపయోగించవచ్చు. Airtel 5G Plus భారతదేశంలోని 10+ నగరాల్లో అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ గతంలో 5G సర్వీసులను మార్చి 2024 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటుందని చెప్పారు. మరోవైపు, Jio 5G సర్వీసులను 2023 చివరి నాటికి భారత్ అంతటా అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

జనవరి 3న పోకో సి50 విడుదల ?


పోకో సి50  స్మార్ట్ ఫోన్ జనవరి 3న ఇండియాలో లాంచ్ కావచ్చు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువాంటి ఫీచర్లను కలిగి ఉండవచ్చనే విషయాన్ని కూడా తెలిపింది. ఇటీవల పోకో విడుదల చేసిన గ్లోబల్ వేరియంట్ పోకో సి40 తరువాత వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. అయితే ఇండియాలో మాత్రం C సిరీస్ నుండి ఇటీవల వచ్చిన C31 తరువాత వస్తున్న ఫోన్ C50 అవుతుంది. పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Poco C50 యొక్క డిజైన్ లేదా స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా రావచ్చని భావిస్తున్నారు (C Series ఎంట్రీ-లెవల్ కాబట్టి సిరీస్). దీన్నిబట్టి మేము ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీ మరియు వాటర్డ్రాప్ డిస్ప్లే వంటి ప్రాథమికతలను కలిగి ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్ఫోన్ HD+ డిస్ప్లే మరియు స్నాప్డ్రాగన్ లేదా మీడియాటెక్ యొక్క బడ్జెట్ ప్రాసెసర్ తో రావచ్చని కూడా ఊహిస్తున్నాము. Poco త్వరలో ఈ ఫోన్ యొక్క ఫీచర్లను వెల్లడించడం ప్రారంభించవచ్చు.


అమ్మకానికి డార్క్ వెబ్‌లో 3 కోట్ల మంది ప్రయాణీకుల పేరు, ఫోన్ నంబర్లు ?

 

భారతీయ రైల్వే వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సమాచారం. డార్క్ వెబ్ ద్వారా ఒక హ్యాకర్ డేటాను అమ్మకానికి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అత్యున్నత వైద్య సంస్థ - ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పై డేటా ఉల్లంఘన జరిగిన కొద్ది రోజులకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు, ప్రభుత్వం లేదా భారతీయ రైల్వేలు డేటా ఉల్లంఘన గురించి ఏమీ ధృవీకరించలేదు. ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. అందులోనూ హ్యాకర్ అందించిన డేటా కచ్చితమైనదో లేదో తెలియదు Times Now నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. హ్యాకర్లు ఈ-మెయిల్, మొబైల్ నంబర్, అడ్రస్, వయస్సు, లింగంతో సహా చాలా యూజర్ డేటాను పొందారని తెలిసింది. భారతీయ రైల్వే ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ, ఇన్‌వాయిస్‌లను కూడా గ్రూప్ లీక్ చేసిందని ఆ హ్యాకర్ పేర్కొన్నాడు. లీక్ అయిన డేటాలో యూజర్ డేటాతో పాటు యూజర్ల బుకింగ్ డేటా కూడా ఉందని తెలిసింది. ఫోరమ్ డేటా కాపీకి 400 డాలర్లు వసూలు చేస్తోంది. కొనుగోలుదారు కేవలం 5 కాపీలను మాత్రమే పొందగలరు. మరో నివేదిక ప్రకారం.. డేటాకు ప్రత్యేకమైన యాక్సెస్ కావాలనుకునే వారు డేటా, ఇతర వివరాల కోసం 1,500 డాలర్లు నుంచి 2000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన డిసెంబర్ 27న జరిగినట్లు తెలిసింది. డేటా లీక్ గురించిన వివరాలను హ్యాకర్ ఫోరమ్‌లో పోస్ట్ చేశారు. అసలు వారు ఎవరు అనేది మాత్రం అసలు గుర్తింపు ఇంకా తెలియదు. దీనిని ‘షాడో హ్యాకర్’ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. అదో ఫేక్ నేమ్. ప్రభుత్వ శాఖల్లోని పలువురి అధికారిక ఈ-మెయిల్ అకౌంట్లను కూడా యాక్సస్ చేసినట్టు అదే హ్యాకర్ గ్రూప్ చెబుతోంది. ప్రస్తుతానికి, హ్యాకర్ గ్రూప్ IRCTC డేటాను ఎలా యాక్సెస్ చేయగలదో సమాచారం లేదు. లేటెస్ట్ డేటా ఉల్లంఘన అథెంటికేషన్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు సైతం ఇంకా ధృవీకరించలేదు.

Tuesday, December 27, 2022

ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ఎఫ్ఈ ?


శాంసంగ్ త్వరలో ఎస్ 23 మోడల్ ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అంతే కాకుండా తన మోడ్సల్ లో ఆదరణ పొందిన ఎస్ 22 లో ఫ్యాన్ ఎడిషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 1, 2023న యూఎస్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శాంసంగ్ ఇటీవల రద్దు చేసిన ఏ 74 5జీ ఎడిషన్ కు ప్రత్యామ్నాయంగా ఎస్ 22 ఎఫ్ఈ ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త శాంసంగ్ ప్రాసెసర్, కెమెరా సెన్సార్లతో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎక్సినోస్ 2300 4 ఎన్ఎం చిప్ సెట్ తో ఉంటుందని అంచనా. అలాగే 108 ఎంపీ బ్యాక్ కెమెరాతో, హెచ్ఎం 6 సెన్సార్ దీని ప్రత్యేకతగా నిలవనుంది. ఈ మొబైల్ 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఎస్ 23 మోడల్ కంటే ముందే ఎస్ 22 ఎఫ్ఈతో పాటుగా, శాంసంగ్ ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. శాంసంగ్ ఫోన్స్ ప్రజాదరణ కలిగిన గెలాక్సీ ఎఫ్ 14 ను త్వరలో భారత మార్కెట్ లోకి తీసుకురానుంది. జనవరి లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఈ ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని శాంసంగ్ ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్ లో కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించనున్నారు. అయితే ఈ ఫోన్ 5 జీ సపోర్ట్ చేస్తుందా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు. 

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫోన్ ఐక్యూ 11


దేశీయ మార్కెట్లో ఐక్యూ  లాంచ్ చేయనున్న తర్వాతి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్. భారతదేశంలో నమ్మకమైన కస్టమర్ బేస్‌ను నిర్మించడంలో ఈ కంపెనీ చాలా విజయవంతమైంది. ఐక్యూ 11 ఇప్పటికే ప్రచారం చేస్తున్న హైప్‌తో, కంపెనీ భవిష్యత్తు మరింత మెరుగ్గా కనిపిస్తోంది. రిపోర్టుల లోని AnTuTu స్కోర్‌ల ప్రకారం, iQOO 11 స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన Android స్మార్ట్‌ఫోన్ గుర్తింపు పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ జనవరి 10, 2023న నిర్ధారించబడింది.అంటే, ఇండియాలో సంక్రాతి కి నాలుగు రోజుల ముందే లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 SoC ద్వారా అందించబడుతుంది మరియు భారతదేశంలో ఆ చిప్‌ని కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. OnePlus కూడా Snapdragon 8 Gen 2 SoC ద్వారా ఆధారితమైన OnePlus 11 స్మార్ట్ ఫోన్ తో భారతదేశం లోకి ప్రవేశిస్తుందని ధృవీకరించింది, అయితే ఇది భారతదేశంలో iQOO 11 ప్రారంభించబడిన దాదాపు ఒక నెల తర్వాత ఫిబ్రవరి 7, 2023న జరుగుతుంది. వన్‌ప్లస్ వన్‌ప్లస్ 11ని మొదట జనవరి 4న చైనాలో లాంచ్ చేస్తోంది, ఆపై వన్‌ప్లస్ 10 ప్రో 5 జితో చేసిన విధంగానే భారతదేశానికి తీసుకువస్తుంది.

అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ దుస్తుల్లో మెరిసిన మోడల్స్‌


హాంకాంగ్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్ అందర్నీఆకట్టుకుంది. అందులో మోడళ్లు ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో తయారు చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు. హాంకాంగ్‌కు చెందిన ఏఐడి ల్యాబ్స్ ఈ కొత్తరకం అవుట్‌ఫిట్స్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో డిజైన్ చేసిన దుస్తులను ఈ సంస్థ తొలిసారిగా హాంకాంగ్‌లో జరిగిన Fashion X AI ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించింది. వీటిని ఏఐ సాఫ్ట్‌వేర్ ఏఐడా (AiDA)తో డిజైనర్లు తయారుచేశారు. ‘డిజైనర్లకు సహాయకారిగా ఉండేందుకు ఏఐడా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామ’ని ఏఐడి ల్యాబ్స్ సీఈఓ కాల్విన్ వాంగ్ తెలిపాడు. 14 మంది డిజైనర్లు డిజైన్ చేసిన 80 రకాల దుస్తులను మోడల్స్ ఈ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ష్యాషన్ వీక్ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ‘డిజైనర్లు తాము అనుకుంటున్న డిజైన్లు, రంగులను ఈ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలి. 10 సెకన్లలోనే వాళ్లు కోరుకుంటున్న కలెక్షన్ కనిపిస్తుంది’ అని కాల్విన్ తెలిపాడు. ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది పది సెకన్ల సమయంలోనే డజన్‌కు పైగా డిజైన్లను తయారు చేయగలదు. అంతేకాదు ఫొటోలను గుర్తించడంతో పాటు ఫొటోలను తీయగలదు అని కాల్విన్ వెల్లడించాడు.

ఫిబ్రవరి 10న వన్‌ప్లస్ 11 విడుదల


దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి 10న వన్‌ప్లస్ 11 లాంఛ్ కానుండగా,  చైనా మార్కెట్‌లో జనవరి 4న  లాంఛ్ కానుంది. అఫిషియల్ లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ 11 డిజైన్, ఫీచర్లు సహా పలు వివరాలను కంపెనీ నిర్ధారించింది.  మరో మోడల్ శాండ్‌స్టోన్ ఫినిష్‌తో ఆకట్టుకుంది. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కలర్స్‌తో పాటు ఫస్ట్‌లుక్‌లో వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. అలర్ట్ స్లైడర్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్టు ఫస్ట్‌లుక్‌లో వెల్లడైంది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు సెన్సర్లతో వన్‌ప్లస్ 11 కస్టమర్ల ముందుకు రానుంది. టాప్ క్లాస్ కెమరా పెర్ఫామెన్స్‌ను అందించేందుకు హ్యాసిల్‌బ్లాద్‌తో చేతులు కలిపినట్టు కంపెనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక వన్‌ప్లస్ 11 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌లో సైడ్ కర్వ్స్‌తో స్లీక్ డిజైన్‌తో వన్‌ప్లస్ 11 స్టైలిష్ లుక్‌లో కనిపించింది.

టాటా సరికొత్త ఎలక్ట్రిక్ కారు టిగోర్ !


టాటా కంపెనీ నుంచి విడుదలైన నెక్సన్ ఈవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే టాటా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్  కారును విడుదల చేశారు. టాటా టిగోర్ మోడల్ ని ఎలక్ట్రానిక్ వర్షన్ లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి నెలలోనే ఈ టిగోర్ ఈవీ మోడల్ కు మొత్తం 20 వేలకు పైగా బుకింగ్స్ లభించినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.  ఇప్పుడు ఈ కాారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫీచర్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ టిగోర్ ఈవీ 2022 ఎక్స్ షోరూమ్ ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మ్యాగ్నెటిక్ రెడ్ కలర్ లో కూడా ఈ మోడల్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఈవీ మోడల్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. 26 కిలోవాట్స్ సామర్థ్యంతో బ్యాటరీ లభిస్తోంది. ఈ బ్యాటరీలకు 8 ఏళ్ల వారెంటీ కూడా ఇస్తున్నారు. ఈ 5 సీటర్ లో 316 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తోంది. ఈ సెడాన్ 172 గ్రౌండ్ క్లియరెన్స్ అన్ లాడెన్ తో వస్తోంది. ఈ 26 వాట్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 7.5 గంటలుA.C), 59 నిమిషాలు(D.C) సమయం పడుతుంది. హైవేలపై బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్ స్టాల్ చేస్తే రాబోయే కార్లన్నీ ఈవీలే అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క టాటానే కాకుండా మహింద్రా వంటి కంపెనీలు కూడా ఈవీ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. మార్కెట్ లో నెలకొన్ని డిమాండ్, పోటీకి తగ్గట్లు కంపెనీలు సరికొత్త మోడల్స్, ఫీచర్లతో ఎలక్ట్రికల్ కార్లను తీసుకొస్తన్నాయి.

స్మార్ట్‌ ఫోన్‌ కొంటే స్మార్ట్‌ వాచ్‌ ఉచితం !


టాటా గ్రూప్‌ ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ కంపెనీ 'క్రోమా' క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలపై డీల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ ధర రూ.12,999తో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ పొందవచ్చు. దీనికి అదనంగా రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్‌ను(బ్రాండ్లను బట్టి) ఉచితంగా అందిస్తుంది. పార్టీ స్పీకర్లను రూ.2199 ప్రారంభ ధరతో అందిస్తుంది. సౌండ్‌బార్లపై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్‌లైన్‌ పోర్టల్‌ కొనుగోలుపై ఈ ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 

Monday, December 26, 2022

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ !


ఫ్లిప్‌కార్ట్  తన యాప్, వెబ్‌సైట్‌లో ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్‌లు, మరిన్ని ప్రొడక్టులపై డిస్కౌంట్లను అందిస్తుంది. అలాంటి ఒక ఆఫర్ స్మార్ట్‌టీవీలలో అందుబాటులో ఉంది. రూ. 25వేల లోపు స్మార్ట్ టీవీలపై కొన్ని బెస్ట్ డీల్‌లు ఉన్నాయి.  Realme 100.3 cm (40 inch) Full HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV తగ్గింపు ధర రూ.19,999గా ఉంది. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు రూ. 2,000 వరకు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించడంపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అదనంగా, డీల్ రూ.11వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ వంటి మరిన్ని యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. OnePlus Y1 100 cm ( 40 inch) ఫుల్ HD LED స్మార్ట్ Android TV రూ. 21,999 ధరతో వస్తుంది. ఆసక్తి కలిగన కస్టమర్‌లు రూ. 2,000 వరకు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించడంపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, డీల్ రూ. 11వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ వంటి మరిన్ని యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. డాల్బీ ఆడియోతో కూడిన Mi 5A 100 సెం.మీ (40 అంగుళాల) Full HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 21,999గా ఉంది. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 5,000 ఆర్డర్‌లపై రూ. 3,000 వరకు అదనంగా, ఈ డీల్ రూ.11వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ వంటి మరిన్ని యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. OnePlus Y1S 108 cm (43 అంగుళాలు) Full HD LED స్మార్ట్ Android TV Android 11, బెజెల్-లెస్ ఫ్రేమ్‌తో రూ. 24,999 ధరతో వస్తుంది. కస్టమర్‌లు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలను ఉపయోగించి రూ. 2,000 వరకు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, డీల్ రూ.16,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ వంటి మరిన్ని యాప్‌లకు సపోర్టు ఇస్తుంది.

సీఈఓ పోస్ట్ కు నేను రెడీ !


ఎలన్ మస్క్ ఎప్పడైతే ట్విట్టర్ కొనుగోలు అంశంలో తలదూర్చాడో క్రమేపి తన ప్రాబవాన్ని కోల్పోతున్నాడు. ఎప్పుడైతే ట్విట్టర్ ను కొనుగోలు చేసి సీఈఓ అయ్యాడో అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఉద్యోగుల తొలగింపు అంశం అతనిపై తీవ్ర నెగటివ్ ప్రచారానికి కారణమైంది. తాజాగా తాను ట్విట్టర్ సీఈఓగా ఉండాలా? వద్దా? అని ఆన్ లైన్ పోల్ నిర్వహించారు. దీంతో యూజర్లు మస్క్ కు మస్కా కొడుతూ సీఈఓ ఉండడానికి నువ్వు అనర్హుడవంటూ 57.5 శాతం మంది తెలిపారు. ఈ ఊహించని రిజల్ట్ తో కంగుతిన్న మస్క్ త్వరలోనే తాను త్వరలోనే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని, ఎవరైనా ఫూలిష్ పర్స్ న్ వస్తే తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని కీలక విభాగాలను కొనసాగిస్తానని ఎలన్ మస్క్ తెలిపాడు. ఎలన్ మస్క్ షాక్ ఇస్తూ ఓ ఇండో అమెరికన్ తాను సీఈఓ పోస్ట్ కు సిద్ధమంటూ ప్రకటించాడు. ఈ-మెయిల్ సృష్టికర్త శివ అయ్యదురై తాను ట్విట్టర్ సీఈఓ పదవిపై ఆసక్తిగా ఉన్నాను అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తాను ప్రతిష్టాత్మక ఎంఐటీ నుంచి నాలుగు డిగ్రీలు పొందానని, ఏడు హైటెక్ సాఫ్ట్ వేర్ కంపెనీలను సృష్టించానని పేర్కొన్నాడు. దయచేసి ఎలా దరఖాస్తు చేయాలో? తెలపాలని కోరాడు. 1978లో అయ్యదురై ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని సృష్టించాడు, దానిని అతను “ఈ-మెయిల్” అని పిలిచాడు.ఈ ప్రోగ్రామ్ ఇంటర్‌ఆఫీస్ మెయిల్ సిస్టమ్ లో అన్ని ఫంక్షన్‌లను ప్రతిరూపం చేసింది. దీంతో 1982, ఆగష్టు 30న, యూఎస్ ప్రభుత్వం అయ్యదురైని ఈ-మెయిల్ సృష్టికర్తగా అధికారికంగా గుర్తించి, కాపీరైట్‌ను అందజేసింది. అయ్యదురై బొంబాయిలోని ఒక తమిళ కుటుంబంలో జన్మించాడు. అతను ఏడేళ్ల వయసులో యూఎస్ కు వెళ్లాడు. అయితే శివ అయ్యదురై ఆఫర్ పై మస్క్ ఎలా స్పందిస్తాడో? వేచి చూడాలి.

డోంట్ డిస్టర్బ్ !


ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ‘ డోంట్ డోంట్ డిస్టర్బ్‘ అనే ఫీచర్ ను యూజర్ లకి అందుబాటులోకి తీసుకొచ్చింది. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ బీటా వర్షన్ లకు అందుబాటులోకి వచ్చింది. టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే కేవలం వెబ్ వెర్షన్ ఉపయోగిస్తున్న వారికి మాత్రమే ఈ ‘ డోంట్ డిస్ట్రబ్ ‘ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వెబ్ వెర్షన్ ను ఉపయోగిస్తున్న WhatsApp New Feature Announces సమయంలో ఇన్ కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు వాటి నోటిఫికేషన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ ఫీచర్ కోసం సెట్టింగ్ ఆప్షన్స్ లోకి వెళ్లి ఇన్ కమింగ్ వాట్సాప్ కాల్ స్విచ్ ఆఫ్, ఆన్ చేసుకోవచ్చు. ఇకపోతే వాట్సాప్ గత కొన్ని రోజులుగా కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఇటీవల వాట్సాప్ కాంటాక్ట్ కార్డులను షేర్ చేసే ఫీచర్ ను తీసుకొచ్చింది. అలాగే ‘ అవతార్ ‘ అనే కొత్త ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను డిజిటల్ వర్షన్ గా రూపొందించుకోవచ్చు. ఫోటోలకు హెయిర్ స్టైల్, ఫేషియల్, డ్రెస్సింగ్ స్టైల్ లను మార్చుకోవచ్చు.

Sunday, December 25, 2022

నెట్ లేకపోయినా అమౌంట్ ట్రాన్స్ఫర్ ?


మొబైల్ లోని  క్యూఆర్ కోడ్ స్కానర్ తో తమ చెల్లింపులను నిరాటంకంగా చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారిని వేధించే సమస్య నెట్ వర్క్ ఇష్యూ. మన ఫోన్స్ లో నెట్ వర్క్ ఇష్యూ లేదంటే బ్యాంక్ సర్వర్ డౌన్ కారణంగా మనం యూపీఐ పేమెంట్ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటాం. అయితే ఈ సమస్య మన షాపింగ్ లో ఎదురైతే పర్లేదు. హోటల్లో తిన్న తర్వాత పేమెంట్ జరగకపోతే అప్పుడు పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి సరికొత్తగా యూపీఐ లైట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నెట్ లేకపోయినా రూ.200 లోపు ఎమౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. ప్లే స్టోర్ లోకి వెళ్లి బీమ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్ లో సైన్ ఇన్ అయ్యాక, మీ బ్యాంక్ ఖాతా లింక్ చేసుకోవాలి. యాప్ ను కిందకు స్క్రోల్ చేసి యూపీఐ లైట్ ను ఎంచుకోవాలి. సమాచారాన్ని సరిచూసుకుని స్టార్ట్ నౌ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. యూపీఐ లైట్ ఈ వ్యాలెట్ లో రూ.2000 వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతను సెలెక్ట్ చేసుకుని వ్యాలెట్ లో ఎమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాలి. అనంతరం ఎనేబుల్ యూపీఐ లైట్ ను ఎంపిక చేయాలి. అనంతరం యూపీఐ పిన్ ను ఎంటర్ చేస్తే యూపీఐ లైట్ యాక్టివేట్ అవుతుంది. యూపీఐ లైట్‌లో వర్చువల్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఎన్‌పీసీఐకి కాకుండా, జారీ చేసే బ్యాంకు ద్వారా మాత్రమే పని చేస్తుంది. యూపీఐ లైట్ బ్యాలెన్స్‌పై వడ్డీ చెల్లించరు. యూపీఐ లైట్ చెల్లింపు వ్యవస్థ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్, కెనరా, హెచ్ డీఎఫ్ సీ, కోటక్ మహీంద్రా, ఇండియన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే అందుబాటలో ఉంది. యూపీఐ లావాదేవీలను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. కానీ రిసీవర్ ఖాతాలోకి క్రెడిట్‌లు ఆన్‌లైన్‌లో చేస్తారు. అయితే, యూపీఐ లైట్‌ని పూర్తిగా ఆఫ్‌లైన్‌గా మార్చే భవిష్యత్తు ప్రణాళిక ఉందని అధికారులు చెబుతున్నారు.

ఫోన్‌కు ఎక్కువ బ్రైట్‌నెస్‌ పెట్టకండి !


మితిమీరిన స్మార్ట్ ఫోన్‌ వినియోగం కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బ్రైట్‌నెస్‌ ఎక్కువ పెట్టుకొని ఫోన్‌ను ఉపయోగిస్తే జరిగే నష్టం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోన్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కారణంగా కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంగా ఇలాగే కొనసాగితే కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రైట్‌నెస్‌ కేవలం కంటి ఆరోగ్యంపై మాత్రమే కాకుండా ఫోన్‌ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ బ్రైట్‌నెస్‌ కారణంగా ఫోన్‌ ఛార్జింగ్ త్వరగా డిశ్చార్జ్‌ అవుతుంది. దీంతో ఇది కాలక్రమేణ ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. ఇక బ్రైట్‌నెస్‌ ఎక్కువ ఉండడం వల్ల ప్రాసెసర్‌పై కూడా ఒత్తిడి పడుతుంది. ఈ కారణంగా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వడం ప్రారంభమవుతుంది. ప్రాసెసర్‌పై ఒత్తిడి పెరిగి ఫోన్‌ పనితీరు తగ్గుతుంది. ఫోన్‌ బ్రైట్‌నెస్‌ మరీ ఎక్కువగా ఉండడం వల్ల అది డిస్‌ప్లేపై కూడా ప్రభావం చూపుతుంది. సాధారణంగా బ్రైట్‌నెస్‌ ఎక్కువగా ఉంటే హీట్‌ జనరేట్ అవుతుంది. దీంతో ఇది డిస్‌ప్లే పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా డిస్‌ప్లే పోయే అవకాశం ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు బ్రైట్‌నెస్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే డార్క్‌ మోడ్‌ను ఉపయోగిస్తే మరింత బెటర్‌ అని సూచనలిస్తున్నారు.

సూర్య విస్ఫోటనంపై నాసా పరిశోధన !


సూర్యునిపై సౌరజ్వాలలు అసాధారణమైన రీతిలో ప్రజ్వరిల్లుతుంటాయి. ఈ సౌర జ్వాలల నుంచి సమీప భూ పరిధి, కృష్ణబిలాల వరకు విశ్వమంతటా ప్లాస్మాలు విస్తరిస్తుంటాయి. ప్లాస్మా అంటే అత్యంత శక్తివంతమైన ద్రవపదార్థం వంటిది. అయస్కాంత క్షేత్రాలకు ప్లాస్మా ఉద్రిక్తమౌతుంది. ప్లాస్మాలు వేగంగా అయస్కాంత శక్తిని ఉష్ణం గాను, చలనం చెందే విధం గానూ మార్చుతాయి. ఈ మాగ్నెటిక్ రీకనెక్షన్ ( అయస్కాంత పునస్సంధానం)లో అనేక రకాలున్నాయి. వీటిలో ఒకటి ముఖ్యంగా ఫాస్ట్ రీకనెక్షన్ అని పేర్కొనే అస్పష్టమైన వేరియంట్ ఉంది. ఇది ఊహాజనిత స్థాయిలో సంభవిస్తుంది. అయితే ఈ వేగవంతమైన స్థాయిని వాస్తవంగా ఏది ముందుకు నడిపిస్తుందో అన్నది అంతుచిక్కడం లేదని నాసా వివరించింది. అంతరిక్షంలో ఎక్కడైతే రీకనెక్షన్ సంభవిస్తుందో ప్లాస్మా చాలావరకు సంఘర్షించే శక్తి కోల్పోతుందని అంటున్నారు. సౌరజ్వాలల్లోని ప్లాస్మా అయినా, భూమి చుట్టూ అంతరిక్షం లోనైనా ప్లాస్మా స్తబ్దతగా మారిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు అరవై ఏళ్లుగా సూర్యుని సౌరజ్వాలలపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. సూర్యునిపై పేలుళ్లు ( విస్ఫోటనాలు ) ఏ విధంగా ఏర్పడతాయో వివరిస్తూ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. దీనివల్ల భూమిపై ప్రభావం చూపించే భూఅయస్కాంత తుపాన్లు, సౌరజ్వాలలను ముందుగానే కనుక్కోడానికి వీలు కలుగుతుంది. ఒక సౌరజ్వాల మొత్తం ప్రపంచానికి 20,000 సంవత్సరాలకు సరిపడే విద్యుత్తును విడుదల చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సౌరజ్వాలల వెనుక విస్ఫోటన ప్రక్రియ ప్రభావం ఉంటుంది. దీనినే మేగ్నటిక్ రీకనెక్షన్ అని అంటారు.

మావి మూలకణాలతో బాలుడికి పునర్జన్మ !


గుండె ఆపరేషన్‌కు గర్భస్థ మావి (ప్లాసెంటా) నుంచి సేకరించిన మూలకణాలు ఉపయోగించి ప్రపంచంలో మొట్ట మొదటిసారి నెలల పసివాడికి పునర్జన్మను బ్రిటన్‌కు చెందిన హార్ట్ సర్జన్ అందించడం వైద్యచరిత్రలో సువర్ణాధ్యాయం. పుట్టిన నాలుగు రోజులకే ఓపెన్‌హార్ట్‌సర్జరీ చేయించుకున్న ఆ పసివాడు తరువాత మూలకణాల చికిత్సతో పునరుత్తేజితుడై ఇప్పుడు రెండేళ్లవాడయ్యాడు. మూలకణాల చికిత్సతో వైద్యరంగంలో మరో మలుపు తిరిగింది. బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ ఈ మూలకణాల చికిత్సను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరింత ప్రోత్సాహం అందిస్తోంది. విల్ట్‌షైర్‌కు చెందిన ఫిన్లీ పాంట్రీ అనే బాలుడు పుట్టుకతోనే గుండె లోపంతో పుట్టాడు. అంటే ఆ బాలుని ఊపిరితిత్తులకు, శరీరం లోని ఇతర అవయవాలకు రక్తం ప్రసారం చేసే ప్రధానమైన రెండు ధమనులు పొరపాటు స్థానంలో ఉన్నాయి. పుట్టిన నాలుగు రోజుల్లోనే ఆ రెండు ధమనులను తిరిగి సరైన స్థానంలో పెట్టడానికి ఓపెన్‌హార్ట్ సర్జరీ జరిగింది. గుండె అలా పనిచేయడం కోసం కొన్ని వారాలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్, మందుల సాయంతో ఉంచేశారు. ఇప్పుడు రెండేళ్ల బాలుడయ్యాడు. తనతల్లిదండ్రులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నాడు. బ్రిస్టల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మెస్సిమో కెపుటో ఫిన్లీ తల్లికి మూలకణాల ఆధారంతో గుండె లోని లోపాలను సరిజేయడానికి ప్రయత్నిస్తానని మొదట చెప్పారు. గర్భస్థ మావి (ప్లాసెంటా) బ్యాంకు నుంచి మూలకణాలు సేకరించి అందించడంతో ఈ వైద్యప్రక్రియ ముడిపడి ఉంది. ఆ మూలకణాలను నేరుగా బాలుడు ఫిన్లీ గుండెకు ఎక్కించడం ప్రారంభించారు. గుండెలో దెబ్బతిన్న రక్తనాళాలు ఈ మూలకణాలతో తిరిగి పెరగడం ప్రారంభిస్తాయన్న ఆశతో చికిత్స సాగించారు. చెప్పుకోదగిన విశేషమేమంటే మందులు, వెంటిలేటర్ సహాయం ఫిన్లీకి అక్కర లేకపోయింది." ఫిన్లీకి రెండు నెలల వయసులో తాము ఆశలు వదులుకున్నాం. డాక్టర్లు కూడా మమ్మల్ని పిలిచి మేం చేయవలసిందంతా చేసాం. అని గదిలోకి మమ్మల్ని పిలిచి చెప్పేశారు " అని ఫిన్లీ తల్లి మెలిస్సా హుడ్ గత అనుభవాన్ని చెప్పారు. "ఆ పరిస్థితిలో డాక్టర్ మెస్సిమో వచ్చి ఒకేఒక అవకాశం ఉందని, ఫిన్లీ గుండెకి ఎడమవైపు మూలకణాలు ఎక్కిస్తామని వివరించారు. ఆయన ఫలితం ఏమవుతుందో చెప్పలేనని హెచ్చరించారు. కానీ మాలో ఇంకా ఆశ చావలేదు. ఫిన్లీ బతకడానికి ప్రతి అవకాశాన్ని చూశాం. " అని ఆమె చెప్పారు. మూలకణాల చికిత్స ప్రారంభించిన రెండు వారాల్లోనే ఫిన్లీలో మార్పును కుటుంబీకులు గమనించారు. ఫిన్లీకి ఆరు నెలలు వచ్చాక మెషిన్ సహాయంతో మొట్టమొదటిసారి ఇంటికి పంపించారు. రాత్రుళ్లు శ్వాస తీసుకోడానికి మెషీన్ ఉపయోగపడేది. డాక్టర్ మెసిమోకు మేం సరిగ్గా కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మూలకణాల చికిత్స లేకుంటే ఈరోజు ఫిన్లీ మాతో ఉండేవాడు కాడు అని ఫిన్లీ తల్లి ఉద్వేగానికి గురైంది. భవిష్యత్ ఏం చేస్తుందో మాకు తెలీదు. మూలకణాల చికిత్స తరువాత ఫిన్లీకి పునర్జన్మ కలగడం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అని అన్నారు. గుండె లోపాలన్నవి సాధారణ వైపరీత్యం. బిడ్డ పుట్టకముందే ఇది అభివృద్ది అవుతుంది. గుండె లోపాలతో పుట్టే పసివాళ్లలో రోజూ 13 మందిని బ్రిటన్‌లో డాక్టర్లు గుర్తించడమౌతోంది. అలాంటి బిడ్డలకు చాలా మందికి ప్రస్తుతం ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసి తాత్కాలికంగ ఆ సమస్యకు మరమ్మతు చేస్తున్నారు. కానీ ఆ ప్యాచెస్‌కు వాడిన పరికరాలు, లేదా గుండెలో తిరిగి అమర్చిన కవాటాలు పూర్తిగా జీవసంబంధంగా మారవు. బిడ్డతోపాటు పెరగలేవు. అంటే దీని అర్థం పసివాడు తిరిగి అనేకసార్లు గుండె ఆపరేషన్లు చేయించుకోవలసిన పరిస్థితి కొనసాగుతుంది. బాల్యమంతా కొన్ని వారాల పాటు ఆస్పత్రుల్లోనే పిల్లలు గడపాల్సి వస్తుంది. ఫిన్లీకి మూలకణాల ఇంజెక్షన్ చికిత్సతో పునర్జన్మ కలగడంతో స్ఫూర్తి పొందిన ప్రొఫెసర్ కేపుటో , మూలకణాల ప్లాస్టర్స్‌ను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు.ఈ ప్లాస్టర్స్ పిల్లవానితోపాటు పెరుగుతుంటాయి. మళ్లీమళ్లీ గుండె ఆపరేషన్ చేయించుకోవలసిన గతి తప్పుతుంది. రోగులను పరీక్షించడానికి ఈ ప్లాస్టర్‌లను సిద్ధం చేయాలన్న లక్షం పెట్టుకున్న ప్రొఫెసర్ కెపుటోకు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ 750,000 పౌండ్లను అవార్డుగా అందించింది.

గిరాకీ పెరిగిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ !


టీవీఎస్ మోటార్స్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటికి భారీ గిరాకీ ఉంది. గత మూడు నాలుగు నెలల కాలంలో చూస్తే ఓలా ఎలక్ట్రిక్ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అదేసమయంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2021 నవంబర్ నెలలో ఐక్యూబ్ అమ్మకాలు కేవలం 699 యూనిట్లు కాగా, 2022 నవంబర్ నెలలో 10,056 యూనిట్లు. అంటే టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల్లో వార్షికంగా ఏకంగా 1339 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. నవంబర్ నెలలో ఎక్కువగా విక్రయమైన టాప్ 10 బెస్ట్ స్కూటర్లలో టీవీఎస్ ఐక్యూబ్ 9వ స్థానంలో నిలిచింది. కంపెనీ తన ఐక్యూబ్ అధికారిక సైట్‌లో స్కూటర్ కొనడం వల్ల ఎంత లాభం పొందవచ్చో వివరించింది. పెట్రోల్ స్కూటర్ 50 వేల కిలోమీటర్లు తిరగడానికి రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. ఇక్కడ పెట్రోల్ ధరను లీటరుకు రూ.100గా తీసుకున్నారు. అదే ఐక్యూబ్ స్కూటర్ కొంటే రూ.6,466కే 50 వేల కిలోమీటర్లు తిరగొచ్చని కంపెనీ తెలిపింది. ఇంకా జీఎస్‌టీ , సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ వంటి రూపంలో మరింత ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే 50 వేల కిలోమీటర్లపై రూ. 93,500 వరకు ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంటోందిఅంతేకాకుండా ఒక్కసారి చార్జింగ్ పెట్టుకోవడానికి రూ. 18.75 ఖర్చు అవుతుందని పేర్కొంటోంది. ఐక్యూబ్‌లో ఎస్‌టీ మోడల్‌ చార్జింగ్ టైమ్ 4 గంటల 6 నిమిషాలు. 145 కిలోమీటర్లు వెళ్లొచ్చు. మీరు రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణించినా.. వారానికి రెండు సార్లు చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఖర్చు రూ.37.5 అవుతుంది. అంటే నెలకు రూ. 150 మేర ఖర్చు అవుతుంది. అంటే రోజుకు రూ. 3 ఖర్చు అవుతుంది. ఐక్యూబ్ ధర విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో టీవీఎస్ ఐక్యూబ్ రేటు రూ. 1.15 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.

ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ సరికొత్త ఉత్పత్తుల విడుదల


న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 7న జరిగే క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ తన సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. ఈ ఈవెంట్ లో వన్‌ప్లస్ 11 5G మరియు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 ని లాంచ్ చేస్తుంది. 2019 తర్వాత కంపెనీ నిర్వహిస్తున్న మొట్టమొదటి ఆఫ్‌లైన్ ఈవెంట్ ఇది. "క్లౌడ్ 11" నేపథ్యంతో జరిగిన ఈ ఈవెంట్ లో బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల అప్‌గ్రేడ్ చేయబడిన టెక్నాలజీని, మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఈ తాజా ఉత్పత్తి లాంచ్ తో OnePlus తన కస్టమర్‌లను "క్లౌడ్ 9" నుండి "క్లౌడ్ 11"కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వన్‌ప్లస్ 11 5G బ్రాండ్ యొక్క వేగవంతమైన మరియు అద్భుతమైన అనుభవాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లడానికి సెట్ చేయబడింది. అదనపు సౌకర్యం కోసం ప్రేక్షకులకు ఇష్టమైన వన్‌ప్లస్ అలర్ట్ స్లైడర్‌ని తిరిగి తీసుకువస్తోంది. వన్‌ప్లస్ అలర్ట్ స్లైడర్ ఫీచర్ -కొన్ని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల లో ఉన్న ఐకానిక్ ఫిజికల్ స్విచ్, ఇది వివిధ నోటిఫికేషన్ సెట్టింగ్‌ల మధ్య తొందరగా మార్చడానికి మరియు స్పష్టమైన వ్యవహారంగా చేస్తుంది. ఇది సాధారణంగా మూడు ఆప్షన్ లు కలిగి ఉంటుంది: "నిశ్శబ్దం," "ప్రాధాన్యత," మరియు "అన్నీ." ఇందులో "నిశ్శబ్దం"కి సెట్ చేసినప్పుడు, మీ ఫోన్ ఎటువంటి శబ్దాలు చేయదు లేదా ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌ల కోసం వైబ్రేట్ చేయదు. ఇక రెండవది "ప్రాధాన్యత" మోడ్ లో కొన్ని నోటిఫికేషన్లు లేదా యాప్‌లను సైలెంట్ మోడ్‌ను దాటి నోటిఫికేషన్‌లను పంపడానికి అనుమతిస్తుంది. అయితే ఇక చివరిది "అన్నీ" దీనిలో అన్ని నోటిఫికేషన్‌లను సాధారణంగా వచ్చేలా అనుమతిస్తుంది. ఇక్కడ మరొక్క హెచ్చరిక, స్లైడర్ అనేది వినియోగదారులకు వారి పరికరం యొక్క నోటిఫికేషన్ ప్రవర్తనపై మరింత నియంత్రణను అందించే అనుకూలమైన ఫీచర్. ఇది వన్‌ప్లస్ వినియోగదారులలో జనాదరణ పొందిన ఫీచర్, మరియు వన్‌ప్లస్ 11 5Gలో మల్లి ఈ ఫీచర్ వస్తుండటంతో వినియోగదారులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Wednesday, December 21, 2022

రేపు పగలు నిడివి 10 గంటల 40 నిమిషాలు..!

Shortest day | Tomorrow is the shortest day.. the length of the day is 10  hours and 40 minutes..!

ఖగోళంలో మార్పులు కొన్నిసార్లు డిసెంబర్‌ 21 న వస్తుండగా ఇంకొన్నిసార్లు 22 వ తేదీన జరుగుతాయి. ఇంతకుముందు 2020 లో డిసెంబర్‌ 21 న షార్టెస్ట్‌ డే వచ్చింది. కాగా, ఈసారి డిసెంబర్‌ 22 వస్తున్నది. షార్టెస్ట్‌ డే అంటే తక్కువ పగలు ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉన్న రోజు. సాధారణంగా పగటి సమయం 12 గంటలుగా ఉంటుంది. అయితే, ఈ షార్టెస్ట్‌ డే నాడు మాత్రం పగలు 10 గంటల 40 నిమిషాల నిడివి ఉండనున్నది. ఉజ్జయిని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాష్ గుప్తా ప్రకారం, ప్రతి ఏటా డిసెంబర్ 21 లేదా 22న సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. అంటే దీని తర్వాత ఉత్తరార్ధగోళం వైపు కదులుతాడు. దీని కారణంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగలు పొడవు క్రమంగా పెరగడంతో రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలోని దేశాలలో సూర్యకాంతి చాలా కాలం పాటు భూమిపై ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో దీనిని అతిపెద్ద రోజుగా పిలుస్తారు.

వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్ ?

WhatsApp Upcoming Features That Might Launch In 2023 | వాట్సాప్‌లో కాల్  రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!

ఈ సంవత్సరం ముగియబోతున్నా ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన ఫీచర్లు వాట్సాప్ లో కనిపించలేదు. ప్రస్తుతం వాట్సాప్ తన వినియోగదారులకు ఆటోమేటిక్ మెసేజ్ డిలీషన్ ఆప్షన్ ను ఇస్తుంది. అయితే మెసేజ్ షెడ్యూలింగ్ కోసం ఇంకా ఆప్షన్ లేదు. కొందరికి మెసేజ్ షెడ్యూలింగ్ ఆప్షన్ చాలా ముఖ్యమైనది. వాట్సాప్ ను తమ పని కోసం కూడా ఉపయోగిస్తూ, అవసరమైతే రాత్రిపూట ఎవరి ప్రైవసీలో జోక్యం చేసుకోకుండా తమ ఉద్యోగులకు ఉదయాన్నే నోటిఫికేషన్లు పంపాలనుకుంటున్నారు. ప్రస్తుతం వాట్సాప్ లో మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ తప్ప ఎడిట్ చేసే అవకాశం లేదు. త్వరలో ఈ ఫీచర్ ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ లో పొరపాటున పంపిన మెసేజ్ ను డిలీట్ చేసే ఆప్షన్ మాత్రమే ఉంది. అయితే మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత, తొలగించినట్లు తెలుస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కాబట్టి త్వరలో వాట్సాప్ లో రావచ్చు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ మాదిరిగానే వాట్సాప్ కూడా తన వినియోగదారులకు మరో ఫీచర్ ను అందుబాటులో ఉంచవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులకు తాత్కాలిక చాట్ థ్రెడ్ ను సృష్టించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది చాట్ ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. చాలా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకునే వారికి ఈ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్ లో ఈ ఫీచర్ వస్తుందా అని చాలా మంది వాట్సాప్ వినియోగదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఫీచర్ ను దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. కానీ వాట్సాప్ తన ప్రత్యర్థులకు సవాలును ఇస్తూ, లాస్ట్ సీన్, ఆన్లైన్ ఫీచర్ల మాదిరిగానే కాల్ రికార్డింగ్ ను ఆన్ లేదా ఆఫ్ చేసే ఆప్షన్ను కూడా అందించే అవకాశం ఉంది.

ఇదే ఇన్‌సైడ్‌ ల్యాండర్‌ చివరి ఫొటో కావచ్చు !

Mars Dust May Have Killed NASA's InSight Lander After 4-Year Mission

అంగారక గ్రహంపై పరిశోధనలకు ప్రయోగించిన నాలుగేండ్ల తర్వాత నాసా ఇన్‌సైడ్‌ ల్యాండర్‌ చివరకు తన కార్యకలాపాలను ముగించేందుకు సిద్ధమైంది. 2018 నుంచి మార్స్‌ అంతర్గత నిర్మాణంపై కీలకమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించింది. తన శక్తి తక్కువైపోయిందని, ఇదే చివరి ఫొటో కావచ్చుననే కాప్షన్‌తో నాసా తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఇన్‌సైట్‌ ల్యాండర్‌ తీసిన ఒక ఫొటోను పోస్ట్‌ చేసింది. అంగారకుడిపై భూకంపాలను గుర్తించి వాటిపై అధ్యయనం చేసేందుకు అమెరికాకు చెందిన నాసా 2018 లో మార్స్ పైకి ఇన్‌సైట్‌ ల్యాండర్‌ను పంపింది. ఇటీవల తన చివరి ఫొటోను పంపింది. సోలార్‌ ప్లేట్లపై దుమ్ము, ధూళి చేరడంతో దాని శక్తి మెల్లమెల్లగా క్షీణిస్తున్నది. దీంతో ' నా శక్తి తగ్గిపోయింది. అందుకని ఇదే నా చివరి ఫొటో కావచ్చు. మిషన్‌ బృందంతో సాధ్యమైతే మాట్లాడుతూ ఉంటాను. త్వరలో సైన్‌ ఆఫ్‌ చేస్తాను. నాతో ఇన్నాళ్లు ఉన్నందుకు ధన్యవాదాలు' అని ఇన్‌సైట్‌ ల్యాండర్‌ పంపిన సందేశాన్ని నాసా ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. నాసా పోస్ట్‌ చేసిన ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 6.5 లక్షకు పైగా లైక్‌ చేశారు. 'సోలార్‌ ప్యానెల్స్‌ దుమ్ము, ధూళితో కప్పుకపోవడంతో శక్తిని ఉత్పత్తి చేసుకోవడం కష్టతరంగా ఉన్నదని, తన కార్యకలాపాలు ముగించే సమయం దగ్గర పడింది' అని నవంబర్‌ 10 న నాసా తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై రాసింది. ఈ ట్వీట్‌ కూడా ఇన్‌సైట్‌ ల్యాండర్‌ కార్యకలాపాలు త్వరలో ముగుస్తాయనే వాస్తవాలను సూచిస్తుండటం ఆసక్తికరం.

Popular Posts