Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, August 31, 2021

4G ఇంటర్నెట్ స్పీడ్ పెంచాలా?



ఆన్ లైన్ లో క్లాసులు, ఆన్ లైన్ వర్క్ చేసేవారితో పాటుగా ఆన్ లైన్ లో వినోదాన్ని కోరుకునే వారికి కూడా తమ స్మార్ట్ ఫోన్ లలో వేగవంతమైన ఇంటర్నెట్ అవసరమవుతుంది. అయితే, కొన్ని సార్లు మీ స్మార్ట్ ఫోన్ అనుకున్న స్థాయిలో ఇంటర్నెట్ వేగాన్ని అందించ లేకపోవచ్చు. మీరు కనుక అటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే, ఈ టిప్స్ పాటిస్తే స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.

* ఫోన్ ను Re-Start చెయ్యండి. ఇది మొదటి మరియు సులభమైన మార్గం. మీ ఫోన్ ను పునఃప్రారంభించిన  తరువాత, మొబైల్ నెట్వర్క్ సెర్చ్ చేస్తుంది. కాబట్టి, మొబైల్ ఇంటర్నెట్ వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఈ మార్గంతో పాటు మీరు మొబైల్ డేటాను ఒకసారి ఆపివేసి పునఃప్రారంభించవచ్చు.

ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ను ఆన్ చేయండి : మొబైల్ ను పునఃప్రారంభించడంతో పాటు, మీరు మీ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. ఆ విధానంలో కూడా మీ ఫోన్ మళ్ళీ మొబైల్ నెట్వర్క్ ను సెర్చ్ చేస్తుంది కాబట్టి, ఇది ఫోన్ యొక్క ఇంటర్నెట్ వేగాన్ని చాలాసార్లు పెంచుతుంది.

* డేటా వినియోగాన్ని తనిఖీ చేయండి : చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. ప్లాన్ యొక్క డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత, ఇంటర్నెట్ వేగం ఆటొమ్యాటిగ్గా తగ్గుతుంది. ఈ సందర్భంలో, మీరు మీ డేటా వినియోగాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది.

* ఆటో డౌన్లోడ్ Update నిలిపివేయండి : సాధారణంగా యాప్స్ ను అప్డేట్ చేయ్యుడానికి ఫోన్లో ఆటో డౌన్లోడ్ ఎంపిక ఆన్ చేయబడుతుంది. మీరు ఈ ఎంపికను ఆపివేయ గలిగితే బాగుంటుంది. ఈ విధానంలో మీకు పరిమిత ఇంటర్నెట్ వినియోగం ఉంటుంది మరియు దీని తరువాత మీకు మంచి వేగం లభిస్తుంది.

* ఫోన్ యొక్క నెట్వర్క్ సెట్టింగ్లను Reset చేయండి : మీ ఫోన్ యొక్క సెట్టింగులను మార్చినప్పటికీ చాలా సార్లు ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. అలాంటప్పుడు, మీ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్లను ఒకసారి రీసెట్ చేయడం మంచిది.

టాటా టిగోర్


భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టాటా టిగోర్ ఈవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త టాటా టిగోర్ ఈవీ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 11.99 లక్షలుగా కంపెనీ చెబుతోంది. కొత్త బ్యాటరీ ప్యాక్‌తో జిప్‌ట్రాన్ టెక్నాలజీతో ఈ కారు మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్యాకప్ ఉంటుంది. బీఎస్‌6 టిగోర్ సబ్ కాంపాక్ట్ సెడన్‌కు అనుగుణంగా న్యూ టిగోర్ ఈవీలో కంపెనీ పలు మార్పులు చేపట్టింది. మెరుగైన సామర్ధ్యం, లాంగర్ రేంజ్‌ను ఆఫర్ చేస్తూ కంపెనీ జిప్‌ట్రన్ టెక్నాలజీని వాడుతూ న్యూ టిగోర్ ఈవీ కస్టమర్లను ఆకట్టుకోనుంది. న్యూ పవర్‌ట్రైన్ ఫీచర్‌ను న్యూ టిగోర్‌లో జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ 21,000 టోకెన్ అమౌంట్‌తో కస్టమర్లు న్యూ టిగోర్ ఈవీని బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా కొత్త టాటా టిగోర్ ఈవీలో అధునాతన ఫీచర్స్, పరికరాలు అందుబాటులో ఉంటాయి. త్వరలో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ప్రారంభం కానుండగా, టీల్ బ్లూ, డేటోనా గ్రే అనే రెండు కలర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన టాటా టిగోర్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM మరియు XZ+ వేరియంట్లు. వీటి ధరల విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ. XE ధర రూ. 11.99 లక్షలు, XM ధర రూ. 12.49 లక్షలు కాగా XZ+ వేరియంట్ ధర రూ. 12.99 లక్షల వరకు ఉంటుంది టాటా టిగోర్ డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలో కొత్త ట్రై-యారో నమూనా, బ్లూ కలర్ స్లేట్ మరియు ఈవి బ్యాడ్జ్‌లు చాలా చోట్ల ఇవ్వబడ్డాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ మోడల్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు బ్లూ యాక్సెంట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. టాటా టిగోర్ ఈవీ మునుపటి మోడల్.. ఒక చార్జితో 90 నుండి 100 కిమీ పరిధిని అందిస్తూ ఉండేది. ఇప్పుడు ఇందులో ప్రవేశపెట్టిన, జిప్‌ట్రాన్ టెక్నాలజీ కారణంగా 306 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సమయంలో ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో, కేవలం ఒక గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కొత్త టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌కు కంపెనీ 8 సంవత్సరాల లేదా 1,60,000 కిమీ వారంటీని అందిస్తుంది. టాటా టిగోర్ ఈవి పూర్తిగా వాటర్‌ప్రూఫ్. వర్షాకాలంలో ఈ ఎలక్ట్రిక్ కారును నడపడం పెద్ద సమస్యగా అనిపించదు. ఇది 74 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకి కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాలంటే, మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

చైనా లో వారానికి మూడు గంటలే ఆన్‌లైన్ గేమింగ్‌ !


ఈ జనరేషన్ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు ఎలా ఆడిక్ట్ అవుతున్నారో అందరికీ తెలుసు. దీనికి తోడు కరోనా ఒకటి. కరోనా వల్ల.. స్కూళ్లను మూసివేయడంతో.. పిల్లలు ఆన్‌లైన్ క్లాసుల బాట పట్టారు. దీంతో ఖచ్చితంగా తల్లిదండ్రులే పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకొని క్లాసులు వినకుండా.. గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు. క్లాసులు అయిపోయాక కూడా స్మార్ట్‌ఫోన్‌ను వదలడం లేదు. ఇది ఎక్కడో ఒక్క చోట జరుగుతుంది అనుకుంటే పొరపాటే. ప్రపంచమంతా అలాగే ఉంది. అందుకే  చైనాలో పిల్లల ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్‌కు అడిక్ట్  కాకుండా ఉండేందుకు భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు చైనా ప్రభుత్వం నడుం బిగించింది.18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లందరూ ఆన్‌లైన్ గేమ్‌కు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ల ఐడీ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐడీ కార్డు ఆధారంగా వాళ్ల వయసును ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు నిర్ధారించి.. కేవలం వారానికి మూడు గంటలు మాత్రమే వాళ్లకు ఆన్‌లైన్ గేమ్ ఆడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అది కూడా ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం.. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు మూడు రోజులు రోజుకో గంట చొప్పున మూడు గంటలు మాత్రమే ఆన్‌లైన్ గేమింగ్‌కి అవకాశం కల్పించనున్నారు. ఒకవేళ మిగతా రోజుల్లో స్కూళ్లకు సెలవులు ఉంటే మాత్రం.. రోజుకు మరో గంట ఎక్కువసేపు ఆడుకునేలా అవకాశం ఇస్తారు. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు కూడా ప్రభుత్వం.. పిల్లల గేమింగ్ పర్మిషన్ టైమ్‌కు సంబంధించిన రూల్స్‌ను పంపించి.. ఆ టైమ్ ప్రకారమే.. పిల్లలకు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లకు చైనా పెట్టింది పేరు. కుప్పలు కుప్పలుగా ఆన్‌లైన్ గేమ్స్ చైనా నుంచే డెవలప్ అవుతుంటాయి. అందుకే.. అక్కడి పిల్లలు, యువత.. ఆన్‌లైన్ గేమింగ్‌కు బాగా అడిక్ట్ అయిపోతున్నారు. 2019 లో కూడా లేట్ నైట్ ఆన్‌లైన్ గేమింగ్‌ను చైనా ప్రభుత్వం బ్యాన్ చేసింది. అర్ధరాత్రి దాటాక.. కేవలం 90 నిమిషాల పాటు మాత్రమే ఆన్‌లైన్ గేమింగ్‌కు అవకాశం ఇచ్చింది. వీకెండ్‌లో మాత్రం 3 గంటలు ఆడుకునే చాన్స్ ఇచ్చింది. తాజాగా ఈ సరికొత్త రూల్స్‌ను చైనా తీసుకొచ్చింది.

రియల్‌మీ, షియోమీ ఫోన్ల ధరల పెంపు


రెడ్‌మీ నోట్ 10 ధరను షియోమీ కంపెనీ అమాంతం పెంచేసింది. షియోమీ పెంచిన మరుసటిరోజే.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ కూడా ధరలలో మార్పు తీసుకొచ్చి… రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ సీ11, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25ఎస్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ 5 స్మార్ట్‌ఫోన్ల ధరలను భారత్‌లో అదనంగా రూ.1500 వరకు పెంచుతున్నట్టు రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ సీ11(2021) ఫోన్ ధర రూ.300, రియల్‌మీ సీ21, రియల్‌మీ సీ25ఎస్ ధర రూ.5వేల వరకూ పెంచింది. రియల్‌మీ 8, రియల్‌మీ 8 5జీ ధర రూ.1500 వరకూ పెంచింది. పెరిగిన ధరలు.. ఈ- కామర్స్ సైట్లతో పాటు రియల్‌మీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో కూడా అమల్లోకి వచ్చాయి. రియల్‌మీ 8 (4 జీబీ ప్లస్ 128 జీబీ) బేసిక్ మోడల్‌ ప్రస్తుత ధర.. రూ.15వేల 999గా ఉంది. ధర పెరగకముందు.. రియల్‌మీ 8 ధర.. రూ.14వేల 499గా ఉండేది. 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.16వేల 999గా ఉంది. ఇంతకుముందు.. దాని ధర రూ.16వేల 499గా మాత్రమే ఉండేది. రూ.15వేల 499గా ఉన్న రియల్‌మీ 8 5జీ ధర పెరగకముందు.. రూ.13వేల 999గా ఉండేది. 6జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16వేల 499 కాగా.. గతంలో దీని ధర రూ.14వేల 999గా ఉండేది. టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ మోడల్ ధర.. రూ.16వేల 999 నుంచి రూ.18వేల 499 వరకూ పెరిగింది. 

నవారు మంచం రూ.41వేలు ... !

 


న్యూజిలాండ్‌ లోని అన్నాబెల్లే  బ్రాండ్ నవారు మంచాన్ని భారతీయ ప్రాచీన పగటివేళ పడుకునే మంచం  అనే పేరుతో తన వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టింది. దాని ధరను 800 న్యూజిలాండ్ డాలర్లుగా ఫిక్స్ చేసింది. అంటే మన భారతీయ రూపాయల్లో రూ.41,297. ఇది ఇంత రేటు ఎందుకు మన దేశంలో మహా అయితే రూ.10 వేల లోపే ఉంటుంది కదా అని మనకు అనిపించవచ్చు. ఇలా విమర్శిస్తామని తెలిసే అ కంపెన ఇది ప్రత్యేకమైన మంచం అనీ, ఒరిజినల్ అనీ చెప్పింది. దాని అసలు ధర 1200 న్యూజిలాండ్ డాలర్లు అని చెప్పింది. అంటే మన రూపాయిల్లో రూ.61,980 అన్నమాట. డిస్కౌంట్ పోగా దాని ధర రూ.41,297గా చెప్పింది. నవారు మంచంలో ఏముంటుంది... ఓ దీర్ఘ చతురస్రాకార కలపకు చుట్టూ నాలుగు కాళ్లు, మధ్యలో దారాలతో అల్లి ఉంటుంది. దాన్ని తయారుచేయడం తేలికే. అలాంటి దాన్ని అరుదైనదిగా చెబుతూ అదిరిపోయే రేటుకు అమ్మడం ఆశ్చర్యకరమే. ఈ రోజుల్లో ఇలాంటి మంచాల్ని కొనడమే తగ్గిపోయింది. ఇంతకంటే క్వాలిటీ ఉన్నవి కొంటున్నారు. బెడ్ షీట్లు వేసుకోవడానికి వీలుగా ఉండేలా పెద్ద డబుల్ కాట్ మంచాలు కొనుక్కుంటున్నారు. అందుకే దీన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ మంచం ఫొటో వైరల్ అయ్యింది.

ఢిల్లీలో భారీ వర్షం

 

దేశరాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వేడి వాతావరణం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగినట్లు అనిపించినా, వర్షాల కారణంగా పలు అవస్థలకు లోనవుతున్నారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాలలోని రోడ్లు జలమయంగా మారాయి. ఫలితంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ముంబైలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి.


తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో బర్త్ డేలు.....!

 

భారతీయ రైల్వేలో నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎవరైనా సరే బర్త్ డేలను చేసుకోవచ్చు.  లక్కీ డ్రా కూడా నిర్వహిస్తారు. అందులో విజేతలకు బహుమతులను కూడా అందజేస్తారు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అందిస్తున్న ఈ ఆఫర్‌పై ఐఆర్‌సీటీసీ ట్వీట్ ద్వారా వివరాలను వెల్లడించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తారు. కాగా దేశంలోనే మొదటి ప్రయివేటు రైలుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుగాంచింది. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారతీయ రైల్వేలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు అనేక ఆఫర్లను తేజస్ రైలులో అందిస్తున్నారు.

బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేవారు ముందుగా తేదీ, సమయంతో బుక్ చేసుకోవాలి. ఒక రోజుకు 13 మందికి మాత్రమే ఇందుకు అనుమతిస్తారు. ఏరోజు కారోజు 13 మంది పేర్లతో డ్రా తీస్తారు. విజేతలకు బహుమతులను ఇస్తారు. ఐఆర్‌సీటీసీ సైట్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు బుక్ చేసుకోవచ్చు.

Monday, August 30, 2021

భారీ ఐపీవోకు ఓలా రెడీ


ప్రస్తుత దేశీయ మార్కెట్‌లో భవిష్యత్ అవసరాల పేరిట కార్పొరేట్ సంస్థలు ఐపీవోల ద్వారా నిధుల సేకరణ ముమ్మరం చేశాయి. తాజాగా క్యాబ్ అగ్రిగేటర్‌.. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా తన భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన నిధుల సేకరణకు కార్యాచరణ వేగవంతం చేసింది.  తాజాగా ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు సిటీ గ్రూప్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్‌, మోర్గాన్ స్టాన్‌లీ సంస్థలను ఓలా ఎంచుకున్నట్లు సమాచారం. బిలియన్ డాలర్ల నిధుల సేకరణ లక్ష్యంతో ముందుకువెళుతున్న ఓలా సంస్థలో జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్‌, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ పెట్టుబడులు పెట్టాయి. 800 కోట్ల డాలర్ల పై చిలుకు నిధుల సేకరణకు ఐపీవోకు వెళ్లేందుకు అనుమతించాలని సెబీని ఓలా అక్టోబర్‌లో కోరనున్నదని తెలుస్తున్నది. ఐపీవోకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. దాని సైజ్ ఖరారైతే, ఐపీవో నిర్వహణ బాధ్యతల్లో మరికొన్ని బ్యాంకులు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓలా ఐపీవో నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించడానికి సిటీ బ్యాంక్ ప్రతినిధి నిరాకరించారు. ఓలా క్యాబ్ సర్వీస్‌లో ప్రస్తుతం దేశంలోని 250 నగరాల పరిధిలో 15 లక్షల మంది డ్రైవర్లు భాగస్వాములుగా ఉన్నారు.

మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్‌మీ

 

మొదటిసారి మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్‌మీ తొలి ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. రియల్‌మీ ఎక్కువగా తన ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను వినియోగిస్తుంది. అయితే.. తాజాగా మీడియాటెక్ కంపెనీతో రియల్‌మీ ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో రియల్‌మీ నుంచి రిలీజ్ కానున్న 5జీ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో రానున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో త్వరలోనే ఇండియాలో రియల్‌మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌, డైమెన్సిటీ 920 ఎస్‌వోసీ ప్రాసెసర్స్‌.. 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయడంతో పాటు.. 120 హెచ్‌జెడ్ వరకు డిస్‌ప్లేను సపోర్ట్ చేస్తాయి. అందుకే.. రియల్‌మీ తన నెక్స్ట్ 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను వినియోగించనుందని తెలుస్తోంది.

నేను గ్రహాంతరవాసిని

 


ఎలోన్ మస్క్ అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. హాలీవుడ్‌ మార్వెల్‌ సూపర్‌ క్యారెక్టర్‌ ఐరన్‌ మ్యాన్‌తో ఎలోన్ మస్క్ ను పోల్చుతారు. అలాగే, ఎలోన్ మస్క్ కూడా ఎప్పుడు తన అభిమానులతో దగ్గరగా ఉంటారు. క్రిప్టోకరెన్సీ, టెస్లా నుంచి రాకెట్లు, స్పేస్ ఎక్స్ వరకు బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విటర్ లో అడిగిన ప్రశ్నలకు సాధ్యమైనంత మేరకు సమాధానాలు ఇస్తారు. అంతే కాదు, అతను తన అభిమానులను స్టంప్ చేయడానికి చమత్కారమైన మీమ్స్ పోస్ట్ చేస్తాడు. అయితే, రెండు రోజుల క్రితం ఆగస్టు 28న ఒక యూజర్ మస్క్ నటించిన ఒక చిన్న వీడియో క్లిప్ పోస్ట్ చేశాడు. ఈ 17 సెకన్ల వీడియోలో టెస్లా సీఈఓ భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రం, గ్రహాంతరవాసుల గురించి మాట్లాడుతారు. భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రంలో గొప్ప ప్రశ్నలలో ఇది ఒకటి అని తాను భావిస్తున్నానని మస్క్ వీడియోలో చెప్పాడు. "గ్రహాంతరవాసులు ఎక్కడ ఉన్నారు?" ఈ ప్రశ్న తర్వాత అతను "బహుశా వారు మా మధ్య ఉండవచ్చు, నాకు తెలియదు" అని జోకులు వేస్తాడు, "కొంతమంది నేను గ్రహాంతరవాసిని అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు" అని అంటారు. అయితే ఇప్పుడు ఆ వీడియో ట్రెండ్ అవుతుంది. ఒక యూజర్  ఈ వీడియోను ట్వీట్ చేసి "గ్రహాంతరవాసినా?" అని అడిగాడు. అయితే, దీనికి మస్క్ ప్రతిస్పందనగా "నిజమే" అవును అని పేర్కొంటారు. 60 వేల మందికి పైగా యూజర్లు ఈ పోస్టును లైక్ చేశారు. మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ రి-ట్వీట్ చేశారు.

రోడ్డు ప్రమాదం......!

 



ఈ పులిలానే ఎవరి బ్రతుకైనా?

 


సిమ్‌కార్డ్‌, నెట్‌వర్క్‌లతో పని లేదు...!


మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు అన్నీ కూడా నెట్‌వర్క్‌ ఆధారంగా పని చేస్తున్నాయి. 2జీ మొదలుకుని ఇప్పుడు ఎల్‌టీఈ (లాంగ్‌టర్మ్‌ ఎవల్యూషన్‌), 5జీ వరకు వచ్చాం. శాటిలైట్‌ తరంగాల ఆధారంగా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఈ నెట్‌వర్క్‌లు పని చేస్తున్నాయి. అయితే వీటిని మించేలా భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా లియో టెక్నాలజీలో సిమ్‌తో అవసరం లేకుండా నేరుగా హ్యండ్‌సెట్‌ ద్వారానే ఇటు కాల్స్‌, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్‌ కొనసాగించవచ్చు. లియో టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకునేందుకు యాపిల్‌ అడుగులు వేస్తోంది. త్వరలో రిలీజ్‌ చేయబోతున్న యాపిల్‌ 13 మోడల్‌ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మొబైల్‌ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఏమైనా రీఛార్జీలు ఉంటాయా? లేక హ్యండ్‌సెట్‌ ధరలోనే అ‍వన్నీ పొందుపరుస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి యాపిల్‌ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

లియో అంటే

నెట్‌వర్క్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ప్రస్తుతం భూ వాతావరణం ఆవల ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై వాటితో సంబంధం లేకుండా భూమి నుంచి కేవలం 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO) శాటిలైట్లను మొబైల్‌ కమ్యూనికేషన్‌ కోసం ఉపయోగించుకోబోతున్నారు. దీని కోసం లో ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్లను ‍ ప్రయోగించేందుకు బడా సంస్థలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆమెజాన్‌, ఎయిర్‌టెల్‌ , స్పేస్‌ఎక్స్‌,, టాటా, టెలిశాట్‌ వంటి కంపెనీలు ఈ పనిలో బిజీగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ 90వ దశకం నుంచి అందుబాటులో ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేలా అనుమతులు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం తరఫున భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సైతం ఇదే టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుంది.

ఆనంద్‌ మహీంద్ర స్పెషల్‌ ఆఫర్‌

 


టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్‌ అవని లేఖారాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్‌యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు  ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని ఆమెకే ఇస్తానని ప్రకటించారు. షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పారా ఒలింపిక్స్‌ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు. ఈ అనుభూతిని వర్ణించ లేనిదని ప్రపంచం శిఖరానికి ఎదిగిన భావన కలుగుతోందని పేర్కొన్నారు. కాగా తన లాంటి ప్రత్యేక సామర‍్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్‌యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్‌యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్‌లతో కూడిన ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ఆమె ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్‌ చేశారు. దీపా మాలిక్‌ ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్‌యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరిన సంగతి తెలిసిందే. 

Sunday, August 29, 2021

అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు

 


ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఈరోజు అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) లో ఉన్న ఏడుగురు వ్యోమగాముల కోసం చీమలు, 2 వేల కేజీలకు పైగా అవకాడోలు, నిమ్మకాయలు, ఐస్ క్రీమ్‌లు, మనిషెత్తు రోబో హ్యాండ్‌ను పంపించింది. ఈ సరంజామాతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్‌ను ఫాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు. నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. మొత్తం 4,800 పౌండ్ల బరువైన (2,170 కేజీలు) పరికరాలు, ఇతర సామగ్రిని ఈ ప్రయోగం ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి చేరవేశారు. మంగళవారం ఇవి స్పేస్ స్టేషన్‌కు చేరుకోనున్నాయి. అమెరికాకు చెందిన ‘గర్ల్స్​ స్కౌట్స్’ నాసా ద్వారా చీమలను అంతరిక్షంలోకి పంపింది. స్పేస్​లో వీటిపై ప్రయోగాలు నిర్వహించనుంది. ఉప్పునీటి రొయ్యలు, కొన్ని మొక్కలను సైతం ప్రయోగాల కోసం పంపించింది. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంపిన విత్తనాలను (జన్యు పరిశోధనలో ఉపయోగించే ఒక చిన్న పుష్పించే మొక్క విత్తనాలు) సైతం డ్రాగన్ క్యాప్సూల్ మోసుకెళ్లింది. ఇక కాంక్రీట్, సోలార్ సెల్స్, తదితర మెటీరియల్‌ను​ సైతం ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి చేరింది. గిటాయ్ ఇంక్ అనే జపాన్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన రోబోటిక్ చెయ్యిని అంతరిక్ష కేంద్రంలో వివిధ పరికరాల మరమ్మతులకు వినియోగించనున్నారు. వ్యోమగాములు చేసే ఇతర పనులు కూడా ఇది చేస్తుందని సంస్థ అధికారి టొయోటకా కొజుకి తెలిపారు. ఇలాంటి పరికరాలను మరికొన్ని పంపించనున్నట్లు చెప్పారు. 2025 నాటికి చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ఈ పరికరాలను వినియోగించనున్నట్లు తెలిపారు. చంద్రుడి గర్భంలో ఉన్న విలువైన వనరులను తవ్వి తీసేందుకూ ఈ రోబో పరికరాలను ఉపయోగించనున్నారు.

ఐటీ మినహాయింపు ఇవ్వండి

 


సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించడానికి ఆదాయపు పన్ను నుంచి పెన్షన్‌ను మినహాయించాలని భారతీయ పెన్షనర్ల సంఘం ప్రధాని నరేంద్ర మోడీ ని కోరారు. ఈ ఏడాది ఆగస్టు 25న ప్రధానికి రాసిన లేఖలో, పార్లమెంటు సభ్యులు, శాసన సభల సభ్యుల పెన్షన్లు పన్ను పరిధిలోకి రాకపోతే, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌పై ప్రభుత్వం ఎందుకు ఆదాయపు పన్ను విధిస్తుందని ఆ సంస్థ వాదించింది. "ప్రతి రిటైర్డ్ వ్యక్తికి అనేక సంవత్సరాలు దేశానికి సేవ చేయడం వల్ల అతని/ఆమె జీవనోపాధి కొరకు రిటైర్ మెంట్ ఫండ్ గా పెన్షన్ చెల్లిస్తున్నట్లు" అని అందులో పేర్కొంది. ఇప్పుడు, పెన్షన్ పై ఆదాయపు పన్ను ఎందుకు విధిస్తున్నారు అనే ప్రశ్న లేవనెత్తింది. ఇది ఏ సేవ లేదా పని వల్ల వచ్చిన ఆదాయం కాదు. ఎంపిలు, ఎంఎల్ఎల పెన్షన్ పన్ను పరిధిలోకి రాకపోతే, మా పెన్షన్‌పై ఎందుకు పన్ను విధిస్తున్నారు? అని ఆ సంఘం లేఖలో పేర్కొంది. జూలై 23, 2018న షిర్డీ లో జరిగిన తన మొదటి అఖిల భారత సదస్సులో ఈ సంస్థ పెన్షన్‌ను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని తీర్మానించింది. అప్పటి నుంచి ఈ సమస్యను ఈ సంస్థ ఆర్థిక మంత్రితో నిరంతరం లేవనెత్తుతోంది, అయితే మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంది. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఈ విషయంలో దయచేసి జోక్యం చేసుకోవాలని, పింఛనుదారుల నిజమైన డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించాలని భారతీయ పెన్షనర్ల సంఘం మోడీని కోరింది. 

పబ్జీ గేమ్ పదిలక్షలు మింగేసింది..!


పబ్జీ యొక్క కొత్త గేమ్ 'బాటిల్ గ్రౌండ్స్ ఇండియా' భారతదేశంలో ప్రారంభం అయింది. అయితే, ఇప్పుడు కూడా చాలా మంది వినియోగదారులు పాత పబ్జీని ఏపీకే  ఫైల్ సహాయంతో డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్లే చేస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఈ గేమ్‌కు సంబంధించిన ప్రతికూల వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలుడు ఈ గేమ్‌లో 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ లావాదేవీ తల్లి ఖాతా నుండి జరిగింది. ఈ విషయమై అతడి తల్లిదండ్రులు మందలించడంతో, అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆన్‌లైన్ గేమ్‌ల కారణంగా పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం వేలాది లేదా లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో, మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో నివసిస్తున్న 13 ఏళ్ల కృష్ణ పాండే, గరీనా ఫ్రీ ఫైర్ అనే ఆన్‌లైన్ గేమ్ ఆడటం ద్వారా 40 వేల రూపాయలు కోల్పోయారు. జూన్‌లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక చిన్నారి ఫ్రీ ఫైర్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి రూ .3.22 లక్షల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది. అదే సమయంలో, యుపికి చెందిన 3 మంది పిల్లలు గేమ్ ఆడుతున్నప్పుడు రూ .11 లక్షలకు పైగా విలువైన ఆయుధాలను కొనుగోలు చేశారు. అలాంటి కేసులు కొన్ని నెలలుగా నిరంతరం తెరపైకి వస్తున్నాయి.

వర్షాకాలం - ఫ్రిజ్​లో పెట్టకూడనవి...!

 


టెక్నాలజీ పెరిగిపోవడంతో ఫ్రిజ్​ల వాడకం ఎక్కువైపోయింది. ప్రతీ ఊరిలోనూ ఫ్రిజ్​లు ఉన్నాయి. కూరగాయలు, పండ్లే కాదు..రవ్వ, చింతపండు, పచ్చళ్లు .. ఒక్కటేమిటి సర్వం దానిలో దూరిపోతున్నాయి. దీనితో ఫ్రీజ్ చెత్తకుండిలా తయారైంది. అయితే చాలామంది కాయగూరలు, పండ్లను ముందే కట్‌ చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటుంటారు. కానీ వర్షాకాలంలో ఈ అలవాటు మానుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ కాలంలో గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు కట్‌ చేసిన ఆహారం పైకి చేరతాయి. మనం వాటిని మళ్లీ కడగకుండా తినేయడం వల్ల అవి మన కడుపులోకి చేరి లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతాయి. ముందుగా ఆయా కాయగూరలు, పండ్లను ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టడం, ఎప్పటికప్పుడే తాజాగా వాటిని కట్‌ చేసుకోవడం ఉత్తమం. వండుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వండినవి రాత్రి, రాత్రి మిగిలిపోయినవి మరునాడు ఉదయం తినడం అస్సలు మంచిది కాదు. ఏ పూటకాపూటే వేడివేడిగా వండుకొని తినాలి. రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల కూరగాయలు పండ్లలో ఉన్న సహజ లక్షణాలు కోల్పోయే ప్రమాదం  ఉందంటూ నిపుణులు  హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ వంటి పండ్లను అయితే ఫ్రిజ్లో అస్సలు పెట్టకూడదంట. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది పుచ్చకాయ తినడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే పుచ్చకాయ తినడం మంచిదే  కానీ రిఫ్రిజరేటర్​లో  నిల్వ ఉంచిన పుచ్చకాయ తినడం మాత్రం అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు ఉల్లిపాయలు కూడా ఫ్రిజ్​లో పెట్టకూడదంటా. ఎందుకంటే అలా పెడితే దాని సహజత్వం పోతుందట. ఇక అరటి పండ్లు సైతం ఫ్రిజ్​లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం వేయదు. అలాగని నీళ్లు తాగకపోతే.. డీహైడ్రేషన్‌, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కాలంలోనూ మీ బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగాలి. అవి కూడా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. ఈ చిట్కా వల్ల ప్రస్తుతం పొంచి ఉన్న కరోనా ముప్పు నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అలాగే బరువూ తగ్గచ్చు. బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి ఫ్లేవర్‌ను కోల్పోతాయి. పైగా.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల ఈ దుంపల్లోని స్టార్చ్ (పిండిపదార్థం) చక్కెరగా మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల పేపర్ బ్యాగుల్ ప్యాక్ చేసి గది టెంపరేచర్‌లోనే నిల్వ ఉంచాలి. టొమాటోలు ఒక్కసారి ఫ్రిజ్‌లో ఉంచిన పూర్తిగా రుచిని కోల్పోతాయి. అందువల్ల వీటిని ఉష్ణోగ్రతలోనే నిల్వచేయాలి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఆలివ్ ఆయిల్‌ను శీతలీకరణ యంత్రంలో నిల్వ చేయడం వల్ల దాన్ని స్థిరత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆలివ్ నూనె ఒక చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో కాంతి, వేడి, గాలిలేని ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల హానికారక క్రిములు తయారై ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది.

ఈ ఫోన్ మడత పెట్టొచ్చు...!


మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో విడుదల కానుంది. శామ్‌సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో లాంచ్ అయినప్పటికీ, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 వేరే విధంగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 గత సంవత్సరం లాంచ్ అయిన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో స్మార్ట్‌ఫోన్ లాగానే ఉంటుంది. దీని ధర $ 1399 (సుమారు రూ. 1.03 లక్షలు).

డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 అనేది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేసే డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 అనేది టాబ్లెట్ , మొబైల్ రెండింటిలోనూ పనిచేసే ఫోన్. దాని వైపు ఒక స్క్రీన్ కూడా ఉంది. ఏదైనా సాధారణ ఫోన్‌లాగే, మీరు కూడా దీనిని కాల్ చేయడానికి ఉపయోగించవచ్చు. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 ఆండ్రాయిడ్ పరికరం. ఇది రెండు స్క్రీన్‌లపై ఒకేసారి రెండు పనులు చేయగలదు . మైక్రోసాఫ్ట్, గూగుల్ దీని కోసం కలిసి పనిచేస్తున్నాయి. దీనిలో మీరు అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్‌లను ఇంస్టాల్ చేసుకోవచ్చు. అయినప్పటికీ థర్డ్ పార్టీ యాప్స్ దాని స్క్రీన్‌కు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. దీని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఒక యాప్‌ను మొదటి స్క్రీన్ నుండి రెండవ స్క్రీన్‌కు సులభంగా లాగవచ్చు. మీరు ఫోన్ రెండు స్క్రీన్‌లలో ఒకేసారి రెండు పనులు చేయవచ్చు.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 స్పెసిఫికేషన్‌లు

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్ మైక్రోసాఫ్ట్ ఫోల్డబుల్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. 5G సపోర్ట్ చేయవచ్చు. డ్యూయల్ స్క్రీన్ ఫోన్ 8GB RAM ని పొందగలదు. ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 సింగిల్-కోర్ పరీక్షలలో 1,071-1,106 పాయింట్ల మధ్య, గీక్ బెంచ్‌లో బహుళ జాబితాలలో మల్టీ-కోర్ పరీక్షలలో 3,166 - 3,569 పాయింట్ల మధ్య జాబితా చేయబడింది. జూలైలో విండోస్ సెంట్రల్‌లో ఒక నివేదిక రాబోయే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డుయో 2 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది. కెమెరా మాడ్యూల్ ఒక స్టాండర్డ్, ఒక టెలిఫోటో, ఒక వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది.

Saturday, August 28, 2021

రాబోయే కాలం రోబోలదే ..?


ఒకప్పటి లాగా లేదు ప్రస్తుత ప్రపంచం. యాంత్రీకరణ బాగా పెరిగింది. ప్రజెంట్ టెక్నాలజీ వరల్డ్‌లో ప్రతీది మెషిన్స్ ఆధారంగా దాదాపుగా జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో మరిన్ని మార్పులు సంభవించే చాన్సెస్ ఉంటాయి. ఆటోమేషన్ కీ రోల్ ప్లే చేయొచ్చు. రోబోటిక్స్, డిజిటల్‌ప్లాట్ ఫామ్స్ సరికొత్తగా వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల సృష్టి ఆయా రంగాల్లోనే ఉండొచ్చు. ప్రస్తుతమున్న పరిస్థితులకు భిన్నంగా ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలోనే విద్యార్థులు తమకు ఏం కావాలో నిర్ణయించుకుని ఆ మేరకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకు దగ్గట్లుగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నాయి. ఉదాహరణకు.. డాక్టర్ కావాలని ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యూచర్‌లో వచ్చే మార్పులను గెస్ చేయగలగాలి. అప్పటికి డాక్టర్స్‌కు సహాయకులుగా మనుషులకు బదులుగా రోబోలు రావొచ్చు. ఇకపోతే నర్సుల స్థానంలో మెషీన్లు పని చేయొచ్చు.అందుకే ప్రతీ ఒక్కరు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా డే టు డే అప్‌డేట్ అయ్యేందుకుగాను ప్రయత్నిస్తూ ఉండాలి. అలా చేస్తే వృత్తిలో అడుగుపెట్టాక ఎటువంటి సమస్యలు తలెత్తవు. మనుషులను రోబోలు, మెషీన్లు రిప్లేస్ చేసే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదని, కొత్త ఉద్యోగాల కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో ఇప్పటికే పలు రంగాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండస్ట్రియల్ రివొల్యూషన్ లేదా డిజటల్ రివొల్యూషన్ ఆల్రెడీ వచ్చేసింది. అక్కడ రోబోలు, మెషిన్లు, టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా సంస్థలు కొన్ని పని చేస్తున్నాయి. 3 డీ ప్రింటింగ్, రోబోట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వంటి టెక్నొలాజికల్ ఇన్వెన్షన్స్‌ను మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మన దేశంతో పాటు ప్రపంచంలో ఇంకా సరి కొత్త మార్పులు వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఉద్యోగార్థులు అవేర్‌నెస్ ఏర్పరుచుకుని కావలిసిన నైపుణ్యాలను పెంచుకోవాలి. సాంకేతికతను అర్థం చేసుకుని ముందుకు సాగుతు ఉండాలి. మొత్తం అన్ని రంగాల్లో రోబోలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి రోబోటిక్స్‌పైన అవగాహన పెంచుకోవాలి.

సముద్ర జలాల్లో ముంబై ?

 


మహారాష్ట్ర రాష్ట్ర సచివాలయం మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్ట్ నారిమన్ పాయింట్ 2050 కల్లా పూర్తిగా నీట మునుగుతుందని బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ హెచ్చరించారు. భూతాపం పెరిగి సముద్ర నీటి మట్టాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, పర్యావరణశాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేతో కలిసి శనివారం ఇక్బాల్ సింగ్ చాహల్ ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి హెచ్చరికలు జారీ చేస్తుందని, కానీ ప్రజలు మేల్కొనకపోతే పరిస్థితి దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై నగరంలో సుమారు 70 శాతం.. సౌత్ ముంబైలోని ఏ,బీ,సీ, డీ వార్డులు జలమయం అవుతాయని ఇక్బాల్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. కుఫే పరేడ్‌, నారిమన్ పాయింట్, మంత్రాలయ ప్రాంతాల్లో 80% నీట మునిగిపోతుందన్నారు. ఈ ప్రాంతాలు కనుమరుగు కావడం ఖాయం అని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్ తరాలతోపాటు ప్రస్తుత తరం కూడా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇంతకుముందు పర్వత శ్రేణులు కరగడం వల్ల భూతాపం కలుగుతుందని, మనపై నేరుగా ప్రభావం ఉండదని భావించామన్నారు. 129 ఏండ్లలో తొలిసారి గతేడాది వచ్చిన నిసర్గ తుఫాన్ ముంబైని ముంచెత్తిందని ఇక్బాల్ సింగ్ చాహల్ గుర్తు చేశారు. గతేడాది ఆగస్టు ఐదో తేదీన నారిమన్ పాయింట్ వద్ద ఐదు నుంచి 5.5 అడుగుల నీరు నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాసియాలో క్లైమేట్ చేంజ్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన తొలి నగరం ముంబై అని చెప్పారు.

కార్వీ స్కాం విలువ రూ.2700 కోట్లు?

 


ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ కార్వీలో కుంభకోణం గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలికి తీశారు. ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.2700 కోట్లు అని నిగ్గు తేల్చారు. సకాలంలో రుణాలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిన కార్వీ చైర్మన్ పార్ధసారధిపై బ్యాంకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు రెండు రోజుల కస్టడీ ముగిసిపోవడంతో శనివారం మరోమారు కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈసారి రెండు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆది, సోమవారాల్లో మరోమారు పార్ధసారధిని పోలీసులు విచారిస్తారు. ఇప్పటికే జరిగిన విచారణలో పార్థ సారధి నుంచి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా చూపిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ.. బ్యాంకుల నుంచి రుణాలు పొందింది. రూ.780 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు పార్ధసారధి చెప్పారు. ఆస్తులు అమ్మైనా కస్టమర్ల అప్పులు తీరుస్తానని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పీటీ వారెంట్‌పై ఆయనను తీసుకెళ్లి విచారించేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

ఏనుగు ప్రాణాలు కాపాడిన లోకో పైలెట్లు

ఓ రైలు లోకోపైలెట్‌లు గజరాజును రక్షించారు. అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆ ఏనుగు ప్రాణాలు కాపాడారు. నగ్రకట-చల్సా మార్గంలో వెళ్తున్న ఓ స్పెషల్ ట్రెయిన్‌ ఉత్తర బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లా పరిధిలోకి వచ్చేసరికి ట్రాక్ పక్కన ఓ ఏనుగు నిలబడి ఉంది. దూరం నుంచి దాన్ని గమనించిన ఇద్దరు లోకోపైలెట్లు వెంటనే అలర్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపేశారు. ఏనుగు ట్రాక్ దగ్గరి నుంచి అడవి లోపలికి వెళ్లేవరకు వేచి చూశారు. ఏనుగు వెళ్లిపోయాక రైలును ముందుకు పోనిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అలీపూర్‌ద్వార్ డివిజన్ అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు లోకో పైలెట్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమయానికి అప్రమత్తంగా వ్యవహరించి ఏనుగు ప్రాణాలను కాపాడారంటూ మెచ్చుకుంటున్నారు. రైల్వే శాఖ కూడా ఆ ఇద్దరు లోకో పైలెట్‌లను అభినందించింది.

అమెజాన్‌ అభ్యంతరాలు సరికాదు


ఫ్యూచర్‌, రిలయన్స్‌ గ్రూపుల మధ్య కుదిరిన రూ. 24,731 కోట్ల డీల్‌ అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఫ్యూచర్‌ గ్రూపు మరోసారి ఆశ్రయించింది. ఈ ఒప్పందం ఆలస్యం అవడం వల్ల సంస్థలో పని చేసే 35 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని పేర్కొంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. గతంలో ఇలాంటి కేసుల్లో వచ్చిన తీర్పులను ఉదహరిస్తూ తమ డీల్‌పై అమెజాన్‌ లేవనెత్తుతున్న అభ్యంతరాలను కొట్టి వేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ కోరింది. మొత్తం ఆరు వేల పేజీలతో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కోరింది

ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) అమెజాన్‌కి వాటాలు ఉన్నాయి. దీని ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా అమెజాన్‌కి దఖలు పడ్డాయి. అయితే అమెజాన్‌ని సంప్రదించకుండా తమ రిటైల్‌ తదితర వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్టు 2020 ఆగస్టులో ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌నకు లీగల్‌ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు సైతం ఢిల్లీ కోర్టు తీర్పును సమర్థించింది. 

శ్రీకృష్ణుడంటే ఎన్టీఆరే !

 


ఎన్‌టీఆర్‌కు నటుడిగా బాగా పేరు తెచ్చి పెట్టినవి మాత్రం పౌరాణిక చిత్రాలే. ముఖ్యంగా ఆయన నటించిన పలు పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడి వేషంలో ఆయన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ, స్వర్గీయ, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ నటనా కౌశలం గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెరపై కనిపించాడంటే చాలు అభిమానులకు పండగే. ఆయన కన్నుమూసి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఆయన సినిమాలను తెగ చూసేవారున్నారని చెబితే అతిశయోక్తి కాదు. అయితే ఎన్‌టీఆర్‌కు నటుడిగా బాగా పేరు తెచ్చి పెట్టినవి మాత్రం పౌరాణిక చిత్రాలే. ముఖ్యంగా ఆయన నటించిన పలు పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడి వేషంలో ఆయన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అభిమానుల ప్రశంసలు చూరగొన్నారు. హిందూ దేవుళ్లు నిజంగా మనకు కనిపిస్తే ఎలా ఉంటారో తెలియదు. కానీ ఎన్టీఆర్‌ను ఆ పాత్రల్లో తెరపై చూశాక నిజంగా దేవుడు అచ్చం అలాగే ఉంటాడనుకునేవారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్‌టీఆర్ ఒదిగిపోయారు. ఆ పాత్రకు ఆయన జీవం పోశారు. సినిమాల్లో కృష్ణుడి పాత్ర గురించి చెబితే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఎన్‌టీఆరే. అంతగా ఆయన ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. తెరపై కృష్ణుడి గెటప్‌లో ఎన్‌టీఆర్ కనిపిస్తే చాలు.. ఇంక ఆ సినిమాకు తిరుగుండదని అప్పట్లో నిర్మాతలు భావించేవారు. అందుకనే ఆయనతో చాలా మంది ఆ పాత్రలతో సినిమాలు తీశారు. ఎన్‌టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో అనేక సినిమాల్లో నటించినా.. కొన్ని సినిమాల్లో ఆ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మాయాబజార్ (1957), దానవీరశూరకర్ణ (1977), శ్రీకృష్ణపాండవీయం (1966), శ్రీకృష్ణ విజయం (1970), శ్రీకృష్ణావతారం (1967), శ్రీకృష్ణతులాభారం (1966) సినిమాల్లో ఎన్‌టీఆర్ శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అసలు శ్రీకృష్ణుడు అనే పేరును తలచుకున్నా సరే.. ముందుగా అన్నగారి శ్రీకృష్ణుడి రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. నిజంగా ఆ పాత్రకు న్యాయం చేయదగ్గ నటుడు మాత్రం ఇప్పటి వరకు ఏ సినీ ఇండస్ట్రీలో మనకు కనిపించలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు..!

Friday, August 27, 2021

డిజిటల్‌ కరెన్సీ ట్రయల్స్‌ ?

 


ఆర్‌బీఐ దశల వారీగా కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రయత్నాలు మొదలుపెట్టిందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. వీలైతే ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదో కొత్త విధానమైన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. భద్రత, భారత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానం, ద్రవ్య లభ్యత వంటి అంశాలపై డిజిటల్‌ కరెన్సీ ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశంపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. కేంద్ర బ్యాంకు విడుదల చేసే డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై నేడు ప్రపంచ దృష్టి కేంద్రీకృతమవుతోంది. ప్రయోగాత్మకంగా సీబీడీసీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన దేశాల జాబితాలో భారతదేశమూ చేరింది. సీబీడీసీ అంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లావాదేవీలు జరుగుతున్న క్రిప్టో కరెన్సీల వంటిది కాదు. అది రిజర్వు బ్యాంకు వంటి కేంద్ర బ్యాంకుల హామీ ఉన్న చట్టబద్ధ కరెన్సీ. అదే సమయంలో సీబీడీసీ కాగితం కరెన్సీ కాదు, నాణెమూ కాదు. దాన్ని ఈ రెండు రూపాల్లోకీ మార్చడమూ కుదరదు. సీబీడీసీ అనేది ఫోన్‌, డిజిటల్‌ వ్యాలట్‌, కంప్యూటర్‌ ద్వారా మాత్రమే ఉపయోగించగల డిజిటల్‌ కరెన్సీ. 

మూడు బ్లాక్ హోల్స్ విలీనం

 


అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింత ఇది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు (బ్లాక్‌హోల్స్‌) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఇదొక విశేషం అయితే, భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం విశేషం మరో విశేషం. పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్‌ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ‘ఆస్ట్రోనమీ’' జర్నల్‌లో ప్రచురించారు. '’మూడో పాలపుంత (గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్‌జీసీ7733ఎన్‌.. అనేది ఎన్‌జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’'' అని తెలిపారు. ఎన్‌జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని వివరించారు. అల్ట్రా వయొలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ సాయంతో వీటిని వీక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్‌ఎస్‌ఎఫ్‌, చిలీ వీఎల్‌టీ, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్‌ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం విడుదల చేశారు.

జియోఫోన్‌ నెక్ట్స్‌ త్వరలో ...!

 

అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో రిలయన్స్‌ ఓ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గూగుల్‌తో కలిసి రూపొందించిన ఈ ఫోన్‌ను జియోఫోన్‌ నెక్ట్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో అనేక అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫోన్‌ సెప్టెంబరు 10న విడుదల కానుంది! ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించనవిగా చెబుతున్న ఫీచర్లు కొన్ని ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీని ధరకు సంబంధించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రిలయన్స్‌ జియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రానప్పటికీ.. దీని ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వచ్చేవారమే ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే ఈ ఫోన్లు, దీనికి సంబంధించిన ఇతర పరికరాలు ఆఫ్‌లైన్ రీటైల్‌ సోర్లలోనూ అందుబాటులో ఉంచేందుకు రిలయన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రముఖ చెఫ్‌ నౌషద్‌ మృతి

  


ప్రముఖ చెఫ్‌, మలయాళ సినీ నిర్మాత నౌషద్‌(55) మరణించారు. తిరువల్లలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కోవిడ్‌ బారిన పడిన నౌషద్‌.. ఉదర సంబంధిత నొప్పితో రెండు వారాల క్రితం నౌషద్‌ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నేటి ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 12న నౌషద్‌ భార్య షీబా గుండెపోటుతో మరణించారు. 15 రోజుల వ్యవధిలో భార్యా భర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన నౌషద్‌ కూతురు నష్వా(13)ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నౌషద్‌ ది బిగ్‌ చెఫ్‌ పేరిట నౌషద్‌ నెలకొల్పిన రెస్టారెంట్‌, క్యాటరింగ్‌ గ్రూపునకు మంచి గుర్తింపు ఉంది. అతడు చేసే రుచికరమైన వంటలంటే సెలబ్రిటీలకు మహా ప్రీతి. ఇక పలు స్థానిక టీవీ చానెళ్లలో కుకరీ షోలతో అలరించే నౌషద్‌ మమ్ముట్టి నటించిన కజా సినిమా (2005)తో నిర్మాతగా మారారు. చట్టంబి నాడు, లయన్‌, బెస్ట్‌ యాక్టర్‌, స్పానిష్‌ మసాలా వంటి చిత్రాలను నిర్మించారు.

బీఎస్ఎన్ఎల్‌ ఉచిత ఫైబర్ కనెక్షన్

 


వినియోగదారులకు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్‌ ఫ్రాంచైజీలకు ఉచితంగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అందిస్తోంది. ఇలా అందించే సర్వీస్‌లను రేడియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్  అని అంటారు. ఈ కనెక్షన్‌కు అర్హత కలిగిన ఫ్రాంచైజీలకు ఉచితం కనెక్షన్ ఇస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ టెల్కో 40 ఎంబిపిఎస్  ప్లాన్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నుంచి ఈ ఆఫర్‌కు అర్హత పొందడానికి భారత్ ఎయిర్ ఫైబర్ ఫ్రాంచైజీలు కనీసం 50  ఎఫ్ టి టి హెచ్  కనెక్షన్‌లను అందించాలి. బీఎస్ఎన్ఎల్ నుంచి ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ ఫ్ టి టి హెచ్  కనెక్షన్‌లను అందించిన ఫ్రాంచైజీ ఉంటే వారికి ఈ ఆఫర్‌కు వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రకారం ముందుగా బీఎస్ఎన్ఎల్ ఎయిర్‌ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌తో భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌, ఉచిత డెమో లభిస్తుంది. దీని వేగం సుమారు 40 ఎంబిపిఎస్ ఉంటుంది. రూ.699లతో కనీసం 50 బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను ఎయిర్ ఫైబర్ భాగస్వామికి చెందిన ప్రతీ కార్యాలయానికి అందిస్తుంది. ఈ డెమో కనెక్షన్‌ను బీఎస్ఎన్ఎల్ ఫ్రాంఛైజీలు మాత్రమే వినియోగించుకోవాలి. ఇతరులు వినియోగించుకోకూడదు. ఫ్రాంఛైజీలు డెమో కనెక్షన్‌నుఎవరికీ విక్రయించడానికి అనుమతి లేదు. డెమో కనెక్షన్ కోసం బీఎస్ఎన్ఎల్ ఎటువంటి బిల్లులను జారీ చేయదు.

'నేను అమ్మాయిని కాను'

ఎప్పుడూ ఫన్నీ వీడియోలు, స్పూర్తినిచ్చే పోస్టులతో నెటిజనులను ఆశ్చర్యపరిచే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్‌ మీడియాలో మరో వీడియోను షేర్‌ చేశారు. గురువారం ఓ బాలుడు ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టు నేర్చుకుంటున్న వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో తొమ్మిదేళ్ల బాలుడు చేతిలో కర్రను పట్టుకొని అవలీలగా కలరిపయట్టు సాధన చేస్తున్నాడు. అతన్ని కేరళలోని ఏక వీర కలరిపయట్టు అకాడమీ విద్యార్థి నీలకందన్‌ నాయర్‌గా గుర్తించారు. అయితే ఈ పోస్టులో ఆనంద్‌ మహీంద్రా ఓ చిన్న తప్పిదం చేశారు. వీడియోలో కలరిపయట్టు చేస్తున్న పిల్లవాడిని అమ్మాయనుకొని పొరపాటుగా 'బాలిక'గా పేర్కొన్నారు 'హెచ్చరిక ఈ యువతి దారిలోకి రాకండి. క్రీడా రంగంలో కలరిపయట్టుకు మరింత ప్రాధాన్యత అందించాలి. అప్పుడే ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించలదు అని పేర్కొన్నారు. కాగా ఆనంద్‌ మహీంద్రా తప్పుగా ట్వీట్‌ చేసినప్పటికీ ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంబరపడిపోతున్నారు. బాలుడి నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. నిజానికి ఆనంద్ మహీంద్రా పోస్ట్‌పై నీలకందన్ కూడా స్పందించాడు. 'మీ మద్దతు, ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు సర్. కానీ ఒక చిన్న దిద్దుబాటు.. నేను అమ్మాయిని కాదు, 10ఏళ్ల అబ్బాయిని. కలరిపయట్టు విద్యలో ఒక షార్ట్ మూవీలో నటించడం కోసం నా జుట్టు పొడవుగా పెంచుతున్నాను' అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా కలరిపయట్టు ఆధునిక కేరళలో ఒక పురాతన యుద్ధ కళారూపం. కళరిపయట్టు దీనినే కలరి అని కూడా పిలుస్తారు. కర్రలు, కత్తులు, కవచాలను ఉపయోగించి చేసే ఇది భారత్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న పురాతన మార్షల్‌ ఆర్ట్‌. 

కొత్త ఎలక్ట్రిక్‌ టూత్‌ బ్రష్‌!

 



ఎలక్ట్రిక్‌ టూత్‌ బ్రెష్‌లను షియోమి, సోనిక్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ టూత్‌ బ్రెష్‌లను ప్రవేశపెట్టాయి. ఈ ఎలక్ట్రిక్‌ టూత్‌ బ్రష్‌లు పళ్లను శుభ్రంగా అన్ని వైపుల నుంచి బ్రష్‌ చేస్తాయి. దీని ధర రూ.1500. అద్భుతమైన టెక్నాలజీతో సోనిక్‌ టూత్‌ బ్రష్‌ను తయారు చేశారు. ఈ బ్రష్‌ నిమిషానికి 40 వేల స్ట్రోక్‌లు చేస్తూ పళ్లను శుభ్రం చేస్తుంది. ఈ బ్రష్‌ దంతాల అమరికకు అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్రష్‌కు అనేక ఆప్షన్లు ఇచ్చారు. వైటెనింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిషింగ్‌. బ్రష్‌ చార్జింగ్‌ సామర్థ్యం కూడా బాగుంది. నాలుగు గంటలు చార్జింగ్‌ పెడితే 25 రోజులు వినియోగించుకోవచ్చు. మనం ఫిక్స్‌ చేసిన సమయానికి ఆపినా ఆపకపోయినా బ్రషింగ్‌ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. తిరిగి వినియోగించిప్పుడు మనం చివరగా వినియోగించిన బ్రషింగ్‌ ఆప్షన్‌ను ప్రారంభిస్తుంది. ఒకవేళ మనకు అవసరం అయితే మార్చుకోవచ్చు. ఈ బ్రష్‌ ను వినియోగించేటప్పుడు ఎలాంటి సమస్య రాదని సోనిక్‌ బ్రష్‌ తయారీ దారులు చెబుతున్నారు. 

నల్లమల అందాలు !

 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. కర్నూలు ప్రకాశం జిల్లాకు సరిహద్దు అయిన ఈ ప్రాంతం ఎత్తైన కొండలు దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో నుంచి ప్రయాణించే ప్రయాణికులు ఈ అడవి అందాలను చూసి ఆస్వాదిస్తూ ఉంటారు.

ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఎంతో విలువైన కలపకు బాండాగారం ఈ అటవీ ప్రాంతం పై ఆధారపడి ఎన్నో తెగలు, జాతుల ప్రజలు జీవనం సాగిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో వన్యప్రాణులు కూడా అధికంగానే సంచరిస్తూ ఉంటాయి. ఇక ఈ ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే వంతెన ఉంది.  అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది బస్సు రైలులో ప్రయాణించే వాళ్ళు బ్రిడ్జి ని చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ఎందుకంటే అంత ఎత్తులో ఆ కాలంలో ట్రైన్ ఎలా ప్రయాణించి ఉంటారో అని ఊహించుకుని ఆశ్చర్య పోతుంటారు. 

దశాబ్దాల క్రితం కొండలో నిర్మించిన రైల్వే సొరంగం రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వేరే వింత లోకం లోకి తీసుకు వెళుతుంది. ఈ ప్రాంతంలో ప్రవహించే సగిలేరు వాగుకు ఉన్న ప్రత్యేకత, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాగు ప్రవహిస్తున్న సమయంలో సందర్శకులు వాగులు జలకాలాడుతూ సేదతీరుతూ ఉంటారు. దాదాపు 30 నుండి 50 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు తోపాటు క్రూర మృగాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. దీనికి అనుసంధానంగా రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద ఉన్న నీటి గుండం అందరినీ ఆకర్షిస్తుంది. ఎంత లోతు ఉందో ఇప్పటికి తెలియకపోవడమే ఈ గుండం ప్రత్యేకత. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ గుండంలోకి అధిక మొత్తంలో వరద నీరు పోటెత్తుతుంది ఆ సందర్భంలో ఉగ్రరూపంలో ఉన్న ఈ గుండాన్ని చూస్తే గుండంలోకి దిగి స్నానం ఆచరించేందుకు ఎవరూ సాహసించరు.

ఇలా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతల కు పెట్టింది పేరు అలానే ప్రకాశం కర్నూలు సమీపంలో ఉన్న నరసింహ స్వామి దేవాలయం వద్ద వజ్రాలు కూడా దొరుకుతాయని ఇక్కడ చాలామంది ప్రజలు వర్షాలు పడిన సమయంలో వజ్రాల కోసం వేట సాగిస్తారు.  గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతాన్ని స్థానిక ప్రజలు చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవటమే కాకుండా ఇంత అదృష్టం అవకాశం కల్పించిన పుడమి తల్లికి రుణపడి ఉంటామని మనసులో ప్రకృతి తల్లికి నమస్కరిస్తూ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం ఈ ప్రకృతిని చూసి పరవశించి పోతుంటారు

Thursday, August 26, 2021

ఇక సెలవు...!

 


యాహూ న్యూస్ ఇది తెలియని వారుండరు. మనలో ఎంతో మందికి ఇంటర్నెట్ పరిచయం అవ్వగానే మొదట తెలిసేంది యాహూనే అని కచ్చితంగా చెప్పవచ్చు. 2017లో అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్ యాహూను కొనుగోలు చేసింది. అలాంటి యాహూ సంస్థ తన న్యూస్ కార్యకలాపాలను నిలిపి వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. యాహూ అనేది అమెరికాకు చెందిన సంస్థ. దాదాపుగా 20 ఏళ్లుగా న్యూస్ ఆపరేషన్‌లను నిర్వహిస్తోంది. ఆగస్టు 26 నుంచి యాహూ ఇండియా న్యూస్ ఆపరేషన్‌లను నిలిపివేసింది. దీనిపై అధికారిక ప్రకటనను వెల్లడించిది. ఇక మీద యాహూ కొత్త వార్తలను అందించదని స్పష్టం చేసింది. న్యూస్ ఆపరేషన్ నిలిపివేత.. ఇతర విభాగాలపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.

కొత్త చట్టాలే కారణం

ఈ విషయాన్ని యాహూ ఇండియా తమ హోం పేజీలో అధికారికంగా పేర్కొంది. ఇకపై యాహూ న్యూస్‌, యాహూ క్రికెట్‌, ఫైనాన్స్‌, పలు అంశాలకు సంబంధించి కంటెంట్ అందుబాటులో ఉండదు. భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మీడియా నియంత్రణ చట్టాల ప్రభావం, ఎఫ్‌డీఏ కొత్త నిబంధనల కారణంగా యాహూ న్యూస్ నిలిపి వేస్తున్నట్టు యూహూ స్పష్టం చేసింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం 26శాతం మాత్రమే విదేశీ పెట్టుబడులు ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి ఈ నిబంధన అమలు కానుండడంతో యాహూ ఇండియా ఈ నిర్ణయం తీసుకొంది. యూజర్లు వినియోగిస్తున్న యాహూ అకౌంట్‌లతో పాటు.. ఈ మెయిల్‌, యాహూ సెర్చ్ ఆప్షన్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహూ పేర్కొంది. ముఖ్యంగా ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాహూ క్రికెట్‌పై ఈ ప్రభావం ఉండనుంది.

హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ త్వరలో లాంఛ్

 



దక్షిణ కొరియా కారు తయారీ కంపెనీ హ్యుందాయ్ వచ్చేవారంలో తన ఐ20 ఎన్ లైన్ ఇండియా లాంఛ్‌ను ప్రకటించింది. ఇప్పటికే ఐ20 ఎన్ లైన్ వివరాలను వెల్లడించిన కంపెనీ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. సెప్టెంబర్ 2న ఈ వాహనం ధరను హ్యందాయ్ వెల్లడించనుంది. ఐ20 స్పోర్ట్ వెర్షన్ కారుగా ఐ20 ఎన్‌లైన్ భారత్‌లో తొలి ఎన్ లైన్ కారుగా మార్కెట్‌లోకి రానుంది. ఐ20 టర్బో ఇంజన్‌తో రానున్న ఎన్‌లైన్ పలు కాస్మెటిక్ మార్పులతో కస్టమర్ల ముందుకు రానుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే మెరుగైన సామర్ధ్యంతో పలు మెకానికల్ మార్పులను ఐ20 ఎన్ లైన్‌లో కంపెనీ చేపట్టింది. ఐ20 ఎన్ లైన్ స్పోర్టియర్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు మెరుగైన ఫ్రంట్ బాడీ కంట్రోల్‌, పిచ్ కంట్రోల్‌, అద్భుతమైన స్టీరింగ్ రెస్పాన్స్‌తో వాహనదారులను ఆకట్టుకోనుంది.

ఏపీలో పోస్టాఫీసులు ఇకపై 34 పౌర సేవలు

 


నవంబరు నెలాఖరు కల్లా రాష్ట్రంలోని పోస్టాఫీసులన్నింటినీ సర్వ సేవా కేంద్రాలు (సీఎస్‌సీ)గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ తపాలా సేవలు మాత్రమే ఉండగా, ఇకనుండి 34 రకాల ఆన్‌లైన్‌ పౌరసేవలు సైతం అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం కంప్యూటర్లు అందుబాటులో ఉండి,  శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న 1,568 పోస్టాఫీసులను కామన్‌ సర్వీస్‌ సెంటర్లుగా మార్చేశారు. మరో రెండు నెలల్లో 8,504 పోస్టాఫీసులను సీఎస్‌సీలుగా మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌, ఓటరు గుర్తింపు కార్డు, మొబైల్‌ రీఛార్జీలు, బీమా ప్రీమియంలు, ఆర్‌టీఏ, డీటీహెచ్‌ సేవలు, విద్యుత్తు, నీటి బిల్లులు, గ్యాస్‌ కనెక్షన్లకు దరఖాస్తు, ఫాస్ట్‌ట్యాగ్‌ సేవలు, రైలు, బస్సు, విమాన టికెట్లు, ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి యోగిమాన్‌ ధన్‌ యోజన వంటి పథకాలకు దరఖాస్తులు, సాయిల్‌ హెల్త్‌కార్డ్‌, ఆహార పదార్థాల విక్రయ లైసెన్సులు వంటి ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ డాక్టర్ అభినవ్‌ వాలియా మాట్లాడుతూ.. తపాలా శాఖకు ఉన్న పరిధిని ఉపయోగించుకుని అన్ని గ్రామాలకూ ఈ ఆన్‌లైన్‌ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సీఎస్‌సీలలో అందించే సేవలపై రాష్ట్రంలోని నాలుగు వేల మందికిపైగా తపాలా శాఖ సిబ్బంది తర్ఫీదు పొందారని అన్నారు. అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తపాలా సీఎస్‌సీల ద్వారా సుమారు రూ.1.30 కోట్ల విలువైన 11,710 లావాదేవీలు చేశామని వివరించారు.

ట‌మాటా సూప్‌!

 



వేసవిలో దాహార్తి తీర్చుకోవడానికి ఎలా కూల్ డ్రింక్స్, మజ్జిగ, చెరకు రసం వంటి వాటిని తాగడానికి ఇష్టపడతామో.. అలాగే వర్షాకాలం వేడి వేడిగా బజ్జిలు, సుప్ లు కావాలనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధుల నుంచి కాపాడడానికి రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ టమాటా సూప్ తో . అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే  రుచికరంగా టమాటా సూప్ ఎలా తయారు చేసుకోవాలో  చూద్దాం!

కావ‌ల్సిన ప‌దార్థాలు:

టమాటాలు- 8

మిరియాల పొడి ఒక టీ స్పూన్

కారం- ఒక టీ స్పూన్

జీలకర్ర పొడి ఒక టీ స్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్

నీళ్లు – 4 క‌ప్పులు

ఉప్పు –  తగినంత

తయారీ విధానం: ముందుగా ప్రెష్ గా ఉన్న టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి రెండు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీలో నాలుగు కప్పుల నీటిని కలిపి స్ట‌వ్‌ మీద పెట్టాలి. అది బాగా మారుతున్న సమయంలో మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం స్విమ్ లో పెట్టి.. మరికొంచెం సేపు మరిగించాలి. తర్వాత స్టౌ మీద నుంచి దింపి.. దానిలో పుదీనా వేసుకుని వేడివేడిగా బ్రేక్ ఫస్ట్ తో పాటు ఒక కప్ టమాటా సూప్ సేవిస్తే.. మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు:

*ట‌మాటాల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపిస్తాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులును రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అందుకని టమాటాని నేరుగా తాగలేని వారు సూప్ గా తయారు చేసుకుని తాగడం మంచిది.

*ట‌మాటా సూప్‌లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, విట‌మిన్లు ఎ, సి, కె, పొటాషియం, కెరోటినాయిడ్స్‌, లైకోపీన్ వంటి పోష‌కాలు ఉన్నాయి ఇవి వ్యాధుల బారిన పడకుండా చూస్తాయి చర్మానికి మంచి పోష‌ణ‌ను ఇస్తాయి.

*ట‌మాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేసి క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వాపుల‌ను త‌గ్గిస్తాయి.

*రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ ట‌మాటా సూప్ మంచి పాత్రను పోషిస్తుంది. రోజూ క‌ప్పు మోతాదులో ట‌మాటా సూప్‌ను తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు దరిచేరవు

మోటరోలా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్

 


మోటరోలా తాజాగా  మోటో జీ50 5జీ స్మార్ట్​ఫోన్​ను ఆస్ట్రేలియన్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్​ చేస్తే ​ రెండు రోజుల బ్యాటరీ లైఫ్​ ఇస్తుంది. కొత్త మోటో జీ50 సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 4జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌ AUD 399 (సుమారు రూ. 21,500) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. మోటో జీ50 5జీ మెటోరైట్ గ్రే కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. లెనోవా ఆస్ట్రేలియా సైట్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో లాంచ్​ అయిన ఈ ఫోన్​ భారత్​లో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. మోటో జీ50 5జీ స్మార్ట్​ఫోన్ ​ఆండ్రాయిడ్​ 11పై రన్ అవుతుంది. ఇది 6.5 -అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. హైబ్రిడ్ మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ సహాయంతో దీని స్టోరేజ్​ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే.. మోటో G50 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా వంటివి చేర్చింది. ఇక, దీని వెనుకవైపు LED ఫ్లాష్ కెమెరాను కూడా అందించింది. బ్యాక్​ కెమెరా మోడ్‌లలో మాక్రో వీడియో, స్లో మోషన్ వీడియో, టైమ్‌లాప్స్, హైపర్‌లాప్స్, స్పాట్ కలర్ వంటివి అందించింది. దీని ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. ఇక, ఈ స్మార్ట్​ఫోన్​లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 mAh బ్యాటరీని చేర్చింది. ఇది రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని పేర్కొంది. బాక్స్ లోపల 10W ఛార్జర్​ను అందించింది. ఇక, దీని పవర్ బటన్ క్రింద సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను కూడా చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. యూఎస్​బీ టైప్-సి పోర్ట్, ఎన్​ఎఫ్​సీ, వైఫై ఏసీ, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, జీపీఎస్​, 5జీ వంటివి అందించింది.

మంచి వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ కొనాలా?!

 

వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ విషయంలో అధిక శాతం మంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య బ్యాటరీ బ్యాకప్. అనేక మోడల్స్ గంటల తరబడి బ్యాకప్ వచ్చే విధంగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా ఎక్కువ బ్యాకప్ ఇచ్చేది కొన్ని మోడల్స్ మాత్రమే.

boAt Rockerz 385v2 Wireless Neckband with Qualcomm CVC & aptX, Up to 40H Nonstop Playback, BT V5.0, Type C Interface, Magnetic Earbuds, IPX6 Water Resistance, ASAP Fast Charge(Active Black) అలాంటి వాటిలో ఒకటి.

దీనిని ప్రాక్టికల్ గా పరిశీలించినప్పుడు ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత పది రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ లభించింది. మోడరేట్‌గా రోజుకి 3-4 గంటల పాటు వాడినప్పుడు లభించిన ఫలితాలు ఇవి. మీ వాడకం ఎక్కువ ఉంటే ఆ సమయం మారవచ్చు.

డిస్కౌంట్ తో రూ. 1,799కి ఈ మోడల్‌ని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు: https://amzn.to/3mtHCl4 వాయిస్ కాల్స్ కూడా స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా లభిస్తుంది. ఆడియో పాటలు వినేటప్పుడు తగినంత bass కూడా పొందవచ్చు. 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 10 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. గంట ఛార్జింగ్ తో 40 గంటల బ్యాటరీ బ్యాకప్ పొందొచ్చు. చెవిలో నుండి జారి పోతాయని ఇయర్ బడ్స్ ఇష్టపడని వారు ఈ నెక్‌బ్యాండ్ ప్రయత్నించవచ్చు.

పాలిచ్చే తల్లులకు పోష్టికాహారం !

 

Wednesday, August 25, 2021

'క్లౌడ్'కు నిపుణుల కొరత !

 

కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరిగింది. దాంతోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌కు గిరాకీ ఎక్కువైంది. ఇంతకుముందు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌), డేటా అనలిటిక్స్ తదితర సాఫ్ట్‌వేర్‌లకు డిమాండ్ ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణుల అభివృద్ధి కోసం గతేడాది ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సదస్సు నిర్వహించింది. తాజాగా క్లౌడ్ ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ పెరుగుతున్నది. దీంతో క్లౌడ్ ప్రస్తుతం మెయిన్‌స్ట్రీమ్‌, ఫౌండేషనల్ డిజిటల్ టెక్నాలజీగా అవతరించింది. తత్ఫలితంగా ఐటీ సంస్థలు క్లౌడ్ సొల్యూషన్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కరోనా వల్ల గతేడాదిలో భారత్‌లోనే 3.8 లక్షల మంది క్లౌడ్ సొల్యూషన్స్ నిపుణులకు డిమాండ్ వచ్చింది. 2019తో పోలిస్తే 40 శాతం ఎక్కువ. కానీ, 1.15 లక్షల మంది నిపుణులను మాత్రమే ఇండియన్ ఐటీ సంస్థలు నియమించుకోగలిగాయి. మిగతా 2.65 లక్షల పోస్టులు అలాగే ఖాళీగా ఉన్నాయని టీసీఎస్‌, యాక్సెంజర్ భాగస్వామ్యంతో నాస్కామ్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. క్లౌడ్ సొల్యూషన్స్ నిపుణుల కొరత వచ్చే నాలుగేండ్ల (2025) లో 7.69 లక్షలకు చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. అదే ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు క్లౌడ్ నిపుణుల కొరత 20 లక్షలు దాటుతుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ సొల్యూషన్స్‌లో శరవేగంగా టాలెంట్ పూల్ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించుకోవాలని నాస్కామ్ నివేదిక సూచించింది. ఈ ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగితే క్లౌడ్ టాలెంట్ పూల్‌లో భారత్‌.. ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరవచ్చు. 17-18 లక్షల మంది క్లౌడ్ నిపుణులను ఇండియన్ ఐటీ రంగం పెంచుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో క్లౌడ్ విభాగంలో 6.08 లక్షల మంది నిపుణులతో భారత్ మూడోస్థానంలో ఉంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సొల్యూషన్స్ కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల డిమాండ్‌ 2022 నాటికి 20 శాతం ఎక్కువై రెవెన్యూ 398 బిలియన్ల డాలర్లకు చేరుతుందని వరల్డ్ వైడ్ ఎండ్ యూజర్ గార్టనర్ పేర్కొంది. నాస్కామ్ మరో నివేదిక ప్రకారం 2025 నాటికి గ్లోబల్ క్లౌడ్ టర్నోవర్ 800 బిలియన్ల డాలర్లకు చేరుతుందని అంచనా. భారత్‌లో వచ్చే ఏడాది నాటికి 26% గ్రోత్‌తో 5.6 బిలియన్ డాలర్లకు చేరుతుంది.

ఆండ్రాయిడ్ ఫోన్‌ ట్రిక్ లు

 


టెక్నాలజీని వాడుకోవడం తెలియాలి కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. మీ దగ్గర అదనంగా ఒక ఫోన్‌ ఉంటే దానిని అత్యంత సులభంగా మౌస్‌గా.. లేదా వెబ్‌క్యామ్‌గా లేదా సెకండ్ డిస్‌ప్లేగా కూడా యూజ్ చెయ్యొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఉన్న అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే.. అవి లక్షలకొద్దీ అప్లికేషన్లకు సపోర్ట్ చేస్తాయి. ఈ అప్లికేషన్ల సహాయంతో మీ స్మార్ట్ ఫోన్ ఏదైనా చేయగలదు. మీ కంప్యూటర్ కు మౌస్‌గా మారగలదు. మీరు కావాలనుకుంటే అది వెబ్‌క్యామ్‌గా కూడా పని చేయగలదు. వైర్ కనెక్షన్ లేకుండా కూడా మీ ఫోన్‌ను మీ విండోస్ కంప్యూటర్  లేదా మ్యాక్‌ కంప్యూటర్లకు కనెక్ట్ చేయొచ్చు. ఇందుకు, కింద పేర్కొన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.

* మీ ఫోన్‌ను మౌస్ లేదా కీబోర్డ్‌గా ఉపయోగించడానికి స్టెప్స్:

స్టెప్ 1: మీ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి రిమోట్‌మౌస్‌ను డౌన్‌లోడ్ చేయండి. అలాగే, మీ PC లో రిమోట్‌మౌస్‌ సర్వర్ ను https://www.remotemouse.net/ నుంచి డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 2: రిమోట్‌మౌస్‌ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 3: మీ మొబైల్ ఫోన్ లో రిమోట్‌మౌస్‌ యాప్‌ను లాంచ్ చేయండి. ఈ మొబైల్ యాప్ లో మీ PC కోసం స్కాన్ చేయండి. అప్పుడు మీ ఫోన్ స్క్రీన్‌లోని డివైజ్‌ల లిస్టులో మీ PC పేరు కనిపిస్తుంది. కనెక్ట్ చేయడానికి మీ PC పేరుపై క్లిక్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు ఫోన్‌తో మీ PC కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత మీరు మీ ఫోన్‌ను టచ్‌ప్యాడ్‌గా, కీబోర్డ్‌గా ఉపయోగించవచ్చు. అలాగే మీ PC ని దూరం నుంచే షట్‌డౌన్ చేయడం, ఫంక్షన్ కీలను ఉపయోగించడం వంటి అనేక ఫీచర్‌లను ఉపయోగించవచ్చు.

* మీ ఫోన్‌ను సెకండ్ డిస్‌ప్లే/మానిటర్‌గా ఉపయోగించడానికి స్టెప్స్:

స్టెప్ 1: మీ PC, ఆండ్రాయిడ్ ఫోన్‌లో DuetDisplay ని డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 2: యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. తరువాత DuetDisplay యాప్ పని చేయాలంటే మీ PC ని రీస్టార్ట్ చేయాలి.

స్టెప్ 3: ఇప్పుడు మీ PC, Android డివైజ్‌లలో డ్యూయెట్ డిస్‌ప్లే యాప్‌ని లాంచ్ చేయండి. మీ విండోస్‌లో ఆండ్రాయిడ్‌ని సెలక్ట్ చేసుకోండి. వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడానికి 'ఎయిర్' ట్యాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

* మీ ఫోన్‌ను వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడానికి స్టెప్స్:

స్టెప్ 1: ప్లే స్టోర్ నుంచి ఇరియున్ వెబ్‌క్యామ్(Iriun Webcam )ను డౌన్‌లోడ్ చేయండి. PC క్లయింట్‌ను Iriun Webcam అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయండి.

స్టెప్ 2: యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. వాటిని మీ ఫోన్‌, PC లలో లాంచ్ చేయండి.

స్టెప్ 3: PC లో యాప్ రన్ చేయడానికి మీ సిస్టమ్ యాప్ ట్రేలోని Iriun Webcam ఐకాన్‌పై డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు యాప్ మీ PC కి రెండవ కెమెరాగా పని చేస్తుంది.

అక్టోబర్ 10న 'మా` ఎన్నికలు


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించ నున్నట్టు 'మా`క్రమశిక్షణ కమిటీ తెలిపింది. ఇటీవల ఆన్‌లైన్‌ వేదికగా మా సర్వసభ్య సమావేశం జరిగింది. మా కార్యవర్గ ఎన్నికల నిర్వహణ పై ప్రధానంగా ఈ చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌ కూడా తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని మా క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇక అధ్యక్ష అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు, హేమలు ఉన్నట్టు వారు ప్రకటించారు. 

ఈ వాచీ రూ.5 కోట్ల పైమాటే !

  

ఐపీఎల్ పుణ్యమా అని రాత్రికి రాత్రి స్టార్లుగా మారిపోయిన క్రికెటర్లలో పాండ్యా సోదరులు (హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య) ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాండ్యా సోదరులు ముంబై ఇండియన్స్ జట్టులో చేరడంతో వారి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ ఫ్లాట్లు, విలాసవంతమైన జీవన శైలి, విలువైన కార్లు, బ్రాండెడ్‌ వస్తువులకు లెక్కే లేదు. తాజాగా, పాండ్యా సోదరుల్లో చిన్నవాడైన హార్ధిక్‌ పాండ్య కళ్లు బైర్లు కమ్మే రేట్‌ ట్యాగ్‌ ఉన్న రిస్ట్‌ వాచ్‌ని సొంతం చేసుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు. హార్ధిక్‌.. పటేక్ ఫిలిప్పీ నాటిలస్ ప్లాటినమ్ 5711 అనే బ్రాండెడ్‌ వాచ్‌ను కొనుగోలు చేశాడు. ఈ వాచీ డయల్ చుట్టూ అత్యంత అరుదైన 32 పచ్చ మరకత రాళ్లను అమర్చారు. వాచ్ మొత్తం ప్లాటినంతో తయారైంది. దీని ధర రూ.5 కోట్ల పైమాటే ! ఇది 5711 రేంజ్ అరుదైన వాచ్‌. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచీల్లో ఇదొకటి. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని హార్ధిక​ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. 

కిరాణా వర్తకులకు బంపర్ ఆఫర్


కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ నూతనంగా ఒక 'క్రెడిట్‌ ప్రోగ్రామ్‌'ను ప్రకటించింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్‌ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది.

101 జిల్లాల అందగాడు

 

'ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి' అంటూ వేడుకుంటున్నారు అవసరాల శ్రీనివాస్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. రుహానీశర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా, బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ''బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణ పాత్రలో అవసరాల, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ కనిపించనున్నారు. అవసరాల కథానాయకుడిగా నటించడంతోపాటు, అందరికీ కడుపుబ్బా నవ్వించే ఈ కథనీ అందించార''ని చిత్ర బృందం తెలిపింది. కడుపుబ్బా నవ్వించే ఈ మూవీ ట్రైలర్‌ మీరూ చూసేయండి. 

ఎప్పటికీ ఉండిపోతుంది : డబ్ల్యూహెచ్ఓ


భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని, మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండిపోయే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా, వ్యాధి తీవ్రత అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. గతంలో ఈ విషయంలో పలువురు శాస్త్రవేత్తలు స్పందించిన సంగతి తెలిసిందే. కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సార్స్ కోవి-2ను అంతం చేసే అవకాశం లేదా ? అని ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా…మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. నిర్మూలించడం కుదరదని వారిలో 90 శాతానికి పైగా సమాధానం ఇచ్చారు.

మరోవైపు భారత్ లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. గత 24 గంటల్లో 37,593 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం…24 గంటల్లో 648 మంది చనిపోయారు. ఎక్కువగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కేరళలో 24,296 కొత్త కోవిడ్ కేసులు రావడంతో, మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 38 లక్షల 51 వేల 984 కు పెరిగింది. మరో 173 మంది కరోనా కారణంగా మరణించగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 19,757కి చేరుకుంది.

ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి


సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నంబరు జాతీయ రహదారిపై గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అవడంతో యువతి మృతదేహం శకలాల్లో ఇరుక్కుపోయింది. బాధితులను హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన స్నేహితులుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువతి నిహారిక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రేన్ సాయంతో కారును పక్కకు తప్పించి ఆ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించారు.

Tuesday, August 24, 2021

వాట్సప్‌లో పేమెంట్ షార్ట్‌కట్‌

 


వాట్సప్ ఇటీవలే పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌తో పాటు.. ఐవోఎస్ యూజర్లకు కూడా పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ వాలెట్స్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్‌కు పోటీగా వాట్సప్ పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఆ పేమెంట్ ఆప్షన్‌లో ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్స్‌, థీమ్స్‌ను ఇటీవలే యాడ్ చేసిన వాట్సప్.. తాజాగా పేమెంట్ షార్ట్‌కట్‌ను తీసుకొచ్చింది. వాట్సప్ చాట్ బార్‌లోనే పేమెంట్ షార్ట్‌కట్‌ను వాట్సప్ తీసుకురానుంది. అయితే.. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా వర్షన్‌లో విడుదల చేసి టెస్ట్ చేయనుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అయితే.. ఇంకా ఇది డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉందట. ఈ పేమెంట్ ఫీచర్‌తో వాట్సప్ యూజర్లు.. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనీ రిసీవ్ చేసుకోవచ్చు. ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుందట. అయితే.. ఐవోఎస్‌లో కూడా బీటా టెస్టింగ్ చేస్తున్నారు. ఈ ఫీచర్‌తో పాటు.. వాట్సప్‌.. మల్టీ డివైజ్ 2.0 మీద వర్క్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో ఐపాడ్ లాంటి డివైజ్‌లలో కూడా వాట్సప్‌ను లింక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్‌లో కూడా వాట్సప్‌ను లింక్ చేసేందుకు వాట్సప్ వర్క్ చేస్తోంది.

Popular Posts