Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, April 30, 2022

ఆగస్టులో చంద్రయాన్‌-3 కి సన్నాహాలు..!


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా  సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి వచ్చే ఆగస్టులో చంద్రయాన్‌-3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యమైంది. దీనికి సంబంధించిన తొలి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా ఇస్రో 'స్పేస్‌ ఆన్‌ వీల్స్‌' పేరుతో మొత్తం 75 ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీలో చంద్రయాన్‌-3 చిత్రాలను పొందుపరిచారు. చంద్రుడి ఉపరితలంపై కాలుమోపనున్న ల్యాండర్‌, ఆదిత్య-ఎల్‌1 మిషన్‌తోపాటు గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా దానిలో తెలిపారు. ఈ వివరాలను అనుసరించి వచ్చే ఆగస్టు నెలలో చంద్రయాన్‌-3 ని విజయవంతంగా పూర్తిచేయాలన్న సంకల్పంతో షార్‌ శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.

రియల్ మీ నాలుగవ వార్షికోత్సవం సేల్ !


రియల్ మీ నాల్గవ వార్షికోత్సవం  సందర్భంగా సేల్ ను ప్రారంభించింది. ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమైన ఈ సేల్ మే 9 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో అన్ని ప్రొడక్ట్స్ పై రూ.7,000 వరకు తగ్గింపును అందజేస్తున్నారు. ఈ సేల్‌లో, రియల్‌మీ ICICI తో జతకట్టింది. రియల్ మీ యానివర్సరీ సేల్‌లో కొనుగోలు సమయంలో మీరు ICICI బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు రూ. 7,000 వరకు తగ్గింపు లభిస్తుంది. realme.comలో రియల్‌మీ వార్షికోత్సవ విక్రయం గురించి వివరంగా ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం.. Realme GT Neo 3 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ICICI బ్యాంక్ రూ. 7,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme GT Neo 3ని ఇటీవల విడుదల చేసింది. ఈ ఫోన్ విక్రయం మే 4 నుంచి Flipkart, realme.com ద్వారా జరుగుతుంది. రియాలిటీ GT నియో 3 స్మార్ట్‌ఫోన్ అనేక వేరియంట్‌లలో విడుదల చేయబడింది. 150W ఫాస్ట్ ఛార్జింగ్, 12 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ.42,999. ICICI బ్యాంక్ కార్డ్, SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా YONO SBI ద్వారా ఫోన్ కొనుగోలుపై రూ.7,000 తక్షణ తగ్గింపు అందించబడుతోంది. ICICI నెట్ బ్యాంకింగ్ ఆఫర్ కింద, ఈ ఫోన్‌పై 5 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. Realme 9 Pro Plus 5G (realme 9 Pro + 5G) ఫోన్ ధర రూ. 24,999. MobiKwik ద్వారా ఫోన్ కొనుగోలుపై 500 శాతం తగ్గింపు మరియు ICICI నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 3,000 వరకు అందించబడుతోంది.

షావోమీ బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న నగదును ఫ్రీజ్‌ చేసిన ఈడీ


షావోమికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాక్‌ ఇచ్చింది. దేశంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో షావోమి ఇండియాకి చెందిన రూ. 5 వేల 5 వందల 51 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్‌ చేసింది. నాలుగు బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న నగదును ఫ్రీజ్‌ చేసింది. అప్పటికే ఈ చైనా ఫోన్‌ తయారీ సంస్థ భారీగా నగదును విదేశాలకు తరలించింది. 2014 నుంచి దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షావోమి పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. గత ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. భారీగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో షావోమి ఏటా 34వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ క్యారియర్లతో మొబైల్‌ ఫోన్లు తయారు చేయిస్తుందీ షావోమి. షావోమి చైనాతో వీటికి ఒప్పందం ఉంది. షావోమీ ఇండియాతో వీటికి ఎలాంటి ఒప్పందం ఉండదు. ఈ సంస్థలకు ఎలాంటి టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ను షావోమి ఇండియా సమకూర్చదు. కానీ మూడు విదేశీ సంస్థలకు షావోమీ ఇండియా భారీగా నగదును మళ్లించింది. వాటి నుంచి ఎలాంటి సేవలు పొందకపోయినా నగదును పొందినట్లు చూపి నగదు తరలించింది. ఇందుకోసం తప్పుడు పత్రాలు సృష్టించింది. బ్యాంకులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఇది ఫెమా నిబంధనలను ఉల్లంఘించడమేనని ఈడీ తేల్చింది. ఆ సంస్థ గ్లోబల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ మనుకుమార్‌ జైన్‌ను కూడా ఇటీవల ఈడీ విచారించింది. విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టనుంది. అయితే ఇప్పటికే వివిధ ఖాతాల నుంచి నగదును మళ్లించిన షావోమి ఇండియా మిగిలిన మొత్తాన్ని కూడా దేశం దాటిస్తుందేమోనన్న అనుమానంతో 5వేల కోట్లకు పైగా నగదును ఈడీ ఫ్రీజ్‌ చేయించింది.

నెట్‌ఫ్లిక్స్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు


డీటీహెచ్ తో పాటు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా ఎయిర్‌టెల్ తన సేవలను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ సర్వీస్  లతో వివిధ రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలతో పాటుగా వృత్తిపరమైన ప్రయోజనాలను కూడా కలుపుకొని అందిస్తాయి. ఇతర ISPల మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా తమ ప్లాన్‌లతో వివిధ రకాల OTT సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు తన అభివృద్ధిలో భాగంగా యూజర్లను ఆకట్టుకోవడానికి తన ప్లాట్‌ఫారమ్‌లోని రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను బండిల్ చేయబడి అందిస్తున్నది.  ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌తో 300 Mbps వేగంతో 'ప్రొఫెషనల్' ప్లాన్‌ను అందిస్తున్నది. దీనిని వినియోగదారులు నెలకు రూ.1,498 ధర వద్ద పొందవచ్చు. ఇది 300 Mbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ అపరిమిత ప్లాన్ లో FUP డేటా 3500GB లేదా 3.5TB కి పరిమితం చేయబడి ఉంటుంది అని గమనించండి. ఈ ప్లాన్ యొక్క OTT ప్రయోజనాలలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్ మరియు షా అకాడమీ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. ఇది తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో 'ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్' ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 1Gbps వేగంతో 'ఇన్ఫినిటీ ప్లాన్' పేరుతో మరొక అపరిమిత డేటా ప్లాన్‌ను అందిస్తుంది. 'ఇన్ఫినిటీ' ప్లాన్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ని కలిగి ఉండాలి. ఈ ప్లాన్ నెలకు రూ.3,999 ధరతో 1Gbps హై-స్పీడ్ తో అపరిమిత డేటాను అందిస్తుంది. అన్ని అపరిమిత ప్లాన్‌ల వలె ఇది కూడా 3500GB లేదా 3.5TB FUP డేటాకు పరిమితం చేయబడి ఉంది. ఈ ప్లాన్ తో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి కొన్ని ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటుగా కంపెనీ ఇప్పుడు కొత్తగా ఈ ప్లాన్ కు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ని కూడా జోడించబడింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌లోని ప్రొఫెషనల్ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ యాక్సెస్ ఉంటుంది. అయితే ఇన్ఫినిటీ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం యాక్సెస్ ఉంటుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను విడిగా కొనుగోలు చేయాలని అనుకుంటే కనుక స్టాండర్డ్ ప్లాన్ ను రూ.199 ధర వద్ద పొందవచ్చు. ఇది ఒక పరికరంలో 480p రిజల్యూషన్‌లో వీడియో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. అలాగే ప్రీమియం ప్లాన్ గరిష్టంగా నాలుగు పరికరాల్లో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. 

వాట్సాప్ లో కొత్తగా 8 ఏమోజీలు ?


యూజర్లకు లేటెస్టు అప్ డేట్స్ ను పరిచయడం చేయడంలో వాట్సాప్ ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో అప్ డేట్స్ చేసిన వాట్సాప్ఇ ప్పుడు సరికొత్తగా మరిన్ని రియాక్షన్స్ ఎమోజీలను ఇవ్వనుంది. గతంలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎమోజీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో వాట్సాప్ కూడా ఎమోజీలను యూజర్లకు పరిచయం చేయునున్నట్లు సమాచారం. వాట్సాప్ లో స్టేస్ అప్ డేట్ ను చూసేటప్పుడు ఎమోజీని పంపించేందుకు క్విక్ రియాక్షన్ ఫీచర్ పై ఈ మెసేజింగ్ సర్వీసు పనిచేస్తోంది. ఈ ఫంక్షనాలిటీ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్ తోపాటు ఇతర మెటా యాజమాన్య ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. రియాక్షన్స్ ఆప్షన్స్ మొత్తం 8 ఎమోటికాన్ లను యూజర్లకు పరిచయం చేయనుంది. అయితే ఈ క్విక్ రియాక్షన్స్ ఫీచర్ డెవలప్ మెంట్ గురించి వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ ఫ్లాట్ ఫాం క్విక్ రియాక్షన్ ఫీచర్ పై పనిచేస్తోంది. ఇది పర్సనల్ ఎమోజీని మెసేజ్ లా పంపించకుండా స్టేటస్ అప్ డేట్ ద్వారా భావాలను వ్యక్తికపర్చేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లకు ఆకర్షణీయంగా నిలుస్తోంది. వాట్సాప్ లో 8 ఎమోజీలను రియాక్షన్ గా ఉపయోగించడం కోసం కళ్లతో నవ్వుతున్న ముఖం, ఆనందం కన్నీళ్లతో కూడిన ముఖం, నోరు తెరచిన ముఖం, ఏడుపు ముఖం, చేతులు ముడుచుకున్న వ్యక్తి చప్పట్లు కొట్టడం, పార్టీ పాప్పర్, వంద పాయింట్ల ఎమోజీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫీచర్ ఇంకా డెవలప్ లోనే ఉందని…భవిష్యత్తులో కొత్త అప్ డేట్స్ తో అందుబాటులోకి వస్తుందని రిపోర్టు పేర్కొంది. కమ్యూనిటీ ట్యాబ్, ఎమోజీ రియాక్షన్లు, బిగ్ సైజ్ ఫైల్ షేరింగ్ వంటి చాలా ఫీచర్లను తీసుకువస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే వాట్సాప్ ప్రకటించింది. అలాగే సింగిల్ ఆడియో కాల్లో ఒకసారి 32మంది మాట్లాడుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. అయితే ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే లేటెస్ట్ ఐఓఎస్ స్టాండర్ట్ వెర్షన్ విడుదలైనట్లు సమాచారం.

Friday, April 29, 2022

ఒకే నెంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌..!


ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునేలా 'మల్టీడివైజ్ సపోర్ట్‌'  ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ప్రైమరీ అకౌంట్‌ కాకుండా ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌లలో లాగిన్‌ అయ్యే సదుపాయాన్ని కల్పించింది. అయితే, తాజాగా ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను రెండు స్మార్ట్‌ఫోన్లలో వాడే సదుపాయాన్ని కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. వాట్సాప్‌ 'మల్టీ డివైజ్‌ సపోర్టు' సేవలను విస్తరించనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌కు అదనపు హంగులు జోడించాలని వాట్సాప్‌ భావిస్తోంది. యూజర్లు ప్రైమరీ మొబైల్‌ల్లోనే కాకుండా మరో ఫోన్‌/ట్యాబ్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసే సదుపాయాన్ని త్వరలోనే తీసుకురానుంది. ఈ ఫీచర్‌ సాయంతో వాట్సాప్‌ అకౌంట్‌ను మరో ఫోన్‌కు లింక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌ బీటా 2.22.10.13 వెర్షన్‌లలో ఈ ఫీచర్‌ పనిచేయనుందని సమాచారం. దీనికోసం వాట్సాప్‌ ప్రైమరీ అకౌంట్‌ ఉన్న మొబైల్‌ నుంచి లింక్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. సెకండరీ మొబైల్‌లో వాట్సాప్‌ ఓపెన్ చేసినప్పుడు 'రిజిస్టర్ డివైజ్ యాజ్‌ కంపానియన్ ' అనే ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలని వాబీటాఇన్ఫో పేర్కొంది. అయితే, ఈ ఫీచర్‌ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని.. ఫైనల్‌ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చే సమయానికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. కాగా.. ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లలో కనెక్ట్ అయినప్పుడు యూజర్ డేటాకు వాట్సాప్ ఎలాంటి భద్రత కల్పిస్తుందనే దానిపై స్పష్టత రాలేదు.

జనరల్‌ టికెట్ల బుకింగ్ !


జనరల్ బోగీల్లో టికెట్ తెచ్చుకోవాలంటే కష్టమే.. రైలు బయల్దేరే సమయంలోగా స్టేషన్ కు చేరుకోవాలి. గంటల కొద్ది క్యూలో నిలబడాలి. టైమ్ వృథా అవుతుంది. ఈ సమస్యను తొలగించేందుకు భారతీయ రైల్వే  అన్ రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా ఫోన్‌లో జనరల్ టికెట్లు, నెలవారీ సీజనల్ టికెట్లు, ప్లాట్ ఫారమ్ టికెట్లను ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఫోన్‌ యూజర్లు… యాప్‌ స్టోర్‌, విండోస్‌ ఫోన్‌ యూజర్లు.. విండోస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యూటీఎస్అ ప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్‌ నంబర్‌, పేరు, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అప్పుడు మీకు వన్‌టైం పాస్‌వర్డ్‌ వస్తుంది. అంతే మీ టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తయినట్టే. ఇప్పుడు మీరు చేయాల్సిందిల్లా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక.. ఫోన్ నెంబర్, పాస్ వర్డ్‌తో మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. టికెట్‌ బుకింగ్‌ కోసం నార్మల్ ' ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ టికెట్‌ కోసం బుక్‌ అండ్‌ ట్రావెల్‌, ప్రింటెడ్‌ టికెట్‌ కోసం బుక్‌ అండ్‌ ప్రింట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ట్రైన్ ఎక్కే, దిగే స్టేషన్‌ల వివరాలను అందులో నమోదు చేసుకోవాలి. అలాగే ప్రయాణికులకు సంఖ్య, ట్రైన్‌ టైప్‌, ఏ క్లాస్‌ (సెకండ్ క్లాస్‌, అన్‌రిజర్వ్‌డ్‌) వంటి వివరాలను నమోదు చేయాలి.  'Payment Type'లో R-Wallet లేదా ఆన్‌లైన్‌ పేమెంట్‌ సిస్టమ్ (క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌) ఆప్షన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీ ట్రైన్ టికెట్‌లకు ఎంత చెల్లించాలో తెలుసుకోవాలి. అప్పుడు Book Ticket అనే ఆఫ్షన్ పై Click చేయాలి. అంతే మీ ట్రైన్ టికెట్‌ బుక్‌ అవుతుంది. ఒకవేళ మీరు బుకింగ్ చేసుకున్న టికెట్ చూడాలనుకుంటే.. 'Show Ticket' ఆప్షన్‌పై Click చేయాలి. మీ బుకింగ్ టికెట్‌ వివరాలు అక్కడ కనిపిస్తాయి. 'View Ticket'పై క్లిక్‌ చేస్తే ఆ టికెట్ కనిపిస్తుంది. 'Quick Booking' ఆప్షన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న టికెట్‌ల వివరాలను నమోదు చేసుకోవాలి. 'Platform Booking' ద్వారా ప్లాట్‌ఫాం టికెట్‌ కూడా తీసుకునే అవకాశం ఉంది. సీజనల్‌ టికెట్స్‌ మాత్రమే కాదు.. నెలవారీ టికెట్‌ కూడా తీసుకోవచ్చు. అవసరమైతే రెన్యూవల్‌ కూడా చేసుకోవచ్చు. 'QR Booking' ఆప్షన్‌ ద్వారా స్టేషన్‌లోని టికెట్‌ కౌంటర్ల వద్ద QR Codeను Scan చేయడం ద్వారా టికెట్‌ పొందవచ్చు. ఆర్‌-వ్యాలెట్‌ ఆప్షన్‌ కోసం రీఛార్జ్‌ చేసుకోవాలి. రూ.100పై మాత్రమే రీఛార్జ్‌ వీలువుతుంది. ఆన్‌లైన్‌లో లేదా, స్టేషన్‌లోని UTS కౌంటర్‌ వద్ద రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ముందుగా టికెట్ బుకింగ్ చేసుకోవడం కుదరదు. ప్రయాణించే రోజు మాత్రమే టికెట్‌ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ తీసుకున్న గంటలోపే రైలు ఎక్కాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ స్టేషన్లలో మాత్రమే ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవడం వీలవుతుంది. పేపర్‌లెస్‌ టికెట్‌ రద్దు చేయలేం.. స్టేషన్‌ వెలుపల 5 కి.మీల పరిధిలో టికెట్‌ తీసుకునే వీలుంది. అదే స్టేషన్‌ లోపల ఉన్నా, రైల్లో ఉన్నా టికెట్ రద్దు చేయడం కుదరదు. అదే పేపర్ టికెట్ తీసుకుంటే.. స్టేషన్ దగ్గర ఏటీవీఎం/ కో-టీవీఎం, OCR Machines, OTS Booing Counter నుంచి టికెట్‌ Print తీసుకోవచ్చు. మీ ఫోన్‌ నంబర్‌, బుకింగ్‌ ID Number నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్‌ రద్దు చేసుకునే వీలుంది. పేపర్ టికెట్‌ బుకింగ్ చేసుకుంటే.. తప్పకుండా టికెట్ చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఫైన్ కట్టాల్సిందే.

అర గంట ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల ప్రయాణం


టాటా మోటార్స్ మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. టాటా అవిన్య కాన్సెప్ట్‌ను విడుదల చేసింది. అవిన్య సంస్కృత భాషలోని పదం. అవిన్య అంటే ఆవిష్కరణ అని అర్థం. అదే పేరుతో సూపర్ కారును ఆవిష్కరించింది టాటా మోటార్స్. అవిన్య కాన్సెప్ట్ సరికొత్త సదుపాయాలతో ఉండటం విశేషం. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో  భాగంగా టాటా మోటార్స్ నెక్స్ట్‌ జెనరేషన్ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించేందుకు కృషి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు తాము సాధించిన అతిపెద్ద పురోగతిగా టాటామోటార్స్ ప్రకటించింది. అవిన్య కార్ జెన్ 3 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించినది. ఈ కారులోని బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సామర్థ్యం ఉంది. కేవలం 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంటే అరగంట ఛార్జింగ్‌తో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈజీగా వెళ్లిపోవచ్చు.  ఇది కొత్త తరం టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపి రూపొందించిన ఎలక్ట్రిక్ కార్. కస్టమర్లకు అత్యంత ప్రీమియం ఫీచర్స్‌తో, సరళమైన, ప్రశాంతమైన కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన కార్ 2025 లోగా మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని టాటా మోటార్స్ ప్రకటించింది. అవిన్య కాన్సెప్ట్‌ను రూపొందిస్తున్నప్పుడు, ఎందులో లేని విధంగా మొబిలిటీ సొల్యూషన్‌ను అందించాలన్నది ప్రధాన ఆలోచన అని, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో చక్కగా రూపొందించబడిన ఈ కారు కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిస్తుందని, ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరణను వేగవంతం చేయడమే కాకుండా, ఈ ఉద్యమానికి తాము నాయకత్వం వహించేలా సృష్టించామని టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అవిన్య కారులో బటర్‌ఫ్లై డోర్స్ ఆకట్టుకుంటాయి. ఈ కారు తయారీకి లైట్‌వెయిట్ మెటీరియల్స్ ఉపయోగిస్తారు. దీని వల్ల కారు బరువు తక్కువగా ఉంటుంది. కారు ఇంటీరియర్స్ అద్భుతంగా ఉన్నాయి. కారు స్టీరింగ్ నుంచి సీటింగ్ వరకు అంతా సరికొత్తగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం టాటా మోటార్స్ Curvv పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ట్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌ సెర్చ్‌లో మీ మొబైల్ నంబర్‌ కనిపిస్తుందా ?


గూగుల్ సెర్చ్ లో మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుందా? అయితే తస్మాత్ జాగ్రత్త ! గూగుల్ సెర్చ్‌లో ఇండెక్స్ అయిన మొబైల్ నెంబర్‌ సహా ఇతర వ్యక్తిగత వివరాలను డిలీట్ చేసుకోవచ్చు. చాలామందికి తమ మొబైల్ నెంబర్ గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తుందని తెలియకపోవచ్చు. మీకు తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలను ఏదో ఒకచోట ఆన్ లైన్లలో ఇచ్చి ఉంటారు. అలా మీ వ్యక్తిగత వివరాలు గూగుల్ లో బహిర్గతమవుతుంటాయి. గూగుల్ లో స్టోర్ అయిన మీ పర్సనల్ వివరాలను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్ కు అనేక అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ యూజర్ల అభ్యర్థనల మేరకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఫోన్ నెంబర్లు, చిరునామా వంటి వివరాలను డిలీట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గూగుల్ సెర్చ్‌లో ఆర్థికపరమైన వివరాలను మాత్రమే డిలీట్ చేయమని అభ్యర్థనలు వచ్చేవి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను గూగుల్ డిలీట్ చేస్తోంది. ఇటీవలే గూగుల్ పాలసీని మార్చేసింది. ఆ స్థానంలో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లాంటి వ్యక్తిగత వివరాలను గూగుల్ సెర్చ్ నుంచి తొలగించేందుకు గతంలో అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఆ వెసులుబాటును కల్పిస్తున్నట్టు గూగుల్ బ్లాగ్‌స్పాట్‌లో తెలిపింది. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ వివరాలను డిలీట్ చేయాలంటూ అభ్యర్థనలు వెల్లువెత్తడంతో గూగుల్ ఈ మేరకు డిలీట్ చేయాలని నిర్ణయం తీసుకుందని గూగుల్ గ్లోబల్ పాలసీ హెడ్ మిచెల్లీ చాంగ్ తెలిపారు. గూగుల్‌ సెర్చ్‌లో మీ వ్యక్తిగత వివరాలను తొలగించాలంటే మీ కోసం గూగుల్ వెబ్ పేజీలను ఫిల్టర్ చేస్తుంది. మీ వ్యక్తిగత వివరాలు ఏదైనా ప్రభుత్వ వెబ్ సైట్లో ఉంటే మాత్రం గూగుల్ ఆ వివరాలను తొలగించలేదు. గూగుల్ సెర్చ్ లో కనిపించే వివరాలను మాత్రమే డిలీట్ చేయగలదు. వాస్తవానికి మీ వివరాలు పూర్తిగా ఇంటర్నెట్‌ నుంచి తొలగిపోవని గుర్తించుకోవాలి. ఎందుకో తెలుసా.. గూగుల్‌ మాదిరి అనేక సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. ఆ సెర్చ్‌ రిజిల్ట్స్‌లో మీ పర్సనల్ డేటా కనిపించే అవకాశం లేకపోలేదు. మీ ఫోన్‌ నంబర్‌ నమోదు చేసుకున్న వెబ్‌సైట్‌ను సంప్రదించండి. మీ వ్యక్తిగత వివరాలను తొలగించాలని చెప్పండి. అప్పుడు మాత్రమే మీ వివరాలను ఆయా గూగుల సెర్చ్ లో నుంచి తొలగించే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అతి పెద్ద రెండో గూగుల్‌ కార్యాలయం


అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్‌ క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలి నానక్ రామ్ గూడ వేదిక కానుంది. దాదాపు 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. దీనికి ఈరోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భవన డిజైన్ ను ఆయన ఆవిష్కరించారు. దీని ద్వారా యువతకు ఐటీ ఉద్యోగాలు రానున్నాయి. 2015లో యూఎస్ లోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. ఈ సమయంలోనే సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం జరిగింది. ఇప్పటికే మహానగరంలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలాన్ని గూగుల్‌ 2019లో కొనుగోలు చేసింది. దీని ద్వారా దాదాపు 30 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేయడానికి వీలుగా భవనాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించాలని గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ తో కలిసి గూగుల్ పని చేయనుంది. ఇందులో యూఎక్స్ డిజైన్, ఐటీ సపోర్టు, ఐటీ ఆటోమేషన్, అనలిటిక్స్, ప్రాజెక్టు మేనేజ్ మెంట్ ఇతర విభాగాల్లో అభ్యర్థులకు శిక్షణనివ్వబడుతుంది ఇలా శిక్షణ పొందిన అభ్యర్థులకు వివిధ సంస్థలకు అనుసంధానం చేస్తారు. ఇందులో మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు మరింత మెరుగ్గా నిర్వహించుకొనేందుకు మద్దతు సైతం అందిస్తారు. గూగుల్ శాశ్వత క్యాంపస్ నిర్మాణంతో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత అందుతాయని అంచనాలు నెలకొన్నాయి. గూగుల్ కెరీర్ సర్టిఫికేట్ ద్వారా ఐటీ సపోర్టు అందించనుంది రెండో అతిపెద్ద క్యాంపస్ రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి తేనుందని అంచన.

కారు మైలేజ్ రావడం లేదా ?


కార్ల సంస్థలు మైలేజ్ ఎక్కువగా వచ్చే విధంగా తమ కార్లను తయారు చేసేందుకు దృష్టి సాధిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో కార్లను వినియోగించేవారు ఎక్కువ ధరతో పాటు మైలేజ్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం BS-4, BS-6 కార్ల ను కాలుష్య నియంత్రణ ఉండే విధంగా తయారు చేస్తున్నారు. అయితే కొన్ని పద్ధతులను పాటించడం వల్ల కార్లు మైలేజ్ పెంచుకోవచ్చును. మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏ సీ ఆన్ లో ఉంచకూడదు. ఎందుకంటే AC రన్ చేయడం వల్ల కార్ మైలేజ్ 30 శాతం వరకు తగ్గిపోతుంది. కారు పని తీరును బట్టి రెగ్యులర్ గా  సర్వీస్ చేయించడం చాలా అవసరం. ఇది మంచి మైలేజీ ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. టీం ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ ను క్లీన్ చేస్తూ ఉండడం వల్ల ఇంధన మైలేజ్ పెరుగుతుంది. ఎక్కువ దినాలకు ఫుల్ ట్యాంక్ పట్టిస్తూ ఉంటారు. అయితే ఇలా పట్టించడం చాలా మైలేజ్ తగ్గిపోవడానికి కారణం అవుతుందట. ఎందుకంటే ఇంధన లోడ్ ఎక్కువ అయినప్పుడు మైలేజ్ తక్కువ అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. డ్రైవ్ చేసే కార్ లోనే టైర్లలో గాలి పీడనం సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైర్లలో ఉండాల్సిన గాలి తక్కువగా ఉన్నట్లు అయితే రన్నింగ్ రోడ్డు పెరిగి మైలేజ్ తగ్గుతుంది. మితిమీరిన వేగంగా వెళ్లకుండా.. ఆ సందర్భాలలో బ్రేక్ లను వేయకుండా ఉండడంవల్ల ఇంధనం మైలేజ్ పెరుగుతుంది. హైవేల పైన ఎక్కువగా వేగంతో వెళ్ళినట్లయితే 30 శాతం వరకు మైలేజ్ కోల్పోతాము. సిటీ రోడ్లలో అనవసరంగా బ్రేకులు వేయడం వల్ల 5% మైలేజ్ ను కోల్పోతాము.

Thursday, April 28, 2022

అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వాలిడిటీని తగ్గించిన వోడాఫోన్ ఐడియా


వినియోగదారులను ఆకట్టుకోవడానికి Vi టెల్కో పోస్ట్‌ పెయిడ్ ప్లాన్‌లతో అమెజాన్ ప్రైమ్ యొక్క సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చెల్లుబాటును టెల్కో తగ్గించింది. ఏప్రిల్ 18న తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అందించే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ చెల్లుబాటులో భారతీ ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. దానిని అనుసరించి వోడాఫోన్ ఐడియా కూడా తన యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అందించే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ వాలిడిటీలో మార్పులను తీసుకొనివచ్చింది. వోడాఫోన్ ఐడియా(Vi) వినియోగదారులు ఎంచుకునే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో ఇకపై సంవత్సరం చెల్లుబాటుతో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని పొందలేరు. అయితే దీనికి బదులుగా వారు ఇప్పుడు ఆరు నెలల వాలిడిటీతో సబ్‌స్క్రిప్షన్ ను పొందుతారు. ఈ మార్పు ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని టెల్కో వెబ్‌సైట్ చెబుతోంది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు అందించే ఇతర ప్రయోజనాల యొక్క వాలిడిటీని కంపెనీ మార్చలేదు. Vi యొక్క వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు, ఫ్యామిలీ ప్లాన్‌లు లేదా REDX ప్లాన్‌లు అన్ని కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యొక్క చెల్లుబాటును ఆరు నెలలకు తగ్గించబడింది.

రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ !


రూ.10,000 లోపు బడ్జెట్‌లో కంపెనీలు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేస్తుంటాయి. ఇటీవల రిలీజ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్లలో భారీ బ్యాటరీ, మంచి కెమెరా, ఎక్కువగా ర్యామ్ ఉంటోంది. బడ్జెట్ రూ.10,000 లోపే అయినా ఈ ప్రైస్‌లోనే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరా, 4జీబీ ర్యామ్ లాంటి ఫీచర్స్ అందిస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో రూ.10,000 లోపు మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.

Redmi 10: రెడ్‌మీ 10 సిరీస్‌లో రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ గత నెలలో లాంఛ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఆఫర్‌లో రూ.10,000 లోపే కొనొచ్చు. ఇందులో 6.71 హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్ బూస్టర్ ఫీచర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.

Realme GT 2: రియల్‌మీ జీటీ 2 ఫస్ట్ సేల్ కాసేపట్లో... తొలి సేల్‌లో రూ.5,000 డిస్కౌంట్

Realme C20: రియల్‌మీ సీ20 స్మార్ట్‌ఫోన్ గతేడాది లాంఛ్ అయినా ఇప్పటికీ రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ పాపులర్. 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,499. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Redmi 9i Sport: రెడ్‌మీ 9ఐ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. ఇందులో 6.53 అంగుళాల హెచ్‍డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Xiaomi 12 Pro: యాపిల్ ఐఫోన్‌కు పోటీగా షావోమీ 12 ప్రో... ప్రీమియం ఫీచర్స్ అదుర్స్

Micromax IN 2B: మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499. ఇందులో 6.52 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+ డిస్‌ప్లే, యూనిసోక్ టీ610 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Infinix Hot 11 2022: ఇన్ఫీనిక్స్ హాట్ 11 2022 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+ డిస్‌ప్లే, యూనిసోక్ టీ610 ప్రాసెసర్, 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రేపు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేయనున్న రియల్ మీ


రియల్ మీ ఇండియాలో కొత్త స్మార్ట్ టీవీలను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ టీవీలలో ఒకటి 40 ఇంచ్ సైజుతో మరొకటి 43 ఇంచ్ సైజుతో తీసుకువస్తుంది.  ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా FHD రిజల్యూషన్ తో ఉండవచ్చు. అయితే, ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ఫీచర్ల పరంగా ఆకట్టుకునేలా HDR 10 సపోర్ట్, ప్రీమియం బెజెల్ లెస్ డిజైన్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో తీసుకువస్తోంది.  Realme Smart TV X Full HD స్మార్ట్ టీవీలు 40 మరియు 43 ఇంచ్ సైజులలో రానున్నాయి. రియల్ సినీమ్యాటిక్ అనుభవాన్ని అందించే క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ ను అందించినట్లు కంపెనీ చెబుతోంది. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ టీవీలు ARM కోర్టెక్స్ A55 CPU మరియు Mali-G31 GPU క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ ను కలిగి ఉంటాయి. అలాగే, పైన తెలిపిన విధంగా ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ X ఫుల్ HD టీవీలు HDR 10 మరియు HLG రెండు ఫార్మాట్ లకు మద్దతును ఇస్తాయి. Android 11 OS పైన నడుస్తాయి. అంతేకాదు, ALLM (ఆటో లో లెటెన్సీ మోడ్) తో కూడా వస్తుంది. సౌండ్ పరంగా, 24W సౌండ్ అవుట్ పుట్ అందించ గల క్వాడ్ స్పీకర్ సెటప్ ఈ టీవీలలో ఉంటుంది. ఇందులో, రెండు సిల్క్ డూమ్ ట్వీటర్ లు మరియు రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఈ సెటప్ కి తోడు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అందుతుంది.

యూట్యూబ్‌లో వీడియోకు సబ్ టైటిల్స్ యాడ్ చేయాలంటే ?


యూట్యూబ్‌ వీడియోలు వేరే భాషకు చెందినవి అయితే.. సబ్ టైటిల్స్ ఉపయోగించి వాటిని చూడవచ్చు. కంటెంట్ ను అర్థం చేసుకోవడంలో సబ్ టైటిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా వీక్షకుడికి వీడియోలో ఉపయోగించిన భాష తెలియకపోయినా దాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు సబ్ టైటిల్స్ అవసరమవుతాయి. అవి వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా సమాచార వీడియోల్లో మరింత కచ్చితంగా సమాచారాన్ని అందిస్తాయి. వీడియో క్రియేటర్లు తమ వీడియోకు సబ్ టైటిల్స్ జోడించడం వల్ల భాష అవరోధాన్ని అధిగమించి కంటెంట్‌ను విస్తృతంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడంతో పాటు పరిధిని సమర్థవంతంగా పెంచుకోవచ్చు. యూట్యూబ్ ఛానెల్‌కు లాగిన్ అయ్యి, ప్రొఫైల్ ఫిక్చర్‌పై క్లిక్ చేయండి. వీడియో ఆప్షన్‌పై క్లిక్ చేసి అప్‌లోడ్ చేసిన వీడియో జాబితా ఓపెన్ అవుతుంది. అందులో సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి. స్క్రోలింగ్ దిగువన కుడి వైపున ఉన్న సబ్‌టైటిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ మీ కోసం యూట్యూబ్ స్టూడియో సబ్ టైటిల్స్ ఎడిటర్‌ను ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మీరు సబ్ టైటిల్స్‌ను సర్దుబాటు చేయవచ్చు. మీరు అప్‌లోడ్ చేసిన వీడియో కోసం యూట్యూబ్ ఆటోమెటిక్‌గా సబ్ టైటిల్స్ రూపొందిస్తుంది. వీటిని స్టూడియో పేజీలోని టెక్స్ట్ బాక్స్‌లో చూడవచ్చు. అయితే అవి తప్పుగా ఉన్నాయని మీరు భావిస్తే, వాటిని క్లియర్ చేయవచ్చు. టెక్స్ట్ డిలీట్ చేయాలనుకుంటే మూడు చుక్కలపై క్లిక్ చేసి, క్లియర్ టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. మీ సబ్‌టైటిల్స్‌ను టెక్స్ట్ బాక్స్‌లో టైప్ చేయవచ్చు లేదా సబ్‌టైటిల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. సబ్‌టైటిల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయాలంటే ముందుగా అది యూట్యూట్‌కు సపోర్ట్ చేస్తుందని నిర్ధారించుకోవాలి. అప్పుడు అప్‌లోడ్ ఫైల్‌ను సెలక్ట్ చేయడం కోసం 'విత్ టైమింగ్' లేదా 'విత్‌ఔట్ టైమింగ్' మధ్య సెలక్ట్ చేసుకోండి. మీ వీడియో సబ్ టైటిల్స్‌తో సరిపోలినప్పుడు "విత్ ఔట్ టైమింగ్" ఆప్షన్‌ను కూడా ఉపయోగించవచ్చు. కంటిన్యూపై క్లిక్ చేసి, సేవ్ చేయడానికి ముందు ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి ఎంచుకోండి ఒకవేళ కొత్త వీడియోను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇలా ఫాలో అవ్వండి. యూట్యూబ్ వీడియోను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, మీరు అప్‌లోడ్ చేసే "వీడియో ఎలిమెంట్స్" దశలో ఉన్నట్లయితే 'యాడ్ సబ్ టైటిల్'ను ఎంపిక చేసుకోండి. సబ్‌టైటిల్ ఫైల్‌ను మునుపటిలా అప్‌లోడ్ చేయవచ్చు. వాటిని మాన్యువల్‌గా కూడా టైప్ చేయవచ్చు లేదా "ఆటో-సింక్" సెలక్ట్ చేసుకోవచ్చు. సబ్‌టైటిల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేసి "విత్ టైమ్'' లేదా "విత్ ఔట్ టైమ్'' సెలక్ట్ చేయండి. ఆపై సబ్ టైటిల్ సరిగ్గా సరిపోలుతున్నాయో లేదో తనిఖీ చేసుకోండి. సబ్ టైటిల్ టెక్స్ట్ పేస్ట్ చేయడానికి Auto-syncను సెలక్ట్ చేసి ఉపయోగించండి. ఛేంజస్‌ను సేవ్ చేయండి. అప్‌లోడ్ చేసిన వీడియోలో సబ్ టైటిల్స్‌ను చూడండి.

విద్యార్థులు, యువత కోసం రీడాప్ట్ అండ్ రీజస్ట్ గైడ్‌ !


విద్యార్థులు ఎగ్జామ్‌ ఫియర్ నుంచి బయటపడేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగెట్టేందుకు ఓ గైడ్ క్రియేట్ చేసింది. విద్యార్థులు ఎలా చదవాలి, పరీక్షలకు సిద్ధం చేయడం, పరీక్షల ఒత్తిడి అధిగమించడంపై సలహాలు సూచనలు ఇస్తుంది. ప్రత్యేకించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సహాయం చేసే లక్ష్యంగా దీన్ని క్రియేట్ చేసింది. బ్యాక్ టు ది క్లాస్‌రూమ్' పేరుతో ఫోర్టిస్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, సంగత్స్ ఇట్స్ ఓకే ఇనిషియేటివ్, ఇన్‌స్టాగ్రామ్‌ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించారు. విద్యార్థులకు స్టడీ, పరీక్ష ప్రాధాన్యత గుర్తించడంతోపాటు స్కోరింగ్ కోసం చిట్కాలను కూడా అందిస్తుంది. ఒత్తిడి అధిగమించే వ్యూహాలను పరిచయం చేస్తుంది. ఏకాగ్రత మెరుగుపరచే పద్ధతులను అందిస్తుంది. ఈ గైడ్‌లో స్వీయ రక్షణ, మానసిక ఆరోగ్యం కోసం షార్ట్‌టెర్మ్‌ రెమిడీస్‌తోపాటు భవిష్యత్‌లో అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేస్తుంది. ఈ గైడ్ పాఠశాలలు, తల్లిదండ్రులకు ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా పంపిణీ చేస్తారు. విద్యార్థులు, పాఠశాలలు, తల్లిదండ్రులు ఫోర్టిస్ మెంటల్ హెల్త్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో గైడ్‌ను చూడవచ్చు. 1 మిలియన్ల 1 బిలియన్‌ వెబ్‌సైట్ నుంచి గైడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకుని ప్రజలను ఉపయోగపడేలా టేక్‌ ఏ బ్రేక్‌ పేరుతో కొత్త ఫీచర్ యాడ్ చేసింది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్ పబ్లిక్ పాలసీ హెడ్, ఫేస్‌బుక్ ఇండియా నటాషా జోగ్ మాట్లాడుతూ యువత శ్రేయస్సును దృష్టి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటిగా చెప్పారు. యువత జీవితాలను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 'రీడాప్ట్ అండ్ రీజస్ట్' గైడ్‌ తీసుకువచ్చామన్నారు.

జూన్‌లో దేశీ మార్కెట్‌లోకి ఒప్పో రెనో 8 సిరీస్‌ !


ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్‌లు జూన్ మాసాంతంలో భారత్‌లో విడుదల కానున్నాయి. తొలుత చైనాలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఒప్పో పాడ్ ట్యాబ్లెట్‌, మల్టిపుల్ ఐఓటీ ఉత్పత్తులు కూడా భారత్‌లో విడుదల కానున్నాయి. రెనో 8 సిరీస్ పోన్లు ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో 6.5 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగిఉంటాయి. డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. రెనో 8 సిరీస్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ను వాడుతోంది. 80డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో 4500ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇక ఈ స్మార్ట్‌పోన్ సిరీస్ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్‌, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సర్‌, 2 మెగాపిక్సెల్ థర్డ్ సెన్సర్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. మరోవైపు రెనో 8 సిరీస్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్709 సెన్సర్‌తో ముందుకు రానుందని భావిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపిన గూగుల్ !


యువతకు డిజిటల్ సర్టిఫికెట్‌ స్కాలర్‌షిప్‌లు, వారిని ఉద్యోగాలకు సిద్ధంగా చేయడమే లక్ష్యంగా ఇకపై తెలంగాణలో గూగుల్ పనిచేయనుంది. మహిళా వాణిజ్యవేత్తలకు మద్దతుగా ఉండేందుకు స్కిల్లింగ్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా పాఠశాలల ఆధునీకరణకు సాయం, తద్వారా విద్యార్థులకు మెరుగైన అభ్యాసన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. గచ్చిబౌలిలో మూడు మిలియన్ల చదరపు అడుగుల భవన నిర్మాణానికి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఖాజాగూడలోని హెచ్ జిసిఎల్ ఆఫీస్ లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గూగుల్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, గూగుల్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.'డిజిటల్ తెలంగాణ' అనే మా దార్శనికతకు మద్దతు ఇవ్వడానికి, ప్రతి పౌరుడు డిజిటల్‌ సాధికారత సాధించాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకురావడానికి గూగుల్ తన పరిష్కారాలను ఉపయోగించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వారితో మేం ఇంతకు ముందు చేసుకున్న ఎంఓయూలు అన్ని వర్గాల పౌరులను సానుకూలంగా ప్రభావితం చేసిన కొన్ని గొప్ప కార్యక్రమాలకు దారితీశాయని ఆయన అన్నారు. అయితే ఈసారి యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పు తీసుకురావడంపై దృష్టి సారించినట్టు కేటీఆర్ చెప్పారు.

ట్విట్టర్ చైర్మన్‌గా జాక్ డోర్సీ ?


మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో కో-ఫౌండర్, మాజీ సీఈవో జాక్ డోర్సీ కీలక బాధ్యతలు వహించబోతున్నారా? ఐదు నెలల క్రితం సీఈవోగా వైదొలిగిన డోర్సీ తిరిగి ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారా అనే వార్తలొస్తున్నాయి. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న ఎలన్‌మస్క్‌కు, జాక్ డోర్సీకి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయి. ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకుంటానని తొలుత ప్రకటించినప్పుడు ప్రస్తుత ఆ సంస్థ యాజమాన్యంపై తనకు విశ్వాసం లేదని మస్క్ చెప్పారు. దీంతో ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ స్థానం సురక్షితం కాదనే అభిప్రాయం వినిపిస్తున్నది. అదే జరిగి, సీఈవోగా పరాగ్ అగర్వాల్ వైదొలిగితే.. ఆ స్థానంలో నూతన సీఈవోగా ఎవరిని నియమిస్తారన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానం చెప్పగలిగింది ఒక్క ఎలన్‌మస్క్ మాత్రమే. ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ తిరిగి తన బాధ్యతల్లోకి వచ్చేస్తారన్న వార్తలను కొట్టి పారేయలేం. ట్విట్టర్ ఇండియా మాజీ అధిపతి మనీశ్ మహేశ్వరి సైతం ఇటీవల స్పందిస్తూ జాక్ డోర్సీ సంస్థలో మరింత శక్తిమంతమైన పాత్ర పోషించబోతున్నారని, ట్విట్టర్ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. ఐదు నెలల క్రితం సీఈవోగా వైదొలిగిన జాక్ డోర్సీ మళ్లీ ఆ పోస్ట్ చేపడతారని చైనా అనలిస్ట్‌లు చెబుతున్నారు. ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ దశాబ్ద కాలానికి పైగా ట్విట్టర్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఎల్లియట్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సీఈవోగా జాక్ డోర్సీ రాజీనామా చేశారు. దీంతో అప్పటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను సీఈవోగా ప్రమోట్ చేశారు. జాక్ డోర్సీ, ఎలన్‌మస్క్ మధ్య స్నేహపూరిత అనుబంధం ఉంది. ట్విట్టర్‌ను టేకోవర్ చేయాలన్న ఎలన్‌మస్క్ ప్రతిపాదనకు జాక్ డోర్సీ మద్దతు ఇచ్చిన కారణాల్లో ఇదొకటి. 44 బిలియన్ డాలర్ల ఎలన్‌మస్క్ ఆఫర్‌ను ట్విట్టర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించగానే జాక్‌డోర్సీ ట్వీట్ల వర్షం కురిపించారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను టెస్లా సీఈవో మస్క్ నడుపగలరని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాలన్న మస్క్ ప్లాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ట్విట్ చేశారు. వాల్ స్ట్రీట్ నుంచి వెనక్కు తీసుకోవడం సరైన మొదటి చర్య అని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో జాక్ డోర్సీకి 2.36 శాతం వాటాలు ఉన్నాయి.

కోకా కోలా కంపెనీని కొనేస్తా !


ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లతో కొనేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కోకా కోలా కంపెనీని కొనేస్తానంటూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆయన ఓసారి ట్విట్టర్ గురించి ఇలాగే ఓ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కొనాలంటే ఎంతవుతుంది అంటూ 2017లో ట్వీట్ చేశారు. ఐదేళ్ల తర్వాత ట్విట్టర్‌ను కొనేశారు. ఇప్పుడు కోకా కోలా కంపెనీని కొంటానని, కొకైన్‌ను మళ్లీ తీసుకొస్తానని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఆయన ట్వీట్ చేసిన మూడు గంటల్లో ఆ ట్వీట్‌కు రెండు లక్షలకు పైగా రీట్వీట్స్, 80 వేలకు పైగా కామెంట్స్, 15 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో కోకా కోలా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎలాన్ మస్క్ సీరియస్‌గానే కోకా కోలాను కొంటారా లేకపోతే సరదాకు అలా ట్వీట్ చేశారా అన్న చర్చజరుగుతోంది. అయితే ట్విట్టర్‌ను సరదాగా చేద్దాం అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. అయితే అయిదేళ్ల క్రితం ట్విట్టర్ కొంటానని సరదాగా ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు అదే పనిచేశారు. మరి కోకా కోలా విషయంలో అలాగే చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

డిజిటల్‌ పేమెంట్స్‌లో దూకుడు పెంచనున్న వాట్సప్?


ఆన్ లైన్ లో బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేందుకు చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే లను వాడుతుంటారు. మిగతా యాప్ లు కూడా ఉన్నా ఇవి రెండూ అగ్ర స్థానంలో ఉన్నాయి. పేటీఎం, అమెజాన్ పే కూడా ఈ బాటలోనే ఉన్నాయి. అయితే అగ్ర స్థానాన్ని త్వరలో వాట్సప్ అందుకోబోతోందని చెబుతున్నారు. దేశంలో రోజు రోజుకీ యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది యూపీఐ సేవలని వినియోగించుకుంటున్నారు. కొవిడ్ తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ చేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. అయితే ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉన్న వాట్సప్ మాత్రం కాస్త వెనకబడి ఉందనే చెప్పాలి. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందరి ఫోన్లలో వాట్సప్. కానీ డిజిటల్ పేమెంట్స్ దగ్గరికి వచ్చే సరికి అందరూ ఫోన్ పేనో, గూగుల్ పేనో తీస్తుంటారు. ఇకపై వాట్సప్ కూడా ఈ విషయంలో దూకుడుగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవలే 10 కోట్ల మంది వరకు పేమెంట్‌ సేవలను అందించేందుకు నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వాట్సప్ అనుమతి తీసుకుంది. ఇప్పటి వరకూ వాట్సప్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వలేదు. ఇప్పుడిక కస్టమర్లకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ఇస్తూ మరింత ఫేమస్ అయ్యేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జూన్ మొదటి వారానికి వాట్సప్ లో క్యాష్ బ్యాక్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సమాచారం. వాట్సప్ ద్వారా యూపీఏ పేమెంట్స్ మొదలు పెట్టేవారికి తొలినాళ్లలో ఒక్కో యూజర్ కి 33 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తారని తెలుస్తోంది. గతంలో గూగుల్ పే నుంచి అటు ఇటు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకుంటే వెంటనే క్యాష్ బ్యాక్ వచ్చేది. అలా గూగుల్ పే కి అందర్నీ అట్రాక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ పే కూడా డిజిటల్ పేమెంట్స్ కి డిస్కౌంట్లు, కూపన్లు ఇచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు వాట్సప్ కూడా అదే బాటలో పయనించాలనుకుంటోంది. మొదటి మూడు లావాదేవీలకు 33 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ అమౌంట్ తక్కువ అనుకున్నా కూడా అందరూ వాట్సప్ కి మారి ఆ క్యాష్ బ్యాక్ తీసుకుని ఆ తర్వాత తమకు ఇష్టమైన, తమకు కన్వీనియంట్ గా ఉండే పేమెంట్స్ వైపు వస్తారు. సో.. ఎలాగైనా వాట్సప్ కస్టమర్లను ఆకర్షించే అవకాశముంది. ఇలా వాట్సప్ విజృంభిస్తే మాత్రం మిగతా వాటికి కష్టకాలమేనని చెప్పాలి. ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్స్ పై వాట్సప్ పెద్దగా దృష్టిసారించలేదు కాబట్టి సరిపోయింది. వాట్సప్ రంగంలోకి దిగితే మిగతా యాప్ లు కాస్త డౌన్ అయ్యే అవకాశముంది.

Wednesday, April 27, 2022

ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడవకుండా ఉండాలంటే ?


ఎండా కాలంలో ఇంట్లో ఏదీ వండినా త్వరగా పాడువుతుంది. మిగతా కాలాలతో పోల్చితే ఈ ఎండా కాలంలో వండిన ఆహారం త్వరగా పాడైపోతుంది. ఆరోగ్యం కోసం పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహార పదార్థాల విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమ్మర్‌ సీజర్‌లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం కష్టమైపోతుంది. ఉదయం వండిన పదార్థాలు రాత్రి వరకు పాడైపోతుంటాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వడిలిపోతాయి. ఇక పాలు, పెరుగు సంగతైతే పెద్దగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఫ్రిజ్‌ ఉన్నవారికి కొంత నయం. లేని వారి సంగతి అయితే అంతే. ఏ పదార్థాలు అయినా త్వరగా పాడైపోతాయి. మరి భారీ ఎండల్లోనూ ఆహార పదార్థాలు తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. మిగతా రోజులతో పోలిస్తే.. ఫ్రిజ్‌ ఉష్ణోగ్రతను తగ్గించి 5 డిగ్రీల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. తాజా గుడ్లు, మాంసాన్ని తప్పకుండా ఫ్రిజ్‌లోనే నిల్వచేయాలి. బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వండిన పదార్థాలను, పచ్చి కూరగాయలను వేరువేరు అరల్లో సర్దుకోవడం మంచిది. కూరలు, పుసులులు, పాలువంటి వాటిని కొద్ది గంటల వ్యవధితో తరచుగా వేడి చేస్తూ ఉండటం మంచిది. కాస్త వేడి కాగానే దించేయకుండా మరుగు వచ్చేంతవరకు స్టవ్‌ మీద ఉంచాలి. దీని వల్ల పాడవకుండా ఉంటాయి. వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తరిగాక, గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచడం మంచిది. దీని వల్ల తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లోంచి తీసిన పదార్థాలను వెంటనే కాకుండా, కాసేపటి తర్వాత వండుకోవడం మంచిది.

ఇక పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్‌లోనే నిలువ చేయాలి. ఫ్రిజ్‌లో ఇరుకుగా ఉన్న డబ్బాలు పెట్టకూడదు. కాస్త మధ్య మధ్యలో గ్యాస్‌ ఉండేలా సర్దుకోవాలి. ఇరుకుగా ఉన్న డబ్బాలు పెట్టకూడదు. గాలి ఆడేందుకు ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి.. అప్పుడే అందులోని పదార్థాలు పాడవకుండా తాజాగా ఉంటాయి.

దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారిన తర్వాతే బాక్సుల్లో పెట్టుకోవాలి. వీలైతే కూల్‌ కంటైనర్‌లో సర్దుకోవడం మంచిది.

వేసవిలో కరెంట్ బిల్ తగ్గాలంటే?


వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో అందరూ 24 గంటలూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడతారు. చల్లదనాన్ని అనుభవిస్తున్నా.. కరెంట్ బిల్లు మాత్రం రెట్టింపు అయ్యిందని ఆవేదన చెందుతుంటారు.  కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే విద్యుత్ బిల్లుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.  సీలింగ్ ఫ్యాన్ ని ఉపయోగిస్తే దానిని ఎప్పటికప్పుడూ సర్వీస్ చేస్తూ ఉండండి. రెగ్యులేటర్ ను తప్పనిసరిగా ఉపయోగించండి. ఫ్యాన్‌లోని కండెన్సర్ మరియు బాల్ బేరింగ్ పాడైపోతే వెంటనే మార్పించండి. కూలర్ ఫ్యాన్ లో  ఆయిల్, గ్రీసింగ్ చాలా ముఖ్యం. ఇది చేయకపోతే ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్‌ను తప్పనిసరిగా ఆన్‌లో ఉంచండి. తద్వారా మీ గది త్వరగా చల్లబడుతుంది. ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇంటి కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచాలని గుర్తుంచుకోండి.లేదంటే ఏసీ నుంచి చల్లటి గాలి బయటకు వెళ్లి ఇల్లు చల్లగా ఉండదు

మాంటెలుకాస్ట్‌తో కరోనాకు అడ్డకట్ట !


కరోనాకు టీకాలు తప్ప అడ్డుకట్ట వేసే డ్రగ్ ఇంత వరకూ లేదు. అయితే, ఆస్తమాకు ఉపయోగించే మాంటెలుకాస్ట్‌తో కరోనాకు చెక్ చెప్పవచ్చని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (ఐఐఎస్‌సీ, బెంగళూరు) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ డ్రగ్ మన శరీరంలో కరోనా వైరస్‌ను ప్రభావవంతంగా అడ్డుకుంటుందని గుర్తించారు. మాంటెలుకాస్ట్ డ్రగ్‌ను సాధారణంగా ఉబ్బసం, గవత జ్వరం (అలర్జిక్ రినైటిస్), దద్దుర్లు లాంటి పరిస్థితుల వల్ల కలిగే మంటను తగ్గించడానికి వాడతారు. ఈ ఔషధం మానవ కణంలో మొదటగా చొచ్చుకుపోయే సార్స్ సీఓవీ-2 ప్రొటీన్ ఎన్ఎస్‌పీ 1 చివరను బలంగా బంధిస్తుందని గుర్తించారు. మాంటెలుకాస్ట్ ఎన్ఎస్‌పీ 1ను బలంగా, స్థిరంగా బంధిస్తుంది. తద్వారా హోస్ట్ కణాలు సాధారణ ప్రోటీన్ సంశ్లేషణను పునఃప్రారంభించడానికి అనుమతిస్తుంది. దీంతో మన శరీరంపై కరోనా ప్రభావం కనిపించదని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ‘ఈ లైఫ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఏప్రిల్‌ 30న తొలి సూర్యగ్రహణం


ప్రతి ఏడాది సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి గ్రహణాలలో ప్రత్యేక నియమాలు పాటిస్తుంటారు. ఇక తొలి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్‌ 30, 2022న ఏర్పడనుంది. అయితే భారత్‌ లో కనిపించే తొలి సూర్యగ్రహణానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మతపరమైన విశ్వాసాలతో ఇంకొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం ఎక్కడ..? ఏ సమయంలో ఎలా కనిపించనుందనే వివరాలను నాసా వెల్లడించింది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం. దక్షిణ అమెరికాలోని దక్షిణాధి ప్రజలు, అంటార్కికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు ఏప్రిల్‌ 30న సూర్యాస్తమయానికి కొద్దిముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇక చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్‌ దేశాలలో అకాశం నిర్మలంగా ఉంటే సూర్యాస్తమయం సమయంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత్ లో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదని నాసా తెలిపింది. దక్షిణ, అమెరికాలోని సౌత్‌ ఈస్టర్న్‌ ప్రాంతాల్లో, దక్షిణ పసిపిక్‌ మహా సముద్ర ప్రాంతాల వాసులకు ఈ సూర్యగ్రహణం కనిపించనుంది.


ఏప్రిల్ 29న పోకో ఎం4 విడుదల


పోకో ఇండియా నుంచి ఏప్రిల్ 29న పోకో ఎం4 5జీ రిలీజ్ కానుంది. గతేడాది బాగా పాపులర్ అయిన పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వేరియంట్‌గా పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది.  పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.13,999 ధర నుంచి అందుబాటులో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇప్పటికే ఈ బడ్జెట్‌లో ఉన్న వివో టీ1, ఐకూ జెడ్6, రెడ్‌మీ నోట్ 10టీ 5జీ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందన్నది రిలీజ్ రోజు తెలుస్తుంది. పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ గురించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వై75, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42, రెడ్‌మీ నోట్ 10టీ, రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్లలో ఉంది. డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇప్పటికే పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.18,999. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్, మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. టర్బోర్యామ్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Tuesday, April 26, 2022

యాపిల్‌ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్ !


ప్రస్తుతం స్మార్ట్‌ గ్యాడ్జెట్ల హవా నడుస్తోంది. ఇంట్లో ఉపయోగించే ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. టీవీ నుంచి కారు వరకు, ఇంట్లో ఉపయోగించే కాలింగ్ బెల్‌ నుంచి బల్బుల వరకు అన్ని స్మార్ట్‌ రూపంలోకి మారిపోయాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం యాపిల్‌ మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్స్‌ను కూడా తీసుకొచ్చాయి. పేరుకు తగ్గట్లుగానే ఈ వాటర్‌ బాటిల్‌ చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ బాటిల్స్‌ను త్వరలోనే ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. హైడ్రేట్ స్పార్క్‌ అనే కంపెనీతో భాగస్వామ్యమై యాపిల్‌ ఈ వాటర్‌ బాటిల్స్‌ను విక్రయిస్తోంది. ఈ బాటిల్‌ సహాయంతో యూజర్లు యాపిల్‌ హెల్త్‌ యాప్‌ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ఈ బాటిల్‌కు అందించిన ఎల్‌ఈడీ లైట్‌ ఆధారంగా యూజర్లు రోజులో ఎన్ని నీళ్లు తాగుతున్నారు లాంటి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. బ్లూటూత్‌ ఆప్షన్‌ ద్వారా హైడ్రేట్‌స్పార్క్‌ యాప్‌కు అనుసంధానం అయ్యే ఈ బాటిల్స్‌ యూజర్ల రోజువారీ యాక్టివిటీ ఆధారంగా నీటిని తీసుకోమని సూచిస్తుంటుంది. అంతేకాకుండా యూజర్లు రోజులో ఎంత నీరు తాగారు అన్న వివరాలు కూడా ఎప్పటికప్పుడు యాప్‌లో సూచిస్తుంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌లను కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ వివరాలు నిక్షిప్తమవుతాయి. ఈ వాటర్‌ బాటిల్ ధర విషయానికొస్తే స్టీల్‌తో రూపొందించిన బాటిల్‌ రూ. 6,129కి అందుబాటులో ఉండగా, ప్లాస్టిక్‌ బాటిల్‌ రూ. 4,596గా ఉంది. గ్రీన్‌, బ్లాక్‌లో కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ సమ్మర్ సేల్ !


అమెజాన్ త్వరలో తన సమ్మర్ సేల్ ను నిర్వహించనునట్లు ప్రకటించింది. ఈ సేల్ ప్రారంభించనున్న తేది ఇంకా ప్రకటించనప్పటికీ ఆఫర్లను గురించి మాత్రం టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సేల్ ను ICICI, Kotak మరియు RBL Bank బ్యాంక్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది. కాబట్టి, ఈ మూడు బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ప్రొడక్ట్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్ నుండి మార్కెట్లో కొత్తగా వచ్చిన 60 కి పైగా ప్రొడక్ట్స్ డిస్కౌంట్ ధరకే అఫర్ చేయనున్నట్లు కూడా అమెజాన్ చెబుతోంది. ల్యాప్ టాప్స్ మరియు హెడ్ ఫోన్స్ పైన 70% వరకు డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు మరియు AC ల పైన కూడా గరిష్టంగా 50% డిస్కౌంట్ ను అందించనున్నట్లు టీజింగ్ మొదలుపెట్టింది. హోమ్ & కిచెన్, ఫ్యాషన్ మరియు భారతీయ చిన్న వ్యాపారుల నుండి వచ్చిన యూనిక్ ప్రొడక్ట్స్ పైన 70% వరకూ డిస్కౌంట్ లను ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఈ సేల్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా విడుదలకానున్నాయి. అప్ కమింగ్ లాంచ్ స్మార్ట్ ఫోన్స్ వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్, వన్ ప్లస్ 10R 5G, iQOO Z6 Pro గురించి కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. త్వరలో సేల్ కి అందుబాటులోకి రానున్న గెలాక్సీ M53 5G మరియు మరిన్ని ఫోన్స్ ను కూడా వెల్లడించింది. ఇక ఈ సేల్ నుండి అతి తక్కువ ధరకు లభించనున్న ప్రోడక్ట్స్ విషయానికి వస్తే, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్స్, AC లు మరియు రిఫ్రిజిరేటర్లు డిస్కౌంట్ ఆఫర్లు మరియు డీల్స్ తో తక్కువ ధరకు లభించనున్నాయి.

ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగిస్తారా ?


ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కొనసాగుతాడా లేదా? ఎందుకంటే ట్విట్టర్ మేనేజ్‌మెంట్‌కు తాను వ్యతిరేకమని గతంలోనే ఎలాన్ మస్క్ చెప్పేశాడు. రాబోయే రోజుల్లో మేనేజ్‌మెంట్‌లో గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఉందన్నాడు. మరి డీల్ పూర్తియ్యాక కూడా ట్విట్టర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను మస్క్ కొనసాగిస్తారా? లేదా అనేది చూడాలి. ఒకవేళ మస్క్ పరాగ్ అగర్వాల్‌ను తొలగించాలని నిర్ణయించుకుంటే మాత్రం.. అతనికి దాదాపు 42 మిలియన్ల డాలర్లు చెల్లించవలసి వస్తుంది. రీసెర్చ్ సంస్థ ఈక్విలర్ ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్‌లో నియంత్రణలో మార్పు వచ్చిన 12 నెలల్లోపు అగర్వాల్‌ను తొలగించిన పక్షంలో మస్క్ సుమారు 42 మిలియన్ డాలర్లు అగర్వాల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. ఏప్రిల్ 14న సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో మస్క్ ట్విట్టర్ నిర్వహణపై తనకు నమ్మకం లేదని చెప్పేశాడు. మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో అగర్వాల్ భవిష్యత్తులో ట్విటర్ సీఈఓగా కొనసాగుతారా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఆయనే సీఈఓగా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరాగ్‌ అగర్వాల్ కూడా ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ ఏ దిశలో వెళ్తుందో అనిశ్చితంగా ఉందని ట్వీట్ చేశాడు. గతంలో సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేసిన వెంటనే అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా నియమితులయ్యారు. పరాగ్ గతేడాది నవంబర్ నుంచి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే కంపెనీలో పరాగ్ సిటిఓగా పనిచేశాడు.  ట్విట్టర్ ప్రాక్సీ ప్రకారం ఎక్కువగా స్టాక్ అవార్డులలో 2021కి పరాగ్ అగర్వాల్ మొత్తం పరిహారం దాదాపు 30.4 మిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్ ట్విట్టర్ ఒప్పందానికి డోర్సే మద్దతుగా నిలిచారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం ప్లాట్‌ఫారమ్‌కు సరైన దిశలో ఒక అడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ సేల్ !


ఫ్లిప్ కార్ట్ లో కొత్తగా మొబైల్ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. తాజాగా కొన్ని ప్రముఖ బ్రాండెడ్ కలిగిన కొన్ని మొబైల్స్ ను తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తుంది . 

iphone-11 :128 GB  మొబైల్ అసలు ధర రూ.54,900 బదులుగా రూ.47,999 రూపాయలకే లభిస్తోంది. ఇక అంతే కాకుండా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన వారికి అదనంగా 3 వేల రూపాయలు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఏదైనా మొబైల్ 13 వేల రూపాయలు విలువ చేస్తే దీని ధర రూ.34,999 రూపాయలకి లభిస్తుంది.

VIVO Y53S స్మార్ట్ మొబైల్ ధర రూ.22,990 రూపాయలు కాగా ఆఫర్ కింద రూ.14,990 రూపాయలకే కొనుక్కోవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్స్ కింద రూ.13 వేల రూపాయల వరకు మనం ఆదా చేసుకోవచ్చు.

MOTO G-60 మొబైల్ ధర రూ.21,999 కాగా దీనిని ఆఫర్ కింద రూ.16,999 రూపాయలకు లభిస్తోంది. ఒకవేళ పాత మొబైల్ ధర ఎక్స్చేంజ్ కింద తీసుకున్నట్లయితే రూ.13,000 వరకు తగ్గింపు పొందుతుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.800 రూపాయలు తగ్గుతుంది.

REDMI NOTE 10T -5G  మొబైల్ ధర రూ.16,999 కాగా ఆఫర్ కింద రూ.12,999 లభిస్తోంది.. ఇక అంతే కాకుండా ఎక్స్చేంజి ఆఫర్ కింద రూ.11,550 రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది.

Samsung galaxy F23 5G మార్కెట్లో రూ.23,999 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో దీనిని రూ.16,999 కొనుగోలు చేయవచ్చు. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ. 2000 తగ్గింపుతో రూ. 14,000 కే ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే వెయ్యి రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి విడుదల


దేశంలో మైక్రోమ్యాక్స్ నేడు కొత్తగా మైక్రోమ్యాక్స్ ఇన్ 2సి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మైక్రోమ్యాక్స్ ఫోన్ గత సంవత్సరంలో లాంచ్ అయిన మైక్రోమ్యాక్స్ In 2bని పోలి ఉండి దాని అప్ గ్రేడ్ వెర్షన్ గా విడుదలైంది. ఈ ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్‌ మరియు డ్యూయల్ రియర్ కెమెరా ఫీచర్లను కలిగి ఉండి ఆక్టా-కోర్ Unisoc T610 SoCతో రన్ అవుతుంది. దీనితో పాటుగా ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్‌, 5,000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండి మార్కెట్ లో ఇన్ఫినిక్స్ హాట్ 11 2022, రియల్ మి C31 మరియు పోకో C3 వంటి వాటితో పోటీపడుతున్నది.  3GB RAM + 32GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ రూ.8,499 ధర వద్ద బ్రౌన్ మరియు సిల్వర్ కలర్ లలో లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు మైక్రోమ్యాక్స్ అధికారిక సైట్ ద్వారా మే 1 నుండి మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి. పరిచయ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.7,499 తగ్గింపు ధరకే అందించనున్నది. డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ద్వారా రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 263ppi పిక్సెల్ డెన్సిటీతో 6.52-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ Unisoc T610 SoCతో శక్తిని పొందుతూ 3GB RAMతో జతచేయబడి ఉంది. డిస్‌ప్లే మరియు SoC యొక్క ఫీచర్స్ గత సంవత్సరం విడుదలైన మైక్రోమ్యాక్స్ ఇన్ 2bతో పొలిఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ మరియు 8-మెగాపిక్సెల్ కెమెరా ప్రత్యేక డెప్త్ సెన్సార్‌తో లభిస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది ఫేస్ బ్యూటీ, నైట్ మోడ్ మరియు పోర్ట్రెయిట్ మోడ్‌తో సహా ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. చివరిగా ఇది 10W స్టాండర్డ్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి 164.31x75.68x8.63mm కొలతల పరిమాణంలో లభిస్తుంది.

Monday, April 25, 2022

లావా అగ్ని 5జీ పై ఇయర్‌బడ్స్ ఉచితం


గతేడాది రిలీజైన మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 5జీ మొబైల్‌పై అదిరిపోయే ఆఫర్ లభిస్తోంది. రిలీజ్ ధరతో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రూ.2,000 తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో పాటు రూ.1,799 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితంగా పొందొచ్చు. లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.18,889 లకే  లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500, హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.3,000 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ.1,799 విలువైన లావా ప్రోబడ్స్ టీడబ్ల్యూఎస్ ఇన్ ఇయర్ ఇయర్‌బడ్స్ ఉచితంగా పొందవచ్చు.  ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 8ఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో అల్ట్రా హెచ్‌డీ మోడ్, సూపర్ నైట్ షాట్, GIF మోడ్, ఏఐ మోడ్, బ్యూటీ మోడ్, మాక్రో మోడ్, ప్రో మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, స్లో మోషన్, టైమ్ లాప్స్, ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌తో రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ 5జీ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ 11 యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్స్ తప్ప ఇతర యాప్స్ ఉండవు.

అత్యవసర సేవలన్నింటికి ఒక్కటే నంబర్‌ ?


దేశంలో అత్యవసర సేవలన్నింటికి ఒక్కటే నంబర్‌.. హోం శాఖ నిర్ణయించింది.  ఇకపై ఆయా రాష్ట్రాలు ఈ నంబర్‌ను ప్రచారం చేయాలని భావిస్తున్నాయి. అంతే కాకుండా డయల్‌ 100కు కాల్‌ చేసిన వారికి వచ్చే సందేశంలో 100కు బదులుగా డయల్‌ 112 అంటూ మార్చాలని చూస్తున్నారు. సాధారణంగా అత్యవసర సాయం కోసం బాధితులు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసేటప్పుడు.. అన్ని సందర్భాల్లో పూర్తి వివరాలు అందించే పరిస్థితి ఉండదు. సమాచారం అందగానే ఎంత తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తే బాధితులకు అంత ఊరట ఉంటుంది. కాబట్టి కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన కాల్, మెసేజ్, మెయిల్‌ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించేందుకు రాష్ట్ర పోలీసుల దగ్గర ఇప్పటికే కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది. తాజాగా ఎన్‌ఈఆర్‌ఎస్‌ అమలుతో మరింత అత్యాధునిక పరిజ్ఞానం చేకూరుతుంది. ఇది పూర్తిస్థాయిలో అందు బాటులోకి వస్తే జీఐఎస్‌ పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్‌ కంట్రోల్‌ రూమ్స్‌లో ఉంటా యి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యా దు చేస్తున్నారో తక్షణం గుర్తించవచ్చు. 112'వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలు నిర్విరామంగా పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ తరహా కాల్‌ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేసింది. పోలీసు, మెడికల్, ఫైర్, విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు సహా ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు మొత్తం 9 రకాల అత్యవసర సేవలకు ఈ కాల్‌ సెంటర్‌ను ఆశ్రయించేలా ఏర్పాటు చేస్తోంది. ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్‌ ద్వారా కాల్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్, చాట్, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌లో ఏర్పాటు చేసే ప్యానిక్‌ బటన్, వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్, మొబైల్‌ యాప్స్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ).. ఇలా అన్ని మాధ్యమాల ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినప్పుడు సత్వర స్పందన కోసం పోలీసు విభా గంతో పాటు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, వైద్యారోగ్య, మున్సి పల్‌ కార్పొరేషన్లకు ఒకేసారి సమాచారం అందేలా ఇంటిగ్రేటెడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్‌ నేరాల్లో బాధితులకు సహాయం చేయడానికి కేంద్రం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని కూడా 112లో కలిపేయాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి

వాట్సాప్ సపోర్ట్ అకౌంట్ పేరుతో మోసాలు !


యాప్ వాట్సాప్ యూజర్ల కోసం కొద్ది రోజుల క్రితం వాట్సాప్ సపోర్ట్  చాట్ విండో పరిచయం చేసింది.  ఈ ఇంటరాక్టివ్ చాట్ థ్రెడ్ ద్వారా యూజర్లు బగ్స్ తో పాటు వాట్సాప్‌కు సంబంధించి ఇతర రిపోర్ట్స్ షేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొందరు సైబర్ నేరగాళ్లు అచ్చం వాట్సాప్ సపోర్ట్ లాంటి అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఫేక్ అకౌంట్ల ముసుగులో యూజర్ల పర్సనల్ డేటా దొంగలిస్తున్నారు. అసలైన వాట్సాప్ సపోర్ట్ లాగా నకిలీ వాట్సాప్ సపోర్ట్ అకౌంట్లు సృష్టించి వీరు వ్యక్తిగత, ఇతర సున్నితమైన సమాచారం వంటి డేటాను దొంగిలిస్తున్నారని వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా తెలిపింది. దీనివల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముంది. "వాట్సాప్ సపోర్ట్‌గా కనిపించే ఒక అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపుతారు. యూజర్లు అది అసలైనదో కాదో తెలుసుకోలేరు. ఇలా యూజర్లు తమ సున్నితమైన సమాచారాన్ని వారికి షేర్ చేసే అవకాశం ఉంది" అని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఒకవేళ మీ వాట్సాప్ అకౌంట్‌కు అలాంటి మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే ముందు పంపినవారి గుర్తింపును ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే రిపోర్ట్ చేసి ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయాలి. ఈ సైబర్ నేరగాళ్లు తమ ప్రొఫైల్ ఫొటోలో వాట్సాప్ లోగోతో పాటు కన్ఫర్మ్ చేసిన టిక్‌ను చేర్చుతారు. దీని వల్ల యూజర్లు అది ఫేక్ వాట్సాప్ సపోర్ట్ అని గ్రహించలేరు. అయితే కొన్ని చిన్న గుర్తులను గమనిస్తే ఏది నిజమయిందో ఈజీగా కనుక్కోవచ్చు. "మీరు వెరిఫైడ్ వాట్సాప్ సపోర్ట్‌తో చాట్ చేస్తున్నప్పుడు, డిస్కషన్ స్క్రీన్‌లో వారి పేరు, చాట్ ఇన్ఫో పక్కన వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. వెరిఫైడ్ బ్యాడ్జ్ గ్రీన్ కలర్‌లో రైట్ మార్క్ లా ఉంటుంది. ఈ వెరిఫైడ్ బ్యాడ్జ్ అకౌంట్ పేరు, చాట్ ఇన్ఫో పక్కన కాకుండా ప్రొఫైల్ ఫొటో వంటి వేరొక లొకేషన్‌లో కనిపిస్తే అది ఫేక్ అని అర్థం. ఆ కాంటాక్ట్ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని గ్రహించాలి" అని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. "ఈ ఫేక్ కాంటాక్ట్స్ క్రియేట్ చేసే నేరగాళ్లు మీ వాట్సాప్ అకౌంట్ రిమూవ్ అవ్వకుండా ఉండాలంటే మీ క్రెడిట్ కార్డ్ డేటా వంటి కొన్ని సున్నితమైన సమాచారాన్ని ఇవ్వాలని నమ్మబలుకుతారు" అని వాట్సాప్ బీటా ఇన్ఫో వివరించింది. కొన్ని సందర్భాల్లో మీ వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి వారు మీ 6-అంకెల కోడ్‌ను కూడా రిక్వెస్ట్ చేయొచ్చని అది హెచ్చరించింది. వాట్సాప్ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని లేదా మీ 6-అంకెల కోడ్ లేదా టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ వంటి సమాచారాన్ని ఎన్నటికీ అడగదు. అకౌంట్ బ్యాన్ చేయకుండా ఉండటానికి వాట్సాప్ డబ్బు లేదా వ్యక్తిగత వివరాలను కూడా అడగదని యూజర్లు గమనించాలి. "ఎవరైనా ఈ సమాచారాన్ని అభ్యర్థిస్తుంటే, అది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న అకౌంట్ కావచ్చు. ఇలాంటి అకౌంట్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. ఈ చాట్ నుంచి 5 రీసెంట్ మెసేజ్‌లు అఫీషియల్ వాట్సాప్ మోడరేషన్ బృందంతో షేర్ అవుతాయి. తద్వారా వారు అకౌంట్ యాక్టివిటీని గ్రహించి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయగలరు." అని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఇది కేవలం వాట్సాప్‌కు మాత్రమే పరిమితం కాదు. ఫేస్ అకౌంట్ క్రియేట్ చేసే వారు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల వలె నటించవచ్చు. కాబట్టి తెలియని నంబర్ నుంచి మీకు తెలిసిన వారిలా మెసేజ్‌లు పంపిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.

షావోమీ 12 ప్రో' ఏప్రిల్ 27 విడుదల


షావోమీ 12 ప్రో ఏప్రిల్ 27న భారత మార్కెట్లో విడుదలకానుంది. దీని ధర రూ.66,999 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్పటికే అమెరికా , చైనా, ఐరోపా దేశాల్లో విడుదలైంది. చైనా లో దీని ధర రూ.56,300  , అమెరికాలో రూ.76,300 ఉంది. అమెజాన్ వెబ్ సైట్ లోనూ ‘ షావోమీ 12 ప్రో’ విక్రయాలు జరగనున్నాయి. దీనికి ప్రధాన పోటీ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ‘ వన్ ప్లస్ 10 ప్రో’ నుంచి ఎదురుకానుంది. దాని ధర రూ.70,000. ‘ వన్ ప్లస్ 10 ప్రో’ తో పోలిస్తే తక్కువ ధర ఉండటం ‘ షావోమీ 12 ప్రో’ కు కలిసొచ్చే అవకాశం ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ తో ఈ ఫోన్ వస్తుంది. 6.73 అంగుళాల స్క్రీన్ తో పాటు WQHD+ రేజెల్యూషన్ ఉంటుంది. 1500 నిట్స్ బ్రైట్ నెస్ తో కూడిన E5 ఆమోల్డ్ ప్యానెల్ ఉంటుంది. 120 HZ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది. 240 HZ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఫోన్ ప్యానెల్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అమర్చి ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా ఉంటుంది. వీటిలో ఒకటి సోనీ IMX707 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఫోన్ ముందు భాగంలో 32 మెగా పిక్సెల్స్ తో ఉండే ఒక సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ లో 4,600 MAH తో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 120 వాట్స్ ఛార్జర్ ను కూడా ఫోన్ తో పాటు ఇస్తారు. ఈ ఫోన్ ను 50 వాట్స్ వైర్ లెస్ ఛార్జింగ్ చేసుకునేందుకు అనుగుణంగా రూపొందించారు. 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. స్పీకర్ సిస్టం ను ‘ హర్మన్ కార్డన్ ‘ కంపెనీ అభివృద్ధి చేసింది.

మోటోరోలా జీ52 విడుదల


మోటోరోలా జీ52ను సోమవారం విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 90 హెచ్‌జడ్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేలాంటి హై ఎండ్ స్పెసిఫికేషన్ కలిగి ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్‌ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుంది. గతేడాది రిలీజ్ చేసిన మోటో జీ51 5జీ స్మార్ట్‌ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వేరియంట్. మోటోరోలా ఇండియా రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసిది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499గా పేర్కొంది. చార్‌కోల్ గ్రే, పోర్సీలెయిన్ వైట్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.. మే 3 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయని మోటోరోలా ఇండియా పేర్కొంది. ఫ్లిప్‌కార్డ్‌తోపాటు ఇతర అన్ని లీడింగ్ స్టోర్స్‌లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి. మెటో జీ52 ఫోన్‌లో పీఓఎల్ఈడీ 90 హెచ్‌జడ్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఫోన్ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. డీసీఐ-P3 సాంకేతికతతో 25% అదనపు రంగుల గేమట్ కలిగి ఉంది. డీసీ డిమ్మింగ్, 5ఎస్‌జీఎస్‌ బ్లూ లైట్, మోషన్ బ్లర్ రిడక్షన్ సర్టిఫికేషన్ ఉంటుంది. 8మెగా పిక్సెల్‌ అల్ట్రా-వైడ్ కెమెరాతో 50మెగా పిక్సెల్‌ క్వాడ్ ఫంక్షన్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. 16మెగా పిక్సెల్‌ ఫ్రంట్ లెన్స్ ఉంది. ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీతోపాటు ప్రత్యేక మైక్రో-SD కార్డ్ స్లాట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ అవ్వడంతోపాటు మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటాయి. 33W చార్జర్‌, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 680తో పాటు 6 GB వరకు ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్ ర్యాంతో నడుస్తుంది. ఐపీ52 వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో కూడా వస్తుంది. ఫోన్‌లో 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కూడా ఉంది.

Sunday, April 24, 2022

యమహా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ యమహా E01


యమహా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. యమహా నుంచి రాబోయే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ యమహా E01 పరీక్షలను సైతం మొదలు పెట్టింది. థాయ్‌లాండ్‌, తైవాన్‌, ఇండోనేషియాతో పాటు మలేషియాలో యమహా E01 ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ స్కూటర్‌ అన్ని విధాలుగా తట్టుకునేలా కంపెనీ రూపొందించింది. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్‌కు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. సీటీ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను రూపొందించింది. యమహా ఈ01 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 4.9 kwh లిథియం-అయాన్‌ బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ సహాయంతో 5000ఆర్‌ఎంపీ వద్ద 8.1kw, 1,950 ఆర్‌పీఎం వద్ద 30.2ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌ సుమారు 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మూడు పవర్‌ మోడ్‌లతో పాటు రివర్న్‌ మోడ్‌లో వస్తుంది. ఈ స్కూటర్‌లో మూడు రకాల ఛార్జింగ్‌లు ఉంటాయి.

32 మందితో గ్రూప్ వాయిస్ కాలింగ్ !


వాట్సాప్ కమ్యూనిటీ ట్యాబ్, ఎమోజీ రియాక్షన్లు, బిగ్ సైజ్ ఫైల్ షేరింగ్ వంటి చాలా ఫీచర్ల ను తీసుకువస్తున్నట్లు వారం రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. సింగిల్ ఆడియో కాల్‌లో  ఒకేసారి 32 మంది మాట్లాడుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సాప్ అనౌన్స్ చేసింది. అయితే ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే లేటెస్ట్ ఐఓఎస్ స్టాండర్డ్ వెర్షన్‌ లో రిలీజైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది కొన్ని దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఇండియన్ యూజర్లకు కూడా న్యూ ఫీచర్ల తో కూడిన కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ విడుదల చేస్తోంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో గరిష్ఠంగా 32 మంది యూజర్లు గ్రూప్ వాయిస్ కాల్‌లో పాల్గొనవచ్చు. ఇంతకుముందు వాట్సాప్ గ్రూప్ ఆడియో కాల్‌లో 8 మంది మాత్రమే ఒకేసారి మాట్లాడుకోగలిగారు. అయితే ఇప్పుడు యూజర్ల పరిమితిని వాట్సాప్ పెంచింది. ఈ ఫీచర్ చాలామందికి ఉపయుక్తంగా ఉండనుంది. అయితే లేటెస్ట్ అప్‌డేట్‌ సోషల్ ఆడియో లేఅవుట్ , స్పీకర్ హైలైట్, వేవ్‌ఫామ్‌ల ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వాయిస్ కాల్స్‌లో యూజర్ల సంఖ్య పెరిగినప్పుడు న్యూ లుక్ కనిపించాలని ఇది ఆడియో లేఅవుట్ ఇంప్రూవ్ చేసింది. ఈ విజువల్ ఫీచర్లన్నీ చక్కగా కనిపించే ఇంటర్‌ఫేస్‌ను అందిస్తాయి. ఇదే అప్‌డేట్‌లో వాయిస్ మెసేజ్ బబుల్‌ల కోసం అప్‌డేటెడ్ డిజైన్‌లు, కాంటాక్ట్ & గ్రూప్‌ల కోసం ఇన్ఫో స్క్రీన్‌లు ఉన్నాయి. ఇంకా ఈ అప్‌డేట్‌లో గ్యాలరీలో ఫేవరెట్ మీడియాను యాక్సెస్ చేసే సదుపాయం ఉంది. కరోనా సమయంలో వాట్సాప్ గ్రూప్ వాయిస్ కాల్‌  ఫీచర్ తీసుకొచ్చింది. ఇది మొదట్లో నలుగురు యూజర్లు ఒకేసారి గ్రూప్ కాల్‌లో చేరడానికి అనుమతించింది, ఆ తర్వాత ఎనిమిది వరకు పొడిగించింది. ఈ పరిమితి ఇప్పుడు 32ki మారుతోంది. వాట్సాప్ వాయిస్ కాల్‌లు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి ఫ్రీగా హెచ్‌డీ ఆడియో క్వాలిటీని ఆఫర్ చేస్తాయి. అయితే వీటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ తప్పనిసరి. వాయిస్ కాల్‌ని ప్రారంభించడానికి, యూజర్లు ఏదైనా కాంటాక్ట్‌ ఓపెన్ చేసి కాల్ ఐకాన్‌పై నొక్కాలి. గ్రూప్ వాయిస్ కాల్‌ని స్టార్ట్ చేసేందుకు ఓపెన్ గ్రూప్ చాట్> కాల్ ట్యాబ్‌ > ప్లస్ ఐకాన్ > స్టార్ట్ గ్రూప్ కాల్‌ ఆప్షన్లపై క్లిక్ చేయాలి. వాట్సాప్ ఇటీవల 2జీబీ వరకు సైజు ఉన్న ఫైల్‌లను షేర్ చేయడం వంటి మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు ప్రకటించింది. అలానే గ్రూప్ చాట్ అడ్మినిస్ట్రేటర్‌ని ఎప్పుడైనా ఇబ్బందికర మెసేజెస్ తొలగించడానికి కూడా వాట్సాప్ అనుమతించనున్నట్లు తెలిపింది. రిమూవ్ లేదా డిలీట్ చేసిన ఈ మెసేజెస్ గ్రూప్ సభ్యులెవరికీ కనిపించవని కంపెనీ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ కమ్యూనిటీలను సృష్టించే ఆప్షన్ కూడా అందిస్తుంది. కమ్యూనిటీస్ ఫీచర్‌తో స్కూళ్లు, రెసిడెన్షియల్ సొసైటీలు, స్నేహితుల గ్రూప్స్ అన్ని కలిసి ఒకేసారి సులభంగా కమ్యూనికేట్ అవ్వచ్చు. అలాగే ఏ విషయంపైనైనా అనేక గ్రూపులతో డిస్కస్ చేయొచ్చు

షియోమీ నుండి విడుదల కానున్న కొత్త ఉత్పత్తులు !


షియోమీ ఏప్రిల్ 27 న జరగనున్న లాంచ్ ఈవెంట్ ద్వారా పలు డివైజ్ లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా Xiaomi 12 Pro మరియు షియోమీ స్మార్ట్ టీవీ 5A లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో విడుదల చేయనున్నట్లు చెబుతున్న స్మార్ట్ టీవీ కొన్ని కీలకమైన ఫీచర్లను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. టీజర్ ద్వారా అందించిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తీసుకువస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇది మాత్రేమే కాదు మరిన్ని వివరాలను గురించి కూడా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ షియోమీ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ అతి సన్నని బెజెల్స్ తో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన Vivid కలర్స్ ను అందించే విధంగా Truly Vivid డిస్ప్లేతో వస్తున్నట్లు కూడా చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీమీ ప్రీమియం మరియు సుందరమైన ఫినిషింగ్ తో కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సిరీస్ నుండి గతంలో వచ్చిన స్మార్ట్ టీవీ 4A కి తరువాత తరం స్మార్ట్ టీవీగా 5A వస్తుంది. అంటే, ఫీచర్ల పరంగా మరింత కొత్తగా షియోమీ స్మార్ట్ టీవీ 5A ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎక్కువగా ఎటువంటి స్పెక్స్ వెల్లడించనప్పటికీ, గతంలో వచ్చిన స్మార్ట్ టీవీ 4A లో వున్నా డిస్ అడ్వాంటేజ్ లను దాటి స్పెక్స్ మరియు ఫీచర్ల పరిధిని మరింతగా పెంచవచ్చని భావిస్తున్నారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0 సపోర్ట్ మరియు Dts-HD తో పాటుగా Dolby Audio సపోర్ట్ అందించడమే కాకుండా సౌండ్ వాట్స్ ను కూడా 4A కంటే పెంచవచ్చు. ఇవన్నీ కూడా స్మార్ట్ టీవీ లో షియోమీ జత చేయవచ్చని భావిస్తున్న ఫీచర్లు మాత్రమే. ఈ టీవీ స్పెక్స్ గురించి ఇప్పటి వరకూ షియోమీ ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.

ఫోన్ అతిగా వాడితే చర్మపై కలిగే నష్టాలు !


ఫోన్ ఎక్కువసేపు చేతిలో ఉంటే దాని ప్రభావం చర్మం పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నికెల్, కోవాల్ట్ వంటి వాటిని ఫోన్ల తయారీలో వాడుతుంటారు. వీటి నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్ కిరణాలు, చర్మంలోని యాంటీజెన్స్ పై ప్రభావం చూపిస్తాయి. దీంతో చర్మం అలర్జీలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా డెర్మటైటిస్ కు కారణం అవుతుంది. ఎక్కువసేపు అదేవిధంగా ఫోన్ స్క్రీన్ చూస్తుంటే కళ్ల పక్కన గీతలు వస్తాయట. చిన్న అక్షరాలు..తక్కువ వెలుతురులో చదవడమూ కూడా దీనికి కారణం అవుతాయి. ఫోన్ చేత్తో పట్టుకుని ఎక్కువసేపు మెడను కింది వంచి చూడటం వల్ల ఆ ప్రదేశంలో ముడతలు వస్తాయి. ఇది వృద్ధాప్య ఛాయలకు చిహ్నం. దీర్ఘకాలంలో అక్కడ కొలాజెన్ తగ్గి చర్మం సాగుతుంది. మొబైల్ నుంచి వచ్చే నీలికాంతి మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. కళ్లు ఉబ్బినట్లుగా ఉండటమే దీనికి కారణం. దీర్ఘకాలంలో ఈ సమస్య కళ్ల కింద నల్లటి వలయాలకు దారి తీస్తుంది. ఫోన్ అవసరం లేనప్పుడు దానిని ఎక్కడో ఒక స్థలంలో పెడుతుంటాం. దీంతో దుమ్ము, సూక్ష్మ క్రిములు చేరతాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు అవి చర్మంలోకి చేరి అలర్జీలు, యాక్నేకు దారి తీస్తాయి. కాబట్టి కాలక్షేపానికి ఫోన్ పై ఆధారపడకండి. ఎప్పటికప్పుడు స్క్రీన్ శుభ్రం చేయాలి. ఫోన్ మాట్లాడేప్పుడు చర్మానికి కాస్త దూరంగా పెట్టి మాట్లాడుకోవడం మంచిది.

ఫ్యాబ్రిక్‌ రింకిల్‌ రిమూవర్‌

 


ఎలాంటి ముడతల్ని అయినా చిటికెలో మాయం చేసేందుకు వచ్చిందే ఇన్‌స్టంట్‌ ఫ్యాబ్రిక్‌ రింకిల్‌ రిమూవర్‌. ముడతలు పడిన దుస్తుల మీద దీన్ని స్ప్రే చేస్తే చాలు.. ఇస్త్రీ చేసినంత చక్కగా తయారైపోతుంది. ఇందులోని రసాయనాలు ఫ్యాబ్రిక్‌కు ఏమాత్రం హాని చేయవు. స్ప్రే తాలూకు తేమ క్షణాల్లో ఆరిపోతుంది కూడా. లావెండర్‌ సువాసన వెదజల్లే మ్యాజికల్‌ రింకిల్‌ రిమూవర్‌ ధర. రూ.299 మాత్రమే. పిల్లలతో దూర ప్రయాణాలంటే చాలా కష్టం. ముఖ్యంగా నిద్రలేకపోతే పసిబిడ్డలు చికాకుపడతారు. సతాయిస్తారు. ఇక ఆ ఇబ్బంది ఉండదు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు, పిల్లలు హాయిగా పడుకునేందుకు వీలుగా మాక్స్‌కోసి ఐరిస్‌ ట్రావెల్‌ కాట్‌ వచ్చేసింది. దీంట్లో బిడ్డల్ని పడుకోబెట్టి ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. పిల్లల వయసును బట్టి దీని ఎత్తు, వెడల్పు సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రయాణాల్లోనే కాదు హాల్లో, గార్డెన్లో ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. పిల్లలను చక్కగా పడుకోబెట్టొచ్చు. మడిచి బ్యాగ్‌లా ప్యాక్‌ చేసుకునే వీలు కూడా ఉంది. ఈ పిల్లల పడక ఆన్‌లైన్‌ ధర రూ.34,999 మాత్రమే. ఎండాకాలం వచ్చిందంటే చాలు. ఎంత చక్కగా స్నానం చేసినా కాసేపటికే చెమట కంపు చంపేస్తుంది. ముఖ్యంగా షూ, సాక్సుల చెడువాసన హానికరం కూడా. బ్యాక్టీరియా దాడిచేసి పాదాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆ హానికారక క్రిములకు చెక్‌ పెట్టేందుకు వచ్చిందే.. ఆడర్‌ ప్రొటెక్టర్‌. షూ వేసుకునేముందు ఒకసారి పాదాలమీద, షూలోపల స్ప్రే చేస్తే చాలు. బ్యాక్టీరియాకు చెక్‌ పెట్టినట్టే. దుర్వాసన కూడా రాదు. దీని తయారీలో రసాయనాలను వాడలేదట. అంటే, పర్యావరణ హితమైంది కూడా. ఈ స్ప్రే ధర రూ.699 (500మి.లీ). పార్టీలు, ఫంక్షన్లు అంటే మ్యూజిక్‌ ఉండాల్సిందే. పాటలు, డ్యాన్సులతో అదిరిపోవాల్సిందే. శుభకార్యాలే కానక్కర లేదు. నలుగురు స్నేహితులు పోగైనప్పుడు కూడా గానాబజానాతోనే జోష్‌ వస్తుంది. పెద్దపెద్ద ఫంక్షన్లు అయితే డీజేలు, స్పీకర్లు పెట్టించొచ్చు. చిన్నపాటి గెట్‌-టుగెదర్స్‌ మాటేమిటి? ఇలాంటి సందర్భాల్లోనూ హుషారు నింపేందుకు వచ్చిందే.. పెబుల్‌ థండర్‌ స్పీకర్‌. బ్లూటూత్‌తో దీన్ని ఫోన్‌కు కనెక్ట్‌ చేస్తే చాలు. నచ్చిన పాటలు వినొచ్చు. రెండు గంటలు చార్జ్‌ చేస్తే ఐదు గంటలసేపు ఆగకుండా అలరిస్తుంది. దీని ఆన్‌లైన్‌ ధర. రూ. 4,949.

Saturday, April 23, 2022

హోండా కంపెనీ నుంచి ప్లెక్స్‌ ఫ్యూయల్‌ కమ్యూటర్‌ మోటార్‌ సైకిల్‌


ప్లెక్స్‌ ఫ్యూయల్‌ కమ్యూటర్‌ మోటార్‌ సైకిల్‌ను రూపొందిస్తున్నట్లు హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ ఇండియా ప్రకటించింది. దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహనాల కంపెనీ అయిన హోండా మోటార్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. హోండా ఇప్పటికే బ్రెజిల్‌లో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ మోటార్‌ సైకిళ్లను విక్రయిస్తోంది. ఫ్లెక్స్‌ ప్యూయల్‌ ఇంజిన్లతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైక్‌లను భారత్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు హోండా మోటార్‌ తెలిపింది. ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్లు పెట్రోల్‌, ఇథనాల్‌  రెండింటితో నడుస్తాయి. హోండా ఈ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తే టీవీఎస్‌ మోటారు తర్వాత ఈ బ్రాండ్‌ తీసుకు వచ్చిన రెండో కంపెనీగా నిలువనుంది. టీవీఎస్‌ కంపెనీ నుంచి ఇప్పటికే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో తయారు చేసిన బైకు అపాచీ ఆర్‌టీఆర్‌200 ఎఫ్‌ఐ ఈ100ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌లతో వాహనాల ట్యాంకులకు వివిధ రకాల ఇంధనాలను జోడించవచ్చు. వాహనాన్ని పెట్రోల్, పెట్రోల్ తోపాటు ఇథనాల్ మిశ్రమాన్ని ఏ నిష్పత్తిలోనైనా లేదా స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడపవచ్చు. దీని కోసం పెట్రోల్ ఇంజిన్‌లో ఇంధన పంపు, నియంత్రణ మాడ్యూల్‌లో మార్పులు చేస్తారు. అయితే ఈ ఇంజిన్‌లో ఉపయోగించే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ధర రూ. 60-62 ఉంటుంది. అంటే లీటరుకు రూ. 35-40 ఆదా చేసుకోవచ్చు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దేశంలో కాలుష్య స్థాయి కూడా తగ్గుతుంది. త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లను విడుదల చేస్తామని హోండా కంపెనీ వెల్లడించింది. వీటిని తయారు చేసేందుకు హోండా మోటారు తన కంపెనీకి చెందిన ఇతర సబ్సిడరీల నుంచి సాయం పొందనుంది. అయితే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో నడిచే హోండా సీజీ150 టైటాన్‌ మిక్స్‌ను 2009లో బ్రెజిల్‌లో విడుదల చేసింది. ఈ బైక్‌ పెట్రోల్, ఇథనాల్‌ రెండింటితో నడుస్తుంది. ఆ తర్వాత ఎన్‌ఎక్స్ఆర్ 150, బ్రోస్ మిక్స్, బీఐజెడ్ 125 ఫ్లెక్స్‌ బైకులను హోండా బ్రెజిల్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లతో విడుదల చేసింది.

కాల్ రికార్డింగ్ ఫీచర్ తొలగించిన ట్రూకాలర్ యాప్


మే 11 నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో అన్ని యాప్‌లను తొలగిస్తున్నట్టు గూగుల్ గురువారం ప్రకటించింది. దీనిపై Truecaller ప్రతినిధి మాట్లాడుతూ గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్ విధానాలను అప్ డేట్ చేసిందని, గూగుల్ కొత్త రూల్ ప్రకారమే.. తమ యాప్‌లోనూ ఇకపై కాల్ రికార్డింగ్‌లను అందించలేమని తెలిపింది. ఇప్పటికే మీ ఫోన్ డివైజ్‌లో స్థానికంగా ఉన్న కాల్ రికార్డింగ్‌ ఆప్షన్‌పై ఎలాంటి ప్రభావితం చేయదు. ట్రూకాలర్‌లో యూజర్ల డిమాండ్ ఆధారంగా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం కాల్ రికార్డింగ్‌ను తీసుకొచ్చింది. ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్ అందరికీ ఉచితంగా అందిస్తోంది. గూగుల్ యాక్సెసిబిలిటీ APIని ఉపయోగించి ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం జరిగిందని ట్రూకలర్ ప్రతినిధి తెలిపారు. Google చాలా ఏళ్లుగా కాల్ రికార్డింగ్ యాప్ సర్వీసులను వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే.. కాల్ రికార్డింగ్ అనేది యూజర్ల ప్రైవసీని ఉల్లంఘించడమే అని కంపెనీ విశ్వసిస్తోంది. గూగుల్ సొంత డయలర్ యాప్‌లోని కాల్ రికార్డింగ్ ఫీచర్ ఎనేబుల్ అయిన విషయం ముందే తెలుస్తుంది. ఈ కాల్ ఇప్పుడు రికార్డ్ అవుతుందంటూ వార్నింగ్ వస్తుంది. కాల్ రికార్డింగ్ ప్రారంభమయ్యే ముందు రెండు వైపులా వినబడుతుంది. రీకాల్ చేయడానికి గూగుల్ ఆండ్రాయిడ్ 6 లో రియల్ టైం కాల్ రికార్డింగ్‌ని బ్లాక్ చేసింది.  ఆండ్రాయిడ్ 10 డివైజ్‌ల్లో మైక్రోఫోన్‌లో కాల్ ఆడియో రికార్డింగ్‌ను తొలగించింది. కొన్ని కాల్ రికార్డింగ్ యాప్‌లు ఆండ్రాయిడ్ 10 అంతకంటే ఎక్కువ వెర్షన్‌ డివైజ్‌లలో కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీని అందించే యాక్సెసిబిలిటీ సర్వీస్‌ను యాక్సెస్ చేసే వీలుంది. ఈ నేపథ్యంలోనే యాక్సెసిబిలిటీ API రూపొందించలేదంటూ రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ కు అనుమతి లేదని అప్‌డేట్ ప్లే స్టోర్ పాలసీ సూచిస్తోంది. ఈ కొత్త రూల్ కేవలం థర్డ్-పార్టీ యాప్‌లపై మాత్రమే ప్రభావం చూపుతుందని గూగుల్ స్పష్టం చేసింది. మీ డివైజ్ గూగుల్  డయలర్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటే అది పని చేస్తుంది. కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో ఏదైనా ప్రీలోడెడ్ డయలర్ యాప్‌లు ఉన్నా అవి కూడా పనిచేస్తాయని తెలిపింది. గూగుల్ ప్లే  స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఇతర థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ మాత్రమే తొలగించినట్టు గూగుల్ తెలిపింది. కాల్‌లను రికార్డ్ చేసేందుకు యూజర్లను అనుమతించే ఏదైనా యాప్ సర్వీసులను మే 11న ప్లే స్టోర్ లో  బ్లాక్ చేయనుంది. 

Popular Posts