Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, July 31, 2023

ఫోన్ ను ఛార్జింగ్ చేయడానికి సేఫ్టీ రూల్ !


ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతే వినియోగదారులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫోన్ పాతగా అవుతున్నా కొద్దీ బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫోన్ బ్యాటరీని కాపాడుకోవచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే.. బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టడం మన చుట్టూ చూస్తుంటాం. ఇంకా చాలా మంది ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచిన కొద్దిసేపటికే మళ్లీ బయటకు తీస్తూ ఉంటారు. మీరు ఫోన్‌ను తరచుగా ఛార్జింగ్ చేస్తూ ఉండడం ద్వారా.. ఫోన్ యొక్క బ్యాటరీ కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజుకు ఫోను ను ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలో అన్న విషయాన్ని వివరిస్తున్నాం. బ్యాటరీ 20% లేదా అంతకంటే ఎక్కువ పడిపోవడాన్ని అనుమతించవద్దు. మరియు బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ అవడాన్ని నివారించండి. బ్యాటరీ స్థాయి 80% నుంచి 100% మధ్య ఉన్నప్పుడు అన్‌ప్లగ్ చేయండి. మీ ఫోన్‌ను ఎక్కువసేపు 100% బ్యాటరీ స్థాయిలో ఉంచకండి. ఈ నేపథ్యంలో నిపుణులు 20-80 నియమాన్ని పాటించాలని సిఫార్సు చేస్తారు. 20 అంటే బ్యాటరీ 20% వరకు ఖాళీ అయినప్పుడు, దానిని ఛార్జింగ్‌లో ఉంచాలి. మరియు 80 అంటే 80% ఉన్నప్పుడు ఛార్జింగ్‌ను తీసివేయడం సరైనది. అంటే, మీ ఫోన్ రోజుకు రెండుసార్లు 20%కి చేరుకుంటే, మీరు దానిని రెండుసార్లు మాత్రమే ఛార్జింగ్‌లో ఉంచాలి. మీ ఫోన్ బ్యాటరీ 20% ఉన్నప్పుడు మాత్రమే ఫోన్‌లో 'తక్కువ బ్యాటరీ' అనే హెచ్చరిక వస్తుందని మీరు గమనించండి. అంటే అంతకు ముందు ఫోన్‌ని సౌకర్యవంతంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు 45-75 నియమాన్ని కూడా అనుసరించవచ్చు. https://t.me/offerbazaramzon

యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ మూడు నెలలు ఉచితం


యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రస్తుతం ఎక్కువ మూడు నెలల కాలం పాటు ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సభ్యత్వం యాడ్స్ ఫ్రీ కంటెంట్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. నెలకు రూ. 139 లేదా 3 నెలలకు రూ. 399కి బదులుగా వినియోగదారులు ఇప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. ఈ ఆఫర్ వ్యవధి ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. ఈ ఉచిత సభ్యత్వాన్ని కొన్ని సాధారణ దశల్లో క్లెయిమ్ చేయవచ్చు. యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని కొనుగలు చేయని వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్‌ను క్లెయిమ్ చేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేసి.. మీ ప్రొఫైల్ ఐకాన్ నొక్కాలి. ఆ తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకోండి. ఫ్రీ 3-నెలల ఆఫర్‌ను ఎంచుకుని, ఆపై 3-నెలల ఉచిత నెలవారీ సభ్యత్వాన్ని ఎంచుకోండి. మీ బ్యాంక్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి. మీరు యూట్యూబ్  ప్రీమియంను 3 నెలల పాటు ఉచితంగా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత, మీరు నెలకు రూ. 129 చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీలను నివారించడానికి.. ఆఫర్ గడువు ముగిసే కొన్ని రోజుల ముందు వినియోగదారులు సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. యూట్యూబ్ ప్రీమియం అకౌంట్.. మార్కెట్‌లోని కొన్ని ఇతర ఆడియో స్ట్రీమింగ్ యాప్‌ల కన్నా మెరుగైన ఆప్షన్ అని చెప్పవచ్చు. పూర్తిగా యూజర్ పొందే ప్రయోజనాల కారణంగా వినియోగదారులు YouTube Music యాప్‌ని ఉచితంగా ఉపయోగించడమే కాకుండా YouTube యాప్‌లో యాడ్స్ ఫ్రీ వీడియోలను కూడా చూడవచ్చు. YouTube మ్యూజిక్ యాప్ పాటలను డౌన్‌లోడ్ చేసేందుకు వీడియోలను చూడవచ్చు. అంతేకాదు.. సాహిత్యాన్ని, ఇతర ఫీచర్లను అందించడానికి అనుమతిస్తుంది. ప్రాథమికంగా 80 మిలియన్ల కన్నా ఎక్కువ అధికారిక పాటలు, ఇతర కంటెంట్‌కు అన్‌లిమిటెడ్, యాడ్స్ రహిత యాక్సెస్‌ను పొందవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ (PiP)కి కూడా సపోర్టు ఇస్తుంది. యాప్‌ను మూసివేసిన తర్వాత లేదా ఫోన్‌లో ఏదైనా చేస్తున్నప్పుడు కూడా యూట్యూబ్‌లో కంటెంట్‌ను చూడవచ్చు. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర భారత్‌లో నెలకు రూ.129కు అందిస్తుంది. https://t.me/offerbazaramzon


ఫ్లిప్ కార్ట్ లోఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్


ఫ్లిప్ కార్ట్ లో ఫింగర్ త్రీ ప్రీమియం ఎం 19 టీడబ్ల్యూఎస్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి MRP రూ. 6,888. వీటిని సేల్ లో కేవలం 500 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌పై 92% తగ్గింపు లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లపై ఇతర ఆఫర్‌లు ఏవీ అందుబాటులో లేవు. దీని వలన మీరు నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఇయర్ బడ్స్ 10 మీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అలాగే బ్యాటరీ లైఫ్ 12 గంటలు. ఈ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఫోన్‌తో సులభంగా కనెక్ట్ అవుతాయి. ఈ హెడ్‌ఫోన్‌లు మాగ్నెటిక్ ఇండక్షన్ ఛార్జింగ్ బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 13 ఎంఎం డ్రైవర్లు ఉంటాయి. ఫీచర్లలో బ్లూటూత్ 5.0 వైర్‌లెస్, ఛార్జింగ్ డిస్‌ప్లేలు కూడా ఉన్నాయి. https://t.me/offerbazaramzon


అమెజాన్ డీల్ ఆఫ్ ది డే లో షియోమీ టీవీ పై డిస్కౌంట్ ఆఫర్ !


మెజాన్ డీల్ ఆఫ్ ది డే లో షియోమీ 43 అంగుళాల X సిరీస్ 4K అల్ట్రా స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV (L43M7-A2IN) మోడల్‌ను ఆఫర్ ధరకు కొనుగోలు చేయవచ్చు. గతంలో ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.42,999 గా ఉండేది. అమెజాన్ ప్రస్తుతం ఈ షియోమీ 43 అంగుళాల X సిరీస్ 4K అల్ట్రా స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV మోడల్‌పై 37 శాతం తగ్గింపును అందిస్తోంది.ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీని రూ.26,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.  ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి మరింత తక్కువ ధరకు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. షియోమీ 43 అంగుళాల X సిరీస్ 4K అల్ట్రా స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV 3840 x 2160 పిక్సెల్‌లు, 4K అల్ట్రా HD సపోర్ట్, 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్‌లపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ Xiaomi 4K స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ A55 CPU ప్రాసెసర్‌తో అమర్చబడింది. అలాగే ఈ టీవీలో యాప్‌లను సజావుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ TV 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ షియోమీ 43 అంగుళాల X సిరీస్ 4K అల్ట్రా స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV కూడా 2GB RAM మరియు 16GB నిల్వను కలిగి ఉంది. కాబట్టి మీరు ఈ స్మార్ట్ టీవీలో చాలా యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ షియోమీ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్ కాస్ట్ సపోర్ట్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ టీవీ లో ప్రైమ్ వీడియో , నెట్ ఫ్లిక్, డిస్నీ+ హాట్ స్టార్, ఆపిల్ టీవీ మరియు యూట్యూబ్ తో సహా పలు రకాల యాప్‌లతో వస్తుంది. ఈ స్టైలిష్ స్మార్ట్ టీవీ మోడల్ మెటల్ బెజెల్ లెస్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది.  బ్లూటూత్ 5.0, Wi-Fi, ఆప్టికల్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB పోర్ట్, HDMI పోర్ట్ వంటి అనేక కనెక్టివిటీ సపోర్ట్‌లు ఉన్నాయి. అలాగే, ఈ టీవీలో డాల్బీ ఆడియో, TDS Virtue: X, TDS-HD సపోర్ట్‌తో 30 వాట్స్ స్పీకర్‌లు ఉన్నాయి. https://t.me/offerbazaramzon

పిల్లల కోసం బోట్ వండరర్‌ స్మార్ట్ వాచ్‌ !


పిల్లల కోసం ప్రత్యేకంగా బోట్ వండరర్‌ పేరుతో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం బోట్ ఓ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.4 హెచ్‌డీ డిస్‌ప్లేనును అందించారు. చిన్నారులకు స్క్రీన్‌ స్పష్టంగా కనిపించేందుకు గాను క్రిస్టల్‌ క్లియర్‌ విజువల్స్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ 4జీ సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా డిజైన్‌ చేశారు. ఈ వాచ్‌ను వాటర్‌ ప్రూఫ్‌గా అందించారు. సిమ్‌ సపోర్ట్ ఉన్న కారణంగా ఈ వాచ్‌కు నేరుగా వీడియో కాల్ చేసుకోవచ్చు. దీంతో మీ పిల్లలు ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. అందుకోసం ఇందులో 2 మెగాపిక్సెల్‌ కెమెరాను కూడా ఇచ్చారు. అలాగే మీ చిన్నారులు ఎక్కడున్నారో లొకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చు. కేవలం వీడియో కాల్‌ మాత్రమే కాకుండా ఆడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఇందులోని ఎస్‌ఓఎస్‌ కాలింగ్‌ ఆప్షన్‌తో పవర్‌ బటన్‌ను రెండు స్లారు లాంగ్‌ ప్రెస్‌ చేస్తే చాలు వెంటనే ఎంపిక చేసుకున్న నెంబర్‌కు ఫోన్‌ కాల్‌ వెళ్తుంది. ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ వాచ్‌ పేరెంట్స్‌ కంట్రోల్‌తో పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్‌ను కనెక్ట్‌ చేయడం ద్వారా ఈ వాచ్‌ను పెద్దలే కంట్రోల్‌ చేసుకోవచ్చు. అవసరం లేని సమయంలో వాచ్‌ పనిచేయకుండా ఫోన్‌ ద్వారానే చేయొచ్చు. ఇక మీ పిల్లలు మీ కాలనీ దాటి బయటకు వెళ్లిన వెంటనే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అలర్ట్‌ వచ్చేలా సెట్‌ చేసుకునే ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. వాయిస్‌ చాట్‌, ఫొటోస్‌తో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్‌ అసలు రూ. 15,999కాగా ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌లో భాగంగా రూ. 5999కి లభిస్తోంది. https://t.me/offerbazaramzon

అమెజాన్ డీల్ ఆఫ్ ది డేలో వన్ ప్లస్ టీవీ పై రూ.7500 డిస్కౌంట్ !


మెజాన్ డీల్ ఆఫ్ ది డే ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా వన్ ప్లస్ స్మార్ట్ టీవీ తక్కువ ధరకు వచ్చేస్తుంది. ఈ 32 అంగుళాల వన్ ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర గతంలో రూ.19,999 గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీకి 38 శాతం వరకు తగ్గింపును ప్రకటించారు. దీనిలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అన్ని ఇంటర్నెట్ ఆధారిత సేవలను పొందవచ్చు. 8కే కావడంతో పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది ఫ్లాట్ స్క్రీన్ డిజైన్, రెడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులతో రావడం ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకత. 20 వాట్స్ డాల్బీ ఆడియో సౌండ్ తో సౌండ్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం దీని ధర డిస్కౌంట్ తో రూ. 12,499 గా ఉంది. ఈ 32 అంగుళాల వన్ ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 64 బిట్ శక్తివంతమైన ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా, వన్ ప్లస్ సంస్థ ఈ వన్ ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ సాఫ్ట్‌వేర్‌పై ఎక్కువ శ్రద్ధ చూపింది. ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్‌తో సహా వివిధ ఫీచర్లను ఉపయోగించవచ్చు. ఈ టీవీలో గామా పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఉండటం కూడా గమనించదగ్గ విషయం. ఈ వన్ ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మోడల్‌లో డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు TDS HD సపోర్ట్‌తో 20 వాట్ స్పీకర్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ స్మార్ట్ టీవీ అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్‌తో సహా పలు యాప్‌లను ఈ టీవీలో ఉపయోగించవచ్చు. ఈ 32 అంగుళాల వన్ ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 1GB RAM మరియు 8GB నిల్వతో వస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ టీవీలో నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చు.బ్లూటూత్, ఈథర్నెట్, Wi-Fi, HDMI పోర్ట్, USB పోర్ట్‌తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తక్కువ ధరకే వస్తుంది. https://t.me/offerbazaramzon

Sunday, July 30, 2023

నిర్దిష్ట సమాచారం కోరుకునే వారికి బార్డ్ సరైన వేదిక కాదు !


పెన్ఏఐ క్రియేషన్ చాట్‌జీపీటీకి దీటుగా ఏఐ టూల్ బార్డ్‌ను సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఈ చాట్‌బాట్ సెర్చికి ప్రత్యామ్నాయంగా, గూగుల్ సమాచారానికి నూతన మార్గంగా బార్డ్ చాట్‌బాట్ పురోగతి సాధిస్తుందని అందరూ భావించారు. ఇంటరాక్టివ్ ఏఐ టూల్‌గా బార్డ్ ఇంకా చాలా మెరుగుపడాల్సిన పరిస్ధితి కాగా, బార్డ్ కొన్ని సార్లు తప్పుడు సమాధానాలు కూడా ఇస్తుందని స్వయంగా తన హోంపేజ్‌లోనే డిస్‌క్లెయిమర్ ఇచ్చారు. ఇక గూగుల్ యూకే బాస్ లేటెస్ట్‌గా బార్డ్‌ను నమ్మలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితమైన సమాచారం అందించే గూగుల్ సెర్చి ఇంజన్‌ను ఉపయోగించాలని తాము యూజర్లను ప్రోత్సహిస్తామని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూగుల్ బ్రిటన్ ఎండీ డెబీ వీన్‌స్టీన్ స్పష్టం చేశారు. నిర్ధిష్ట సమాచారం కోరుకునే వారికి బార్డ్ సరైన వేదిక కాదని ఆమె తేల్చిచెప్పారు. బార్డ్ రెస్పాన్స్‌లు నమ్మదగినవి కావని ఇంతకుముందు పలువురు గూగుల్ ఉద్యోగులు సైతం పేర్కొన్నారు. బార్డ్ పోటీలో నిలిచేందుకు నాసిరకం నాణ్యతా ప్రమాణాలతో కూడిన సమాచారాన్ని చేరవేస్తుందని ఈ ఏడాది ఏప్రిల్‌లో 18 మంది ప్రస్తుత, మాజీ గూగుల్ ఉద్యోగులు పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. https://t.me/offerbazaramzon

ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా జీ13 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా తగ్గింపు !


ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా కంపెనీకి చెందిన జీ13 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 4 వేల తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉండొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ13 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,999గా ఉండేది. ఇప్పుడు రూ. 9,999కే కొనొచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఫోన్ ను బట్టి రూ. 8850 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 6.5 ఇంచుల స్క్రీన్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, హీలియో జీ85 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండొచ్చు. అందువల్ల కొత్త ఫోన్ కొనే వారు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు తక్కువ ఈఎంఐతో కూడా ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 352 నుంచి ప్రారంభం అవుతోంది. 36 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 490 చెల్లించాలి. ఇంకా 18 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 624 చెల్లించాలి. ఏడాది పాటు టెన్యూర్ అయితే నెలకు రూ. 903 పడుతుంది. 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1177 పడుతుంది. 6 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 1736 చెల్లించాలి. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3400 పడుతుంది. క్రెడిట్ కార్డు ఆధారంగా ఈఎంఐ మారుతుంది. ఇంకా మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా కూడా ఈఎంఐలో మార్పు ఉంటుంది. https://t.me/offerbazaramzon

గ్రూప్​లో సభ్యులను చేర్చుకోవడం మరింత సులభం !


వాట్సాప్​ తన యూజర్ల కోసం అదిరిపోయే అప్​డేట్​ తీసుకొచ్చింది. వాట్సాప్​ గ్రూప్​ చాట్​లోనే.. కొత్త గ్రూప్​లకు పార్టిసిపెంట్స్​ను చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తూ అప్​డేట్ తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ ఫీచర్​ ఒక షార్ట్​కట్​గా పనిచేస్తుంది. కనుక యూజర్లు తమ కొత్త గ్రూప్​లో సభ్యులను చాలా సులభంగా, వేగంగా చేర్చుకోవచ్చు. బీటాఇన్ఫో ప్రకారం, ప్రస్తుతం గ్రూప్​ చాట్​లో ఒక కొత్త బ్యానర్​ కనిపిస్తుంది. ఇది వాట్సాప్ కొత్త​ గ్రూప్​లో చేరేందుకు ఇతరులను ఆహ్వానిస్తుంది. దీని వల్ల గ్రూప్​ చాట్​ అనుమతించినంత మేరకు, వాట్సాప్​ గ్రూప్​లో కొత్త వ్యక్తులను చాలా సులభంగా, వేగంగా చేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ నయా ఫీచర్​ వాట్సాప్ బీటా ఐవోఎస్​​ 23.15.1.77 వెర్షన్​లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కొంత మంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్​.. త్వరలో అందరు వాట్సాప్​ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో తెలిపింది. వాట్సాప్​ ఈ సరికొత్త ఫీచర్​ వల్ల వాట్సాప్​ గ్రూప్​లోని సభ్యులు  నేరుగా ఇతరులను తమ గ్రూప్​లో చేర్చుకోవచ్చు. ఇందుకోసం గ్రూప్ ఇన్ఫోను తెరవాల్సిన అవసరం కూడా ఉండదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ లేటెస్ట్ వాట్సాప్​​ ఫీచర్ ఒక రిమైండర్​లా కూడా పనిచేస్తుంది.​ గ్రూప్​ల్లోకి కొత్త సభ్యులను చేర్చుకునే విషయాన్ని యూజర్లకు గుర్తు చేస్తుంది. https://t.me/offerbazaramzon

డెడ్ శాటిలైట్‌ కూల్చివేత !


ప్రపంచ చరిత్రలో తొలిసారిగా డెడ్‌ శాటిలైట్‌ను భూమిపైకి తెచ్చి కూల్చివేశారు. ఏయోలస్ అనే 1,360 కిలోల బరువున్న వాతావరణ పర్యవేక్షణ అంతరిక్ష నౌకను 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. ఇటీవల ఈ మిషన్‌ కాలపరిమితి ముగిసింది. దీంతో డెడ్‌ అయిన ఈ శాటిలైట్‌ 200 మైళ్లు (సుమారు 320 కిలోమీటర్ల ) ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతోంది. అయితే ఇందులో నియంత్రిత పద్ధతిలో భూమి వాతావరణంలోకి వచ్చి కూలిపోయే ఏర్పాట్లను చేయలేదు. గత కొన్ని నెలలుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఇతర సంస్థలతో కలిసి శాటిలైట్‌ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టింది. క్రమంగా ఉపగ్రహం ఎత్తు తగ్గిస్తూ 120 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకొచ్చారు. ఈ నెల 24న ఆ డెడ్‌ శాటిలైట్‌ అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలింది. https://t.me/offerbazaramzon

ఎస్‌ఓఐ రీడర్‌ గ్లాసెస్‌తో బుక్‌ లేకుండానే చదివేయొచ్చు!


వతరం పుస్తక ప్రియులకు ఐపాడ్‌, కిండిల్‌ ఈ-రీడర్‌ ఉండాల్సిందే. అయితే ఇదే తరహాలో నచ్చిన పుస్తకాన్ని వీలుని బట్టి సులభంగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి 'ఎస్‌ఓఐ రీడర్‌ గ్లాసెస్‌'. ఐ-ఇంక్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ కళ్ల జోడులోపల కిండిల్‌ తరహాలో పుస్తకాల పేజీలను చూపిస్తాయి. జూమ్‌ చేసుకుని చదువుకోవచ్చు. పెద్ద గ్యాడ్జెట్లను మోసుకెళ్లే పని లేకుండా ఎటైనా వెళ్లినప్పుడు వీటిని తీసుకెళ్తే సరి. సాధారణ సన్‌గ్లాసెస్‌ అంత బరువు ఉంటాయి. ఒకసారి చార్జింగ్‌ పెడితే 25 గంటల దాకా చదువుకోవచ్చు. soIreader.com లో ఆర్డర్‌ చేయవచ్చు. https://t.me/offerbazaramzon

ఆగస్టు 1న టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో లాంచ్ !


యోటా కొత్త 5వ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను వచ్చే ఆగస్ట్ 1న లాంచ్ చేయనుంది. SUV మొదటిసారిగా అమెరికాలో ల్యాండ్ క్రూయిజర్ పేరుతో ఆవిష్కరించనుంది. టయోటో మొదటిసారిగా ప్రాడో మోడల్ కారును ప్రవేశపెట్టనుంది. కొత్త టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను లెక్సస్ బ్రాండెడ్ మాదిరిగా లెక్సస్ GX ఫీచర్లతో రానుంది. లేటెస్ట్ అవతార్‌లో ప్రయోజనకరమైన, కఠినమైన డిజైన్‌ను అందించనుంది. ప్రాడో దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్‌లతో మెష్-టైప్ గ్రిల్‌తో వస్తుందని టయోటా ధృవీకరించింది. కిందిభాగంలో కఠినమైన స్కిడ్ ప్లేట్‌ను కలిగి ఉండనుంది. SUV ప్రొఫైల్‌లో బుచ్, స్క్వేర్డ్ డిజైన్‌ను అందించనుంది. లెక్సస్ జిఎక్స్ ప్రాడో మధ్య సారూప్యతలు ప్రధానంగా కాస్మెటిక్ మార్పులతో ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. టయోటా కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో TNGA-F ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించింది. లెక్సస్ GXకి కూడా సపోర్టు అందిస్తుంది. కంపెనీ పవర్‌ట్రెయిన్‌లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనప్పటికీ లెక్సస్ GXతో అందించిన వాటితో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 349bhpతో 3.4-లీటర్ V6, అలాగే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లు, పెట్రోల్/డీజిల్ ఇంజిన్‌లు ఉన్నాయి. AWDతో సామర్థ్యం గల ఆఫ్-రోడ్ సామర్థ్యం గల సస్పెన్షన్‌పై అందించనుంది. GX ఓవర్‌ల్యాండ్ వేరియంట్‌తో లెక్సస్ మాదిరిగానే టయోటా ప్రాడోను హై-స్పెక్ ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ వేరియంట్‌తో అందించవచ్చు. కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఉత్తర అమెరికా మార్కెట్లోకి వస్తుంది. అయితే, ల్యాండ్ క్రూయిజర్‌గా విక్రయించనుంది. ప్రాడో పైన కూర్చున్న ల్యాండ్ క్రూయిజర్ LC 300 అయితే మార్కెట్లోకి రాలేదు. ఈ బ్రాండ్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి తీసుకురానుంది. https://t.me/offerbazaramzon

Saturday, July 29, 2023

ఆండ్రాయిడ్‌లో చాట్‌జీపీటీ !


పెన్ఏఐ  పరిచయం చేసిన చాట్‌జీపీటీ తక్కువ కాలంలోనే ఇంటర్నెట్ యూజర్లకు బాగా దగ్గరయింది. అద్భుతమైన సామర్థ్యాలతో, అన్ని విషయాలపై లోతైన అవగాహనతో ఇది ఇండియాలో కూడా పాపులర్ అయింది. భారత్‌లో మరింత మందికి చేరువ అయ్యేందుకు ఈ ఏఐ చాట్‌బాట్ తాజాగా ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపంలోనూ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ యాప్ iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా రిలీజ్ అయింది. వెబ్ వెర్షన్‌లో క్వశ్చన్లు అడిగినట్లే ఈ ఆండ్రాయిడ్ యాప్‌లో కూడా వినియోగదారులు క్వారీస్ అడగవచ్చు. ఏ టాపిక్ గురించి అయినా అడిగి ఎప్పట్లాగానే రెస్పాన్స్‌లు పొందవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ యూజర్లు నిర్దిష్ట ప్రాంప్ట్‌లతో చాట్‌జీపీటీ రెస్పాన్స్‌లు కస్టమైజ్ చేసుకోవచ్చు. మునుపటి చాట్స్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం కుదరదని గమనించాలి. కాకపోతే ఈ యాప్ ఉపయోగించడానికి, నావిగేట్ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ చాట్‌జీపీటీ యాప్‌ Android 6, అంతకంటే ఎక్కువ వెర్షన్లపై రన్ అవుతున్న ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది. జులై నెలాఖరులో రిలీజ్ అయిన దీన్ని గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ ఓపెన్ చేసి, సెర్చ్ బార్‌లో "ChatGPT" అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సెర్చ్ రిజల్ట్స్‌లో ChatGPT యాప్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్‌ చేయాలి. అప్పుడు యాప్ నేమ్ ChatGPT కిందే OpenAI అని కనిపిస్తుంది. తద్వారా అది అఫీషియల్ యాప్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ జులై 21న రిలీజ్ అయింది, జులై 26న అప్‌డేట్ అయింది. ఈ వివరాలను అబౌట్ థిస్ యాప్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. అఫీషియల్ యాప్ అని నిర్ధారించుకున్న తర్వాత ChatGPT డౌన్‌లోడ్ చేసి లాంచ్ చేయాలి. సైన్-ఇన్ కావడానికి పలు రకాల మెథడ్స్ కనిపిస్తాయి. అందులో కంటిన్యూ విత్ గూగుల్ లేదా ఇతర లాగిన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ChatGPT వెబ్ వెర్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఉపయోగించిన అదే ఈమెయిల్ ఐడీతో కూడా లాగిన్ చేయవచ్చు. ఇప్పుడు క్వశ్చన్లు అడగడానికి, రెస్పాన్స్‌లు స్వీకరించడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లో చాట్‌జీపీటీని వాడటం మొదలుపెట్టొచ్చు.

ఐఫోన్‌లో యాప్ స్టోర్‌ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో "ChatGPT" అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సెర్చ్ రిజల్ట్స్‌లో అఫీషియల్ ChatGPT యాప్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడానికి పక్కనే కనిపించే "గెట్" బటన్‌పై క్లిక్ చేయాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యాక ChatGPT యాప్‌ని ఓపెన్ చేసి లాగిన్ కావాలి. అంతే, ఇప్పుడు చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయవచ్చు. https://t.me/offerbazaramzon500 ఫాలోవర్లు, 15 మిలియన్ల ఇంప్రెషన్స్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చు !


X (ట్విట్టర్) ద్వారా యాడ్స్ రెవిన్యూ ద్వారా క్రియేటర్లు డబ్బు సంపాదించడంలో సాయపడేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా (Twitter) మాదిరిగా (X) బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంది. అర్హత పొందాలంటే.. క్రియేటర్లలో X బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉండాలి. గత 3 నెలల్లో యూజర్లు తమ పోస్ట్‌లపై కనీసం 15 మిలియన్ ఇంప్రెషన్‌లు, కనీసం 500 మంది ఫాలోవర్లు ఉండాలి. అర్హత కలిగిన (X) బ్లూ, వెరిఫైడ్ ఆర్గనైజేషన్ సబ్‌స్క్రైబర్‌లందరికీ ఈ ప్రక్రియను వీలైనంత సులభతరం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రోగ్రామ్‌లో చేరిన తర్వాత మీ ఆదాయాలు 50 డాలర్లు దాటితే మీరు పేమెంట్లను స్వీకరించవచ్చు. అయినప్పటికీ, పేమెంట్ వాల్యూను లెక్కించడానికి (X) ఉపయోగించే కచ్చితమైన మెథడ్ సపోర్టు డాక్యుమెంట్లలో బహిర్గతం చేయనుంది. ట్విట్టర్ క్రియేటర్ల పేమెంట్ వివరాలను సెటప్ చేసే క్రియేటర్ల కోసం పేమెంట్లు జూలై 31 వారం నుంచి ప్రారంభమవుతాయి. సరళమైన ప్రక్రియ, అర్హత ఉన్న X బ్లూ వెరిఫైడ్ కంపెనీల సభ్యులందరూ ప్రమాణాలకు అనుగుణంగా ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు. క్రియేటర్లు స్వతంత్రంగా యాడ్స్ రెవిన్యూ షేరింగ్, క్రియేటర్ సభ్యత్వాలను సెటప్ చేయవచ్చు. వారి ఆదాయాలను స్వీకరించడానికి యూజర్లు తప్పనిసరిగా పేమెంట్ల కోసం Stripe Account కలిగి ఉండాలి. ప్రోగ్రామ్ నుంచి మినహాయించకుండా ఉండటానికి క్రియేటర్ మానిటైజేషన్ ప్రమాణాలు X నియమాలతో సహా నిబంధనలను అనుసరించడం చాలా ముఖ్యమని గమనించాలి. బిజినెస్, ఆర్థిక లేదా చట్టపరమైన కారణాల వల్ల ఎప్పుడైనా ప్రోగ్రామ్‌ను సవరించే లేదా రద్దు చేసే హక్కు ట్విట్టర్ (X)కి ఉందని గమనించడం ముఖ్యం. ముఖ్యంగా, ట్విట్టర్ ఇటీవల క్రియేటర్ల కోసం ఇలాంటి యాడ్స్ రెవిన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. వారిలో కొందరికి పేమెంట్లను అందిస్తుంది. ఇప్పుడు (X) బ్లూ మరింత మంది క్రియేటర్‌లు తమ కంటెంట్‌ను మానిటైజ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. యాడ్స్ రెవిన్యూ షేరింగ్ ప్రొగ్రామ్ జూలై 14, 2023న ప్రవేశపెట్టింది. ఎలన్ మస్క్ ప్రకటించిన ఈ ప్రొగ్రామ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. క్రియేటర్లకు గణనీయమైన ఆదాయ వనరుగా మారడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. క్రియేటర్లు తమ ట్వీట్‌లకు రిప్లయ్ ద్వారా కనిపించే యాడ్స్ నుంచి వచ్చే ఆదాయంలో 50శాతం అందుకోవచ్చు. అయితే, బ్లూ చెక్‌మార్క్ కోసం చెల్లించిన వెరిఫైడ్ యూజర్లకు ప్రోగ్రామ్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అర్హత పొందాలంటే.. క్రియేటర్‌లు గత 3 నెలల్లో తమ పోస్ట్‌లపై కనీసం 15 మిలియన్ ఇంప్రెషన్‌లను పొందాలి. కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మానిటైజేషన్ పొందవచ్చు. https://t.me/offerbazaramzon

ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించిన ఓలా !


లక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్  2021లో విడుదల చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుండి ఎస్1 వేరియంట్‌ను తొలగించి ఎస్1 ప్రోపై, ఎస్‌ 1 ఎయిర్ మోడల్స్‌ ఫోకస్‌ పెట్టనుంది. ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ లాంచింగ్‌ సందర్బంగా ఎస్1​ స్కూటర్‌ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతలేదు. అయితే పరిమిత ఉత్పత్తి సామర్థ్యం ,ఇతర వేరియంట్‌లకు అధిక డిమాండ్ కారణంగా కావచ్చని అంచనా. దీని ప్రకారం ఇకపై ఓలా పోర్ట్​ఫోలియోలో ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ప్రో మోడల్స్​ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల పరంగా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌1 ప్రొ దాదాపు ఒకే రకంగా ఉన్న కారణంగా ఎస్‌ 1 వేరియంట్‌ అమ్మకాలను నిలిపి వేసిందే మోననేది అంచనా. అలాగే రెండింటీ మధ్య పేర్లలో భిన్నం తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నారు. ఎస్‌1 వేరియంట్‌ను బుక్ చేసిన కస్టమర్‌లు ప్లాన్‌లలో మార్పు గురించి తెలియజేస్తూ కంపెనీ ఇమెయిల్‌ను పంపింది. ఈక్రమంలో వారికి మూడు ఆప్షన్‌లు ఇచ్చింది. S1 ప్రో వేరియంట్‌కి అప్‌గ్రేడ్ కావడం, 2022 చివరిలో ఎస్‌1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం లేదా వారి బుకింగ్‌ను రద్దు చేసి మనీ రీఫండ్‌ పొందడం. ఎస్‌ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ (FAME 2 సబ్సిడీతో సహా). ఓలా యాప్‌లో జనవరి 21న సాయంత్రం 6 గంటలకు తుది చెల్లింపు విండో తెరిచినప్పుడు అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న కస్టమర్‌లు రూ. 30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రానున్న ఎలక్ట్రిక్​ స్కూటర్‌ ఓల్​ ఎస్​1 ఎయిర్​ ఇప్పటికే ఉన్న కస్లమర్లకోసం ముందస్తు బుకింగ్‌లను మొదలు పెట్టింది. విండోను తెరిచిన మొదలు పెట్టిన గంటలోపు 1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించిందని సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్‌లో ప్రకటించారు. సామాన్య ప్రజానీకం ప్రజల ఈ నెల 31నుంచి సేల్‌ షురూ అవుతుంది. ఎస్‌1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయి. ఓలా ఎలక్ట్రిక్​ ఎస్​1 ఎయిర్‌ ధర రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఓలా OS4పై పని చేస్తోందట. త్వరలో సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అంతేకాదు .ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై కూడా పని చేస్తోంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరింపజేయనున్నామని భవిష్ హింట్‌ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఓలా బైకులు కూడా రంగంలోకి దిగనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.   https://t.me/offerbazaramzon

ట్విట్టర్ భవనంపై 'X' లోగో


లాన్ మస్క్ ట్విట్టర్‌ లోగోగా ఉన్న పిట్టను తొలగించి Xను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అలాగే వెబ్‌సైట్‌ను కూడా X.com మార్చారు. చట్టపరమైనటువంటి అనుమతులు తీసుకోకుండానే ఎలాన్ మస్క్ లోగో మార్పు నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పుడు మస్క్ చట్టపరమైన చిక్కులను ఎదుర్కుంటున్నాడు. నిబంధనల ప్రకారం ఒక సంస్థ లోగో కానీ దాని గుర్తును కానీ మార్చాలనుకుప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగోను మార్చేశారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్‌పై ఉన్న పిట్ట బొమ్మను కూడా తొలగించి ఎక్స్‌ లోగోను ఏర్పాటు చేశారు. దీంతో ఎలాన్ మస్క్ ‎కు చిక్కులు మొదలయ్యాయి. దీనిపై శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు విచారణకు ఆదేశించారు. వెంటనే సమాధానం చెప్పాలంటూ ట్విట్టర్ బాసుకు నోటీసులు పంపించారు. లోగో డిజైన్, భద్రతా కారణాల దృష్ట్యా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఇక మరోవైపు ట్విట్టర్‌ లోగో ఛేంజ్ చేసి ఎక్స్ పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ట్విట్టర్ లోగోగా పిట్ట బొమ్మనే కొనసాగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  https://t.me/offerbazaramzon

రూ. 799 ప్లాన్ తో 1.5 GB డేటా, 90డేస్ వ్యాలిడిటీ !


యిర్‌టెల్ రూ. 799 ప్లాన్ తో మీరు రీఛార్జ్ చేసుకున్నట్లైతే మీకు 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మీరు ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు. ఇవి కాకుండా మీరు ప్రతిరోజూ 100 SMSలను కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లో కంపెనీ మీకు రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ లో అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. ఉచిత హెలోట్యూన్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. రూ. 519 ప్లాన్ లో మీరు ప్రతిరోజూ 1.5 GB హై స్పీడ్ డేటా ప్రయోజనం పొందుతారు. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 60 రోజులు మాత్రమే. మీకు తక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కావాలంటే, మీరు ఈ ప్లాన్‌ని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon


సెమీ కండక్టర్లకు భారత్ ఎకో సిస్టమ్ చాలా అనుకూలం !


గుజరాత్ లోని గాంధీనగర్‌లో సెమీకాన్ ఇండియా-2 సదస్సులో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ మాట్లాడుతూ భారత్ లో సెమీ కండక్టర్ల తయారీకి కార్యాచరణ ప్రణాళిక ఆశావాహంగా ఉందన్నారు. వేదాంతాతో కలిసి సెమీ కండక్టర్ల తయారీకి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ జాయింట్ వెంచర్ నుంచి రూ.1,60,300 కోట్ల (19.5 బిలియన్ డాలర్లు) నిధులను ఉపసంహరించుకున్నది. కార్లు, రిఫ్రిజిరేటర్లు, మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే చిప్‌ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం మరో భాగస్వామి కోసం ఫాక్స్‌కాన్ అన్వేసిస్తుంది. భారత్‌లో సెమీ కండక్టర్ల తయారీకి తమ సంస్థ అత్యంత విశ్వసనీయమైన, నమ్మకమైన సంస్థ అని యంగ్ లియూ పేర్కొన్నారు. వేదాంతాతో జాయింట్ వెంచర్ నుంచి వైదొలిగిన తర్వాత.. సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ కోసం దరఖాస్తు సమర్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఫాక్స్ కాన్ తెలిపింది. తమతో కలిసి వచ్చే భాగస్వాముల కోసం చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. https://t.me/offerbazaramzon

Friday, July 28, 2023

వాట్సాప్ లో 60 సెకండ్ ఫీచర్ !


వాట్సాప్‌లో షార్ట్ వీడియో మెసేజ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ పేరుకు సూచించినట్లుగా, ఇది చిన్న వీడియోలను తక్షణ మెసెజ్ లుగా పంపడంలో మీకు ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఇంతకుముందు వాట్సాప్ వినియోగదారులు ఆడియో లేదా టెక్స్ట్ మెసెజ్ లను మాత్రమే ప్రత్యుత్తరాలుగా పంపేవారు. కానీ ఇక నుండి  చిన్న వీడియోలను రికార్డ్ చేసి వాటిని టెక్స్ట్ సందేశాలకు ప్రత్యుత్తరాలుగా పంపవచ్చు. ఈ కొత్త ఫీచర్ తో  రిప్లైగా 60 సెకన్ల వరకు రియల్ టైమ్ వీడియో మెసెజ్ ను పంపవచ్చు. వాట్సాప్‌లోని ఇతర మెసెజ్ ల మాదిరిగానే,ఈ చిన్న వీడియో మెసెజ్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్) సందేశాలుగా ఉంటుందని వాట్సాప్ కంపెనీ తెలిపింది. దీనర్థం మీరు పంపే వ్యక్తికి తప్ప ఎవరూ (వాట్సాప్ కూడా) చిన్న వీడియో సందేశాన్ని చూడలేరు లేదా యాక్సెస్ చేయలేరు. ఈ చిన్న వీడియో సందేశ ఫీచర్  రోల్ అవుట్ ఇప్పటికే ప్రారంభించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారులందరికీ వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తుందనడంలో సందేహం లేదు.  చిన్న వీడియో సందేశాన్ని పంపడం వాయిస్ సందేశాన్ని పంపినంత సులభం. వీడియో మోడ్‌కి మారడం ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు దానిని ఎక్కువసేపు నొక్కి ఉంచండి; అప్పుడు మీరు దానిని ప్రత్యుత్తరంగా పంపవచ్చు. అంతే! వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు స్వైప్ చేయడం ద్వారా మీరు రికార్డ్ చేస్తున్న వీడియోను లాక్ చేసే ఎంపికను కూడా పొందుతారు. దీనర్థం లాక్ ఫీచర్‌ని షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్‌లో అలాగే వాయిస్ రికార్డింగ్ మెసేజ్‌లో యాక్సెస్ చేయవచ్చు; ఇది లాంగ్ ప్రెస్ లేదా హోల్డ్ యొక్క పనిని తగ్గించే సదుపాయం ఉంది. https://t.me/offerbazaramzon


రికార్డు స్థాయిలో 25 లక్షల యూనిట్లు తయారు చేసిన రెనో-నిస్సాన్‌ !


చెన్నైలో 600 ఎకరాల్లో ప్లాంటు కలిగిన వాహన తయారీ సంస్థ రెనో-నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా 25 లక్షల యూనిట్ల తయారీ పూర్తి చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి విదేశాలకూ కార్లు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా 108 ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు కార్లు విదేశీ గడ్డపై అడుగు పెట్టాయి. 13 ఏళ్లుగా ఈ కేంద్రం ద్వారా రెనో, నిస్సాన్‌ బ్రాండ్లలో సుమారు 20 మోడళ్లు భారత మార్కెట్లో ప్రవేశించాయి. https://t.me/offerbazaramzon

ఆగస్టు 5 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ !


మెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే.. ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చునని సేల్ టీజర్ పేజీ వెల్లడించింది. అమెజాన్ అనేక ఆఫర్లకు ఎలక్ట్రానిక్స్‌ను అందించనుంది. Samsung, OnePlus, Realme మరిన్ని వంటి వివిధ బ్రాండ్‌ల నుంచి అనేక ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్లను అందించనుంది. మీరు ల్యాప్‌టాప్ లేదా కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కొనాలనుకునే వారైతే.. మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌లపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అమెజాన్ టీజర్ పేజీ పేర్కొంది. ఆపిల్, ఇతర కంపెనీల టాబ్లెట్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ల్యాప్‌టాప్‌లు రూ. 40వేల వరకు డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 75 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ ఆఫర్‌లలో ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఈవెంట్‌లో స్మార్ట్ టీవీలు కూడా విక్రయించనుంది. కొన్ని 4K టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర అప్లియన్సెస్ కూడా డిస్కౌంట్ ధరలకు విక్రయించనుంది. గేమింగ్ పరంగా, సోనీ ప్లేస్టేషన్ 5, ఇతర ప్రొడక్టులపై కూడా డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ వాటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందజేస్తుందని పేర్కొంది. గేమ్‌లు కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌తో విక్రయించనుంది. తక్కువ ధరకు విక్రయించే ప్రొడక్టుల కచ్చితమైన ధరను అమెజాన్ ఇప్పటివరకు వెల్లడించలేదు. కానీ, వచ్చే వారం నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో కనిపించే అత్యుత్తమ డీల్‌లను అందిస్తోంది. https://t.me/offerbazaramzon

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్‌8 !


ధ్యప్రదేశ్ కు సంబందించిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్‌8ని విడుదల చేసింది. అంబియర్ ఎన్‌8 లోని బ్యాటరీ రెండు నుంచి నాలుగు గంటల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవడంతో పాటు సింగిల్‌ చార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. యాంబియర్ ఎన్‌8 1500-వాట్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఎనిగ్మా ప్రకారం ఈ స్కూటర్ 200 కిలోల లోడ్ కెపాసిటీని కలిగి ఉంది. అదనంగా, స్కూటర్ 26-లీటర్ బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.. ఇది కంపెనీ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది.. ఈ ప్రత్యేక యాంబియర్ ఎన్8 ధర మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ప్రారంభ ధర రూ. 1,05,000 నుంచి రూ. 1,10,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఎన్‌8 థండర్‌స్టార్మ్ ఐదు రంగులలో లభిస్తుంది - గ్రే, వైట్, బ్లూ, మ్యాట్ బ్లాక్, సిల్వర్ కలర్లో లభిస్తున్నాయి.. ఈ స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌ పై 200 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని, దీంతో కొద్ది దూరాలకే చార్జింగ్‌ సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.. మార్కెట్ లోకి వచ్చిన వెంటనే వీటికి డిమాండ్ కూడా పెరిగింది. https://t.me/offerbazaramzon

నాయిస్‌ నుంచి లూనా స్మార్ట్ రింగ్ !


టెక్నాలజీ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ముఖ్యంగా టెక్‌ గ్యాడ్జెట్స్‌లో రోజుకో కొత్త ప్రొడక్ట్‌ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు స్మార్ట్ వాచ్‌ల ట్రెండ్ బాగా నడించింది. మార్కెట్లో రకరకాల వాచ్‌లు సందడి చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు స్మార్ట్ రింగ్‌ల హడావుడి మొదలైంది. వేలుకు రింగ్ పెట్టుకుంటే చాలు మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఫోన్‌లో రికార్డ్‌ చేసుకోవచ్చు. మొన్నటి మొన్న బోట్ తొలి స్మార్ట్ రింగ్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో టెక్‌ దిగ్గజం నాయిస్‌ కూడా స్మార్ట్ రింగ్‌ను తీసుకొచ్చింది. లూనా పేరుతో ఈ స్మార్ట్ రింగ్‌ను లాంచ్‌ చేశారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్‌కు సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్‌ను కంపెనీ ప్రారంభంచింది. కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా రూ. 2000 చెల్లించి రింగ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. కొనుగోలు సమయంలో రూ. 1000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ రింగ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను అందించారు. టైటానియం బాడీతో డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌ రింగ్‌ 3 మిమీ మందంతో వస్తుంది. ఇక ఈ రింగ్‌ బాడీ టెంపరేచర్‌ను ఎప్పటికప్పడు ట్రాకింగ్ చేస్తుంది. దీంతో పాటు ఎస్‌పీఓ2, స్లీపింగ్ ట్రాకింగ్‌, నాయిస్‌ ఫిట్ యాప్‌కు కనెక్ట్ చేసుకొని యాక్టివిటీ రికార్డ్‌లు, హెల్త్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్లూటూత్ లో-ఎనర్జీ (BLE 5) ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్‌ ఐఓఎస్‌ 14, ఆండ్రాయిడ్‌ 6 అంతకంటే ఎక్కువ వెర్షన్‌ డివైజలకు కనెక్ట్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. https://t.me/offerbazaramzon

దేశీయ మార్కెట్లోకి త్వరలో రానున్న ఒప్పో ఏ78 4జీ !


దేశీయ మార్కెట్లో ఒప్పో ఏ78 4జీ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. గత జనవరిలో ఒప్పో ఏ78 5జీ ఫోన్ రూ.18,999లకే మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో ఏ78 4జీ ఫోన్ ధర రూ.18 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండొచ్చునని వార్తలొస్తున్నాయి. ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రావచ్చు. ఇంతకుముందు ఇండోనేషియాలో బ్లాక్ మిస్ట్, సీ గ్రీన్ కలర్స్‌లో 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ఆవిష్కరించారు. 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080 x2400 పిక్సెల్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుందని భావిస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్, 8 జీబీ రామ్ (వర్చువల్‌గా 16 జీబీ వరకు పొడిగించవచ్చు) విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్‌తో డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఒప్పో ఏ78 4జీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది. వై-ఫై, బ్లూ టూత్ 5.3, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. https://t.me/offerbazaramzon

Thursday, July 27, 2023

వాట్సాప్ లో రీడిజైన్డ్ సెర్చ్ బార్ ?


వాట్సాప్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా అప్‌డేట్ 2.23.16.5లో రీడిజైన్డ్‌ సెర్చ్ బార్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. లేటెస్ట్ బీటా వెర్షన్ ఇన్‌స్టాల్‌ చేసుకున్న కొందరు వాట్సాప్ యూజర్లకు కొత్త సెర్చ్ బార్ అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాలను ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది. మెటీరియల్ డిజైన్ 3 మార్గదర్శకాలను అనుసరించి ఈ సెర్చ్ బార్‌ను వాట్సాప్ రీడిజైన్ చేసినట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ కొత్త సెర్చ్ బార్ లుక్‌ స్క్రీన్‌షాట్ కూడా పంచుకుంది. అందులో ఈ రీడిజైన్డ్‌ సెర్చ్ బార్ చాలా ఆకర్షణీయంగా, యూజర్ ఫ్రెండ్లీగా కనిపించింది. ఈ అప్‌డేటెడ్ డిజైన్ సెట్టింగ్స్‌, మెసేజ్ కన్వర్జేషన్స్ వంటి వివిధ సెక్షన్లలోని సెర్చ్ బార్‌లతో సహా యాప్ అంతటా ఒకేలా మారిందని వెల్లడించింది. మెయిన్ సెర్చ్ బార్ మాత్రమే కాకుండా మిగతా సెర్చ్ బార్లు కూడా చేంజ్ అయ్యాయి. వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ 2.23.16.5లో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్ కూడా అందుబాటులోకి వచ్చింది. కొంతమంది లక్కీ బీటా టెస్టర్లకు రీడిజైన్డ్‌ సెర్చ్ బార్‌తో సహా టాప్ యాప్ బార్‌లోని ఐటెమ్స్‌ కొత్త వైట్ కలర్‌లో కనిపించాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే వారికి ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. తదుపరి వారాల్లో ఇది క్రమంగా మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. https://t.me/offerbazaramzon

జియో ఫైబర్ నుంచి రూ.398కే నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ !


జియో ఫైబర్ యూజర్ల కోసం స్పెషల్ మాన్‌సూన్ ప్లాన్ ఆఫర్‌ తీసుకొచ్చింది. రూ.398కే ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. దేశీయ టెలికం రంగంలో తిరుగులేని రిలయన్స్‌ జియో తమ జియో ఫైబర్  సర్వీసు ద్వారా నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ తీసుకొచ్చింది.  ఈ కొత్త జియోఫైబర్ టీవీ ప్లాన్ ద్వారా వర్షాకాలంలోనూ అంతరాయం లేని కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. జియో ఫైబర్ నాన్‌స్టాప్ ప్లాన్ ద్వారా 750కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను అందిస్తుంది. Amazon Prime, Netflix, Disney Hot Star, Zee5, SunNxt, SonyLiv సహా 14 మోస్ట్ పాపులర్ ప్రీమియం OTT కంటెంట్ అందించే ప్లాట్‌ఫారమ్‌లకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌లు నచ్చిన టీవీ షోలు, మూవీలను నాన్‌స్టాప్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు అన్‌లిమిటెడ్ డేటాతో కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ ప్లాన్, స్ట్రీమింగ్, బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఇంకా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచిత ల్యాండ్‌లైన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. కాల్ ఛార్జీల విషయంలోనూ వినియోగదారులు ఎలాంటి రాజీపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. ఈ మాన్‌సూన్ ఆఫర్‌ ద్వారా కస్టమర్‌లు ఫ్రీగా 4K సెట్-టాప్ బాక్స్‌తో పాటు రూ.10వేల విలువైన ఫ్రీ గిగారూటర్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. అదనంగా, జియో ఫైబర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కస్టమర్‌లకు జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, జీరో డిపాజిట్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ స్పెషల్ ప్లాన్ ఆఫర్ పొందాలంటే జియోఫైబర్ యూజర్లు 6 నెలలకు అడ్వాన్స్ రీఛార్జ్‌ ఎంచుకోవాలి. https://t.me/offerbazaramzon


యాడ్స్‌పై నెలకు 1,000 డాలర్లు ఖర్చు చేస్తేనే గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ !


ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే ఎలన్ మస్క్ ఉన్నాడు. ట్విట్టర్‌కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏ మార్గాన్ని కూడా అసలు వదలుకోవడం లేదు. రెండు నెలల క్రితమే తన ప్రకటనదారులు చాలా మంది ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చారని మస్క్ వెల్లడించారు. అన్ని ఆందోళనకరమైన విషయాలను పరిష్కరించినట్టు మస్క్ చెప్పాడు. ట్విట్టర్ కొత్త సీఈఓగా మార్కెట్‌లో అగ్ర అడ్వర్టైజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ అయిన లిండా యాకారినోను నియమించుకున్న సంగతి తెలిసిందే. మస్క్ హయాంలో ట్విట్టర్ ప్రకటనల వ్యాపారం భారీగా దెబ్బతింది. ఇప్పుడు యాడ్స్ బిజినెస్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు మస్క్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇటీవలి నివేదికల ప్రకారం ట్విట్టర్ యాడ్స్ కోసం నెలకు కనీసం 1,000 డాలర్లు (రూ. 81వేలు) ఖర్చు చేయాల్సిందిగా బ్రాండ్ అకౌంట్లను మస్క్ ప్రలోభపెట్టాలని భావిస్తున్నాడు. లేదంటే బ్రాండ్ ట్విట్టర్ అకౌంట్లలో గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం ట్విట్టర్ ప్లాట్‌ఫారం ఆగస్ట్ 7 నుంచి ప్రకటనల వ్యాపారాభివృద్ధికి కనీసం 60 రోజుల్లో యాడ్స్ కోసం 1,000 డాలర్లు (దాదాపు రూ. 81వేలు) లేదా 180 రోజుల్లో 6వేల డాలర్లు (రూ. 800.9 లక్షలు) ఖర్చు చేయకపోతే గోల్డ్ చెక్‌మార్క్‌ను తొలగిస్తుంది. దీనికి సంబంధించి ఇమెయిల్ ద్వారా ట్విట్టర్ పలు బ్రాండ్‌లకు తెలియజేస్తోంది. ట్విట్టర్ కొత్త రీబ్రాండ్ (X) లోగోకు మార్చిన సందర్భంగా కొన్ని యాడ్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. బ్రాండ్ అకౌంటుదారులు తమ గోల్డ్ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్‌లో ఉంచడానికి ఇప్పటికే నెలవారీ 1,000 డాలర్లు చెల్లించాలి. ఈ ఏడాది జనవరిలోనే కొత్త ట్విట్టర్ వెరిఫికేషన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. https://t.me/offerbazaramzon

యూజర్లకు 72.5 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించనున్న ఫేస్‌బుక్ !


యూజర్ల డేటాను అమ్ముకున్న ఫేస్‌బుక్ పాప పరిహారం చెల్లించుకుంటోంది. అమెరికాలోని తన యూజర్లకు 72.5 కోట్ల డాలర్ల (రూ. 5940 కోట్లు) పరిహారాన్ని చెల్లిస్తామని తెలిపింది. మే 24, 2002 నుంచి డిసెంబర్ 22, 2022 మధ్య అకౌంటు తెరిచిన వారికే డబ్బులివ్వనుంది. అమెరికాకు చెందిన ప్రతి యూజర్‌ కూడా పరిహారానికి అర్హులే. అయితే ఒక్కొక్కరికి ఎంత సొమ్ము వస్తుందో స్పష్టంగా తెలియడం లేదు. యూజర్లు ఈ ఏడాది ఆగస్టు 25 లోపు దరఖాస్తు చేసుకోవాలి. యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తూ వాడి డేటాను అమ్ముకున్న కేసులో ఫేస్‌బుక్ మాతృసంస్థకు అమెరికా కోర్టు అక్షింతలు వేయడం తెలిసిందేవ. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేమ్ బ్రిడ్జ్ అనలైటికా సంస్థ.. 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కొనుక్కుంది. ఆ డేటాను ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. ఎన్నికల్లో ట్రంప్ గెలిచాడు. యూజర్ల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి సొమ్ము పంపిణీ చేస్తారు. ఫేస్‌బుక్ తన తప్పులకు పరిహారం ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు. ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మెటాకు చాలాసార్లు జరిమానాలు పడ్డాయి. ఈ ఏడాది మేలో యూరోపియన్ డేటా నిబంధనలను తుంగలో తొక్కిన కేసులో 130 కోట్ల డాలర్ల జరిమానా పడింది. ఐర్లాండ్ డేటా ప్రొటెకషన్ కమిషన్ ఈ జరిమానా విధించింది. https://t.me/offerbazaramzon

అమెజాన్ లో రూ.5వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు !


మెజాన్ లేటెస్ట్ ఆఫర్లలో అతి తక్కువ ధరకు లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ నోకియా, మైక్రోమ్యాక్స్, ఇతర కంపెనీల ఎంట్రీ లెవల్ ఫోన్లను ఈ పోర్టల్‌లో రూ.5వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. నోకియా 2.1 (బ్లూ-కాపర్) స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,350కే కొనుగోలు చేయవచ్చు. దీంట్లోని 8MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 5.5-అంగుళాల టచ్‌స్క్రీన్‌, ఆండ్రాయిడ్ v8 ఓరియో, 1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌, 1GB RAM, 8GB ఇంటర్నల్ మెమరీ (128GB వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు), డ్యుయల్ 4G సిమ్, 4000mAH లిథియం అయాన్ బ్యాటరీ, ఒక సంవత్సరం వారంటీ.. వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ యావరేజ్ యూజర్‌కు సరిపోతాయి. మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్  స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.3,999కే లిస్ట్ అయింది. పూర్తిగా ఇండియాలో తయారైన ఈ స్మార్ట్‌ఫోన్, ఒక ఆల్ ఇన్ వన్ సూపర్ డివైజ్‌గా పనిచేసే ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఈ ఫోన్‌తో ఇంటర్నెట్ లేకుండానే టాస్క్‌లు మేనేజ్ చేసుకోవచ్చు. 4 అంగుళాల WVGA డిస్‌ప్లే, 5MP వెనుక కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.  Itel A23S మరో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అమెజాన్ ఈ డివైజ్‌ను రూ.4,690కే అందిస్తోంది. 2GB RAM, 32GB ROM, స్మార్ట్ పవర్ సేవింగ్ మోడ్‌తో వచ్చే 3020mAh పవర్‌ఫుల్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ డివైజ్ 12.7cm (5) బ్రైట్ డిస్‌ప్లే వస్తుంది. స్మార్ట్ ఫేస్ అన్‌లాక్, ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్), 15 లాంగ్వేజెస్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం. యూజర్లు 100 రోజులలోపు వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ ఫెసిలిటీ కూడా పొందవచ్చు.  ఐకాల్ జడ్1 4G (IKALL Z1 4G) స్మార్ట్‌ఫోన్ రూ.4,799 ధరకే లభిస్తోంది. ఈ ఫీచర్ ఫోన్ 5.5 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ డిస్‌ప్లేతో వస్తుంది. డివైజ్ 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3GB RAM, 64GB వరకు ఎక్స్‌టెండ్ చేసుకోగలిగే 32GB స్టోరేజ్, డ్యుయల్ సిమ్ 4G VoLTE, ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 8MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా.. వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఒక సంవత్సరం మొబైల్ వారంటీ, యాక్సెసరీస్‌పై 6 నెలల వారంటీని అందిస్తుంది. ఐటెల్ A60s స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,499. ఈ డివైజ్ 4GB RAM, 64GB ROM కెపాసిటీతో లాంచ్ అయింది. మెమరీ ఫ్యూజన్‌తో ర్యామ్ కెపాసిటీని 8GB వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండే 8MP AI రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాలు మంచి పోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలవు. 6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ వంటి స్పెసిఫికేషన్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. https://t.me/offerbazaramzon

ఫ్లిప్‌కార్ట్ లో టీసీఎల్ పీ635పై ధమాకా ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్ లో 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై ఏకంగా రూ. 75 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎలాంటి బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్స్ లేకుండానే. ఫ్లిప్‌కార్ట్‌లో టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ గూగుల్ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 1,24,990లు. అయితే ఈ టీవీని రూ. 49,990కే కైవసం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌టీవీపై 60 శాతం డిస్కౌంట్ ఉంది. అదే సమయంలో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే.. రూ. 1000 అదనపు తగ్గింపు వస్తుంది. అప్పుడు మీరు టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీని రూ. 48,990కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ. 16,900 వరకు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్ ఉంది. ఈ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ద్వారా మీరు ఈ స్మార్ట్‌టీవీని మరింత తక్కువ ధరకు కొనొచ్చు. ఈ టీవీలో బెజిల్ లెస్ డిస్‌ప్లే, డాల్బే ఆడియో, ఓకే గూగుల్, హెచ్‌డీఆర్ 10 వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి జీ5 వరకు చాలా యాప్స్ ఇందులో చూడొచ్చు. టీసీఎల్ పీ635 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీ థియేటర్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. https://t.me/offerbazaramzon

Wednesday, July 26, 2023

ఏఐతో కొలువుల కోత తప్పదన్నసామ్ ఆల్ట్‌మన్‌ !


చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఏఐ టూల్స్‌పై బాంబు పేల్చారు. వీటిపై కఠిన నియంత్రణలు అవసరమని పలు వేదికలపై వెల్లడించిన సామ్ లేటెస్ట్‌గా ఏఐతో కొలువుల కోత తప్పదని మరోసారి తేల్చిచెప్పారు. చాట్‌జీపీటీ సమాధానాల్నింటినీ తాను అంగీకరించనని భారత్ పర్యటన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ది అట్లాంటిక్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏఐ టూల్స్ కొన్ని ఉద్యోగాలకు ఎసరు పెడతాయని పేర్కొన్నారు. ఏఐపై పనిచేస్తున్న ఎంతోమంది రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీతో మనిషికి మేలు జరుగుతుందని చెప్పినా అది పూర్తిగా నిజం కాదని చెప్పారు. ఏఐ మనుషులకు సప్లిమెంట్ మాత్రమేనని, దీని ద్వారా ఎలాంటి ఉద్యోగాలు రీప్లేస్ కావని నమ్మడం సరైంది కాదని తేల్చిచెప్పారు. న్యూ టెక్నాలజీతో ఉద్యోగాలు కచ్చితంగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. చాట్‌జీపీటీ కంటే మరింత శక్తివంతమైన టూల్‌ను ఓపెన్ఏఐ క్రియేట్ చేస్తుందని కానీ అంతటి సాంకేతిక ముందడుగుని ప్రజలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండబోరని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ ఫలితాలు ఊహించేందుకు కూడా మనస్కరించవని ఆల్ట్‌మన్ అన్నారు. భవిష్యత్తులో శక్తివంతమైన కొత్త మేధస్సు మానవులతో సహజీవనం చేయవచ్చని, చాట్‌జీపీటీ అనేది దీనికి ముందస్తు సంకేతమనే ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రజలకు సమయం పడుతుందని ది అట్లాంటిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్ చెప్పుకొచ్చారు. https://t.me/offerbazaramzon

రిలయన్స్‌ జియో భారత్ వీ2 ఫోన్‌ !


భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్‌ జియో బ్రాండ్‌ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్‌ వీ2 ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్‌ ఇదే. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్‌ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్‌ జియో 'జియో భారత్‌' ఫోన్‌ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్‌ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్‌పీ పారిబాస్‌ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్‌లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్‌, 1000mAh రిమూవబుల్‌ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్‌ యాప్ జియో సావన్‌, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి కార్బన్‌ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్‌లను రిలయన్స్‌ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్‌ జియోతో జత కలిసే అవకాశం ఉంది. https://t.me/offerbazaramzon

స్వాలంబన దిశలో దేశీయ మిస్సైల్‌ రంగం !


భారత రక్షణ పరిశోధక విభాగం డీఆర్డీవో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ప్రస్తుతం హైపర్ సోనిక్ వెఫన్స్ కావాలంటే రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ లేకుండా డీఆర్డీవో ఒక అద్భుతమైన హైపర్ సోనిక్ వెపన్ ను కనిపెట్టింది. సెకన్ కు 2 కిలోమీటర్ల దూరం నిమిషానికి 120 కిలోమీటర్ల దూరంతో పని చేసేలా ప్రయత్నాన్ని మొదలెట్టింది. తక్కువ ఖర్చుతో, స్వదేశీ శక్తితో దీన్ని తయారు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం కూడా ఒకే చెప్పేసింది. భారత దేశం డీఆర్డీవో సంస్థ అద్భుతమైన కాన్పెస్ట్ తో దీన్ని తయారు చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం కూడా ఒకే చెప్పేసింది. అయితే హైపర్ సోనిక్ మిస్సైల్ అనేది భారత అమ్ముల పొదిలో విలువైన అస్త్రం. ఎందుకంటే వేగంగా అభివృద్ది చెంది ఆర్థికంగా బలవంతమైన దేశాల్లో ఆ ఆయుధాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం భారత్ కూడాా వాటి సరసన చేరింది. దేశ వ్యాప్తంగా గతంలో ఆయుధాలను ఎక్కువగా వివిధ దేశాల నుంచి కొనుగోలు చేసుకునేవాళ్లం. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలతో కొని వాటి కోసం కొన్ని వందల కోట్ల రూపాయలను వెచ్చించే వాళ్లం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. స్వదేశీ వస్తువుల తయారీ ఎలానో ప్రస్తుతం సొంత నాలెడ్జ్ తోనే మిస్సైల్స్ కూడా తయారు చేసుకుంటున్నాం. ముఖ్యంగా దీని వల్ల ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యమైనవి మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు ఆయుధాలు కొనుగోలు చేసే ఇండియా ఇప్పుడు ఆయుధాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఆఫ్రికా దేశాలకు తక్కువ ధరకు అమ్ముతోంది. https://t.me/offerbazaramzon

లెనోవో డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ విడుదల


లెనోవో యోగో బుక్ 9i ల్యాప్‌టాప్ ను హాంగ్‌కాంగ్-హెడ్‌క్వార్టర్డ్ కంపెనీ లేటెస్ట్ డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ 13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో రిలీజ్ చేసింది. 2.8K రిజల్యూషన్‌తో 13.3-అంగుళాల OLED టచ్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. లెనోవో యోగా బుక్ 9i ఇంటెల్ Evo ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుంది. డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. Wi-Fi 6E, థండర్‌బోల్ట్ 4తో సహా లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లతో వచ్చింది. ఫోలియో స్టాండ్, సపరేటు బ్లూటూత్ కీబోర్డ్ వంటి విభిన్న అప్లియన్సెస్‌తో వస్తుంది. యోగా బుక్ 9i నాలుగు-సెల్ 80Whr బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. దేశీయ మార్కెట్లో లెనోవో యోగోబుక్ 9i ప్రారంభ ధర రూ. 2,24,999గా ఉంది. ల్యాప్‌టాప్ టైడల్ టీల్ షేడ్‌లో వస్తుంది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. లెనోవో రూ. 10వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. అలాగే, కొనుగోలుదారులు రూ. 10వేల వరకు ప్రొడక్టు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. కొత్త మోడల్‌తో పాత ల్యాప్‌టాప్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. లెనోవో యోగాబుక్ 9i మోడల్ CES 2023 సమయంలో 2,099.99 డాలర్లు (దాదాపు రూ. 1,75,000) ప్రారంభ ధరతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇందులో రెండు OLED డిస్ప్లేలు సెంట్రల్ కీలుతో వచ్చాయి. ఈ ఫోల్డబుల్ స్క్రీన్ 5 వేళ్ల కదలికతో ఏకకాలంలో మల్టీ టాస్క్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ Windows 11లో రన్ అవుతుంది. 60Hz రిఫ్రెష్ రేట్, HDR సర్టిఫికేషన్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో రెండు 13.3-అంగుళాల 2.8K OLED ప్యూర్‌సైట్ డిస్‌ప్లేలను కలిగి ఉంది. DCI-P3 కలర్ గామెట్, 16:10 అస్పెక్ట్ రేషియో 100 శాతం కవరేజీతో డిస్ప్లేలు, ల్యాప్‌టాప్, టాబ్లెట్ మోడ్‌ల మధ్య మారడానికి యూజర్లను అనుమతించే ఫోలియో స్టాండ్‌తో వచ్చాయి. 13వ Gen Intel కోర్ i7 ప్రాసెసర్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ Intel Iris Xe గ్రాఫిక్స్‌తో రన్ అవుతుంది. 16GB వరకు LPDDR5x RAMని ప్యాక్ చేస్తుంది. 1TB వరకు PCIe SSD స్టోరేజీని పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు 2W స్పీకర్లు, రెండు 1W బోవర్‌లు, డాల్బీ అట్మోస్ ఆడియోతో విల్కిన్స్ స్పీకర్‌లు ఉన్నాయి. ఇంకా, ల్యాప్‌టాప్ ప్రైవసీ షట్టర్‌తో ఫుల్-HD IR RGB వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. డ్యూయల్ స్క్రీన్ వినియోగంతో గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఒకే డిస్‌ప్లేను ఉపయోగిస్తే.. గరిష్టంగా 14 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. https://t.me/offerbazaramzon


ఫ్లిప్ కార్ట్ లో 10 వేలకే పోకో ఎం4 !


జూలై నెల క్లోజింగ్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ ను ప్రకటించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ జూలై 25 నుండి మొదలయ్యింది. జూలై 30 వ తారీఖు అర్ధరాత్రి కి క్లోజ్ అవుతుంది. ఈ సేల్ నెల చివరి సేల్ నుండి ఫ్లిప్ కార్ట్  5G మొబైల్ అఫర్ ను అందించింది. లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేల బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ మంచి అవకాశం అవుతుంది. ఫ్లిప్ కార్ట్ పోకో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ గా పేరొందిన POCO M4 5G ను భారీ డిస్కౌంట్ తో కేవలం బేసిక్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరలో అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ నిన్న మొన్నటి వరకూ కూడా రూ. 11,999 ధరతో సేల్ అయ్యేది. ఈ ఫోన్ ను అతి తక్కువ EMI తో కూడా కొనుగోలు చేసే వీలుంది. Flipkart నుండి M4 5G స్మార్ట్ ఫోన్ ను ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కేవలం రూ. 539 రూపాయల అతి తక్కువ EMI మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే, డెబిట్ కార్డ్ లేదా Flipkart EMI తో కూడా ఈ ఫోన్ ను కొనుగోలు చెయవచ్చు. ఈ ఫోన్ యొక్క ప్రధాన ఫీచర్లు క్రింద చూడవచ్చు. POCO M4 5G స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లనే కలిగి ఉందని చెప్పాలి. ఈ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. అంటే, OTT నుండి FHD రిజల్యూషన్ తో మీరు కంటెంట్ ను అనందించవచ్చు. ఈ ఫోన్ Dimensity 700 5G ప్రోసెసర్ తో వస్తుంది మరియు 4GB ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఇది 7 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా అక్కటుకుంటుంది మరియు 50MP డ్యూయల్ కెమేరాతో మంచి ఫోటోలను కూడా అందించ గలదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం దొరుకుతున్న అఫర్ ధరలో ఇది బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ అఫర్ గా మాత్రం ఉంటుంది. https://t.me/offerbazaramzon

త్వరలో దేశీయ మార్కెట్ లోకి ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్‌


దేశీయ మార్కెట్ లోకి ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్‌ ను విడుదల చెయ్యనున్నారు. ఆ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల అవ్వక ముందే డిమాండ్ కూడా భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  వచ్చే నెల మధ్యలో ఈ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌లో తీసుకురానున్నారు. అయితే ఈ ఫోన్‌లో ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రటన రాలేకపోయినప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న కథనాల ప్రకారం కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి. 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు..ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్లో మీడియా టెక్‌ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. 66 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ అందించనున్నారు..ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ధర విషయానికొస్తే రూ. 25 నుంచి రూ. 30 వేల వరకు ధర ఉంటుందని అంచనా.  https://t.me/offerbazaramzon

Tuesday, July 25, 2023

త్వరలో 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం' !


'ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం' అనే సర్వీస్‌ను  ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్ త్వరలో లాంచ్‌ చేయనుంది. ప్రస్తుతం ఉన్న 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్'తో పోలిస్తే, దీనితో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ పేరును చూసి, ఈ సేవల కోసం సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం అందిస్తున్న కస్టమర్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రామ్‌ 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌'కి ఎక్స్‌టెన్షన్‌గా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం సర్వీస్‌ రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీని బెనిఫిట్స్‌, ఫీచర్‌లు ఇంకా పూర్తిగా తెలియలేదు. కంపెనీ కస్టమర్లను కొత్త సర్వీస్‌ రిలీజ్‌ ప్రకటనతో సర్‌ప్రైజ్‌ చేసింది. దాదాపు రెండు వారాల్లోనే ఈ కొత్త ప్రోగ్రామ్‌కి సంబంధించిన అన్ని వివరాలు కస్టమర్లకు తెలిసే అవకాశం ఉంది.  ఫ్రీ షిప్పింగ్, యాక్సలరేటెడ్‌ సూపర్‌కాయిన్స్‌ ఎర్నింగ్స్‌, డీల్స్‌కి ఎర్లీ యాక్సెస్‌, ప్రయారిటీ కస్టమర్‌ సపోర్ట్‌ సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్లాట్‌ఫామ్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.100తో, ప్లస్ మెంబర్స్ నాలుగు సూపర్‌కాయిన్స్ అందుకుంటారు. తరచుగా కొనుగోళ్లు చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే రాబోయే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియంతో, వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా మరింత మెరుగైన షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ పొందవచ్చని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియంను లాంచ్‌ చేసే పనులతో పాటు 'ఇండిపెండెన్స్ డే సేల్‌'ను తీసుకొచ్చే పనుల్లో ఉంది. ఈ సేల్ ఈవెంట్ కోసం దేశవ్యాప్తంగా షాపర్‌లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సేల్ భారీ డిస్కౌంట్‌లు, అద్భుతమైన డీల్స్‌ ఆఫర్‌ చేస్తుంది. ఇండిపెండెన్స్ డే సేల్ గురించి ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ, కొత్త ప్లస్ ప్రీమియం మెంబర్‌షిప్ లాంచ్ ఈ సేల్ పీరియడ్‌తో పాటు వచ్చే అవకాశం ఉంది.  https://t.me/offerbazaramzon

సైబాల్ నుంచి స్మార్ట్ వాచీలు !


ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ స్కైబాల్ స్మార్ట్ వాచ్ కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టించాలని స్కైబాల్ ప్రణాళిక చేస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏకంగా ఐదు కొత్త స్మార్ట్‌వాచ్ మోడల్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్కైబాల్ ప్రకటించింది. వీటిలో రెండు మోడళ్లు స్కైఫిట్ ఎలివేట్, స్కైఫిట్ రిగర్ లను ఈ ఏడాది ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. స్కైబాల్ స్మార్ట్‌వాచ్‌లను సరికొత్త డిజైన్ లో, అత్యుత్తమ పనితీరు కలిగినవిగా తీర్చిదిద్దుతున్నట్లు స్కైబాల్ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందిస్తున్నట్లు వివరించింది. ఈ స్మార్ట్ వాచ్ లు ప్రీమియం, ఫీచర్ రిచ్ గా ఉంటాయి చెబుతోంది. అడ్వాన్స్ డ్ ఫీచర్లుంటాయని, అమోల్డ్ డిస్ ప్లే తో వైబ్రెంట్ విజువల్స్, క్లారిటీతో ఉంటాయని వివరించింది. పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ సందర్భంగా స్కైబాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గుప్తా మాట్లాడుతూ వినియోగదారుల అంచనాలకు మించి తమ ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. కస్టమర్‌ల విభిన్న అవసరాలను తీర్చడానికి స్కైఫిట్ ఎలివేట్, స్కైఫిట్ రిగర్‌లను చాలా పరిశోధనల అనంతరం రూపొందించామని పేర్కొన్నారు. స్కైబాల్ దీపావళికి ముందే మార్కెట్లో తన ఉనికిని పదిలపరుచుకునేలా ప్రణాళిక చేస్తోంది. ఆ లోపే మరో మూడు మోడళ్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది స్మార్ట్‌వాచ్ విభాగంలో 1,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ లతో పాటు ఆడియో రేంజ్ కోసం కూడా కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. పార్టీ స్పీకర్లను దీపావళి నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. https://t.me/offerbazaramzon

ల్యాప్ టాప్‌లో మల్టీ టాస్కింగ్‌ టిప్ !


నం వాడే డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో కూడా మల్టీ టాస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అలాంటప్పుడు మీ స్క్రీన్ మీకు చాలా అమూల్యమైనదిగా ఉంటుంది. స్క్రీన్ పైనే మీరు అనేక రకాల విండోలు ఓపెన్ చేసుకోవాల్సి రావొచ్చు. అలాంటప్పుడు మీకు అవసరమైన విండోను మళ్లీ ఓపెన్ చేసుకోవాలంటే దానిని వెతుక్కోవడం కష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం, కొన్ని టిప్స్ ఫాలో అవడం ద్వారా మీకు బాగా అవసరం అయిన విండోను మీరు ఎప్పుడూ పైన కనిపించే విధంగా పెట్టుకోవచ్చు. అవసరం అయిన విండోను ఎల్లప్పుడూ పైన ఉంచే సామర్థ్యంతో, ల్యాప్‌టాప్ వినియోగదారులు తమ వర్క్‌ఫ్లోలను క్రమబద్ధీకరించుకోవడం సులభం అవుతుంది. అప్లికేషన్‌లను నిరంతరం మార్చుకోకుండా అత్యంత క్లిష్టమైన పనులపై దృష్టి పెట్టగలరు. దీనిని ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు విండోస్ ఓస్ లేదా మాక్ ఓఎస్ ఏ వినియోగదారుడైన మల్టీ టాస్కింగ్ ను సులభతరం చేసే విధానం అందుబాటులో ఉంది. ఈ టెక్నిక్ ని వినియోగించి మీరు మీ ల్యాప్ టాప్ స్క్రీన్ చాలా సమర్థంగా వినియోగించుకోగలుగుతారు. విండోస్ ఓఎస్ వాడే వినియోగదారులు ఆల్వేస్ ఆన్ టాప్ విండోస్ ఫీచర్ కోసం ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ లను వినియోగించాల్సిన అవసరం లేదు. ముందుగా మీకు కావాల్సిన విండోను ఎంపిక చేసుకోవాలి. అందుకోసం ఆ విండో టైటిల్ బార్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కీ బోర్డు ను వినియోగించి “Alt” + “Spacebar” నొక్కాలి. అప్పుడు విండో మెనూ ఓపెన్ అవుతుంది. ఆ విండోను టాప్ లో ఉంచడానికి మెనూ లో నుంచి ఆల్వేస్ ఆన్ టాప్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అంతే మీకు కావాల్సిన విండో ఎప్పుడూ మీకు పైనే కనిపిస్తుంది.

విండోస్ ఓఎస్ కు ఉన్నట్లు మ్యాక్ ఓఎస్ కి బిల్ట్ ఇన్ ఆల్వేస్ ఆన్ టాప్ ఫీచర్ అందుబాటులో లేదు. దీనిని వినియోగించుకోవాలంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ ను ఇన్ స్టాల్ చేసిన తర్వాత మీ కావాల్సిన విండోను స్రీన్ పై కి డ్రాగ్ చేయాలి. అది టాప్ లో సెట్ అయ్యే వరకూ దానిని అలాగే డ్రాగ్ చేస్తూ ఉండాలి. అంతే అది అన్నింటికన్నా పైన మీకు కనిపిస్తుంది. https://t.me/offerbazaramzon

యూట్యూబ్ బ్రౌజింగ్‌లో కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌ !


స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలామంది యూట్యూబ్ వీడియోలు చూస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎడ్యుకేషనల్ వీడియోల వరకు ఇందులో వివిధ రకాల వీడియోలు ఉంటాయి. మోస్ట్ పాపులర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తున్న యూట్యూబ్, యూజర్ల అవసరాలకు తగ్గట్లు చాలా ఫీచర్లను అందిస్తుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కీబోర్డ్ షార్ట్‌కట్స్‌  కూడా అందిస్తుంది. Shift + ? ప్రెస్ చేస్తే, యూజర్లు షార్ట్‌కట్స్‌ యాక్సెస్ చేయవచ్చు. ఈ షార్ట్‌కట్స్‌తో వీడియో ప్లేబ్యాక్‌ను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.

* "K" కీ నొక్కితే యూట్యూబ్ వీడియోను పాజ్ చేయవచ్చు. అదే కీని మళ్లీ ప్రెస్ చేస్తే ప్లేబ్యాక్‌ను రెస్యూమ్ చేయవచ్చు. వీడియోలు చూస్తున్నప్పుడు కాల్స్‌ వచ్చినా లేదా అంతరాయాలు కలిగినా వీడియోను హోల్డ్ చేసి, అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టడానికి ఈ షార్ట్‌కట్ వాడవచ్చు. స్పేస్‌బార్‌పై నొక్కినా వీడియో పాజ్ అవుతుంది.

* వీడియోను 10 సెకన్ల పాటు ఫార్వర్డ్ చేయడానికి కీబోర్డ్‌లో "l" కీ ప్రెస్ చేయవచ్చు. దీనికి బదులుగా "రైట్ యారో" పై క్లిక్ చేసి 5 సెకన్స్‌ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.

* వీడియోను 10 సెకన్లు వెనక్కు తీసుకెళ్లడానికి "j" బటన్ నొక్కాలి. వీడియోలు చూస్తున్నప్పుడు రివైండ్ చేయడానికి ఈ షార్ట్‌కట్ ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి బదులుగా "లెఫ్ట్ యారో" పై క్లిక్ చేసి 5 సెకన్స్‌ రివైండ్ చేసుకోవచ్చు.

* వీడియోను మ్యూట్ చేయడానికి "m" కీని నొక్కాలి. అన్‌మ్యూట్ చేయడానికి, అదే కీపై క్లిక్ చేయాలి.

* వీడియోల ప్లేబ్యాక్ వేగాన్ని పెంచడానికి, ">" కీపై క్లిక్ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ వీడియోలను త్వరగా చూడటానికి ఈ షార్ట్‌కట్‌ వాడొచ్చు. "<" క్లిక్ చేసి, ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకోవచ్చు.

* యూట్యూబ్ గంటల కొద్దీ చూస్తున్నప్పుడు ప్లేలిస్ట్‌లో నెక్స్ట్ వీడియోకి వెళ్లడానికి Shift + N నొక్కితే సరిపోతుంది. ప్లేలిస్ట్‌ వీడియోస్ కాకుండా మామూలుగా వీడియోస్ చూస్తుంటే, నెక్స్ట్ సజెస్టెడ్ వీడియోకి వెళ్లడానికి ఈ షార్ట్‌కట్ పనికొస్తుంది.

* ప్రీవియస్ వీడియోకి తిరిగి వెళ్లడానికి కీబోర్డ్‌లో Shift + P నొక్కాలి. ప్లేలిస్ట్‌లో వీడియోను చూస్తున్నప్పుడు మాత్రమే ఈ షార్ట్‌కట్ పని చేస్తుంది.

* వీడియోలోని నిర్దిష్ట పాయింట్‌కి స్కిప్ చేయడానికి, 10% రేట్‌తో ముందుకు వెళ్లడానికి 1 - 9 మధ్య ఏదైనా కీ నొక్కవచ్చు. ఉదాహరణకు, వీడియోలోకి 80% వెళ్లడానికి 8ని నొక్కాలి. 0 బటన్ ప్రెస్ చేస్తే, వీడియోను స్టార్టింగ్ నుంచి చూడవచ్చు

* థియేటర్ మోడ్ కోసం T, ఫుల్ స్క్రీన్ కోసం F, ఫుల్‌స్క్రీన్ ఎగ్జిట్‌కి Esc, క్యాప్షన్స్‌ కోసం C బటన్స్ క్లిక్ చేయాలి.  https://t.me/offerbazaramzon

2033 నాటికి గంటకు సబ్‌ఆర్బిటాల్ విమానాలు ?


ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్‌సోనిక్ కమర్షియల్ ఎయిర్‌లైనర్ అయిన కాంకోర్డ్ కనుమరుగైన 20 సంవత్సరాల తర్వాత విమానయాన పరిశ్రమ అతివేగవంతమైన విమాన ప్రయాణ యుగంలోకి ప్రవేశించబోతోంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం , నాసా  ప్రయోగాత్మక సూపర్సోనిక్ విమానం, X-59 'సన్ ఆఫ్ కాంకోర్డ్' దాని మొదటి పరీక్షా విమానానికి సిద్ధంగా ఉంది. 2033 కల్లా ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా కేవలం రెండు గంటల్లోనే చేరుకునే స్థాయిలో అత్యాధునిక విమానసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ విమానాలు నిటారుగా గాల్లోకి ఎగిరే ఈ విమానాలు ఆకాశంలో సుమారు 125 మైళ్ల ఎత్తువరకు వెళ్లి.. మళ్లీ వేగంగా భూమ్మీద తమ గమ్యస్థానాలవైపు దిగుతాయి. ఈ క్రమంలో 3 వేల మైళ్లకు మించి గరిష్ఠ వేగాలను అందుకుంటూ ప్రయాణ సమయాన్ని అనూహ్య రీతిలో తగ్గించేస్తాయని వెల్లడించింది. నాసా ప్రస్తుతం ఈ సూపర్ సానిక్ విమానంపై ప్రయోగాలు చేస్తోంది. ఎక్స్-59 పేరుగల ఈ విమానాన్ని త్వరలో నాసా ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. కాంకార్డ్ కంటే నెమ్మదైనప్పటికీ ఈ విమానంతో న్యూయార్క్-లండన్‌ ప్రయాణ సమయాన్ని ఏకంగా 3.30 గంటల మేర తగ్గించొచ్చట. దీని గరిష్ఠ వేగం గంటకు 1500 కిలోమీటర్లు కాగా, కాంకర్డ్ అప్పట్లో ఏకంగా గంటకు 2000 కిలోమీటర్ల పైచిలుకు వేగాన్ని అందుకుంది. కాంకోర్డ్ కంటే చిన్నది, నెమ్మదిగా ఉండే X-59, గంటకు 1,500 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. న్యూయార్క్ నుండి లండన్‌కు ప్రయాణ సమయాన్ని సుమారు 3 గంటల 30 నిమిషాలు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. బ్రిటన్‌లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ  ప్రచురించిన ఇటీవలి పరిశోధన ప్రకారం, 2033 నాటికి, లండన్ నుండి సిడ్నీకి ప్రస్తుతం 22 గంటలు పట్టే విమానాన్ని కేవలం రెండు గంటలకు తగ్గించవచ్చని సూచించింది. విమానయాన రంగంలో సబ్‌ ఆర్బిటల్ ఫ్లైట్ శకం ప్రారంభం కానుందంటూ పరిశోధాత్మక కథనాన్ని ప్రచురించింది. https://t.me/offerbazaramzon

ఎయిర్‌టెల్‌ నుంచి కొత్త ప్లాన్‌ !


యిర్‌టెల్‌ తక్కువ ధరలో డేటా, అపరిమిత కాల్స్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. యాక్టివ్‌ ప్లాన్‌లోనే దీన్ని యాడ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కూడా అనుమతి లభిస్తుండటం విశేషం. రూ. 148 డేటా వోచర్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే మొత్తంగా 15 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా వినియోగానికి పరిమితులు ఉండవు. మీ రెగ్యూలర్ ప్లాన్‌ వ్యాలిడిటీ ముగిసేలోగా.. ఈ 15 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌నూ ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో సోనీలీవ్ ప్రీమియం, ఎరోస్‌ నౌ, హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లేతో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. రూ. 148 డేటా వోచర్‌తో రీఛార్జ్‌ చేసుకున్నాక ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌ ద్వారా మాత్రమే ఓటీటీలకు అనుమతి ఉంటుంది. 28 రోజుల పాటు ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంది. అయితే ఎయిర్‌టెల్‌ దీంతో పాటు రూ. 149 రీఛార్జ్‌తో ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో 1 జీబీ డేటా మాత్రమే వస్తుంది. https://t.me/offerbazaramzon

Monday, July 24, 2023

జులై 26న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ !


శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను ఈ నెల 26న నిర్వహించనుంది. ఈ సందర్భంగా వివిధ ప్రొడక్ట్స్‌ను కంపెనీ పరిచయం చేయనుంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ టీజర్‌ను శామ్‌సంగ్ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో ఫోల్డబుల్ సిరీస్ ఫోన్ల కొత్త డిజైన్‌ను రివీల్ చేసింది. కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5  మోడళ్లను ఈ మెగా ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శామ్‌సంగ్ Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే Galaxy Watch 6 సిరీస్‌ను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో కర్వ్డ్ గ్లాస్, అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ ఉండవచ్చు. కంపెనీ ఇదే ప్రోగ్రామ్‌లో Galaxy Tab S9 సిరీస్‌ను సైతం ఆవిష్కరించనుంది. అయితే వీటి ధర, స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో రావచ్చిని లీక్ అయిన డేటా సూచిస్తోంది. 7.6 అంగుళాల ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లే, 6.2 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లోతో ఫోన్ లాంచ్ కానుంది. 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరాలు ఉండే 50MP ప్రైమరీ సెన్సార్‌తో డివైజ్ రానుంది. లీక్‌ అయిన సమాచారం ప్రకారం, శామ్‌సంగ్ Z ఫ్లిప్ 5 ఫోన్ 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో, అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో ఇది మంచి పనితీరును అందించనుంది. ఈ డివైజ్ డ్యుయల్ 12 MP కెమెరా సెటప్‌తో రానుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ IP58 రేటింగ్‌తో రావచ్చని నివేదికలు పేర్కొన్నాయి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను శామ్‌సంగ్ జులై 26న నిర్వహించనుంది. భారత్‌లో ఆరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ ప్రారంభమవుతుంది. కంపెనీ మొదటిసారి తమ స్వదేశం అయిన దక్షిణ కొరియాలో ఈ ఈవెంట్‌ను నిర్వహించడం విశేషం. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది.  https://t.me/offerbazaramzon

Popular Posts