ఒప్పో పాడ్ 2 పేరుతొ కొత్త టాబ్లెట్ మోడల్‌లను పరిచయం చేయబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన మొదటి ఒప్పో టాబ్లెట్ మోడల్‌కు మంచి ఆదరణ లభించింది. కాబట్టి ఇప్పుడు ఒప్పో సంస్థ ఒప్పో పాడ్ 2 మోడల్‌ను పరిచయం చేయడానికి ఒప్పో ప్యాడ్ 2 మోడల్ 11-అంగుళాల డిస్‌ప్లే తో ఉంది. ఈ Oppo Pad 2 మోడల్‌లో 2800 x 2000 పిక్సెల్‌లు, 144 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR 10 ప్లస్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. Oppo Pad 2 మోడల్‌లో MediaTek Dimensity 9000 చిప్‌సెట్ ఉన్నట్లు రిపోర్ట్ లు తెలియచేస్తున్నాయి. అలాగే, ఈ టాబ్లెట్ యొక్క గేమింగ్ ప్రయోజనాల ను ఒక్కసారి గమనిస్తే, ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కావడం ప్రధాన విషయంగా చెప్పుకోవచ్చు. RAM మరియు స్టోరేజీ వివరాలు గమనిస్తే, Oppo Pad 2 మోడల్‌లో 12GB RAM ఉంది. తరువాత, కొత్త టాబ్లెట్ 128GB లేదా 256GB నిల్వ మద్దతుతో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. Oppo కంపెనీ ఈ టాబ్లెట్ మోడల్ లో బ్యాటరీ సామర్థ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు లీక్ అయిన వివరాలు తెలియచేస్తున్నాయి. అంటే Oppo Pad 2 మోడల్ 9500 mAh బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి ఈ oppo టాబ్లెట్ గొప్ప బ్యాటరీ బ్యాకప్‌ను కూడా అందిస్తుంది. ఇంకా, ఈ Oppo Pad 2 మోడల్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో వస్తుందని రిపోర్టులు తెలియచేస్తున్నాయి.
Search This Blog
Monday, January 30, 2023
షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ రాజీనామా !
షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ రాజీనామా చేశారు. తొమ్మిదేండ్లుగా షియోమీలో మను కుమార్ జైన్ సేవలందించారు. షియోమీ ఇండియా మనీ లాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించిందన్న అభియోగంపై షియోమీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న నేపథ్యంలో మను కుమార్ జైన్ వైదొలగడం ఆసక్తికర పరిణామం. 'జీవితంలో మార్పు ఒక్కటే స్థిరం. గత తొమ్మిదేండ్లుగా నా పట్ల షియోమీ యాజమాన్యం చూపిన ఆదరాభిమానాలకు అదృష్టవంతుడ్ని. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థ నుంచి వైదొలగడం కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు` అని ట్వీట్ చేశారు. `పలు ఉత్తేజకరమైన అవకాశాలు అందుబాటులో ఉండగా, ఒక ప్రయాణం ముగింపు మరో ప్రయాణానికి నాంది. న్యూ అడ్వెంచర్‌కు స్వాగతం పలుకుతున్నా` అని పేర్కొన్నారు. 2014లో భారత్‌లో షియోమీ ఆవిష్కరణలో మను కుమార్ జైన్ కీలకంగా వ్యవహరించారు. భారత్ మార్కెట్‌లో విస్తరణకు కృషి చేశారు. `తొమ్మిదేండ్ల తర్వాత షియోమీ గ్రూప్ నుంచి వైదొలుగుతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా సంస్థకు సమర్థవంతమైన బృందాలు ఉన్న ప్రస్తుత తరుణంలో వైదొలగడం సరైందని విశ్వసిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా జియో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా` అని మను కుమార్ జైన్ పేర్కొన్నారు.
టెక్నో స్పార్క్ గో స్మార్ట్ ఫోన్ విడుదల !
టెక్నో స్పార్క్ గో స్మార్ట్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ తో రూ.6,999 లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎండ్ లెస్ బ్లాక్, యూయిని బ్లూ మరియు నెబ్యులా పర్పల్ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది. టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ డిస్ ప్లేని HD+ రిజల్యూషన్ తో వుంటుంది. ఈ డిస్ప్లే 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90% స్క్రీన్ టూ బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ బడ్జెట్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ Helio A22 తో పనిచేస్తుంది. దీనికి జతగా, 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ టి ఉంటుంది. కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక AI డ్యూయల్ కెమేరా వుంది. ఇందులో 13MP ప్రైమరీ కెమేరా జతగా మరొక కెమేరా వుంది. ముందు భాగంలో, 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా HiOS సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో పెద్ద 5000 mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది.
వాట్సప్‌లో మెసేజెస్ దాచుకోవచ్చు ?
వాట్సప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం ఈ మెసేజింగ్ యాప్ డిసప్పియరింగ్ మెసేజ్ లను టెంపరరీగా సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ తీసుకొచ్చే పనిలో ఉంది. సాధారణంగా ఏదైనా వాట్సప్ చాట్‌కు 'డిసప్పియరింగ్ మెసేజెస్' టర్న్ ఆన్ చేస్తే.. ఆ చాట్‌లోని మెసేజ్‌లన్నీ కొన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్ చేసినా ఆ చాట్‌లోని మెసేజెస్ సేవ్ చేసుకునేలా వాట్సప్ ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. డిసప్పియరింగ్ మెసేజెస్‌ను సేవ్ చేసే ఫీచర్‌ను 'కెప్ట్ మెసేజెస్'గా వాట్సప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ చేసింది. కెప్ట్ మెసేజెస్ లేదా సేవ్డ్ మెసేజెస్ ఫీచర్‌ను ఉపయోగించి చాట్‌లోని డిసప్పియరింగ్ మెసేజెస్‌ను తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు. అంటే ఇలా సేవ్ చేసిన డిసప్పియరింగ్ మెసేజ్‌లు చాట్ నుంచి ఆటోమేటిక్‌గా ఎప్పటికీ డిలీట్ అవ్వవు. చాట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ వాటిని చూడగలరు. యూజర్లు ఈ మెసేజ్‌లు అవసరం లేదనుకుంటే వాటిని ఏ సమయంలోనైనా "అన్-కీప్" చేయవచ్చు. అప్పుడు ఆ మెసేజ్‌లు చాట్ నుంచి పర్మనెంట్‌గా డిసప్పియర్ అవుతాయి. ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. WABetaInfo తన లేటెస్ట్ రిపోర్ట్‌లో ఈ ఫీచర్ పనితీరుకు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లో వాట్సప్‌లో కెప్ట్ మెసేజెస్‌తో సేవ్ చేసిన ఒక మెసేజ్ చూడవచ్చు. అలానే డిసప్పియరింగ్ మెసేజ్ బబుల్‌లో కనిపించే బుక్‌మార్క్ ఐకాన్ గమనించవచ్చు. చాట్‌లో కనిపించే ఈ విజువల్ ఇండికేటర్ సహాయంతో డిసప్పియరింగ్ మెసేజ్‌లు, సేవ్ చేసిన మెసేజ్‌ల మధ్య తేడాను గుర్తించడం సాధ్యమవుతుంది. యూజర్లు సెట్ చేసుకున్న టైమ్ లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా ఈ సేవ్డ్ మెసేజ్‌లు కనిపిస్తూనే ఉంటాయి. వీటిని చాట్‌లోని ఎవరైనా సరే డిలీట్ చేయవచ్చు. వాట్సప్‌లో స్టార్‌డ్ మెసేజెస్‌పై స్టార్ గుర్తు ఎలా ఉంటుందో అలా ఈ సేవ్డ్ లేదా కెప్ట్ మెసేజ్‌పై కూడా ఒక గుర్తు ఉంటుంది. వీటిని కావలసినప్పుడు అన్‌సేవ్ చేయడం ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. వీటిని ఒకసారి డిలీట్ చేస్తే మళ్లీ తిరిగి పొందడం సాధ్యం కాదు. డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్ చేసినా వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్‌లను సేవ్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. వాట్సప్ QR కోడ్‌ని ఉపయోగించి ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్‌కి డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్‌పై కూడా పనిచేస్తోందని WABetaInfo నివేదించింది. అలానే వాట్సప్ రీసెంట్‌గా తన యూజర్లకు "యాక్సిడెంటల్ డిలీట్" పేరుతో ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. మీరు పొరపాటున "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"కి బదులుగా "డిలీట్ ఫర్ మీ" ఆప్షన్‌ని నొక్కితే.. ఆ యాక్షన్ క్యాన్సిల్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీనివల్ల యూజర్లకు చాలా హెల్ప్ అవుతుంది.
ఫిలిప్స్ లో ఆరువేల మంది తొలగింపు
ఫిలిప్స్ కంపెనీ మరోసారి ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. కొన్ని నెలల క్రితమే వేలాది మందినితొలగించిన సంస్థ, మరోసారి 6,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. గతేడాది రెస్పిరేటరీ డివైజ్‌లను భారీగా రీకాల్ చేసింది. ఆ ప్రభావం సంస్థపై తీవ్రంగా ఉంది. ఇంకా కొనసాగుతుండటమే ఉద్యోగాల కోతకు కారణమవుతున్నట్లు సమాచారం. ఈ రెస్పిరేటరీ సామగ్రిని రీకాల్ చేసిన తర్వాత ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ఇది రెండోసారి. ఫిలిప్స్ సంస్థ గత ఏడాది 2022, అక్టోబర్‌లో 4,000 మందిని తొలగించింది. గతంలో మాదిరి సంస్థను మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు డచ్ సంస్థ ఫిలిప్స్ తెలిపింది. ఈ రీకాల్ తో కంపెనీ మార్కెట్ విలువ 70 శాతం మేర తగ్గిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించాలని సంస్థ ప్రణాళికలు చేస్తోంది. 2025 నాటికి మిగిలిన 50 శాతం వర్క్ ఫోర్స్ పై నిర్ణయం తీసుకోనుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ కు భారీ డిమాండ్
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చింది. కంపెనీ 2022 డిసెంబర్ నెలలో దీన్ని ఆవిష్కరించింది. ఇది ఐదు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ ఎక్స్ ఓ అనేవి ఇవి. అలాగే ఈ కారు వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ఓ వేరియంట్లలో హైబ్రిన్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 18.3 లక్షలు. అలాగే టాప్ మోడల్ ధర రూ. 28.97 లక్షలు. కంపెనీ ఈ కార్ల డెలివరీని ప్రారంభించింది. నీలేశ్ దేశాయ్‌కు తొలి కారు డెలివరీ చేసింది. అయితే ఈ కారు వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు కనీసం ఆరు నెలలుగా ఉంది. అలాగే కొన్ని వేరియంట్లకు వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 12 నెలల దాకా ఉంది. ఈ కొత్త కారులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉంది. స్మార్ట్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ కారులో అడాస్ టెక్నాలజీ ఉంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కంపెనీ ఈ ఇన్నోవా హైక్రాస్‌కు బోల్డ్ లుక్ ఇచ్చింది. చంకీ బంపర్, హనీకంబ్ మెష్ గ్రిల్, స్లీకర్ హెడ్ ల్యాంప్స్, అప్‌రైట్ ప్రొఫైల్ వంటి వాటితో ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారులో 18 ఇంచుల అలాయ్ టైర్లు ఉంటాయి. 100 ఎంఎం వీల్‌బేస్, ట్యాపంగ్ రూఫ్, అలాగే ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మారుతీ ఎక్స్ఎల్, ఎర్టిగా టాప్ వేరియంట్లతో పోటీ పడుతోంది. అలాగే ఇన్నోవా క్రిస్టా, ఇతర 6 నుంచి 7 సీటర్ల కారుకు గట్టి పోటీ ఇస్తోంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్ రెండు పవర్‌ట్రైన్స్ ఆప్షన్లలో లభిస్తోంది. ఒక దానిలో 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో సీవీటీ గేర్ బాక్స్ ఉంటుంది. పవర్ 174 పీఎస్. టార్క్ 205 ఎన్ఎం. ఇక రెండో కారులో 2 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు పవర్ 152 పీఎస్. టార్క్ 187 ఎన్ఎం. ఇందులో ఇసీవీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. కంపెనీ ప్రకారం చూస్తే.. ఈ కారు లీటరుకు 21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంకా ఈ కారులో 7 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పది ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్జస్టబుల్ కెప్టెన్ సీట్స్, డ్యూయెల్ 10 ఇంచ్ రియర్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, అడాస్, సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Sunday, January 29, 2023
సెన్స్ పికాసో 55 ఇంచుల స్మార్ట్ టీవీపై బంపరాఫర్ !
సెన్స్ పికాసో 55 ఇంచుల స్మార్ట్ టీవీపై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఇది అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఇందులో డాల్బే ఆడియో, డీటీఎస్ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీపై పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 56,790. అయితే ఈ టీవీని ఇప్పుడు రూ. 28,999కే కొనొచ్చు. అంటే మీరు నేరుగా 48 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు అదనపు తగ్గింపు ఉంది. రూ. 1000 వరకు తగ్గింపు వస్తుంది. అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈ టీవీ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే తక్కువ రేటుకే టీవీ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్స్‌ట్రా 1 ఐటమ్స్ ద్వారా రూ. 1000 తగ్గింపు వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.11 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. అంటే రూ. 17,999కే ఈ టీవీ కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే మీకు రూ. 16,999కే ఈ టీవీ లభిస్తుంది. ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కలుపుకుంటే రూ. 15,999కే టీవీ పొందొచ్చు. ఈ టీవీ కొనుగోలుపై తక్కువ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు కలిగిన వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు. 18 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వడ్డీ పడదు. 18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1556 కట్టాలి. అదే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2334 చెల్లించాలి. అలాగే 9 నెలల ఈఎంఐ అయితే రూ.3111 కట్టాల్సి ఉంటుంది. ఇంకా 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 4667 చెల్లించాలి. 3 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ. 9333 పడుతుంది. ఇంకా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అయితే టెన్యూర్ మాత్రం తక్కువగా ఉంటుంది.
ఇండస్ బ్యాటిల్ రాయల్ గేమ్ ప్లే ట్రైలర్ విడుదల !
ఆన్‌లైన్ వీడియో గేమ్‌లకు ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. గతంలో పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటివి దేశంలో పాపులర్ అయ్యాయి. ఇండియాలో ఆన్‌లైన్ గేమ్స్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇదే తరుణంలో ఇండియన్ గేమర్స్ కోసం మరో సూపర్ గేమ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆ గేమ్ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఆండ్రాయిడ్‌లో ప్రీ- రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంచారు. పూణేకు చెందిన గేమ్ డెవలపర్ సూపర్‌గేమింగ్ అనే సంస్థ ఇప్పుడు ఇండస్ బ్యాటిల్ రాయల్ గేమ్ ను డెవలప్ చేసింది. ఈ గేమ్‌కు సంబంధించి 21 సెకన్లు ఉన్న వీడియోను తన వెబ్‌సైట్‌లో పెట్టింది. అయితే ఇందులో వివరాలు ఏవీ వెల్లడించలేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం భారతీయ సంగీతం మాత్రం ఓ మంచి రిథమ్‌లో వినిపిస్తుంది. ఇది యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రత్యేకమైన ఆయుధాలు, అందులోని పాత్రలు, వాళ్లు ఉపయోగించే వాహనాలు, వేరే వేరే లోకేషన్లలలో అదిరిపోయే ఫైర్ ఫైట్స్ వంటివి ఆకట్టుకున్నాయి. ఈ గేమ్ పబ్జీకి పోటీ అవ్వొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గేమ్‌లోని పాత్రలు కూడా హైలెట్‌గా నిలుస్తున్నాయి. భారతీయ పురాణాల్లోని కథల నుంచి స్ఫూర్తి పొంది వీటిని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులోని 'బిగ్-గాజ్' అనే పాత్ర ఏనుగు ముఖాన్ని కలిగి ఉంటుంది. విర్లోక్ అనే దాన్ని చూసిన అలాంటి భావనే కలుగుతుంది. సూపర్‌గేమింగ్ సంస్థ గతంలో సిల్లీ రాయల్, మాస్క్ గన్ అనే రెండు గేమ్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు తీసుకురాబోతున్న ఇండస్ బ్యాటిల్ రాయల్ గేమ్.. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అపెక్స్ లెజెండ్స్, ఫోర్ట్ నైట్, పబ్జీ వంటి వాటికి పోటీ ఇవ్వనుంది. కొత్త గేమ్ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా సూపర్‌గేమింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రాబీ జాన్ మాట్లాడారు. ఏడాదిగా తాము తయారు చేస్తున్న ఈ రాయల్ గేమ్‌ను ప్రపంచంతో పంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే గేమ్ అందుబాటులోకి రానుంది. ఈ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో ముందస్తుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. iOS, ఐప్యాడ్ ఓఎస్ వాడే వారికి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాబీ జాన్ వెల్లడించారు. ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ఆసక్తికరమైన ఇన్-గేమ్ సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఆడి కార్ !
లగ్జరీ కార్ కంపెనీ ఆడి తన స్పియర్ కాన్సెప్ట్ లో తన నాల్గో ఎలక్ట్రిక్ వాహనం యాక్టివ్ స్పియర్ ను లాంచ్ చేసింది. పూర్తి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఉన్న ఈ కారు సూపర్ పవర్ తో అందుబాటులో రానుంది. స్పియర్ ఈవీ కాన్సెప్ట్ లో ఇదే తన చివరి మోడల్ అని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కార్ లో ఎక్కడ బటన్స్ గానీ స్క్రీన్ లు గానీ ఉండవు. కంప్లీట్ కన్సీల్డ్ టైప్ ఇంటీరియర్ ఉంటుంది. కానీ అద్భుతమైన వర్చువల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. డ్రైవర్ రాగానే కావాల్సినవి ఓపెన్ అవుతాయి. అన్ని ఫంక్షన్లను కంట్రోల్ చేసేందుకు ఆగ్యూమెంటెడ్ రియాలిటీ (ఏఆర్) టెక్నాలజీని ఆడి కంపెనీ వాడింది. కారులోకి ఎక్కి వర్చువల్ రియాలిటీ (వీఆర్) గ్లాసెస్ పెట్టుకోగానే సరికొత్త వర్చువల్ ప్రపంచంలోనికి తీసుకెళ్తుంది. దీని ద్వారానే నావిగేషన్, కారులో క్లైమెట్ కంట్రోల్ ఇంకా అలాగే ఎంటర్ టైన్మెంట్ ఫీచర్లను వినియోగించుకునే వీలుంటుంది. ఈ కారులో వుండే మిక్స్ డ్ రియాలిటీ అనే డిజిటల్ ఎకో సిస్టమ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ని త్రీడిలో ప్రొజెక్ట్ చేస్తుంది.ఈ కార్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కారైనా.. డ్రైవర్ కోరుకొన్నప్పుడు మాన్యుల్ మోడ్ లోకి మార్చుకునే ఫీచర్ ఉంటుంది. ఇంటీరియర్ ప్యానల్ డ్యాష్ బోర్డ్ లో హిడెన్ గా ఉన్న స్టీరింగ్ వీల్ డ్రైవర్ కమాండ్ తో బయటకు రావడం వల్ల మాన్యువల్ మోడ్ అనేది ఆన్ అవుతుంది.ఇక ఈ ఆడి కారు ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తోందని ఆడి కంపెనీ పేర్కొంది. అంటే దీనిలో వుండే బ్యాటరీ సింగిల్ చార్జ్ తో ఏకంగా 600 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే బ్యాటరీ కూడా ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ తో వస్తోంది. ఇది 5 శాతం నుంచి 80 శాతానికి కేవలం 25 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని ఆడి కంపెనీ తెలిపింది.మొత్తం 800 volt సామర్థ్యంతో కూడిన చార్జింగ్ టెక్ 10 నిమిషాల్లోనే ఏకంగా 300 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి అవసరమైన పవర్ ను ఇది స్టోర్ చేస్తుంది.అలాగే దీని బయట వైపు 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.ఇంకా కారు బాడీలో ఎక్కువ భాగం గ్లాస్ తో ఉంటుంది. ముందు భాగంలో రన్నింగ్ లైట్లు ఇంకా వెనకాల అల్ట్రా ఫైన్ ఎల్ఈడీ టెక్నాలజీతో వస్తున్నాయి.
20 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిన జియో !
జియో నవంబర్ 2022లో దాదాపు 1.42 మిలియన్ల కొత్త వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను పొందింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, జియో మరియు ఎయిర్‌టెల్ ఈ నెలలో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను జోడించగా, BSNL మరియు Vi కోల్పోయాయి. అయితే, అది ముఖ్యమైన విషయం కాదు. టెల్కోలు ఎంత మంది యాక్టివ్ యూజర్‌లను యాడ్ చేశారన్నది నిజంగా ముఖ్యమైనది. TRAI ప్రచురించిన డేటా ప్రకారం, Airtel 1 మిలియన్ యాక్టివ్ యూజర్‌లను జోడించగా, Jio 2 మిలియన్ యాక్టివ్ యూజర్‌లను కోల్పోయింది. Jio యాక్టివ్ యూజర్‌లను కోల్పోయిన విషయం అంచనా వేయడం కష్టం . దేశంలోని అనేక ప్రాంతాలకు 5Gని విడుదల చేయడంలో ఎయిర్‌టెల్ కంటే జియో కొంచెం ముందుంది. కాబట్టి, జియో యాక్టివ్ యూజర్‌లను ఎందుకు కోల్పోయిందని అర్థం చేసుకోవడం కష్టం. Jio యొక్క టారిఫ్‌లు ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్‌ల కంటే కూడా తక్కువగా ఉన్నాయి. Vodafone Idea మరియు BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వరుసగా 2 మిలియన్ మరియు 0.5 మిలియన్ క్రియాశీల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయాయి.
పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ పొందండి !
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌పై మంచి డీల్ లభిస్తోంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వేరియంట్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఉచితంగానే పొందే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పోకో స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ రూ. 10,999గా ఉంది. అయితే దీన్ని ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రానిక్స్ సేల్‌లో రూ. 6499కు కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు నేరుగానే 40 శాతం తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ పోకో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ. 650 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు మీకు ఈ ఫోన్ కేవలం రూ. 5849కు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై మరో డీల్ కూడా ఉంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 5950 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అంటే మీరు బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే ఒక్క రూపాయి కట్టకుండానే కొత్త ఫోన్ పొందొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ స్మార్ట్‌ఫోన్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. కొన్ని ఫోన్లకు ఎక్స్చేంజ్ విలువ తక్కువ ఉండొచ్చు. అప్పుడు చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఫోన్ ఎక్స్చేంజ్ చేసే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 2+1 స్లిప్ స్లాట్, మీడియాటెక్ జీ35 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే అందుబాటు ధరలో ఫోన్ అదిరిందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈఎంఐలో ఈ ఫోన్ కొనాలని భావిస్తే.. నెలకు రూ. 584 నుంచి ప్రారంభం అవుతోంది. 12 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 765 చెల్లించాలి. 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1128 కటాల్సి వస్తుంది. మూడు నెలలు అయితే నెలకు రూ. 2219 ఈఎంఐ పడుతుంది. కేవలం టెన్యూర్ ప్రకారం కాకుండా క్రెడిట్ కార్డు ప్రాతిపదికన కూడా మీ నెల వారీ ఈఎంఐ మొత్తంలో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు.
ఇస్రో ఆదిత్య స్పేస్ మిషన్ !
ఆదిత్య - L1 అనేది భారతదేశం సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో పంపబోతున్న తొలి స్పేస్ మిషన్. ఈ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ నింగిలోకి మోసుకెళ్తుంది. సూర్యుడి ఉపరితలాన్ని కరోనా అని పిలుస్తారు. అక్కడ దాదాపు 5,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంత వేడి ఉంటుంది కాబట్టే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి కూడా సూర్యుడి వేడి బాగానే తగులుతూ ఉంటుంది. ఈ వేడిపై పరిశోధన చేసేందుకు ఆదిత్య - L1ను 2023 జూన్ లేదా జులైలో ఇస్రో ప్రయోగించనుంది. ఆదిత్య - L1 చాలా దూరం వెళ్లాలి కదా.. అందువల్ల దానికి 7 పేలోడ్స్ ఉంటాయి. అవి VELC (కనిపించే ఉద్గార రేఖ కరోనాగ్రాఫ్), SUIT (సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్), SoLEXS (సోలార్ తక్కువ శక్తి ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్), HEL1OS (హై ఎనర్జీ L1 కక్ష్యలో ఉన్న ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్), ASPEX (ఆదిత్య సౌర పవన కణ ప్రయోగం), PAPA (ఆదిత్య కోసం ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ), అధునాతన ట్రై-యాక్సియల్ హై-రిజల్యూషన్ డిజిటల్ మాగ్నెటోమీటర్లు. ఈ పేలోడ్లలో అతి పెద్దదైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC)ని.. జనవరి 26న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA)... ఇస్రోకి అందించింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో కూడా... సూర్యుడిపై ప్రయోగాల్లో నాసా సరసన చేరుతుంది. దీన్ని సక్సెస్ చెయ్యడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో మరో అడుగు ముందుకేసేందుకు శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.
Saturday, January 28, 2023
మైక్రోసాఫ్ట్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక !
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలామంది ఉపయోగిస్తున్నారు. వారందరికీ తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఒక ప్రమాదకరమైన సాంకేతిక లోపం ఉన్నట్లు ఈ సంస్థ మైక్రోసాఫ్ట్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఈ లోపం ద్వారా రిమోట్ అటాకర్ లేదా హ్యాకర్ యూజర్ కంప్యూటర్‌కు యాక్సెస్‌ను సులభంగా పొంది దానిని కంట్రోల్ చేయగలుగుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సెక్యూరిటీ సమస్య 109.0.1518.61కి ముందు ఎడ్జ్ వెర్షన్లు వాడుతున్న వారిని ప్రమాదంలో పడి వేస్తుందని వివరించింది. ఎవరైనా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లోని ఆ లోపాన్ని ఉపయోగించుకోగలిగితే, వారు యూజర్ల కంప్యూటర్‌కు యాక్సెస్‌ను పొందగలరని, టర్న్ ఆన్ చేసి ఉన్న ఎలాంటి సెక్యూరిటీస్‌నైనా దాటవేయగలరని తెలిపింది. తద్వారా యూజర్ల పర్సనల్ సమాచారం దొంగిలించడానికి లేదా యూజర్లపై నిఘా పెట్టడానికి వీలవుతుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లోని ఈ లోపం యూజర్ల కంప్యూటర్‌కు ప్రత్యేక రకమైన రిక్వెస్ట్‌ను పంపడానికి హ్యాకర్లకు మార్గం సుగమనం కూడా చేస్తుందని CERT-IN పేర్కొంది. దాని ద్వారా హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడం సులువు అవుతుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఈ సెక్యూరిటీ బాడీ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో బగ్‌లు, లోపాలను కనిపెట్టి యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లకు హై సెక్యూరిటీ రిస్క్ ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమస్య చాలా పెద్దది కాబట్టి దీనిని మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రమే ఫిక్స్ చేయగలదు. కాగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ లోపాన్ని ఫిక్స్ చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 109.0.1518.61 వెర్షన్‌ను తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ యూజర్లు ఈ కొత్త వెర్షన్‌కు తమ ఎడ్జ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు. మీ సిస్టమ్‌లో న్యూ అప్‌డేట్ అందుబాటులో ఉంటే అప్‌డేట్ ప్రాంప్ట్ పొందుతారు. లేదంటే కొత్త అప్‌డేట్ కోసం మాన్యువల్‌గా కూడా చెక్ చేయవచ్చు. అందుకు బ్రౌజర్ టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఆపై సెట్టింగ్స్‌కి వెళ్లి అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత లేటెస్ట్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం బ్రౌజర్‌ను రీలాంచ్ చేసుకుంటే సరిపోతుంది.
పోకో X5 5G సిరీస్ వచ్చేస్తోంది !
పోకో స్మార్ట్‌ఫోన్లలో Poco X5, Poco X5 ప్రోలతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. Poco X5 5G, Poco X5 Pro 5G మోడల్‌లు యూరోపియన్ రిటైల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. పోకో X5 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్‌ల సంబంధించి వివరాలను రివీల్ చేసింది. హంగేరియన్ రిటైల్ వెబ్‌సైట్, సిటీటెల్‌లోని లిస్టు ప్రకారం.. Poco X5 5G, Poco X5 Pro 5G త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పోకో స్మార్ట్‌ఫోన్ సిరీస్ బేస్, ప్రో మోడల్స్ రెండింటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు కలర్ ఆప్షన్‌లతో లిస్టు అయింది. ఫోన్ గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. నానో-సిమ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 11 బేస్‌లో POCO MIUI 13 రన్ అవుతుంది. వెబ్‌సైట్ ప్రకారం… ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల AMOLED ఫుల్-HD+ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6GB RAMతో Qualcomm SM6375 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48-MP ప్రైమరీ సెన్సార్, 8-MP సెకండరీ సెన్సార్, 2-MP ఒకటి ఉంటాయి. ముందు కెమెరాలో 16MP సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, NFC కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. 33W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Poco X5 Pro 5G బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. Android 12 ఆధారంగా POCO మోడల్ MIUI 14ని అందిస్తుంది. ఈ ఫోన్ 16Kతో 6.67-అంగుళాల AMOLED పూర్తి-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1,080 x 2,400 పిక్సెల్స్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. కెమెరా సెటప్‌లో 108-MP ప్రైమరీ సెన్సార్, 8-MP సెకండరీ సెన్సార్, 2-MP లెన్స్‌తో పాటు ఫ్రంట్ కెమెరా,16-MP లెన్స్ ఉంటాయి. బేస్ వెర్షన్ మాదిరిగా ప్రో మోడల్ కూడా వెర్షన్ 5.1కి బదులుగా బ్లూటూత్ 5.2తో పాటు Wi-Fi, GPS, NFC కనెక్టివిటీని అందిస్తుంది. ప్రో మోడల్ Li-Po 5000mAh బ్యాటరీని అందిస్తుంది. 67W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
అమెజాన్ ఉచిత కిరాణా డెలివరీ రద్దు !
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు 150 డాలర్లు కన్నా తక్కువ ఆర్డర్‌లపై అమెజాన్ ఉచిత కిరాణా డెలివరీని రద్దు చేస్తోంది. అమెజాన్ ఫ్రెష్ నుంచి తమ కిరాణా సామాగ్రిని డెలివరీ చేసే ఆర్డర్లు 150 డాలర్ల కన్నా తక్కువ చెల్లించే కస్టమర్‌లకు ఆర్డర్ సైజు ఆధారంగా 3.95 , 9.95 డాలర్లు వరకు వసూలు చేయడం జరుగుతుందని కంపెనీ ఈ-మెయిల్‌లో తెలిపింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 28 నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని ఆర్డర్‌లపై అనుకూలమైన రెండు గంటల డెలివరీలను అందిస్తామని కంపెనీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కస్టమర్‌లు తక్కువ రుసుముతో ఆరు గంటల డెలివరీ విండోను ఎంచుకోవచ్చునని అమెజాన్ ఈమెయిల్‌లో తెలిపింది. 2005లో ప్రారంభమైన ప్రైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా మెంబర్లు ఉన్నారు. అమెజాన్ సంవత్సరానికి 139 డాలర్లు లేదా వేగవంతమైన షిప్పింగ్, ఉచిత డెలివరీ, రిటర్న్‌ల వంటి ఇతర పెర్క్‌ల కోసం నెలకు 14.99 డాలర్లు చెల్లిస్తారు. ప్రస్తుతం, కంపెనీ 35 డాలర్లు కన్నా ఎక్కువ ఆర్డర్‌లపై సభ్యులకు ఉచిత కిరాణా డెలివరీలను అందిస్తోంది. అమెరికా అంతటా డజన్ల కొద్దీ అమెజాన్ ఫ్రెష్ స్టోర్‌లను కలిగి ఉంది. కొన్ని విదేశాలలోనూ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ 2017 నుంచి హోల్ ఫుడ్స్‌ను కూడా కలిగి ఉంది. గత కొన్ని నెలల్లో, వ్యాపారంలో లాభదాయకమైన ప్రాంతాలను తగ్గించింది. కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో నియామకాన్ని నిలిపివేసింది. ఈ నెలలో 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
పడిపోయిన స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు !
చైనా మార్కెట్లో గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయంలో ఒప్పోను దాటేసి.. ఆపిల్ ఐఫోన్లు రెండో స్థానం ఆక్రమించాయి. చైనా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ గతేడాది స్మార్ట్ ఫోన్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద మార్కెట్లు చైనా, భారత్. డ్రాగన్‌తో పోలిస్తే భారత్‌లో స్మార్ట్ ఫోన్స్ పడిపోయాయని కౌంటర్ పాయింట్ మార్కెట్ రీసెర్చ్ వెల్లడించింది. 2021తో పోలిస్తే 2022లో భారత్‌లో స్మార్ట్ ఫోన్ సేల్స్ తొమ్మిది శాతం తగ్గిపోయాయి. గతేడాది కేవలం 152 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఎంట్రీ లెవెల్, బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల సేల్స్‌లోనే తగ్గుదల నమోదైంది. ఓవరాల్‌గా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గినా.. రూ.30 వేల కంటే పై చిలుకు స్మార్ట్ ఫోన్ల సేల్స్ మాత్రం రికార్డు స్థాయిలో 35 శాతం పెరిగాయి. ఈ క్యాటగిరీలో తొలిసారి డబుల్ డిజిట్స్ 11 శాతం పెరిగాయి. ఇక చైనాలో వరుసగా ఐదో ఏడాది స్మార్ట్ ఫోన్ సేల్స్ 2022లో 14 శాతం తగ్గాయి. అన్ని రకాల బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ సేల్స్ పడిపోయాయి. సేల్స్‌లో మూడుశాతం తగ్గుదల నమోదైనా చైనాలో దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పోను దాటేసి ఆపిల్ ఐ-ఫోన్లు రెండో స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది మొత్తం స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో 5జీ ఫోన్ల వాటా 32శాతానికి పెరిగింది. 2021లో స్మార్ట్ ఫోన్ల విక్రయం 19 శాతం పెరిగితే, 2022లో అది 32 శాతానికి దూసుకెళ్లింది. 5జీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో శ్యామ్‌సంగ్ 21 శాతం వాటాతో మొదటి స్థానం కొట్టేసింది. సేల్స్ ఆదాయంలోనూ 22 శాతం పెంచుకున్నది శ్యామ్‌సంగ్.
Friday, January 27, 2023
ఫిబ్రవరి 7న వన్ ప్లస్ కొత్త టాబ్లెట్ విడుదల
వన్ ప్లస్ సంస్థ ఫిబ్రవరి 7, 2023న న్యూ ఢిల్లీలో క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈవెంట్ సందర్భంగా అనేక ఉత్పత్తులను లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఇప్పటికే ధృవీకరించిన కొన్ని పరికరాలలో - వన్ ప్లస్ Buds Pro 2, వన్ ప్లస్ 11 5G, వన్ ప్లస్ కీబోర్డ్, వన్ ప్లస్ TV 65 Q2 Pro మరియు వన్ ప్లస్ 11R 5G. కానీ వీటితో పాటు, OnePlus అనేక ఇతర ఉత్పత్తులను ప్రకటించవచ్చు. ఆ ఉత్పత్తులలో ఒకటి వన్ ప్లస్ ప్యాడ్ కూడా ఈ లిస్టులో ఉంటుందని అంచనాలున్నాయి. ఇప్పటికే లాంచ్ చేయబడిన రీబ్రాండెడ్ ఒప్పో ప్యాడ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒప్పో ప్యాడ్ ColorOSలో పనిచేస్తుంది. అయితే, OnePlus ప్యాడ్ OxygenOS పై రన్ అవుతుంది. ప్రముఖ టిప్‌స్టర్ @OnLeaks (ట్విటర్‌లో) పంచుకున్న సమాచారం మేరకు, రాబోయే OnePlus టాబ్లెట్ యొక్క ఫస్ట్ లుక్‌ను షేర్ చేసారు. ఇది భారతదేశంలో OnePlus నుండి వచ్చిన మొదటి టాబ్లెట్. కాబట్టి OnePlus క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్‌తో టాబ్లెట్‌లు మరియు కీబోర్డ్‌లతో సహా అనేక కొత్త ఉత్పతులతో ఇది మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కంపెనీ ఇప్పటికే చైనాలో OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. కాబట్టి, ఇది భారతీయ మార్కెట్ లో కూడా అదే విధంగా ఉండబోతోంది కాబట్టి మీరు దాని స్పెసిఫికేషన్‌లను పరిశీలించవచ్చు. అయినప్పటికీ, ఈ ఫోన్లు మరియు టాబ్లెట్ లు విజయవంతమైందని నిర్ధారించడానికి OnePlusకి ధర కీలకం. OnePlus 11R కూడా ఒక ఆసక్తికరమైన మరియు అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది మరియు ఆశాజనక, ఇది OnePlus 11తో వస్తున్న హెచ్చరిక స్లయిడర్ ను తీసుకువస్తుంది.
దేశంలో గూగుల్ పాలసీలో మార్పులు!
భారతదేశంలో కార్యకలాపాలకు సంబంధించిన పాలసీలో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. పాలసీని పూర్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నుంచి ఇదివరకే ఆదేశాలు అందుకున్న గూగుల్, ఈ మేరకు చర్యలను ప్రారంభించింది. యాంటీ ట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించిన నిబంధనల మార్పులకు గూగుల్ ఇండియా ఎట్టకేలకు అంగీకరించింది. సీసీఐ నిర్దేశించిన సూచనలకు తగినట్లుగా అనేక మార్పులను గూగుల్ లిస్ట్ అవుట్ చేసింది. గతంలో ఈ మార్పులను గూగుల్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, సీసీఐ మాత్రం మార్పుల విషయంలో వెనక్కి తగ్గలేదు. దేశ ప్రజల, సంస్థల డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మార్పులను అంగీకరిస్తూ గూగుల్ ప్రకటన చేసింది. కొత్త పాలసీ ప్రకారం.. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు తమ ప్రిఫరెన్స్ అనుగుణంగా వారి డివైజ్ సెట్టింగ్‌లను ఛేంజ్ చేసుకోవచ్చు. ఇండియన్ యూజర్స్ ఇకపై డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌ను సెలెక్ట్ స్క్రీన్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. ఇకపై కొనుగోలు చేసే కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ సెటప్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ కనిపిస్తుందని గూగుల్ ప్రకటించింది. ఓఈఎంలు తమ డివైజెస్‌లో ప్రీ-ఇన్‌స్టాలేషన్ కోసం పర్సనలైజ్డ్ గూగుల్ యాప్‌లకు లైసెన్స్ ఇస్తాయి. నాన్ కంపాటబిలిటీ లేదా ఫోర్క్ చేసిన వేరియంట్‌లను రూపొందించేందుకు పార్ట్నర్స్‌కు చేంజెస్ ఇంట్రడ్యూస్ చేసేందుకు ఆండ్రాయిడ్ కంపాటబిలిటీ రిక్వైర్‌మెంట్స్‌ను గూగుల్ అప్‌డేట్ చేస్తుంది. యూజర్ ఛాయిస్ బిల్లింగ్ వచ్చే నెల నుండి అన్ని యాప్‌లు, గేమ్‌లకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా డెవలపర్‌లు యాప్‌లో డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేసేటప్పుడు Google Play బిల్లింగ్ సిస్టమ్‌తో పాటు ఆల్టర్నేటివ్ బిల్లింగ్ సిస్టమ్‌ను సెలెక్ట్ చేసుకునే ఛాయిస్‌ను పొందవచ్చు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. డెవలపర్ వెబ్‌సైట్ నుంచి నేరుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటుతోపాటు వివిధ సోర్స్‌ల నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు Android సపోర్ట్ చేస్తుంది. అలాగే హ్యాండ్‌సెట్ మేకర్స్‌కు వారి ఛాయిస్‌ను బట్టి యాప్‌లను ప్రీ-ఇన్‌స్టాల్ చేసుకునే స్వేచ్ఛను Google ఇస్తోంది. డెవలపర్లు, యూజర్ల సౌకర్యార్థం యాప్‌లో పేమెంట్స్ కోసం థర్డ్ పార్టీ బిల్లింగ్ సిస్టమ్‌ను అందించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని గూగుల్ యూజర్స్‌ను సూచిస్తున్నప్పటికీ, యాప్‌ల సైడ్‌లోడింగ్‌తో Google మరింత ట్రాన్సపరెంట్‌గా మారుతోందని గూగుల్ ప్రకటించింది. ఇండియాలో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ యూజర్లే ఉన్నారు. 95 శాతం కంటే ఎక్కువ డివైజ్‌లు ఇప్పుడు Android ఆధారంగానే పనిచేస్తున్నాయి. ఇంత మార్కెట్‌ను వదులుకునేందుకు గూగుల్ సిద్ధంగా లేదు. కాబట్టి, కొత్త నిబంధనలు లోబడి ఉండాలని నిర్ణయించుకుంది. దీనికి తగినట్లుగా మార్పులను అనుమతించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ కి గూగుల్ లేఆఫ్ !
గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఇటీవల తీసుకున్ననిర్ణయంలో భాగంగా క్రమంగా ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తోంది. భార్యాభర్తలకు ఒకేసారి లేఆఫ్ ఇచ్చిన సంస్థ, ఇప్పుడు ఓ హెచ్‌ఆర్‌కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో హెచ్ఆర్ సిబ్బందిలో పని చేస్తున్న ఒకరికి లేఆఫ్ మెయిల్ వచ్చింది. ఈ కంపెనీకి మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు, ఇకపై మీరు ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆ ఉద్యోగిని సంస్థ నుంచి తొలగించినట్టు ఓ వార్తా సంస్థ కథనం పేర్కొంది. గూగుల్‌లో రిక్రూట్‌మెంట్ విభాగంలో పని చేస్తున్న డాన్ లానిగాన్ ర్యాన్ ఫోన్‌లో ఒకరిని ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇంతలో ఆ కాల్ ఒక్కసారిగా కట్ అయ్యింది. దీంతో ఆ ఉద్యోగి ఖంగుతిన్నారు. అసలేం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. దీంతో తనకు అనుమానం వచ్చి, గూగుల్‌కి చెందిన ఓ వెబ్‌సైట్‌లో లాగిన అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ లాగిన్ అవ్వలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తొలుత ఏమైనా సాంకేతిక లోపం కారణంగా లాగిన్ అవ్వడానికి వీలు పడట్లేదేమోనని ర్యాన్ అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆ ఉద్యోగికి ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్ సందేశం వచ్చింది. దాంతో ర్యాన్ అర్థాంతరంగా సంస్థ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. నిజానికి తనకు రీసెంట్‌గానే మరో ఏడాదికి కాంట్రాక్టును పొడిగించారని, జీతం గురించి చర్చలు కూడా జరిగాయని, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ర్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బోట్ రొకెర్స్ 378 నెక్‌బ్యాండ్ విడుదల !
హోంగ్రోన్ టెక్ బ్రాండ్ మార్కెట్‌లో రూ.1300 లోపు కొత్త స్మార్ట్ నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. 200mAh బ్యాటరీతో రన్ అయ్యే 25-గంటల బ్యాటరీ లైఫ్, 3D స్పేషియల్ బయోనిక్ సౌండ్‌తో కూడిన అకౌస్టిక్ సౌండ్‌తో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. గతంలో, boAt భారత మార్కెట్లో boAT Rockerz 330 ప్రోని రూ. 1,499 ధరతో రిలీజ్ చేసింది. బోట్ Rockerz 378 సరసమైన ధర రూ. 1,299 వద్ద రిలీజ్ అయింది. నెక్‌బ్యాండ్ బ్లాక్, బ్రైట్ బ్లూ, లైట్ బ్లూ, రెడ్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో సేల్ అందుబాటులో ఉంది. బోట్ Rockerz 378 ముఖ్యాంశాలలో ఒకటి. భారీ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. boAt ఫుల్ ఛార్జ్‌తో 25 గంటల బ్యాటరీ లైఫ్ అందించుంది. 10 నిమిషాల ఛార్జ్‌తో 15 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుందని పేర్కొంది. BoAt Rockerz 200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో దాదాపు 30 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్‌ను అందిస్తుంది. నెక్‌బ్యాండ్‌లో 3D స్పేషియల్ బయోనిక్ సౌండ్‌తో 10mm డైనమిక్ డ్రైవర్‌లు ఉన్నాయి. క్వాలిటీ కోసం THX ద్వారా ట్యూన్ చేసింది. కొత్త అకౌస్టిక్ టెక్నాలజీ 3D స్పేషియల్ బయోనిక్ సౌండ్ 3-డైమెన్షనల్ రియలిస్టిక్ ఆడియో, పొజిషనల్ కచ్చితత్వాన్ని అందిస్తుందని boAt పేర్కొంది. ఆడియో లేటెన్సీని కేవలం 65msకి తగ్గిస్తుందని తెలిపింది. ఇయర్‌బడ్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ పొందాలంటే డీప్ బాస్‌ను కలిగిన కంపెనీ ‘సిగ్నేచర్ సౌండ్’ని కూడా అందిస్తాయి. ఈ డివైజ్ బ్లూటూత్ V5.1కి సపోర్టుతో వస్తుంది. వేగవంతమైన కనెక్టివిటీని కలిగి ఉండనుంది.
అమ్మకానికి అమెజాన్ ఆఫీస్‌లు !
అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. లేఆఫ్స్‌లో భాగంగా దాదాపు 18 వేల ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. తాజాగా అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చిత పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు వివిధ దేశాల్లో ఆఫీస్‌లను విక్రయిస్తోంది. ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో 2021లో ఓ ఆఫీస్‌ను భవిష్యత్ అవసరాల కోసం 123 అమెరికన్ మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దాన్ని విక్రయిస్తోందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఇప్పటికే ఓ కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, అమెజాన్ ఈ ఆఫీస్‌ను నష్టానికి విక్రయించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కాగా, ధర ఇంకా ఫైనల్ కాలేదని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. అమెజాన్ ప్రతినిధి స్టీవ్ కెల్లీ మాట్లాడుతూ తమ బిజినెస్ అవసరాలకు అనుగుణంగా నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తుంటామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావంతో ఖర్చులను తగ్గించుకునేందుకు మెట్రో కార్పొరేట్ సెంటర్ సైట్‌ను విక్రయించాలని కంపెనీ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో మిల్పిటాస్‌లోని మరో రెండు డెలివరీ స్టేషన్స్ నుంచి కస్టమర్‌లకు ప్రొడక్ట్స్‌ను డెలివరీని కొనసాగిస్తామని కెల్లీ స్పష్టం చేశారు. తాజాగా 2,300 మంది ఉద్యోగులకు వార్నింగ్ నోటీస్ జారీ చేసింది. అయితే ప్రభావం ముందుగా యూఎస్, కెనడా, కోస్టారికాలోని ఉద్యోగులపై పడనుంది. తాజా నోటీస్ ప్రకారం.. సియాటెల్‌లో 1,852 మంది ఉద్యోగులను, బెల్లేవ్, వాషింగ్టన్‌లో 448 మందిని ఉద్యోగులను ముందుగా తొలగించనున్నారు. అయితే ఈ లేఆఫ్స్ మార్చిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇండియాలోనూ అమెజాన్ లేఆఫ్స్‌కు తెరలేపింది. అనేక మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. భారతీయ నిపుణుల కోసం డిజైన్ చేసిన కమ్యూనిటీ యాప్ గ్రేప్‌విన్‌లో అమెజాన్ ఇండియా ఉద్యోగి ఒకరు ఓ పోస్ట్ చేశారు. తన టీమ్‌లో ఇప్పటికే 75 శాతం మందిని తొలగించారని పేర్కొన్నారు. దీంతో మిగిలిన 25 శాతం సభ్యుల్లో ఆందోళన మొదలైందని, ఎప్పుడు ఉద్యోగం పోతుందన్న టెన్షన్ భరించలేకపోతున్నామని, దీంతో వర్క్‌పై ఫోకస్ చేయలేకపోతున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు.
బయోగ్యాస్‌ను ఇంధనంగా వినియోగించనున్న మారుతీ సుజుకీ ?
పర్యావరణాన్ని కాపాడడానికి ఆవు పేడను ఇంధనంగా ఉపయోగించాలని మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యానికి చోటివ్వకుండా 2030 నాటికి ఆరు ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకురావాలని సంకల్పించిన మారుతి, అదే సమయంలో ఆవు పేడ నుంచి ఉత్పత్తయ్యే బయోగ్యాస్‌ను ఇంధనంగా వాహనాలకు వినియోగించనుంది. దీంతో భవిష్యత్తులో పెద్ద మార్పు సాధ్యమవుతుందని అంచనా వేస్తోంది. భారత దేశంలో భారీ ఎత్తున పశువుల వ్యర్ధాలు అందుబాటులో ఉంటాయని, వాటితో పెద్ద ఎత్తున బయోగ్యాస్ తయారు చేయమచ్చని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ గ్యాస్‌ను సీఎన్జీ మోడళ్లలో వినియోగిస్తామని తెలిపింది. ఈ క్రమంలో బయో ఇంధనం ఉత్పత్తి కోసం నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, బనాస్ డెయిరీ సంస్థలో మారుతీ ఒప్పందం చేసుకుంది.అటు ఈ కాన్సెప్టును మన దేశంలోనే కాకుండా జపాన్, ఆఫ్రికా దేశాల్లో కూడా అమలు చేయనుంది. జపాన్‌లో ఆవుపేడ నుంచి ఇంధనం తయారు చేసే ఫ్యుజిసాన్ అస్గిరి బయోమాస్ సంస్థలో మారుతి పెట్టుబడులు పెట్టింది. ఈ విధానంతో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్ధికంగా చాలా లాభించనుంది.
Wednesday, January 25, 2023
బుకింగ్ క్యాన్సల్ చేసుకుంటే రూ. 2 లక్షలు రిఫండ్ !
ఫోర్డ్ మోటార్ ప్రపంచంలోని టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో ఇదొకటి. ఫోర్డ్ మోటార్ మార్కెట్‌లోకి బ్రాన్‌కో ఎస్‌యూవీ కారును తీసుకువచ్చింది. దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. చాలా మంది ఈ కారును ముందుగానే బుక్ చేసుకున్నారు. భారీ బుకింగ్స్‌తో కంపెనీ అవాక్కైంది. వచ్చిన బుకింగ్స్ అన్నింటికీ కార్లను సరఫరా చేయలేమని కంపెనీ పేర్కొంటోంది. అందుకే ఎవరైతే బుకింగ్‌ను క్యాన్సల్ చేసుకుంటారో వారికి రూ. 2 లక్షలు అందిస్తోంది. 2500 డాలర్లను వెనక్కి ఇస్తోంది. మీడియా నివేదిక ప్రకారం చూస్తే.. ఫోర్డ్ బ్రాన్‌కో కారుకు భారీ డిమాండ్ ఉంది. అయితే కంపెనీ విడిభాగాల కొరతతో ఇబ్బంది పడుతోంది. గ్లోబల్‌గా సరఫరా అడ్డంకులను ఎదుర్కొంటోంది. దీని వల్ల తయారీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పటికే బ్రాన్‌కో కారుకు 2 లక్షలకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కంపెనీ బుకింగ్స్‌ను క్యాన్సల్ చేసుకునే వారికి 2500 డాలర్ల తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొందరికే వర్తిస్తుంది. బ్రాన్‌కో బుకింగ్ క్యాన్సిల్ చేసుకొని మళ్లీ ఫోర్డ్ కంపెనీకే చెందిన మరో కారును కొంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెరివిక్, మస్టంగ్, ఎఫ్ 150 ట్రెమ్మర్ వంటి పలు మోడళ్లను అందిస్తోంది. బ్రాన్‌కో మల్టీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ కారులో 2.3 లీటర్ ఎకో బూస్ట్ 4 సిలిండర్ ఇంజిన్, 2.7 లీటర్ ఎకోబూస్ట్ వీ6 ఇంజిన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇందులో 7 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్, 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. బేస్ మోడల్‌లో 16 ఇంచుల వీల్స్, టాప్ వేరియంట్‌లో 17 ఇంచుల వీల్స్ ఉంటాయి. బేస్ వేరియంట్ 2 డోర్స్ ఉన్న కారు ధర రూ. 26 లక్షలుగా ఉంది. అలగే 4 డోర్ వేరియంట్ ధర రూ. 29 లక్షలకు పైగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 60 లక్షల దాకా ఉంది.
45 రోజుల్లో అంగారకుడిపైకి చేరవచ్చు ?
భూమి నుంచి కేవలం 45 రోజుల వ్యవధిలో మార్స్ (అంగారకుడు) పై చేరుకోగలిగితే. ఆ ఊహ చాలా బాగుంది కదా. ఆ దిశగానే ప్రయోగాలు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా. అంగారకుడిపై అడుగు పెట్టేందుకు మనం సిద్ధమయ్యామా? దీనికి సమాధానం ఇప్పటి వరకూ లేదు అనే చెప్పాలి. కానీ ఇటీవలి సాంకేతికతంగా సాధిస్తున్న అభివృద్ధి.. దీనిని సుసాధ్యం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. సాధారణంగా 39,600 కి.మీ/గం వేగంతో ప్రయాణించే వ్యోమనౌక మార్స్ గ్రహాన్ని చేరుకోవడానికి దాదాపు 200 రోజులు పడుతుంది. ఇంతకన్నా వేగంగా అక్కడకు చేరుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? అంటే ఉందనే అంటోంది నాసా. నాసా ఇన్నోవేటివ్ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌లు, నాసా శాస్తవేత్తలు ఓ ప్రణాళికను రూపొందించాయి. అదేంటంటే ఒక న్యూక్లియర్ కాన్సెప్ట్. ఇది మనల్ని 45 రోజుల్లో అంగారక గ్రహానికి పంపగలగుతుందట. ఇది అసాధ్యమైన పనిగానే కనిపిస్తున్నా.. కానీ సైన్స్ మనకు దీనిని సుసాధ్యం చేసినా ఎంతమాత్రం ఆశ్చర్యం ఉండదు. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి చేరుకోడానికి యూఎస్ అంతరిక్ష సంస్థ న్యూక్లియర్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది.బిమోడల్ న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్ లో వేవ్ రోటర్ టోపింగ్ సైకిల్ 900 సెకన్ల స్పెసిఫిక్ ఇంపల్షన్(Isp) అందిస్తుంది. అంటే ఇది కెమికల్ రాకెట్ల శక్తికి రెట్టింపు. న్యూక్లియర్-థర్మల్ ప్రొపల్షన్ విధానంలో, లిక్విడ్ హైడ్రోజన్ (LH2) ఇంధనం ఐయనైజ్డ్ హైడ్రోజన్ వాయువు (ప్లాస్మా) అయ్యే వరకు వేడి చేయబడుతుంది. రాకెట్ కావాల్సిన థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిలో కొన్ని సవాళ్లు, ఇబ్బందులు కూడా ఉన్నాయని పేర్కొంది. వీటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాసా ప్రకటించింది. అందుకోసం $12,500 నిధులు వెచ్చిస్తోంది.
ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభం !
'హర్ గల్లీ ఎలక్ట్రిక్' నినాదంతో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ ప్రైమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ ఆంపియర్ అధికారిక వెబ్ సైట్ లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ బుకింగ్ సొమ్ము కూడా పూర్తిగా వాపసు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి ఈ స్కూటర్ రోడ్లపైకి రానుంది. అలాగే ఈ స్కూటర్ రూ.95,000 ధరకు అందుబాటులో ఉంటుంది. అలాగే 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఏఆర్ఏఐ ప్రామాణిక పరీక్ష వద్ద ఈ బైక్ ఓ సారి చార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల పరిధి కలిగి ఉంది. ఆంపియర్ ప్రైమస్ డిజైన్ మామూలు పెట్రో వెర్షన్ స్కూటర్లలో లా ఉంటుంది. ఎర్గోనామిక్ సీటింగ్, పొడవాటి లెగ్ రూమ్, అలాగే 22 లీటర్ల బూట్ స్పేస్ తో రైడర్ కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 15 ఆంప్స్ చార్జర్ తో అయితే 4.5 గంటల్లో, 25 ఆంప్స్ చార్జర్ తో అయితే 2.5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అలాగే కేవలం 5 సెకన్లలో 40 కిలో మీటర్ల పరిధిని అందుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 150 కిలోల బరువును మోసేలా గంటకు 77 కిలో మీటర్ల స్పీడ్ తో వెళ్తుందని పేర్కొంటున్నాయి. అలాగే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటుగా 12 అంగుళాల వీల్ టెలీస్కోపిక్ సస్పెన్షన్ తో వస్తుంది. బ్లూ టూత్ కనెక్టవిటీ, నావిగేషన్ తో పాటు మూడు రైడ్ లు మోడ్ లు ఉంటాయి. అలాగే ఇది ఎల్ సీడీ ఇన్సుస్ట్రుమెంట్ కన్సోల్ తో వస్తుంది. అలాగే ఇందులో ఉండే రివర్స్ మోడ్ వల్ల వెనక వైపు బరువు ఉన్నా రివర్స్ చేసేటప్పడు సౌకర్యంగా ఉంటుంది. ఈ స్కూటర్ బేసిక్ ఫీచర్లతో వచ్చినా యాంటీ థెఫ్ట్, లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల విషయంపై ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ స్కూటర్ ఇతర ఈవీ స్కూటర్ల పోటీనిచ్చేలా లేదని మార్కెట్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ స్కూటర్ రేట్ లోనే వేరే స్కూటర్ లు వస్తున్నాయి. దీంతో వాటి నుంచి చాలా కఠిన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం !
మైక్రోసాఫ్ట్ సేవలకు పలు దేశాల్లో అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 వంటి సర్వీసులు డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి. భారత్ సహా యూఏఈ, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి సేవల్లో అంతరాయం ఏర్పడటంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవుట్ లుక్ రీఫ్రెష్ కావడం లేదని, మెయిల్స్ రావడం లేదని పలువురు యూజర్లు సోషల్ మీడియా ద్వారా కంప్లయింట్ చేస్తున్నారు. భారత్‌లో మాత్రం మైక్రోసాఫ్ట్ టీమ్స్ విషయంలో యూజర్లు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. సేవలు నిలిచిపోవడంపై మైక్రోసాఫ్ట్ కంపెనీ స్పందించింది. సమస్య తలెత్తడానికి గల కారణాన్ని అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దీనిపై దర్యాప్తు చేస్తామని, తొందరలోనే సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. అయితే దీనివల్ల ఎంతమంది ఇబ్బందుల పడ్డారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
కోకాకోలా స్మార్ట్‌ఫోన్ ?
కోకాకోలా స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. బాటిల్స్ నుంచి నేరుగా మన పాకెట్‌లో సందడి చేసేలా స్మార్ట్‌ఫోన్ తయారీని కోకాకోలా చేపట్టింది. భారత్‌లో ఈ ఏడాది మార్చిలో కోకాకోలా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేస్తుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ తొలుత షేర్ చేశారు. అప్‌కమింగ్ డివైజ్‌ను ఆయన షేర్ చేయగా ఈ స్మార్ట్‌ఫోన్ కోకాకోలా బ్రాండ్ ఐకానిక్ రెడ్ కలర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కనిపించింది. ఈ క్వార్టర్‌లోనే భారత్‌లోకి ఈ డివైజ్ రానుంది..ఈ న్యూ ఫోన్ కోసం కోకాకోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో భాగస్వామ్యంతో ముందుకొచ్చిందని ఈ పోస్ట్‌కు శర్మ క్యాప్షన్ ఇచ్చారు. భారత్‌లో కోకాకోలా థీమ్‌తో కూడిన ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సహకరించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నేమ్‌ను ఆయన వెల్లడించలేదు. బేవరేజెస్ మార్కెట్‌లో సత్తా చాటిన కోకాకోలా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. లీకైన ఇమేజ్‌లో కోకాకోలా డివైజ్ రియల్మి డిజైన్‌ను పోలి ఉంది. రియల్మి 10 ప్రొ 4జీని ఇది తలపించేలా ఉంది. వెనుకభాగంలో ఈ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ ఫోన్ కెమెరా సెన్సర్ కలిగిఉంది. కోకాకోలా ఫోన్ ఫీచర్లను ముకుల్ శర్మ వెల్లడించకున్నా బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్ లక్ష్యంగా కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు.
Tuesday, January 24, 2023
నావికాదళంలోకి ఐఎన్‌ఎస్ వాగీర్ !
కల్వరీ శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది, ఐదవది అయిన వాగీర్‌ను జనవరి 23వ తేదీన ముంబైలోని నావల్ డాక్‌యార్డ్ లో నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ లాంఛనంగా భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. 'వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువుల బారి నుంచి దేశ ప్రయోజనాలను మరింతగా సంరక్షించవచ్చు. ఇంటెలిజెన్స్, నిఘా, మొహరింపు విభాగాల్లో నేవీ సామర్థ్యాన్ని వగర్ పరిపుష్టంచేస్తుంది' అని ఈ సందర్భంగా భారత నేవీ ప్రకటించింది. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్ చేప (వాగీర్) పేరును దీనికి పెట్టారు. 24 నెలల వ్యవధిలో నేవీ చేరిన మూడో సబ్‌మరైన్ ఇది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ సంస్థ దీనిని తయారుచేసింది. ఫ్రాన్స్ నుంచి బదిలీచేసిన సాంకేతికతను ఇందులో వినియోగించారు. 11 నెలలపాటు సముద్రంలో పలు రకాల ప్రయోగ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక సోమవారం నేవీలోకి తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యత్తుమ సెన్సార్‌లను దీనిలో అమర్చారు, వైర్ ఆధారిత టోర్పెడోలున్నాయి, దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుంచి క్షిపణులను సముద్రజలాల మీది లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు. స్పెషల్ ఆపరేషన్స్‌లో మెరైన్ కమెండోలను శత్రు స్థావరాలలోకి చడీచప్పుడుకాకుండా తరలించగలదు, శక్తివంత డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, శత్రు టోర్పెడోలను ఏమార్చే నూతన స్వీయ రక్షణ వ్యవస్థతో దీనిని బలోపేతం చేశారు
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సదవకాశం !
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, సిటీ ఆన్ లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో జతగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్ లను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ల ద్వారా ఒకే కనెక్షన్ పైన బ్రాండ్ బ్యాండ్ మరియు టీవీ ఛానల్స్ ను పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్ లను విజయవాడలో ప్రారంభించింది. ఈ సర్వీస్ ను ఉల్కా టీవీ పేరుతో అందించింది మరియు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లోని బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు పొందనున్నారు. బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్ లను కొత్త కస్టమర్లు మరియు ఇటప్పటికే కొనసాగుతున్న కస్టమర్లు కూడా పొందవచ్చు. అంతేకాదు, ఈ సర్వీసులు కేవలం టీవీలలో మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లలో కూడా బిఎస్ఎన్ఎల్ వినియోగధారులు పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్స్ పైన అందిస్తున్న ఈ కొత్త సదవకాశం వినియోగదారులకు ఒకే కనెక్షన్ పైన రెండు లాభాలను అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
50 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు !
దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఈ కొత్త నగరాల్లో గోవా, హర్యానా, పుదుచ్చెరి ఉన్నాయి. కోటాలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా సర్కిల్‌లో ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా 184 పట్టణాలు, నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ సేవలు తెలుగు రాష్ట్రాల్లో పట్టణాలు కూడా ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప, రాజమహేంద్రవరంలో ఈ జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ నగరాల్లో 5జీ సేవలు అందించేది ఏకైక టెలికాం కంపెనీ జియో. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది , పంజాబ్ రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రతి ప్రాంతాన్ని డిజిటలైజ్ చేయాలనే మా తపనకు నిరంతర మద్దతునిస్తున్నాయని తెలిపింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50 నగరాల్లో నిజమైన జియో 5G సేవలు అందుతున్నట్లు తెలిపింది. ఇది వరకు జియో ట్రూ 5జీ సేవలు తెలంగాణలోని 5 నగరాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉండగా, ఇప్పుడు నల్గొండను చేర్చారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 9 నగరాలైన తిరుమల, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడ ఉండగా, ఇప్పుడు కొత్తగా చిత్తూరు, కడప, నర్సరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలకు ఈ జియో ట్రూ 5జీ సేవలను విస్తరించింది.
మోటోరోలో జీ62 5జీపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ !
బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌తో వినియోగదారులను అట్రాక్ట్ చేసిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఎలక్ట్రానిక్ సేల్ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్స్‌పై ఆఫర్లను ఇస్తోంది. మోటోరోలో జీ62 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 21,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 14,999కే అందిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకుల డెబిట్, కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ. 750 తగ్గింపు ధరకు పొందొచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తక్కువ ధరకు ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ కండిషన్ ఆధారంగా గరిష్టంగా రూ. 5000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలలోపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో అందించిన ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ లిథియం పాలీమార్ 5జీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్+8 మెగాపిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ విడుదల
దేశీయ మార్కెట్లోకి శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ S23 సిరీస్ ఫిబ్రవరి 1న వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ముందు పవర్‌ఫుల్ Galaxy S23 Ultra ధర ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రాబోయే శాంసంగ్ Galaxy S23 సిరీస్ గెలాక్సీ S22 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. Galaxy S22 సరసమైన S22, S22 Plus,S22 Ultraతో సహా వివిధ కేటగిరీలలో మొత్తం 3 ఫోన్‌లతో వచ్చింది. ఈ కొత్త S23 సిరీస్‌లో శాంసంగ్ 3 ఫోన్‌లను లాంచ్ చేయనుంది. కెమెరా పరంగా చూస్తే.. అవసరమైన అప్‌గ్రేడ్‌లతో రానున్నాయి. ఈసారి అందరి దృష్టి S23 Ultra మోడల్‌పైనే ఉంది. S23 అల్ట్రా డిజైన్, స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే మార్కెట్లోకి లీక్ అయ్యాయి. లేటెస్టుగా గెలాక్సీ S23 Ultra మోడల్ ధర కూడా Slashleaks అనే వెబ్‌సైట్లో లీక్ అయింది. Galaxy S23 Ultra ధర 1,400 డాలర్లు (రూ. 1,13,400)తో రావచ్చని టిప్‌స్టర్ నివేదిక తెలిపింది. అదే నిజమైతే.. గెలాక్సీ S23 అల్ట్రా మోడల్ రూ. 1,09,999 ప్రారంభ ధరతో రానుంది. ముందు వెర్షన్ S22 అల్ట్రా కన్నా S23 అల్ట్రా చాలా ఖరీదైనదిగా ఉండనుంది. శాంసంగ్ S23 అల్ట్రా కలర్ ఆప్షన్‌లను టిప్‌స్టర్ వెల్లడించింది. గెలాక్సీ S23 అల్ట్రాను బొటానిక్ గ్రీన్, కాటన్ ఫ్లవర్, మిస్టీ లిలక్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో చూడవచ్చు. గెలాక్సీ S23 Ultra, S23 సిరీస్‌లోని లైన్ మోడల్‌లో అగ్రస్థానంలో ఉంది. 1440×3088 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో పాటు 12GB RAM, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఆప్టిక్స్ పరంగా Samsung Galaxy S23 ఫోన్ 200-MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 200-MP సెన్సార్‌తో పాటు, 108MP సెకండరీ కెమెరా, రెండు 12MP సెన్సార్లు ఉంటాయి. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 12-MP స్నాపర్ కూడా ఉండనుంది.
కొత్త వెర్షన్ లో బజాజ్ పల్సర్ బైక్ ?
పల్సర్ బైక్ మిడిల్ క్లాస్ యువతకు అందుబాటులో ఉండేది. బజాజ్ కంపెనీ రూపొందించిన ఈ బైక్ లో కొత్త వెర్షన్ రెడీ అవుతుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 250 కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పోర్టీ లుక్ తో వచ్చే ఈ బైక్ లో అధునాతన ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. పల్సర్ అభిమానులు చూడాలనుకునే అధునాతన ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి. కూల్ టర్కోయిస్, గ్రే బాడీ గ్రాఫిక్స్, పెయింట్ ఫినిషింగ్ టచ్ తో ఈ బైక్ వస్తుంది. ఈ బైక్ అలాయ్ వీల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ విండ్ వైజర్ వల్ల ఈ బైక్ స్పోర్టీ లుక్ ను సొంతం చేసుకుంది. దీని ట్యాంక్ డిజైన్ కూడా స్పోర్ట్స్ బైక్ లానే వస్తుంది. స్ప్లిట్ సీట్ కచ్చితంగా రైడర్స్ కు సూపర్ ఫీలింగ్ ను ఇస్తుంది. బీఎస్ 6 వెర్షన్ లో వచ్చే ఈ బైక్ 8750 ఆర్ పీఎం వద్ద 24.5 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో వర్క్ చేసే ఈ బైక్ 250 సీసీ తో వస్తుంది. అలాగే 5 స్పీడ్ గేర్లతో వచ్చే ఈ బైక్ టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మోనో షాక్ రియర్ షాక్ అబ్జార్బర్ తో వస్తుంది. ఏబీఎస్ తో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.45 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా.
Monday, January 23, 2023
జొమాటోలో పెద్ద స్కాం ?
జొమాటోలో కొత్త ఫుడ్ డెలివరీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయ్ సేథి అనే ఒక ఎంట్రప్రెన్యూర్ జొమాటోలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేశారు. బర్గర్ ఆర్డర్ ఇచ్చారు. 30 నుంచి 40 నిమిషాల్లో ఇచ్చిన ఆర్డర్ ఇంటికి వచ్చింది. జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ చేయవద్దని చెప్పినట్లు వినయ్ తన లింక్డ్ ఇన్ పోస్ట్‌లో తెలియజేశారు. ఈ పోస్ట్ ప్రకారం.. మళ్లీ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టొద్దు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ ధరకే ఫుడ్ పొందొచ్చు. రూ. 1000 విలువైన ఫుడ్ కేవలం రూ.200కే వస్తుంది. ఇక్కడ డెలివరీ బాయ్‌కు రూ.200 నుంచి రూ. 300 చెల్లించాలి. అప్పుడు వాళ్లు డెలివరీ తీసుకోలేదని జొమాటోకు తెలియజేస్తారు. కానీ ఆ ఫుడ్‌ను కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. ఇలా రూ.200కే రూ.1000 విలువైన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చని డెలివరీ బాయ్ పేర్కొన్నట్లు వినయ్ తెలిపారు. ఇలా జొమాటోలో ఫుడ్ డెలివరీ స్కామ్ జరుగుతోంది. ఈ విషయం జొమాటో సీఈవోకు కూడా తెలిసే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్ ఈ అంశంపై స్పందించారు. లూప్ హోల్స్‌ను సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే కొత్తమీ కాదు. జొమాటో గతంలో కూడా ఆన్‌లైన్ పేమెంట్ అంశంపై విమర్శలు ఎదుర్కొంది. ఆన్‌లైన్ ఆర్డర్ల బిల్లు పెంపు అంశంపై విమర్శలు వచ్చాయి. ఆఫ్‌లైన్‌లో కన్నా ఆన్‌లైన్‌లో బిల్లు పేమెంట్‌పై చాలా వ్యత్యాసం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అంటే ఆఫ్‌లైన్‌లో ఫుడ్ ధరల కన్నా ఆన్‌లైన్‌లో జొమాటో ఎక్కువ వసూలు చేస్తోందని చాలా మంది విమర్శలు చేశారు. దాదాపు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బిల్లు తేడా 34 శాతం వరకు ఉందని ఒక యూజర్ గతంలో వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ మరో వివాదం తెర పైకి వచ్చింది. దీంతో ఇప్పుడు జొమాటో ఇలాంటి స్కామ్స్ జరగకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
భారత్‌లో అమెజాన్ ఎయిర్ సర్వీసు !
దేశంలో అమెజాన్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా ఏదైనా ఆర్డర్ చేస్తే అత్యంత వేగంగా డెలివరీ కానుంది. దీని కోసం అమెజాన్ భారత మార్కెట్లో కొత్త డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే.. అమెజాన్ ఎయిర్ సర్వీసు. ఈ అమెజాన్ ఎయిర్ సర్వీసుల ద్వారా వినియోగదారులకు వేగంగా డెలివరీని అందించడానికి సాయపడుతుంది. రిటైలర్ బెంగళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్ తో భాగస్వామ్యాన్ని అమెజాన్ కుదుర్చుకుంది. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దేశంలో అమెజాన్ సొంత ఎయిర్ ఫ్రైట్ సర్వీసును ప్రారంభించింది. ఎయిర్ సర్వీసుల ద్వారా చాలా వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలు కల్పిస్తుందని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. టెక్ దిగ్గజం తన కార్గో సర్వీసును ప్రారంభించిన మొదటి మార్కెట్ భారత్ కాదు. అమెజాన్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసులను పొందుతున్న మార్కెట్లలో భారత్ మూడోవది. అమెజాన్ ఎయిర్ మొదటిసారిగా 2016లో అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత యూరప్‌కు కూడా అందుబాటులోకి వచ్చింది. భారతీయ మార్కెట్‌లో రెండు కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి 20వేల ప్యాకేజీలను అందించగలదని టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. అమెజాన్ ఎయిర్ సర్వీసు భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. Amazon Airలో పెట్టుబడుల ద్వారా భారత్‌లో కస్టమర్‌లకు డెలివరీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఈ సర్వీసు ద్వారా భారత్‌లోని 1.1 మిలియన్లకు పైగా అమ్మకందారులకు సపోర్టు అందిస్తుంది. రవాణాతో పాటు విమానయానం వంటి అనుబంధ వ్యాపారాల వృద్ధికి మరింత వీలు కల్పిస్తుందని అమెజాన్‌లో కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు. అమెజాన్ డెలివరీ సర్వీసు కోసం బోయింగ్ 737-800 విమానాన్ని వినియోగించుకుంటుంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం.. క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్ ద్వారా ఈ సర్వీసులను అందించనుంది. అమెజాన్-బ్రాండెడ్ విమానం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు కస్టమర్ షిప్‌మెంట్‌లను రవాణా చేస్తుంది. భారత్‌లో అత్యంత వేగంగా డెలివరీలను అందించడమే కాకుండా ఖర్చులను కూడా ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ గ్లోబల్ ఎయిర్ వైస్ ప్రెసిడెంట్, సారా రోడ్స్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కస్టమర్ బేస్ ఆధారంగా తక్కువ ధరలు, వేగవంతమైన డెలివరీలతో అందించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. భారత్‌లో Amazon Air సర్వీసులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎయిర్ కార్గో సర్వీసులో ప్రస్తుతం ప్రపంచంలోని 70 గమ్యస్థానాలలో 110కి పైగా విమానాలు ఉన్నాయని, ఇందుకోసం అమెజాన్ వందల మిలియన్ డాలర్లను ఎయిర్ లాజిస్టిక్స్ కోసం వెచ్చించిందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, అమెజాన్ ఇటీవల 18వేల మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. దాంతో చాలా మందిని నిరాశపరిచింది. గత 6 నెలలుగా టెక్ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపులు పెరుగుతున్నాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కూడా 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే, మైక్రోసాఫ్ట్ (Microsoft) తన హెడ్‌కౌంట్లను 10,000 తగ్గించింది. మెటా వంటి ఇతర కంపెనీలు 11వేల మందిని తొలగించేందుకు తమ ప్లాన్లను ప్రకటించాయి. అనేక టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. బాధిత ఉద్యోగులను తొలగించిందుకు వారికి వేతనాన్ని కూడా అందజేస్తామని హామీ ఇచ్చాయి.
ఐఫోన్లలో వాట్సాప్ గ్రూపు అడ్మిన్ల కోసం కొత్త షార్ట్‌కట్స్ !
ఆపిల్ స్టోర్ లో వాట్సాప్ లేటెస్ట్ 23.1.75 అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. WaBetaInfo నివేదిక ప్రకారం.. ఈ అప్‌డేట్ గ్రూప్ అడ్మిన్‌ల కోసం కొత్త షార్ట్‌కట్‌లను తీసుకువస్తుంది. ఈ షార్ట్‌కట్‌లు వాట్సాప్ గ్రూప్‌లోని గ్రూప్ అడ్మిన్‌లు నిర్దిష్ట కాంటాక్ట్ కోసం సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఇప్పుడు గ్రూప్‌లో పాల్గొనేవారు జాయిన్ అయినప్పుడు లేదా ఎగ్జిట్ అయినప్పుడు యూజర్ కాంటాక్టు నంబర్‌ను హైలైట్ చేస్తుంది. కొత్త అప్‌డేట్‌తో, గ్రూప్ అడ్మిన్‌లు వాట్సాప్‌లో త్వరగా కాల్‌లు చేసేందుకు కాంటాక్ట్ నంబర్‌ను Tap చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ పార్టిసిపెంట్‌లతో ప్రైవేట్‌గా కూడా చాట్ చేయవచ్చు. WhatsApp లేటెస్ట్ iOS వెర్షన్‌తో యాడ్ చేసిన ఇతర ఫోన్ నంబర్‌ను కాపీ చేయగల సామర్థ్యంతో అడ్రస్ బుక్‌లో గ్రూప్ పార్టిసిపెంట్‌లను యాడ్ చేయాలి. వాట్పాప్ షార్ట్‌కట్‌లు ‘గ్రూపులలో యూజర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. చాలా మంది వాట్పాప్ యూజర్లు పాల్గొనేవారిలో నిర్దిష్ట కాంటాక్టును గుర్తించాల్సి ఉంటుంది. లేటెస్ట్ WhatsApp iOS అప్‌డేట్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ షార్ట్‌కట్‌లను ఉపయోగించాలంటే iPhone యూజర్లు తమ డివైజ్‌లలో వాట్పాప్ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. WhatsApp త్వరలో ఒరిజినల్ క్వాలిటీతో ఇతర కాంటాక్టుల ఫోటోలను షేర్ చేసేందుకు యూజర్లను అనుమతించవచ్చు. ప్రస్తుతం, WhatsApp ద్వారా షేర్ చేసిన ఫొటోలను కంప్రెస్ అవుతాయి. ఫలితంగా గ్రైనీ ఫోటోలు ఉంటాయి. కానీ, WaBetaInfo ప్రకారం.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను పంపగల సామర్థ్యంపై కంపెనీ కృషి చేస్తోంది. ఆండ్రాయిడ్ 2.23.2.11 అప్‌డేట్ WhatsApp బీటాలో ఫీచర్ ఉందని WaBetaInfo ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్లాట్‌ఫారమ్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, మెసేజింగ్ యాప్ డ్రాయింగ్ టూల్ హెడర్‌లో కొత్త సెట్టింగ్ ఐకాన్ యాడ్ చేయాలని యోచిస్తోంది. కొత్త ఐకాన్ యూజర్లను వారి ఒరిజినల్ క్వాలిటీతో సహా ఫొటో క్వాలిటీని కాన్ఫిగర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఫొటోల క్వాలిటీపై వారికి మరింత కంట్రోల్ అందిస్తుంది.
స్మార్ట్‌వాచ్‌లు హార్ట్ బీట్‌ని ఎలా లెక్కిస్తాయి.?
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలియజేసే ఒక సాధనం మాత్రమే. కానీ నేడు స్మార్ట్ వాచ్‌ల రాకతో వాచ్‌కి అర్థమే మారిపోయింది. బాడీ టెంపరేచర్ నుంచి ఆక్సిజన్ లెవల్స్ వరకు, గుండె కొట్టుకునే తీరు నుంచి ఎంత దూరం నడిచారు అన్న విషయాలను చెప్పేస్తున్నాయి. వాతావరణం అలర్ట్స్‌తో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లకు స్మార్ట్ వాచ్‌లు పెట్టింది పేరు. ఇలాంటి ఫీచర్స్‌లో హార్ట్ బీట్ ఒకటి. చేతికి ధరించిన స్మార్ట్ వాచ్ మన హార్ట్ బీట్‌ను ఎలా లెక్కిస్తుందనే సందేహం రావడం సర్వసాధారణమైన విషయమే.? అయితే స్మార్ట్ వాచ్ హార్ట్ బీట్‌ను ఎలా లెక్కగడుతుంది.? హార్ట్ బీట్‌ను లెక్కగట్టడానికి స్మార్ట్ వాచ్‌లో ఫొటోఫ్లెతిస్మోగ్రఫీ అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలాగే స్మార్ట్ ఫోన్‌కు వెనకాల గ్రీన్ లైట్ వెలుగుతుండడాన్ని గమనించే ఉంటారు. ఈ గ్రీన్ లైటే మన హార్ట్‌బీట్‌ను లెక్కిస్తుంది. స్మార్ట్‌వాచ్ నుంచి వచ్చే గ్రీన్ లైట్ చేతి గుండాలోపలికి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఎరుపు రక్తంలో ఉండే బ్లడ్ గ్రీన్ కలర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే రక్తం లేని చోట గ్రీన్ లైన్ రిఫ్లక్ట్ అవుతుంది. రిఫ్లక్ట్ అయిన ఆ గ్రీన్ లైట్ వాచ్‌లో ఉండే ఆప్టికల్ సెన్సార్‌ను క్యాప్చర్ చేస్తుంది. గుండె కొట్టుకునే సమయంలో రక్తం శరీరం గుండా ప్రవహిస్తుందనే విషయం తెలిసిందే. చేతిలో ప్రవహించే ఈ రక్త ప్రసారణ ఆధారంగానే స్మార్ట్‌వాచ్‌లోని గ్రీన్ లైట్ గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. హార్ట్‌బీట్‌ని బట్టి చేతిలో ప్రవహించే రక్తంలో హెచ్చుతగ్గుల ఆధారంగానే హార్ట్ బీట్‌ను స్మార్ట్ వాచ్ లెక్కిస్తుంది. ఇదంటీ స్మార్ట్ వాచ్ వెనకాల ఉన్న అసలు టెక్నాలజీ.
రీల్స్, షాట్స్ పై కంట్రోలింగ్ ఏది ?
స్మార్ట్ ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే చాలా మంది పిల్లలు బొమ్మల కంటే స్మార్ట్ ఫోన్ల కోసమే ఎక్కువ ఏడుస్తున్నారు. మరో వైపు కొత్తగా వచ్చిన షాట్స్, రీల్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటిని చూస్తూ లోకాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇన్ స్టా రీల్స్, షార్ట్స్ ద్వారా ఎంతో మంది టాలెంట్ బయటపడింది. చాలా మంది సెలబ్రిటీలుగా కూడా మారారు. అయితే వీటి వల్ల జరిగిన ప్రయోజనం కంటే జరుగుతున్న నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు పెట్టుకుని ఏ పని చేయకుండా, చదువుకోకుండా చాలా మంది పిల్లలు సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న చందానా చాలా మంది పిల్లలు ప్రవర్తిస్తున్నారు. రీల్స్, షార్ట్స్ చేస్తామంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చదువుకునే వయసులో పుస్తకాన్ని పక్కన పెట్టేసి స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటున్నారు. పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు? అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు పట్టిచుకోవాల్సి ఉంటుంది. ఫోన్లలో బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేయడం, యూట్యూబ్, పలు సోషల్ మీడియా ఖాతాల్లో పేరెంటింగ్ కంట్రోల్ ఆన్ చేయడం. ఇబ్బంది కలిగించే దృశ్యాలు, పిల్లలు చూడకూడని వీడియోలు డిస్ ప్లే కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఫోన్ ఇస్తున్నాం వాళ్లు కాసేపు టైమ్ పాస్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ, ఆ సమయంలో వాళ్లు ఏం చూస్తున్నారు అనే విషయాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఫోన్ వాడుతూ వాళ్లు చదువులను అటకెక్కిస్తున్నారు. పట్టించుకోవాల్సిన తల్లిదండ్రులు కూడా.. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఫోన్ చూసుకుంటున్నారులే అని లైట్ తీసుకుంటున్నారు. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించడానికి, ఏడుపు మానిపించడానికి స్మార్ట్ ఫోన్ చేతికిస్తే.. ఇప్పుడు వాళ్లు స్మార్ట్ ఫోన్ లేకపోతే జీవించలేము అన్నట్లు తయారవుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పైపెచ్చు సోషల్ మీడియాలో ఇప్పుడు అభ్యంతరకర వీడియోలే ఎక్కువగా వస్తున్నాయి. రీల్స్, షాట్స్ లో అవే ఎక్కువ దర్శనమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరైన కంట్రోల్, పర్యవేక్షణ లేకుండా తల్లిదండ్రులు బాధ్యతారాహిత్యం ప్రదర్శిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ చెడిపోతుంది. ఆ వీడియోలు, రీల్స్ వారి జీవితంపై చాలా ప్రభావం చూపించవచ్చు. పసి వయసులోనే వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని పిల్లలను ఫోన్ కు దూరంగా పెట్టడం, ఫోన్ వాడుతుంటే ఏం చేస్తున్నారు అనే అంశాలను పరిశీలిచడం చేయాలి. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే వాళ్లు పేరెంటింగ్ కంట్రోల్ గురించి కూడా తెలుసుకోవాలి.
Sunday, January 22, 2023
రియల్‌మి నుంచి కొత్త ఏసీలు !
రియల్‌మి టెక్‌లైఫ్ తాజాగా కొత్త ఏసీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎండా కాలం ముందే కంపెనీ కొత్త ఏసీని తీసుకురావడం గమనార్హం. ఇది 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు అయ్యాయి. రియల్‌మి టెక్‌లైఫ్ బ్రాండ్ వివిధ రకాల హోమ్ అప్లయెన్సెస్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్‌గా 4 ఇన్ 1 ఏసీని తీసుకువచ్చింది. ఈ ఏసీ రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. 1 టన్ను, 1.5 టన్ను ఆప్షన్లలో ఇది లభిస్తోంది. ఏసీలలో రాపిడ్ కూలింగ్ ఫీచర్ ఉంది. అంటే ఎయిర్‌ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కేవలం 20 నిమిషాల్లో రూమ్ కూల్ అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. రూమ్‌లో ఎంత మంది ఉన్నారనే అంశం ప్రాతిపదికన కూడా ఏసీ స్పీడ్ మారుతుంది. అలాగే ఈ ఏసీలో ఫ్లెక్సీ కంట్రోల్ టెక్నాలజీ ఉంది. ఇంకా ఈ కొత్త ఏసీ ఎనర్జీ ఎఫిసియేంట్ కూడా. అంటే తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది. అలాగే ఈ ఏసీలో ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా ఉంది. కంప్రెసర్ దీర్ఘకాలం మన్నికకు వచ్చేలా ఈ టెక్నాలజీ పని చేస్తుంది. రియల్‌మి ఇండియా సీఈవో, వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ ప్రకారం చూస్తే 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఫ్లెక్సి కంట్రోల్ ఎయిర్ కండీషనర్లు కస్టమర్లకు అనువుగా ఉంటాయని, సులభంగానే వీటిని ఆపరేట్ చేయొచ్చని, ఇంకా అధిక మన్నిక వీటి సొంతం అని తెలిపారు. ఈ ఏసీ ధర రూ. 28,499 నుంచి ప్రారంభం అవుతోంది. 1 టన్ను ఏసీకి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 1.5 టన్ను ఏసీ విషయానికి వస్తే.. దీని రేటు రూ. 33,999గా ఉంది. ఈ రెండు ఏసీలు దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు కొత్త ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ కొత్త ఏసీలను ఒకసారి పరిశీలించొచ్చు. ఎందుకంటే ఎండా కాలం వస్తే.. ఏసీలు, కూలర్ల, ఫ్రిజ్‌ల ధరలు కొండెక్కి కూర్చుంటాయి. అందువల్ల మీరు వీటిల్లో ఏదైనా కొనాలని భావిస్తే.. ఇప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాగే రిపబ్లిక్ డే ఆఫర్లు ఏమైనా ఉండొచ్చు. వీటిల్లో తక్కువ ధరకే ప్రొడక్టులు లభించే ఛాన్స్ ఉంది.
ఐటెల్ ఏ24 ప్రో విడుదల
ఐటెల్ కంపెనీ ఏ24 ప్రో పేరుతో కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. కాంపాక్ట్ డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది . ఇందులో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. స్టోరేజ్ 32 జీబీ ఉంటుంది. ఈ ఫోన్ రేటు రూ. 4,600. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.4 గిగాహెర్ట్జ్ యూనిసెక్ ఎస్‌సీ9832ఈ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 2 ఎంపీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 0.3 ఎంపీ కెమెరా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. అలాగే 3020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయ్యింద. త్వరలోనే మన దేశంలోకి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మన దేశంలో ఇప్పటికే రూ. 5 వేల రేంజ్‌లో పలు రకాల స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మార్‌క్యూ దగ్గరి నుంచి జియో వరకు పలు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్‌ఫోన్స్ అందిస్తున్నాయి. రూ. 5 వేల కన్నా తక్కువే ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా యాప్స్ కూడా వాడొచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ తొలి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 5,999. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్‌లో రూ. 4499కే కొనొచ్చు. ఈ ఫోన్‌లో 5.45 అంగుళాల స్క్రీన్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఒక్కో కాంటాక్ట్ కి ఒక్కో రింగ్ టోన్ !
వాట్సాప్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేం. ఎందుకంటే పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకూ, చిన్న చిన్ని బడ్డీ కొట్లు ల నుంచి బడా వ్యాపార సంస్థల వరకూ, ఉద్యోగులు, వ్యక్తులు, కుటుంబాలు, స్నేహితులు ఇలా ఒకటేమిటి, ఒకరేమిటి అందరి కమ్యూనికేషన్ కు ఈ వాట్సాప్ పైనే ఆధారపడుతున్నారు. వ్యక్తికీ వ్యక్తికి మధ్య పర్సనల్ చాట్ తో పాటు ఇందులోని గ్రూప్స్ సమాచార మార్పిడి బాగా ఉపకరిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని వినియోగదారులు నానాటికీ పెరుగుతున్నారు. మెటా యాజమాన్యంలో నడిచే ఈ వాట్సాప్ కు మన దేశంలో కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. చాలా మంది దీనిని వాడుతారు కానీ దానిలోని చాలా ఫీచర్ల గురించి తెలీదు. కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించరు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన ఫీచర్ ను మీకోసం అందిస్తున్నాం.. అదేంటంటే వాట్సాప్ రింగ్ టోన్ ఫీచర్. ప్రతి కాంటాక్ట్ కి, అలాగే ప్రతి గ్రూప్ ప్రత్యేకంగా రింగ్ టోన్ పెట్టుకొనే వెసులుబాటు వాట్సాప్ లో ఉంది. ప్రత్యేక రింగ్ టోన్ కావాలనుకుంటున్న కాంటాక్ట్ ను సెలెక్ట్ చేయండి. వారి పేరుపై క్లిక్ చేసి లోపలికి వెళ్లండి. ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి రింగ్ టోన్ ని ఎంపిక చేసుకోండి. ఐఫోన్ యూజర్లయితే ఇలా చేయండి. ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న వ్యక్తిని మీ కాన్వర్జేషన్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని, వారి పేరుపై క్లిక్ చేయండి. కింద మెనూ నుంచి వాల్‌పేపర్ & సౌండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. దాని కింద కస్టమ్ టోన్ బటన్ క్లిక్ చేసి, అలర్ట్ టోన్ లోకి వెళ్లి మీకు ఇష్టమైన రింగ్ టోన్ ను సెట్ చేసుకోండి. మీ చాట్స్ లో నుంచి ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న గ్రూప్ ను ఎంపిక చేసుకొని, దాని పేరుపై క్లిక్ చేయండి. ఆ గ్రూప్ ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. తర్వాత యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి రింగ్ టోన్ ని పెట్టుకోండి.
ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఈజీ డౌన్‌లోడ్ !
ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు, మనకు నచ్చిన అనేక వీడియోలు మనకు కనిపిస్తాయి. మనం ఈ వీడియోలలో దేనినైనా డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, దాని కోసం మనం థర్డ్ పార్టీ యాప్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. చాలా సార్లు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ నుండి కొన్ని వీడియోలను మన స్నేహితులు లేదా పరిచయస్తులతో పంచుకోవాలని లేదా వాటిని సేవ్ చేయాలనుకుంటున్నాము కానీ వాటిని డౌన్‌లోడ్ చేయలేము. షేర్ చేస్తున్నప్పుడు దాని లింక్ మాత్రమే షేర్ చేయబడుతుంటుంది. మీరు ఏ ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Facebook లేదా Instagram నుండి వీడియోను డౌన్‌లోడ్ చేయడానికి, ముందుగా దాని లింక్‌ను కాపీ చేయండి. ఆపై షేరింగ్ ఆప్షన్ లేదా మూడు చుక్కలపై నొక్కండి. దీని తర్వాత, మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ యూజర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మరియు ఐఓఎస్ యూజర్ సఫారి బ్రౌజర్‌ను తెరవండి. ఆ తర్వాత savefrom.net వెబ్‌సైట్‌కి వెళ్లండి. విండోలో వీడియో లింక్‌ను పేస్ట్ చేయండి. దీని తర్వాత మీరు వీడియోను డౌన్‌లోడ్ చేసుకునే ఎంపికను పొందుతారు, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయవచ్చు.
కిలోమీటర్‌కు 7 పైసలు ఖర్చు !
మోటోవోల్ట్ కంపెనీ నుంచి వచ్చిన అర్బన్ ఇబైక్ చూడటానికి స్టైలిష్‌గా ఉంది. స్వల్ప ప్రయాణానికి ఈ ఇబైక్ కొనుగోలు చేయొచ్చు. ధర కూడా అందుబాటులోనే ఉంది. అర్బన్ ఇబైక్ వివిధ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. పసుపు, బ్లూ, రెడ్, గ్రే వంటి కలర్లలో లభిస్తోంది. ఈ ఇబైక్ ధర రూ. 49,999 నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా రూ. 54,999 వరకు ఉంది. వేరియంట్ ప్రాతిపదికన ధర కూడా మారుతుంది. దీని బరువు 40 కేజీలు. రేటెడ్ కెపాసిటీ 120 కేజీలు. ఈ అర్బన్ ఇబైక్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమటర్లు. 0 నుంచి 25 కిలోమీరట్ల వేగాన్ని 10 సెకన్లలోపే అందుకుంటుంది. ఇందులో 20 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ. చార్జింగ్ టైమ్ 4 గంటలు పడుతుంది. కంపెనీ ఇందులో బీఎల్‌డీసీ మోటార్‌ను అమర్చింది. బ్యాటరీ వోల్టేజ్ కెపాసిటీ 36 వీ. సీట్ టైప్ విషయానికి వస్తే.. ఇది ఫ్లిప్ టైప్‌లో ఉంటుంది. లాక్ చేసుకోవచ్చు. టార్క్ 35 నుంచి 40 ఎన్ఎం. స్ప్రింగ్ ఆపరేటెడ్ సస్పెన్షన్ ముందు భాగంలో ఉంటుంది. వెనుక భాగంలో హైడ్రాలిక్ కోయిల్ స్ల్పింగ్ సస్పెన్షన్ ఉంటుంది. ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేకులు ఉన్నాయి. వీల్స్ 20 ఇంచులు. ఒక్కసారి ఈ అర్బన్ ఇబైక్‌ను చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అందుబాటులో ధరలో ఇబైక్ కొనాలని భావించే వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. కిలోమీటరుకు 7 పైసలు ఖర్చు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. మూడేళ్ల వరకు బ్యాటరీపై వారంటీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 1,50,000 కిలోమీటర్లు. జెస్ట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అందువల్ల మీరు సులభంగానే ఈ అర్బన్ ఇబైక్‌ను సొంతం చేసుకోవచ్చు.
జనవరి 31న ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్ విడుదల !
ఈనెల 31న ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల డిస్‌ప్లే, ఇంటెల్ యొక్క 12వ జెన్ కోర్ హెచ్ ప్రాసెసర్‌లు, 32GB వరకు ర్యామ్, Wi-Fi 6E మరియు 76Whr బ్యాటరీతో పాటు ఇతర ఫీచర్‌లను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్ ప్రీమియం మెటల్ నిర్మాణం మరియు "ఇంటర్స్టెల్లార్ ఈస్తటిక్స్‌తో కూడిన మెటోరైట్ ఫేజ్ డిజైన్" డిజైన్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ కేవలం 16.9mm మందంతో స్లిమ్‌గా ఉంది. ఇది పూర్తి HD రిజల్యూషన్, 100 sRGB కవరేజ్ మరియు 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ నోట్‌బుక్ ఇంటెల్ యొక్క 12వ జనరేషన్ కోర్ హెచ్ సిరీస్ ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. టాప్ మోడల్‌కు ఇంటెల్ కోర్ ఐ9 ప్రాసెసర్ లభిస్తుంది. ఇతర మోడల్‌లు కోర్ i7 మరియు కోర్ i5 ఎంపికలతో అందుబాటులో ఉంటాయి. ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా గరిష్టంగా 32GB LPDDR5 RAM మరియు 1TB వరకు PCie 4.0 SSD నిల్వతో అమర్చబడుతుంది. మీరు అదనపు SSD డ్రైవ్ స్లాట్ ద్వారా స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 16GB RAM+512GB SSD కాన్ఫిగరేషన్‌లో కూడా అందించబడుతుంది. స్పోర్ట్స్ కార్లలో డ్రైవింగ్ మోడ్‌ల మాదిరిగానే, Infinix ల్యాప్‌టాప్ వైపు హార్డ్‌వేర్ కీని అందించింది, ఇది ఎకో, బ్యాలెన్స్ మరియు ఓవర్‌బూస్ట్ మోడ్‌ల మధ్య మార్చడానికి ఉపయోగించవచ్చు. ల్యాప్‌టాప్‌లో AI బ్యూటీ క్యామ్, ఫేస్ ట్రాకింగ్, AI నాయిస్ తగ్గింపు, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, Wi-Fi 6E, ICE స్టార్మ్ 2.0 డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ మరియు క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. I/O పోర్ట్‌లలో రెండు USB టైప్-A 3.0 పోర్ట్‌లు, రెండు USB టైప్-C పోర్ట్‌లు, ఒక HDMI 1.4 పోర్ట్, మైక్రో SD కార్డ్ స్లాట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. నోట్‌బుక్ 70Whr బ్యాటరీ ప్యాక్‌తో పాటు 96W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించబడుతుంది.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...