Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, January 31, 2022

మొబైల్ ఫోన్లు, పెద్ద టీవీల ధరలు తగ్గబోతున్నాయా?

 


బడ్జెట్ 2022పై వేతన జీవులు, బ్యాంకులు, రిటైలర్లు, ఫిన్‌టెక్ సంస్థలు సహా అనేక రంగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఈ బడ్జెట్ ప్రతి సెక్టార్‌కు కీలకంగా మారనుంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్ రంగంలో ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌ల పార్ట్స్ లేదా సబ్-పార్ట్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం సవరించబోతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌లు, పెద్ద టీవీలు ఈ ఏడాది నుంచి తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని సవరించడం వల్ల బడ్జెట్ 2022 సమయంలో ఎలక్ట్రానిక్ రంగం మెరుగుపడుతుంది. అయితే వినియోగదారుల కోసం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు విక్రయించే రిటైలర్లు ఇతర డిమాండ్‌లు వినిపిస్తున్నారు. "2022-23 బడ్జెట్‌తో అసమానతను తగ్గించడానికి ముడి పదార్థాల ధరలకనుగుణంగా ప్రభుత్వం అన్ని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై జీఎస్‌టీని తగ్గించాలని ఆశిస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజుల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను అందరూ నిత్యావసరాలుగా భావిస్తున్నారు." అని వెస్టింగ్‌హౌస్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్  వైస్ ప్రెసిడెంట్ పల్లవి సింగ్ అన్నారు. 2022 బడ్జెట్‌లో టెలివిజన్‌లపై జీఎస్‌టీ తగ్గింపు అవసరమని ఆమె అన్నారు. "32 అంగుళాల వరకు ఉన్న టెలివిజన్‌లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. 28 శాతం రేటు పరిధిలోకి వచ్చే టెలివిజన్‌లు కూడా ఉన్నాయి. 43 అంగుళాల వరకు ఉన్న టెలివిజన్‌లలో కూడా 18 శాతానికి రేటును తగ్గించడం వల్ల వినియోగదారులకు పెద్ద ఊరట కల్పించినట్లు అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు 32 నుంచి 43 రేంజ్ లోనే టీవీలను కొనుగోలు చేస్తారు," అని సింగ్ తెలిపారు. "ప్రస్తుతం మనం మరొక కరోనా వేవ్ కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఆత్మ నిర్భర్ భారత్ ఎంత ముఖ్యమో తెలుస్తోంది. భారతీయ తయారీ, MSMEలను పెంచడానికి... మాకు స్థిరమైన జీఎస్‌టీ పన్ను స్లాబ్ అవసరం. ఏ ఉత్పత్తి 18 శాతం స్లాబ్‌కు మించకూడదు. మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడానికి వారు ఇప్పుడు వినియోగదారులను ప్రోత్సహించాలి" అని ఓ కంపెనీ అధికారి వెల్లడించారు. "ఇలా చేయడం ద్వారా భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద టీవీ మార్కెట్‌గా అవతరిస్తుంది. మార్కెట్ పరిమాణం ఏటా 15 శాతం వృద్ధి చెంది 16 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. పరిశ్రమ స్థిరమైన స్థితికి వెళుతున్నందున, ప్రస్తుతానికి ఎలాంటి కస్టమ్స్ సుంకాలను మార్చవద్దని మేం ప్రభుత్వాన్ని కోరుతున్నాం," అని సదరు అధికారి చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలను ప్రభుత్వం పెంచాలని పల్లవి సింగ్ అభిప్రాయపడ్డారు. "ప్రపంచంలో ప్రస్తుత సెమీకండక్టర్ కొరత దృష్ట్యా, మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రంగానికి సహాయం చేయాలి. ఎలక్ట్రానిక్స్‌పై జాతీయ విధానం కింద పథకాలను అందించాలి. అవసరమైన పెట్టుబడి పరిమాణం భారీగా ఉన్నందున, ఒక సంస్థపై భారాన్ని తగ్గించడానికి పన్ను రాయితీ పథకాల ద్వారా కూడా మద్దతు ఇవ్వాలి." అని ఆమె అన్నారు.

ఐఫోన్ ప్రో మాక్స్ లో 120HZ యానిమేషన్!

యాపిల్ ఐఫోన్ 13 ప్రో (ప్రో మ్యాక్స్)లో 120Hz ప్రమోషన్ డిస్ ప్లేతో రానుంది. అది కేవలం సెకనుకు 120 ఫ్రేముల డిస్ ప్లే అందించగల యాప్ లకు మాత్రమే అందించేది. అలాంటిది ఐఓఎస్ 15.4 బీటాతో అన్ని అప్లికేషన్లకు 120 Hzల యానిమేషన్ అందిస్తున్నారట!.  దీనిని బట్టి చూస్తుంటే యాపిల్ కోర్ యానిమేషన్ బగ్ క్లియర్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వెర్షన్ రిలీజ్ అయ్యేంతవరకూ సెకనుకు 120 ఫ్రేములు రావడమనేది ఊహాగానం మాత్రమే. దాంతోపాటు iOS 15.4 బీటా వెర్షన్ లో ఫేస్ మాస్క్ ఉన్నా ఫేస్ ఐడీని అన్ లాక్ తీసుకునే ఫీచర్ తీసుకొస్తున్నారు. కంటిచుట్టూ ఉన్న భాగాన్ని గుర్తించే యూనిక్ ఫీచర్లతో రూపొందించనుంది ఈ టెక్ దిగ్గజం. కాకపోతే ఈ ఫీచర్ వాడుకోవాలనుకుంటే మాస్క్ పెట్టుకుని ఫేస్ తో ఒకసారి రీస్కాన్ చేసుకోవాల్సి ఉంటుందట.

వాట్సప్ యూజర్లకు అలర్ట్...!


ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారని అంచనా. భారతదేశంలోనే 48 కోట్లకు పైనే యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం వాట్సప్ నిత్యం అనేక ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికీ యూజర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్ వాట్సప్‌లో లేవు. వాట్సప్‌లో లేని ఫీచర్స్ కోసం యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్స్ వాట్సప్‌ని బైపాస్ చేసి యూజర్లకు కావాల్సిన ఫీచర్స్ అందిస్తుంటాయి. అయితే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో రిస్కు తప్పదు. తాజాగా WAMR పేరుతో ఓ యాప్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. డిలీట్ చేసిన మెసేజెస్, వాట్సప్ స్టేటస్‌లను రికవర్ చేసేందుకు ఉపయోగించే యాప్ ఇది. వాట్సప్‌లో ఒక యూజర్ ఏదైనా మెసేజ్ పంపితే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశం ఉంది. అంటే అవతలివారు చూడకముందే ఆ మెసేజ్ డిలీట్  చేయొచ్చు. ఇందుకోసం delete message for everyone ఆప్షన్ ఉంది. అయితే అవతలివారు మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత This message was deleted అని కనిపిస్తుంది. అవతలివారు ఏదో మెసేజ్ పంపి డిలీట్ చేశారని తెలియడంతో యూజర్లలో ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలవుతుంది. వాట్సప్‌లో తిరిగి ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఇలా డిలీట్ చేసిన మెసేజెస్ తెలుసుకుంటున్నారు యూజర్లు. WAMR యాప్ కూడా ఇలాగే ఉపయోగపడుతోంది. WAMR యాప్ మీకు వచ్చే నోటిఫికేషన్స్‌ని ట్రాక్ చేస్తుంది. ఒకవేళ అవతలి వ్యక్తం మెసేజ్ డిలీట్ చేసినా WAMR యాప్ మీ నోటిఫికేషన్ హిస్టరీని రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ నుంచి మీకు వచ్చిన మెసేజెస్ చూడొచ్చు. అందులో డిలీట్ చేసిన మెసేజెస్ కూడా కనిపిస్తాయి. అయితే ఇలాంటి యాప్స్‌తో ఆన్‌లైన్ ప్రైవసీ విషయంలో రిస్కు ఉంటుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ యాప్ పనిచేయడానికి అనేక సెట్టింగ్స్‌కు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని కాబట్టి ఈ యాప్ ప్రమాదకరమని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలోని (IICS) సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ పనిచేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ, నెట్వర్క్, నోటిఫికేషన్స్ యాక్సెస్ ఇవ్వాలి. ఇలా స్మార్ట్‌ఫోన్‌ లోని ముఖ్యమైన సెట్టింగ్స్‌కు థర్డ్ పార్టీ యాప్స్‌కు యాక్సెస్ ఇస్తే మీరు రిస్కులో పడ్డట్టే. ఈ యాప్ హానికరమైనదని, సున్నితమైన డేటా థర్డ్ పార్టీ యాప్ చేతుల్లోకి వెళ్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఈ యాప్ లేదా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ ఏదైనా ఉపయోగిస్తున్నట్టైతే వీటితో ఉన్న రిస్కుల్ని గుర్తుంచుకోండి.

ఫిబ్రవరి 9 న వస్తున్న మరో రెడ్ మి స్మార్ట్ టీవీ


షియోమి ఫిబ్రవరి 9 న చాలా ప్రోడక్ట్స్ ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది మరియు వాటిలో Redmi Smart Tv X43 కూడా ఒకటి. ఇది 43 ఇంచ్ సైజులో వస్తున్న 4K UHD స్మార్ట్ టీవీ. ఈ సిరీస్ నుండి ఇప్పటికే X50, X55 మరియు X65 ఇంచ్ రోజుల్లో పెద్ద టీవీలు ఉండగా కంపెనీ ఇప్పుడు బడ్జెట్ ధరలో 4K ని ఆస్వాదించేందుకు వీలుపడే 43 ఇంచ్ సైజులో ఈటీవీని లాంచ్ చేయడానికి షియోమి సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ టీవీ టీజర్ పేజ్ ద్వారా Redmi Smart Tv X43 టీవీని కూడా X సిరీస్ లో ముందుగా తీసుకొచ్చిన పెద్ద టీవీల మాదిరిగా 4K HDR మరియు Dolby Vision సపోర్ట్ తో తీసుకువస్తునట్లు పేర్కొంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవిలో అందించిన సౌండ్ టెక్నలజీ గురించి కూడా తెలిపింది. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు హెవీ సౌండ్ అందించగల 30W స్పీకర్లను కలిగి ఉంటుంది. డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే, ఈ Redmi Smart Tv X43 పేరు సుచినట్లుగానే 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కావచ్చు. ఇందులో, అందించిన ప్రోసెసర్ గురించి పూర్తిగా వివరించలేదు కానీ, ఫ్యూచర్ రెడీ మరియు ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ తో తీసుకువస్తునట్లు మాత్రం తెలిపింది. Xiaomi యొక్క స్వంత PatchWall UIతో ఆండ్రాయిడ్ TV OSలో టీవీ రన్ అవుతుంది. అయితే, ఇది e-ARC మరియు ALLM (ఆటో తక్కువ లేటెన్సీ మోడ్) వంటి దాని పెద్ద సహోదరులలో కనిపించే ఫీచర్లకు మద్దతు ఇస్తుందని మనం ఆశించవచ్చు.

కోవిడ్ ఇన్ఫెక్షన్ పరీక్ష కోసం స్మార్ట్‌ఫోన్ కెమెరా?


కోవిడ్-19 మహమ్మారి రాకతో హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై విపరీతమైన ఒత్తిడిని తీసుకొనివచ్చింది. సంభావ్య ఇన్‌ఫెక్షన్ల కోసం ప్రతిరోజూ వేలాది మంది పరీక్షించడానికి ల్యాబ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. చాలా వరకు ల్యాబ్‌లలో లేదా స్వీయ పరీక్ష కిట్‌లు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్  లేదా RT-PCRని కలిగి ఉంటాయి. ఇది చాలా కుటుంబాలకు ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు దూరంగా ఉంచుతుంది. కానీ ఇప్పుడు పరిశోధకులు కోవిడ్-19 కోసం కొత్త టెస్టింగ్ టెక్నిక్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది తక్కువ ఆదాయ సమూహాల వినియోగదారులు కూడా వారి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి సంభావ్య కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ను పరీక్షించడం సాధ్యమవుతుంది. కోవిడ్-19 కొత్త టెస్టింగ్ టెక్నిక్‌ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటా బార్బరా పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రారంభంలో $100 కంటే తక్కువ పరికరాలు అవసరం. అన్ని పరికరాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక్కో పరీక్ష ధర కేవలం $7 (సుమారు రూ. 525) అని CNET నివేదించింది. టెస్టింగ్ కిట్‌ను సెటప్ చేయడానికి వినియోగదారులకు హాట్ ప్లేట్, రియాక్టివ్ సొల్యూషన్ మరియు వారి స్మార్ట్‌ఫోన్‌లు వంటి సాధారణ పరికరాలు అవసరం. అయితే వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో బాక్టీకౌంట్ అనే పరిశోధకుల ఉచిత యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఫోన్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడిన డేటాను విశ్లేషిస్తుంది మరియు కోవిడ్-19కి సంబంధించి పాజిటివ్ లేదా నెగెటివ్ అని వచ్చినట్లయితే వినియోగదారుకు తెలియజేస్తుంది. JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించబడిన 'SARS-CoV-2 మరియు ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ల గుర్తింపు కోసం స్మార్ట్‌ఫోన్-ఆధారిత లూప్-మధ్యవర్తిత్వ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ అస్సే' అనే పేపరు ప్రకారం వినియోగదారులు తమ లాలాజలాన్ని టెస్ట్ కిట్‌లో ఉంచాలి. దీనిని వేడి ప్లేట్ మీద ఉంచబడిన తర్వాత వినియోగదారులు రియాక్టివ్ సొల్యూషన్‌ను జోడించాలి. దీని తర్వాత ద్రవం యొక్క రంగు మారుతుంది. ఇప్పుడు ద్రవం యొక్క రంగు ఎంత త్వరగా మారుతుందనే దాని ఆధారంగా లాలాజలంలో వైరల్ లోడ్ మొత్తాన్ని యాప్ అంచనా వేస్తుంది. లూప్-మెడియేటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ అనే టెక్నిక్ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ యొక్క అన్ని ప్రధాన ఐదు రకాలను గుర్తించగలదు. ఈ ఐదు రకాలు వరుసగా ఆల్ఫా, B.1.1.7 (UK వేరియంట్); గామా, P.1 (బ్రెజిల్ వేరియంట్); డెల్టా, B.1.617.2 (ఇండియా వేరియంట్); ఎప్సిలాన్, B.1.429 (CAL20C); మరియు ఐయోటా, B.1.526 (న్యూయార్క్ వేరియంట్). 20 రోగలక్షణ మరియు 30 రోగలక్షణ లేని రోగులతో కూడిన 50 మందితో మాత్రమే పరిశోధకులు కొత్త టెక్నాలజీను పరీక్షించారు. ఇది Samsung Galaxy S9 స్మార్ట్‌ఫోన్‌ల కోసం మాత్రమే క్రమాంకనం చేయబడినందున పరీక్ష ఇంకా భారీ విస్తరణకు సిద్ధంగా లేదు. కాబట్టి టెక్నాలజీను పరిశీలించడానికి మరింత పరిశోధన అవసరం. సరళంగా చెప్పాలంటే ఇది ఎప్పుడైనా మార్కెట్లో అందుబాటులో ఉంటుందని ఆశించవద్దు.

Sunday, January 30, 2022

ప్యాసింజర్, స్కూల్ బస్సులలో భద్రతా నిబంధనలను కఠినతరం?


దేశంలోని అనేక ప్రాంతాల్లో బస్సుల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసే ఉంటాం. ఇలాంటి వాటిపై ఆందోళన వ్యక్తంచేసిన ప్రభుత్వం ప్యాసింజర్ బస్సులు, స్కూల్ బస్సుల్లో భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ బస్సులలో అగ్ని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. బస్సులలో ఈ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయాలనే నిబంధన గతంలోనే ఉంది. అయితే పరిమిత స్థలం కారణంగా ఇది చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రయాణికులు కూర్చునే ప్రదేశాల్లో కూడా రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చాలా దూరం ప్రయాణించే బస్సులు, పాఠశాల బస్సులలో ఫైర్ అలారం ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేసింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. సుదూర ప్రాంతాలకు నడుపుతున్న ప్యాసింజర్ బస్సులు, పాఠశాల బస్సుల భాగంలో ఫైర్ ప్రివెన్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాహనాల ఇంజిన్ భాగం నుంచి వెలువడే మంటలను గుర్తించడం, అలారం సౌండింగ్, సప్రెషన్ సిస్టమ్ మాత్రమే అమలు చేశారు. వాహన పరిశ్రమ ప్రమాణం 135 ప్రకారం ఇంజిన్ మంటలు సంభవించినప్పుడు ఈ సిస్టమ్ హెచ్చరిస్తుంది. టైప్ -3 బస్సులు చాలా దూరం ప్రయాణించేలా రూపొందించారు. బస్సుల్లో అగ్నిప్రమాదాల సమయంలో అధిక ఉష్ణోగ్రత, పొగ కారణంగా బస్సులో కూర్చున్న ప్రయాణికులు తరచుగా గాయపడతారు. ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో ఫైర్ వార్నింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలారం మోగిన తర్వాత ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందికి దిగడానికి సమయం లభిస్తుందని వివరించింది.

రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి కారణం?


సాధారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ట్రాక్‌పై ఏ మాత్రం కదలకుండా వెళ్తుంది. దీని వల్ల మనకు అలసట అనేది ఉండదు. రైలు వెళ్లే పట్టాలు ఇనుముతో చేసి ఉంటాయి. ఇనుము అనేది ఎండకు ఎండుతూ వానకు తడుస్తుండటంతో తుప్పు పడుతుంటుంది. కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు. అలా తుప్పు పట్టినట్లయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కానీ రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనే అనుమానం చాలా మందిలో రావచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. రైలు పట్టాలు ఇనుముతో చేసేవే అయినప్పటికీ.. వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఈ ఉక్కులో 1శాతం కార్బన్, 12 శాతం మాంగనీస్ కలిసి ఉంటుంది. అందుకే దీనిని 'సి-ఎంఎన్' రైల్ స్టీల్ అని పిలుస్తారు. దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ. ఒకవేళ తుప్పు పట్టినా తుప్పు రేటు సంవత్సరానికి 0.05 మి.మీ ఉంటుందట. అంటే 1 మి.మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇక పట్టాలపై ఎప్పుడు రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి .. రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు ఎలెప్పుడు పాలిష్ చేసిన మాదిరి మెరుస్తుంటాయి. అందుకే తుప్పు పట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కొంచెం పట్టాలు తేడా అనిపించినా రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తుంటారు. రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తారు. అలాగే రైళ్లు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టవు. రైలు పట్టాలు తుప్పు పట్టకపోయినా సాధారణం ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పడుతుంటాయి. తడిగా ఉన్నా, గాలిలో ఆక్సిజన్‌తో ప్రతిస్పందించినప్పుడు లేదా తడిగా ఉన్నప్పుడు ఇనుముపై గోధుమ రంగు ఐరన్‌ ఆక్సైడ్‌ నిక్షిప్తం చేయబడుతుంది. ఈ గోధుమ రంగు పూత ఇనుము ఆక్సిజన్‌తో ప్రతిస్పందించి ఐరన్‌ ఆక్సైడ్‌ ఏర్పడుతుంది. దీని కారణంగా తుప్పు పడుతుంది. ఇది తేమ కారణంగా జరుగుతుంది.

అన్నిటికీ ఒక్కటే డిజిటల్ కార్డు?


కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును పోలిన మరో కార్డును రూపొందించే కసరత్తు ప్రారంభిస్తోంది. ఈ అంశంపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపిన వివరాలు ప్రకారం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ నంబర్లు, పాన్ వంటి బహుళ డిజిటల్ ఐడిలను లింక్ చేయడానికి ప్రభుత్వం "ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్" కొత్త మోడల్ రూపొందించేందుకు పని చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశ పౌరులు ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ ఐడీ  లను వాడుతున్న సంగతి తెలిసిందే. వీటి స్థానంలో ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ కొత్త డిజిటల్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదిక తెలుపుతుంది. వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం 'ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ ఉపయోపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో సులభం అవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ కొత్త డిజిటల్ ఐడిఅకారణంగా ఆధార్ కార్డ్ నంబర్ మాదిరిగానే ఒక ప్రత్యేక ఐడి రూపొందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ అనేది సెంట్రల్ అండ్ స్టేట్-సంబంధిత ఐడి డేటాను నిల్వ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ డిజిటల్ ID KYC లేదా eKYC (నౌ యువర కస్టమర్‌) ప్రక్రియల కోసం ఉపయోగించవచ్చు. సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం కోసం దేశంలో ఈ-గవర్నెన్స్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎలక్ట్రానిక్ సర్వీసులను, ప్రొడక్టులను, డివైజ్‌లను, ఉద్యోగ అవకాశాలను కవర్ చేస్తుంది. దీంతో పాటు దేశంలో ఎలక్ట్రానిక్  తయారీని కూడా బలోపేతం చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం తాజా ప్రతిపాదనపై విమర్శకులు డిజిటల్ భద్రతతో సమస్యలను లేవనెత్తే అవకాశం ఉండవచ్చిని అంచనా వేస్తుంది. డేటా అంతా ఒకే దగ్గర ఉంటే చోరీకి గురయితే ఎక్కువ ప్రమాదం ఉంటుందనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి అధ్యయనం, రక్షణ చర్యలు తీసుకొన్న తరువాతే అమలులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన త్వరలో పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను, అనుమానాలను, సలహాలను ఫిబ్రవరి 27 వరకు చెప్పవచ్చని సమాచారం.

ఐఫోన్ లో ఫేస్ మాస్క్ ఉన్నా ఫేస్ ఐడీ ఫీచర్ పనిచేయాలంటే...!


ఫేస్ మాస్క్ తో ఫేస్ ఐడీ ఫీచర్ వాడుకోవాలంటే ఐఫోన్ యూజర్లకు చాలా ఇబ్బందిగా మారింది. ఫలితంగా పిన్ మాత్రమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా పనిచేస్తున్న యాపిల్ సంస్థ. ఇప్పుడు మాస్క్ ఉన్నా ఫేస్ ఐడీని గుర్తించేలా ఫీచర్ తీసుకురానున్నారు. iOS 15.4 డెవలపర్ బీటా వెర్షన్ లో ఇది ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఫేస్ ఐడీ సెట్టింగ్స్ లో ఆప్షన్ ఎనేబుల్ డిటెక్షన్ సెలక్ట్ చేసుకోవడం ద్వారా పనిచేస్తుందట. ఫలితంగా సెక్యూరిటీ విషయంలోనూ కాస్త తగ్గినట్లేనని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఈ సెట్టింగ్ లో.. ఫేస్ ఐడీని మాస్క్ ఉన్న లేకున్నా వాడుకోవచ్చు. స్కానింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది పనిచేయడం మొదలవుతుంది. అక్కడే ఒక టాగుల్ మెనూ కూడా కనిపిస్తుంది. కావాలనుకుంటే టెంపరరీగా ఆప్షన్ ను బ్యాన్ చేసుకోవచ్చు కూడా. విచారకరమైన విషయమేమిటంటే.. ఈ ఫీచర్ అన్ని ఐఫోన్ మోడల్స్ లో పనిచేయదు. ఓ ఇంగ్లీష్ మీడియా తెలిపిన వివరాలను బట్టి.. ఐఫోన్12, ఐఫోన్13 సిరీస్ లలో మాత్రమే పనిచేస్తుంది. ఐప్యాడ్ ప్రో సెకండ్ జనరేషన్ లో ఫీచర్ అసలు కనిపించదట.

మ్యాగ్నెట్ కారు రూ.6 లక్షల లోపే !


నిసాన్ ఇండియా తన కొత్త కారు మ్యాగ్నైట్ బుకింగ్ నంబర్లను ప్రకటించారు. 2021లో ఏకంగా నిసాన్ మ్యాగ్నైట్‌కు 78,000కు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. నిసాన్ మ్యాగ్నైట్ మనదేశంలో 2020 డిసెంబర్‌లో లాంచ్ అయింది. అంటే నెలకు దాదాపు 6,500 కార్లు బుక్ అయ్యాయన్న మాట. ఈ కారు ధర మనదేశంలో రూ.5.76 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్లు అందించారు. వీటిలో ఒకటి 1.0 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్ కాగా మరొకటి 1.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ మోటార్. వీటిలో మొదటి ఇంజిన్ 71 బీహెచ్‌పీ, 96 ఎన్ఎం పీక్ టార్క్ అందించనుంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఇందులో ఉండనుంది. ఇక టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ వేరియంట్ 99 బీహెచ్‌పీ, 152 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఈ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్ వేరియంట్‌లో సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండనుంది. ఈ ఫోన్ ఎక్స్‌పోర్ట్ నంబర్లను కూడా కంపెనీ అందించింది. 2021 డిసెంబర్ వరకు మ్యాగ్నైట్‌కు సంబంధించిన 6,344 యూనిట్లను వేరే దేశాలకు ఎగుమతి చేసింది. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రూనే, ఉగాండా, కెన్యా, సేచెల్స్, మొజాంబిక్, జాంబియా, మారిషస్, టాంజానియా, మలావి దేశాలకు ఈ కారు ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది.

Saturday, January 29, 2022

అభివృద్ధి పథంలో భారత్ లో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్!


ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గా భారతదేశం ఉంది. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ పరంగా కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని IDC మరియు ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) 'స్మార్ట్‌ఫోన్ రీ-కామర్స్: ఇండియా మార్కెట్' పేరుతో కొత్త నివేదిక పేర్కొంది. 2021లో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దాదాపు 25 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు ట్రేడ్ అయ్యాయి. ఒక్కో పరికరానికి సగటున $94 లేదా రూ.6,900 చొప్పున $2.3 బిలియన్ కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాయని నివేదిక అంచనా వేసింది. ఇది 2019లోని మార్కెట్ తో పోలిస్తే దాదాపు 14% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే 2025 నాటికి $4.6 బిలియన్ల విలువతో 51 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా కూడా వేస్తున్నారు. ట్రేడ్-ఇన్‌ల కోసం తీసుకువచ్చిన మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో అన్ని సెకండ్‌హ్యాండ్ ఫోన్‌లు 95% కంటే ఎక్కువగా విక్రయించబడుతున్నాయి. అయితే 5% మాత్రమే భారతదేశంలో ఎలాంటి మరమ్మతులు లేదా పునరుద్ధరణల ద్వారా వెళ్తాయి. వినియోగదారు ఎలక్ట్రానిక్స్ పరికరాలలో స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో 90% అమ్మకాలను కలిగి ఉన్న అతిపెద్ద వాల్యూమ్ డ్రైవర్‌గా ఉన్నాయని నివేదిక పేర్కొంది. సెకండ్ హ్యాండ్ పరికరాల మార్కెట్లో విక్రయించబడే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గేమింగ్ కన్సోల్‌లు మరియు కెమెరాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం 2020 నుండి 2025 వరకు 3.9% సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో 2025లో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 1.54 బిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని IDC అంచనా వేసింది. ఈ వృద్ధికి ప్రధానంగా దక్షిణాసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆపాదించబడింది. మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా దేశాల్లో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాప్తి తక్కువగా ఉన్నందున స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ బలంగా ఉంది అని నివేదిక పేర్కొంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం 225.4 మిలియన్ యూనిట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. ఈ సంఖ్య 2024 నాటికి 351.6 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో ఈ సంఖ్య 2025 నాటికి 51 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. 2025 నాటికి సంచిత మార్కెట్ 245 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని IDC అంచనా వేసింది. అందులో 21% లేదా 51 మిలియన్లు మాత్రమే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ ఉండనున్నది అని నివేదికలు తెలిపింది. Cashify, Yaantra, InstaCash, Flipkart Refurbished, Amazon Renewed వంటి సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో సెకండ్‌హ్యాండ్ మార్కెట్ వృద్ధిని సులభతరం చేసిందని నివేదిక పేర్కొంది. ఇది క్రమంగా ఐదు సంవత్సరాల క్రితం 10% కంటే తక్కువగా ఉన్న వ్యవస్థీకృత వాణిజ్య వాటాను 2020లో 15%కి పెంచింది. ఆసక్తికరంగా కొత్త స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లతో పోల్చినప్పుడు ముఖ్యంగా వ్యవస్థీకృత విభాగంలోని సెకండ్‌హ్యాండ్ మార్కెట్‌లో Apple అధిక వాటాను కలిగి ఉంది. $700 కంటే ఎక్కువ ASPని కలిగి ఉన్న కొత్త ఐఫోన్‌లు మాస్ కన్స్యూమర్ సెగ్మెంట్‌కు అందుబాటులో లేవు. అయితే ఆకాంక్షాత్మక విలువ కారణంగా సెకండ్‌హ్యాండ్ పరికరాల మార్కెట్‌లో చాలా ఎక్కువ వాటాను కలిగి ఉంది. అదే విధంగా కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 2% వాటాను కలిగి ఉన్న OnePlus బ్రాండ్ వ్యవస్థీకృత విభాగంలో టాప్ 5 విక్రేతల జాబితాలో ఉంది. సెకండ్‌హ్యాండ్ మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్/ప్రీమియం పరికరాల కోసం ట్రాక్షన్‌ను ప్రదర్శిస్తుంది అని ICEA మరియు IDC సంయుక్త నివేదికలో పేర్కొంది. అంటున్నారు. సెకండ్‌హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ విషయానికి వస్తే ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, పూణే, నోయిడా, అహ్మదాబాద్, ఫరీదాబాద్, ఘజియాబాద్, లక్నో, కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లోనే అత్యధిక విక్రయాలు కేంద్రీకృతమై ఉన్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా జైపూర్ లో దాదాపు 40% అమ్మకాలను కలిగి ఉంది. భారతదేశంలో సెకండ్‌హ్యాండ్ విభాగంలో చిన్న నగరాల వాటా గత కొన్ని సంవత్సరాలుగా పెరిగింది. అసంఘటిత సెకండ్ హ్యాండ్ మార్కెట్ విషయానికొస్తే పెద్ద నగరాల్లో ఇప్పటికే చేతులు మార్చుకున్న లేదా సారూప్య శ్రేణి నగరాల్లో ఉపయోగించిన పరికరాలతో దిగువ-స్థాయి నగరాల నుండి ఎక్కువ డిమాండ్ ఉత్పత్తి ఉందని నివేదిక పేర్కొంది. మొత్తంమీద భారతదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ 2020 నుండి 2025 మధ్య 15% చొప్పున వృద్ధి చెందుతుందని నివేదిక అంచనా వేసింది.

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్!


మెటాకు చెందిన సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎట్టకేలకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్ ఎలా ఉంటుందనే వివరాలను సంస్థ షేర్ చేసింది. ఇదివరకు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ ఫీచర్‌ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే మెసేంజర్‌లో యూజర్లు చేసే చాట్స్‌, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సెక్యూరిటీ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తున్నట్టు మెటా వెల్లడించింది. వ్యక్తిగత ప్రైవసీ, సమాచార భద్రత కోసం ఈ ఎన్‌క్రిప్షన్ అవసరమని మెటా చెబుతోంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అనేది ఒక ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్. ఎన్‌క్రిప్షన్ అంటే ఏదైనా సమాచారాన్ని చదవటానికి వీలులేకుండా కోడ్స్ రూపంలోకి మార్చేయటం. మనకు తెలియకుండా ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని వాడుతూనే ఉన్నాం. ఎన్ క్రిప్షన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు మూడో వ్యక్తి చదవకుండా వేసే లాక్ లాంటిది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్స్ వంటి సేవల్లో ఈ ఎన్‌క్రిప్షన్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అంతకుముందు వరకూ ఈ ఫీచర్ లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది ఇప్పుడు మెసెంజర్‌ని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మెటా తెలిపింది. అయితే ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా పనిచేయదు. ఎవరికి వారు వారి వ్యక్తిగత ప్రైవేట్ చాట్‌ల కోసం E2EE ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

టాటా ప్లేగా మారిన టాటా స్కై...!


టాటా స్కై ఇప్పుడు టాటా ప్లేగా మారింది. ఇకపై టాటా స్కై యూజర్లు టాటా ప్లే సేవల్ని పొందొచ్చు. టాటా ప్లేగా మారిన టాటా స్కై కొత్త ప్లాన్స్‌ని కూడా అందిస్తోంది. ఇప్పటికే ఉన్న ప్లాన్స్‌తో పాటు కొత్తగా టాటా ప్లే ప్యాక్స్‌ని ప్రకటించింది. ఓటీటీ సేవలు కావాలనుకునేవారు ఈ ప్లాన్స్ పొందొచ్చు. టాటా ప్లే ప్యాక్స్ కేవలం రూ.389 నుంచి ప్రారంభం అవుతాయి. టాటా ప్లే పేరుతో సెట్ టాప్ బాక్సులు కూడా వచ్చాయి.  టాటా ప్లే ఎస్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర రూ.1699. పీసీఎం సౌండ్, షోకేస్ మూవీస్, పేరెంటల్ కంట్రోల్ ఫీచర్, ఆటో స్టాండ్‌బై లాంటి ఫీచర్స్ ఉన్నాయి. టాటా ప్లే హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర రూ.1899. ఈ బాక్సుతో 500 పైగా ఛానెళ్లు చూడొచ్చు. త్రీడీ కంపాటబుల్, పీసీఎం సౌండ్, షోకేస్ మూవీస్, పేరెంటల్ కంట్రోల్ ఫీచర్, ఆటో స్టాండ్‌బై లాంటి ఫీచర్స్ ఉన్నాయి. టాటా ప్లే బింజ్+ స్మార్ట్ సెట్ టాప్ బాక్స్ ధర రూ.2499. సెట్ టాప్ బాక్స్, బింజ్ సర్వీస్ ఉచితం. టాటా ప్లే బింజ్ ఒక నెల ఉచితం. 12 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. దీంతో పాటు ఒక నెల అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితం. త్రీడీ కంపాటబుల్, 4ఎక్స్ షార్పర్ పిక్చర్, బిల్ట్ ఇన్ క్రోమ్‌క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్‌తో పనిచేసే వాయిస్ సెర్చ్ రిమోట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. టాటా ప్లే+ హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ ధర రూ.4,999. త్రీడీ కంపాటబుల్, పీసీఎం సౌండ్, డాల్బీ డిజిటల్ ప్లస్, పేరెంటల్ కంట్రోల్ ఫీచర్, షోకేస్ మూవీస్ లాంటి ఫీచర్స్ లభిస్తాయి. ఓటీటీ సేవల్లో నెట్‌ఫ్లిక్స్‌ని కూడా చేర్చింది టాటా ప్లే. మొత్తం 14 ఓటీటీ సేవలు పొందొచ్చు. కోటి 90 లక్షల మంది టాటా స్కై సబ్‌స్క్రైబర్లు టాటా ప్లే సబ్‌స్క్రైబర్స్‌గా మారారు.టాటా ప్లే రూ.175 విజిటింగ్ ఛార్జీలను తొలగించిన సంగతి తెలిసిందే. రీఛార్జ్ చేయని డీటీహెచ్ కస్టమర్లకు రీకనెక్షన్స్ ఉచితంగా లభిస్తాయి.

కలకలం రేపుతున్న కొత్త మాల్‌వేర్!


కొద్ది రోజుల క్రితం జోకర్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో చేరి స్మార్ట్‌ఫోన్ యూజర్ల వివరాలు కాజేసింది. ఇప్పటికీ జోకర్ మాల్‌వేర్ చాలా యాప్స్‌లో బయటపడుతున్నాయి. యూజర్ల ప్రమేయం లేకుండా ప్రీమియం సర్వీసులకు సబ్‌స్క్రైబ్ చేయడమే జోకర్ మాల్‌వేర్ పని. దీంతో స్మార్ట్‌ఫోన్ యూజర్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు మరో మాల్‌వేర్ పలు దేశాల్లో కలకలం రేపుతోంది. BRATA కొత్త వేరియంట్లను సెక్యూరిటీ రీసెర్చర్లు కనుగొన్నారు. ఈ వైరస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. వారి ఇ-బ్యాంకింగ్ వివరాలు అంటే బ్యాంకు అకౌంట్ నెంబర్లు, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ లాంటి వివరాలను కాజేస్తోంది. ఈ వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి చేరుతున్నాయి. యూకే, పోలాండ్, ఇటలీ, స్పెయిన్, చైనా, లాటిన్ అమెరికాలో ఇప్పటికే BRATA కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. 2021 డిసెంబర్ నుంచి కొత్త వేరియంట్ సర్క్యులేట్ అవుతోంది. ఈ మాల్‌వేర్ ఎంత డేంజరస్ అంటే బ్యాంకు వివరాలను కాజేయడం మాత్రమే కాదు... యూజర్ల స్మార్ట్‌ఫోన్ డేటాను మొత్తం డిలిట్ చేసేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంది. BRATA ఆండ్రాయిడ్ మాల్‌వేర్‌ను తొలిసారిగా మల్టీనేషనల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్యాస్పర్‌స్కీ గుర్తించింది. తాజాగా BRATA కొత్త వేరియంట్‌ను Cleafy అనే కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఇ-బ్యాంకింగ్ యూజర్లను టార్గెట్ చేసేందుకే కొత్త వేరియంట్ రూపొందించినట్టు తేల్చారు. గతంలో ఈ బ్యాంకింగ్ ట్రోజాన్‌ను వెబ్‌సైట్లలో పుష్ నోటిఫికేషన్స్ ద్వారా పంపేవారు. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్స్ ద్వారా, థర్డ్ పార్టీ యాప్ స్టోర్ ద్వారా ఈ మాల్‌వేర్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి పంపుతున్నారు హ్యాకర్లు. అంతేకాదు... ఎస్ఎంఎస్‌తో పాటు వాట్సప్ సందేశాల్లో కూడా ఈ మాల్‌వేర్ చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఈ మెసేజెస్ బ్యాంకు నుంచి పంపినట్టుగా ఉంటాయి. దీంతో యూజర్లు ఈజీగా మోసపోతున్నారు. బ్యాంకులే తమకు మెసేజెస్ పంపారనుకొని లింక్స్ క్లిక్ చేస్తున్నారు. హ్యాకర్ల ట్రాప్‌లో పడుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడర్ ద్వారా ఎంటర్ అవుతోంది. యాంటీవైరస్ యాప్స్ ఉన్నా వాటిని కూడా బైపాస్ చేస్తోంది. ఇప్పటివరకు మూడు BRATA వేరియంట్లు గుర్తించారు సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు. BRATA.A కొన్ని నెలల క్రితం బయటపడింది. జీపీఎస్ ట్రాకింగ్‌తో పాటు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంది. BRATA.B వేరియంట్ కూడా ఇలాగే పనిచేస్తుంది. దీంతో పాటు బ్యాంక్ లాగిన్ వివరాలను సేకరిస్తుంది. ఇక BRATA.C వేరియంట్ ప్రైమరీ యాప్ కాకుండా సెకండరీ యాప్ డౌన్‌లోడ్ చేస్తుంది. మరి ఇలాంటి వేరియంట్లతో ఎలా జాగ్రత్తగా ఉండాలన్న సందేహాలు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ చెక్ చేసి అవసరం లేని యాప్స్ డిలిట్ చేయాలి. ఇప్పటికే ఉన్న యాప్స్ ఒరిజినల్ యాప్సేనా కాదా అని చెక్ చేయాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి యాప్స్ అస్సలు డౌన్‌లోడ్ చేయకూడదు. 

ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమా డౌన్‌లోడ్


ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ సేవలకు సంబంధించి ఇప్పటికే చురుకుగా పనులు సాగుతున్నాయి. ముందుగా దేశంలోని 13 మెట్రో నగరాల్లో 5జీ సేవలు మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్) ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ విషయంలో సంచలనాలు క్రియేట్ చేసిన జియో.. 5G రేసులో ముందు వరసలో కనిపిస్తోంది. 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కస్టమర్లకు అందించాలని దేశంలోని 1000 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అందించేందుకు ప్లాన్‌ కూడా సిద్ధం చేసింది జియో. ఈ క్రమంలోనే 5జీ ట్రయల్స్‌ నిర్వహించింది సంస్థ. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఓ స్క్రీన్‌షాట్‌ మాత్రం లీక్ అయ్యింది. లీకైన సమాచరం ప్రకారం చూస్తే.. 4జీ నెట్‌వర్క్ కంటే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ స్పీడ్ 8రెట్లు వేగంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. 420Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో.. 412Mbps అప్‌లోడ్ స్పీడ్‌ జీయో నెట్‌‍వర్క్‌లో ఉంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఇది 15రెట్లు అధికం కాగా.. ఈ స్పీడ్‌తో కేవలం ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముంబై నగరంలో జియో 5జీ నెట్‌వర్క్ టెస్ట్ జరిగింది. జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 46.82ఎంబీపీఎస్, అప్‌లోడ్ స్పీడ్ 25.31ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ డేటాతో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ 8రెట్లు, అప్‌లోడ్ 15 రెట్లు వేగంగా ఉంది. అయితే, ట్రయల్స్‌ సమయంలో వచ్చిన ఫలితాలకు వాస్తవ రూపంలో వాడకంలోకి వచ్చే వేగంలో మార్పులు ఉంటాయి. గతంలో 4జీ విషయంలో కూడా అదే జరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, గురుగ్రామ్, చండీగఢ్, బెంగుళూరు, అహ్మదాబాద్, జామ్‌నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, గాంధీనగర్‌లతో సహా కొన్ని నగరాల్లో 5G లాంచ్ జరుగుతుందని DoT ఇప్పటికే ధృవీకరించింది. హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో అధునాతన వినియోగం కోసం ఆయా రంగాల్లో 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు జియో వెల్లడించింది. అయితే, 5జీ వస్తే మాత్రం ఆ నెట్‌వర్క్ ప్లాన్‌ల రేట్లు బాగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

Friday, January 28, 2022

8,600లకే టెక్నో పాప్ 5ఎక్స్ స్మార్ట్ ఫోన్ ?


ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్ తక్కువ ధరలకే అదిరిపోయే ఫీచర్లతో ఫోన్స్ రిలీజ్ చేస్తూ మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా టెక్నో పాప్ 5ఎక్స్ అనే మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో లాంచ్ చేసింది. తన పాప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల్లో భాగంగా దీన్ని టెక్నో సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ ఇటీవల భారతదేశంలో టెక్నో పాప్ 5 ప్రో, టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే టెక్నో పాప్ 5 ఎక్స్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ మెక్సికో   లో లాంచ్ అయ్యింది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాను అందించారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ కాస్మిక్ షైన్, క్రిస్టల్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో వచ్చింది. ఇది పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. భారతదేశం, ఇతర మార్కెట్‌లలో టెక్నో పాప్ 5X లభ్యత, దాని ధర వంటి వివరాలను టెక్నో సంస్థ ఇంకా వెల్లడించలేదు. లాటిన్ అమెరికా దేశమైన మెక్సికోలో ఇది 115 డాలర్లకు లభిస్తోంది. దీన్నిబట్టి ఇండియాలో ఇది సుమారు రూ.8,600 ధరతో లాంచ్ అవుతుందని చెప్పవచ్చు. టెక్నో పాప్ 5ఎక్స్ డ్యూయల్-సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్)పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచుల (720x1,600 పిక్సెల్‌లు) హెచ్‌డీ+ డిస్‌ప్లేతో, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో వస్తుంది. ఇది 2జీబీ ర్యామ్ తో 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ప్రాసెసర్ ఏంటి అనేది కంపెనీ స్పష్టంగా తెలపలేదు. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించడం విశేషం. వాటిలో రెండు QVGA రిజల్యూషన్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఇది 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇందులో ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టెక్నో పాప్ 5ఎక్స్ ఒక మైక్రో ఎస్‌డీ స్లాట్ ద్వారా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అయితే ఎంత వరకు అనేది ఇంకా తెలియరాలేదు. ఇది 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో 4జీ LTE, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్ఎం వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. మైక్రో-యూఎస్‌బీ పోర్ట్ ద్వారా ఛార్జ్ అయ్యే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీపై ఈ స్మార్ట్‌ఫోన్ నడుస్తుంది. ఏఐ-ఆధారిత పవర్ మేనేజ్మెంట్ 10 శాతం వరకు మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుంది. ఇది 166x75.90x8.5mm కొలతలతో 150 గ్రాముల బరువు ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్ !


భారతదేశంలోని వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త అప్ డేట్ ను తీసుకువచ్చింది. ఈ అప్ డేట్ లో వినియోగదారులు ఇంటి చిరునామాలను ప్లస్ కోడ్‌లతో సేవ్ చేయడానికి మరియు షేర్ చేయవచ్చు. ఎటువంటి ల్యాండ్‌ మార్క్‌లు లేదా వాయిస్ సూచనలను లేకుండానే, వినియోగదారులు వారి ఆహారం, మందులు తదితరాలను వేగంగా డెలివరీ చేయడానికి ఉపయోగించే వారి ఇంటి యొక్క ఖచ్చితమైన డిజిటల్ చిరునామాలను పొందడానికి ఈ నవీకరణ సహాయపడుతుంది. సులభమైన నావిగేషన్ కోసం ప్లస్ కోడ్‌లతో కూడిన చిరునామాలను షేర్ చేయవచ్చు. ప్లస్ కోడ్‌లు ఖచ్చితమైన స్థాన వివరాలను అందించడానికి ఉద్దేశించిన ఉచిత, ఓపెన్ సోర్స్ డిజిటల్ చిరునామాలు. గూగుల్ మ్యాప్స్, ప్రారంభంలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం దీనిని అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇది రాబోయే రోజుల్లో iOS వినియోగదారులకు కూడా అందుబాటులో తీసుకురానుంది. అప్‌డేట్‌ను తెలియజేస్తూ మ్యాప్స్ ద్వారా ఖచ్చితమైన ఇంటి చిరునామాలను అందించడానికి భారతదేశం లోనే మొదటిసారిగా  రూపొందించబడిందని గూగుల్ తెలిపింది. గూగుల్ మ్యాప్స్ లోని తాజా అప్‌డేట్‌ని ఉపయోగించి, దీని ద్వారా మీ ఇంటి చిరునామా కోసం ప్లస్ కోడ్‌ని రూపొందించవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉందని, తర్వాత ఐఫోన్లకు కూడా వస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో, వినియోగదారు "హోమ్" కింద లొకేషన్‌ను సేవ్ చేస్తుంటే, వారికి "ప్రస్తుత స్థానాన్ని ఉపయోగించండి" అని చెప్పే ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లోని లొకేషన్ సేవలను ఉపయోగించి, గూగుల్ మ్యాప్స్ ఒక ప్లస్ కోడ్‌ను రూపొందించింది. ఇది ఇంటి చిరునామాగా ఉపయోగించబడుతుంది. వినియోగదారులు ఇంటి చిరునామాలను భాగస్వామ్యం చేయడానికి మరియు ఉపయోగించడానికి సేవ్ చేసిన ట్యాబ్ కింద ఒక విభాగాన్ని జోడించే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా మీ ఇంటి  ఖచ్చితమైన లొకేషన్ వివరాలను అందించడానికి మీరు ప్లస్ కోడ్‌ను కాపీ చేసి, దాన్ని మీ చాట్‌లో షేర్ చేయవచ్చు. ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ముఖ్యంగా మీ పేరు మరియు ఇమెయిల్ ID వంటి మీ వ్యక్తిగత వివరాలను కలిగి ఉండదు. మీ ఇంటి చిరునామా మీ ప్రైవేట్ గూగుల్ మ్యాప్స్ ప్రొఫైల్‌లో కూడా సేవ్ చేయబడింది. నెల రోజుల క్రితం ఈ ఫీచర్‌ను భారత్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు గూగుల్ తెలిపింది. దేశంలో ఇప్పటికే 300,000 మంది వినియోగదారులు తమ ఇంటి చిరునామాల కోసం దీనిని ఉపయోగిస్తున్నారని కంపెనీ తెలిపింది. "మేము మరిన్ని రకాల ప్రదేశాలకు విస్తరించాలని ఎదురుచూస్తున్నాము మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి అనుభవాన్ని పెంచడానికి ఇ-కామర్స్, లాజిస్టిక్స్ మరియు డెలివరీ కంపెనీలతో భాగస్వామిగా ఉండటానికి అవకాశాల కోసం చురుకుగా చూస్తున్నాము" అని ఉత్పత్తి, అమండా బిషప్ చెప్పారు.

5,000 గ్రహాల్లో ఏలియన్స్?


5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” ఇటీవల ప్రకటించింది. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరిక్షించిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఇఎస్ఎస్) ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ నాసా పేర్కొంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఏప్రిల్ 2018లో నాసా ఈ టీఇఎస్ఎస్ శాటిలైట్ ను ప్రయోగించింది. ఆనాటి నుంచి 5,000 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ  ఉపగ్రహం వాటిలో 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. ఒక్క 2021 ఏడాదిలోనే 24 00 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ టీఇఎస్ఎస్ గుర్తించిందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు. టీఇఎస్ఎస్ గుర్తించిన 5,000 బాహ్యగ్రహాల్లో ఏలియన్స్ జాడలు ఉండే ఉంటాయని అమెరికాలోని అంతరిక్ష పరిశోధకులు వాదిస్తున్నారు. ఆయా గ్రహాలు ఏర్పడిన తీరు, ప్రస్తుతం ఉన్న తీరు, వాటిపై ఉన్న వాతావరణాలను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చారు. టీఇఎస్ఎస్ ఉపగ్రహం ఖగోళ వస్తువును కనిపెట్టి దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత సమయం పడుతుండడంతో ఆయా వస్తువుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఆలస్యం అవుతుంది. టీఇఎస్ఎస్ కంటే ముందు బాహ్యగ్రహాల పరిశోధనకు ప్రయోగించిన కెప్లెర్ టెలిస్కోప్ 2000 ఖగోళ వస్తువులను కనుగొన్నా.. అవేవి.. గ్రహాలుగా నిర్ధారింపబడలేదు. టీఇఎస్ఎస్ కనిపెట్టిన ఒక గ్రహంపై ఏడాది కాలం భూమిపై 16 గంటలకే ముగుస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు. దీంతో టీఇఎస్ఎస్ పనితీరుపై అంతరిక్ష పరిశోధకులకు నమ్మకం కుదిరింది. అందుకే రెండు సంవత్సరాల పని నిమిత్తం అంతరిక్షంలోకి పంపిన టీఇఎస్ఎస్ శాటిలైట్ సేవలను మరో మూడేళ్ళ పాటు (2025 వరకు) వినియోయోగించుకోవాలని నాసా పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కనిపెట్టిన గ్రహాలలో ఏలియన్స్ ఉండే అవకాశాం ఉందని మాత్రమే అంచనా వేశామని.. కానీ నిర్ధారణ చేయలేదని మిచెల్ కునిమోటో తెలిపారు.

గూగుల్ డాక్యుమెంట్స్‌లో కొత్త ఫీచర్‌ !


డాక్యుమెంటేషన్, టైపింగ్ ఆన్‌లైన్ టూల్ గూగుల్ డాక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా టెక్స్ట్ వాటర్‌మార్క్ అనే ఓ కొత్త ఫీచర్‌ను గూగుల్ డాక్స్‌కు విడుదల చేసింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమ డాక్యుమెంట్స్ లోని ప్రతి పేజీలో టెక్స్ట్ వాటర్‌మార్క్‌ను ప్లేస్ చేయొచ్చు. ఏదైనా డాక్యుమెంట్ ఫైల్‌ను షేర్ చేయడానికి ముందు దాని స్టేటస్ తెలియజేయడానికి యూజర్లు "కాన్ఫిడెన్షియల్" లేదా "డ్రాఫ్ట్" వంటి టెక్స్ట్ వాటర్‌మార్క్‌లను సృష్టించి ప్రతి పేజీలోనూ యాడ్ చేయొచ్చు. ఈ టెక్స్ట్ వాటర్‌మార్క్ ఆప్షన్‌ గూగుల్ డాక్స్ లోని ఇన్‌సర్ట్‌ మెనూలో ఉంటుంది. ఈ ఆప్షన్ వాటర్‌మార్క్ టెక్స్ట్ ఫాంట్, సైజు, ట్రాన్స్‌పరసీ, పొజిషన్ వంటి వాటిని కస్టమైజ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. దీనివల్ల డాక్యుమెంట్‌లు మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి. వర్క్‌స్పేస్ కస్టమర్లు, జీ సూట్ బేసిక్ యూజర్లు, బిజినెస్ కస్టమర్లతో సహా యూజర్లందరికీ గూగుల్ డాక్స్ వాటర్‌మార్క్ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. గూగుల్ కంపెనీ జనవరి 24న ఈ ఫీచర్‌ను రోల్‌అవుట్‌ చేయడం ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ఇది యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గూగుల్ డాక్స్‌లోని వాటర్‌మార్క్ కేవలం గూగుల్ టూల్ కు మాత్రమే పరిమితం కాదు. ఈ వాటర్‌ మార్క్ టెక్స్ట్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ నుంచి డాక్యుమెంట్‌లను ఇంపోర్ట్ చేసేటప్పుడు లేదా ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్నప్పుడు అలాగే ఉండిపోతుంది. గతేడాది సెప్టెంబరులో గూగుల్ సంస్థ గూగుల్ డాక్స్‌లో ఇమేజ్ వాటర్‌మార్క్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది డాక్యుమెంట్‌లోని ప్రతి పేజీలో ఇమేజ్ వాటర్‌మార్క్‌ను ఇన్‌సర్ట్‌ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు తమ డాక్యుమెంట్లకు కంపెనీ లోగోలు, బ్రాండింగ్ వంటివి జోడించడానికి ఈ ఫీచర్ సహకరిస్తుంది. సేఫ్ ఫైల్‌లను నావిగేట్ చేయడంలో యూజర్లకు సహాయపడే కొత్త అప్‌డేట్‌ను గూగుల్ డ్రైవ్‌కు గూగుల్ ఇటీవలే తీసుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు గూగుల్ డాక్స్‌కు చక్కటి ఫీచర్ అందించి యూజర్లను ఫిదా చేసింది. అయితే గూగుల్ డ్రైవ్‌లో వచ్చిన కొత్త అప్‌డేట్‌తో యూజర్లు ఇప్పుడు ప్రమాదకరమైన ఫైల్‌ను ఓపెన్ చేసేటప్పుడు "వార్నింగ్ బ్యానర్"ని చూడగలుగుతారు. అక్టోబర్‌లో గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 2021లో మొదటిసారిగా ఈ వార్నింగ్ బ్యానర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఇది గూగుల్ డ్రైవ్‌, గూగుల్ డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, డ్రాయింగ్‌ల యూజర్లకు విడుదలయ్యింది. 2022 ప్రారంభంలో గూగుల్ ఆండ్రాయిడ్ 'ఎకోసిస్టమ్'ని మరింత సమగ్రంగా, స్పష్టమైనదిగా మార్చే ప్రణాళికలను ప్రకటించింది. యాపిల్ ఉత్పత్తులు ఎలా పరస్పరం ఇంటర్ లింక్ అయ్యి సాఫీగా వర్క్ అవుతాయో ఆ విధంగా ఆండ్రాయిడ్ ఉత్పత్తులను అనుసంధానించేలా 'ఎకోసిస్టమ్'ని మార్చేందుకు ఓ ప్రణాళిక రూపొందించింది. అంతేకాదు, ఇది స్మార్ట్ హోమ్ డివైజ్ లు , క్రోమ్ బుక్ లకు ఫాస్ట్ పెయిర్ టెక్నాలజీని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

ట్విట్టర్ ఖాతా తొలగింపుకు 50 వేల డాలర్లు ఇవ్వగలరా?


ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలన్ మస్క్ తన వ్యాపార పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత విమానాలు ఉపయోగిస్తుంటాడు. అయితే తన సెక్యూరిటీ దృష్ట్యా ఆ విమాన ప్రయాణ తాలూకు వివరాలు గోప్యంగా ఉంచుతాడు. ఈ నేపధ్యంలో మస్క్ తన విమానంలో ఏరోజు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ సమయానికి చేరుకుంటున్నారు వంటి సంగతులన్నీ మీడియా వారికి చేరిపోతున్నాయి. దీంతో వారు ముందుగానే అక్కడికి చేరుకుని ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇక విషయమై మస్క్ కార్యాలయం ఆరా తీయగా.. అమెరికాకు చెందిన స్వీనీ అనే 19 ఏళ్ల యువకుడు మస్క్ విమాన ప్రయాణ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. మస్క్ ప్రయాణ వివరాల కోసమే ఆ ట్విట్టర్ ఖాతా తెరిచాడు ఆ యువకుడు. దీంతో ఆ ట్విట్టర్ ఖాతాను తొలగించాలంటూ మస్క్ స్వయంగా స్వీనీకి విజ్ఞప్తి చేశాడట. దీనిపై యువకుడు స్వీనీ స్పందిస్తూ.. 'తొలగిస్తాను, కానీ అందుకు కొంత ఖర్చు అవుతుంది. కనీసం ఒక టెస్లా మోడల్ 3 కారు ఇవ్వాలి' అంటూ సరదాగా కోరాడు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'ఒక తుంటరి చేతిలో బలైపోవడం నాకు నచ్చలేదు, కానీ మీ ప్రతిభకు ఒక 5 వేల డాలర్లు (రూ.3,76,087) ఇవ్వగలను అంటూ సమాధానం ఇచ్చాడట. దీనిపై స్వీనీ స్పందిస్తూ 5 వేలు కాదుగానీ ఒక 50 వేల డాలర్లు ఇవ్వగలరా? నాకు చాలా అవసరం ఉంది. మంచి కాలజీకి వెళ్లి చదువుకోవాలి, అలాగే కారు కూడా కొనుక్కోవాలని ఉంది' అంటూ సమాధానం పంపాడట. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'ఆలోచిస్తానని' సమాధానం ఇచ్చాడట. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాలూకు వివరాలను మస్క్ కార్యాలయ ప్రతినిధి ఒకరు ఇటీవల బయటకు వెల్లడించారు. అయితే మస్క్ ఇంకా స్వీనీకి ఆ డబ్బు ఇచ్చాడా? లేదా? అనే విషయం తెలియరాలేదు గానీ విమాన వివరాలు తాలూకు ట్విట్టర్ ఖాతా అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.

Thursday, January 27, 2022

ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందడం ఎలా?


ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అనేది సర్వసాధారణం అయింది. అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలో ముఖ్యంగా ఐఫోన్ ను కొనుగోలు చేయాలనీ ప్రతి ఒక్కరు భవిస్తూ ఉంటారు. ఇప్పటికే ఐఫోన్ ను ఉపయోగించే వినియోగదారులకు షాజామ్‌ వినియోగం కొత్తేమీ కాదు. ఆపిల్ సంస్థ 2018లో షాజామ్‌ని కొనుగోలు చేసింది. అయితే రెండు సంవత్సరాల తర్వాత ఒరిజినల్ ప్లాట్‌ఫారమ్‌ను విడిగా సజీవంగా ఉంచుతూ iOS 14.2 ప్రారంభించడంతో కంపెనీ మ్యూజిక్ డిస్కవరీ ప్లాట్‌ఫారమ్‌ను స్థానిక iOS కార్యాచరణగా తీసుకువచ్చింది. దీన్ని ఐఫోన్‌లలో పొందుపరచడంతో పాటు యాపిల్ మ్యూజిక్‌ను క్రమం తప్పకుండా ప్రచారం చేయడానికి షాజామ్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఆపిల్ ఉపయోగిస్తోంది. దాదాపు ప్రతి హాలిడే సీజన్‌లో ఆపిల్ మరియు షాజామ్‌ కొత్త ఆఫర్‌లను ప్రవేశపెడతాయి. ఇందులో భాగంగా షాజామ్‌ ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ షాజామ్‌ మరోసారి వినియోగదారులకు ఉచిత Apple Music సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఆపిల్ మ్యూజిక్ కి కొత్తగా వచ్చిన వినియోగదారులు ఆపిల్ యొక్క మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ యొక్క ఐదు నెలల ఉచిత ట్రయల్‌ను ఉచితంగా పొందుతారు. యాపిల్ సంస్థ కూడా కొత్త మ్యూజిక్ యూజర్లకు మూడు నెలల ఉచిత ట్రయల్‌ను ఆఫర్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఉన్న ఈ ఆఫర్‌కు అనుగుణంగా ఇప్పటికే మూడు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ ట్రయల్‌ని పొందిన వినియోగదారులు మరొక రెండు నెలల అదనపు సబ్‌స్క్రిప్షన్ సమయాన్ని కూడా ఉచితంగా పొందుతారు. మరోవైపు ఈ ఆఫర్‌ను ఇంకా పొందని కొత్త సబ్‌స్క్రైబర్‌లు ఐదు నెలల పాటు ఉచిత ట్రయల్‌ని పొందవచ్చు. యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రైబర్‌ల కోసం షాజమ్ ఈ ఆఫర్‌ను ఈ సంవత్సరం చాలా కాలంగా అమలు చేస్తోంది. మీరు ఇంకా ఈ ఆఫర్‌ను పొందకుండా ఉంటే కనుక ఇప్పుడు మీరు దీన్ని పొందడానికి కింద తెలిపే దశల వారీ గైడ్ ను అనుసరించండి. యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను 5 నెలల చెల్లుబాటు కాలానికి ఉచితంగా పొందడానికి కింద తెలిపే 5 దశల గైడ్ ను అనుసరించడం ద్వారా సులభంగా పొందవచ్చు.మొదటగా షాజమ్ వెబ్‌సైట్‌కి (https://www.shazam.com/ applemusic) వెళ్లి మీ ఫోన్ కెమెరా యాప్‌ని ఓపెన్ చేసి స్క్రీన్‌పై ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేయండి. ఇది మిమ్మల్ని మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ద్వారా Shazam వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. FaceIDని ఉపయోగించి మీ గుర్తింపును ధృవీకరించండి. దాని కోసం మీరు పవర్ బటన్‌పై రెండుసార్లు నొక్కండి. మీ గుర్తింపు ధృవీకరించబడిన తర్వాత మీరు ఇంతకు ముందు మూడు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ ట్రయల్‌ని పొందారా లేదా అని ఆపిల్ తనిఖీ చేస్తుంది. ఒకవేళ మీరు కలిగి ఉంటే కనుక మీరు రెండు నెలల ఉచిత ఆపిల్ మ్యూజిక్ సభ్యత్వాన్ని పొందుతారు. మీరు పొందకపోయి ఉంటే కనుక మీరు ఐదు నెలల ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.

నెట్‌ఫ్లిక్స్ సహా 13 ఓటీటీ యాప్‌లు ఉచిత యాక్సెస్ ?


టాటా స్కై గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ టు హోమ్‌(డీటీహెచ్‌) కోసం చాలామంది వినియోగదారులు టాటా స్కైనే వాడతారు. మన దేశంలో ఎక్కువ మంది వినియోగించేది టాటా స్కైనే. తాజాగా టాటా స్కై పేరును  ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా అందించడం కోసం టాటా ప్లేగా మార్చారు. ప్రస్తుతం స్మార్ట్ టీవీల కాలం నడుస్తుండటంతో ఓటీటీ యాప్స్‌ను స్మార్ట్ టీవీలలోనూ యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా యాప్స్‌కు సపరేట్‌గా సబ్‌స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ.. ఇక నుంచి అటువంటి అవసరం లేకుండా.. టాటా ప్లే డీటీహెచ్ కనెక్షన్ ఉంటే చాలు స్మార్ట్ టీవీలలో డైరెక్ట్‌గా ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. దాని కోసమే టాటా స్కై.. టాటా ప్లేగా పేరు మార్చుకొని సరికొత్త ఓటీటీ అగ్రగేటర్‌గా ముందుకు వచ్చింది. టాటా ప్లే ద్వారా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సహా 13 ఓటీటీ యాప్స్‌ను స్మార్ట్ టీవీలలో యాక్సెస్ చేసుకోవచ్చు. దాని కోసం టాటా స్కై బింగె ప్యాక్స్‌ను తీసుకొచ్చింది. అందులో రూ.399 ప్లాన్ ఒకటి. అలాగే.. ఇప్పటికే టాటా స్కై బింగే ప్లస్ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ ఉంది. కానీ.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అన్ని ఓటీటీలను యాక్సెస్ లభిస్తుంది. టాటా ప్లే నెట్‌ఫ్లిక్స్ కాంబో ప్యాక్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, స్టాండర్డ్‌, ప్రీమియం ప్లాన్స్‌ను తీసుకోవచ్చు. టాటా ప్లే వాలెట్‌ను ఉపయోగించుకొని సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

మహీంద్రా నుంచి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో


ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ కార్లను చూశాం. ఎలక్ట్రిక్ బైకులను చూశాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కూడా వచ్చేసింది. త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటోను ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా & మహీంద్రా సబ్సిడరీ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ప్రవేశపెట్టింది. ఆల్ఫా కార్గో పేరుతో త్రీవీలర్‌ EV సెగ్మెంట్‌లోకి మహీంద్రా గ్రూపు ఎంట్రీ ఇచ్చింది. 2022 జనవరి 18న ఈ ఆల్ఫా కార్గోను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది మహీంద్రా కంపెనీ. ఈ త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటో దేశ రాజధాని (ఢిల్లీలో ఎక్స్‌షోరూం) ధర 1.44 లక్షలుగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆటోను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 310 కిలోల లోడుతో 80కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకి 25 కిలోమీటర్లుగా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మహీంద్రా త్రివీలర్ ఎలక్ట్రిక్ ఆల్ఫా ఆటోను 48 V/15 A ఛార్జర్ సాయంతో మీ.. మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకున్నంత సులభంగా ఛార్జ్‌ చేసుకోవచ్చునని మహీంద్రా కంపెనీ అంటోంది. ఇంధన ధరలు అమాంతం పెరిగిపోవడంతో నగర ప్రాంతాల్లో కార్గో సేవలు తగ్గిపోయాయి. ఇకపై ఎలక్ట్రిక్ ఆల్ఫా ఆటోతో ఆ ససమ్య కూడా తీరిపోతుందని మహీంద్రా కంపెనీ అంటోంది. మహీంద్రా పోర్ట్ పోలియోలో ఈ ఆల్ఫా మినీ ఆటో కూడా ఉంది.

పేమెంట్ వాలెట్‌లా మారనున్న ఐఫోన్


ఐఫోన్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసే ఫీచర్ త్వరలో ఐఫోన్‌లో రాబోతోందని యాపిల్ సంస్థ ప్రకటించింది. దాని కోసం సపరేట్‌గా హార్ట్‌వేర్ అవసరం లేకుండా ఫీచర్‌ను యాపిల్ డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్‌ను యాపిల్ త్వరలో తీసుకురాబోయే ఐవోఎస్ 15.4 వర్షన్‌లో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ వల్ల చిన్న బిజినెస్ చేసుకునే మర్చంట్లు పేమెంట్‌ను ఐఫోన్ ద్వారా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ మీద యాపిల్ 2020 నుంచి వర్క్ చేస్తోంది. దాని కోసమే కెనడాకు చెందిన మొబీవేవ్ అనే ఓ స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేసింది. ఐఫోన్‌నే ఒక పేమెంట్ వాలెట్‌గా మార్చడం కోసం ఒక యాప్, ఫోన్‌లోని ఎన్ఎఫ్‌సీ ఉంటే చాలు. దాని కోసం సపరేట్‌గా హార్ట్‌వేర్ అవసరం లేకుండా ఈ ఫీచర్‌ను మొబీవేవ్ తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా స్టోర్ యజమాని ఫోన్‌లో కస్టమర్ ఎంత డబ్బు చెల్లించాలో టైప్ చేస్తాడు. ఆ తర్వాత కస్టమర్ తన క్రెడిట్ కార్డును ఫోన్ వెనుక వైపు ట్యాప్ చేస్తే చాలు. పేమెంట్ వెంటనే పూర్తవుతుంది. యాపిల్ పేలో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తారా? లేక ఈ ఫీచర్ పూర్తి ఫంక్షనాలిటీ ఏంటి అనే దానిపై ఇంకా యాపిల్ క్లారిటీ ఇవ్వనప్పటికీ బ్లూమ్‌బెర్గ్ సోర్స్ మేరకు సపరేట్ గా యాప్‌ను డెవలప్ చేసి దాని ద్వారా ఐఫోన్‌నే పేమెంట్ వాలెట్‌గా మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.2019లో  మొబీవేవ్ సామ్‌సంగ్‌తో కూడా కలిసి పనిచేసింది. అప్పుడు మర్చంట్స్‌కు ఇలాంటి ఫీచర్‌నే సామ్‌సంగ్ అందించింది. దానికి సామ్‌సంగ్ పీవోఎస్ అనే పేరును పెట్టింది. ఆ సర్వీస్‌తో చిన్న చిన్న బిజినెస్‌లు సామ్‌సంగ్ ఫోన్ల ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసే ఫెసిలిటీని అందించింది.


శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్42 పై రూ.6,000 డిస్కౌంట్ !

 


ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఎప్పట్లాగే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. శామ్ సంగ్ స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్స్ ఉన్నాయి. శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్42 స్మార్ట్‌ఫోన్‌ను అసలు ధర కన్నా రూ.6,000 తక్కువకే సొంతం చేసుకోవచ్చు. శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్42  గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.20,999 ధరకు, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.22,999 ధరకు రిలీజ్ అయింది. మొన్నటి వరకు ఇవే ధరలతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.6,000 తగ్గింపు పొందొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్42 గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. బేస్ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.16,999 ధరకు కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రస్తుతం రూ.20,000 లోపు బడ్జెట్‌లో రెడ్‌మీ నోట్ 10 ప్రో, రియల్‌మీ 8 ప్రో, రియల్‌మీ 8ఎస్, ఐకూ జెడ్3, రెడ్‌మీ నోట్ 10ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ. శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్42  గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ నార్జో 30, వివో వీ21ఈ, పోకో ఎం3 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఏ22, వివో వై52, రియల్‌మీ 8, ఒప్పో ఏ53ఎస్ లాంటి మోడల్స్‌లో ఉండటం విశేషం. శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్42 గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలున్నాయి. రియర్ కెమెరాలో హైపర్‌ల్యాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, నైట్ మోడ్, పనోరమా, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.శామ్ సంగ్ గెలాక్సీ ఎఫ్42 గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 స్మార్ట్‌ఫోన్‌ను మ్యాటీ బ్లాక్, మ్యాటీ ఆక్వా కలర్స్‌లో కొనొచ్చు.

Wednesday, January 26, 2022

నగల దొంగల్ని పట్టిచ్చిన వాట్సప్ గ్రూప్!


చెన్నైలోని వేపేరికి చెందిన మహిపాల్ నగలు తయారు చేస్తుంటాడు. జనవరి 17న వేపేరిలోని తన ఇంటి నుంచి 365 గ్రాముల నగలతో బయల్దేరాడు. ఆటో మాట్లాడుకొని ఈవీకే సంపత్ రోడ్డు మీదుగా వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక చూస్తే ఇంటి నుంచి తీసుకొచ్చిన నగలు మిస్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆలస్యం చేయకుండా పెరియమేడు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే నగల యజమాని అయిన మహిపాల్ ఇక్కడే కాస్త తెలివిగా ఆలోచించాడు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చెన్నైలో నగలు తాకట్టుపెట్టుకునే పాన్ బ్రోకర్స్‌కు, నగల వ్యాపారులకు ఒక కామన్ వాట్సప్ గ్రూప్ ఉంది. అసోసియేషన్ ఆఫ్ జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్‌ను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పి మిస్ అయిన నగల ఫోటోలను వారి వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేయించాడు. నగలు దొంగిలించిన వారు ఖచ్చితంగా ఏదో ఓ నగల షాపులో అమ్మడం ఖాయం. మహిపాల్ కూడా సరిగ్గా ఇదే అంచనా వేసి పాన్ బ్రోకర్స్ వాట్సప్ గ్రూప్‌లో నగల ఫోటోలు పోస్ట్ చేయించాడు. ఎవరైనా ఆ నగలు అమ్మడానికి వస్తే సంప్రదించాలని వివరాలు కూడా ఇచ్చాడు. మహిపాల్ అంచనా కరెక్ట్ అయింది. జనవరి 23న పురసవాల్కంలోని ఓ పాన్ బ్రోకర్ దగ్గరకు రమేష్ అనే వ్యక్తి నగలు అమ్మడానికి వచ్చాడు. అప్పటికే ఆ పాన్ బ్రోకర్ తన వాట్సప్ గ్రూప్‌లో మహిపాల్ పోస్ట్ చేసిన ఫోటోలను చూశాడు. తన దగ్గరకు అమ్మడానికి తీసుకొచ్చిన నగలు కూడా అవే. వాట్సప్ గ్రూప్‌లో ఉన్న నగల ఫోటోలు, రమేష్ అనే వ్యక్తి తీసుకొచ్చిన నగలు మ్యాచ్ కావడంతో సదరు పాన్ బ్రోకర్ ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే మహిపాల్‌కు సమాచారం ఇచ్చాడు. మహిపాల్ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా పెరియమేడు పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. అంతే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రమేష్‌ను విచారిస్తే తనకు వెంకటేష్ అనే స్నేహితుడు ఈ నగలు ఇచ్చినట్టు చెప్పాడు. అతను ఓ ఆటోడ్రైవర్. విచారణ కొనసాగించిన పోలీసులు వెంకటేష్‌తో పాటు అతని భార్య సంగీతను కూడా అరెస్ట్ చేశారు.  తనకు ఈ నగలను తన తల్లి కళ, తన మామ జోతి ఇచ్చినట్టు విచారణలో వెల్లడించాడు. పోలీసులు జోతిని విచారించారు. ఈవీకే సంపత్ రోడ్డులో తనకు ఈ బ్యాగు దొరికినట్టు చెప్పాడు. అందులో నగలు ఉండటంతో తన చెల్లెలికి, తన అల్లుడికి ఇచ్చినట్టు జోతి వెల్లడించాడు. విచారణ కొనసాగించిన పోలీసులు 365 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నగలను పోలీసులకు ఇవ్వకుండా పంచుకున్నందుకు నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే జోతి నగల బ్యాగును తీసుకెళ్లినట్టు తేలింది. ఈ కేసులో నగల యజమాని తెలివిగా వ్యవహరించడంతో వారంలోపే దొంగలు దొరికిపోయారు. పాన్ బ్రోకర్స్ వాట్సప్ గ్రూప్‌లో ఫోటోలు షేర్ చేయాలన్న ఆలోచన బాగా పనిచేసింది. 

ఒమిక్రాన్ వేగానికి కారణం తెలిసింది ?


ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాని వేగానికి కారణాన్ని తేల్చేందుకు జపాన్‌కు చెందిన పరిశోధకులు పరిశోధన చేశారు. అందులో చాలా అసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ 21గంటల పాటు సజీవంగా ఉంటుందనీ అదే ప్లాస్టిక్‌ ఉపరితలంపైన దాదాపు 8 రోజుల పాటు జీవించి ఉంటుందని క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఒమిక్రాన్‌ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇదేనని తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ 56 గంటలు, ఆల్ఫా 191.3, బీటా 156.6 గంటలు, గామా 59.3గంటలు, డెల్టా 114 గంటల పాటు ప్లాస్టిక్‌ ఉపరితలాలపై జీవించగలవని గుర్తించారు. చర్మం నమూనాపై ఒమిక్రాన్‌ 21.1గంటల పాటు సజీవంగా ఉండగా.. ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ 8.6 గంటలు, ఆల్ఫా 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, గామా 11గంటలు, డెల్టా వేరియంట్‌ 16.8గంటలు సజీవంగా ఉన్నట్టు తెలిపారు. ఫ్యూర్ ఆల్కాహాల్‌తో తయారైన శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకుంటే 15 సెకన్లలోనే వైరస్‌ అంతమవుతుందని రీసర్చర్స్ తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించినట్లు తరచూ శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


మార్కెట్లోకి హోండా CBR650R 2022


జపాన్ మోటార్ వాహన దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్, భారత్ లో ప్రీమియం సెగ్మెంట్ పై దృష్టిపెట్టింది. ఈక్రమంలోనే 300సీసీ అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన బైక్ లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తుంది హోండా. 2021 డిసెంబర్ లో సీబీ300ఆర్ ను భారత విఫణిలోకి ప్రవేశపెట్టిన హోండా.. నెల రోజుల వ్యవధిలోనే మరో బైక్ ను విడుదల చేసింది. CBR650R బైక్ ను హోండా భారత్ లో విడుదల చేసింది. 650సీసీ సామర్ధ్యం కలిగిన ఈ స్పోర్ట్స్ బైక్ ధరను రూ.9.35 లక్షలు(Ex-Showroom)గా నిర్ణయించింది. భారీ “ప్రైస్ ట్యాగ్”తో వస్తున్న ఆ బైక్ విశేషాలు ఏంటంటే CBR650R గతంలోనే భారత్ లో అందుబాటులో ఉంది. ఆ మోడల్ కె కొత్త సొబగులు అద్ది 2022 మోడల్ గా ప్రవేశపెట్టింది హోండా సంస్థ. 649cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్(4సిలిండర్) ఇంజన్ కలిగిన ఈ బైక్ 87hp@12,000rpm శక్తిని, 57.5Nm@8,500rpm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 2022 మోడల్ లో ఎక్జాస్ట్ ని సరికొత్తగా డిజైన్ చేశారు. ముందూ వెనుక మొత్తం LED లైట్లు అమర్చారు. LCD క్లస్టర్ కి కూడా మెరుగులు దిద్దారు. గ్రాఫిక్స్ హైలట్ గా విడుదలైన ఈ CBR650R 2022 మోడల్.. గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ అనీ రెండు కలర్స్ లో మాత్రమే లభిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూర్తిగా ఇంపోర్ట్ చేసుకునే ఈ బైక్.. దేశీయంగా ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరి 25 నుంచే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఖరీదైన బైక్ కొనాలనుకునే వారు.. ప్రీమియం బైక్ లంటే ఇష్టపడే యువతే లక్ష్యంగా విడుదలైన ఈ బైక్.. kawasaki ninja650, Z650, Aprilia RS 660, CF Moto 650GT వంటి ప్రీమియం బైక్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మోటోరోలా ఇన్-డిస్ప్లేకెమెరా ఫోన్ !


మోటోరోలా ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీజ్ చేశారు. ఇది కొత్త సిరీస్ నుండి కాకుండా గత సంవత్సరం చివరిలో Snapdragon 8 Gen 1 ప్రోసెసర్ తో విడుదల చేసిన Edge X30 యొక్క స్పెషల్ ఎడిషన్ గా తీసుకువస్తునట్లు పేర్కొన్నారు. ఈ అప్ కమింగ్ Moto Edge X30 అండర్-స్క్రీన్ కెమెరా ఎడిషన్ బాక్స్ యొక్క ఇమేజీలను Lenovo యొక్క చైనా మొబైల్ ఫోన్ బిజినెస్ జనరల్ మేనేజర్ చెన్ జిన్ Weiboలో షేర్ చేసారు. వాస్తవానికి, అండర్- డిస్ప్లే కెమెరా ఫోన్లు మునుపే వచ్చాయి మరియు ఇప్పుడు మరింత మెరుగవుతున్నాయి. అయితే, అండర్-డిస్ప్లే కెమెరా ఫోన్లలో వాటి ఫోటో నాణ్యత పైన కొంత ప్రభావం ఉంటుంది. అయితే, ప్రారంభంలో 2020 లో మొదటి అండర్ డిస్ప్లే కెమెరా ఫోన్ (ZTE Axon 20) ప్రారంభించినప్పటి నుండి పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. Moto Edge X30 అండర్-స్క్రీన్ కెమెరా స్పెషల్ ఎడిషన్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఒరిజినల్ గ్లోబల్ వేరియంట్ను పోలి ఉండవచ్చని భావిస్తున్నారు. Moto Edge X30 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ FHD+ రిజల్యూషన్ అందించగల OLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో ఉండడమే కాకుండా 10-Bit కలర్ HDR10+ సపోర్ట్ మరియు 144 Hz రిఫ్రెష్ వంటి హాయ్ ఎండ్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్పీడ్ మరియు మల్టి టాస్కింగ్ ను చక్కగా నిర్వహించగల Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ శక్తికి జతగా LPDDR5 RAM 12GB వరకు ర్యామ్ మరియు UFS 3.1 256GB వరకూ స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్ కి జతగా5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP సెన్సార్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో భారీ 60MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఈ Moto ఫోన్ 5000mAh బ్యాటరీని 68W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో అందించింది. అయితే, ఇండియా లాంచ్ గురించి ఎటువంటి ప్రకటన లేదా సమాచారం కానీ బయటకీ రాలేదు.

చంద్రుడిని ఢీకొట్టబోతున్న భారీ రాకెట్


ఏడేళ్ల క్రితం నాటి ఓ భారీ రాకెట్ చంద్రున్ని ఢీకొట్టబోతోంది. సైంటిస్టులు ప్రయోగించిన ఈ రాకెట్ ఇన్నాళ్ల తర్వాత ట్రాక్ తప్పి అపసవ్య దిశలో చంద్రుని దిశగా దూసుకెళ్తోంది. కచ్చితంగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని స్పేస్ ఏజెన్సీలు అంచనాలు వేస్తున్నాయి. అదేగానీ జరిగితే ఏమౌతుందనేది ఆసక్తిగా పరిశీలనలు జరుగుతున్నాయి. సాధారణంగా రాకెట్ పరిశోధనలు కోసం ప్రయోగిస్తారు. కానీ, ఇలా చంద్రున్ని ఢీకొట్టడమేంటంటే అది ఏడేళ్ల పాటు క్షక్షలోనే ఉండి కనిపించకుండా అదృశ్యమైపోయింది. ఇప్పటి వరకూ ఆ రాకెట్ స్పేస్ జంక్ లోకి కలిసి పోయి ఉండొచ్చులేనని భావించారంతా. కానీ, ఇప్పుడా ఆ భారీ రాకెట్ దిశ మార్చుకుని చంద్రునివైపుగా ఢీకొట్టబోతోంది. స్పేస్‌ఎక్స్‌ రాకెట్ కంపెనీ ద్వారా ఫాల్కన్‌ 9 బూస్టర్‌ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించారు. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించేందుకు ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి లాంచ్ చేశారు. మొదటి దశలో రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. రెండో దశలో ఈ ప్రయోగం ఫెయిల్ అయింది. ఫాల్కన్‌ 9 బూస్టర్‌ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్ష్యలో పయనిస్తోంది. అప్పటినుంచి అదుపు తప్పి జాడ లేకుండా పోయింది. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఊహించనిరీతిలో ఈ రాకెట్‌ ట్రాక్‌ ఎక్కింది. చంద్రుడి పైకి క్రాష్‌ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనా ప్రకారం.. మార్చి 4వ తేదీన ఈ రాకెట్ క్రాష్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించింది. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలోకి వెళ్లింది. దాంతో రాకెట్‌ పని అంతేనని సైంటిస్టులు ఆలోచించడం మానేశారు. ఏడేళ్ల తర్వాత చంద్రుడి వైపు కక్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువైన ఈ పాల్కన్‌ 9 బూస్టర్‌ రాకెట్‌.. గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకెళ్తోంది. నాసా లునార్‌ ఆర్బిటర్ సహా భారత్‌ చంద్రయాన్‌-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్‌ ల్యాండ్‌ను అతి సమీపంలోనే గమనించనున్నాయి. ఈ క్రాష్‌ ల్యాండ్‌తో ఏం జరగబోతుందనే ఆసక్తిగా మారింది. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఈ క్రాష్‌ల్యాండ్‌ను అక్కడ పరిస్థితులను పరిశీలించనున్నారు. 2009లో నాసా ఓ రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ ల్యాండ్ చేసింది. పాల్కన్‌ విషయంలో మాత్రం చంద్రుడి ఉపరితలంపైకి ఢీకొట్టబోతోంది. చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టడం ద్వారా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని, దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

జియో నుంచి చౌకైన 5 జీ మొబైల్‌


దేశీయంగా సంచనాలు సృష్టిస్తున్న జియో మరో సంచలనంతో ముందుకు రాబోతున్నది. భారత్‌లో అత్యంత తక్కువ ధరకు జియో 4జీ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. భారత్‌లో 5జీ విస్తరణలో జియో ముందంజలో ఉన్నది. దీనికి తగ్గట్టుగా 5 జీ స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తున్నది. రియల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా రిలయన్స్ జియో 5 జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ప్రస్తుతం 5 జీ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో రూ. 15 వేల వరకు ఉన్నది. జియో తీసుకురాబోయే 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్వాలకం స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌, 13 ఎంపీ ప్లస్ ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, మైక్రో ఎస్‌డీ కార్ట్ స్లాట్‌, ఎన్3, ఎన్‌5, ఎన్‌28, ఎన్‌40, ఎన్‌78 బ్యాండ్ సపోర్ట్‌, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ ఫీచర్లతో 5జీ మొబైల్ అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం.


Tuesday, January 25, 2022

అందుబాటు ధరలోనే యు బ్రాడ్‌బ్యాండ్ 350 Mbps ప్లాన్

 

ఇండియాలోని ప్రైవేట్ టెల్కోలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా(Vi) సంస్థ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో యు బ్రాడ్‌బ్యాండ్ పేరుతో వినియోగదారులకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తున్నది. అధిక వేగంతో లభించే మెరుగైన ప్లాన్ల కోసం మీరు చూస్తున్నట్లయితే యు బ్రాడ్‌బ్యాండ్ మీకు మంచి ఎంపిక కావచ్చు. వొడాఫోన్ ఐడియా అనుబంధ సంస్థ యు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు దాని 350 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కేవలం రూ.1750 ధరకే అందిస్తోంది. ఈ ప్లాన్ అపరిమిత డేటాతో లభించడమే కాకుండా వివిధ వాలిడిటీ కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్‌లతో యు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లకు అదనపు వాలిడిటీ సర్వీస్ ప్రయోజనాలను అందిస్తుంది. 350 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ ఫిగర్‌ను పూర్తి చేయడానికి 300 Mbps స్పీడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది.  యు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ తన యొక్క వినియోగదారులకు 350 Mbps స్పీడ్ ప్లాన్ ను రూ.1750 ధర వద్ద అందుబాటులో ఉంది. అన్ని రకాల పన్నులతో కలుపుకొని ఈ ప్లాన్ మొత్తం ధర నెలకు రూ.2065గా ఉంటుంది. ఇంకా వినియోగదారులు మూడు నెలలు, ఆరు నెలలు మరియు పన్నెండు నెలల చెల్లుబాటుతో కూడా ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. త్రైమాసిక ప్లాన్‌తో యు బ్రాడ్‌బ్యాండ్ ఐదు రోజుల అదనపు సర్వీసును ఉచితంగా అందిస్తుంది. అదేవిధంగా ఆరు నెలల మరియు పన్నెండు నెలల వాలిడిటీ ప్లాన్‌లతో వినియోగదారులు కంపెనీ నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వరుసగా పది రోజులు మరియు 15 రోజుల అదనపు సర్వీస్ వాలిడిటీని పొందుతారు. త్రైమాసిక, ఆరు నెలలు మరియు పన్నెండు నెలల చెల్లుబాటుతో లభించే ఈ ప్లాన్‌ వినియోగదారులకు వరుసగా రూ. 6195, రూ. 12,390 మరియు రూ.24,780 ధరల వద్ద లభిస్తుంది. ఇక్కడ పేర్కొన్న ధరలో పన్నులు కూడా ఉన్నాయని గమనించండి. డేటా విషయానికి వస్తే ఇది నెలకు 3.5TB డేటాను అందిస్తుంది. మీకు కంపెనీ నుండి రౌటర్ మరియు మోడెమ్ కావాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ తన యొక్క వినియోగదారులకు 300 Mbps స్పీడ్ తో మరొక ప్లాన్ ను అందిస్తుంది. ఇది నెలకు రూ.2006 ధర వద్ద అందుబాటులో ఉంది (పన్నులు కూడా ఉన్నాయి). అదేవిధంగా మూడు నెలలు, ఆరు నెలలు మరియు పన్నెండు నెలల వాలిడిటీ కాలానికి ఈ ప్లాన్‌ను వరుసగా రూ.6018, రూ.12036 మరియు రూ.24072 ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌తో అందించే డేటా కూడా 3.5TB. రూటర్ మరియు మోడెమ్ కోసం కస్టమర్‌లు రూ.1999 అదనపు డిపాజిట్ మొత్తాన్ని చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి తిరిగి చెల్లించే డిపాజిట్. 3.5TB డేటాతో వచ్చే కంపెనీ అందించే మరిన్ని ప్లాన్‌లు ఉన్నాయి.

ల్యాప్ టాప్ కొనడానికి ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు!


ల్యాప్ టాప్ కొనడానికి ముందుగా కొన్నిఅంశాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ల్యాప్ టాప్ ని మీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవడం చాలా ఉత్తమం. వెబ్ సర్ఫింగ్, ఆన్లైన్ బిల్లులు చెల్లించడం, ఇమెయిల్ మరియు సోషల్ మీడియా వంటి సినిమాలు లేదా స్ట్రీమ్ కంటెంట్ ను చూడడానికి తక్కువ కాన్ఫిగరేషన్ తో బడ్జెట్ ల్యాప్ టాప్ ని ఎంచుకోవచ్చు. ఎక్కువగా టైప్ చేసేవారు, ఫోటోలు ఎడిట్ మరియు బ్రౌజ్ చేసే వారు ఎక్కువ సెర్చింగ్, HD సినిమాల లైబ్రరీని కలిగి ఉంటే, మీ మీడియా ప్లేయర్ కొంచెం శక్తివంతమైన ల్యాప్ టాప్ కావాలి, తద్వారా సినిమాలు ఏ లాగ్ లేకుండా చూడదానికి మధ్యస్త  కాన్ఫిగరేషన్ ల్యాప్ టాప్ ని ఎంచుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్, గేమర్ అయితే ల్యాప్ టాప్ హైఎండ్ అయి వుండాలి. అది మంచి Photoshop లేదా వీడియో సవరణ టూల్స్ అయినా లేదా PUBG గేమ్ ప్లే అయినా, ఎటువంటి అవసరమైన, మీ ల్యాప్ టాప్ లో మీకు ప్రత్యేకమైన భాగాలు అవసరమవతాయి, తద్వారా దీని నుండి మీరు ఎక్కువగా ప్రయోజనాలను పొందవచ్చు. 

అమెజాన్ కు ట్విట్టర్‌లో భారీ నిరసన


రిపబ్లిక్ డేకి ముందు భారత జాతీయ జెండా ముద్రలతో ఉత్పత్తులను విక్రయించినందుకు అమెజాన్ ట్విట్టర్‌లో భారీ నిరసన ఎదుర్కొంటోంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ భారత జెండా చిత్రాలతో ఆహార, దుస్తుల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచింది. కొంతమంది కొనుగోలుదారులు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ అమెజాన్‌ను బహిష్కరించండి అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. చాక్లెట్లు, ఫేస్ మాస్క్‌లు, సిరామిక్ మగ్‌లు, కీచైన్‌లు, పిల్లల దుస్తులు వంటి వస్తువులపై జెండా ముద్ర ఉందని, ఇది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002కి విరుద్ధమని త్రివర్ణ పతాకాన్ని అటువంటి రూపంలో ఉపయోగించడం అవమానకరమని, జాతీయ జెండా కోడ్‌ను ఉల్లంఘించడమేనని వినియోగదారులు అంటున్నారు. ఇటీవల భారత జాతీయ జెండా చిత్రంతో బూట్లు సహా ఉత్పత్తులను విక్రయిస్తున్నందుకు అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ విషయంపై హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ అమెజాన్ విక్రయిస్తున్న ఉత్పత్తులపై మన జాతీయ జెండాను ఉపయోగిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది జాతీయ జెండా కోడ్‌ను ఉల్లంఘించడమేనని మిశ్రా అన్నారు. అమెజాన్ అధికారులు, యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిజిపిని ఆదేశించామని తెలిపారు.

రీబాక్ నుంచి మొదటి స్మార్ట్​వాచ్​ విడుదల !


ప్రముఖ స్పోర్టింగ్​ గూడ్స్​ బ్రాండ్​ రీబాక్ తాజాగా స్మార్ట్​వాచ్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. రీబాక్​ యాక్టివ్​ ఫిట్​1.0 పేరుతో దీన్ని లాంచ్​ చేసింది. 1.3 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే గల ఈ స్మార్ట్​వాచ్​లో హార్ట్​ రేట్​ మానిటరింగ్​తో పాటు బ్లడ్​ ఆక్సిజన్ శాచురేషన్​ మానిటరింగ్​ వంటి ఫీచర్లు ఉన్నాయి. రీబాక్​ యాక్టివ్​ ఫిట్​1.0 స్మార్ట్​వాచ్​ 15 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ఇది IP67 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్​ను పొందింది. రీబాక్ స్మార్ట్​వాచ్​ గరిష్టంగా 15 రోజుల బ్యాటరీ లైఫ్, 30 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది. బాక్​ యాక్టివ్​ ఫిట్ 1.0 భారతదేశంలో రూ. 4,499 ధర వద్ద లభిస్తుంది. ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, నేవీ, రెడ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ధర మార్జిన్​లోనే స్మార్ట్​వాచ్​లను విక్రయిస్తున్న అమేజ్​ఫిట్​, ఫైర్​బోల్ట్​, నాయిస్​, రియల్​మీ, జీబ్రానిక్స్ వంటి మిడ్​రేంజ్​ స్మార్ట్​ బ్రాండ్లకు రీబాక్​ గట్టిపోటీనివ్వనుంది.

ఐఫోన్ వాడే వాళ్లకు వాట్సాప్ లో మూడు కొత్త ఫీచర్లు !


ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు మూడు కీలక మార్పులతో అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్.వాయిస్ మెసేజ్ లను రికార్డ్ చేసిన తర్వాత పాస్ చేసి విని మళ్ళీ సెండ్ చేసే అవకాశం తెచ్చింది. గతంలో ఈ అవకాశం లేదు. రికార్డ్ చేసిన తర్వాత వినే అవకాశం లేకుండా సెండ్ చేసే వాళ్ళు. వినే టైం లో నచ్చితే సెండ్ చేయవచ్చు లేదా క్యాన్సిల్ చేయవచ్చు.మరో ఫీచర్ విషయానికి వస్తే ఫోకస్ మోడ్ అనే డునాట్ డిస్టర్బ్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ కు కూడా అందుబాటులోకి వచ్చింది. గతంలో ఐమెసేజ్ లాంటి వాటికి మాత్రమే ఈ ఫీచర్అందుబాటులో ఉండేది. దీనితో వాట్సాప్ నుంచి కూడా మనకు డునాట్ డిస్టర్బ్ లో మెసేజెస్ వస్తాయి.ఇక మరో ఫీచర్ విషయానికి వస్తే నోటిఫికేషన్ లో మెసేజ్ చేసిన వారి ప్రొఫైల్ పిక్ కనపడేది కాదు. కాని ఇప్పుడు దాన్ని మెరుగు పరిచి నోటిఫికేషన్ లో ప్రొఫైల్ పిక్ కూడా ఉండేలా మార్పులు చేసారు.

మెటా నుంచి వేగవంతమైన AI సూపర్‌ కంప్యూటర్‌


ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌కంప్యూటర్‌ను నిర్మించినట్లు ఇటీవల ప్రకటించింది. మెటా కంపెనీ యొక్క పరిశోధనా బృందం యొక్క సమాచారం ప్రకారం ఏఐ రీసెర్చ్ సూపర్‌క్లస్టర్ గా పిలువబడే సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది. 'నేడు నడుస్తున్న అత్యంత వేగవంతమైన ఏఐ సూపర్‌ కంప్యూటర్‌లలో ఒకటి' అని విశ్వసిస్తోందని పేర్కొంది. ఏఐ రీసెర్చ్ సూపర్‌ క్లస్టర్ అనేది ప్రపంచంలో అత్యంత వేగవంతమైనదిగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది 2022 మధ్యనాటికి పూర్తిగా నిర్మించబడనున్నట్లు తెలిపింది. ట్రిలియన్ల ఉదాహరణల నుండి నేర్చుకునే, వందలాది విభిన్న భాషల్లో పని చేసే, టెక్స్ట్, ఇమేజ్‌లు మరియు వీడియోలను సజావుగా విశ్లేషించి ఇతర విషయాలతోపాటు కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ టూల్స్‌ను అభివృద్ధి చేసే మెరుగైన ఏఐ మోడల్‌లను రూపొందించడంలో కంపెనీకి చెందిన AI పరిశోధకులు తమ సూపర్ కంప్యూటర్ RSC కు సహాయం చేస్తుందని మెటా సంస్థ తెలిపింది. ఇది కాకుండా ఏదైనా ఒక చర్య, ధ్వని లేదా ఫోటో హానికరమా లేదా నిరుపాయమైనదా అని నిర్ధారించడానికి కంపెనీ తన AI మోడల్‌లకు త్వరగా శిక్షణ ఇవ్వగలదు. ఇది కంపెనీ యొక్క ప్రస్తుత AI సిస్టమ్‌లను బలోపేతం చేస్తుంది మరియు సెకన్లలో హానికరమైన కంటెంట్‌ను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. మెటా యొక్క సూపర్‌కంప్యూటర్ లోని ముఖ్యమైన విషయాలలో వీటన్నింటికీ మించి AI రీసెర్చ్ సూపర్‌క్లస్టర్ అంతిమంగా మెటావర్స్‌ను నిర్మించాలనే దాని వ్యవస్థాపకుడి దృష్టిని సాధించడంలో కంపెనీకి సహాయపడుతుంది. RSCతో చేసిన పని తదుపరి ప్రధాన కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ కోసం టెక్నాలజీలను నిర్మించడానికి మార్గం సుగమం చేస్తుంది. మెటావర్స్, AI- రన్ అప్లికేషన్‌లు వంటి మరిన్ని ఉత్పత్తులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని మెటా సంస్థ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. మెటా సంస్థ తన యొక్క వివరణాత్మక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన ప్రస్తుత సమాచారం ప్రకారం RSC మొత్తం 760 NVIDIA DGX A100 సిస్టమ్‌లను దాని కంప్యూట్ నోడ్‌లుగా కలిగి ఉంది. ఇందులో మొత్తంగా 6,080 GPUలు ఉన్నాయి. RSC యొక్క స్టోరేజ్ టైర్‌లో 175 పెటాబైట్‌ల ప్యూర్ స్టోరేజ్ ఫ్లాష్‌అరే, 46 పెటాబైట్‌ల కాష్ స్టోరేజ్ పెంగ్విన్ కంప్యూటింగ్ ఆల్టస్ సిస్టమ్‌లు మరియు 10 పెటాబైట్ల ప్యూర్ స్టోరేజ్ ఫ్లాష్‌బ్లేడ్ ఉన్నాయి. మెటా యొక్క లెగసీ ప్రొడక్షన్ మరియు రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పోలిస్తే ప్రారంభ బెంచ్‌మార్క్‌లు కంపెనీ ప్రస్తుత సిస్టమ్‌ల కంటే 20 రెట్లు వేగంగా కంప్యూటర్ విజన్ వర్క్‌ఫ్లోలను నడుపుతున్నాయని కంపెనీ తెలిపింది. ఇంకా కంపెనీ తన సూపర్‌కంప్యూటర్‌ను నిర్మించే రెండవ దశను పూర్తి చేసిన తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన AI సూపర్‌కంప్యూటర్‌గా అవతరించనుందని తెలిపింది. మిక్స్‌డ్ ప్రిసిషన్ కంప్యూట్‌లో దాదాపు 5 ఎక్స్‌ఫ్లాప్‌లను ప్రదర్శిస్తుందని కంపెనీ తెలిపింది.

మార్కెట్‌లోకి మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 విడుదల


మైక్రోమ్యాక్స్ తన సరికొత్త మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2ని ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ నుండి వచ్చిన తాజా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్ మరియు AMOLED డిస్‌ప్లేతో పాటు కొత్త, మరింత ప్రీమియం లుక్‌తో వచ్చింది. జనవరి 30 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 భారతదేశంలో రూ. 13,490 ధరతో లభిస్తుంది.  పరిచయ ఆఫర్‌గా, కంపెనీ రూ. 1,000 తగ్గింపును ప్రవేశపెట్టింది. మొదటగా కొనుగోలు చేసేవారు  రూ. 12,490కే  స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. స్టాక్స్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుంది. Flipkart, Micromax అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. MediaTek Helio G95 ప్రాసెసర్‌తో పవర్ చేయబడింది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2, శామ్సంగ్ లాంటి కెమెరా మాడ్యూల్ డిజైన్‌లో ఉంచబడిన క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. కెమెరా మాడ్యూల్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, రెండు 2-మెగాపిక్సెల్ లెన్స్‌లు ఉన్నాయి. ముందు, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్‌తో వస్తుంది.


Monday, January 24, 2022

ఒబెన్ సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ !


పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కొత్త స్టార్టప్‌లు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ లో ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ విభాగంలోకి ప్రవేశించడానికి ఒబెన్ సంస్థ సిద్ధమైంది  కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ లుక్ స్పోర్ట్స్ బైక్ ను తలపిస్తోంది. ఈ-బైక్ ఎరుపు మరియు నలుపు డ్యూయల్-టోన్ కలర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం 16 పేటెంట్ హక్కులను పొందింది. ఈ బైక్ 3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ చెబుతోంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దింకర్ వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ తన మొదటి బైక్‌ను 2022 మొదటి త్రైమాసికంలో  భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. 2 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్: ఎలక్ట్రిక్ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 100 కిమీ. ఇంకా ఇది 3 సెకన్లలో గంటకు 0-40 కిమీ వేగంతో నడుస్తుంది. బైక్‌లోని బ్యాటరీని 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్ లో ఉండే ప్రత్యేక సాంకేతికత బ్యాటరీని చల్లగా ఉంచుతుంది. దీంతో బ్యాటరీ ఎక్కువ కాలం ఉంటుంది. 

కొత్త మొబైల్ టవర్లకు శ్రీకారం


దేశంలో ఆగస్ట్ 15, 2022 నాటికి ఎంపిక చేసిన 13 నగరాల్లో 5G నెట్‌వర్క్‌ యొక్క సర్వీసులను తన యొక్క వినియోగదారులకు అందించాలని అన్ని టెలికాం ప్రొవైడర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ తేదీ అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ కౌంటీలో 5G నెట్‌వర్క్‌లను మెరుగుపరచడానికి కృషి జరుగుతుంది. వచ్చే రెండేళ్లలో 8 లక్షల కొత్త మొబైల్‌ టవర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా టెలికాం రంగాన్ని మెరుగుపర్చనుంది.  ప్రస్తుతం భారతదేశంలోని 34% మొబైల్ టవర్లు మాత్రమే ఫైబర్‌ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. టవర్ సాంద్రతతో పాటు FY24 చివరి నాటికి 70% టవర్లను ఫైబర్‌గా మార్చాలనుకుంటోంది. టవర్ సాంద్రత కూడా మార్చి 2024 చివరి నాటికి ప్రస్తుత 0.4/1000 జనాభా నుండి 1/1000 జనాభాకు పెంచాలని భావిస్తున్నారు. దీని కోసం  నేషనల్ ఫైబర్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఎ)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశం 5Gని సమర్ధవంతంగా విడుదల చేయడానికి మౌలిక సదుపాయాలలో బూమ్ చాలా అవసరం. ఇది టెలికాం ఆపరేటర్ల 4G సేవలను కూడా పెంచుతుంది . వినియోగదారులకు మెరుగైన కవరేజీని అందించబడుతుంది.

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్ షురూ!


ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 ముగియగానే గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. జనవరి 26 వరకు ఈ సేల్ లైవ్‌లో జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్, వాటి యాక్సెసరీస్ మీద భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. డిజిటల్ కెమెరాలు, స్మార్ట్‌వాచెస్‌, వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్‌, లాప్‌టాప్స్‌, మానిటర్స్‌, ప్రొజెక్టర్స్‌, గేమింగ్ హెడ్‌సెట్స్‌, కంప్యూటర్ విడిభాగాల మీద భారీ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. దానితో పాటు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్, ఫైర్ బోల్ట్ టాక్ స్మార్ట్‌వాచ్‌, డెల్ లాప్‌టాప్స్‌, నథింగ్ ఇయర్ వన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్‌, హెచ్‌పీ మౌస్‌, కీబోర్డ్ మీద భారీ డిస్కౌంట్ లభించనుంది. 9వ జనరేషన్ యాపిల్ ఐపాడ్‌, సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఏ7 వైఫై వేరియంట్‌, యాపిల్ ఎయిర్‌పాడ్స్ మీద కూడా భారీ ఆఫర్లు ఈ సేల్‌లో ఉండనున్నాయి. 


నేతాజీ 3D హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ !


ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే ప్రదేశంలో గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఉంచుతామని ప్రధాని మోదీ ప్రసంగంలో తెలిపారు. గ్రానైట్ విగ్రహం ఎప్పుడు నిర్మించబడి ఏర్పాటు చేస్తోరో అన్న నిర్దిష్ట తేదికి సంబందించిన వివరాలను వెల్లడించలేదు. హోలోగ్రామ్‌లు అనేవి నిజమైన భౌతిక వస్తువులను ప్రతిబింబించే కాంతి కిరణాల జోక్యం సహాయంతో సృష్టించబడిన వర్చువల్ 3D చిత్రాలు. సుభాష్ చంద్రబోస్ యొక్క హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన విషయానికి వస్తే హోలోగ్రామ్ యొక్క చిత్రాన్ని వాస్తవికంగా మరియు అన్ని వైపుల నుండి కనిపించే విధంగా ప్రొజెక్ట్ చేయడం. హోలోగ్రామ్ చూడడానికి  తప్పనిసరిగా దాని చుట్టూ నడవాలి. కొత్తగా ఏర్పాటు చేసిన నేతాజీ హోలోగ్రామ్ 30,000 ల్యూమెన్స్ 4K ప్రొజెక్టర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గ్రానైట్ విగ్రహాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే వరకు అందుబాటులో ఉంచబడుతుంది. సందర్శకులకు అన్ని సమయాలలో కనిపించే విధంగా "90 శాతం పారదర్శక" హోలోగ్రాఫిక్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. "ఇండియా గేట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క హోలోగ్రామ్ విగ్రహం 28×6 అడుగుల పరిమాణంలో ఉంటుంది. గ్రానైట్ విగ్రహం లాగానే ఇది కనిపిస్తుంది. అంతేకాకుండా అసలు విగ్రహం వచ్చే వరకు ప్రతిరోజూ సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది" అని ఒక అధికారి తెలిపారు. ఈ విగ్రహం యొక్క గ్రాఫిక్ నమూనాను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత గదానాయక్ ఆధ్వర్యంలోని బృందం రూపొందించింది.

భారత్‌లో రెడ్‌మీ నోట్ 11ఎస్‌ ఫిబ్రవరి 9న లాంచ్!


జియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచ్ డేట్‌ను రెడ్‌మీ తాజాగా ఫిక్స్ చేసింది. భారత్‌లో ఫిబ్రవరి 9న లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో హైఎండ్ ఫీచర్లు ఉండనున్నాయి. అందులో ముఖ్యమైనది 108 ఎంపీ రేర్ కెమెరా. ఈ ఫోన్ క్వాడ్ రేర్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉండనుంది. రెడ్‌మీ నోట్ 11 మోడల్స్‌ను గత సంవత్సరమే చైనాలో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 11 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు జియోమీ కసరత్తు చేస్తోంది. 108 ఎంపీ సామ్‌సంగ్ ఐఎస్‌వో సెల్ హెచ్ఎం2 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 355 సెన్సార్‌, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ లాంటి ఫీచర్లతో 11ఎస్ రానుంది. జనవరి 26న రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా జియోమీ లాంచ్ చేయనుంది. అందులో భాగంగా రెడ్‌మీ నోట్ 11 4జీ, రెడ్‌మీ నోట్ 11 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్లు విడుదల కానున్నాయి. అయితే.. గత సంవత్సరం చైనాలో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌కు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఫోన్ల ఫీచర్లలో తేడా ఉండనున్నట్టు తెలుస్తోంది.


Popular Posts