Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, October 25, 2022

మూన్‌లైటింగ్‌పై తాజా నివేదిక !


ఐటీ ఉద్యోగులు మరో జాబ్‌ చేసే మూన్‌లైటింగ్‌ కల్చర్‌పై హాట్‌ డిబేట్‌ సాగుతున్న సమయంలో దాదాపు పది శాతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు రెండవ జాబ్‌ చేస్తున్నారని తాజా నివేదిక స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నప్పటి నుంచి మూన్‌లైటింగ్‌ ట్రెండ్‌ ముందుకొచ్చింది. ఇంటి నుంచి పనిచేసే ఐటీ ఉద్యోగులు తమ రెగ్యులర్‌ జాబ్‌ చేస్తూనే ఫ్రీలాన్స్‌ ప్రాజెక్టులను చేపడతుండటంపై ఐటీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మూన్‌లైటింగ్‌పై విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి టెక్‌ దిగ్గజాలు ఉద్యోగుల తీరును తప్పుబడుతున్నాయి. మూన్‌లైటింగ్‌కు సహకరించే వెసులుబాటు కలిగిన జాబ్‌ల కోసం ఉద్యోగులు దృష్టిసారిస్తుంటే టెక్‌ దిగ్గజాలు మాత్రం మూన్‌లైటింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. భారత్‌లో 9 శాతం ఐటీ ఉద్యోగులు మూన్‌లైటింగ్‌ కొనసాగిస్తున్నారని అవుత్‌బ్రిడ్జ్‌ రీసెర్చి వెల్లడించింది. పూర్తికాలం జాబ్‌ చేస్తూ పార్ట్‌టైమ్‌ అవకాశాలు లేదా మూన్‌లైటింగ్‌ కోసం చూస్తున్న ఉద్యోగులెవరో 65 శాతం ఐటీ ఉద్యోగులకు తెలుసని కొటాక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటాస్‌ చేపట్టిన మరో సర్వే వెల్లడించింది. మూన్‌లైటింగ్‌ను, పార్ట్‌ టైం ఉద్యోగాలను పలు టెక్‌ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తుండగా టెక్‌ మహింద్ర మాత్రం తమ ఉద్యోగుల ఐడియాను సపోర్ట్‌ చేసింది. ఇక గత నెలలో రెండవ ఉద్యోగం చేస్తూ పట్టుబడిన 300 మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించామని విప్రో చీఫ్ రిషద్‌ ప్రేమ్జీ ప్రకటించారు. మూన్‌లైటింగ్‌ మోసపూరిత వ్యవహారమని ఆయన అభివర్ణించారు. ఇక ప్రత్యర్ధి కంపెనీల్లో సెకండరీ జాబ్‌ చేయడం నైతిక పరమైన అంశాలని టీసీఎస్‌ పేర్కొంది. మూన్‌లైటింగ్‌తో తమకు సమస్యల్లేకున్నా ఈ అంశానికి షరతులు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. తాజాగా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న పలువురు ఉద్యోగులను కంపెనీ తొలగించిందని టీసీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సలిల్‌ పరేఖ్‌ ఇటీవల ప్రకటించారు.

వెబ్ అప్లికేషన్, వెబ్‌సైట్ అంటే ఏమిటి ?


కాలేజీలో అడ్మిషన్ పొందాలన్నా ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించి అప్లికేషన్ ను పంపించాలన్నా దరఖాస్తు ఫారమ్ ను నింపి ఆఫ్ లైన్ విధానాన్ని ఉపయోగించుకునే వాళ్లం. అప్పటికి ప్రస్తుతమున్న టెక్నాలజీ లేదు. ఇలా ఒకప్పుడు ఏదైనా ఫారం నింపాలంటే ఆ శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చింది. దీని కోసం.. ఇంటర్నెట్ బ్రౌజర్‌లో సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఇంట్లో కూర్చొని చాలా సులభంగా ఫారమ్‌ను నింపి ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఏ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకుండా వెబ్ అప్లికేషన్ ద్వారా చేసే కొన్ని పనులు కూడా ఉన్నాయి. వెబ్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్ మధ్య వ్యత్యాసం ఉంది. HTML జావాస్క్రిప్ట్, CSS వెబ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగిస్తాయి. కాబట్టి వెబ్‌సైట్ మరియు వెబ్ అప్లికేషన్ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటున్నాయి. అయితే వెబ్ సైట్ ను డైరెక్ట్ గా ఎలాంటి యాప్ లను ఉపయోగించకుండా వాడుకోవచ్చు. వెబ్ అప్లికేషన్ కు మాత్రం యాప్ లను ఉపయోగిస్తున్నారు. వెబ్ అప్లికేషన్ అనేది వెబ్ సర్వర్‌లో పనిచేసే ఒక రకమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్. దీన్ని ఏదైనా బ్రౌజర్ ద్వారా ఒపెన్ చేయవచ్చు. మనం వాడుక పదాలలో మాట్లాడటానికి.. ఏదైనా సమాచారాన్ని పొందడానికి, ఇంటర్నెట్ సహాయం తీసుకుంటే, దాన్ని Google Chrome లేదా Story Firefoxలో సెర్చ్ చేస్తాం. ఆ తర్వాత అనేక రిజల్ట్స్ అనేవి వెబ్ సైట్లో కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ఒక ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఏ సమాచారాన్ని అయితే కావాలని అనుకుంటున్నారో దానిని పొందవచ్చు. ఇలా ఏ రకమైన వెబ్‌సైట్‌నైనా వెబ్ అప్లికేషన్ అని పిలుస్తారు. HTML, జావాస్క్రిప్ట్, CSS వెబ్ అప్లికేషన్‌లను రూపొందించడానికి ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగిస్తారు. వెబ్ అప్లికేషన్ అందరూ ఉపయోగించే జీమెయిల్ అనేది చక్కటి ఉదాహరణ. ఏదైనా బ్రౌజర్ నుండి జీమెయిల్ ను ఉపయోగించవచ్చు. ఎవరికైనా మనం అనుకున్న సమాచారాన్ని చేరవేయవచ్చు. అంతే కాకుండా.. ఫైల్స్, డాక్యుమెంట్స్ లాంటివి కూడా అటాచ్ చేసి పంపవచ్చు. పేస్ బుక్  బ్రౌజర్ అనేది సాఫ్ట్‌వేర్ యాప్ ద్వారా ఉపయోగించబడుతుంది. ఇది ఒక వెబ్ అప్లికేషన్ . ఎందుకంటే చిత్రాలు, వీడియోలు మొదలైనవాటిని సేవ్ చేయడంతో పాటు, మీరు వ్యక్తుల నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకోవచ్చు.

వన్ ప్లస్ నోర్డ్ N300 5G స్మార్ట్ ఫోన్ విడుదల !


వన్ ప్లస్ నోర్డ్ N300 5G స్మార్ట్ ఫోన్ ను అమెరికా మార్కెట్‌లోకి  ప్రవేశపెట్టింది. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మరియు US మార్కెట్లో MediaTek చిప్‌సెట్‌తో ఆధారితమైన మొదటి స్మార్ట్‌ఫోన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Nord N200 5G ఒక పంచ్-హోల్ కెమెరా కటౌట్‌తో ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. మొబైల్ ధరను $228 (సుమారు ₹18,860) గా నిర్ణయించారు. 4GB LPDDR4x RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌. బ్యాక్ ప్యానెల్ మరియు ఫ్లాట్ సైడ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలోని Oppo A77 పరికరాన్ని పోలి ఉంటుంది. డివైజ్ వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ ను లిగి ఉంది, దీనిలో వెనుక కెమెరా సెన్సార్లు మరియు డ్యూయల్ LED ఫ్లాష్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Nord N200 5G ఒక పంచ్-హోల్ కెమెరా కటౌట్‌తో ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. Nord N300 5G వాటర్‌డ్రాప్ నాచ్‌ను పొందుతుంది. Nord N300 5G 6nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై నిర్మించిన ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. డైమెన్సిటీ 810 చిప్‌సెట్ Realme 9 5G, Redmi Note 11T 5G, Poco M4 Pro 5G, Oppo K10 5G మరియు మరిన్ని స్మార్ట్ ఫోన్లకు శక్తినిస్తుంది. Nord N300 5G 4GB LPDDR4x RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమర్చబడింది. 48MP వెనుక ప్రైమరీ కెమెరాను పొందుతుంది. సెకండరీ కెమెరా ఒక చిన్న 2MP డెప్త్ సెన్సార్. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ విధులు ముందు 16MP సెన్సార్ ద్వారా నిర్వహించబడతాయి. హ్యాండ్‌సెట్‌లోని కొన్ని ఇతర ముఖ్యమైన ఫీచర్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మైక్రో SD కార్డ్ స్లాట్, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ v5.1, NFC మరియు USB టైప్-సి ఉన్నాయి. పరికరం 5,000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. USలో OnePlus Nord N300 5G మొబైల్ ధరను $228 (సుమారు ₹18,860) గా నిర్ణయించారు. 4GB LPDDR4x RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అమర్చబడింది.

డిస్కౌంట్ లో గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌ !


శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌పై అదిరే డీల్ సొంతం చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఎంఆర్‌పీ రూ. 34,999గా ఉంది. అయితే దీన్ని రూ. 11 వేల డిస్కౌంట్ తో  రూ. 23,999కు కొనొచ్చు.  మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 2 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే మీకు మొత్తంగా శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 13 వేల డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డిమెన్‌సిటీ 900 ప్రాసెసర్, 108 ఎంపీ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వాపౌర్ కూలింగ్ చాంబర్, ఆటో డేటా స్విచ్చింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై వన్ యూఐ 4పై పని చేస్తుంది. డాల్బే ఆటమ్స్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ స్లిమ్‌గా (7.4 ఎంఎం) ఉంటుంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ నెలకు రూ. 4 వేల నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. 18 నెలల ఈఎంఐకు నెలకు రూ. 1375 చెల్లించాలి. కాగా ఇక్కడ ఈఎంఐ అమౌంట్ అనేది మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మారుతుంది. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే తక్కువ ఈఎంఐ పడుతుంది. తక్కువ టెన్యూర్ అయితే ఎక్కువ ఈఎంఐ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ యూజర్లకు ఫ్రీగా 5G సర్వీసులు ?


ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులను ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వచ్చేశాయి. ఆ నగరాల్లోని మరికొన్ని సర్కిల్‌లలో ఎక్కువ మంది ఎయిర్ టెల్ యూజర్లకు 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, చెన్నై వంటి మరిన్ని నగరాల్లోని స్మార్ట్‌ఫోన్‌లలో 5G సర్వీసులు సపోర్టు చేస్తున్నాయని ట్విట్టర్‌లోని అనేక మంది యూజర్లు గుర్తించారు. అక్టోబరు 1న అధికారికంగా ప్రారంభించిన ఎయిర్‌టెల్ తొలిదశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలలో 5G సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది నాటికి మరిన్ని సర్కిల్‌లలో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. Samsung Galaxy Z Fold 4లో స్పీడ్ టెస్ట్ సమయంలో Airtel 5G దాదాపు 283Mbps స్పీడ్ పొందింది. 5G నెట్‌వర్క్ వస్తుందని చెప్పినంత స్పీడ్‌గా మాత్రం లేదు. దీనికి అనేక కారణాల వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఎయిర్ టెల్ యూజర్లు 732Mbps, 465Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌ని పొందవచ్చు. ఈ 5G స్పీడ్ చెన్నైలో, గురుగ్రామ్‌లో మాత్రమే ఉందని యూజర్లు ట్విట్టర్ పోస్ట్‌లు పెడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లలో 5G కనెక్టివిటీని పొందిన యూజర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించడం లేదు. ఎయిర్‌టెల్ ముందుగా సూచించినట్లుగా యూజర్లు తమ 4G సిమ్ కార్డ్‌లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ 5G ప్లాన్‌ల ధరలను ఇంకా రిలీజ్ చేయలేదు. మరోవైపు, Airtel 5G ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్‌లు హుడ్ కింద 5G మోడెమ్‌ను కలిగి ఉన్నప్పటికీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ ఏడాది చివర్లో కనెక్టివిటీ సపోర్టు పొందవచ్చు. ఎయిర్‌టెల్ 5G లేదా 5G ప్లస్ సర్వీసులు దశలవారీగా ఎనిమిది సర్కిళ్లలో అందుబాటులోకి వస్తున్నాయి. ముందుగా, మీ ఫోన్ 5Gకి సపోర్టు చేస్తుందో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. మోడల్ నంబర్‌ను కనుగొనడంతో పాటు అధికారిక వెబ్‌సైట్‌లోని స్పెసిఫికేషన్‌లను చెక్ చేసుకోవచ్చు. నెట్‌వర్క్ సెక్షన్‌లో 5G ఆప్షన్ లేకుంటే, మీ ఫోన్ 5Gకి సపోర్టు చేయదని అర్థం చేసుకోవాలి. వినియోగదారులు సంబంధిత యాప్ స్టోర్ నుంచి అధికారిక ఎయిర్‌టెల్ యాప్‌ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హోమ్ పేజీలో నేరుగా మీ ఫోన్ 5G ప్రారంభమైందో లేదో చెక్ చేయండి. మీరు Boxపై క్లిక్ చేసిన తర్వాత యాప్ లొకేషన్ Allow అడుగుతుంది. ఆ తర్వాత, మీ ఫోన్ 5Gకి సపోర్టు చేస్తుందో ఉందో లేదో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అయినప్పటికీ, 5G సర్వీసులు పొందుతున్నప్పటికీ, మీ డివైజ్ 5G రెడీగా లేదని అర్థం. అలాంటప్పుడు, మీరు Wi-Fiని ఆఫ్ చేయండి. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న నెట్‌వర్క్ స్టేటస్ బార్ పక్కన 5G ఇండికేషన్ కోసం చెక్ చేయవచ్చు.

Monday, October 24, 2022

జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ విడుదల !


జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ మెక్సికోలో విడుదలయింది. హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే గిజ్మోచైనా కథనం ప్రకారం 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 మెక్సికన్ పెసోలుగా (సుమారు రూ.24,700) ఉంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో వచ్చింది.  ఈ ఫోన్ గ్లోబల్‌గా ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ618 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. ర్యామ్‌ను ఉపయోగించని స్టోరేజ్ నుంచి 2 జీబీ పెంచుకోవచ్చు.  ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, కంపాస్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లుగా ఉంది.

ఇయర్ ఫోన్స్ - ప్రమాదాలు !


ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తే వినికిడి సమస్యతో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మనం1.1 బిలియన్ మందికి పైగా ఎక్కువ సౌండ్స్తో పాటలు వినడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇయర్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ , బ్లూటూత్ అంటే వాటితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము వీటివల్ల ఎక్కువ శబ్దంతో మ్యూజిక్ వినడం వల్ల అది వినికిడి పైన ప్రభావం చూపిస్తుందట. నాసిరకం ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇయర్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏకాగ్రత కూలిపోతారని, ముఖ్యంగా ఇతరులు ఉపయోగించిన ఇయర్ ఫోన్లో మరొకరు వాడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నదట!. ఇయర్ ఫోన్స్ కు బదులుగా హెడ్ ఫోన్లు ఉపయోగించడం వల్ల సౌండ్ కు కర్ణభేరికి మధ్య గ్యాప్ ఉంటుందని తెలియజేస్తున్నారు వైద్యులు. లేదంటే ఏదైనా బ్రాండెడ్ కలిగిన ఇయర్ ఫోన్స్ తో తక్కువ వాల్యూమ్ తో కేవలం గంటా రెండు గంటలు ఉపయోగించి వదిలేయాలని తెలియజేస్తున్నారు.

'శామ్‌సంగ్‌ ఇండియా' ఆదాయం పెరుగుదల !


కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కన్నా  8.65 శాతం గ్రోత్‌ సాధించింది. ఇదిలాఉండగా శామ్‌సంగ్‌ ఇండియాకి నెట్‌ ప్రాఫిట్‌ 4.86 శాతం తగ్గింది. సుమారు రూ.4,041 కోట్ల నుంచి రూ.3,844 కోట్లకు పరిమితమైంది. మొబైల్‌ హ్యాండ్‌సెట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఉత్పత్తులను తయారుచేసే శామ్‌సంగ్‌ ఇండియాకి సంబంధించిన ఈ విషయాలను టోఫ్లర్‌ అనే రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. 2020-21లో శామ్‌సంగ్‌ ఇండియా మొత్తం ఆదాయం రూ.77,501.40 కోట్లు కాగా 2021-22లో 10.09 శాతం పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యాయి. రూ.71,899 కోట్ల నుంచి 10.93 శాతం అధికమై రూ.79,758.90 కోట్లకు చేరుకున్నాయి. శామ్‌సంగ్‌ 1995లో ఇండియాలోకి ప్రవేశించింది. న్యూఢిల్లీకి దగ్గరలోని నోయిడాతోపాటు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రెండు ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసింది. ఐదు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లు, ఒక డిజైన్‌ సెంటర్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. 2 లక్షలకు పైగా ఉన్న రిటైల్‌ ఔట్‌లెట్లు, 3 వేలకు పైగా ఉన్న కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లు వీటికి అదనం.

స్కూటర్లకు కూడా ఎయిర్ బ్యాగ్ ?


జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా ఇకపై స్కూటర్లలో ఎయిర్ బ్యాగులను తీసుకొని రావచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసిందట!. అయితే ఈ ఎయిర్ బ్యాగ్ లను స్కూటర్ మధ్యలో అమర్చవచ్చు. హ్యాండిల్ మధ్యలో ఉండటం వల్ల ఎయిర్‌ బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు వాహనదారుడ్ని సురక్షితంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఈ స్కూటర్ ఎయిర్ బ్యాగ్ కార్లలో ఉండే ఎయిర్‌బ్యాగ్‌ల లాగానే పని చేస్తుంది కానీ కార్లలోని సిస్టమ్‌కు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇకపోతే ఎయిర్ బ్యాగ్ స్కూటర్ లు లాంచ్ ఎప్పుడు అన్న విషయాల విషయానికొస్తే. 2009 సంవత్సరంలో హోండా థాయ్‌లాండ్ అండ్ జపాన్‌లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. PCX అనే ఈ స్కూటర్‌లో ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు కంపెనీ మరోసారి ఎయిర్‌ బ్యాగ్‌లతో కూడిన కొత్త స్కూటర్‌ను అందించవచ్చట !.

అసుస్ జెన్‌ ఫోన్ 9 విడుదల !


అసుస్ జెన్‌ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ ఇటీవలే గ్లోబల్ లాంచ్ అయింది. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. యాపిల్ తరహాలో చిన్న డిజైన్‌తో రానున్న ఈ ఫోన్ కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వారిని ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేయనుంది. దీనికి మనదేశంలో అసుస్ 9జెడ్ అని పేరు పెట్టనున్నారు. అసుస్ జెన్ ఫోన్ 9 ధర యూరోప్‌లో 799 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.64,800) నుంచి ప్రారంభం అయింది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా దీని ధర రూ.70 వేల రేంజ్‌లో ఉండవచ్చు. ఈ ఫోన్ యూరోప్ వేరియంట్ తరహాలోనే మనదేశంలో కూడా దీని ఫీచర్లు ఉండనున్నాయి. దీని యూరోప్ వేరియంట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1100 నిట్స్‌గా ఉంది. హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. అడ్రెనో 730 జీపీయూని కూడా ఈ ప్రాసెసర్‌కు ఇంటిగ్రేట్ చేశారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సిక్స్-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, నావిక్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 18.5 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను, 8 గంటల గేమింగ్ టైంను ఇది అందించనుంది. డ్యూయల్ మైక్రో ఫోన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 169 గ్రాములుగా ఉంది.

Sunday, October 23, 2022

వాయు కాలుష్యం ఊపిరితిత్తులతో పాటు గుండెకు ప్రమాదం !


ఢిల్లీలో ఓవరాల్ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ శనివారం సాయంత్రం 266 మార్కును తాకింది. ఇది చాలా ఆధ్వాన్నమైన స్థాయి అని ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సంస్థ పేర్కొన్నది. ఢిల్లీ యూనివర్సిటీ ఏరియాలో అయితే మరింత అధ్వాన్నంగా AQI 327గా ఉన్నదని SAFAR తెలిపింది. కాగా, ఢిల్లీతోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో ప్రజలు విష వాయువులనే పీల్చుకుంటున్నారని ఫోర్టిస్‌ ఎస్కార్ట్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ డాక్టర్‌ అశోక్‌ సేథ్‌ చెప్పారు. వాయు కాలుష్యం వల్ల ఆస్తమా లాంటి లంగ్స్‌ సంబంధ అరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని మాత్రమే జనానికి తెలుసని సేథ్ అన్నారు. ఊపిరితిత్తులతోపాటు గుండెకు కూడా వాయు కాలుష్యం వల్ల చాలా ప్రమాదం ఉందని డాక్టర్‌ సేథ్‌ హెచ్చరిస్తున్నారు. ఈ అంశంలో ఎలాంటి అజాగ్రత్త తగదని ఆయన చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో యుక్త వయసులో ఉన్న చాలామంది గుండె సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారని, దానికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమన్నది తన అభిప్రాయమని డాక్టర్‌ సేథ్ చెప్పారు. గత 20 ఏండ్ల నుంచి వాయు కాలుష్యం వేగంగా పెరుగుతున్నదని పలు పరిశోధనల్లో తేలిందని ఆయన తెలిపారు.

మైక్రోసాఫ్ట్ నుంచి చెత్త ఊడ్చే కొత్త యాప్ ?


కంప్యూటర్ లో పనికి రాని చెత్త పేరుకుపోతుంది. మన కంప్యూటర్ లో అలాంటిది ఎంత చెత్తదాగివుందో చెప్పడం కష్టం. ఇవి కంప్యూటర్ పనితీరును మందగించేలా చేస్తాయి. దాంతో వేగంగా పనిచేయలేక యూజర్లు ఎంతో ఇబ్బందిపడతారు. వీటిని తొలగించే పరిష్కారం దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ తీసుకువస్తోంది. ఈ యాప్ పీసీలో మూలమూలలా దాగివున్న అనవసర చెత్తను ఏరిపారేస్తోంది. తద్వారా కంప్యూటర్ చురుకుగా, మెరుగైన పనితీరు కనబరిచేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ అభివృద్ధి దశలో ఉంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఇలాంటి క్లీనింగ్ యాప్స్ ఎన్ని ఉన్నా వాటన్నింటి కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. ఈ కొత్త యాప్ కు పీసీ మేనేజర్‎గా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఇది విండోస్ 10, ఆపై వెర్షన్లతో పనిచేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నిదానించడానికి గల కారణాలను అన్వేషించి ఆ దిశగా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, సిస్టమ్ స్టోరేజి స్పేస్ ను కూడా ఓ చూపు చూస్తుంది. స్టోరేజిలో చెత్త ఫైళ్లు చేరకుండా ప్రక్షాళన చేస్తూ, తగినంత స్పేస్ ఉండేలా చూస్తుంది. కేవలం ఒక్క క్లిక్ తో వైరస్ లను గుర్తించడమే కాకుండా, తగిన పరిష్కారాలను కూడా చూపుతుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. త్వరలోనే ఇది కొన్ని ప్రత్యేకమైన మార్కెట్లలోనే అందుబాటులోకి రానుంది.

వోడాఫోన్ ఐడియా దీపావళి ఆఫర్ !


వోడాఫోన్ ఐడియా యూజర్లకు దీపావళి పండగ నేపథ్యంలో బొనాంజా ఆఫర్‌లను ప్రకటించింది.  ఆరు నెలలు, వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల సభ్యత్వం పొందిన వినియోగదారుల కోసం అదనపు డేటా పెర్క్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు అక్టోబర్ 18 మరియు 31 మధ్య మొబైల్ రీఛార్జ్‌పై 75 GB వరకు అదనపు డేటాను ఉచితంగా పొందుతారు. ఈ ప్రత్యేక ఆఫర్ రూ.1449 మరియు రూ.3099 ప్లాన్‌లకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌లలో అనేక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్లలో ఒకటి సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, అపరిమిత కాలింగ్ మరియు రోజువారీ డేటా ను అందిస్తాయి. అలాగే ఒకదానిలో, కంపెనీ డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్‌కి ఒక సంవత్సరం పాటు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.  రూ.1449 ప్లాన్‌లో 180 రోజుల వాలిడిటీని అందిస్తోంది. అపరిమిత కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా అందిస్తుంది. ప్లాన్‌లో, ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి  రోజుకు మొత్తం 1.5 GB డేటాను అందిస్తుంది. ప్లాన్‌లో, దీపావళి ఆఫర్ కింద కంపెనీ 50 GB డేటాను ఉచితంగా ఇస్తుంది. రూ.3099 ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో, ఇంటర్నెట్ వినియోగం కోసం రోజువారీ 2GB డేటాను అందిస్తోంది. ఈ దీపావళి ఆఫర్ కింద, మీరు ఈ ప్లాన్‌లో 75 GB అదనపు డేటా మరియు ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ యొక్క ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. ప్రతిరోజూ 100 ఉచిత SMSలను అందించే ఈ ప్లాన్‌లో, మీరు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ కూడా పొందుతారు. బింగే ఆల్ నైట్ కూడా ఉంది. దీని ప్రకారం, వినియోగదారులు మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటాను ఉచితంగా ఉపయోగించగలరు. ఈ ప్లాన్‌లు వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్ కింద నెలకు 2GB వరకు బ్యాకప్ డేటాను అందిస్తాయి. ఈ ప్లాన్‌ల సబ్‌స్క్రైబర్‌లు Vi Movies & TV VIP యాప్‌కి ఉచిత యాక్సెస్‌ను కూడా పొందుతారు.


ఒకేసారే 32 మందికి వీడియో కాల్‌


వాట్సప్ క్రియేట్ కాల్ లింక్ ఫీచర్ ద్వారా, వాట్సప్ వినియోగదారులు జూమ్, గూగుల్ మీట్ వంటి ఆడియో లేదా వీడియో కాల్ కోసం లింక్‌ను తయారుచేయవచ్చు. క్రియేట్ కాల్ లింక్ ఫీచర్ ఇప్పటి వరకు పరిమిత వినియోగదారులకు అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు మెటా యాజమాన్యంలోని ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అలాగే iOS/iPhone వినియోగదారుల కోసం విడుదల చేయబడింది. ఈ ఫీచర్ మీ వాట్సప్‌లో కనిపించకుంటే, మీ యాప్ స్టోర్ నుంచి యాప్‌ని అప్‌డేట్ చేయండి. ముందుగా వాట్సాప్‌ను 2.22.21.83 వెర్షన్‌కి అప్‌డేట్ చేయండి. దీని తర్వాత, ఈ ఫీచర్ మీ యాప్‌లో అందుబాటులో ఉందో లేదో చూడటానికి వాట్సప్‌కి వెళ్లండి. కాల్ సెక్షన్ ఎగువన క్రియేట్ కాల్ లింక్ ఫీచర్ కనిపిస్తుంది. ముందుగా వాట్సాప్‌లోకి వెళ్లి కాల్స్ సెక్షన్‌పై నొక్కండి, దీని తర్వాత మీరు ఎగువన ‘Create Call link- Share a link for your WhatsApp call’ ఎంపిక కనిపిస్తుంది. ఇప్పుడు క్రియేట్ కాల్ లింక్‌పై నొక్కండి. ఆ తర్వాత వాట్సప్‌లో ఇంటర్‌ఫేస్ తెరవబడుతుంది, అక్కడ మీకు డిఫాల్ట్ కాల్ ఎంపిక, వీడియో కాల్ కోసం లింక్ కనిపిస్తుంది. దీని తర్వాత, లింక్ క్రింద, మీకు నాలుగు ఎంపికలు కనిపిస్తాయి – కాల్ టైప్, వాట్సాప్ ద్వారా లింక్ పంపడం, లింక్ లింక్, షేర్ లింక్‌ను కాపీ చేయండి. ఇప్పుడు కాల్ టైప్ కింద మీకు వీడియో, వాయిస్ అనే రెండు ఎంపికలు కనిపిస్తాయి. ఆడియో కాల్ కోసం లింక్‌ని సృష్టించడానికి, వాయిస్‌పై నొక్కండి. మరోవైపు, మీరు వాట్సాప్‌లో లింక్‌ను షేర్ చేయాలనుకుంటే, ‘వాట్సాప్ ద్వారా లింక్ పంపు’పై నొక్కండి. మీరు లింక్‌ను కాపీ చేయాలనుకుంటే, ‘కాపీ లింక్’పై నొక్కండి. మీరు ఇతర యాప్‌లతో లింక్‌ను షేర్ చేయాలనుకుంటే, ‘షేర్ లింక్’ ఎంపికపై నొక్కండి. ఒక లింక్ ద్వారా 32 మంది వరకు వీడియో కాల్‌లో చేయవచ్చు. ఇంతకు ముందు వాట్సాప్ వీడియో కాల్‌లో కేవలం 8 మంది మాత్రమే ఉండేది. 

నేటితో ముగియనున్న అమెజాన్ పండుగ సేల్


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ఈ రోజు అర్థరాత్రితో ముగియనుంది. సేల్ ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ సేల్ సమయంలో, కస్టమర్లు సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు రూపే కార్డులపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు.  వినియోగదారులు ఈ Oppo ఫోన్‌ను రూ. 20,990కి బదులుగా రూ. 14,990కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై 29% తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద 12,200 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ Oppo ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. Samsung Galaxy M13  ఫోన్ సేల్‌లో రూ. 14,999కి బదులుగా రూ. 9,999కి మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనిపై 33 శాతం రాయితీ అందిస్తోంది అమెజాన్. దీంతో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.9,300 తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల పూర్తి-HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. పవర్ కోసం 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. Redmi K50i 5G ఫోన్‌ను రూ. 31,999కి బదులుగా కేవలం రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,200 తగ్గింపు సైతం అందుబాటులో ఉంది. పవర్ కోసం, ఈ ఫోన్ 5080mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల పూర్తి HD + LCD స్క్రీన్‌ను కలిగి ఉంది, Xiaomi 12 Pro ఫోన్‌ను రూ. 79,999కి బదులుగా కేవలం రూ. 54,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై వినియోగదారులకు 31% తగ్గింపు ఇవ్వబడుతోంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కస్టమర్లు దీనిపై రూ.22,000 తగ్గింపును పొందవచ్చు.


Saturday, October 22, 2022

16 యాప్స్ ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్ !


గూగుల్ అనుమానాస్పదంగా ఉన్న యాప్ లను ఎప్పటికప్పుడు ప్లే స్టోర్ నుండి తొలగిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని యాప్ లు మీ ఇంటర్నెట్ డేటా ను కూడా చాలా ఎక్కువగా వాడుతుంటాయి. ఇలాంటి , అనుమానాస్పదంగా ఉన్న16 యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించినట్లు తెలిపింది. ఒక భద్రతా సంస్థ ద్వారా గుర్తించబడిన అప్లికేషన్‌లు ను వినియోగదారులు తెరిచిన తర్వాత ప్రకటనలపై క్లిక్ చేయడానికి వెబ్ పేజీలను తెరవడం ద్వారా ఈ ప్రకటనలోని మోసాన్ని ప్రదర్శించినట్లు ఆరోపించింది. ఈ యాప్‌లు ప్లే స్టోర్ నుండి తీసివేయక ముందే సెక్యూరిటీ సంస్థ ప్రకారం మొత్తం 20 మిలియన్ ఇన్‌స్టాలేషన్‌లను కలిగి ఉన్నాయి. ARS టెక్నికా నివేదిక ప్రకారం, గూగుల్ ప్లే స్టోర్ నుండి 16 అప్లికేషన్‌లను తొలగించింది, వీటిని మెకాఫీ కూడా గుర్తించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి గతంలో ఇవి అందుబాటులో ఉండేవి, భద్రతా సంస్థ ప్రకారం QR కోడ్‌లను స్కాన్ చేయడానికి, పరికరం యొక్క ఫ్లాష్‌ను టార్చ్‌గా ఆన్ చేయడానికి లేదా వివిధ కొలతలను మార్చడానికి వినియోగదారులను అనుమతించే యుటిలిటీ అప్లికేషన్‌లుగా ప్లే స్టోర్ లో ఇవి జాబితా చేయబడ్డాయి. BusanBus, Joycode, Currency Converter, High-speed Camera, Smart Task Manager, Flashlight+, K-Dictionary, Quick Note, EzDica, Instagram ప్రొఫైల్ డౌన్‌లోడర్ మరియు Ez నోట్స్ వంటి "యుటిలిటీ" యాప్‌లను ప్లే స్టోర్ నుండి  తొలగించింది. ఈ అప్లికేషన్‌లు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఉన్న కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాయని మెకాఫీ కనుగొంది, మరియు ఇది వినియోగదారుని కూడా అప్రమత్తం చేయకుండా జరిగిపోతుంది. ప్రకటనల లింక్‌లు మరియు ప్రకటనలపై క్లిక్ చేయకుండా వెబ్ పేజీలను తెరవడానికి నోటిఫికేషన్‌లను స్వీకరిస్తుంది. ఈ తొలగించబడిన యాప్‌లు "com.liveposting" మరియు "com.click.cas" అనే యాడ్‌వేర్ కోడ్‌తో వచ్చాయని భద్రతా సంస్థ కనుగొంది. ఈ లింక్‌లు మరియు ప్రకటనలపై క్లిక్ చేయడానికి అనుమతించే లైబ్రరీలు వినియోగదారుకు తెలియకుండానే జరుగుతుంది మరియు అదనపు బ్యాటరీ డ్రెయిన్ మరియు నెట్‌వర్క్ వినియోగాన్ని పెంచుతుంది. ప్రస్తుతానికి ప్రమాదకరమైన ఈ అన్ని యాప్ లను ప్లే స్టోర్ నుండి అన్ని అప్లికేషన్‌లు తీసివేయబడ్డాయి.ఇంకా, వినియోగదారుల పరికరాలలో ఈ యాప్‌లను Play Protect బ్లాక్ చేస్తుందని Google Ars Technica కి తెలిపింది. అయితే, ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్‌లు అదనపు కోడ్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటాయని మెకాఫీ యొక్క నివేదిక తెలిపింది, ఇలా డౌన్‌లోడ్ చేసుకోవడం కారణంగా ప్లే స్టోర్‌లో Google యొక్క సెక్యూరిటీ వివరాలను దాటవేయగలిగారని సూచిస్తున్నారు.

రిఫ్రిజిరేటర్‌ -జాగ్రత్తలు !


తినే  పదార్థాలు, వస్తువులను తాజాగా ఉంచడానికి ఫ్రిజ్‌ ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఫ్రిజ్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. రిఫ్రిజిరేటర్‌ను శుభ్రపరచడం నుండి దానిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.  కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత దాని రుచి కూడా మరిపోతుండటం గమనించే ఉంటారు. కొన్ని ఆహారాలు పాడైపోవడం, దానిపై బ్యాక్టీరియా  తయారు కావడం లాంటివి జరుగుతుంటాయి.  ఆహారం తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతాము. కానీ ఇది సరైనది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే చల్లదనం కారణంగా ఆహారంపై పొర ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఆహారం తక్కువ ఉష్ణోగ్రత కారణంగా దాని రుచి క్షీణిస్తుంది. ఆహారాన్ని పాత్రలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే ఆ పాత్రలో నీరు లేదా దాని చుక్కలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే తడి కారణంగా ఆహారం చెడిపోతుంది. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు కడగడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి చెడిపోతాయి. చూడడానికి బాగానే ఉన్నా తడి కారణంగా అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. ఫ్రిజ్‌ కొన్ని ఆహార పదార్థాలు, కూరగాయలు పెట్టుకునేందుకు డస్ట్‌బిన్‌గా ఉపయోగించడం చేస్తే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

వివో బిగ్‌ జాయ్‌ దీపావళీ !


దీపావళీ సందర్భంగా దిగ్గజ ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు గాను వివో బిగ్‌ జాయ్‌ దీపావళీ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే కేవలం 101 రూపాయలకే వివో స్మార్ట్‌ ఫోన్‌ సొంతం చేసుకునే  అవకాశాన్ని కస్టమర్లకు అందించనుంది. దీనిలో భాగంగా తన వివో ఎక్స్ 80 సిరీస్, వివో వీ 25 సిరీస్, వై75 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై గతంలో ఎన్నడు ఇవ్వనంత భారీ డిస్కౌంటు ఇస్తున్నట్టు తెలిపింది. వివో ఎక్స్ 80 సిరీస్‌పై ఏకంగా రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలానే వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా అందించే ఈఎంఐలపై కూడా ఈ ప్రయోజనాలు అందిస్తోంది. దానిలో భాగంగా కస్టమర్లు ముందుగా కేవలం రూ. 101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్‌లో తమకు నచ్చిన ఫోన్‌ను తీసుకెళ్లొచ్చని ఈ సందర్భంగా వివో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ తర్వాత ఈఎంఐ కట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. రూ. 15 వేలకు పైన విలువైన వివో ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా, ఆరు నెలల అదనపు వారంటీ ఇస్తున్నట్టు తెలిపింది. వై సిరీస్ ఫోన్లను ఈఎంఐపై తీసుకుంటే వాటిపై రూ.2,000 క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 

ఐక్యూ నుంచి ఐక్యూ నియో 7 విడుదల !


ఐక్యూ బడ్జెట్ ఫోన్లతో పాటు మిడ్‌రేంజ్ ఫోన్లను వరుసగా మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా మరో మిడ్‌రేంజ్ ఫోన్‌ను చైనీస్ మార్కెట్‌లోకి అధికారికంగా రిలీజ్ చేసింది. ఐక్యూ నియో 7 పేరుతో తీసుకొచ్చిన ఈ డివైజ్‌లో లేటెస్ట్ చిప్‌సెట్‌తో పాటు, 120Hz AMOLED డిస్‌ప్లే, 120W ఛార్జింగ్ కెపాసిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.  మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ SoC, ఇండిపెండెంట్ ప్రో+ డిస్‌ప్లే చిప్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 12GB వరకు LPDDR5 RAM, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో పాటు 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్, OTG వంటి కనెక్టివిటీ ఫీచర్లు దీని సొంతం. 50 MP సోనీ IMX766V సెన్సార్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8 MP అల్ట్రావైడ్ యూనిట్, 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఐక్యూ నియో 7 డివైజ్ 20:8 యాస్పెక్ట్ రేషియో, 1,500 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేసే 6.78 అంగుళాల FHD+ E5 AMOELD శామ్‌సంగ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ప్యానెల్ HDR10+, DCI-P3 కలర్ గామాట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ OriginOS Oceanతో రన్ అవుతుంది.  చైనాలో లాంచ్ అయిన ఐక్యూ నియో 7 ఫోన్ వివిధ వేరియంట్లలో లభిస్తోంది. ఫోన్ బేస్ వేరియంట్ 8GB/128GB మోడల్ ధరను CNY 2,699గా (దాదాపు రూ. 31,000) నిర్ణయించింది. 8GB/256GB వేరియంట్ ధర CNY 2,799 (సుమారు రూ. 32,150), 12GB/256GB వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ. 34,450), టాప్ ఎండ్ 12GB/512GB వేరియంట్ ధర CNY 3,299 (సుమారు రూ. 37,900)గా ఉంది. ఈ ఫోన్ జామెట్రిక్ బ్లాక్, ఇంప్రెషన్ బ్లూ, పాప్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చైనాలో ఐక్యూ నియో 7 ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 

రాజస్థాన్‌లో జియో 5G సేవల ప్రారంభం


రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం నుండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ 5G సేవలను ప్రారంభించారు. నేటి నుంచి నాథ్‌ద్వారాతో పాటు చెన్నైలో కూడా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి అని ఆకాష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత నెలలో ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం నుండి రాష్ట్రంలో 5G సేవలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 2015లో కూడా ముఖేష్ అంబానీ 4G సేవలను ప్రారంభించే ముందు శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించారు.

Friday, October 21, 2022

ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లు !


ఇన్‌స్టాగ్రామ్  యూజర్లకు మరిన్ని మెరుగైన సేఫ్టీ ఫీచర్స్ పరిచయం చేసింది. ఈ అప్‌డేటెడ్ ఫీచర్లతో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర, అసభ్యకర మెసేజ్‌లు పంపే ఇతర యూజర్లను చాలా సమర్థవంతంగా బ్లాక్ చేయవచ్చు. అలాగే బ్యాడ్ కామెంట్స్‌ బిల్డర్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ కొత్త సేఫ్టీ టూల్స్‌ల అప్‌డేట్స్ పరిచయం చేశారు. "ఈ రోజు మేం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేటర్స్ & యూజర్లు సురక్షితంగా ఉండటానికి న్యూ నడ్జెస్, అప్‌డేటెడ్ బ్లాకింగ్, హిడెన్ వర్డ్స్ ఇంప్రూవ్‌మెంట్స్ అనే కొత్త మార్గాలను ప్రకటిస్తున్నాం" అని ఆడమ్ ఒక ట్వీట్ చేశారు. కామెంట్స్, డైరెక్ట్ మెసేజ్‌లలో బ్యాడ్ వర్డ్స్ పంపించకుండా ఓన్లీ రెస్పెక్టబుల్ వర్డ్స్ పంపేలా యూజర్లను ప్రోత్సహించడమే ఈ నడ్జెస్ ఫీచర్ ముఖ్య పని. ఒకవేళ యూజర్లు ఏదైనా బ్యాడ్ కామెంట్ చేయాలనుకున్నా లేదా అసభ్యకర మెసేజ్‌ పంపాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్ వెంటనే వారిని నడ్జ్ చేస్తుంది. "హెల్ప్ కీప్ ఇన్‌స్టాగ్రామ్ ఏ సపోర్టివ్ ప్లేస్" అనే పాప్-అప్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల మధ్య గౌరవప్రదమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. నడ్జెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాధించే కామెంట్స్‌కి చాలావరకు కళ్లెం వేస్తాయి. ఒక పోస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లో ఇడియట్, స్టుపిడ్ వంటి అనుచిత పదాలు ఉంటే.. మరొకరు అక్కడ మరింత బ్యాడ్ వర్డ్స్ యూజ్‌ చేయకుండా ఒక రిమైండర్‌ను ఈ ఫీచర్ పంపిస్తుంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్‌ లాంగ్వేజ్ లో యాప్స్ వాడే యూజర్లకు ఈ నడ్జెస్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేస్తే వారు మళ్లీ ఆ యూజర్లను కాంటాక్ట్ అవ్వకుండా ఇన్‌స్టాగ్రామ్ బ్లాకింగ్ ఫీచర్‌ను మరింత సమర్థవంతంగా మార్చింది. ఈ కొత్త ఫీచర్‌తో, మీరు ఎవరినైనా బ్లాక్ చేసిన ప్రతిసారీ.. వారి బ్లాక్డ్‌ అకౌంట్‌తో పాటు వారికి సంబంధించిన మిగతా అకౌంట్స్‌ లేదా భవిష్యత్తులో క్రియేట్ చేసే ఇతర అకౌంట్స్‌ బ్లాక్ చేయడం సాధ్యమవుతుంది. ఇది కొత్త అకౌంట్స్ ఉపయోగించి వెంబడించడం/వేధించడం వంటి వాటికి చెక్ పెడుతుంది. హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్ అభ్యంతరకరమైన, ప్రమాదకరమైన మెసేజ్‌లు కామెంట్స్ గుర్తించి వాటిని యూజర్లకు కనిపించకుండా దాచేస్తుంది. ఈ ఫీచర్‌ ఆన్ చేసిన యూజర్లకు కామెంట్స్, మెసేజ్ రిక్వెస్ట్ నుంచి హానికరమైన కంటెంట్‌ ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు క్రియేటర్ అకౌంట్స్‌కి హిడెన్ వర్డ్స్ డిటెక్షన్‌ను ఆటోమేటిక్‌గా ఆన్ చేయడాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఈ సెట్టింగ్‌లను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. వారు తమకు కనిపించకూడదు లేదా దాచాలనుకునే ఎక్స్‌ట్రా పదాలు, పదబంధాలు, ఎమోజీలు ఒక కస్టమ్ వర్డ్స్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు చూడకూడదనుకున్న కంటెంట్ మొత్తం హైడ్ అవుతుంది.

వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ ?


వాట్సాప్ 'ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్' అనే కొత్త అప్‌డేట్ తీసుకు రావడానికి సిద్ధమైంది. ఈ అప్‌డేట్ గురించి వాట్సాప్ ట్రాకర్ WABetaInfo రిపోర్ట్ చేసింది. వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది.  సాధారణంగా వాట్సాప్‌లో క్యాప్షన్ గల మీడియా ఫైల్స్ ఫార్వర్డ్ చేసినప్పుడు అవి క్యాప్షన్ లేకుండానే అవతలి వ్యక్తికి సెండ్ అవుతుంటాయి. ఫార్వర్డ్ చేసే ఫొటోలు, వీడియోలు, గిఫ్స్ (GIFs), డాక్యుమెంట్స్ వంటి మీడియా ఫైల్స్ అన్నిటిలో ఇలానే క్యాప్షన్‌ మిస్ అవుతుంటుంది. ఫలితంగా ఫార్వర్డ్ చేసే ప్రతి మీడియా మెసేజ్‌కి క్యాప్షన్ జత చేయాల్సిన వస్తోంది. కొత్త అప్‌డేట్‌తో ఈ సమస్యకు వాట్సాప్ చెక్ పెట్టనుంది. సరికొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు మీడియా ఫైల్స్‌తో పాటు క్యాప్షన్ కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అప్పుడు రిసీవర్‌కి క్యాప్షన్‌తోనే మీడియా అందుతుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో షేర్ చేసిన ఒక స్క్రీన్‌షాట్ ప్రకారం, కొత్త అప్‌డేట్‌తో యూజర్లు మీడియా ఫైల్స్‌ను క్యాప్షన్‌తో ఫార్వర్డ్ చేయడమే కాదు క్యాప్షన్ లేకుండా కూడా పంపించొచ్చు. షేర్ చేసేటప్పుడు మీడియా ఫైల్స్ కింద క్యాప్షన్ బాక్స్‌లో క్యాప్షన్ కనిపిస్తుంది. ఈ కాప్షన్ క్లియర్/ఎడిట్ చేయొచ్చు. లేదంటే ఆ క్యాప్షన్‌తోనే డైరెక్ట్‌గా మీడియా ఫైల్ ఫార్వర్డ్ చేయవచ్చు. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఫార్వార్డ్ చేసిన కంటెంట్‌కు క్యాప్షన్‌ను చేర్చాలను కుంటున్నారా అని ఒక పాప్‌-అప్ కనిపించింది. మల్టీమీడియా కంటెంట్‌కు క్యాప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కొత్త పాప్‌-అప్/ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్ కింద ఉన్న డిస్మిస్ బటన్‌ను నొక్కడం ద్వారా క్యాప్షన్‌ను రిమూవ్ చేయవచ్చు. ఇక ప్రస్తుతానికి వాట్సాప్‌లో ఒకేసారి 5 కాంటాక్ట్స్‌కి మాత్రమే మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడం కుదురుతుంది. వాట్సాప్ ఇటీవల అప్‌డేటెడ్ స్టేటస్‌లు ఈజీగా కనిపెట్టడానికి వీలుగా కొత్తగా స్టేటస్ అప్‌డేట్ చేసిన వారి కాంటాక్ట్ ఐకాన్ చుట్టూ ఒక సర్కిల్‌ను చూపించడం ప్రారంభించింది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అవతార్ క్రియేట్ చేసుకునే వీలు కల్పించనుంది. అలాగే ఒకే మెసేజ్‌కు 4 ఎమోజీలతో రియాక్ట్ అయ్యేలా ఒక అప్‌డేట్ విడుదల చేయనుంది. అంతేకాకుండా, పంపించిన మెసేజ్‌లను ఎడిట్ చేసే సదుపాయం అందించనుంది 

దీపావళి తర్వాత పాత ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు !


వాట్సాప్ ఇకపై iOS 10 లేదా iOS 11లో రన్ కాదని iPhone యూజర్లకు తెలియజేస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ని కొనసాగించాలంటే పాత ఐఫోన్ యూజర్లు తమ iOSని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.  వాట్సాప్  హెల్ప్ సెంటర్ పేజీ ప్రకారం, iPhone యూజర్లు వాట్సాప్ యాప్‌ని కొనసాగించడానికి iOS 12 లేదా అంతకంటే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి.  iOS 10, iOS 11 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లలో చాలా iPhoneలు రన్ కావడం లేదు. iPhone 5 లేదా iPhone 5Cని ఉపయోగించే iPhone యూజర్లు iOS, WhatsAppని అప్‌డేట్ చేసిన తర్వాత WhatsAppని ఉపయోగించవచ్చు. అయితే, iPhone 4, iPhone 4S యూజర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సమయం ఆసన్నమైంది. WhatsApp ఇకపై డివైజ్‌కు సపోర్టు ఇవ్వదని గుర్తించాలి. ప్రైవసీ, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో WhatsApp నిరంతరం పనిచేస్తుంది. అందుకోసం ఆపిల్, ఆండ్రాయిడ్ అందించిన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో సరిపోయే డెవలప్‌మెంట్‌లపై మెసేజింగ్ యాప్ ఫోకస్ పెట్టింది.  వాట్సాప్ లోని కొత్త అప్‌డేట్‌లు పాత OS, డివైజ్‌లకు సపోర్టు ఇవ్వవని గుర్తించాలి. ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లకు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను కొనసాగించడానికి ఆండ్రాయిడ్ 4.1 లేదా నెక్స్ట్ వెర్షన్ కూడా అవసరమని గుర్తించాలి. ఒకవేళ మీ iPhone ఆటో-అప్‌డేట్‌లో లేనట్లయితే.. మీరు Settings > Generalకు వెళ్లడం ద్వారా iOS సరికొత్త వెర్షన్‌కి అప్‌డేట్ చేయవచ్చు. ఆపై లేటెస్ట్ iOS వెర్షన్‌ను పొందడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని Tap చేయండి. మీరు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే పండుగ సేల్ సమయంలో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో iPhone 12, iPhone 13పై బెస్ట్ డీల్స్ ద్వారా మరెన్నో డిస్కౌంట్‌లను పొందవచ్చు.

వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రో టికెట్స్ !


దేశంలో వాట్సాప్‌ ద్వారా ఫుల్లీ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్డ్ ఈ టికెటింగ్ ఫెసిలిటీ తెచ్చిన తొలి మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైల్ నిలిచింది. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ బిల్ఈజీ తో ఇందుకోసం హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ప్రయాణికులు ఇప్పుడు వాట్సాప్‌ ద్వారానే హైదరాబాద్ మెట్రో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీని కోసం స్మార్ట్ ఫోన్‌ లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్ చేసి హైదరాబాద్ మెట్రో రైల్ నంబర్ +91 8341146468 కు హాయ్ అని మెసేజ్ చేయాలి. ఆ నెంబర్ కు  మెసేజ్ చేయడానికి ముందుగా ఆ నెంబర్ ను సేవ్ చేసుకోవాలి. లేదంటే మైట్రో స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసినా కూడా సరిపోతుంది. ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత ఈ టికెటింగ్ కోసం ఒక యూఆర్‌ఎల్‌ వాట్సాప్ చాట్‌ లోకి  వస్తుంది. ఆ యూఆర్‌ఎల్‌ పై క్లిక్ చేస్తే ఈ-టికెట్ గేట్‌ వే వెబ్‌ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో జర్నీ రూట్‌ ను ఆ వెబ్‌పేజ్‌లో ఎంటర్ చేయాలి. అనంతరం ప్రొసీడ్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ పేజీకి వెళుతుంది. ఇక్కడ పేమెంట్ పూర్తయ్యాక ఈ-టికెట్ యూఆర్ఎల్ వాట్సాప్‌ చాట్‌కే వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే QRకోడ్‌ ఈ-టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇక మెట్రో గేట్ వద్ద ఈ QR కోడ్ స్కాన్ చేసి ఎంటర్ అవొచ్చు.

గూగుల్‌కి రూ.1338 కోట్ల జరిమానా !


కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్‌కి భారీ జరిమానా విధించింది. మార్కెట్లో ఉన్న తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై రూ.1338 కోట్లను జరిమానా విధించింది. అంతేకాక, అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడం మానుకోవాలని హెచ్చిరించింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు గూగుల్ మొబైల్ సూట్‌ను కూడా పొందపరిచేలా షరతు విధిస్తుందన్న ఆరోపణలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ లేకుండా ప్రి ఇన్‌స్టాల్ చేయాలనడం అసమంజసమని సీసీఐ చైర్ పర్సన్ అశోక్ కుమార్ ఆదేశాల్లో వెల్లడించారు. 

Thursday, October 20, 2022

దేశీయ మార్కెట్లో ఒప్పో ఏ17కే విడుదల !


దేశీయ మార్కెట్లో ఒప్పో కొత్త బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ17కేను విడుదల చేసింది.  6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.10,499గా నిర్ణయించారు. నేవీ బ్లూ, గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియా 88.7 శాతంగానూ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఒప్పో ఏ17కేలో అందించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఒప్పో ఏ17కే పని చేయనుంది. దీని బరువు 199 గ్రాములుగా ఉంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. వెనకవైపు కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ 78 డిగ్రీలు కాగా, సెల్ఫీ కెమెరా ఫీల్డ్ ఆఫ్ వ్యూ 76.8 డిగ్రీలుగా ఉంది. వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు మ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్లను కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

రూ. 32 లక్షలకు అమ్ముడైన 'ఐఫోన్' !


ఐఫోన్ హైఎండ్ ధర ఎంత ఉంటుంది? దాదాపు రూ. 2 లక్షలు. మోడల్‌ని బట్టి అంతకంటే తక్కువ ధరకే ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఐఫోన్ మాత్రం ఒకటి కాదు. రెండు కాదు.. ఏకంగా రూ. 32 లక్షల ధరకు అమ్ముడుపోయింది. ఫ్యాక్టరీ సీల్డ్, ఫస్ట్ ఎడిషన్ ఐఫోన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. 2007లో ఐఫోన్ మార్కెట్‌లో విడుదలవగా, ఫస్ట్ ఎడిషన్ ఫోన్ ఒకదానిని ప్రస్తుతం వేలం వేశారు. దాని ధర 599 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, ఇది అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో ఏకంగా 39,339.60 డాలర్లు పలికింది. ఇది అసలు ధర కంటే దాదాపు 65 రెట్లు ఎక్కువ. ఫస్ట్ ఎడిషన్ ఐఫోన్‌లో ప్రత్యేక ఫీచర్లు ఏమీ లేవు. కేవలం 8GB స్టోరేజీ, 2MP కెమెరా మాత్రమే ఉంది. ఈ ఫోన్‌ను వేలంలో మొదట 2,500 డాలర్లు పాడారు. ఆ తరువాత 10,000 డాలర్లకు చేరింది. వేలం జరిగిన మొదటి రెండు రోజులు ధర మారలేదు. ఆ తరువాత జరిగిన 28 వేర్వేరు బిడ్‌లలో ఫోన్ ధర ఐదు అంకెలను మించిపోయింది. ఈ ఫోన్‌ను ఎవరూ వినియోగించలేదని నిర్ధారించడానికి అనేక సూచికలు కూడా ఉన్నాయి. పకడ్బందీ ప్యాకేజీతో, ఫ్యాక్టరీ సీల్ అన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 2007 జనవరి 9న మొట్టమొదటి ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. సెల్‌ఫోన్ ప్రారంభించిన 5 నెలల తరువాత దాని క్రేజ్ భారీగా పెరిగింది. ఫస్ట్ జెనరేషన్ ఐఫోన్ గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లో వెలుగొందింది.

మారుతి మొదటి కారు మారుతి 800 !


మొదటి మారుతి 800 పునరుద్ధరించబడింది.  మారుతీ దేశంలో అతిపెద్ద కార్ల తయారీ మరియు విక్రయదారు. కంపెనీ వాహనాలను విపరీతంగా కొనుగోలు చేస్తారు. ఆల్టో 800 కంపెనీ  అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి, ఇది కంపెనీ మారుతి 800ని గుర్తు చేస్తుంది. మారుతి కంపెనీ మొదటి వాహనం మారుతి 800. సరిగ్గా 39 ఏళ్ల క్రితం 1983లో మారుతీ దీన్ని విడుదల చేసింది. ఈ కారు రోడ్లపై కనిపించకపోవచ్చు కానీ ఒకప్పుడు ఇది భారతీయ కార్ మార్కెట్‌ను కుదిపేసింది. విశేషమేమిటంటే.. ఇప్పటికీ ఈ కారు షైనింగ్ కండిషన్‌లో కనిపిస్తూ ఉంటుంది. కంపెనీ తన మొదటి మారుతి-800ని విడుదల చేసినప్పుడు, దాని ధర కేవలం రూ.47,500. అయితే 1983 సంవత్సరంలో ఈ మొత్తం కూడా చాలా ఎక్కువగానే ఉంది. మారుతి 800 మొదటి యూనిట్ హర్యానాలో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌లో తయారు చేయబడింది. 2010లో కంపెనీ తన ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, ఈ కారు దశాబ్దాలుగా వినియోగదారుల హృదయాలను గెల్చుకుంది. దాని స్థానంలో మారుతీ ఆల్టోను తీసుకొచ్చింది. న్యూఢిల్లీకి చెందిన హర్పాల్ సింగ్ మారుతి సుజుకి మొదటి 800 కారును  కొనుగోలు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ DIA 6479. అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ తన చేతులతో కారు తాళాలను ఆయనకు అందజేశారు. హర్పాల్ సింగ్ కూడా తన జీవితాంతం తనతో పాటు కారును తీసుకెళ్లాడు. అతను 2010లో మరణించాడు. ఆ తర్వాత కారు పరిస్థితి విషమంగా మారింది. ఈ వాహనం యొక్క శరీర భాగాలు మెరుస్తున్న స్థితిలోనే కరగడం ప్రారంభించాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కారును పునరుద్ధరించాలని కంపెనీ నిర్ణయించింది. అన్ని అసలు విడి భాగాలు మరియు పరికరాలు వాహనంలో మళ్లీ ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఇప్పుడు మారుతి ఈ కారును ప్రధాన కార్యాలయంలో ప్రదర్శనగా ఉంచారు. 

భూమి చుట్టూ 30 వేల గ్రహ శకలాలు !


మన భూమికి దగ్గరగా 30 వేల గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నదని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ పరిశోధకులు తెలిపారు. అందులో 1,425 గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని, వీటిపై టెలిస్కోప్‌తో ఓ కన్నేసి ఉంచాలని వెల్లడించారు.

ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారు గుర్తుంచుకోవలసినవి !


పారిస్ ఒప్పందం అమలులో బాగంగా కర్బన ఉద్గారాల కట్టడి కోసం ప్రభుత్వం ఈ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు కొన్ని కొత్త కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగు పెట్టాయి. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మండిపోతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలు. కర్బన ఉద్గారాల విడుదలలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఐక్యూ ఎయిర్ 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య కారక నగరాల్లో 14 భారత్‌కు చెందినవే. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇండియాలో 2014 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ల వాడకం స్థిరంగా పెరుగుతూ వస్తోంది. 2019లో 1,52వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు అమ్ముడయ్యాయి. 2014తో పోల్చుకుంటే ఇది 20.6 శాతం ఎక్కువ. 2020-25 మధ్య ఇది 63.9 శాతం పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇండియాలో ఈ-వెహికల్స్ ట్రెండ్ ప్రారంభించింది హీరో ఎలక్ట్రిక్ సంస్థ. ఫ్లాష్, ఆప్టిమా, నిక్స్ పేరుతో ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. హీరో తర్వాత ఎథెర్ ఎనర్జీ, ఒకినావా స్కూటర్స్, బీగాస్, ఏంపియిర్, ఓలా, ప్యూర్ మరి కొన్ని సంస్థలు కూడా స్కూటర్లు, బైకుల్ని తయారు చేస్తున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు ఎంత చెప్పినా.. ప్రజలు తమ సౌలభ్యం, సౌకర్యమే చూసుకుంటారనేది వాస్తవం. పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకు నేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలు మేలని చాలా మంది భావిస్తున్నారు. మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైకుల షోరూమ్‌లు వెలిశాయి. ఈ వాహనాలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇతర వాహనాల్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు కూడా కష్టాలు, నష్టాలు ఉన్నాయి. ఈ వాహనాల వల్ల పెట్రోల్ ఖర్చు, రిపేర్లు, విడి భాగాల కొనుగోలు ఖర్చు చాలా వరకూ తగ్గుతోంది. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. నిర్వహణ ఖర్చు తక్కువ. పర్యావరణ హితమైనవి. సౌండ్ పొల్యూషన్ ఉండదు. ప్రతికూలతల విషయానికి వస్తే ధరలు ఎక్కువగా ఉండటం, అక్కడక్కడ బ్యాటరీలు పేలిపోతుండటం, బ్యాటరీని మార్చాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి రావడం, ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేకపోవడం లాంటి కొన్ని సమస్యలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పెట్రోల్ బంకుల మాదిరిగా విస్తృతంగా చార్జింగ్ పాయింట్లు లేకపోవడం, వేగంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం చాలా సంస్థల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనేటప్పుడు దాని సైజ్, సస్పెన్షన్ బ్రేక్స్, సర్వీసింగ్, ఒకసారి చార్జింగ్ పెట్టాక ఎంతదూరం ప్రయాణిస్తుంది, ఎలా పని చేస్తుంది లాంటి విషయాలన్నీ తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాటిలో చాలా వరకూ సింగిల్ చార్జింగ్‌తో 50 నుంచి వంద కిలోమీటర్లు మాత్రమే వెళుతున్నాయి. కొన్ని వాహనాల్లో అదనపు బ్యాటరీతో మరి కొంత దూరం వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని సంస్థలు డాష్ బోర్డులోనే బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉంది, వాహనం ఎంత దూరం వెళుతుందనే అంశాలతో పాటు మ్యాపులు, యూఎస్‌బీ పోర్టు, స్పీడ్ మోడ్, సీటు కింద స్టోరేజ్ బిన్స్ లాంటి సౌకర్యాలు అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంపిక చేసుకోవడంలో అన్నింటి కంటే కీలకం బ్రాండ్. వాహనాన్ని తయారు చేసిన సంస్థ చరిత్ర, విశ్వసనీయత కూడా ముఖ్యం. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఆందోళన కలిగిస్తున్న అంశం ప్రమాదాలు. బ్యాటరీలు పేలిపోవడం, వాహనాలు కాలిపోవడం లాంటి ఘటనల్ని చూస్తున్నాం. అయితే ఇందులో ఎక్కువగా వినియోగదారుల అవగాహన లేమి వల్లే జరుగుతున్నాయి. వాహనాల్ని ఎండలో పార్కింగ్ చెయ్యడం, బ్యాటరీని ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం, చార్జింగ్ పెట్టగానే వాహనాన్ని నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. వాహనాన్ని పార్కింగ్ చేశాక, కొంత సేపటి తర్వాత చార్జింగ్ పెట్టడం, చార్జింగ్ పూర్తయిన అరగంట తర్వాతే వాహనాన్ని నడపడం వంటి వాటితో ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.  నిర్ధారిత ప్రమాణాలున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మూడేళ్ల వరకూ ఢోకా లేకుండా నడుస్తుందని కైనటిక్ సంస్థ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అయితే ఇది వాహనం నడిపే వ్యక్తుల వ్యవహార శైలి మీద కూడా ఆధారపడి ఉంటుందని చెబుతోంది. పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రభుత్వం 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో బాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఈవీలను ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - FAME పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు ఇస్తోంది. పెట్రోల్ వాహనాల మీద జీఎస్టీ 28 శాతం ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల మీద జీఎస్టీ 12 శాతంగా ఉంది.


Wednesday, October 19, 2022

ఐమెసేజ్ కంటే వాట్సాప్‌ బెటర్ !


ప్రపంచంలోని అన్ని దేశాల్లో వాట్సాప్ అత్యధిక యూజర్లతో అగ్రస్థానంలో  ఉంది. కానీ యూఎస్‌లో మాత్రం యాపిల్ ఐమెసేజ్‌ను ఎక్కువ మంది వాడుతున్నారు. అమెరికాలోని ప్రజలందరూ కూడా తమ మెసేజింగ్ యాప్‌నే వాడేలా ఎంకరేజ్ చేయడానికి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా యాపిల్ ఐమెసేజ్ కంటే తమ వాట్సాప్ చాలా సెక్యూర్, ప్రైవేట్ అంటూ పోస్ట్ పెట్టారు. iMessageలో ఉన్న డిసడ్వాంటేజెస్‌ను ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఫన్నీగా వెల్లడించారు. మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ..'గ్రూప్ చాట్‌లతో సహా ఐఫోన్లు, ఆండ్రాయిడ్ రెండింటిలోనూ పనిచేసే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వాట్సాప్ iMessage కంటే చాలా ప్రైవేట్, సెక్యూర్. వాట్సాప్‌లో మీరు సింగిల్ బటన్‌ను నొక్కడం ద్వారా అన్ని కొత్త చాట్‌లను కూడా డిసప్పియర్ అయ్యేలా సెట్ చేయవచ్చు. గతేడాది మేం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌లను కూడా తీసుకొచ్చాం. ఈ ఫీచర్లన్నీ ఇప్పటికీ iMessageలో లేవు.' అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో iMessageలో కనిపించే గ్రీన్ బబుల్, బ్లూ బబుల్ చూపించే ఒక ఫొటో కూడా షేర్ చేశారు. సాధారణంగా ఐమెసేజ్ అనేది రెండు యాపిల్ డివైజ్‌ల మధ్య మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ ఐ-మెసేజ్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు మెసేజ్ చేస్తే.. ఆ మెసేజ్ కాస్త సాధారణ ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తుంది. ఇలా ఎస్ఎంఎస్ రూపంలో వెళ్లే మెసేజ్‌లన్నీ కూడా గ్రీన్ కలర్ బబుల్‌లో కనిపిస్తాయి. ఈ SMSలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండదు. అప్పుడు యూజర్ల ప్రైవసీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే జుకర్‌బర్గ్ ఐమెసేజ్‌తో పూర్తిగా ప్రైవసీ ఉండదని, కానీ తన వాట్సాప్‌లో ఐఫోన్లు లేదా ఆండ్రాయిడ్ ఫోన్లకు మెసేజ్ పంపినా పూర్తి ప్రైవసీ ఉంటుందని ఈ పోస్ట్ ద్వారా సింబాలిక్‌గా చెప్పారు. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలోని పెన్సిల్వేనియా స్టేషన్‌లో మెటా కంపెనీ ఐమెసేజ్ గ్రీన్ బబుల్, బ్లూ బబుల్ చూపించే ఒక యాడ్ కూడా ఉంచింది. ఈ పోస్టర్ ఫొటోనే జుకర్‌బర్గ్ షేర్ చేశారు. యాపిల్ iMessageలో ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు బ్లూ కలర్‌కి బదులుగా గ్రీన్ బబుల్‌లో కనిపిస్తాయి. వాట్సాప్‌లో మాత్రం అన్నీ కూడా ఒకే కలర్‌లో ప్రైవేట్ బబుల్‌గా ఉంటాయని ఈ ప్రకటన సారాంశం. యునైటెడ్ స్టేట్స్‌లో వాట్సాప్ కంటే ఐమెసేజ్ వాడేవారి సంఖ్య ఎక్కువ. వారందరినీ తమ యాప్‌కు మళ్లించేందుకు మెటా సీఈఓ మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను రీస్టార్ట్ చేశారు. మరి ఈ ప్రచారంతోనైనా యూఎస్‌లో వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరుగుతుందో లేదో చూడాలి. ఇక వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఎంత ముఖ్యమో, వాట్సాప్‌లో యూజర్లు ఎందుకు జాయిన్ కావాలో ఒక ట్వీట్ థ్రెడ్ ద్వారా వివరించారు. యూఎస్‌లోని ప్రజలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రాముఖ్యత గురించి చెప్పడానికి మేం జనవరిలో ప్రారంభించిన మార్కెటింగ్ ప్రచారాన్ని ఇప్పుడు మరింత పెంచుతున్నామని పేర్కొన్నారు.

భారీగా ధర పెంచిన నథింగ్ ఇయర్ (1) !


నథింగ్ ఇయర్ (1) ఇయర్ బడ్స్ పరికరం ధరను అకస్మాత్తుగా 50% పెంచినట్లు ప్రకటించారు. రూ. 5999 గా ఉన్న ఇవి ధర పెంపు తర్వాత రూ. 6999.కి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 26 నుండి ఈ ధర అమలులోకి వస్తుంది. ఈ ఇయర్‌ఫోన్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు అనేక మార్గాల్లో మద్దతు ఇస్తుంది. ఇది Android మరియు iOS పరికరాలలో యాప్ నుండి నియంత్రించబడుతుంది. ఈ పరికరం IPX4 చెమట మరియు స్ప్లాష్ నిరోధకత కలిగి ఉంటుంది. మరియు ఇన్-ఇయర్ డిటెక్షన్‌తో కూడా వస్తుంది.  వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు వంపు అంచులతో ఫారమ్ ఫ్యాక్టర్‌లో పారదర్శకంగా ఉంటాయి. 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 1,080 x 2,400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. డిస్ప్లే 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 1,200 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను కూడా కలిగి ఉంది. ఈ డిస్ప్లే HDR10+ సపోర్ట్, 402 ppi షాపింగ్ మోడ్ పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కూడా కలిగి ఉంది. హాప్టిక్ టచ్ మోటార్లు కూడా ఉన్నాయి.

4కే క్వాలిటీ వీడియోలు అందరికీ యాక్సెస్ !


యూట్యూబ్ ఆదాయం పెంచుకోవడం కోసం 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్‌ను కేవలం యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేనివారికి 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ లభించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా యూట్యూబ్ ఈ ట్రయల్‌ను నిర్వహించింది. దీంతో అనేక మంది యూజర్లు షాక్ అయ్యారు. 4కే క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వచ్చాయని యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫామ్‌లో వివరించారు. రెండువారాల పాటు ఈ ట్రయల్ నిర్వహించిన యూట్యూబ్, ఈ ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించింది. ఇక అందరికీ 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ లభిస్తుందని ప్రకటించింది. ఎలాంటి పరిమితులు లేవని, మెంబర్‌షిప్స్ కూడా అవసరం లేదని యూట్యూబ్ ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. అయితే యూట్యూబ్ ఈ ప్రయోగం ఎందుకు చేసింది, ఈ ప్రయోగం ద్వారా వచ్చిన ఫలితాలేంటీ, యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది, ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికే ఇలా చేసిందా అన్నది తెలియదు. అయితే యూట్యూబ్ ఈ ప్రయోగాన్ని ఆపేసి, యూజర్లు అందరికీ 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ ఇవ్వడం పెద్ద ఊరటే. స్మార్ట్‌ఫోన్ల కన్నా 4కే స్మార్ట్ టీవీల్లో ఎక్కువగా 4కే క్వాలిటీ వీడియోలు చూసేవారు ఎక్కువ. గూగుల్ అకౌంట్ ఉన్నవారు యూట్యూబ్‌లో 4కే క్వాలిటీ వీడియోలు చూడొచ్చు. వీడియో ప్లే చేసినప్పుడు యాడ్స్ రావడం మామూలే. కొంతకాలం 4కే క్వాలిటీ వీడియోల యాక్సెస్ నిలిచిపోవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. 

త్వరలో శాంసంగ్ నుంచి గెలాక్సీ S23 ?


శాంసంగ్ గెలాక్సీ S సిరీస్‌లో మరో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. Galaxy S22 3,700mAh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. చూడటానికి ఈ బ్యాటరీ చాలా చిన్నదిగా ఉంటుంది. బ్యాటరీ భారీ వినియోగంతో తొందరగా పూర్తి అయిపోతుంది. యూజర్లను చాలా నిరాశను కలిగించవచ్చు. లేటెస్ట్ మోడల్‌తో చిన్నపాటి మార్పులు చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy S23 3,900mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు 3,700mAh బ్యాటరీ కన్నా కొంచెం అప్‌గ్రేడ్ అయింది. కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని తేలింది. గత ఏడాదిలో మోడల్‌కు సమానంగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S23 ఛార్జర్‌తో వస్తుందని చెప్పలేం. శాంసంగ్ చాలా డివైజ్‌లకు ఛార్జర్ అందించడం ఆపివేసింది. శాంసంగ్ వినియోగదారులు ఛార్జర్‌పై అదనపు ఖర్చు చేయవలసి వస్తుంది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని అందిస్తుంది. ఈ డివైజ్ కొన్ని ప్రాంతాలలో కంపెనీ ఇంటర్నల్ Exynos 2300 SoCని ప్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. Full HD+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.1-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. సాధారణ పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. కెమెరా డిపార్ట్‌మెంట్ పెద్దగా అప్‌గ్రేడ్ చేసినట్టు లీక్‌లు సూచిస్తున్నాయి. OISకి సపోర్టుతో 50-MP ప్రైమరీ సెన్సార్‌తో సహా అదే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. 12-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 10-MP టెలిఫోటో సెన్సార్ ద్వారా సపోర్టు అందిస్తుంది. సెల్ఫీల కోసం.. ముందు భాగంలో అదే 10-MP కెమెరాను చూడవచ్చు. ధరలపై ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. కానీ, ఈ డివైజ్ ప్రీమియం ధరలకు అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. Samsung Galaxy S22 సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.72,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.

తక్కువ ధరలో రియల్ మీ స్మార్ట్ టీవీ !


ఫ్లిప్ కార్ట్ దీవాళీ సేల్ ను మరో సారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు సేల్ నిర్వహించిన ఫ్లిప్ కార్ట్, మూడు రోజుల వ్యవధిలోనే మరో సారి దీపావళి సేల్ ను ప్రారంభించింది.  అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ సేల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది.  ఈ సేల్ లో కనీవినీ ఎరగని ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లపై 50 శాతానికి పైగా డిస్కౌంట్లు అందిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు సైతం వర్తించనున్నాయి. తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దీపావళి సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.  రూ.10 వేల ధరలోనే బెస్ట్ స్మార్ట్ టీవీని ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. realme 80 cm HD Ready LED Smart Android TV పై ఈ సేల్ లో మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీ అసలు ధర రూ.17,999 కాగా, ఈ దీనిపై 38 శాతం డిస్కౌంట్ దీపావళి సేల్ లో అందుబాటులో ఉంది.  రూ.7 వేల తగ్గింపుతో రూ.10,999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును అందుకోవచ్చు. టీవీపై ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఉంది. మీ పాత టీవీని ఎక్సేంజ్ చేస్తే రూ.9 వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు. పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. ఈ టీవీ Netflix, Prime Video, Disney+Hotstar, Youtube తదితర యాప్ లను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ స్మార్ట్ టీవీ పని చేస్తుంది. 

Tuesday, October 18, 2022

టెస్లా నుంచి 'పై' స్మార్ట్‌ ఫోన్‌ ?


బార్ట్న్‌ హెయిర్‌ పేరుతో పెర్‌ఫ్యూమ్‌ రిలీజ్‌ చేసిన టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌, ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ రంగంలోకీ అడుగు పెడుతున్నారు. టెస్లా 'పై' 5G ఫోన్‌ని పరిచయం చేయబోతున్నారు. ఎలాన్ మస్క్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందట!. ఆపిల్ టెక్నాలజీ ప్రొడక్ట్స్‌ కోసం ఇన్నోవేటివ్‌ డిజైన్‌లను అందించిన నిపుణుడు 'ఆంటోనియో డి రోసా' టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్‌ చేశారు. టెస్లా, స్టార్‌లింక్ స్పేస్‌ఎక్స్‌కు ‍ గుర్తు చేసేలా ఫోన్ ఉంటుందని డిజైనర్ చెబుతున్నారు. కొంతమంది టెక్నాలజీ బిజినెస్‌ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం... ఐఫోన్ 12 తరహాలో టెస్లా మోడల్ పై ఫోన్‌ ఉండవచ్చు. ఉదాహరణకు.. గుండ్రటి మూలలు, చతురస్రాకార ఫ్రేమ్‌లో నాలుగు కెమెరాలు, వెండి రంగులో ఉండవచ్చు. టెస్లా కార్ల లాగే టెస్లా ఫోన్ కూడా అత్యాధునిక సాంకేతికతతో రాబోతోందట. 6.5 అంగుళాల స్క్రీన్, AMOLED డిస్‌ప్లే, 16 GB లేదా అంతకంటే ఎక్కువ RAM, 1-2 TB నిల్వ సామర్థ్యం సహా ప్రతి స్టాండర్డ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌తో ఇవి పని చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాటిలైట్ నుంచి నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఇదే 'పై' ఫోన్‌ బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది. ఒకవేళ మీరు అంగారక గ్రహంపైకి వెళ్తే, ఈ ఫోన్‌లోని స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ద్వారా, భూమిపై ఉన్న వ్యక్తులకు ఫోన్ కాల్స్ కూడా చేయవచ్చట. మార్స్‌ మీద ఒక మానవ కాలనీ నిర్మించుకుంటే, వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడానికీ ఈ ఫోన్‌లోని కనెక్టింగ్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుందట. మీ మెదడుతో అనుసంధానించగలగడం టెస్లా పై ఫోన్‌లో ఉన్న మరో అద్భుత లక్షణం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో న్యూరాలింక్‌ని  చేరుస్తున్నారు. భారీ విక్రయాలను తీసుకొచ్చే మరో గొప్ప అంశం ఇది. Samsung, Apple ఫోన్లలో ఈ టెక్నాలజీ లేదు. ఆపిల్‌ వాచ్, iPad, MacBook సహా Apple అన్ని గాడ్జెట్‌లను iPhoneతో అనుసంధానించవచ్చు. టెస్లా పై ఫోన్‌కు కూడా ఇలాంటి సామర్థ్యం ఉందట. టెస్లా ప్రొడక్ట్స్‌ అన్నింటినీ పై ఫోన్‌కు అనుసంధానించవచ్చు. టెస్లా ఎలక్ట్రిక్ కార్‌ను స్మార్ట్‌ఫోన్ నుంచి ఆపరేట్ (లాక్‌, అన్‌లాక్‌ సహా కొన్ని పనులు) చేయడానికి టెస్లా పై ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుమతిస్తుంది. టెస్లా పై ఫోన్‌లో మరో అత్యాధునిక ఫీచర్‌ ఇది. పై ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎండ ఉన్న ప్రాంతానికి వెళితే చాలు. కరెంటు కోసం ఎదురు చూడడం, ఛార్జింగ్ పోర్ట్‌ల వెతుక్కోవడం చేయాల్సిన అవసరమే ఉండదు. వినియోగదారులు పై స్మార్ట్‌ఫోన్‌ ద్వారా క్రిప్టో కరెన్సీ 'మార్స్‌కాయిన్‌'ను  మైనింగ్ చేయవచ్చట. ఫలితంగా, తమ ఫోన్లలోనే వర్చువల్ కరెన్సీని పొందుతారట !.


లావా యువ ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్‌లో లావా యువ ప్రో స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది. మెటాలిక్ డిజైన్‌తో లుక్ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయంగా ఉంది. వెనుక మూడు కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ మన ముందుకు వస్తోంది. 5000mAh బ్యాటరీ ఈ ఫోనులో ఉంది. 6.51 ఇంచ్ ల HD+ IPS LCD డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు వస్తుంది. 269ppi పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. డిస్ప్లే కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ పై ఈ స్మార్ట్ ఫోన్‌ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ లావా బడ్జెట్ ఫోన్ వస్తోంది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఉన్న సింగిల్ వేరియంట్‌లో అందుబాటులోకి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. దీని ధర రూ.7,799 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లావా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

మైక్రోసాఫ్ట్‌లో వెయ్యి మంది ఉద్యోగులపై వేటు !


మైక్రోసాఫ్ట్‌ మరోసారి మాస్‌ లేఆఫ్స్‌కు ప్రకటించింది. తాజా లే ఆఫ్స్‌లో భాగంగా వేయి మంది ఉద్యోగులపై వేటు వేసిందని ఓ రిపోర్ట్‌ వెల్లడించింది. తమను ఉద్యోగాల నుంచి తొలగించారని పలువురు ఉద్యోగులు ట్విట్టర్‌ సహా పలు సోషల్‌ మీడియా వేదికల ద్వారా వాపోయారు. తాను మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ కోల్పోయానని సీనియర్‌ ఉద్యోగిని, ప్రోడక్ట్‌ సూపర్‌వైజర్‌ కేసీ లెమ్సన్‌ ట్వీట్‌ చేశారు. లెమ్సన్‌ సహా మైక్రోసాఫ్ట్‌లో పలువురు సీనియర్‌ ఉద్యోగులు లే ఆఫ్స్‌కు బలయ్యారు. తాజా లేఆఫ్స్‌పై మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి స్పందిస్తూ ఇతర కంపెనీల తరహాలోనే తాము సంస్ధ ప్రాధామ్యాలకు అనుగుణంగా సంస్ధాగత మార్పులు చేపడుతున్నామని చెప్పారు. ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలకు ఈ ఏడాది జులై లోనే మైక్రోసాఫ్ట్‌ పదును పెట్టింది.  మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు టెక్‌ దిగ్గజాలు లేఆఫ్స్‌ బాట పట్టాయి. మార్క్‌ జుకర్‌బర్గ్‌ సారధ్యంలోని మెటా పెద్దసంఖ్యలో ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమైంది. మెటా దాదాపు 12,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. సోషల్‌ మీడియా చర్చా వేదికలపై మెటా ఉద్యోగి ఈ విషయం వెల్లడించారు.

పోకో నుంచి మరో 5జీ స్మార్ట్ ఫోన్ ?


చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల తయారీ సంస్థ పోకో, ఎప్పటికప్పుడూ సరికొత్త మోడల్ మొబైల్స్‌ను మార్కెట్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మరో సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అది Poco F5 5G మొబైల్ అని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇటీవలి ఓ నివేదికలో వెల్లడయ్యాయి. తాజాగా, EEC సర్టిఫికేషన్ సైట్‌లో ఒక టిప్‌స్టర్ ద్వారా మోడల్ నంబర్ 23013PC75Gతో Poco స్మార్ట్‌ఫోన్ కనిపించింది. పలు రూమర్ల ప్రకారం చూస్తే.. ఈ హ్యాండ్‌సెట్ Poco F5 5G గా తెలుస్తోంది. లిస్టింగ్‌లో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన ఏ సమాచారం లేదు. అయితే, ఈ సర్టిఫికేషన్ ప్రకారం చూస్తే.. ఈ మొబైల్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్లలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. EEC సర్టిఫికేషన్ సైట్‌లో ప్రత్యక్షమైందని చెబుతున్న Poco F5 5G జాబితాను టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విటర్లో గుర్తించారు. జాబితా చేయబడిన హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ 23013PC75Gని కలిగి ఉంది, ఇది Poco స్మార్ట్‌ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ కావచ్చు అని ఆయన పేర్కొ్నారు. దురదృష్టవశాత్తూ, EEC లిస్టింగ్‌లో ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన ఇతర వివరాలు ఏవీ పేర్కొనబడలేదు.

వాట్సాప్‌ మెసేజ్‌ఎడిట్ ఫీచర్ ?


వాట్సాప్ త్వరలో మెసేజ్ ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ కు సంబంధించి బీటా వెర్షన్ లో టెస్ట్ రన్ నడుస్తోంది. త్వరలోనే ఈ పరీక్షలు పూర్తి చేసుకుని వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే దాన్ని ఎడిట్ చేసే అవకాశం ప్రస్తుతం లేదు. ఏదైనా మెసేజ్‌ను పొరపాటుగా పంపిస్తే కచ్చితంగా డిలీట్ చేయాలి. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వస్తే మెసేజ్ పంపిన తర్వాత కూడా దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా హడావిడిగా పంపిన మెసేజ్ లలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని ఆ తర్వాత సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ కు సంబంధించిన విషయాలను తాజాగా వెబ్ బీటా ఇన్ఫో వెల్లడించింది. వాస్తవానికి వాట్సాప్ లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ పై చాలా రోజులుగా పరిశోధన జరుగుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో ఓసారి ఈ విషయం గురించి వాట్సాప్ ప్రస్తావించింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. వాట్సాప్ యూజర్స్ కూడా మెసేజ్ ఎడిట్ ఫీచర్ గురించి ఎదురుచూస్తున్నారు. తాజాగా వెబ్ బీటా ఇన్ఫో ఈ విషయానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలిపింది. వాట్సాప్ వర్షెన్ 2.22.20.12లో ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా ప్రస్తావించలేదు. అటు వాట్సాప్ లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? అనే విషయాన్ని కూడా వివరించలేదు. అయితే, తొలుత పంపిన వాట్సాప్ మెసేజ్ ను ఎడిట్ చేస్తే.. ఆ మెసేజ్ పక్కనే ఎడిటెడ్ అని చూపించే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. అంతేకాదు.. మెసేజ్ పంపిన కొద్ది సేపటి వరకే ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నారు. వాట్సాప్ కు భారత్ లో దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

Monday, October 17, 2022

ప్రతి దానికి పాయింట్లు పొందండి !


గూగుల్ ప్లై పాయింట్స్  మరియు ఈ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారులకు పాయింట్స్ అందిస్తుంది. గూగుల్ ఈ రివార్డ్ ప్రోగ్రాం ఇప్పటికే 28 దేశాలలో అందుబాటులో వుంది. ఇప్పుడు ఈ గూగుల్ ప్లే పాయింట్స్ ప్రోగ్రామ్ ను భారతీయ యూజర్లకు కోసం తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు ఉపయోగపడే రివార్డ్ ప్రోగ్రామ్. వచ్చే వారాల్లో ఈ రివార్డ్ సిస్టమ్ను గూగుల్ ఇండియాలో విడుదల చేయడం ప్రారంభిస్తుంది.  గూగుల్ తన యూజర్లకు అందించే రివార్డ్ ప్రోగ్రామ్ Play Points మరియు వినియోగదారులు Google Play ని ఉపయోగించే అనేక మార్గాల్లో పాయింట్లు మరియు రివార్డ్లను సంపాదించడంలో ఇది సహాయపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, APPs, గేమ్స్ మరియు సబ్స్క్రిప్షన్లతో సహా Google Play తో చేసే కొనుగోళ్ల పైన కూడా వినియోగదారులు పాయింట్ లను సంపాదించగలరు. ఈ పాయింట్స్ జత చెయ్యబడిన తరువాత Play Credit గా రీడీమ్ చేయబడతాయి. మీరు వాటిని స్టోర్లో మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. రివార్డ్ ప్రోగ్రామ్లో నాలుగు స్థాయిలు ఉన్నాయి అవి : కాంస్య, వెండి, బంగారం మరియు ప్లాటినం. Google Play Points రివార్డ్ సిస్టమ్ ను ఉపయోగించడం చాలా సులభం మరియు మీరు అనుసరించవలసిన స్టెప్స్ :  ముందుగా, Google Play Store యాప్ని తెరవండి. ఎగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ పై నొక్కండి. ఇక్కడ Google Play Point కోసం అప్షన్ వస్తుంది.  ఈ అప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు సంపాదించిన మొత్తం పాయింట్స్ చూడవచ్చు

తగ్గిన ఒప్పో ఫోన్ల ధరలు !


ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు సరికొత్త ఫీచర్లతో టాప్ మొబైల్ బ్రాండ్లు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పాత మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఒప్పో కంపెనీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసిన కొన్ని మోడళ్ల ధరలను తగ్గించినట్లు ఒప్పో ఇండియా తెలిపింది. ముంబైకి చెందిన మహేశ్ టెలికామ్ రిటైలర్ స్టోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో ఇండియా మూడు మోడళ్ల ధరలను తగ్గించింది. ఇప్పుడు ఒప్పో ఎఫ్ 21 ప్రో, ఒప్పో ఏ 55, ఒప్పో ఏ 77 ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒప్పో ఏ 55 స్మార్ట్‌ఫోన్ 2021లో రూ. 15,490 ప్రారంభ ధరతో మార్కెట్లోకి లాంచ్ కాగా, ఇప్పుడు దీని ధరను కంపెనీ తగ్గించింది. ఒప్పో A55 బడ్జెట్ డివైజ్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.14,499కి లభిస్తుంది. ఫోన్ 6GB RAM మోడల్ మాత్రం రూ. 14,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఏ 77 హ్యాండ్‌సెట్ 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను ఒప్పో ఇండియా తాజాగా తగ్గించింది. ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ.15,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 720x1,612 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ 90 Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC చిప్‌సెట్‌తో పనిచేసే ఈ డివైజ్ ColorOS 12.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీ ఫోన్‌ మరో ప్రత్యేకత. ఒప్పో F21 ప్రో  ఫోన్ 32MP సోనీ సెల్ఫీ కెమెరా ప్రధాన హైలెట్. 15x/30x మాగ్నిఫికేషన్ కోసం F21 ప్రోలో 2MP మైక్రోలెన్స్‌ను కూడా కంపెనీ యాడ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సన్‌సెట్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సన్‌సెట్ ఆరెంజ్ మోడల్ క్లాసిక్ ఫైబర్‌గ్లాస్ లెదర్ డిజైన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC చిప్‌తో ఫోన్ పనిచేస్తుంది. దీని 8 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.22,999గా ఉంది. అంటే ఈమేరకు ధర తగ్గింది.

పురుషులు కంటే మహిళలకు జ్ఙానపక శక్తి ఎక్కువ !


ఒక విషయాన్ని ఆలోచించడంలో మగవారి కంటే ఆడవారు ముందుంటారనేది మనకు తెలిసిందే. పురుషుల్లో కంటే మహిళల మెదడు వేగంగా, చురుకుగా ఉంటుందని నార్వేకు చెందిన పరిశోధకులు తేల్చారు. ఇదే సమయంలో మహిళలు 50 ఏండ్ల క్రితం నాటి మాటల్ని కూడా గుర్తుంచుకోగలరని వెల్లడించారు. మెదడు చురుకుదనం, ఆలోచనావిధానం, జ్ఞాపకశక్తి సామర్ధ్యంపై నార్వేలోని బెర్గిన్‌ యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. వీరు తమ పరిశోధన కోసం పురుషులు, స్త్రీల మానసిక నైపుణ్యాలకు సంబంధించి కొన్నేండ్ల డాటాను సేకరించి విశ్వేషించారు. ఈ మెటా విశ్లేషణలో దాదాపు 3.50 లక్షల మంది డాటాను తీసుకున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన డాటా రీసెర్చ్‌లో మహిళలకు అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. వీరు వెల్లడించిన అధ్యయన పత్రం ప్రకారం.. మేధో నైపుణ్యాల్లో స్త్రీ, పురుషుల మధ్య తేడా లేదు. స్త్రీల జ్ఞాపకశక్తి కూడా పురుషుల కంటే మెరుగ్గా ఉంటుంది. ఒక నిర్దిష్ట అక్షరం లేదా సంఖ్యతో ప్రారంభమయ్యే పేర్లు, పదాలను కనుగొనడం, గుర్తుంచుకోవడంలో మహిళలు ముందు వరుసలో ఉంటారు. మహిళల మెదడులోని కార్టెక్స్, లింబిక్ వ్యవస్థలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల వారి మెదడు పురుషుల కంటే చురుకుగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఇదే సమయంలో ముఖాలను గుర్తుంచుకోవడంలో కూడా మహిళలు మెరుగ్గా ఉంటారని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధన వెల్లడించింది. అంతేకాకుండా వాసనలు గుర్తుపెట్టుకోవడం వంటి ఇంద్రియ జ్ఞాపకాలను మహిళలు మరిచిపోరని వీరి అధ్యయనం పేర్కొన్నది.

వచ్చే ఏడాది ప్రధమార్ధంలో వన్‌ప్లస్‌ 11 విడుదల !


వన్‌ప్లస్‌ 11ను వచ్చే ఏడాది ప్రధమార్ధంలో విడుదల కానున్నది.  వన్‌ప్లస్‌ 11 ప్రొకు బదులుగా వన్‌ప్లస్‌ 11ను కంపెనీ విడుదల చేస్తుందని టెక్‌ నిపుణులు మ్యాక్స్‌ జంబర్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ప్రొ లెవెల్‌ ఫీచర్లతో వన్‌ప్లస్‌ 11ను 2023 ప్రధమార్ధంలో వన్‌ప్లస్‌ ముందుకు తీసుకురానుందని ఈ రిపోర్ట్‌ తెలిపింది. మెరుగైన, పవర్‌ఫుల్‌ స్పెసిఫికేషన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని తెలిపింది. వన్‌ప్లస్‌ 11 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌2 చిప్‌సెట్‌ను కలిగిఉంటుందని, ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 ఇంచ్‌ క్యూహెచ్‌డీ+ అమోల్డ్‌ డిస్‌ప్లేతో ఫ్రంట్‌ కెమెరా కోసం పంచ్‌ హోల్‌ కటౌట్‌తో ముందుకొస్తుందని చెబుతున్నారు. వన్‌ప్లస్‌ లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 అవుటాఫ్‌ ది బాక్స్‌ ఓఎస్‌పై రన్‌ అవుతుంది. 100డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. వన్‌ప్లస్‌ 11 ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సిస్టంతో కస్టమర్ల ముందుకు రానుంది. వన్‌ప్లస్‌ 11 5జీ టెక్నాలజీతో హైఎండ్‌ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అత్యంత శక్తివంతమైన కెమెరా !


ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కెమెరాను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 3200 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉన్న ఈ కెమెరా దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోని బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు. ఐదున్నర అడుగుల లెన్స్ అంటే ఓ చిన్న కారు సైజులో ఉంటుంది. ముందు భాగంలో అద్దం 27 అడుగులు ఉంటుంది. 189 సెన్సర్లతో సుమారు 2800 కిలోల బరువు ఉంటుంది. ఈ కెమెరాని కేవలం ఖగోళ పరిశోధనలకే వాడతామని  శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఆకాశంలో రాత్రి వేళల్లో జరిగే అద్భుతాలు, రహస్యాలను కనిపెట్టేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కెమెరాను వచ్చే ఏడాది చిలీలోని ఓ పర్వతంపై కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు పూర్తి కావొచ్చిన ఈ కెమెరా ఫోటోలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో ఫోటోలు తీసే సత్తా ఈ భారీ డిజిటల్ కెమెరాకుందని వారు వెల్లడించారు.

Popular Posts