Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, May 31, 2023

ఆఫీసుకి రాకుంటే కఠిన చర్యలు తప్పవు !


వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధనలను ఉద్యోగులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్  హెచ్చరించింది. వారానికి మూడు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని టీసీఎస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు నెలకు కనీసం 12 రోజుల పాటు కార్యాలయాలకు రావాలని కంపెనీ కోరింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయాలకు హాజరు కాని ఉద్యోగులపై కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్ జారీ చేసిన మెమోలో హెచ్చరించింది. కేటాయించిన రోస్టర్‌కు అనుగుణంగా తక్షణమే ఉద్యోగులందరూ వారి కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని లేటెస్ట్ మెమోలో టీసీఎస్ స్పష్టం చేసింది. రెండేండ్ల కిందట కంపెనీలో చేరిన ఉద్యోగులు పని ప్రదేశం గురించి తెలుసుకుని, మెరుగైన ఫలితాలు అందించేందుకు వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీ ఉపకరిస్తుందని పేర్కొంది. కంపెనీలో చేరిన నూతన ఉద్యోగులు టీసీఎస్ వాతావరణాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సహోద్యోగులతో కలిసి పనిచేస్తూ ఎదిగే అవకాశం అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కంపెనీ ఉద్యోగుల్లో పలువురు కార్యాలయానికి తిరిగి రావడంతో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. నెలలో సగటున వారానికి కనీసం మూడు రోజులు అసోసియేట్‌లందరూ ఆఫీసు నుండి పని చేయడమే మా లక్ష్యమని చెప్పారు. వర్క్ ఫ్రం హోం పాలసీకి ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు.

ఏఐ సమాజానికి పెను ముప్పుగా పరిణమిస్తుంది ?


చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌కు విశేష ఆదరణ లభిస్తున్న క్రమంలో ఏఐపై టెక్ ప్రపంచంలో విస్తృత చర్చ సాగుతోంది. ఏఐతో కొలువుల కోత తప్పదనే ఆందోళన నెలకొన్న క్రమంలో ఏఐ విపరిమాణాలపైనా గుబులు రేపుతోంది. ఏఐతో మానవాళికి ముప్పు తప్పదని టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తుండగా తాజాగా చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ అల్ట్‌మన్ సైతం ఏఐపై బాంబు పేల్చారు. ఓపెన్ఏఐ వ్యవస్ధాపకులు అల్ట్‌మన్‌, మైక్రోసాఫ్ట్ సీటీవో కెవిన్ స్కాట్ వంటి టెకీలు ఏఐ సమాజానికి పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. మహమ్మారులు, అణు యుద్ధాలు మానవాళికి ఎలాంటి విధ్వంసాన్ని మిగుల్చుతాయో ఏఐ కూడా అలాంటి ముప్పేనని స్పష్టం చేశారు. ఏఐని నియంత్రించాలని, ఇది మానవాళి ముందుంచే ముప్పులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని కోరుతూ సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ విడుదల చేసిన ప్రకటనపై పెద్దసంఖ్యలో ఎగ్జిక్యూటివ్‌లు, విద్యావేత్తలు సంతకాలు చేశారు. జాబ్ మార్కెట్లకు ఏఐ పెను విఘాతం కలిగిస్తుందని, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని ఈ ప్రకటన ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఏఐ మానవాళికి సవాల్‌గా మారుతుందనే ఆందోళనతో ప్రముఖ టెక్ నిపుణులు జెఫ్రీ హింటన్ ఇటీవల గూగుల్ నుంచి బయటకు వచ్చారు.

వాట్సాప్ బిజినెస్ యూజర్లకు స్టేటస్‌ ఆర్కైవ్ ఫీచర్‌ !


వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం స్టేటస్ ఆర్కైవ్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు దృవీకరిస్తున్నాయి. పెరుగుతున్నటెక్నాలజీకి అనుగుణంగా వ్యాపారులు తమ కస్టమర్లకు అందుబాటులో ఉండడానికి వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌లను తీసుకున్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు కస్టమర్లకు తాము అందించే అదిరిపోయే ఆఫర్ల వివరాలను తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టేటస్‌ల ద్వారా ఆఫర్ల వివరాలను పేర్కొంటున్నారు. అయితే ఈ స్టేటస్‌లు కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఏరోజుకారోజు స్టేటస్‌లను అప్‌డేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి గతంలో పెట్టిన ఆఫర్లనే మళ్లీ పెడుతున్నప్పుడు మళ్లీ కొత్తగా స్టేటస్ పెట్టాల్సి వస్తుంది. అయితే వాట్సాప్ తాజాగా ఇచ్చిన అప్‌డేట్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టినట్లువ తెలుస్తుంది. వాట్సాప్ వ్యాపార వినియోగదారుల కోసం స్టేటస్ ఆర్కైవ్ చేసే సామర్థ్యాన్ని జోడించడానికి ఆ కంపెనీ డెవలపర్‌లు ఇప్పుడు పని చేస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ బిజినెస్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.11.18తో వినియోగదారులు పోస్ట్ చేసిన 24 గంటల తర్వాత వారి స్టేటస్ నవీకరణలను ఆర్కైవ్ చేస్తారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు యాప్ ‘స్టేటస్’ ట్యాబ్‌లో ఓ ప్రత్యక బ్యానర్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనెబుల్ చేశాక 30 రోజుల వరకు వారి పరికరాలలో అప్‌డేట్‌లు ఉంచుతారు. అలాగే ఆర్కైవ్ చేసిన అప్‌డేట్‌లను వినియోగదారు మాత్రమే చూడగలరు. బిజినెస్ ఓనర్‌లు తమ ఆర్కైవ్‌ల నుంచి స్టేటస్‌ని కస్టమర్‌లతో షేర్ చేయగలరు. కాబట్టి ఇది వారికి నిజంగా ఉపయోగకరమైన ఫీచర్. వినియోగదారులు ఈ సమయంలో ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ కోసం ప్రకటనలను కూడా సృష్టించవచ్చు. ప్రస్తుతం, ఆర్కైవ్‌కు స్టేటస్ అప్‌డేట్‌లను జోడించే సామర్థ్యం వ్యాపార వినియోగదారులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే వాట్సాప్ భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారులకు అందజేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తున్న మహీంద్రా థార్ ?


మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో కార్ లేటెస్ట్ వెర్షన్ లో రాబోతుంది. ఈ ఆటోమెుబైల్ నుంచి 5 డోర్ల థార్ ఎస్ యూవీ అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో మరికొద్ది నెలల్లో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. కార్ల ప్రియులకు మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో కార్ లెటేస్ట్ వెర్షన్ లో రాబోతుంది. ఈ ఆటోమెుబైల్ నుంచి 5 డోర్ల థార్ ఎస్ యూవీ అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో మరికొద్ది రోజుల్లో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. మహీంద్రా Q4, FY23 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ.. 5-డోర్ల థార్ 2023లో కాకుండా 2024లో లాంచ్ అవుతుందని వెల్లడించారు. ఇప్పుడు 2024 మహీంద్రా థార్ 5-డోర్ SUV మోడల్‌కు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఆ ఫొటోలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో మహీంద్రా థార్ SUV కారు కనిపించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించే 3-డోర్ల థార్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లేదు. అంతేకాకుండా, 2024 మహీంద్రా థార్ 5-డోర్ కూడా 3-డోర్ థార్ మాదిరిగా కాకుండా, కన్వర్టిబుల్ టాప్, హార్డ్ టాప్ ఆప్షన్‌లతో హార్డ్ టాప్‌ని కలిగి ఉండొచ్చు. స్టాండర్డ్‌గా ఈ ఏడాది ప్రారంభంలో, మహీంద్రా 3-డోర్ థార్ RWD వేరియంట్‌ను లాంచ్ చేసింది. SUV మోడల్ మొదట అక్టోబర్ 2020లో 4WD ప్రామాణికంగా ప్రవేశపెట్టారు. 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ మిల్లులు 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లను కలిగి ఉన్నాయి. 3-డోర్ థార్ ధర రూ. 10,54,500 నుంచి రూ. 16,77,501 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా.. 2024 మహీంద్రా థార్ 5-డోర్ ప్రీమియంతో రానుంది. ఈ SUV కారు ధర రూ. 2 లక్షల వరకు ఉండవచ్చు.

టీవీ స్క్రీన్ నల్లగా ఎందుకుంటుంది ?


టీవీ స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు అది సాధారణంగా నలుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే డిస్‌ప్లే బ్యాక్‌లైట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. కొన్ని టీవీల స్క్రీన్‌లు ఆఫ్ చేసినప్పుడు అవి నీలం (బ్లూ) లేదా ఎరుపు (రెడ్) రంగులు కనిపిస్తాయి. దీనికి కారణం టీవీలోని సెట్టింగ్స్. టీవీ స్క్రీన్ నల్లగా కాకుండా మరో కలర్లోకి మార్చాలంటే మనం మార్చుకోవచ్చు. సెట్టింగ్ లోకి వెళ్లి కలర్ ను మార్చుకోవచ్చు. అయితే కొన్ని టీవీల్లోని సెటింగ్స్ లో కలర్ మార్చుకునే అవకాశం ఉండదు. ఆ సమయంలో యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. టీవీ స్క్రీన్ నల్లగా ఉండటానికి కారణం ఏంటనే ప్రశ్నకు కొందరు వినియోగదారులు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. టీవీ ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ అయిపోతుందని, ఆ సమయంలో పిక్సెల్ నుంచి కాంతి విడుదల చేసే CRT,OLED, ప్లాస్మా స్క్రీన్ లు పూర్తిగా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయని చెబుతున్నారు. అందుకే అవి నల్లగా మారిపోతాయంటున్నారు. సాధారణంగా టీవీ స్క్రీన్ లపై ఉండే అద్దం నల్లగా ఉండటం వల్ల టీవీ ఆఫ్ అయిపోయినప్పుడు స్క్రీన్ కూడా నల్లగా మారుతుందంటున్నారు.

Tuesday, May 30, 2023

క్రోమా టీవీల పై ఆఫర్ !


టాటా క్రోమా ఈరోజు తన సొంత బ్రాండ్ టీవీ ల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. క్రోమా ఈరోజు సొంత బ్రాండ్ టీవీల పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. క్రోమా టీవీ 32 ఇంచ్ సైజులో వచ్చే HD ready టీవీ. ఈ టీవీ 2 HDMI పోర్ట్ లు 2 USB పోర్ట్ లు మరియు ఇన్ బిల్ట్ సరౌండ్ సౌండ్ తో వస్తుంది. ఈ టీవీ ఈరోజు 63% డిస్కౌంట్ తో రూ. 7,290 అఫర్ ధరతో లభిస్తోంది. 8 వేల ఉప బడ్జెట్ ధరలో 32 ఇంచ్ టీవీ కోరుకునే వారు ఈ అఫర్ ను పరిశీలించవచ్చు. 39 ఇంచ్ సైజులో వచ్చే HD ready టీవీ. ఈ క్రోమా టీవీ కూడా 2 HDMI మరియు 2 USB పోర్ట్ లతో వస్తుంది. ఇది A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు ఈరోజు ఈ టీవీ 53% డిస్కౌంట్ తో రూ. 13,990 అఫర్ ధరతో లభిస్తోంది. తక్కువ ధరలో 39 ఇంచ్ టీవీ కోరుకునే వారు ఈ క్రోమా అఫర్ ను పరిశీలించవచ్చు. 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ఇన్ బిల్ట్ Wi Fi తో వస్తుంది. ఈ క్రోమా టీవీ కూడా 2 HDMI మరియు 2 USB పోర్ట్ లతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OS పైన పనిచేస్తుంది మరియు ఈ టీవీ క్రోమా ఆన్లైన్ స్టోర్ నుండి ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ. 15,990 అఫర్ ధరతో లభిస్తోంది. 15 వేల బడ్జెట్ ధరలో 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈ క్రోమాను తీసుకోవచ్చు. 

వంద వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వన్ ప్లస్ ఏస్ 2 ప్రో !


ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రానున్నది. ఏసర్ 2 ప్రో ఫోన్.. త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రానున్నది. 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. గత వారం చైనా మార్కెట్లోకి ఎంటరైన ఒప్పో రెనో 10 ప్రో + 5జీ డిస్ ప్లే, స్పెషికేషన్లే వన్ ప్లస్ ఏస్ 2 ప్రో ఫోన్‌లో కూడా ఉండొచ్చునని భావిస్తున్నారు. వన్ ప్లస్ ఏస్ 2 ప్రో ఫోన్ 6.74 – అంగుళాల డిస్ ప్లే విత్ కర్వ్డ్ ఎడ్జెస్‌తో వస్తుంది. 1.5కే రిజొల్యూసన్, 1440 హెర్ట్జ్ ప్లస్ విడ్త్ మాడ్యులేషన్ (పీడబ్ల్యూఎం) ప్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. వన్ ప్లస్ ఏస్ ప్రో ఫోన్.. భారత్ మార్కెట్లో వన్ ప్లస్ 10టీ పేరుతో ఎంటరైంది. అలాగే వన్ ప్లస్ ఏస్ 2 ప్రో సైతం వన్ ప్లస్ 11టీ పేరుతో ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు. భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి మాత్రం వెల్లడి కాలేదు. 16 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుందని భావసి్తున్నారు. ఆండ్రాయిడ్ 13- బేస్డ్ కలర్ ఆపరేటింగ్ సిస్టమ్ 13 పై పని చేస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 16-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.

2030కల్లా చంద్రుడి మీదకు చైనా వ్యోమగాములు


అంతరిక్ష పరిశోధనలో పశ్చిమదేశాలతో పోటీపడుతున్న చైనా మరో ముందడుగు వేస్తోంది. వచ్చే ఏడేళ్లలో చంద్రుడి మీదకు మానవసహిత ప్రయోగాలు చేపడతామని చైనా మ్యాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ డెప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ జిక్వియాంగ్‌ ప్రకటించారు. భూమి నుంచి చంద్రుడి మీదకు వెళ్లిరావడం, స్వల్పకాలం చంద్రుడిపై ల్యాండింగ్, మానవసహిత రోబో పరిశోధనలు, ల్యాండింగ్, కలియతిరగడం, శాంపిళ్ల సేకరణ, పరిశోధన, తిరుగుప్రయాణం ఇలా పలు కీలక విభాగాల్లో పట్టుసాధించేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. చందమామ దక్షిణ ధృవం వైపు గడ్డకట్టిన నీటి నిల్వల అన్వేషణ కోసం 2025కల్లా మరోమారు వ్యోమగాములను పంపాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించిన నేపథ్యంలో చైనా చంద్రుడిపై శోధనకు సిద్ధమైందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

జూన్ 8న లెక్సస్ GX లగ్జరీ ఫుల్ సైజ్ SUV కారు విడుదల


జపనీస్ లగ్జరీ ఆటోమేకర్ లెక్సస్ జీఎక్స్ ఎస్ యూవిని లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలో ఫుల్-సైజు ఎస్ యూవి థర్డ్ జనరేషన్ గ్రాడ్యుయేట్ అవుతోంది. జీఎక్స్ అనేది లెక్సస్ లగ్జరీ ఆఫ్-రోడ్ సామర్థ్యంతో వస్తుంది. సరికొత్త జీఎక్స్ ఎస్ యూవి జూన్ 8, 2023న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుందని లెక్సస్ వెల్లడించింది. కొత్త TNGA-F ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించనుంది. ఈ కొత్త GX లెక్సస్‌లోని ఫుల్ లెవల్ LX SUV మోడల్ అని చెప్పవచ్చు. ప్రపంచ లైనప్‌లో 2009లో తొలిసారిగా లాంచ్ అయిన ప్రస్తుత-జనరేషన్ SUVతో కొత్త మోడల్ కూడా చాలా కాలంగా వస్తోంది. కొత్త 2023 లెక్సస్ GX ప్లాట్‌ఫారమ్‌, టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో నుంచి మెజారిటీ పార్టులను షేర్ చేస్తుంది. కొత్త జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఇంకా వెల్లడి కాలేదు. SUV అనేక ఆఫ్-రోడ్ స్పెక్ మెకానికల్ పార్ట్స్, సాఫ్ట్‌వేర్‌లతో పాటు బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. కొత్త GX లెక్సస్ టీజర్ ఫొటోలు ఓల్డ్ జనరేషన్ లెక్సస్ GX, ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వాడుకలో మొత్తం లాంగ్వేజీని అనుసరించి బాక్సీ, నిటారుగా డిజైన్‌ను అందుతాయి. వాస్తవానికి, లేటెస్ట్-జెన్ ఆధునిక మార్పులతో లేటెస్ట్-జెన్ LX నుంచి ప్రేరణ పొందిన రూపాన్ని కలిగి ఉంటాయి. ముందు భాగంలో పెద్ద స్పిండిల్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. హెడ్‌ల్యాంప్‌లు సాధారణ లెక్సస్ డిజైన్‌ మాదిరిగా ఉంటాయి. జపనీస్ బ్రాండ్‌కు చెందిన మోడల్‌లు పాపులర్ బానెట్ కనెక్ట్ చేసిన LED టెయిల్ ల్యాంప్స్‌తో బాక్సీ స్టాన్స్ కలిగి ఉంటుంది. లెక్సస్ కొత్త లెక్సస్ GX పవర్‌ట్రెయిన్ గురించి వివరాలను వెల్లడించలేదు. SUV 3.3-లీటర్ V6 డీజిల్ మోటారుతో పాటు చిన్న పెట్రోల్-హైబ్రిడ్ ఆప్షన్లతో సహా మల్టీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంటుందని ఆశించవచ్చు. పవర్‌ట్రెయిన్‌లు మార్కెట్ నుంచి మార్కెట్‌కు మారుతూ ఉంటాయి. లెక్సస్ పాత GXని ఉత్తర అమెరికా ఇతర LHD మార్కెట్‌ల కోసం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కారుగా మాత్రమే విక్రయించింది. అయినప్పటికీ, థర్డ్-జనరేషన్ GX జపాన్, ఆస్ట్రేలియాలో విక్రయించే రైట్-హ్యాండ్-డ్రైవ్ వేరియంట్‌గా కూడా అందిస్తుంది. లెక్సస్ ఇండియా లైనప్‌ను విస్తరించడానికి GXని భారత మార్కెట్లోకి తీసుకురావచ్చు. ఇటీవలే కొత్త LC500h, RX SUVని లాంచ్ చేసింది.

వాట్సాప్ లో ఇక పెద్ద ఫైల్ పంపవచ్చు?


వాట్సాప్ ద్వారా విస్తృత సంఖ్యలో ఫొటోలు, వీడియోలు షేర్ అవుతాయి. అవి పెద్ద సైజ్ లో ఉంటే వినియోగదారుల ఫోన్ స్టోరేజ్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అందుకే వాట్సాప్ ఇంతకాలం పెద్ద ఫైళ్లను అనుమతించలేదు. అయితే వినియోగదారుల అభ్యర్థనల మేరకు వాట్సాప్ ఇప్పుడు ఫైల్ సైజ్ లిమిట్ ని సవరించింది. ఇప్పుడు 2జీబీ వరకూ ఉండే ఫైల్ ఏదైనా వాట్సాప్ నుంచి పంపించుకోవచ్చు. అది ఆండ్రాయిడ్, ఐఓఎస్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ దేనిలో అయినా ఇదే సైజ్ లో పంపుకోవచ్చు. మరి ఆండ్రాయిడ్ లో ఎలా పంపించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. చాట్ స్క్రీన్ ని ఓపెన్ చేసి మీరు ఫైల్ పంపాలనుకొంటున్న కాంటాక్ట్ లేదా గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి..అటాచ్ మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసి, టెక్ట్స్ బాక్స్ లో డ్యాక్యుమెంట్ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఫైల్ ని 2 జీబీ వరకు సైజ్లో ఎంపిక చేసుకోవచ్చు. ఫైల్ ఎంపిక చేసుకున్న తర్వాత అది కన్ఫర్మేషన్ అడుగుతుంది. అది ఒకే చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. అది అప్ లోడ్ అవడానికి కొద్ది సమయం పడుతుంది. అయితే అది త్వరగా సెండ్ అవడం అన్నది మీ నెట్ వర్క్ స్పీడ్ ని ఇది ఆధారపడి ఉంటుంది.

శాప్‌ ల్యాబ్స్ ఇండియా భూమి పూజ !


శాప్‌ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడింట్‌ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. 'శాప్‌ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం' అని శాప్‌ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడింట్‌ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం శాప్‌ ల్యాబ్స్‌కు అతి పెద్ద ఆర్‌అండ్‌డీ హబ్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్‌అండ్‌డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్‌ కంపెనీ తెలిపింది.

Monday, May 29, 2023

వాట్సాప్‌లో కొత్త బగ్ ?


వాట్సాప్‌లో తాజాగా గుర్తించిన ఒక బగ్, యూజర్ల అసంతృప్తికి కారణమవుతోంది. ఈ సమస్య కారణంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లు క్రాష్ అవుతున్నాయి. నిర్దిష్ట టెక్స్ట్ మెసేజ్ అందుకున్నప్పుడు యాప్ క్రాష్ అవుతోంది. ఆండ్రాయిడ్ యూజర్లు 'wa.me/settings.' అని టైప్ చేసి ఇతర యూజర్లకు పంపినప్పుడు ఈ సమస్య ఎదురవుతోంది. ఈ టెక్స్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారితో పాటు పంపిన వారు కూడా యాప్ క్రాష్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు  ఒక యూజర్ ఒక చాట్‌కు wa.me/settings అని టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే, వారి యాప్ క్రాష్‌ అవుతుంది. ఆ తర్వాత రిసీవర్ ఈ మెసేజ్ ఓపెన్ చేయగానే వారి వాట్సాప్ యాప్ కూడా క్రాష్ అవుతుంది. ఈ మెసేజ్‌ను డిలీట్ చేయడం కూడా సాధ్యం కాట్లేదు. దీనివల్ల పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారు ఇద్దరూ వారి చాట్స్‌ ఓపెన్ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఈ టెక్నికల్ ఇష్యూ లేదా బగ్‌పై వాట్సాప్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా కంపెనీ స్పందించాల్సి ఉంది. అయితే ఈ బగ్‌ను యూజర్లు సొంతంగా ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది.  web.whatsapp.com వెబ్‌సైట్‌కి వెళ్లి వాట్సాప్ వెబ్‌కు లాగిన్ అవ్వాలి. సమస్యకు కారణమైన 'wa.me/settings' అనే టెక్స్ట్ మెసేజ్‌ను చాట్ నుంచి డిలీట్ చేయాలి. తర్వాత డివైజ్‌లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేస్తే.. అది మునుపటి లాగే సాధారణంగా పనిచేస్తుంది.


హైవేలపై ప్రమాదాల నివారణకు ఏఐ లెన్స్‌ కెమెరాలు ?


ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌ హైవే ట్రాఫిక్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (హెచ్‌టీఎంఎస్‌)కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సిస్టమ్‌ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తికావచ్చని సమాచారం. ఈ సిస్టమ్‌తో వాహన వేగాన్ని గుర్తించడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టేందుకు మరింత అవకాశం లభిస్తుంది. ఈ సిస్టమ్‌ పూర్తిగా ఆటోమేటెడ్‌ విధానంలో కొనసాగనుంది. గడచిన కొద్ది నెలల నుంచి రవాణాశాఖ రాష్ట్రంలోని అన్ని ఆర్టీవోలకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని ఆదేశించింది. కాగా హెచ్‌టీఎంఎస్‌లో ముంబై నుంచి పూణె మధ్య 93 స్పాట్‌లలో హైటెక్‌ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. ఈ కెమెరాలు వాహన వేగాన్ని గుర్తించే సామర్థ్యం కలిగివుంటాయి. ఈ కెమెరాలలో హైరిజల్యూషన్‌ ఉన్న కారణంగా వాహనంలోని డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో కూడా ఈ కెమెరా చూపిస్తుంది. ఏఐ ఆధారిత లెన్సులు కలిగిన ఈ కెమెరా.. వాహన నంబరు ప్లేటు ఆధారంగా సమాచారాన్నంతా సేకరించి, వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు పంపిస్తుంది. ఈ హైవేలో ఇలాంటి 370 కెమెరాలను అమరుస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నందున వాటి నియంత్రణకు హెచ్‌టీఎంఎస్‌ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ఇది సమగ్రంగా కార్యకలాలు ప్రారంభించాక రోడ్డు ప్రమాదాలు మరింతగా తగ్గుతాయని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. 

వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఐఫోన్ 16 మోడల్స్ !


ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ భారీ డిస్‌ప్లే సైజ్‌లతో పాటు న్యూ కెమెరాలతో ఆకట్టుకుంటాయని వెల్లడైంది. వచ్చే ఏడాది కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 16 మోడల్స్ గురించి వారానికో లీక్ ప్రచారంలోకి వస్తోంది. ఐఫోన్ 16 ప్రొ , ప్రొ మ్యాక్స్ మోడల్స్ డిస్‌ప్లే ఇంతకుమునుపెన్నడూ లేని రీతిలో భారీ డిస్‌ప్లేను కలిగిఉంటాయని బ్లూమ్‌బర్గ్ మార్క్ గుర్మన్ వెల్లడించారు. ఐఫోన్ 14 ప్రొ వెర్షన్ 6.1 ఇంచ్ స్క్రీన్ కలిగిఉండగా ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ 6.7 ఇంచ్ స్క్రీన్‌ను కలిగిఉంది. ఇక ఐఫోన్ 15 సిరీస్ పాత డిస్‌ప్లే సైజ్‌లను కలిగిఉంటుందని ఐఫోన్ 16 సిరీస్ భారీ డిస్‌ప్లేతో కస్టమర్ల ముందుకొస్తుందని లీక్‌లు వెల్లడించాయి. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ వరుసగా 6.3 ఇంచ్‌, 6.9 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌లతో ఆకట్టుకుంటాయని టెక్ నిపుణులు మింగ్‌-చి కు అంచనా వేశారు. ఐఫోన్ 16 డివైజ్‌లు ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానున్నాయని చెబుతున్నారు. ఇక ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ వెనుకభాగంలో న్యూ సోనీ ఐఎంఎక్స్‌903 కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, డిజిటల్ చాట్‌స్టేషన్‌తో పాటు మరో టిప్‌స్టర్ ష్రింప్‌యాపిల్ ప్రొ వెల్లడించింది. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్ వెనుకభాగంలో న్యూ పెరిస్కోప్ కెమెరా ఉంటుందని చెబుతున్నారు. ఈ పెరిస్కోప్ లెన్స్ 6x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇక ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ కానుండగా, ఐఫోన్ 16 సిరీస్ వచ్చే ఏడాది మార్కెట్‌లో సందడి చేయనుంది.

దేశీయ మార్కెట్లోకి టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లు !


దేశీయ మార్కెట్లోకి టెక్నో కామన్.. భారత్ మార్కెట్లోకి కామన్ 20 సిరీస్ ఫోన్లు.. టెక్నో కామన్20, టెక్నో కామన్ 20 ప్రో 5జీ, టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్లు తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్లు మీడియా టెక్ బేస్డ్ చిప్ సెట్, అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. టెక్నో కామన్20, టెక్నో కామన్ ప్రో ఫోన్లు 64-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా, టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్స్ కెమెరా ప్యాక్‌తో వస్తున్నాయి. మూడు ఫోన్లు కూడా 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉంటాయి. అయితే, టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ కాసింత కాస్ట్ లీ ఫోన్. టెక్నో కామన్ 20 ఫోన్ సింగిల్ వేరియంట్ 8జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ రూ.14,999లకు లభిస్తుంది. ఈ ఫోన్ గ్లాసియర్ గ్లో, ప్రీడాన్ బ్లాక్, సెరెనిటీ బ్లూ కలర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు. టెక్నో కామన్ 20 ప్రో 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు లభిస్తుంది. రెండు వేరియంట్లు భారత్‌లో డార్క్ వెల్కిన్, సెరెనిటీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వచ్చే నెల రెండో వారం నుంచి యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఇక టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ వచ్చేనెలాఖరులో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీని కలర్ ఆప్షన్లు, ధరల వివరాలు వెల్లడి కాలేదు. టెక్నో కామన్20, టెక్నో కామన్ 20ప్రో 5 జీ ఫోన్లు రెండూ డ్యుయల్ సిమ్ (నానో) ఆప్షన్ కలిగి ఉంటాయి. 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 13- బేస్డ్ హెచ్ఐఓఎస్ 13.0 ఔట్ ఆఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తాయి. టెక్నో కామన్ 20 ఫోన్ 12 ఎన్ఎం మీడియా టెక్ హెలియో జీ85 ఎస్వోసీ విత్ 8బీబీ రామ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఫొటోలు, వీడియోల కోసం టెక్నో కామన్20 ఫోన్ 64-మెగా పిక్సెల్ ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, క్యూవీవీజీఏ టెర్టియరీ కెమెరా కలిగి ఉంటాయి. టెక్నో కామన్ 20 ప్రో5జీ ఫోన్ 64-మెగా పిక్సెల్స్ ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 2మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లలోనూ సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ ఆప్షన్ కలిగి ఉంటాయి. అదనంగా టెక్నో కామన్ 20 ప్రో 5జీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. రెండు ఫోన్లు బయోమెట్రిక్ అథంటికేషన్ ఆప్షన్ కలిగి ఉంటాయి. టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8050 ఎస్వోసీ, 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోలెడ్ స్క్రీన్ విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ఆప్షన్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ 8జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా విత్ సెన్సర్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేసన్, 108-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. వీటితోపాటు సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.

సరసమైన ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు !


ఎయిర్‌టెల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగిస్తున్నప్పటికీ.. మీరు కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే దాదాపు నెల వ్యాలిడిటీతో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లు ఇతర సర్వీసులతో పాటు కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఎయిర్‌టెల్ అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 99 ఉంటే.. టెలికాం ఆపరేటర్ ఈ ప్లాన్‌ను అనేక సర్కిల్‌ల నుంచి తొలగించింది. ఈ ప్లాన్ బదులుగా ధరను రూ. 56 పెంచింది. దాంతో రూ. 155 ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 1GB మొత్తం డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కోసం హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ పొందవచ్చు. రూ. 179 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMS, 2GB మొత్తం డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ పైన పేర్కొన్న ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయి. హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ కూడా పొందవచ్చు. రూ. 199 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ STD, రోమింగ్ నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMSలతో 3GB మొత్తం డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి, Wynk, హలో ట్యూన్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి. రూ. 209 ప్లాన్ కొంత మంది యూజర్లకు బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ, రోజువారీ డేటా బెనిఫిట్స్‌తో కూడిన ప్లాన్ కావాలంటే.. ఈ ప్లాన్ కచ్చితంగా చెక్ చేయవచ్చు. 1GB రోజువారీ డేటాను అందిస్తోంది, ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 21 రోజుల పాటు (Hello Tunes), Wynk అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ఎయిర్‌టెల్ ప్లాన్‌లు 5G డేటా యాక్సెస్‌ను అందించవని గమనించాలి.


మొబైల్ ఫోన్‌ - ఛార్జింగ్ - జాగ్రత్తలు !


మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ సురక్షితంగా ఉండటానికి, ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అనేక విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చాలామంది తమ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు.. కొన్ని పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు ఒక్కోసారి భారీ ప్రమాదాలకు కారణం అవుతాయి. కొన్నిసార్లు మొబైల్ ఫోన్స్ బాంబులా పేలే ప్రమాదం ఉంది. ఒకే సాకెట్‌లో రెండు మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టడం చేయొద్దు, ఛార్జింగ్ పెట్టి ఒక ఫోన్‌పై మరొక ఫోన్‌ను పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్లు వేడెక్కి పేలే ప్రమాదం ఉంది, ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఛార్జర్‌తోనే ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టాలి. లేదా సదరు కంపెనీకి చెందిన ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయాలి. లోకల్ ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల ఫోన్ ఛార్జింగ్ ఎక్కకపోవడం, లేదా కాలిపోవడం జరుగుతుంది, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను పొరపాటున కూడా ఉపయోగించొద్దు. చాలా మంది ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి కాల్స్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ బాగా వేడెక్కి  పేలిపోయే ప్రమాదం ఉంది.

Sunday, May 28, 2023

దేశంలో 20 కోట్లకు చేరుకున్న నెలవారీ స్నాప్‭చాట్ యూజర్లు


దేశంలో 200 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల స్నాప్‌చాటర్‌ల మైలురాయిని చేరుకున్నట్లుగా స్నాప్ ఇన్ కార్పొరేషన్ నేడిక్కడ ప్రకటించింది. కంపెనీ ప్రముఖ ప్రపంచ వృద్ధి మార్కెట్‌లలో భారత్ ఒకటి. స్థానికీకరించిన ప్లాట్‌ఫామ్ అనుభవం, స్థానిక కంటెంట్ కార్యక్రమాలు, భాగస్వా మ్యాలు, స్పాట్‌లైట్, స్టోరీస్ తో ప్రాంతీయ సృష్టికర్తలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా స్నాప్ భారతదేశంలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది. ఇవన్నీ స్నాప్ ఈ మైలురాయిని చేరుకోవడంలో సహాయ పడ్డాయి. స్థానిక వినియోగదారులకు ఔచిత్యాన్ని నిర్ధారించడం అనేది భారతదేశంలో స్నాప్ చాట్ కు చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు 120 మిలియన్లకు పైగా భారతీయ స్నాప్‌చాటర్‌లు యాప్‌లోని నాల్గవ, ఐదవ ట్యాబ్‌లైన స్టో రీస్, స్పాట్‌లైట్‌లో కంటెంట్‌ను చూస్తున్నారు. స్నాప్ చాట్ వినియోగదారులు సృష్టించిన వినోద ప్లాట్‌ఫామ్ అయిన స్పాట్‌లైట్, భారతదేశంలో యూజర్లు స్పాట్‌లైట్‌లో గడిపిన సమయాన్ని మూడు రెట్లు ఎక్కువ చేయడంతో గణనీయమైన వృద్ధిని కొనసాగిస్తోంది. ఈ బలమైన ఎంగేజ్ మెంట్ కొత్తతరం సృష్టికర్తలకు స్నాప్ చాట్ ద్వారా ప్రేక్షకులను పెంచుకోవడానికి సాధికారతను కల్పిస్తోంది. ఏపీఏసీ స్నాప్ ఇన్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ "మన భారతీయ కమ్యూనిటీలో ఊపందుకుంటున్న సమయంలో నేను స్నాప్‌లో చేరినందుకు థ్రిల్‌గా ఉన్నాను. స్నాప్‌చాట్‌లో కమ్యూనిటీలు, వ్యాపారాలను నిర్మించడానికి భాగస్వాములు, సృష్టికర్తలు, బ్రాండ్‌లకు అద్భుతమైన సంభావ్య తను మేం చూస్తున్నాం. మా భవిష్యత్తు గురించి మేం మరింత ఉత్సాహంగా ఉన్నాం. యంగ్ ఇండియా ముఖ్యంగా ఆరోగ్యకరమైన, ప్రైవేట్ వాతావరణాన్ని విలువైనదిగా పరిగణిస్తుంది. ఇది మాకు బాగా తెలుసు. దాన్ని కేంద్రంగా చేసుకునే ముందుకు కొనసాగుతాం'' అని అన్నారు.

భారీగా పడిపోయిన పర్సనల్ కంప్యూటర్ల రవాణా !


దేశీయ మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల రవాణా బాగా పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పీసీల రవాణా 29.92 లక్షల యూనిట్లకే పరిమితమైంది. ఇది గత ఏడాది తో పోలిస్తే 30 శాతం తక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం పీసీ షిప్ మెంట్ వివరాలను ఇంటర్ నేషనల్ డేటా కార్పొరేషన్ విడుదల చేసింది. 2022 ఏడాదిలో మొదటి మూడు నెలల్లో దేశ మార్కెల్లో పీసీల షిప్ మెంట్ 42.82 లక్షల యూనిట్లు గా ఉంది. కానీ ఈ మార్చి త్రైమాసికంలో డెస్క్ టాప్ లకు డిమాండ్ ఉన్నా, నోట్ బుక్ ల డిమాండ్ మాత్రం మరోసారి బలహీనంగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 41 శాతం తగ్గినట్టు ఐడీసీ రిపోర్టు తెలిపింది. వినియెగదారుల డిమాండ్ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్ 25.1 శాతం తగ్గింది. కాగా, పీసీ మార్కెట్ లో 33.8 శాతం వాటాను హెచ్ పీ కంపెనీ కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30.2 శాతం తగ్గింది. లెనోవా కు 15.7 శాతం వాటా ఉంది. అదే విధంగా డెల్ కంపెనీ మార్కెట్ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. ఏసర్ గ్రూప్ వాటా 12.3 శాతం కాగా, ఆసుస్ మార్కెట్ వాటా 6.6 శాతం గా ఉంది.

ఈ కామర్స్ లో రిలయన్స్ హవా !


దేశీయ ఈ కామర్స్ రంగంలో ప్రముఖ కంపెనీ రిలయన్స్ దూసుకుపోతోంది. సుమారు రూ. 12.30 లక్షల కోట్ల దేశీయ ఈ కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్ మార్ట్ కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది. ఈ విషయాన్ని బెర్న్ స్టీన్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. అతి పెద్ద రిటైల్ నెట్ వర్క్, టెలికాం కార్యకలాపాలు, బలమైన డిజిటల్ మీడియా లాంటివి రిలయన్స్ సంస్థను ముందుకు నడిపిస్తాయని ఆ నివేదిక తెలిపింది. భారత్ లో అమెజాన్, రిలయన్స్, వాల్ మార్ట్ ల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని చెప్పింది. సంప్రదాయ రిటైల్ వ్యాపార నమూనా ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. దేశీయంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అతి పెద్ద డిజిటల్‌ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. దీని అనుబంధ సంస్థ జియోకు 43 కోట్ల మంది మొబైల్‌ సబ్ స్రైబర్స్ ఉన్నారు. రిటైల్‌ అనుబంధ సంస్థకు దేశీయంగా 18,300 రిటైల్‌ విక్రయశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు రూ. 2.46 లక్షల కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. డిజిటల్‌ మిక్స్‌ 17 నుంచి 18 శాతానికి పెరుగుతోంది. సమగ్ర ఆఫ్‌లైన్‌+ఆన్‌లైన్‌+ప్రైమ్‌ స్ట్రీమ్‌లోకి రిలయన్స్‌ ఎంటర్ అయితే అమెజాన్‌, వాల్‌మార్ట్‌ సంస్థలకు రిలయన్స్‌ గట్టి పోటీ ఇస్తుందని బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. భారతీయ ఈ కామర్స్‌ విపణి 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ 23 బిలియన్ డాలర్ల జీఎంవీ, అమెజాన్‌ 18 నుంచి 20 బిలియన్ డాలర్ల జీఎంవీతో టాప్ 2 స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతుండగా, రిలయన్స్‌ 5.7 బిలియన్ డాలర్ల జీఎంవీతో మూడో స్థానంలో ఉంది. ఫ్యాషన్‌ (అజియో), ఈ గ్రోసరీ (జియోమార్ట్‌) ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు గెట్‌ బిగ్‌ , గెట్‌ క్లోజ్‌, గెట్‌ ఫిట్‌ పై మెయిన్ గా దృష్టి సారించాయి.

వాట్సాప్ లో స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌ ?


వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. సాధారణంగా జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌లో ఈ స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌ ఉంది. ఆఫీస్‌ మీటింగ్‌ కానీ మరే ఇతర సమావేశాల్లోనైనా ఒక యూజర్‌ ఈ ఆప్షన్‌ ద్వారా తన స్క్రీన్‌ను గ్రూప్‌లో ఉన్న వారందరికీ షేర్‌ చేసే అవకాశం ఉంటుంది. అచ్చంగా ఇలాంటి ఫీచర్‌నే వాట్సాప్‌ సైతం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొందరు బీటా టెస్టర్లకు వాట్సాప్‌ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎవరితోనైనా వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మన మొబైల్‌ స్క్రీన్‌ను అవతలి వ్యక్తికి షేర్‌ చేసే అవకాశం లభించనుంది. ఇందుకోసం స్క్రీన్‌ అడుగు భాగంలో కొత్తగా స్క్రీన్‌ షేరింగ్‌ బటన్‌ను వాట్సాప్‌ ఇవ్వనుంది. ఈ బటన్‌ను క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో చేసే ప్రతిదీ రికార్డు అవ్వడంతో పాటు అవతలి వ్యక్తికి షేర్‌ అవుతుంది. దీనికి యూజర్‌ అనుమతి తప్పనిసరి. ఇదిలా ఉంటే గ్రూప్‌ వీడియో కాల్‌లో ఎక్కువ మంది యూజర్లు ఉంటే స్క్రీన్‌ షేర్‌ ఆప్షన్‌ పనిచేయకపోవచ్చని తెలుస్తోంది.

జూలై 16న ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ విడుదల !


దేశీయ మార్కెట్లో జూలై 16న  ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ విడుదలవుతుంది. ఈ ల్యాప్‌టాప్ సన్నని, తేలికపాటి బరువుతో వస్తుంది. AMD రైజెన్ 7040 సిరీస్ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. మెరుగైన పనితీరు మరియు ఇతర AI ఫీచర్‌ల కోసం ఎంపిక చేసిన మోడల్‌లు AMD రైజెన్ AIతో కూడా వస్తాయి. మొట్టమొదటి పర్యావరణ అనుకూల Wi-Fi 6E మెష్ రూటర్‌ను పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసింది. ఇది స్టీరియోస్కోపిక్ 3D సౌండ్ అనుభవాలను మెరుగుపరచడంలో సహాయపడటానికి SpatialLabs డెవలపర్‌లకు మద్దతు ఇవ్వడానికి కొత్త సాధనాలను కూడా ప్రకటించింది.16 జూలై నుండి ఎంపిక చేయబడిన మార్కెట్లలో సేల్ కు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.  ఉత్తర అమెరికాలో, ఈ ల్యాప్‌టాప్ ధర $1,299.99 (దాదాపు రూ. 1,07,300), యూరప్, మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికా ప్రాంతంలో ఇది EUR 1,199 (దాదాపు రూ. 99,000)గా నిర్ణయించబడింది. ఏసర్ స్విఫ్ట్ ఎడ్జ్ 16 బ్లాక్ కలర్ బాడీలో ఉంటుంది.  16 అంగుళాల 3.2K (3200 x 2000 పిక్సెల్‌లు) OLED ప్యానెల్, రిఫ్రెష్ రేట్ 120Hz, కలర్ గామట్ సపోర్ట్ 100 శాతం, ప్రతిస్పందన సమయం 0.2ms, కాంట్రాస్ట్ రేషియో 1,000,00:100,00. గరిష్ట ప్రకాశం 500 నిట్స్ ఫీచర్లు కలిగి ఉన్నాయి. AMD Radeon 780M GPUతో జత చేయబడిన ఎంపిక చేసిన మోడళ్లలో AMD రైజెన్ AI ఫీచర్‌తో AMD రైజెన్ 7040 సిరీస్ ప్రాసెసర్‌ల ద్వారా పనిచేస్తుంది. ఇది 32GB వరకు LPDDR5 RAM మరియు 2TB వరకు PCIe Gen 4 SSD అంతర్నిర్మిత నిల్వకు మద్దతు ఇస్తుంది. సురక్షిత కోర్ మైక్రోసాఫ్ట్ ప్లూటాన్ మరియు విండోస్ హలోతో వస్తుంది. ఇది Windows 11తో ముందే ఇన్‌స్టాల్ చేయబడింది. ఈ ల్యాప్‌టాప్ నెంబర్ ప్యాడ్‌తో పూర్తి-పరిమాణ కీబోర్డ్‌తో వస్తుంది. ఇది మెరుగుపరచబడిన ఫ్యాన్ మరియు ఎయిర్ ఇన్‌లెట్ కీబోర్డ్ డిజైన్‌లతో ట్విన్ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది మరియు విండో స్టూడియో ఎఫెక్ట్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది టెంపోరల్ నాయిస్ రిడక్షన్ మరియు AI నాయిస్ రిడక్షన్ ఫీచర్‌లతో కూడిన ఏసర్ ప్యూరిఫైడ్ వాయిస్‌ని కూడా కలిగి ఉంది. ఇది ఆటోమేటిక్ ఫ్రేమింగ్ ఫీచర్ తో 1440p QHD వెబ్‌ కెమెరా తో వస్తుంది. బహుళ లింక్ సామర్థ్యాలతో 5.8Gbps వరకు Wi-Fi 7 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఇందులో రెండు USB టైప్-A పోర్ట్‌లు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ USB 4 టైప్-C PD 65W పోర్ట్‌లు, ఒక HDMI 2.1 మరియు ఒక మైక్రో SD కార్డ్ రీడర్ కూడా ఉన్నాయి. ఇది 1.23 కిలోగ్రాముల బరువు, 12.95 మిమీ మందం కలిగి ఉంటుంది. 

దేశీయ మార్కెట్లో జూన్ 1 నుంచి లెనోవో ట్యాబ్ ఎం 9


దేశీయ మార్కెట్లో లెనోవో ట్యాబ్ ఎం 9ను తీసుకొచ్చింది.  ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. ఈ టాబ్లెట్ బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. జూన్ 1 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటూ లెనోవో కంపెనీ అధికారిక సైట్‌లో  లభిస్తుంది.  ఇది Android 12 వెర్షన్‌తో నడుస్తోంది. దీనికి ఒక సంవత్సరం Android OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.   9-అంగుళాల HD (800 X 1,340 పిక్సెల్‌లు) LCD TFT డిస్‌ప్లే... 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉంది. డిస్ప్లే TUV రైన్‌ల్యాండ్.. కంటికి ఏమాత్రం హాని చెయ్యదని చెబుతున్నారు. 4GB... LPDDR4X RAMతో ఆక్టా-కోర్ MediaTek Helio G80 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. టాబ్లెట్‌లో 64GB eMMC ఆన్‌బోర్డ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. దీనిని 128GB వరకు పెంచుకోవచ్చు.  ఫొటోగ్రఫీ కోసం ట్యాబ్లెట్ వెనుక భాగంలో ఆటోఫోకస్‌తో కూడిన 8MP కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 2MP కెమెరా ఉంది. దీని బ్యాటరీ 5,100mAh. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది. కనెక్టివిటీ విషయానికొస్తే, ఇది 4G LTE, Wi-Fi 802.11AC, బ్లూటూత్ 5.1, హెడ్‌ఫోన్ పోర్ట్, USB టైప్-సి పోర్ట్‌లను సపోర్ట్ చేస్తుంది.

Saturday, May 27, 2023

ఒకే ప్లాన్ ని తొమ్మిది మంది వాడుకోవచ్చు!


ఎయిర్‌టెల్ రూ. 599 ప్లాటినం ఫ్యామిలీ ప్లాన్‌ పేరిట ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. దీనిని కపుల్ ప్లాన్ గా పిలుస్తారు. అంటే ఒకే ప్లాన్‌పై భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందవచ్చు. ప్రైమరీ యూజర్ ఈ ప్లాన్ మేనేజ్ చేస్తుంటారు. కావాల్సినప్పుడు మరొక కుటుంబ సభ్యుణ్ని ఈ ప్లాన్‌లో యాడ్ చేసుకోవచ్చు. లేదా ప్లాన్ నుంచి తీసేయవచ్చు. ఈ ప్లాన్‌లోకి కొత్తగా ఎవరు వచ్చినా సెకండరీ యూజర్‌గా పరిగణించాలి. సెకండరీ యూజర్ కోటా కింద ఉన్న డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఉన్న ఇద్దరికీ అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దాంతో పాటు నెల రోజులకు గానూ ఇద్దరికి 105 జీబీ డేటా వరకు లభిస్తుంది. అందులో మళ్లీ 75 జీబీ ప్రైమరీ యూజర్‌ లభిస్తుండగా.. మిలిగిన 30 జీబీ డేటా సెకండరీ యూజర్‌ కోటా కింద ఉంటుంది. ఒక వేళ ఈ డేటాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే మరుసటి నెలకు బదిలీ చేసుకోవచ్చు. గరిష్ఠంగా 200 జీబీ వరకు బదిలీ చేసుకునే వీలుండడం గమనార్హం. ప్రైమరీ, సెకండరీ యూజర్లతో పాటు మరో 8 మంది వరకు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ప్రతి కనెక్షన్‌కు రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి వ్యక్తికి 30 జీబీ డేటా అదనంగా వస్తుంది. పైగా అన్ని ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లపై పరిచయ ప్రయోజనంగా అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఆస్వాదించవచ్చు. అందువల్ల, ఏదైనా 5G డేటా వినియోగం ప్లాన్ డేటా కోటా కింద పరిగణించబడదు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5G ప్లస్ 3000 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ ఆరు నెలల సభ్యత్వం లభిస్తుంది. అలాగే ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ లభిస్తాయి. అంతేకాక ఉచితంగా హలో ట్యూన్స్, వింక్ ప్రీమియం, ఏడాది పాటు అపోలో 24/7 సేవలు పొందవచ్చు. అలాగే ఎయిర్ టెల్ స్టోర్లు, కస్టమర్ కేర్ సెంటర్లలో వీఐపీ సర్వీస్ కింద ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఎయిర్‌టెల్ దాని ప్లాటినం కస్టమర్‌లకు ప్రాధాన్యతనిస్తుంది. వారికి ప్రత్యేకమైన వీఐపీ సేవలను అందిస్తుంది. ‘ప్రియారిటీ సర్వీస్’తో, ప్లాటినం కస్టమర్‌లు ఎయిర్‌టెల్ కాల్ సెంటర్‌లు, స్టోర్‌లలో ప్రిఫరెన్షియల్ కస్టమర్ సపోర్ట్‌ను పొందవచ్చు.

యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో కోమాకి టిఎన్ 95 ఎలక్ట్రిక్ స్కూటర్ !


దేశీయ మార్కెట్లోకి ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ కోమాకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ కోమాకి ఈవీ స్కూటర్ధర రూ. 1,31,035 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. ఈ బైకులో మోడల్ యాంటీ-స్కిడ్ టెక్నాలజీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాప్-ఆధారిత స్మార్ట్ బ్యాటరీలతో వస్తుంది. ఇందులోని బ్యాటరీలు అగ్ని-నిరోధకతను కలిగి ఉంటాయి. డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ కంట్రోల్ కొత్త కీ ఫోబ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట స్పీడ్ గంటకు 85కిమీ దూసుకెళ్తుంది. ఇందులో 18-లీటర్ బూట్ కూడా ఉంది. 2023 Komaki TN 95 ప్రత్యేక ఫీచర్లలో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్, LED DRL, LED ఫ్రంట్ వింకర్‌లు, TFT స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, ఆన్-రైడ్ కాలింగ్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి. కొమాకి బైకులో మెటల్ గ్రే, చెర్రీ రెడ్ వంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి. 5kW హబ్ మోటార్ ద్వారా పవర్ అందిస్తుంది. 50amp కంట్రోలర్‌ను ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 3 గేర్ మోడ్‌లను కలిగి ఉంది. ఎకో, స్పోర్ట్స్, టర్బో రీజెన్‌తో వచ్చాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. 2023 Komaki TN 95 స్కూటర్130-150km, 150-180km పరిధిని బట్టి రెండు వేరియంట్‌లలో అందిస్తోంది. 

థామ్సన్ ఇండియా నుంచి కొత్త స్మార్ట్‌టీవీలు !


ప్రముఖ టెక్ కంపెనీ థామ్సన్ సంస్థ ఇండియాలో ఎఫ్ఏ సిరీస్‌తో పాటు ఓత్ ప్రో మ్యాక్స్ 4కె టీవీలను ఆవిష్కరించింది. ఈ టీవీలు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, హై-క్వాలిటీ విజువల్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు కంపెనీ కొత్త వాషింగ్ మెషీన్లను కూడా పరిచయం చేసింది. అయితే టీవీలు కేవలం రూ.10 వేల ప్రారంభ ధరలతోనే లాంచ్ అవుతాయని కంపెనీ ప్రకటించింది. థామ్సన్ ఎఫ్ఏ సిరీస్ ధరలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. 32-అంగుళాల ఎఫ్ఏ సిరీస్ టీవీ ధరను రూ.10,499గా కంపెనీ నిర్ణయించగా.. 40-అంగుళాల టీవీని రూ.15,999గా.. 50-అంగుళాల మోడల్‌ను రూ.16,999గా కంపెనీ ప్రకటించింది. ఇక Oath Pro Max 4K TVల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. 43-అంగుళాల టీవీ రూ.22,999, 50-అంగుళాల టీవీ మోడల్‌ను రూ.27,999కి సేల్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇక వాషింగ్ మెషీన్ల ధరలు రూ.12,999 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త థామ్సన్ ఉత్పత్తులు కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్ట్‌ అయ్యాయి. మే 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. టీవీలు 32-అంగుళాల, 40-అంగుళాల, 42-అంగుళాల స్క్రీన్ సైజుల్లో అందుబాటులో ఉంటాయి. రియల్‌టెక్ ప్రాసెసర్లు, 1GB RAM + 8GB ఇంటర్నల్ స్టోరేజీతో ఇవి లాంచ్ అవుతాయి. ఈ టీవీలలో Google Play Store యాక్సెస్‌ ఉంటుంది. ఇవి Android TV 11 OSపై రన్ అవుతాయి. బెజర్స్-లెస్ డిస్‌ప్లేతో ఫుల్ HD రిజల్యూషన్‌ను అందిస్తాయి. డాల్బీ డిజిటల్ సపోర్ట్‌తో 30W స్పీకర్లు కూడా వీటిలో ఆఫర్ చేశారు. ఇవి 43-అంగుళాల, 50-అంగుళాల స్క్రీన్ సైజులలో రిలీజ్ కానున్నాయి. అనేక యాప్‌లు, గేమ్‌లకు యాక్సెస్‌తో Google TV OS పై ఈ టీవీలు రిలీజ్ అవుతాయి. డాల్బీ విజన్, HDR10+ మద్దతుతో బెజెల్-లెస్ డిజైన్ ఈ టీవీలలో ఉంటుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్, DTS TrueSurroundతో 40W స్టీరియో బాక్స్ స్పీకర్‌లు వీటిలో ఆఫర్ చేశారు. ఇవి క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2GB RAM + 16GB స్టోరేజీతో వస్తాయి. కనెక్టివిటీ విషయానికొస్తే వీటిలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, HDMI ARC/CEC, USB 3.0 సపోర్టు అందించారు. గూగుల్ అసిస్టెంట్, ఇన్-బిల్ట్ Chromecast ఫీచర్లు రెండు టీవీ సిరీస్‌లలో ఉంటాయి. మల్టీపుల్ ప్రొఫైల్స్‌, మాన్యువల్, వాయిస్ కంట్రోల్స్‌ వీటిలో ఆఫర్ చేశారు. ఈ ప్రీమియం టీవీలలో స్మార్ట్ హోమ్ డివైజ్ కంట్రోల్స్‌, పర్సనలైజ్డ్‌ కంటెంట్‌కి యాక్సెస్ ఉంటుంది.


ఆండ్రాయిడ్ ఫోన్లపై 'డామ్’ వైరస్


ఆండ్రాయిడ్ ఫోన్‌లకు హాని కలిగించే ‘డామ్’ అనే మాల్వేర్‌కు ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ మార్వెట్ మీ ఫోన్లలోని కాల్ రికార్డ్‌లు, కాంటాక్ట్‌లు, బ్రౌజింగ్ హిస్టరీ, కెమెరా వంటి వాటిని యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. 'డామ్' పేరుతో ఉన్న వైరస్ యాంటీ వైరస్ ప్రోగ్రాములను కూడా ఏమార్చగలదని, దీనిని గుర్తించడం, తీసేయడం కష్టతరం అని తెలిపింది. ఈ వైరస్ మీ మొబైల్ ఫోన్ ను లాక్ చేసి, దాన్ని అన్ లాక్ చేయడానికి డబ్బులను కూడా డిమాండ్ చేసే హానికరమైన సాఫ్ట్ వేర్ ransomwareని కూడా అమలు చేస్తుందని తెలిపింది. థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌ని అన్ ట్రస్ట్‌డ్, అన్ నోన్ సోర్స్ నుంచి డౌన్ లోడ్ చేస్తే ఈ వైరస్ మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఒకసారి డామ్ వైరస్ ఫోన్లలోకి ఎంటరైతే, అది ఫోన్ భద్రతా వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఫోన్ కాల్ రికార్డింగ్స్, కాంటాక్స్ హ్యాక్ చేస్తుంది. కెమెరాను యాక్సెస్ చేయగలదని హెచ్చిరిస్తున్నారు నిపుణులు. మొబైల్స్ లోని ఫైల్స్ ను ఎన్‌క్రిప్ట్ చేయడానికి మాల్వేర్ AES అనే అధునాతన ఎన్‌క్రిప్షన్ అల్గారిథమ్‌ని ఉపయోగిస్తుంది. ఇది డివైజ్ లో ఉండే ఫైల్స్ ను తొలగించిడానికి, ఎన్ క్రిప్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఒక్కోసారి పర్సనల్ డేటాను దొంగిలించి డబ్బులను కూడా డిమాండ్ చేసే ర్యామ్సన్ వేర్ గా మారొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పడకూడదంటే  అన్ ట్రస్టెడ్ వెబ్ సైట్లను, అన్ నోన్ లింక్స్ పై క్లిక్ చేయడం చేయొద్దని కేంద్రం తెలిపింది. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయడం మంచిది. అనుమానాస్పద ఫోన్ నెంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ‘bitly’ లేదా ‘tinyurl’ హైపర్‌లింక్‌లను కలిగి ఉన్నటువంటి సంక్షిప్త URLలతో వ్యవహరించేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ URLలు హానికరమైన వెబ్‌సైట్‌లకు దారి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

యూట్యూబ్ లో స్టోరీస్ ఫీచర్ కనిపించదు !


యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను ఆపేయనుంది. యూట్యూబ్ 2017లో స్టోరీస్ ఫీచర్‌ను పరిచయం చేసింది. యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈజీ అప్‌డేట్‌ షేరింగ్, సంభాషణల ప్రారంభం, కంటెంట్‌ ప్రచారం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లను ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తోంది. ఇందుకు యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు బెస్ట్ అని అనుకుంటోంది. ఎందుకంటే స్టోరీస్ ఫీచర్ తో పోలిస్తే యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు.. ఎక్కువ వ్యూయర్ షిప్ తో పాటు.. కామెంట్‌లు, లైక్‌లు వస్తాయి. ఇవి యూజర్లకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి. “6/26/2023 నుంచి కొత్త YouTube స్టోరీని సృష్టించే ఎంపిక అందుబాటులో ఉండదు. ఆ తేదీలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేయబడిన కథనాలు పోస్ట్ చేసిన ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయి” అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ స్టోరీస్ ఫీచర్ ను సోషల్ మీడియా దిగ్గజాలైన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ప్రవేశపెట్టారు. కానీ ఈ ఫీచర్ సక్సెస్ కాలేదు. ప్రవేశపెట్టిన మొదట్లో ఆదరణ భాగానే లభించినా క్రమంగా యూజర్లు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్, ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది పొడవునా కొత్త ఫీచర్‌లతో షార్ట్‌లు, కమ్యూనిటీ పోస్ట్‌లను మెరుగుపరచడం కొనసాగిస్తామని యూట్యూబ్ చెబుతోంది. 

గ్రామాలకు కూడా గూగుల్ స్ట్రీట్ వ్యూ !


ఇప్పటివరకు ప్రధాన నగరాలకు మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ మ్యాప్స్‌  స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఇకపై దేశంలోని ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉంటుందని గూగుల్ వెల్లడించింది. దీంతో గూగుల్ యూజర్లు ప్రతి వీధిలోని ప్రతి ఇంటినీ సులువుగా గుర్తించవచ్చు. దీనివల్ల అడ్రస్‌లు వెతుక్కోవడం మరింత ఈజీ అవుతుంది. మనం అడ్రస్ కోసం వెతికే చోట ఉన్న షాపు, ఇల్లు లేదా ఆఫీస్ ను 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. ఒకరకంగా దీన్ని వర్చువల్ ప్రజెంటేషన్‌గా చెప్పొచ్చు. దీంతో యూజర్ ఆ ప్రాంతలో ఉండి.. అక్కడి పరిసరాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పటిదాకా గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. విదేశాల్లో ఈ ఫీచర్ ఎప్పుడో అందుబాటులో ఉన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఈ ఫీచర్‌కి ప్రభుత్వం 2016లో అనుమతులు నిరాకరించింది. 2018లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచగా మరోసారి తిరస్కరణకు గురైంది. స్ట్రీట్ వ్యూ ఫీచర్ పనోరమిక్ ఫొటోలతో నగరాలు, గ్రామాల్లోని వీధులను చూడొచ్చు. దీనివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగా స్ట్రీట్ వ్యూ కోసం సేకరించే పనోరమిక్ ఫొటోల్లోని వ్యక్తుల ముఖాలు, వాహనాల నంబర్ ప్లేట్లు వంటి వాటిని కనపడకుండా చేస్తామని తెలిపింది. దీంతో గూగుల్ స్ట్రీట్ వ్యూను ప్రభుత్వం ఆమోదించడంతో గతేడాది ఈ ఫీచర్‌ను గూగుల్ భారత్‌లోని యూజర్లకు పరిచయం చేసింది. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది.


Friday, May 26, 2023

ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో నోకియా సౌండ్ బార్ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ !


ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ 2023 ఈరోజు నుండి మొదలైంది. నోకియా బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్స్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మే 26వ తేదీ నుండి మే 31 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి 65 ఇంచ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ మరియు ఇతర అఫర్ లతో తక్కువ ధరలోనే లభిస్తోంది. NOKIA 65 ఇంచ్ Ultra HD 4Kస్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మోడల్ నెంబర్ 65UHDADNDT8P పైన ఈరోజు ఈ బెస్ట్ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ నోకియా స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి 37% డిస్కౌంట్ తో రూ. 49,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారు రూ. 1,250 డిస్కౌంట్ ను, Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను పొందుతారు. ఈ నోకియా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ నోకియా బిగ్ స్మార్ట్ టీవీ Onkyo స్పీకర్ల కలిగిన సౌండ్ బార్ సెటప్ మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇందులో 48W భారీ సౌండ్ అందించ గల 2 స్పీకర్లు ఉన్నాయి. ఈ నోకియా స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో మంచి వీక్షణాను భూతిని అందిస్తుంది. ఈ టీవీ లో 3HMDI, 2 USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవిలో క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 OS పైన పని చేస్తుంది.

జులైలో 'నంథింగ్ ఫోన్ 2' విడుదల


'నథింగ్' నుంచి గత ఏడాది అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో తొలి స్మార్ట్ ఫోన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ 2 ను జులైలో మార్కెట్ లోకి తీసుకురానున్నట్టు కంపెనీ సీఈఓ కార్ల్ పే వెల్లడించారు. నథింగ్ ఫోన్ 2 కూడా ఆకర్షణీయ డిజైన్, ఫీచర్లతో సహా బలమైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. ఫోన్ 1 లో 4500 mAh బ్యాటరీని అందించగా.. ఫోన్ 2 లో 4700mAh బ్యాటరీతో వస్తందన్నారు. కాగా, ఫోన్ 1 ను అమెరికా మార్కెట్ లో ప్రవేశపెట్టని నంథింగ్ .. ఫోన్ 2 ను మాత్రం అక్కడ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఫోన్ 1 లో మిడ్ రేంజ్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ + ప్రాసెసర్ తో వచ్చింది. అదే విధంగా నంథింగ్ ఫోన్ 2 లో స్నాప్ డ్రాగన్ 8 + జెన్ 1 ప్రాసెసర్ ఉంటుందని కార్ల్ పే చెప్పారు. గత ఏడాది జులైలో నథింగ్ కంపెనీ తన తొలి స్మార్ట్ ఫోన్ ను భారత్ తో సహా పలు దేశాల్లో విడుదల చేసింది. 6.55 ఇంచుల ఓఎల్ఈడీ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 78జీ+ చిప్ సెట్ తో వచ్చిన ఈ ఫోన్ లో వెనుక రెండు 50 MP, సెన్సార్లతో కూడిక కెమెరాలున్నాయి. 4500 mAh బ్యాటరీ, 33 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇందులో నోటిఫికేషన్ల కోసం ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 1 విడుదల టైమ్ లో 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజీ మోడల్ ధరను రూ. 32,999 గా ఉంది. అయితే పలు ఆఫర్లు, డిస్కౌంట్ల తో ధరలు కొంత మేర తగ్గాయి. కాగా నంథింగ్ ఫోన్ 2 ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

5,000 మందికి రిలయన్స్‌ ఫౌండేషన్ చేయూత !


రిలయన్స్‌ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్‌ అందుకునే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌/టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, కామర్స్, ఆర్ట్స్, బిజినెస్‌/మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్, ఇతర ప్రొఫెషనల్‌ డిగ్రీలకు చెందిన వారు ఉన్నారు. స్కాలర్స్‌లో 51 శాతం మంది బాలికలు. 4,984 విద్యా సంస్థలలో చదువుతున్న దాదాపు 40,000 మంది దరఖాస్తుదారుల నుండి కఠినమైన ప్రక్రియ ద్వారా వీరి ఎంపిక జరిగింది. ఇందులో ఆప్టిట్యూడ్‌ టెస్ట్, 12వ తరగతి మార్కు లు, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అర్హుల జాబితా రూపొందింది. పదేళ్లలో 50,000 మందికి స్కాలర్‌షిప్స్‌ అందజేయనున్నట్టు రిలయన్స్‌ ఫౌండేషన్‌ 2022 డిసెంబర్‌లో ప్రకటించింది.

మనుషుల మెదడుపై ఇంప్లాట్స్‌ టెస్ట్‌కు న్యూరాలింక్ కంపెనీకి అనుమతులు !

మెదడుకు సంబంధించిన వ్యాధులను సమర్థంగా నయం చేసేందుకు బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీని ఎలాన్‌ మస్క్‌ కంపెనీ న్యూరాలింక్‌ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా న్యూరాలింక్ తన మొదటి హ్యూమన్‌ క్లినికల్ ట్రయల్ కోసం యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం పొందింది. దీంతో మానవులపై న్యూరాలింక్‌ బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీని టెస్ట్‌ చేయడానికి రూట్ క్లియర్‌ అయింది. న్యూరాలింక్‌ కంపెనీకి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే గతంలో ఈ ఆమోదం కోసం సంస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. చాలా మందికి సహాయం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన మొదటి అడుగు అని న్యూరాలింక్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదంపై ఆనందం వ్యక్తం చేసింది. అయితే రిక్రూట్‌మెంట్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి, అధ్యయనం గురించి నిర్దిష్ట వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరింత సమాచారం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బ్రెయిన్‌ ఇంప్లాంట్స్‌ వివిధ కండిషన్లను అడ్రస్‌ చేయగలవని, వెబ్ బ్రౌజింగ్, టెలిపతి వంటి ఫంక్షన్స్‌ను ఎనేబుల్‌ చేయగలవని ఎలాన్‌ మస్క్ గతంలో పేర్కొన్నారు. ఆయన డివైజెస్‌ సేఫ్టీపై విశ్వాసం వ్యక్తం చేశారు. వాటిని తన సొంత పిల్లలకు కూడా అమర్చడానికి సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి భయాలు అవసరం లేదని ప్రకటించారు. 2022 సంవత్సరం ప్రారంభంలో న్యూరాలింక్‌ కంపెనీ FDA అనుమతిని కోరింది. అయితే హ్యూమన్‌ టెస్ట్‌ల వైపు న్యూరాలింక్ ప్రయాణానికి కొంత సమయం పట్టింది. డివైజ్‌లో పొందుపరిచిన లిథియం బ్యాటరీ, బ్రెయిన్‌లోని వైర్ మూవ్‌మెంట్స్‌, మెదడు కణజాలం దెబ్బతినకుండా సురక్షితంగా వెలికితీసే విషయంలో FDA వివిధ ప్రశ్నలు లేవనెత్తింది. ఆమోదం పొందడానికి ముందు ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ఎట్టకేలకు సవాళ్లను అధిగమించిన న్యూరాలింక్‌ FDA ఆమోదం అందుకుంది. 2016లో న్యూరాలింక్ కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్స్‌కి సబ్జెక్ట్‌గా మారింది. న్యూరాలింక్‌లో యానిమల్‌ టెస్టింగ్‌ను పర్యవేక్షిస్తున్న ప్యానెల్‌ను పరిశీలించాలని, దాని కంపొజిషన్‌, పొటెన్షియల్‌ రష్డ్‌ ఎక్స్‌పరిమెంట్స్‌ను ప్రశ్నించాలని చట్టసభ సభ్యులు కోరారు. సరైన నియంత్రణ చర్యలు లేకుండా న్యూరాలింక్ ప్రమాదకర వ్యాధికారకాలను చట్టవిరుద్ధంగా రవాణా చేసిందా? లేదా? అనే అంశాలను కూడా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ దర్యాప్తు చేస్తోంది. యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పొటెన్షియల్‌ యానిమల్ వెల్ఫేర్‌ వయోలేషన్స్‌, కంపెనీపై USDA పర్యవేక్షణపై విచారణను నిర్వహిస్తోంది. బ్రెయిన్‌-ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా బ్రెయిన్‌లో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు లేదా ఇంప్లాంట్స్‌ ఉంచుతారు. న్యూరల్ సర్క్యూట్‌లతో ఇంటరాక్ట్‌ కావడానికి, బ్రెయిన్‌ ఫంక్షన్స్‌ని మెరుగుపరచడానికి లేదా పునరుద్ధరించడానికి ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. ఈ ఇంప్లాట్స్‌ను బ్రెయిన్‌ ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌తో ఇంటర్‌ఫేస్ అయ్యేలా రూపొందిస్తారు. దీనితో బ్రెయిన్‌, ఎక్స్‌టెర్నల్‌ డివైజ్‌లు లేదా కంప్యూటర్ సిస్టమ్‌ల మధ్య కమ్యూనికేషన్‌ సాధ్యమవుతుంది. బ్రెయిన్‌ ఫంక్షన్స్‌ను నేరుగా ప్రభావితం చేయడం ద్వారా వివిధ నాడీ సంబంధిత పరిస్థితులు లేదా వైకల్యాలకు చికిత్స చేయడం బ్రెయిన్-ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ఇది పార్కిన్సన్స్ వ్యాధి, మూర్ఛ, పక్షవాతం వంటి వివిధ రోగాలను సమర్థంగా నయం చేయగలదు.

ఆలీబాబాలో ఉద్యోగాల ఆఫర్ !


రిట్రెంచ్‌మెంట్, ఆర్థిక మాంద్యం సమయంలో చైనా కంపెనీ ఆలీబాబా గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఎక్కడికక్కడ కంపెనీలు నిరంతరం ఉద్యోగాల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో చైనాకు చెందిన ఈ-కామర్స్ వెబ్‌సైట్ అలీబాబా వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. 15000 మందికి ఉద్యోగాలు ఇస్తామని అలీబాబా తాజాగా ప్రకటించింది. గత 6 నెలల్లో ఐటీ రంగంలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రజలకు కష్టకాలంలో దూతగా నిలిచిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. వెయిబో నివేదిక ప్రకారం.. చైనీస్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అలీబాబా తన 6 ప్రధాన వ్యాపార విభాగాల కోసం 15000 మందిని రిక్రూట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సమయంలో కాలేజీలో కొత్తగా గ్రాడ్యుయేట్ చేసిన వారికి ఇది ప్రత్యేక అవకాశంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎందుకంటే తాజాగా గ్రాడ్యుయేట్ల నుంచి 3 వేల మందిని కంపెనీ రిక్రూట్ చేసుకోనుంది. అదే సమయంలో కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందని వస్తున్న పుకార్లను ఖండించింది.  ఈ -కామ్ వెబ్‌సైట్ అలీబాబా ఇటీవల వేలాది మంది ఉద్యోగులకు నియామకానికి మార్గం చూపింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని చైనా కంపెనీ నిర్ణయించింది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ తన మొత్తం ఉద్యోగులలో 7శాతం తగ్గించాలని కోరుకుంటోంది. పునర్వ్యవస్థీకరణ కింద కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా అలీబాబా తన ఖర్చులను తగ్గించుకుంటుంది. అయితే, తమ ఉద్యోగులను తగ్గించాలన్న నిర్ణయాన్ని కంపెనీ ‘పుకారు’గా పేర్కొంది. ఇది సాధారణ ప్రక్రియ అని కంపెనీ తెలిపింది. కంపెనీ త్వరలో వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది.

మెటా ఇండియా టాప్‌ ఉద్యోగులపై లేఆఫ్స్‌ ప్రభావం !


ఫేస్‌బుక్‌ మాతృసంస్థ అయిన మెటా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది. మార్కెటింగ్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌, కంటెంట్‌ స్ట్రాటజీ, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను తొలగించింది. భారత్‌లో పనిచేస్తున్న పలువురు టాప్‌ ఉద్యోగులపై కూడా ఈ లేఆఫ్స్‌ ప్రభావం పడింది. మెటా ఇండియా మార్కెటింగ్‌ డైరెక్టర్‌ అవినాష్‌ పంత్‌, మీడియా భాగస్వామ్యాల డైరెక్టర్‌ సాకేత్‌ ఝా సౌరభ్‌, మెటా ఇండియా లీగల్‌ డైరెక్టర్‌ అమృతా ముఖర్జీతో సహా భారత్‌లోని కొందరు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు పదవీ విరమణ చేయాల్సిందిగా యాజయాన్యం కోరినట్లు తెలిసింది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు ఈ ఏడాది మార్చిలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల తొలగింపును ఏప్రిల్‌, మేలో రెండు విడతలగా చేపడతామని వెల్లడించారు. అందులోభాగంగానే ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపిన మెటా, మిగిలిన 6వేల మంది ఉద్యోగుల్ని తాజాగా తొలగించింది. కాగా, జాబ్‌ కోల్పోయిన ఉద్యోగులు లింక్డిన్‌ పోస్టుల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Thursday, May 25, 2023

వాట్సాప్‌లో ఫోన్‌ నెంబర్‌ బదులు యూజర్‌ నేమ్‌ ?


వాట్సాప్‌ కాంటాక్ట్‌ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తుంది. ఇప్పటివరకు ఎవరికైనా మెసేజ్‌ చేస్తే అవతలివ్యక్తులకు మన ఫోన్‌ నెంబర్‌ కనిపించేది. దీనివల్ల ఒక్కోసారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేది. అందుకే అవతలి వ్యక్తులకు ఇకపై మన ఫోన్‌ నెంబర్‌ తెలిసే వీలు లేకుండా వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ అని పిలిచే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ అప్‌కమింగ్‌ ఫీచర్‌ గురించి వాట్సాప్‌ బీటా ఇన్ఫో ( WABetaInfo ) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మనం ఎవరికైనా మెసేజ్‌ చేస్తే అవతలి వ్యక్తులకు మన ఫోన్‌ నెంబర్‌ బదులు యూజర్‌ నేమ్‌ కనిపిస్తుంది. దీనికోసం యూనిక్‌ యూజర్‌నేమ్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా 2.23.11.15 వెర్షన్‌లో కనిపించిందని WABetaInfo వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్‌ చేసింది. దీని ప్రకారం వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని ప్రొఫైల్‌ సెక్షన్‌లోకి వెళ్లి యూజర్‌నేమ్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యూనిక్‌ యూజర్‌నేమ్ సెట్‌ చేసుకోవడం ద్వారా దాంతోనే బంధుమిత్రులు, తెలిసిన వాళ్లతో కాంటాక్ట్‌ అవ్వొచ్చు. అలాగే ఏవైనా గ్రూపుల ద్వారా కాంటాక్ట్‌ అయ్యే వ్యక్తులకు కూడా మన ఫోన్‌ నెంబర్‌ కనిపించకుండా జాగ్రత్త పడొచ్చు. వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ ఇంకా డెవలప్‌మెంట్‌ దశలోనే ఉంది కాబట్టి ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. అయితే.. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్‌ యాప్‌లో యూజర్‌నేమ్‌ సెర్చ్‌ చేయడం ద్వారా కూడా సంబంధిత వ్యక్తులను కాంటాక్ట్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు టెక్‌నిపుణులు భావిస్తున్నారు. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ తొందరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఎల్‌జీ రోలబుల్ ఓలెడ్ స్మార్ట్ టీవీ ధర రూ.80 లక్షలు !


ఎల్‌జీ రిలీజ్ చేసిన రోలబుల్ ఓలెడ్ స్మార్ట్ టీవీ ధర అక్షరాలా రూ.80 లక్షలు. ఈ స్మార్ట్ టీవీ రిలీజ్ అయినప్పుడు ధర రూ.75 లక్షలు. కానీ ఇప్పుడు ధర పెరిగిపోయింది. ప్రస్తుత ధర రూ.79,99,999. అంటే ఈ స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవాలంటే రూ.80 లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఎల్‌జీ చాలా ఏళ్ల క్రితమే రోలబుల్ ఓలెడ్ టీవీలను పరిచయం చేసింది. భారతదేశంలో ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ టీవీ రిలీజ్ కావడం విశేషం. కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ నిర్వహించే సీఈఎస్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్ టీవీని పరిచయం చేసింది ఎల్‌జీ. ఆ తర్వాత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎల్‌జీ రిలీజ్ చేసిన ఈ రోలబుల్ టీవీని సులువుగా చాప చుట్టేసినట్టు చుట్టేయొచ్చు. ఇది 8కే ఓలెడ్ టీవీ. 42 అంగుళాల నుంచి 96 అంగుళాల ఓలెడ్ టీవీ వరకు వేర్వేరు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అందులో భాగంగా హైఎండ్ మోడల్‌లో రోలబుల్ టీవీ రిలీజ్ చేసింది. ఎల్‌జీ 2022 ఓలెడ్ టీవీ కొనాలంటే రూ.88,990 చెల్లిస్తే చాలు. కానీ రోలబుల్ టీవీ కొనాలంటే మాత్రం ధర రూ.75 లక్షలు చెల్లించాలి. ఈ టీవీకి ఇంత ధర ఎందుకన్న డౌట్ మీకు రావొచ్చు. ఇందులో రోలబుల్ టెక్నాలజీ ఉండటమే కారణం. అసలు ఈ స్మార్ట్ టీవీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ టీవీ ఓ బాక్సులో వస్తుంది. టీవీ చూడాలనుకున్నప్పుడు ఆన్ చేస్తే స్క్రీన్ పైకి రోల్ అవుతుంది. ఆఫ్ చేస్తే మళ్లీ బాక్సులోకి స్క్రీన్ రోల్ అవుతుంది. అంటే స్క్రీన్ చాప చుట్టినట్టుగా ఆటోమెటిక్‌గా రోల్ అవుతుంది. ఇలా జీవితకాలంలో 50,000 సార్లు టీవీని రోల్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీ తప్ప మిగతా ఫీచర్స్ అన్నీ ఇతర ఓలెడ్ టీవీలో ఉన్నట్టుగానే ఉన్నాయి.  ఎల్‌జీ రోలబుల్ ఓలెడ్ టీవీలో 120Hz రిఫ్రెష్ రేట్, 4కే రెజల్యూషన్, హెచ్‌డీఆర్ సపోర్ట్, హెచ్‌డీఎంఐ 2.1, డాల్బీ విజన్, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎల్‌జీ సొంత వెబ్ఓఎస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తోంది. అన్ని పాపులర్ యాప్స్ ఇందులో ఉంటాయి.  టీవీలో అల్‌ట్రా హెచ్‌డీ రెజల్యూషన్ సపోర్ట్ లభించడం విశేషం. ఇందులో గెమింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎల్‌జీ ఏఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఏఐ యూఎక్స్, ఏఐ హోమ్, ఏఐ రికమండేషన్, ఇంటెలిజెంట్ ఎడిట్, కన్వర్జేషనల్ ఏఐ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.  ఇందులో 100వాట్ స్పీకర్, 40వాట్ సబ్ వూఫర్ సపోర్ట్ ఉంది. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 4 హెచ్‌డీఎంఐ పోర్టులు, 3 యూఎస్‌బీ పోర్టులు, 1 హెడ్‌ఫోన్ ఔట్‌పుట్ పోర్ట్ ఉన్నాయి. ఈ టీవీ, స్టాండ్ బరువు 91 కిలోలు ఉంటుంది. 

రెడ్మీ ఏ2, రెడ్ మీ ఏ2+ స్మార్ట్‌ఫోన్లు విక్రయాలు ప్రారంభం !


దేశీయ మార్కెట్లోకి రెడ్మీ ఏ2, రెడ్మీ ఏ2+ స్మార్ట్‌ఫోన్లు విక్రయాలు ఈరోజు నుంచే ప్రారంభించారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లపై కంపెనీ మంచి మంచి ఆఫర్లను సైతం అందజేస్తోంది. ఈ రెండు ఫోన్లలో ఒకేరకమైన ఫీచర్లున్నాయి. అయితే ఏ2ప్లస్ లో మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. గత సంవత్సరం విడుదలైన రెడ్‌మీ A1 సిరీస్ కన్నా A2 సిరీస్‌లో అదనపు హంగులతోపాటు శక్తివంతమైన చిప్‌లను యాడ్ చేశారు. A2 స్మార్ట్‌ఫోన్ 2GB రామ్, 32GB స్టోరేజీ మోడల్‌ రూ.6,299. బ్యాంకు కార్డులతో ఆర్డర్ చేయడంద్వారా రూ.వెయ్యి తగ్గింపుతో రూ.5,999కే పొందొచ్చు. 2GB రామ్, 64జీబీ స్టోరేజీ మోడల్‌ వేరియంట్ ధర రూ.6,999. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.7,999. A2+ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64GB స్టోరేజీతో ఒకే మోడల్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.8,499. అమెజాన్, Mi వెబ్‌సైట్ తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ రంగుల్లో లభిస్తాయి. ICICI బ్యాంకు కార్డులను ఉపయోగించి A2 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఫోన్లకు రెండు సంవత్సరాల వారంటీ ఉంది. రెడ్ మీ A2, Redmi A2+ స్మార్ట్‌ఫోన్లు ఒకే విధమైన ఫీచర్లతో వచ్చాయి. 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగివున్నాయి. ఇది 400 నిట్‌ల బ్రైట్‌నెస్ తో ఉంది. 120Hz టచ్ శాంప్లింగ్ రేటుతో ఎల్ సీడీ డిస్‌ప్లే ఉంది. Media Tek Hello G36 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. వీటిని 7GB వరకు పెంచుకోవచ్చు. కంపెనీ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్‌ను అందించింది. 4G LTE నెట్‌వర్క్ లను సపోర్ట్ చేసే డ్యూయల్ సిమ్ పోర్ట్ ఉంది. A2+ స్మార్ట్‌ఫోన్‌కి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఇచ్చారు. A2లో ఈ ఫీచర్ లేదు. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, QVGA కెమెరాతో AI సపోర్ట్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉంది. మైక్రో USB పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.

హిట్లర్ ను పొగిడి డెలాయిట్‌ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు !


డెలాయిట్‌ కంపెనీలో రిస్క్ అడ్వైజరీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నీరభ్ మెహ్రోత్రా, ప్రపంచాన్ని వణికించిన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ చేసిన అరాచకాలకు జర్మన్లు నేటికి సిగ్గు పడుతుంటారు. అలాంటి వ్యక్తిని తన హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి ఉద్యోగం పొగొట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం నీరభ్‌ 'ఫ్రైడే ఇన్స్పిరేషన్‌' అనే కొటేషన్‌ తో నియంత అడాల్ఫ్‌ హిట‍్లర్‌ను పొగిడాడు. హిట్లర్‌ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. ''తాజాగా నేను 'ది డార్క్‌ చార్మ్‌ ఆఫ్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌' అను బుక్‌ కొన్నాను. ఆ బుక్‌ చదువుతున్న కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపించింది. అది చదివాక హిట్లర్‌ గురించి, వరల్డ్‌ వార్‌ II నేపథ్యం గురించి నాకు సరైన అవగాహన వచ్చింది. అంతేకాదు మనం అడాల్ఫ్‌ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని ఆకళింపు చేసుకోవాలి. ఈ పుస్తకం చదివాక నేను హిట్లర్ అభిమానిగా మారిపోయా.. '' అంటూ అతడు లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అతడు చేసిన ఈ ఘనకార్యంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. 'హిట్లర్ ఓ నియంత.. ఏమాత్రం జాలి, దయ అనేవి లేకుండా.. ఎందరినో అన్యాయంగా హత మార్చిన అతడు నీకు నచ్చాడా..; అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున​ నీరభ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నీరభ్‌ తన తప్పు సరిదిద్దుకుంటూ.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పోస్ట్‌ వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. ఆపై పోస్టును డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో డెలాయిట్‌ కంపెనీ నీరభ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాక అతడి చేసిన పోస్ట్‌కు తమకు ఏం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు డెలాయిట్‌ సంస్థ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ''గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా సంస్థ భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు. నీరభ్ అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు'' అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ఎలక్ట్రిక్‌ కార్లతో పర్యావరణ ముప్పు ?


ఇటీవల రోడ్లపై ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ) కనిపిస్తున్నాయి. నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, పెట్రోలుతో పనిలేకుండా ఎంచక్కా ఇంట్లోనే చార్జింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉండడం, ఎంత దూరమైనా చవగ్గా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో అందరూ వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా ఈవీలపై అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ప్రముఖ వాహన తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే కాన్పూరు ఐఐటీ మాత్రం విస్తుపోయే విషయాలను వెల్లడిస్తూ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. సంప్రదాయ, హైబ్రిడ్‌ కార్లతో పోలిస్తే ఈవీలు ఎంతమాత్రమూ ఎకో ఫ్రెండ్లీ కాదని అధ్యయనం తేల్చి చెప్పింది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్‌ కార్లతో పోల్చి చూసినప్పుడు 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూరుకు చెందిన ఇంజిన్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ పేర్కొన్నది. కిలోమీటరు చొప్పున విశ్లేషించినప్పుడు ఈవీల కొనుగోలు, ఇన్సూరెన్స్‌, నిర్వహణ వంటివి 15 నుంచి 60 శాతం ఎక్కువని స్పష్టం చేసింది. ఈవీల కంటే సంప్రదాయ, హైబ్రిడ్‌ కార్లే పర్యావరణ అనుకూలమని పేర్కొన్నది. ఓ జపాన్‌ సంస్థతో కలిసి ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ అవినాష్‌ అగర్వాల్‌ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వాహనాల్లోని బ్యాటరీలను చార్జింగ్‌ చేసేందుకు విద్యుత్‌ అవసరమని, ప్రస్తుతం దేశంలోని 75 శాతం విద్యుత్తు బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతున్నదని ప్రొఫెసర్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పెద్ద మొత్తంలో గాల్లోకి విడుదలవుతున్నదని తెలిపారు.

హైదరాబాద్​లో గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ దజో ఏర్పాటు


గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ దజో భారతదేశంలో తన మొదటి డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దజో గ్రూప్ సీఈఓ షే సెగేవ్ మాట్లాడుతూ రూ.200 కోట్ల ప్రారంభ పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్​లో సుమారు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ఈ సంవత్సరం చివరి నాటికి, ఉద్యోగుల సంఖ్యను వెయ్యికి పెంచుతామని, 2024 డిసెంబరు నాటికి ఉద్యోగుల సంఖ్య 2500కి పెరుగుతుందన్నారు. దజో గ్రూప్ ఐదు కేంద్రాల్లో 3,000 మంది పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 మార్కెట్లలో నంబర్​వన్​ అయిన ఈ కంపెనీ యునైటెడ్ కింగ్‌డమ్​తోపాటు ఇతర మార్కెట్‌లలో ఐపీఎల్ ప్రసార హక్కులను పొందింది. స్ట్రీమింగ్ యాప్‌తో పాటు, దజో ఇంటరాక్టివ్ యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని, వివిధ స్పోర్ట్స్​ ఈవెంట్‌లకు టిక్కెట్లు, మెర్చండైజ్ ​ కొనుగోలు చేయవచ్చని, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడవచ్చని సీఈఓ వివరించారు. దజో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సందీప్ టికు మాట్లాడుతూ హైదరాబాద్​ డెవలప్‌మెంట్ సెంటర్, యాప్ డెవలప్‌మెంట్, ఇంటరాక్టివ్ ఎక్స్​పీరియెన్సెస్​, డేటా అనలిటిక్స్​పై పోకస్​ చేస్తుందని అన్నారు. 

Wednesday, May 24, 2023

చైనాలో చాట్ జీపీటీ స్థానంలో ఎర్నీ బోట్‌ !


ప్రపంచం మొత్తం గూగుల్‌ను వాడితే, చైనా మాత్రం తమకంటూ ఓ గూగుల్‌లాంటి సెర్చ్‌ ఇంజిన్‌ను క్రియేట్‌ చేసుకుంది. దాన్నే ఇప్పుడు వాడుతోంది. అన్నింటికి ప్రత్యామ్నాయాలు సృష్టించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ విషయంలోనూ చైనా అదే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రపంచం మొత్తం వాడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ చాట్‌జీపీటీని కాదని ఓ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంది. ''ఎర్నీ బోట్‌'' పేరిట ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చైనా మొత్తం ఈ ఎర్నీ బోట్‌నే వాడుతోంది. ఈ ఎర్నీబోట్‌ చైనా ప్రజలకు ఒకరకంగా చుక్కలు చూపెడుతోంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఏ కామెంట్‌ చేయటం లేదు. దానికి తోడు అలాంటి ప్రశ్నలు అడిగిన వారిని బ్లాక్‌ చేస్తోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ రిపోర్టర్‌ '' చైనా అధ్యక్షుడు క్షీకి.. కార్టూన్‌ బొమ్మ విన్ని దీ పూనకు'' ఉన్న సంబంధం ఏంటి అని ఎర్నీని అడిగాడు. సాధారణంగా చైనా ప్రజలు తమ అధ్యక్షుడి మూతిని విన్ని దీ పూ అనే కార్టూన్‌ బొమ్మతో పోలుస్తూ ఉంటారు. ఈ ప్రశ్నకు ఎర్నీ సమాధానం చెప్పలేకపోయింది. ప్రశ్న అడిగిన వెంటనే కనెక్షన్‌ కట్‌ అయింది. ఆ రిపోర్టర్‌ '' కరోనా వైరస్‌ ఎక్కడినుంచి పుట్టుకొచ్చింది'' అని మరో ప్రశ్న అడిగాడు. ఇందుకు ఎర్నీ సమాధానం ఇస్తూ  '' కరోనా వైరస్‌ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందో తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు'' అని సమాధానం ఇచ్చింది. చైనాలోనే కరోనా పుట్టిందని అందరికీ తెలిసినా దాన్ని ఎర్నీ అంగీకరించటం లేదు. దాన్ని అలా డిజైన్‌ చేశారు. ఈ ఎర్నీ బోట్‌ కారణంగా చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దేశీయ మార్కెట్ లోకి మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్ విడుదల


దేశీయ మార్కెట్ లోకి మోటోరోలా నుంచి మోటోరోలా ఎడ్జ్‌ 40 ఫోన్  విడుదల అయింది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ ను గత నెలలోనే ఈ ఫోన్‌ను ఐరోపా, పశ్చిమ ఆసియా, లాటిన్ అమెరికా, ఏసియా పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్స్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం బేస్‌ వేరియంట్‌ను మాత్రమే భారత్ లో ప్రవేశపెట్టారు. ఇంతకుముందు వచ్చిన మోటోరోలా ఎడ్జ్‌ 30 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగానే ఈ ఎడ్జ్‌ 40 ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే దేశీయ మర్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధరను రూ. 29,999 గా కంపెనీ నిర్ణయించింది. మే 23 నుంచి ప్రీ ఆర్డర్లు మొదలు కాగా, మే 30 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కింద స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. ఎక్లిప్స్‌ బ్లాక్‌, ల్యూనార్‌ బ్లూ, నెబ్యులా గ్రీన్‌ లాంటి 3 రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తోంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ 6.5 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్ తో ఈ ఫోన్ వస్తోంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8020 5జీ ప్రాసెసర్‌ ఉంది. డ్యుయల్‌ సిమ్‌ ఆప్షన్‌తో రాగా.. e SIM ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను ఇందులో ఇస్తున్నారు. రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వెనుక భాగంలో 50 MP,ముందు 32 MP కెమెరాను ఇస్తున్నారు. 68 Wat టర్బోపవర్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తూ 4,400 mAh బ్యాటరీ ఇచ్చింది కంపెనీ. వైఫై 6, బ్లూటూత్‌ వీ 5.2, జీపీఎస్‌ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఐటీ కంపెనీల క్యాంపస్ హైరింగ్‌లో 40% కోత !


భారత ఐటీ కంపెనీలు క్యాంపస్ హైరింగ్‌ను ఏకంగా 40 శాతం తగ్గించాయి. ఆర్ధిక మందగమనం వెంటాడటంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా క్యాంపస్ హైరింగ్‌ పైనా ఆ ప్రభావం కనిపిస్తోంది. లేఆఫ్స్‌తో పాటు ఐటీలో నెలకొన్న స్ధబ్ధత కారణంగా 2024లో క్యాంపస్ హైరింగ్ మందకొడిగా ఉంటుందని రిక్రూట్‌మెంట్ కంపెనీ టీమ్‌లీజ్ డిజిటల్ పేర్కొంది. 2023లో ఐటీ కంపెనీలు 2,30,000 మందిని క్యాంపస్‌ల నుంచి రిక్రూట్ చేసుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,55,00కు పరిమితం కానుందని అంచనా వేసింది. తాము ఇప్పటికే అభ్యర్ధులకు ఇచ్చిన జాబ్ ఆఫర్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, అంందుకే తాము క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు ఈసారి వెళ్లడం లేదని విప్రో హెచ్ఆర్ చీఫ్ సౌరవ్ గోవిల్ స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే టాలెంట్ పరిస్దితి ప్రస్తుతం భిన్నంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ధిక అనిశ్చితి నేపధ్యంలో హైరింగ్ ప్రాధాన్యతలు మారాయని తెలిపారు. కాగా ఫ్రెషర్ల జాబ్ ఆఫర్ల వేతనాన్ని 50 శాతం కోత విధించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో విప్రో నిర్ణయించిన సమయంలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. 

చైనా మార్కెట్ లోఎంఐ సివీ 25న విడుదల !


దేశంలో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏ ఫోన్ తీసుకున్నా వెనక వైపు కెమెరాలు ఒకే రకంగా ఉంటున్నాయి. ఫోన్ ధరకు అనుగుణంగా డ్యుయల్, ట్రిపుల్ కెమెరాల సెటప్‌తో వస్తున్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా మాత్రం ధరను బట్టి ఒకే కెమెరాతో వస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ అయిన ఎంఐ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయబోతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంఐ సివీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ ఫోన్‌ను కంపెనీ మే 25న లాంచ్ చేస్తుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ కోనోమట్‌ గ్రే, మింట్ గ్రీన్, ఎడ్వంచర్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్ చేస్తూ ఎంఐ కంపెనీ ఈ ఫోన్ రిలీజ్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.  6.5 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 12 జీబీ+256 జీబీ వేరియంట్ లో లభిస్తుంది.  ఎంఐయూఐ 14 ద్వారా ఆండ్రాయిడ్ 13తో వర్కింగ్, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 20 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో రౌండ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 ఎంపీ+32 ఎంపీ కెమెరాలతో డ్యుయల్ ఫ్రంట్ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అయితే ఈ తాజా ఫోన్ చైనా మార్కెట్ 25న లాంచ్ చేస్తుండగా.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారో? అనే విషయం అధికారికంగా వెల్లడించలేదు.

హాట్ కేకుల్లా అమ్ముడైన లావా అగ్ని-2


లావా మొబైల్స్ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది.  తాజాగా కర్వ్డ్ డిస్ప్లే బడ్జెట్ స్మార్ట్ మొబైల్ ని కూడా తీసుకురావడం జరిగింది. లావా అగ్ని-2 అనే పేరుతో ఈ రోజున మొదటిసారి ఈ సేల్ ను తీసుకురావడం జరిగింది ఈరోజు ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సెల్ నిమిషాలలోనే ముగిసినట్టు కనిపిస్తోంది. ఎన్ని యూనిట్ సేల్ అయ్యాయి అనే విషయం మాత్రం లావా కంపెనీ అధికారికంగా తెలియజేయలేదు. లావా అగ్ని-2 స్మార్ట్ మొబైల్ ఇటీవలే ఇండియాలో కర్వ్డ్ డిస్ప్లే తో పాటు 5g ప్రాసెస్ తో ఆకర్షణీయమైన డిజైన్తో లాంచ్ కావడం జరిగింది. ఈ మొబైల్ మొదటి సెల్ మొదలైన గంట లోపే అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్ పడడం జరిగింది ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది. ఈ ట్విట్టర్ నుండి THANK YOU INDIA,WE ARE OUT OF STOCK అని తెలుపుతూ త్వరలోనే ఈ ఫోన్ స్టాక్ అందుబాటులోకి రాబోతుంది అంటూ ట్విట్టర్లో తెలియజేశారు ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త తెగ వైరల్ గా మారుతోంది.. ఈ ట్విట్కు స్పందిస్తూ ఈ మొబైల్ కొన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ స్క్రీన్ షాట్ పంచుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ మొబైల్ గురించి సేల్ ముందు నుంచి మంచి హైప్ ఏర్పడింది.అందుకు కారణం ఈ మొబైల్ రూ.20 వేల లోపు ఉండడంతో పాటు కర్వ్డ్ డిస్ ప్, 50 mp వాడి కెమెరా సిస్టం తో పాటు లేటెస్ట్ ప్రాసెస్ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి తదితర ఫీచర్స్ ఉండడంతో పాటు ఫోన్ పాడైతే కొత్త మొబైల్ ఇస్తానన్నడంతో ఈ మొబైల్ కి మంచి హైప్ ఏర్పడింది.

Popular Posts