Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, July 31, 2022

ఫోన్ లేకుండా వాట్సప్ !


స్మార్ట్ ఫోన్ తో లింకప్ అయి వాట్సప్ వెబ్ వాడుకునేంతసేపు డేటా (ఇంటర్నెట్ కనెక్షన్) ఉండాలి. వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ వెర్షన్లలో కొత్త ఫీచర్ వచ్చింది. మల్టీ డివైజ్ ఫీచర్‌తో ఆన్‌లైన్‌లో లేకపోయినా మెసేజింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఫోన్ స్విచాఫ్ చేసినా, ల్యాప్‌టాప్ వెబ్ వర్షన్, డెస్క్‌టాప్ వర్షన్ లలో యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వినియోగదారులు కొన్ని సమస్యలను చూడొచ్చని గుర్తుంచుకోండి. వాట్సప్ పరిష్కారానికై కృషి చేస్తోంది. లింక్ చేయబడిన డివైజ్‌లలో WhatsAppని ఉపయోగించడానికి మీ ఫోన్ ఆన్‌లైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. మీ ఫోన్‌ను 14 రోజులకు పైగా ఉపయోగించకపోయినా లింక్ చేసిన పరికరాలు లాగౌట్ చేస్తామని వెల్లడించారు. ఫోన్ లేకుండా ల్యాప్‌టాప్ లేదా PCలో WhatsApp ఎలా ఉపయోగించాలంటే యాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయకూడదనుకుంటే మీ బ్రౌజర్‌లో WhatsApp వెబ్ అని టైప్ చేయండి. మీరు పైన WhatsApp వెబ్ లింక్‌ను పొందుతారు. దానిపై క్లిక్ చేస్తే QR కోడ్ కనిపిస్తుంది. మీ మొబైల్ > సెట్టింగ్ మెను > లింక్డ్ డివైజ్‌లు > లింక్ పరికరంలో WhatsAppని తెరవడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ నుండి ఈ QR కోడ్‌ని స్కాన్ చేయాలి. మీ WhatsApp స్క్రీన్ పైభాగంలో వ్రాసిన "స్కాన్ QR కోడ్" చూడొచ్చు. కాబట్టి, మీ ఫోన్‌ని ల్యాప్‌టాప్ స్క్రీన్ యాడ్‌పై ఉంచాలి QR కోడ్‌ని స్కాన్ చేయండి. మీ ప్రైమరీ డివైజ్ ఐఫోన్ అయితే మీరు లింక్ చేసిన డివైజ్‌లలో చాట్‌లను క్లియర్ చేయలేరు లేదా తొలగించలేరు అని WhatsApp చెబుతోంది. వారి ఫోన్‌లో చాలా పాత వెర్షన్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్న వారికి మెసేజ్ చేయడం లేదా కాల్ చేయడం కూడా కష్టమవుతుంది.


మెటీరియల్ యు రీడిజైన్‌ ?


జీమెయిల్  వెబ్ యాప్‌లో సరికొత్త డిజైన్ ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నెలలో మెటీరియల్ యు రీడిజైన్‌ను అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ జీమెయిల్ ఇంటర్‌ఫేస్ లుక్‌ను డిజైన్ లాంగ్వేజ్‌గా మార్చేసి ఒక దగ్గర నుంచే అనేక యాప్స్ యాక్సెస్ చేసేలా వీలు కల్పించింది. ఈ రీడిజైన్ లుక్ మరికొద్ది వారాల్లోనే జీమెయిల్ యూజర్లందరికీ రిలీజ్ కానుంది. కొత్త రీడిజైన్‌లో కొత్త సైడ్ ప్యానెల్ కనిపిస్తోంది. ఈ ప్యానెల్‌లో మెయిల్, చాట్, స్పేసెస్, మీట్ వంటి యాప్స్ కనిపిస్తున్నాయి. వీటిపై నొక్కడం ద్వారా ఈజీగా ఆ యాప్స్‌ యాక్సెస్ చేయొచ్చు. "ఇంటిగ్రేటెడ్ వ్యూ" అని పిలిచే వ్యూలో సైడ్ ప్యానెల్ ఐకాన్‌లపై క్లిక్ చేయడం ద్వారా యాప్‌లను యూజ్ చేసుకోవచ్చు. ఈ వ్యూ నచ్చని వారు క్విక్ మెనూలోకి వెళ్లి ఓల్డ్ వ్యూకి చేంజ్ కావొచ్చు. ఎవరైతే యూజర్లు తమ జీమెయిల్ అకౌంట్స్‌లో చాట్ యాప్ లాంచ్ చేస్తారో వారికి మాత్రమే ఇంటిగ్రేటెడ్ వ్యూ అందుబాటులో ఉంటుందని తాజాగా గూగుల్ వెల్లడించింది. గూగుల్ కొత్త ఫిల్టర్ బటన్లను కూడా తీసుకొచ్చింది. ఈ ఫిల్టర్ బటన్లు ఈ-మెయిల్స్ లిస్ట్‌ పైభాగంలో కనిపిస్తాయి. సెర్చ్ చేస్తున్నప్పుడు కావాల్సిన మెయిల్‌ను ఇన్‌బాక్స్‌లో చాలా త్వరగా కనుగొనేందుకు ఇవి ఉపయోగపడతాయి. "సెర్చ్ చిప్స్" అని పిలిచే ఈ కొత్త ఫిల్టర్లు గతంలో సెర్చ్ బార్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు సెర్చ్ బార్ పైన కనిపిస్తున్నాయి. "హ్యజ్‌ అటాచ్‌మెంట్", "ఇజ్‌ అన్‌రీడ్" వంటి ఫిల్టర్లను ఉపయోగించి కావాల్సిన వర్గానికి చెందిన మెయిల్‌లను సెర్చ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతాయి. ఇన్‌బాక్స్‌లో మరింత త్వరగా సెర్చింగ్ జరపడానికి అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ను కూడా వాడవచ్చు. మెయిల్ కోసం సెర్చ్ చేసేటప్పుడు మాత్రమే ఈ ఫిల్టర్లు పై భాగంలో చాలా చక్కగా ఒక వరుసలో కనిపిస్తాయి. తద్వారా ఎక్కువగా టైప్ చేయకుండా ఈ ఫిల్టర్ బటన్స్ ని ఎంచుకొని త్వరగా సెర్చ్ పూర్తి చేయవచ్చు. జీమెయిల్ ఇప్పుడు సందర్భానికి తగినట్లుగా చాలా మెరుగైన సెర్చ్ సజెషన్స్ కూడా ఇస్తోంది. కాంటాక్ట్స్ కోసం వెతుకుతున్నప్పుడు గూగుల్ మొదటి పేర్లు, ఈమెయిల్ అడ్రస్సులు చూపిస్తోంది. ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉంటే, Gmail లో మీరు ఎవరితో ఎక్కువ సంభాషిస్తున్నారో పరిశీలించి, వారి పేరును పైన చూపుతుంది. అలా అద్భుతంగా ఈ సెర్చ్ సజెషన్స్ అనేవి మెరుగుపడ్డాయి. ఇవన్నీ కూడా అప్‌కమింగ్ యాప్ అప్‌డేట్ల ద్వారా యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.

ఒప్పో భారీ పెట్టుబడులు


దేశంలో తాజా పెట్టుబడులపై ఒప్పో దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్‌తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది. దేశంలో 500 కోట్ల డాలర్ల వార్షిక ఎగుమతి సామర్ధ్యం చేరుకునేందుకు ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయని ఒప్పో పేర్కొంది. ఈ వ్యవధిలో 5జీ, ఏఐ వంటి నూతన శ్రేణి టెక్నాలజీలపై దృష్టి కేంద్రీకరిస్తామని, భారత్‌లో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తామని కంపెనీ తెలిపింది. కాగా రూ 4389 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలపై ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేపడుతున్న సమయంలో ఒప్పో భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించడం గమనార్హం. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఒప్పో చెబుతోంది. పలు మార్కెట్లలో మేకిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతిని ప్రోత్సహించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని ఒప్పో ఇండియా పబ్లిక్ ఎఫైర్స్ వైస్‌ప్రెసిడెంట్ వివేక్ వశిష్ట వెల్లడించారు.


సెప్టెంబర్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు లాంచ్


మారుతి సుజుకి నుంచి 2022 గ్రాండ్ విటారా కారు త్వరలో లాంచ్‌ కానుంది. ఇప్పటికే మొదలైన బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. అయితే ఇప్పుడు 2022 మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు లీక్‌ అయ్యాయి. కొత్త గ్రాండ్ విటారా ధర రూ.9.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి ఐదు మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లను, రెండు స్ట్రాంగ్‌ హైబ్రిడ్ ట్రిమ్‌లను అందిస్తుంది. కంపెనీ ఈ పండుగ సీజన్‌ ప్రారంభంలో, సెప్టెంబర్‌లో కొత్త గ్రాండ్ విటారాను అధికారికంగా లాంచ్‌ చేయనుంది. మారుతి సుజుకి మొత్తం 2022 గ్రాండ్ విటారాలో ఏడు వేరియంట్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటిని మాన్యువల్, ఆటోమేటిక్‌గా విభజించారు. సిగ్మా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ ధర రూ. 9.50 లక్షలుగా ఉంది. డెల్టా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ.11.00 లక్షలు, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ.12.50 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. జీటా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ. 12.00 లక్షలు, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ.13.50 లక్షలుగా పేర్కొంటున్నారు. ఆల్ఫా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ ధర రూ.13.50 లక్షలు, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ.15.00 లక్షలుగా ఉంది. ఆల్ఫా AWD మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ రూ 15.50 లక్షలకు అందుబాటులోకి రానుంది. జీటా ప్లస్ వేరియంట్‌ను 17.00 లక్షలు, ఆల్ఫా ప్లస్ వేరియంట్‌ను రూ.18.00 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజిన్‌ వేరియంట్‌లు- మైల్డ్, స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో వస్తుంది. రెండూ 1.5-లీటర్ యూనిట్లు, డిఫరెంట్‌ పవర్‌ను డెలివర్‌ చేస్తాయి. 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ 101 bhp, 136 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది. బలమైన హైబ్రిడ్ ఇంజిన్‌, 1.5-లీటర్ యూనిట్ కూడా 114 bhp, 122 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది, e-CVTకి పెయిర్‌ అవుతుంది. మారుతి సుజుకి కొత్త గ్రాండ్ విటారా 27.9 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది దేశంలో అత్యంత ఫ్యూయల్‌ ఎఫిసియంట్‌ SUVగా నిలిచింది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఆల్ఫా ట్రిమ్‌లో కొత్త విటారా AWD వెర్షన్‌ను మారుతి సుజుకి అందిస్తుంది. సరికొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్పోర్ట్, స్నో, ఆటో, లాక్ అనే నాలుగు మోడ్‌లతో ఆల్-గ్రిప్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ మోడ్‌లు రెండు, ఆల్-వీల్ డ్రైవ్ మోడ్‌ల మధ్య స్విచ్‌ అవుతాయి. 'లాక్' మోడ్ పర్మనెంట్‌ ఆల్-వీల్-డ్రైవ్‌ను ఎంగేజ్ చేస్తుంది. అలాగే 2022 మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కాకుండా, AWD సిస్టమ్‌ను అందించే ఏకైక SUV. ఈ సంవత్సరం చివర్లో లాంచ్‌ అయినప్పుడు.. గ్రాండ్ విటారా మార్కెట్‌లోని సెగ్మెంట్ లీడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, నిస్సాన్ కిక్స్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్‌తో పోటీపడుతుంది. ఈ రోజు వరకు, మారుతి సుజుకి కొత్త గ్రాండ్ విటారా కోసం అనేక బుకింగ్‌లు వచ్చినట్లు సమాచారం. మొదటి ఆరు రోజుల్లోనే, మారుతి సుజుకి 13,000 బుకింగ్‌లను నమోదు చేసింది. వాటిలో 50 శాతానికి పైగా బలమైన హైబ్రిడ్ జీటా, ఆల్ఫా ట్రిమ్‌ వేరియంట్‌ల కోసం ఉన్నాయి. 2022 మారుతీ సుజుకి గ్రాండ్ విటారా కోసం దక్షిణాదిలోనే 4,000 బుకింగ్‌లు నమోదయ్యాయని సోర్సెస్‌ ద్వారా తెలిసింది.

యూట్యూబ్‌ క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌ !


వీడియో రూపంలో ఏ సమాచారం కావాలన్నా వెంటనే అందరికీ గుర్తొచ్చేది యూట్యూబ్‌ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లకు డబ్బులతో పాటు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది యూట్యూబ్‌. ఈ క్రమంలోనే తాజాగా క్రియేటర్ల కోసం మరో అదిరిపోయే టూల్‌ను పరిచయం చేసింది యూట్యూబ్‌. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ టూల్ సహాయంతో యూజర్లు ఎక్కు నిడివితో ఉన్న వీడియోలను 60 సెకండ్ల షార్ట్‌ వీడియోగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా తగ్గించిన ఆ వీడియోకు టెక్ట్స్‌, ఫిల్టర్స్‌ వంటి వాటిని జోడించవచ్చు. ఈ టూల్‌తో క్రియేటర్లు తమ వీడియోలను మరింత ఆకర్షణీయంగా మార్చవచ్చు. దీంతో ఆడియన్స్‌ను పెంచుకోవచ్చని యూట్యూబ్‌ చెబుతోంది. ఎడిటింగ్‌ స్క్రీన్‌లో వీడియో సెగ్మెంట్‌ను ఎంచుకున్న తర్వాత షార్ట్స్‌ కోసం వీడియోలను యాడ్‌ చేసుకోవడం లేదా వీడియోను నేరుగా చిత్రీకరించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా షార్ట్స్ కెమెరాతో అదనపు వీడియోలను షూట్ చేసుకోవచ్చు, ఆ గ్యాలరీ నుంచి 60 సెకండ్లలోపు వీడియో పార్ట్‌ను ఎంచుకుంటే మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది. ఈ టూల్స్‌ సహాయంతో మరికొంత మంది క్రియేటర్లను యూట్యూబ్‌కు ఆకర్షించవచ్చనే ఆలోచనతో ఉంది.

చైనా రాకెట్ శకలాలు ఫిలిప్పీన్స్‌ సముద్రంలో పడ్డాయ్ !


అంతరిక్షంలో ముక్కలుగా విరిగిపోయిన చైనా లాంగ్‌మార్చ్‌-5బీ రాకెట్‌కు సంబంధించిన శకలాలు ఇవాళ ఫిలిప్పీన్స్‌లోని సముద్రంలో పడిపోయాయి. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 12.55 గంటలకు శకలాలు భూ కక్ష్య లోకి ప్రవేశించిన అనంతరం కాలిపోయాయని చైనా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. 119 డిగ్రీల తూర్పు రేఖాంశం, 9.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఈ శకకాలు పడ్డాయని వివరించింది. ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ప్రావిన్స్‌లోని ప్యూర్టో ప్రిన్సెసాలోని సముద్రంలో ఆ శకలాలు పడ్డాయి. అయితే, ఈ విషయంపై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. లాంగ్‌మార్చ్‌-5బీ రాకెట్‌ను చైనా ఈ నెల 24న ప్రయోగించింది. ఆ శకలాలు భూమి వైపునకు వేగంగా దూసుకు రావడంతో అవి ఏ సమయంలో ఎక్కడ పడతాయోనని కొన్ని రోజులుగా ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ శకకాలు ఏ దిశగా వస్తున్నాయో కూడా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అనేక విధాలుగా ప్రయత్నించారు. ఆ శకాల దిశను మార్చేందుకు కూడా సాధ్యపడలేదు. వాటి శకలాలు భూ కక్ష్య లోకి ప్రవేశించడంతో ఆందోళన మరింత పెరిగింది. వాటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల ప్రజలకు ఇవి కనపడ్డాయి. గత రాత్రి హిందూ మహాసముద్రంపై భూవాతావరణంలోకి చైనా రాకెట్‌ శకలాలు ప్రవేశించాయని అమెరికా కూడా నిర్ధారించింది. చివరకు అవి ఇవాళ ఫిలిప్పీన్స్‌లోని సముద్రంలో పడిపోయాయని చైనా ప్రకటన చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చైనా నిర్మించాలనుకుంటోన్న స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికిగాను ల్యాబరేటరీ మాడ్యూల్‌ను ఆ దేశం తరలించింది. ఇందులో భాగంగా చేస్తోన్న రాకెట్ ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. దీంతో చైనా స్పేస్‌ ఏజెన్సీ తీరుపై నాసా శాస్త్రవేత్తలు విమర్శలు చేస్తున్నారు.


Saturday, July 30, 2022

దేశీయ మార్కెట్లో పెబల్ స్మార్ట్‌వాచ్ లు విడుదల


పెబల్ మరో రెండు కొత్త స్మార్ట్‌వాచ్ లు  ఓరియన్, స్పెక్ట్రా అనే మోడళ్లను బడ్జెట్ ధరలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్ లు  బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌ను కలిగి ఉన్నాయి. పెబల్ ఓరియన్ మోడల్ Smartwatch 1.81-అంగుళాల పూర్తి-HD డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇక స్పెక్ట్రా మోడల్ 1.36-అంగుళాల AMOLED డిస్‌ప్లేను ప్యాక్ చేస్తుంది. రెండు మోడల్‌లు AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు స్పోర్ట్ SpO2 మానిటరింగ్‌, రక్తపోటు పర్యవేక్షణ, హృదయ స్పందన పర్యవేక్షణ మరియు స్త్రీలకు ఆరోగ్య ట్రాకింగ్‌ను కలిగి ఉన్నాయి. పెబల్ Orion మోడల్ స్మార్ట్ వాచ్ Smartwatchధరను రూ.3,499 గా నిర్ణయించారు. పెబల్ Spectra ధరను డిస్కౌంట్‌తో రూ.5,499 గా నిర్ణయించారు. పెబల్ Orion యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 240×286 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.81-అంగుళాల స్క్వేర్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీనికి స్క్వేర్ ఆకారంలో ఉండే జింక్ బాడీని అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్‌, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు. ఇది ఆటో స్పీకర్ క్లీనర్ ఫీచర్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా కాల్ రిజెక్షన్‌, ఫైండ్ మై ఫోన్‌, మ్యూజిక్‌, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 5.1 బ్లూటూత్ వర్షన్‌ను కలిగి ఉంది. మరోవైపు ఈ స్మార్ట్ వాచ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP67 సౌకర్యాన్ని కలిగి ఉంది. దీనికి 260mAh సామర్థ్యం గల బ్యాటరీ ని అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 10 రోజుల పాటు కంటిన్యూ వినియోగాన్ని అందిస్తుంది. AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంది. పెబల్ Spectra యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 390×390 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.36-అంగుళాల స్క్వేర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ పరిమాణం ఓరియాన్ కంటే కాస్త చిన్నగా ఉంటుంది. ఈ వాచ్ డిస్‌ప్లే ఆల్వేస్ ఆన్ మోడ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ బాడీని జింక్ అలాయ్ మెటల్‌తో తయారు చేశారు. క్రౌన్ రొటేషన్ బటన్‌ను కలిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్‌, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు. ఇది ఆటో స్పీకర్ క్లీనర్ ఫీచర్‌ను కలిగి ఉంది. కాల్ రిజెక్షన్‌, ఫైండ్ మై ఫోన్‌, మ్యూజిక్‌, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 5.1 బ్లూటూత్ వర్షన్‌ను కలిగి ఉంది. మరోవైపు ఈ స్మార్ట్ వాచ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కు సంబంధించి IP67 సౌకర్యాన్ని కలిగి ఉంది. దీనికి 300mAh సామర్థ్యం గల బ్యాటరీ ని అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 30 రోజుల పాటు కంటిన్యూ వినియోగాన్ని అందిస్తుంది. AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంది.

ఒక్క గ్లాసు నీటితో 80 సెకండ్లలో బట్టలను ఉతికే వాషింగ్ మిషన్ ?


ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసి మనుషులకి పని తగ్గించి, వాటిని వాడుతున్నారు. దానిలో ఒకటి వాషింగ్ మిషన్, ఇది కొంతకాలం నుండి దీనిని చాలామంది వాడుతున్నారు. అయితే సాధారణంగా వాషింగ్ మిషన్లు బట్టలు ఉతకాలి అంటే 100 లీటర్ల నీటి నుంచి 150 లీటర్ల వరకు నీరు పడుతుంది. అలాగే ఆరు ఏడు కేజీల బట్టలను ఉతకాలి అంటే ఒక గంట సమయం తీసుకుంటుంది. అంటే అవి బయటికి రావాలి అంటే ఒక గంట సమయం పడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక వాషింగ్ మిషను మన ముందుకు తీసుకొచ్చారు. ఆ మిషన్ 80 సెకండ్లలో ఒక గ్లాసు నీటితో బట్టలని ఉతుకుతుంది అంట !. ఇండియా స్టార్ట్ అప్ వారు వేస్టేజ్ ను అరికట్టి, కెమికల్స్ వాడకాన్ని తగ్గించే ..ఈ మిషన్ ను స్టార్ట్ అప్ కు చెందిన నితిన్ కుమార్ సలూజ , వీరేందర్ సింగ్, రాహుల్ గుప్తా తయారు చేశారు. ఈ మిషన్ ఐఎస్పి స్టీమ్ టెక్నాలజీ ద్వారా వర్క్ చేస్తుందంట. అంటే పొడి ఆవిరి రేడియో ఫ్రీక్వెన్సీ తో కూడుకున్న మైక్రోవేవ్ సామర్థ్యంతో బట్టలను క్లీన్ చేస్తుంది. అయితే ఈ మిషన్ లో బట్టలు వేయగానే ఆయానికరణ చేయని ఎలక్ట్రిక్ కిరణాలు బట్టల పై ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తాయి. అలాగే ఒక గ్లాసు నీరు, పొడి ఆవిరి రూపంలోకి మారి, బట్టల పై ఉన్న మొండి మురికిని పోగోడతాయి. ఇలా ఒక భాగం పూర్తవుతుంది ఇంకా బాగా మొండి మురికి ఉన్న బట్టలు అయితే ఎలా రెండు మూడు సార్లు వెయ్యాలి. మొండి మురికి ఉన్న బట్టలు కి అయితే పెద్ద మిషన్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు దీనికి 4 5 గ్లాసుల నీరు పడుతుంది. ఆరు కిలోల వరకు ఉతుకుతుంది. ఇలాంటి ఈ మిషను పంజాబ్లో చిత్కర యూనివర్సిటీ వారు, విద్యార్థులతో కలిసి రబుల్ గుప్తా, వీరేందర్ సింగ్, నితిన్ కుమార్ సలూజ దీనిని తయారు చేయడం జరిగింది. ఇలా 80 సెకండ్లలో ఒక గ్లాసునీటితో బట్టలు ఉతికే మిషన్ మన ముందుకి వస్తే, అది ఒక వింతే అవుతుంది.

మోటరోలా స్మార్ట్ టీవీపై 20 వేలే !


ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మోటరోలా స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. MOTOROLA Revou 2 102 cm (40 inch) Full HD LED Smart Android TV అసలు ధర రూ.30 వేలు. కాగా 33 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ టీవీని 33 శాతం డిస్కౌంట్ తో రూ.19,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఈ టీవీపై అనేక బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ కార్డుతో ఈ టీవీని కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు అందుకోవచ్చు. రూ.750 వరకు ఈ తగ్గింపు ఉంటుంది. ఇంకా వివిధ ఈఎంఐ ఆఫర్లు సైతం ఈ టీవీపై అందుబాటులో ఉన్నాయి. ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. పాత టీవీని ఎక్సేంజ్ చేయడం ద్వారా ఈ టీవీపై రూ.11 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే కేవలం రూ.8999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ టీవీ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 40 అంగుళాల డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఈ టీవీని 2022లో అంటే ఈ ఏడాదే లాంచ్ చేశారు. Netflix|Prime Video| Disney+Hotstar| Youtube యాప్ లను సైతం ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ టీవీ రిజస్ల్యూషన్ విషయానికి వస్తే Full HD 1920 x 1080 Pixels రిజల్యూషన్ ను సపోర్ట్ చేస్తుంది. రీఫ్రెష్ రేట్ 60HZ, సౌండ్ అవుట్ పుట్ 24W.

బిఎస్ఎన్ఎల్ 4G రాకతో ప్రైవేట్ టెల్కోల 5Gపై తీవ్ర ప్రభావం ?


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  ని తిరిగి అభివృద్ధి చేయడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ దేశం మొత్తం మీద 4G రోల్‌అవుట్ మరియు సైట్ అప్‌గ్రేడ్‌ల కాపెక్స్‌ను కూడా కవర్ చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ టెల్కో తన వినియోగదారులకు మరింత వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ప్రైవేట్ టెల్కోలు 5Gకి మారుతున్న సమయంలో బిఎస్ఎన్ఎల్  4Gకి ఎందుకు వెళుతోంది అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ త్వరలోనే బిఎస్ఎన్ఎల్ 5G NSAని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుండడంతో దానికి 4G కోర్ అవసరం ఎంతైనా ఉంది. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2027లో భారతదేశంలోని మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లలో 55% పైగా 4Gని కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంటే ఐదేళ్ల తరువాత కూడా ఎక్కువ మంది వినియోగదారులు 4G మొబైల్ సేవలను ఉపయోగిస్తుఉంటారు. ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌ ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. 4G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నప్పుడే టెల్కోలు అన్ని కూడా రెండు సార్లు తమ యొక్క అన్ని రకుల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్ల యొక్క ధరలను పెంచాయి. బిఎస్ఎన్ఎల్ మాత్రమే తన ప్లాన్ ల ధరలను పెంచలేదు. ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాలలో ప్రైవేట్ టెల్కోల వినియోగదారులు నెట్‌వర్క్‌ సమస్యలతో బాధపడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కి మాత్రం ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ కోసం నెట్‌వర్క్‌ సమస్యలు ఎదురుకోలేదు. 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తే కనుక ప్రస్తుత ధరలను పరిగణలోకి తీసుకుంటే కనుక ప్రతి ఒక్కరు తిరిగి బిఎస్ఎన్ఎల్ సిమ్ ని ఎంచుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పోటీదారుల కంటే తక్కువ టారిఫ్‌లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించగలదు. బిఎస్ఎన్ఎల్  పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే కొన్ని అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ ప్లాన్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉండే విలువతో మాత్రమే పెరుగుతాయి. బిఎస్ఎన్ఎల్ ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15, 2022న 4G నెట్‌వర్క్‌లను సాఫ్ట్‌గా ప్రారంభించాలని భావిస్తున్నారు. 2022 చివరి నాటికి దేశం మొత్తం మీద విస్తృతంగా ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో BSNL తన 4G నెట్‌వర్క్‌లతో దేశం మొత్తాన్ని కవర్ చేయాలని యోచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడానికి ప్రభుత్వం USOF ప్రాజెక్ట్‌ల కోసం బిఎస్ఎన్ఎల్ ని కూడా ఎంపిక చేస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఇంటి వద్ద పనిచేస్తున్న వినియోగదారులు తమ యొక్క పనిని పూర్తి చేయడం కోసం 4G నెట్‌వర్క్‌ల మీద అధికంగా ఆధారపడ్డారు. 4G నెట్‌వర్క్‌లతోనే తమ పనిని పూర్తి చేయగలిగినప్పుడు అధిక టారిఫ్‌ల వద్ద లభించే 5G నెట్‌వర్క్‌లను ఎంచుకోవడం అనేది కొద్దిగా ఆలోచించే విషయమే. దేశం మొత్తం మీద మారుమూల ప్రాంతాలలో కూడా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లు విస్తరిస్తున్నందున వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వినియోగదారులు అపరిమిత డేటాతో వాటిపై ఆధారపడవచ్చు.

వి25 సిరీస్ మొబైల్స్‌ ఆగస్టులో విడుదల ?


ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో, వివో వి25 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ల విడుదలకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు సంబంధించి ఇప్పటి వరకైతే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఈ హ్యాండ్‌సెట్ గ్రీక్ బెంచ్ మార్కింగ్ సైట్‌లో కనిపించడం విశేషం. ఈ తాజా పరిణామం ప్రకారం చూస్తుంటే.. కొత్త  వి సిరీస్ ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తోంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల విషయాన్ని పక్కన పెడితే.. లాంచ్‌కు ముందే ఇది పలు ప్లాట్‌ఫాంలలో ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలె ఆ Vivo V25 ప్రో స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ ఫొటో విడుదల చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు, టెక్ ప్రియులు కూడా ఆ మొబైల్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ Vivo V25 స్మార్ట్‌ఫోన్ 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తోంది. Geekbench లిస్టింగ్‌లో తెలిసిన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ టెస్టింగ్‌లో ఈ హ్యాండ్‌సెట్ 700 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 1,997 పాయింట్లను స్కోర్ చేసింది. ఆన్‌లైన్ లో పలు మీడియా వర్గాల నుంచి ఈ మొబైల్‌కు సంబంధించి విడుదల తేదీ లీకులు వచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ 17 లేదా ఆగస్టు 18న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు లీకుల సమాచారం. ఇది 8GB RAM కెపాసిటీ మరియు 128GB | 256GB రెండు స్టోరేజీ ఎంపికలలో వస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే భారత్‌లో ఈ మొబైల్ ధర దాదాపు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుందని అంచనా. ఇది డైమండ్ బ్లాక్‌, సన్‌రైస్ గోల్డ్ కలర్లలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ మోడల్‌కు సంబంధించి ఇటీవల లీకైన స్పెసిఫిషన్లను చూస్తే.. ఈ మొబైల్ కు 6.62 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్యధికంగా 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్‌ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరో రెండింటిలో 12 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో హై రిసోల్యూషన్ ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఛార్జ్‌ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. 44W or 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 5G ​​సపోర్ట్, Wi-Fi, USB టైప్-C పోర్ట్ సహా పలు ఫీచర్లను కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఈ కొత్త డివైజ్ OnePlus 10R మరియు Realme GT నియో 3 వంటి వాటితో పోటీపడుతుందని భావిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి నిలిపివేత !


ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సంబంధించి ఓలా స్కూటర్ల ఉత్పత్తికి బ్రేక్ వేసింది. ఇప్పటికే తమిళనాడులోని కృష్ణగిరి ప్రొడక్షన్ ప్లాంట్‌లో 4 వేల స్కూటర్లు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ల మేరకు ఉత్పత్తి చేసిన వేల స్కూటర్ల కంటే ఇవి అదనం. చెన్నై యూనిట్‌లో రోజువారీగా 6 వందల స్కూటర్లు ఉత్పత్తి చేయొచ్చు. గత నెల 21 నుంచి ప్రొడక్షన్ నిలిపి వేసినట్టు తెలుస్తోంది. వార్షిక మెయింటెనెన్స్, నూతన యంత్రాలను బిగించడం కోసం ఉత్పత్తిని నిలిపేశామని ఓలా కంపెనీ యాజమాన్యం చెబుతోంది. కానీ భారీగా నిల్వలు పేరుకుపోవడం కారణమంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కొత్తలో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రారంభంలో 1.50 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. కానీ వాటి పనితీరులో లోపం, సాంకేతిక సమస్యలు ఉన్నాయన్న ఫిర్యాదులతో భారీ సంఖ్యలో స్కూటర్ల బుకింగ్స్ రద్దు చేసుకున్నారు కస్టమర్స్‌. రోడ్లపైకి వచ్చిన వాటిలో అగ్ని ప్రమాదాలు జరుగడంతో కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు, లోపాలు, సాంకేతిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఇలా అన్ని కారణాలతో సేల్స్ తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో ఉత్పత్తి నిలిపివేసినట్టు సమాచారం.


Friday, July 29, 2022

జర్నలిస్టుల పోస్టుల తొలగింపు అభ్యర్థనల్లో భారత్ నెం.1


ట్విట్టర్‌లో జర్నలిస్టుల పోస్టుల తొలగింపు అభ్యర్థనల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని సామాజిక మాధ్యమ నివేదిక పేర్కొంది. ఈ మేరకు జూలై-డిసెంబర్ 2021లో ట్విట్టర్‌లో ధృవీకరించబడిన జర్నలిస్టులు, వార్తా సంస్థలు పోస్ట్ చేసిన కంటెంట్‌ను తొలగించాలని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చట్టపరమైన డిమాండ్లను భారతదేశం చేసిందని పేర్కొంది. ట్విటర్ ఖాతా సమాచారాన్ని కోరడంలో అమెరికా కంటే భారత్ మాత్రమే వెనుకబడి ఉందని, ప్రపంచ సమాచార అభ్యర్థనలలో 19 శాతం వాటాను కలిగి ఉందని ట్విట్టర్ వెల్లడించింది. అన్ని రకాల వినియోగదారుల కోసం 2021 జూలై-డిసెంబర్‌లో ట్విట్టర్‌కు కంటెంట్-బ్లాకింగ్ ఆర్డర్‌లను జారీ చేసిన మొదటి ఐదు దేశాలలో భారత్ ఒకటిగా ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెరిఫైడ్ జర్నలిస్టులు, న్యూస్ అవుట్‌లెట్‌ల యొక్క 349 ఖాతాలు కంటెంట్‌ను తీసివేయడానికి 326 చట్టపరమైన డిమాండ్లకు లోబడి ఉన్నాయని ట్విట్టర్ పేర్కొంది. అయితే జనవరి-జూన్ (2021)తో పోలిస్తే ఖాతాల సంఖ్య 103 శాతం పెరిగింది. భారత్ (114), టర్కీ (78), రష్యా (55), పాకిస్తాన్ (48) సమర్పించిన చట్టపరమైన డిమాండ్లే ఈ పెరుగుదలకు ఎక్కువగా కారణమని తెలిపింది. ఇక జనవరి-జూన్ 2021లోనూ భారత్ మొదటి స్థానంలో ఉంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 231 డిమాండ్లలో భారత్ (89) అత్యధికంగా చేసింది. చట్టపరమైన డిమాండ్లలో ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులకు ప్రాతినిధ్యం వహించే న్యాయవాదుల నుండి కంటెంట్‌ను తీసివేయడానికి కోర్టు ఆదేశాలు, ఇతర అధికారిక డిమాండ్‌ల కలయిక ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. గతేడాది ఓ చిన్నారి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ప్రముఖ నేత చేసిన పోస్టును తొలగించాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ నోటీసులు ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేసింది. మరోవైపు యూఎస్ తర్వాత, భారతదేశం నుండి వినియోగదారుల ఖాతా సమాచారాన్ని అందించడం కోసం ట్విట్టర్ అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ చట్టపరమైన అభ్యర్థనలను స్వీకరించింది. భారతదేశం నుండి చేసిన ట్విట్టర్ నుంచి పోస్టు తొలగించాలని 3,992 చట్టపరమైన డిమాండ్లు వచ్చాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లలో 47,572లో ఇది 8 శాతమని పేర్కొంది. జూలై-డిసెంబర్ 2021లో తన ప్లాట్‌ఫారమ్ నుండి కంటెంట్‌ను తీసివేయమని అభ్యర్థనలు చేశామని తెలిపింది. వీటిలో 23 కోర్టు ఆదేశాలు, 3,969 ఇతర చట్టపరమైన డిమాండ్లు ఉన్నాయి. అంతర్జాతీయ సంరక్షణ అభ్యర్థనల్లోనూ యూఎస్(34 శాతం), భారత్ (51 శాతం)తో 8

ఐ ఫోన్‌లను అధికంగా కొంటున్న భారతీయులు


భారతీయులు ఐఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. కంపెనీ రాబడి వృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరం మూడో క్వార్టర్ ఆర్ధిక ఫలితాలను యాపిల్ వెల్లడించింది. బ్రెజిల్‌, ఇండోనేషియా, వియత్నాంల్లో రెండంకెల వృద్ధితో పాటు భారత్‌లో కంపెనీ ఆదాయం దాదాపు రెండింతలైందని టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ క్వార్టర్‌లో 83 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. ఐఫోన్ల వ్యాప్తి తక్కువగా ఉన్న ఇండోనేషియా, వియత్నాం, భారత్ వంటి దేశాల్లో అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని కుక్ తెలిపారు. కంపెనీ రాబడిలో ఐఫోన్ నుంచే అధిక ఆదాయం నమోదైంది. కంపెనీ మొత్తం రాబడిలో ఐఫోన్ సేల్స్ ద్వారా సమకూరిన ఆదాయం 50 శాతం వరకూ ఉండటం గమనార్హం. ఇక ఈ క్వార్టర్‌లో ఐపాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌, వాచ్ విభాగం నుంచి రాబడులు పడిపోయాయి. ఇక గత క్వార్టర్‌లో కొవిడ్ నియంత్రణలతో పాటు పలు ప్లాంట్లలో ఉత్పత్తి సామర్ధ్యం తగ్గడం వంటి అవరోధాలు ఎదురయ్యాయని కుక్ చెప్పారు. అమెరికా, బ్రెజిల్‌, మెక్సికో, కొరియా, భారత్ సహా పలు దేశాల్లో యాపిల్ సర్వీసులు రికార్డులు నెలకొల్పాయని కంపెనీ సీఎఫ్ఓ లుకా మయస్త్రీ వివరించారు. విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులను కాపాడుకునేందుకు, నైపుణ్యాలను ఆకర్షించేందుకు యాపిల్ ప్రోడక్ట్స్‌పై గణనీయంగా వెచ్చించాయని తెలిపారు.

బీజీఎమ్ఐ మొబైల్ గేమ్‌పై బ్యాన్ !


'పబ్‌జి'కి ఇండియన్ వెర్షన్‌గా రూపొందిన 'బీజీఎమ్ఐ (బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా)'పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గూగుల్, యాపిల్ సంస్థలు తమ ఆండ్రాయిడ్, యాపిల్ ఓఎస్‌లపై నుంచి ఈ గేమ్‌ను తొలగించాయి. గురువారం నుంచి ఈ గేమ్ యూజర్లకు అందుబాటులో లేకుండా పోయింది. రెండేళ్లక్రితం దేశంలో పబ్‌జిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి పబ్‌జి లాంటి అనేక గేమ్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బీజీఎమ్ఐ ఒకటి. ఇది ప్రత్యేకంగా మొబైల్ గేమ్. ఈ గేమ్ గత ఏడాది జూలై 2న విడుదలైంది. ఈ గేమ్ బాగా సక్సెస్ అయ్యింది. లక్షలాది మంది గేమర్స్ దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆడారు. క్రాఫ్టాన్ అనే సంస్థ ఈ గేమ్ రూపొందించింది. ఇది పబ్‌జిలాగే ఉండటంతో త్వరగా ఆదరణ పొందింది. తయారీ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్ తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంది. 100 మిలియన్ డాలర్లను క్రాఫ్టాన్ సంస్థ గేమ్ కోసం వెచ్చించింది. ఇటీవలే ఈ గేమ్ తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. మరిన్ని కొత్త వెర్షన్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ఈమధ్యే ప్రకటించింది. అంతలోపే వివిధ కారణాలతో గేమ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై క్రాఫ్టాన్ సంస్థ ఇంకా స్పందించలేదు.

 

సగం ధరకే ఫాక్స్ స్కై-4కే స్మార్ట్ టీవీ


ఫాక్స్ స్కై-4కే అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ పై పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ 69% డిస్కౌంట్ తో కస్టమర్లకు రూ.29,999 రూపాయలకి అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన పలు బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.. ఇక ముఖ్యంగా సిటీ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా తో పాటు ఇతర కార్డుల పైన కూడా 10% అదనపు డిస్కౌంట్ ని లభిస్తుంది. ఫాక్స్ స్కై 55 అంగుళాల అల్ట్రా హెచ్డి 4k స్మార్ట్ టీవీ మనకు 55 ఇంచుల సైజులో లభిస్తుంది. ఇకపోతే 9.0 ఓ ఎస్ ఆండ్రాయిడ్ పైన ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది ముఖ్యంగా గరిష్ట బ్రైట్నెస్ ను అందించగల ప్యానల్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుందని కంపెనీ కూడా వెల్లడించింది. ఇకపోతే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే రెండు యూఎస్బీ పోర్ట్స్ తో పాటు ఇన్బిల్ట్ వైఫై , 2 హెచ్డిఎంఐ పోర్ట్స్ ను కూడా కలిగి ఉంటాయి. ఇక సౌండ్ తో పాటు మరిన్ని ఫీచర్లు విషయానికి వస్తే కనుక 30 w హెవీ సౌండ్ ను అందించడంతోపాటు డాల్బీ ఆటం సౌండ్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. అలాగే 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు తో పాటు 2GB ర్యామ్ కూడా లభిస్తుంది.

గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ కోసం ఆటోపై ఈ కెమెరాలు ?


ఇండియాలో గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసింది.  స్ట్రీట్ వ్యూ సేవల్ని అందించేందుకు గూగుల్ మ్యాప్స్... జెనిసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ 11 ఏళ్ల క్రితమే ప్రారంభమైనా, ప్రభుత్వ రెగ్యులేషన్స్ కారణంగా భారతదేశానికి చాలా ఆలస్యంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా వీధుల మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసేందుకు కార్లపై కెమెరాలు ఉంటాయి. కానీ ఇండియాలో ఖర్చు తగ్గించుకునేందుకు టెక్ మహీంద్రా మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసేందుకు ఆటోలపై కెమెరాలను అమర్చింది. ఆ ఆటోలు రోడ్లు, వీధుల్లో తిరుగుతూ మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేస్తుంటాయి. గూగుల్‌కు లైసెన్స్ స్ట్రీట్ వ్యూ డేటా అందించేందుకు టెక్ మహీంద్రా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా మహీంద్రా లాజిస్టిక్స్ ఇలా మహీంద్రా ఆటోలను ఉపయోగిస్తున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్ పర్సన్ ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. అన్ని రూట్లల్లో ఆటోలనే ఉపయోగిస్తున్నారా అన్న వివరాలైతే ప్రస్తుతానికి లేవు. భారతీయ రోడ్ల పరిస్థితులు, ప్రాంతాలను బట్టి మహీంద్రా లాజిస్టిక్స్ వేర్వేరు వాహనాలను ఉపయోగిస్తూ ఉండవచ్చు. గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 10 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్ స్ట్రీట్ వ్యూ సేవలు లభిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికే మొత్తం 1,50,000 కిలోమీటర్ల దూరాన్ని స్ట్రీట్ వ్యూ కవర్ చేయనుంది. 2022 చివరి నాటికి 50 నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

స్ట్రీట్‌ వ్యూపై ఎన్నో అనుమాలు !


గూగుల్ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను ప్రారంభించడం కొత్తేమీ కాదు. గతంలోనూ గూగుల్ సంస్థ స్ట్రీట్ వ్యూను తీసుకొచ్చింది. అయితే కొన్ని భద్రతా కారణాలతో అప్పట్లో వాటిపై బ్యాన్‌ విధించింది. మరోసారి గూగుల్ స్ట్రీట్‌ వ్యూ అందుబాటులోకి రావడంతో సెక్యూరిటీ ప్రాంతాల పరిస్థితి ఏంటన్న దానిపై ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. గూగుల్‌ సంస్థ 2011లోనే స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను భారత్‌లో ప్రారంభించింది. అప్పట్లో రక్షణ శాఖ వివరాలు ఉగ్రమూకలకు, దేశ వ్యతిరేక శక్తులు సులభంగా చేరే ప్రమాదం ఉందని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో 2016లో స్ట్రీట్‌ వ్యూను అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆరేళ్ల తర్వాత తిరిగి మళ్లీ ఇప్పుడు స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించింది. ఈ సారి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా టెక్‌ మహింద్రాతో టైఅప్‌ అయ్యింది. వీధుల్లో ఫోటోలను తీసే బాధ్యతను టెక్‌ మహింద్రా చేపట్టింది. స్కార్పియో వాహనాలను కెమెరాలతో రోడ్లపై తిప్పుతూ ఫొటోలను సేకరిస్తోంది. అయితే గూగుల్‌ మ్యాప్స్‌ స్ట్రీట్‌ వ్యూపై గత అనుమానాలే ఇప్పుడూ తలెత్తుతున్నాయి. అయితే గతంలో లాగా ప్రభుత్వ, రక్షణ, మిలిటరీ సంబంధిత ప్రాంతాల్లో స్ట్రీట్‌ వ్యూ అందుబాటులో ఉండదంటోంది గూగుల్. ఇలాంటి హై సెక్కూరిటి ప్రాంతాల భద్రతకు ముప్పు లేకుండా స్ట్రీట్ వ్యూలో కొన్నింటిని మాస్కింగ్ ఏరియాలుగా ఉంటాయని ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. రక్షణ, మిలటరీ ప్రాంతాల్లో భద్రతకు ముప్పు లేనప్పటికీ కాలనీల్లో మాత్రం ఇది కాస్తాంత ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే కాలనీల్లో ఉండే ఇళ్లు, ఆ కాలనీకి సంబంధించిన వ్యూ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంటి గేటు ఎంత ఎత్తుంది..? కిటికీలు ఎక్కడ ఉన్నాయి..? మెట్లు ఎలా ఉన్నాయన్నది.. స్ట్రీట్‌ వ్యూలో క్లిస్టర్‌ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు దోపిడీ దొంగలకు వరంగా మారే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనం చేసేందుకు చక్కగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందని మరికొంతమంది వాదిస్తున్నారు. కాలనీల్లో ఏ ఇళ్లు ఎక్కడ ఉంది? తరచూ సెక్యూరిటీ జోన్‌లేని ఇళ్లను టార్గెట్‌ చేసుకుని దోపిడీకి పాల్పడే అవకాశం లేకపోలేదన్నది కొంతమంది వాదన.మొత్తంమ్మీద నష్టాల సంగతి ఎలా ఉన్నా…. గూగుల్ మ్యాప్స్‌తో తెలియని ప్రాంతాలకు ఈజీగా చేరుకుంటున్న గూగుల్ యూజర్లకు ఇప్పుడు స్ట్రీట్ వ్యూ ఏకంగా ఆ ప్రాంతమే కళ్లముందు కదలాడనుంది.

Thursday, July 28, 2022

నచ్చని వాళ్లని బ్లాక్ చేయాలా ?


మనకు అసౌకర్యం కలిగించే ఏ వ్యక్తి ఫోన్ నంబర్‌ను అయినా సులభంగా బ్లాక్ చేయవచ్చు. ఐఫోన్‌లతో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇందుకు స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. మీ డివైజ్‌లో ఎవరి కాంటాక్ట్ నంబర్‌ను అయినా ఎలా బ్లాక్ చేయాలి, అన్‌బ్లాక్ చేయాలి అనేది ఎప్పుడు చూద్దాం. 

 ఐఫోన్‌ : ఐఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి, "Phone" ఆప్షన్‌పై క్లిక్ చేయండి. డిస్‌ప్లే అయ్యే ట్యాబ్స్ నుంచి 'Blocked Contacts'ను ఎంచుకోండి. కనిపించే "Add New" అనే ఆప్షన్‌పై నొక్కండి. ఏదైనా ఫోన్ నంబర్‌ను లేదా కాంటాక్స్‌ నుంచి వారి పేరును ఎంచుకొని ఇక్కడ యాడ్ చేస్తే, వారి నంబర్ బ్లాక్ అవుతుంది.

ఐఫోన్‌లో కాంటాక్ట్‌ను ఎలా అన్- బ్లాక్ :  ఐఫోన్‌ సెట్టింగ్స్‌కు వెళ్లి, "Phone" ట్యాబ్‌పై క్లిక్ చేయండి. రిజల్ట్ లిస్ట్‌లో నుంచి "Blocked Contacts"పై నొక్కండి. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే "Edit"ను సెలక్ట్ చేసుకోండి. ఈ లిస్ట్‌లో మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వీటినుంచి అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పక్కన ఉన్న "Remove" అనే ఎరుపు రంగు మైనస్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. కాంటాక్ట్‌ను అన్‌-బ్లాక్ చేయడాన్ని కన్ఫర్మ్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో "Done"పై నొక్కండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌ : స్మార్ట్‌ఫోన్ ఓపెన్ చేసి Phone యాప్ ఓపెన్ చేయండి. టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు నిలువు చుక్కలపై నొక్కండి. రిజల్ట్స్ నుంచి "Settings" ఎంచుకోండి. ఇందులో "Call blocking settings"కి వెళ్లండి. సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే "Blocked numbers" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. కొత్తగా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయాలనుకుంటే.. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న + ఐకాన్‌ను ప్రెస్ చేసి కాంటాక్ట్ నంబర్‌ను యాడ్ చేస్తే చాలు. కాంటాక్ట్ నంబర్‌ను అన్‌బ్లాక్ చేయాలనుకుంటే.. ఆ నంబర్ పక్కన కనిపించే "X" ఐకాన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ సెట్టింగ్స్ యూజర్ల డివైజ్‌ను బట్టి మారవచ్చు. యూజర్లు కాల్ హిస్టరీ లేదా కాంటాక్ట్స్ నుంచి కూడా నంబర్‌ను బ్లాక్ చేయవచ్చు. ఏదైనా నంబర్‌పై క్లిక్ చేసి, 'More' అనే ఆప్షన్ నుంచి నేరుగా కాంటాక్ట్‌ను బ్లాక్ చేయవచ్చు.

రియల్‌మీ ట్యాబ్లెట్ రూ.18 వేల లోపే!


దేశీయ మార్కెట్లో రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్లెట్లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పనిచేయనుంది. రియల్‌మీ లాంచ్ చేసిన మొదటి 5జీ ట్యాబ్లెట్ ఇదే కావడం విశేషం. ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఇందులో ఉంది. దీని ధరను మనదేశంలో రూ.19,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. ఇది వైఫై కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. 5జీ ఫీచర్ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.25,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో 5జీ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.27,999గా ఉంది. గ్లేసియర్ బ్లూ, గ్లోయింగ్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ ఆగస్టు 1వ తేదీ నుంచి జరగనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, ఆఫ్‌లైన్ రిటైల్ చానెళ్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించింది. అంటే రూ.17,999కే దీన్ని కొనేయచ్చన్న మాట. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఫర్ ప్యాడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 11 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ 105 డిగ్రీలుగా ఉంది. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్ కీబోర్డు, రియల్‌మీ మ్యాగ్నటిక్ స్టైలస్‌ను కూడా ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. అయితే వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 8340 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

పేలుళ్లపై ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు నోటీసులు !


దేశంలో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌తో పాటు ఫోర్ వీలర్ వాహనాల్లో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలలో చాలా మంది వాహనదారులు గాయపడితే కొందరు చనిపోయారు కూడా. ఈ సంఘటనలపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు అనేకమంది ఎలక్ట్రిక్ వాహనదారులు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కి అనేక ఫిర్యాదులు చేశారు. ఈ రెగ్యులేటర్ అథారిటీ వారి ఫిర్యాదుల మేరకు ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారుచేసే నాలుగైదు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. CCPA ఈ విషయాన్ని మంగళవారం రోజు వెల్లడించింది. ఈవీ కంపెనీలకు తమ నోటీసులకు స్పందించిన వెంటనే ఈ అంశంపై విచారణను ప్రారంభిస్తుందని CCPA చీఫ్ కమిషనర్ నిధి ఖరే పేర్కొన్నారు. కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలలో సంభవిస్తున్న పేలుళ్లకు గల కారణాలను వివరించాలని CCPA కోరుతోందని ఖరే చెప్పారు. వారిపై CCPA ఎందుకు చర్య తీసుకోకూడదో కూడా కంపెనీలు చెప్పాలని రెగ్యులేటర్ కోరినట్లు నిధి ఖరే వెల్లడించారు. ఈ సంఘటనల గురించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కి కూడా సమాచారం అందించామని ఆమె తెలిపారు.డీఆర్డీఓ చేసిన పరిశోధనలో దాదాపు అన్ని EV అగ్నిప్రమాదాలలో బ్యాటరీ సెల్‌లలో లోపాలు, బ్యాటరీ డిజైన్‌లో లోపాలే కారణమని తేలింది. ఒకినావా ఆటోటెక్, ప్యూర్ EV, జితేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓలా ఎలక్ట్రిక్, బూమ్ మోటార్స్ వంటి ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి లోయర్-గ్రేడ్ మెటీరియళ్లను ఉపయోగించాయని డీఆర్డీఓ వెల్లడించింది. ఏప్రిల్‌లో ఆ కంపెనీల ఈ-స్కూటర్లు పేలడంతో గత నెలలో CCPA ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్‌కు నోటీసులు పంపింది. బ్యాటరీ సమస్యల కారణంగా వాహనాలు అగ్నికి దగ్ధమవుతున్న నేపథ్యంలో అన్ని ఈవీ ద్విచక్ర వాహనాల కంపెనీలకు షో-కాజ్ నోటీసులు అందజేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత వారం పార్లమెంట్‌లో తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈవీ తయారీ సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నోటీసులకు EV కంపెనీలు ఇచ్చే రెస్పాన్స్‌ల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. ఏప్రిల్‌లో ఆయా కంపెనీల ఈ-స్కూటర్‌లు పేలడంతో గత నెలలో CCPA ప్యూర్ EV, బూమ్ మోటార్స్‌కు నోటీసులు పంపింది. కొంతకాలం క్రితం బ్యాటరీలు, బ్యాటరీ పార్ట్స్, సంబంధిత వ్యవస్థలకు భద్రతా ప్రమాణాలను సూచించడానికి మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించనుంది. EV అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో దర్యాప్తు కమిటీ అందించిన ప్రాథమిక ఫలితాల్లో సంచలన నిజాలు బయట పడ్డాయి. ఆ ఫలితాల ప్రకారం, దేశంలో అగ్ని ప్రమాదాలకు గురైన దాదాపు అన్ని ఎలక్ట్రిక్ బైక్స్‌(Bikes)లో బ్యాటరీ సెల్స్‌ లేదా డిజైన్‌లో సమస్యలు ఉన్నాయి.

ప్రిమిటివ్ మెకానికల్ పరికరం


పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన పనిలో తాను బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో సోషల్ మీడియా ద్వారా మోటివేషనల్ వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచేస్తారు. తాజాగా, మరో వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'ఎలక్ర్టానిక్ గాడ్జెట్‌లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతం. ఈ ప్రిమిటివ్ మెకానికల్ పరికరం కేవలం సమర్థవంతమైన యంత్రం మాత్రమే కాదు మొబైల్ శిల్పం' అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. వీడియోలో ఏముందంటే.. కట్టెతో తయారు చేసిన ఆ యంత్రం ఓ వైపు పొలాల్లోకి నీటిని తోడుతుండగా మరోవైపు ఆహార ధాన్యాలను దంచుకునే రోకలిగా ఒకేసారి రెండు పనులు చేసేలా రూపొందించారు. దాని పనితీరును చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

భూమి వైపు మరోసారి దూసుకొస్తున్న రాకెట్‌ శికలాలు ?


చైనా గత వారం లాంగ్‌మార్చి 5బీ రాకెట్‌ను ప్రయోగించింది. ఇది అంతరిక్షంలో నిర్మించతలపెట్టిన స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన ల్యాబరేటరీ మాడ్యూల్‌ను తరలించింది. చైనా 2020 నుంచి ఈ రాకెట్‌ను మూడోసారి ప్రయోగించడం గమనార్హం. తొలి రెండు రాకెట్ల మాదిరిగానే ఇది కూడా దిగువ భూకక్ష్యకు చేరుకొని మళ్లీ తిరిగి భూగోళం దిశగా జారిపోయింది. దీంతో ఇవి ఈ వారంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించవచ్చని అమెరికాకు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 100 మీటర్ల పొడవు, 22 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్‌ శకలాలు పూర్తిగా కాలిపోవని.. కొన్ని భూఉపరి తలాన్ని తాకే ప్రమాదం ఉందని అంచనావేస్తున్నారు. గతంలో చైనా ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌5బీ శకలాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా చైనాకు చెందిన గుర్తుతెలియని రాకెట్‌ శిథిలాలు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో పడ్డాయి. గతంలో చైనా రాకెట్ శకలాలు ఐవరీ కోస్ట్‌లోని జనావాసాలపై కూలి బీభత్సం సృష్టించాయి.

Wednesday, July 27, 2022

పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్


అమెజాన్ కొన్ని దేశాల్లో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరను పెంచాలని చూస్తోంది. సెప్టెంబర్‌ నాటికల్లా కొత్తధరలను అమలు చేయాలనే యోచనలో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం 43 శాతం వరకు పెరుగుతుందని, అయినప్పటికీ ధరల పెంపు శాతం వివిధ దేశాలలో ఒకేలా ఉండదని పేర్కొంది. ఫ్రాన్స్ 43 శాతం ధరలను పెంచగా.. ఫ్రాన్స్‌లో ఉన్న వ్యక్తులు సంవత్సరానికి EUR 69.90 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 5వేల 640. ఇటలీ, స్పెయిన్‌లలో 39 శాతం పెంచగా దీని ధర EUR 49.90 (దాదాపు రూ. 4వేల 32)గా ఉంటుంది. UKలో, వార్షిక ఖరీదు £95 (దాదాపు రూ. 9,070), జర్మనీలో నివసిస్తున్న వ్యక్తులు EUR 89.90 (సుమారు రూ. 8,590) చెల్లించాల్సి ఉంటుంది. US తర్వాత అమెజాన్‌కు మూడో అతిపెద్ద మార్కెట్ UK. భారతదేశంలో Amazon Prime మెంబర్‌షిప్ ధర నెలకు రూ. 179 నుండి రూ. 129 నుండి ప్రారంభమవుతుంది. మూడు నెలల ధర రూ. 459, సంవత్సరానికి రూ. 1,499. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఖర్చు పెరగడం వెనుక ప్రధాన కారణం “పెరిగిన ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు” అని యాజమాన్యం పేర్కొంది. సకాలంలో మంచి కంటెంట్‌ను డెలివరీ చేయడానికి ధరల పెంపు అవసరమని అమెజాన్ సూచించింది.

త్వరలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ ?


దేశంలో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్‌ అంతా సిద్ధం చేసింది. ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే...ఇంట్లోనే కూర్చుని ల్యాండ్‌మార్క్‌లను వర్చువల్‌గా చూడొచ్చు. రెస్టారెంట్‌లో కూర్చున్న అనుభూతినీ పొందొచ్చు. అంతే కాదు. స్పీడ్‌ లిమిట్స్‌ సహా రోడ్డు ఎక్కడ ఎండ్ అవుతుంది..? ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది తెలియజేసేలా ట్రాఫిక్ లైట్స్‌ లాంటి ఫీచర్లనూ జోడించనుంది. లోకల్ ట్రాఫిక్ అథారిటీస్‌ భాగస్వామ్యంతో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయనుంది. డిజిటల్ కన్సల్టెన్సీలో టాప్‌లో ఉన్న టెక్‌ మహీంద్రాతో పాటు మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ జెనెసిస్ ఇంటర్నేషనల్‌తో కలిసి భారత్‌లో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కొన్ని సిటీల్లో మాత్రమే ఈ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్ పని చేయనుంది. బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. తరవాత హైదరాబాద్, కలకత్తాలోనూ అందుబాటులోకి వస్తుందని గూగుల్ సంస్థ వెల్లడించింది. క్రమంగా చెన్నై, దిల్లీ, ముంబయి, పుణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్‌లో ఈ సేవలు విస్తరించనున్నారు. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయటం చాలా సులభం అని వివరిస్తోంది గూగుల్. గూగుల్ మ్యాప్స్‌ యాప్ ఓపెన్ చేసి, ఏయే సిటీల్లో అయితే స్ట్రీట్ వ్యూ ఎనేబుల్ అవుతుందో ఆ సిటీలో ఓ ఏరియాను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ చుట్టుపక్కల ఉన్న కేఫ్‌లు, కల్చరల్ హాట్‌స్పాట్‌లు, సహా పరిసరాల్లో ఉన్న అన్ని ఫేమస్ ప్లేసెస్‌ను వర్చువల్‌గా చూడొచ్చు. "స్ట్రీట్ వ్యూతో ప్రపంచాన్ని కొత్తగా చూడొచ్చు. ప్రతి వీధిలోనూ ప్రతి మూలనూ ఎక్స్‌ప్లోర్ చేయటానికి ఇది తోడ్పడుతుంది. ప్రతి ప్రదేశాన్నీ విజువలైజ్ చేసి చూపిస్తుంది. ఫోన్‌ లేదా కంప్యూటర్‌ నుంచి లోకాన్ని కొత్త కోణంలో చూసేందుకు వీలవుతుంది. 2022 ముగిసే నాటికి 50 నగరాలకుపైగా గూగుల్ స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇంతే కాదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌తో కలిసి ఏయే ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందో తెలియజేయాలని చూస్తోంది.

కృత్రిమ మేధ ప్రమాదకరంగా మారవచ్చు !


కృత్రిమ మేధ (ఏఐ)తో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ ఏఐ వల్ల మానవాళి తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదమూ ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అటువంటి వారి వాదనకు బలం చేకూర్చేలా గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధను ఆయన అణ్వాయుధాలతో పోల్చడం గమనార్హం. నైతిక విలువల ఆధారంగానే కృత్రిమ మేధ (ఏఐ) పని చేయాలని, అందుకు తగ్గ నిబంధనలు, మార్గదర్శకాలు తీసుకురావాలని ఆయన చెప్పారు. లేదంటే ఐఏ ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారు. ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరం తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను గూగుల్ సీఈవోగా ఉన్నసమయంలో (2001 నుంచి 2011 వరకు) ఉన్న పరిస్థితులు, 20 ఏళ్ళుగా చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. గూగుల్ సంస్థ ప్రారంభమైన సమయంలో సమాచార శక్తి గురించి తనకు అంతగా తెలియదని చెప్పారు. కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగం అంశాల్లో నైతిక విలువల ఆధారంగానే పని చేయాలని, అమెరికా, చైనా మధ్య ఈ విషయంలో ఒప్పందం జరగాలని ఆయన అన్నారు. 1950, 1960 దశకాల్లో క్రమంగా సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం జరిగిందని అన్నారు. ఇప్పుడు కృత్రిమ మేధ కూడా చాలా శక్తిమంతంగా తయారవుతుందని చెప్పారు. కృత్రిమ మేధను ఎలా వాడాలి? ఎలా అభివృద్ధి చేయాలన్న విషయాలను నిర్దేశించేందుకు ఏ వ్యవస్థా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీరు ఏఐను దుర్వినియోగం చేసేందుకు, ప్రమాదకర రీతిలో వాడేందుకు దారి తీస్తుందని అన్నారు.

చంద్రుడిపై గుహలు !


చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మనకు కనిపించని చీకటి భాగంలో మైనస్ 173 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటుంది. అలాంటి చందమామపై మనుషులు ఎక్కడ ఉండాలి? అనే ప్రశ్నకు తాజా పరిశోధనలో సమాధానం దొరికిందని నాసా పరిశోధకులు అంటున్నారు. చందమామపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా. అంతేకాదు ఈ సొరంగాల వద్ద చేసిన పరిశోధనల్లో వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని అటూ ఇటుగా 17 డిగ్రీల సెల్సియస్ వద్దనే ఉంటున్నాయని తేలింది. నాసాకు చెందిన లూనార్ రికనసెన్స్ ఆర్బిటర్ ఈ వివరాలను సేకరించింది. అంటే ఈ సొరంగాల్లోకి వెళ్లి అక్కడి గుహల్లో మనుషులు ఉండి, పరిశోధనలు చేయొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ) పరిశోధకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఈ గుహల్లో వ్యోమగాములు ఉండి తమ పరిశోధనలు కొనసాగించే అవకాశం ఉందని తెలియజేశారు. ఒకప్పుడు మనిషి గుహల్లోనే బతికేవాడని, ఇప్పుడు మళ్లీ చంద్రుడిపై గుహల్లోనే జీవితం ప్రారంభించాల్సి ఉంటుందని ఈ పరిశోధకులు వివరించారు.

ఆకాశంలో అందమైన ఉల్కాపాతం !


ఈ విశ్వమే అంతుచిక్కని అద్భుతం. ఎంతసేపు చూసినా తనివితీరని చిత్రం. అలాంటి విశ్వంలో ఆకాశం, అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు కొందరు ఔత్సాహకులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. పెర్సీడ్​ ఉల్కాపాతం ఈ ఏడాది అత్యంత అద్భుతంగా కనిపించబోతున్నట్టునాసా చెబుతోంది. ఇది జులై, ఆగస్టు నెలల మధ్య ఏర్పడుతుందని స్పేస్​ సైంటిస్టులు చెబుతున్నారు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన కాస్మిక్ లైట్ షోగా ఇది ఉంటుందని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం భూమి జులై 17 నుంచి ఆగస్టు 24 తేదీల మధ్య కామెట్​ స్విఫ్ట్​ టటిల్​ మార్గంలో వెళ్తుంది. ఆ సమయంలో భూమి దట్టమైన, ధూళి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అంటే.. దాదాపు ఆగస్టు 11, 12 తేదీల వరకు ఇట్లాంటి పెర్సీడ్​ ఉల్కాపాతం కనిపించే అవకాశాలున్నాయి. అయితే.. అమెరికన్ మెటోర్ సొసైటీ (AMS) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఆగస్ట్ 11-12 తేదీల్లో అత్యధిక సంఖ్యలో ఉల్కలను చూసే అవకాశం అమెరికన్ ప్రజలకు దక్కబోతున్నట్టు తెలుస్తోంది.

వాట్సాప్‌లో ఎస్‌బిఐ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్స్ !


ఎస్‌బిఐ కస్టమర్ల కోసం మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్లు తమ ఖాతా వివరాలను (మినీ స్టేట్‌మెంట్) కొన్ని సెకన్లలోనే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఖాతాలోని బ్యాలెన్స్ కూడా చూడవచ్చు. దీని కోసం వినియోగదారులు ఎస్ఎంఎస్  పంపాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటిఎం  సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ సహకారంతో కస్టమర్ల కోసం ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది ఎస్‌బిఐ. చాలా బ్యాంకులు కస్టమర్ల కోసం ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టాయి. ఇప్పుడు ఎస్‌బిఐ కాడా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చింది.  SBI WhatsApp బ్యాంకింగ్ సర్వీస్.. సేవింగ్స్ ఖాతాదారులు, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రారంభించడానికి ఖాతాదారులు SBIలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ కస్టమర్లు రిజిస్ట్రేషన్ తర్వాత తమ ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను కూడా చూడవచ్చు. అలాగే, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ సేవను ఉపయోగించి ఖాతా వివరాలు, ఖర్చు వివరాలను చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా రివార్డ్ పాయింట్లు, బకాయి మొత్తంతో సహా ఇతర సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. కార్డ్ హోల్డర్స్ తమ వాట్సాప్ నంబర్ నుండి 9004022022కు OPTIN అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. లేదంటే.. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 08080945040కి మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. ఎస్‌బిఐ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ఫీచర్ కోసం సైన్ అప్ చేయవచ్చు. బ్యాంక్‌లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ నుండి ఫోన్‌లో మెసేజ్ ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి. మెసేజ్‌లో WAREG అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, మీ ఖాతా నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్‌ను 7208933148కి SMS చేయాలి. ఇది రిజిస్టర్ కావాలంటే.. తప్పనిసరిగా ఈ నంబర్‌కు హాయ్ అని రిప్లై ఇవ్వాలి. ఆ తరువాత కాసేపటికే వాట్సాప్‌లో సర్వీస్ మెనూ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ పూర్తయినట్లుగా మీకు 90226 902226 నెంబర్‌తో whatsapp మెసేజ్ నంబర్ వస్తుంది.

ఆ చిన్న రంధ్రం నాయిస్ క్యాన్సిలేషన్ డివైజ్‌ !


స్మార్ట్‌ఫోన్లలో ఒక చిన్న రంధ్రం ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. ఇది ఫోన్ పైభాగంలో లేదా కింద చార్జింగ్ పోర్ట్ పక్కన ఉంటుంది. కొన్ని ఫోన్లలో ఇది సెల్ఫీ కెమెరా పక్కన లేదా వెనుకవైపు ఫ్లాష్‌లైట్ పక్కన కూడా మనం చూడొచ్చు. అయితే.. ఈ రంధ్రం ఎందుకు ? దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? అనే విషయం మాత్రం చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. ఫోన్ లోపలికి ఎయిర్ వెళ్లడం కోసమే దీనిని ఏర్పాటు చేసి ఉంటారని కొందరు అనుకుంటుంటారు. కానీ  దీని వెనుక మరో కారణం ఉంది. స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి విడుదలైన తొలినాళ్లలో వాయిస్ సమస్యల్ని ఎదురయ్యాయి. చాలామంది ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక రకమైన శబ్దం వచ్చేదని, దాని వల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించేవి కాదని కంప్లైంట్ చేశారు. దీనిని నాయిస్ డిస్ట్రర్బెన్స్‌గా గమనించిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఆ తర్వాత నుంచి తమ ఫోన్లలో చిన్న రంధ్రం ఏర్పాటు, ఆ మోడల్స్‌ని రిలీజ్ చేశారు. అప్పట్నుంచి నాయిస్ డిస్ట్రర్బెన్స్ సమస్య తలెత్తలేదు. ఆ రంధ్రంలో ఓ మినీ మైక్రోఫోన్ ఉంటుంది. అది నాయిస్ క్యాన్సిలేషన్ డివైజ్‌గా పని చేస్తుంది. దాని వల్లే ఎలాంటి అంతరాయం లేకుండా, ఫోన్‌లో మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపిస్తాయి.

Tuesday, July 26, 2022

10 వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లోగో !


గూగుల్ తన ప్లే స్టోర్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న  సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ కొత్త లోగో ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటుంది మరియు Google ఫోటోలు, search, Gmail మరియు మరిన్ని వంటి ఇతర Google సేవల లోగో ల వైబ్‌తో సరిపోలుతుంది. ఈ కొత్త లోగో ప్రకాశవంతమైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం మరియు పసుపు రంగుల లో ఉంది. మరియు మునుపటి లోగోకు భిన్నంగా మరింత గుండ్రంగా ఉంటుంది. 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా లోగో ను ఆవిష్కరించడమే కాకుండా, Google Play Points సభ్యుల కోసం రివార్డ్‌ను ఇవ్వనుంది. పాయింట్ల బూస్టర్‌ను ప్రారంభించడం ద్వారా ప్లే స్టోర్ ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై 10 రెట్లు ఎక్కువ పాయింట్‌లను పొందుతారు. ఈ ఆఫర్ ఇప్పుడు లైవ్‌లో ఉంది. Play Store యాప్‌లో మీ ప్రొఫైల్‌కి వెళ్లడం ద్వారా ఈ ఆఫర్ ను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే. 

యూట్యూబ్‌లో ఆన్‌లైన్ మీటింగ్స్ లైవ్ స్ట్రీమింగ్‌ !


గూగుల్ తన మీట్ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో మీటింగ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసుకునేలా యూజర్లకు అనుమతించింది. అడ్మిన్‌.. మీటింగ్ యాక్టివిటీ ప్యానెల్‌కు నావిగేట్ చేయడం, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీటింగ్‌ను ప్రారంభించొచ్చు. ఈ ఆన్‌లైన్ సమావేశం కోసం యూజర్స్ ఛానెల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని ఆండ్రాయిడ్ సెంట్రల్తెలిపింది. ‘యూజర్స్‌.. తమ సంస్థ వెలుపల ఎక్కువ మంది ప్రేక్షకులకు సమాచారాన్ని అందించాలనుకునే సందర్భాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. వారికి అవసరమైన విధంగా పాజ్ చేయడానికి, రీప్లే చేయడానికి లేదా తర్వాత సమయంలో వీక్షించేందుకు వీలు కల్పిస్తుంది’ అని గూగుల్ వివరించింది. యూట్యూబ్‌లో గూగుల్ మీట్ లైవ్ మీటింగ్ కోసం చానల్ కచ్చితంగా అప్రూవ్ అయి ఉండాలని గూగుల్ పేర్కొంది. అప్పుడే లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకోవచ్చని తెలిపింది. హోస్ట్ మేనేజ్‌మెంట్ ఆన్‌లో ఉంటే హోస్ట్, కో హోస్ట్‌లు మాత్రమే సమావేశం ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించొచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్ ఆఫ్‌లో ఉంటే మీటింగ్‌కు హాజరయ్యే ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించొచ్చు.

వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు విడుదల


వోల్వో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వాహనం వోల్వో XC40 ను  దేశీయ మార్కెట్లోకి అధికారికంగా ఈరోజు విడుదల చేసింది. 2022 వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో రూ. 55.90 లక్షలకు ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించబడింది. ఈ సరికొత్త మోడల్ దేశంలోనే మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం. బెంగళూరు సమీపంలోని హాస్కోట్ లోని వోల్వో యూనిట్ లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసి ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు రూ. 50వేలు చెల్లించి వోల్వో వెబ్ సైట్ లోకి వెళ్లి జూలై 27 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ XC40 రీఛార్జ్ 11 kw వాల్ - బాక్స్ ఛార్జర్ తో వస్తుంది. 33 నిమిషాల్లో కారులో 10 నుంచి 80 శాతం వరకు, 50 kw ఫాస్ట్ ఛార్జర్ తో సుమారు 2.5 గంటల్లో 100శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది. 418km పరిధితో XC40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ 'ట్విన్' వెర్షన్‌లో అందుబాటులో ఉంది, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408hp , 660Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడు సంవత్సరాల సమగ్ర కారు వారంటీ, మూడు సంవత్సరాల వోల్వో సర్వీస్ ప్యాకేజీ, మూడు సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ, డిజిటల్ సేవలకు నాలుగు సంవత్సరాల సబ్‌స్క్రిప్షన్, థర్డ్ పార్టీ ఇంటీరియర్ ద్వారా 1 వాల్ బాక్స్ ఛార్జర్ (11 kW)

జీమెయిల్‌లో స్పేస్‌ ఫుల్‌ అయ్యిందా ?


యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, మెయిల్స్‌ను సింపుల్‌గా యాక్సెస్‌ చేసుకునే వీలు ఉండడంతో ఎక్కువ మంది  జీమెయిల్‌నే ఉపయోగిస్తుంటారు. ఇతర మెయిల్‌ సర్వీసెస్‌ అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది ఉపయోగించేది మాత్రం జీమెయిల్‌నేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ రోజూ వందలాది మెయిల్స్‌తో అకౌంట్‌ నిండిపోతుంటుంది. ప్రకటనల నుంచి మొదలు ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేస్తే వచ్చే అలర్ట్‌ వరకు ఇలా వందలాది మెయిల్స్‌ ఇన్‌బాక్స్‌లో నిండిపోతుంటాయి. జీమెయిల్‌లో ఉండే స్పేస్‌ ఫుల్‌ కావడంతో కొత్త మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లోకి రావు. ఇందుకోసం మెయిల్స్‌ను క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మెమోరీతో కూడిన మెయిల్స్‌ను డిలీట్‌ చేయడం ద్వారా స్పేస్‌ను తగ్గించుకోవచ్చు. అయితే వందలాది మెయిల్స్‌లో ఎక్కువ డేటా ఉన్న మెయిల్స్‌ ఏంటనేది తెలుసుకోవడం అంత సులువు కాదు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే జీమెయిల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం యూజర్లు సెర్చ్‌ ట్యాబ్‌లో ‘has:attachment larger:10M’ అని టైప్ చేయాలి. దీంతో 10 ఎమ్‌బీ కంటే ఎక్కువ మెమోరీ ఉన్న మెయిల్స్‌ డిస్‌ప్లే అవుతాయి. వాటిని సెలక్ట్‌ చేసుకొని డిలీట్‌ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు గూగుల్‌ ఆటో-డిలీషన్‌ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. దీని సహాయంతో యూజర్లు సెట్‌ చేసుకున్న ఫిల్టర్‌ల ఆధారంగా మెయిల్స్‌ను డిలీట్‌ చేసుకోవచ్చు.

వాట్సాప్ నుండి టెలిగ్రామ్‌కు చాట్‌ల బదిలీ !


ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుండి ఐఫోన్‌కు మారినప్పుడు వినియోగదారుల చాట్ డేటా మొత్తాన్ని బదిలీ చేయడానికి  వాట్సాప్ వీలు కల్పించింది. ఇప్పుడు వాట్సాప్ చాట్‌లను టెలిగ్రామ్‌కి కూడా బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ చాట్‌లను కేవలం కొన్ని నిమిషాల్లోనే టెలిగ్రామ్‌లో పొందడానికి టెలిగ్రామ్ తన వినియోగదారులను అనుమతిస్తుంది. వాట్సాప్ నుండి చాట్‌ని దిగుమతి చేసుకునేటప్పుడు దానికి ఎంత సమయం అవసరమో డేటా మొత్తం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ని ఓపెన్ చేసి బదిలీ చేయాలనుకుంటున్న చాట్‌ను నావిగేట్ చేయండి. ఇందుకోసం కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు-చుక్కల మెను చిహ్నాన్ని ఉపయోగించండి. తరువాత 'మోర్' ఎంపికకి వెళ్లి, ఎక్సపోర్ట్ చాట్ ఎంపికపై నొక్కండి.వాట్సాప్ మీ చాట్‌ని మీడియాతో లేదా మీడియా లేకుండా ఎగుమతి చేసే ఎంపికను చూపుతుంది. ఇప్పుడు కనిపించే షేర్ మెను నుండి టెలిగ్రామ్ యాప్‌ని ఎంచుకోండి. వినియోగదారు టెలిగ్రామ్ యాప్‌కి మళ్ళించబడతారు. ఇక్కడ జాబితా నుండి సంబంధిత కాంటాక్ట్ ని ఎంచుకోవాలి. కాంటాక్ట్ ని ఎంచుకున్న తర్వాత వాట్సాప్ ఆటోమేటిక్‌గా అన్ని మెసేజ్ లు మరియు మీడియాను టెలిగ్రామ్‌కి బదిలీ చేయడం ప్రారంభిస్తుంది.
iOSలో వ్యక్తిగత చాట్‌లను బదిలీ చేసే విధానం : ఐఫోన్‌లో ముందుగా వాట్సాప్ ను ఓపెన్ చేసి మీరు టెలిగ్రామ్‌కి బదిలీ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎగువన ఉన్న కాంటాక్ట్ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి, ఎక్సపోర్ట్ చాట్ ఎంపికపై నొక్కండి. ఇప్పుడు ఏదైనా కాంటాక్ట్ ని ఎంచుకుని ప్రాంప్ట్ చేసినప్పుడు దిగుమతి ఎంపికని ఎంచుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బదిలీ చేయబడిన చాట్‌లు వాటి టైమ్‌స్టాంప్‌లతో పాటు దిగుమతి చేయబడినవిగా లేబుల్ చేయబడతాయి కాబట్టి మీరు టెలిగ్రామ్ నుండి మీ వాట్సాప్ మెసేజ్లను సులభంగా తెలియజేయవచ్చు.

దేశంలో రెట్టింపైన యాపిల్ అమ్మకాలు !


దేశంలో యాపిల్ ఫోన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. సైబర్ మీడియా రీసెర్చి (సీఎమ్ఆర్) సంస్థ అంచనా ప్రకారం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో యాపిల్ సంస్థ దాదాపు 12 లక్షల ఐఫోన్లు విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాలు 94 శాతం ఎక్కువ కావడం విశేషం. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడల్స్ భారీగా అమ్ముడవుతుండటమే దీనికి కారణం. యాపిల్ సంస్థ దేశంలోనే ఫోన్లు తయారు చేస్తుండటం కూడా ఈ విక్రయాలు పెరిగేందుకు ఒక కారణం. తాజాగా అమ్ముడైన ఫోన్లలో 10 లక్షల ఫోన్లు మన దేశంలో తయారైనవే. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్‌లో ఐఫోన్ 12 ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 41 శాతం. ఆ తర్వాత ఐఫోన్ 13 ఫోన్లు అమ్ముడవుతున్నాయి. వీటి వాటా 32 శాతం. ఆ తర్వాత ఐఫోన్ 11 (17 శాతం), ఐఫోన్ 13 ప్రొ (4శాతం), ఐఫోన్ ప్రొ మ్యాక్స్ (3 శాతం) అమ్ముడవుతున్నాయి. రెండో త్రైమాసికంలో ఐప్యాడ్‌లు కూడా భారీగానే అమ్ముడయ్యాయి. దాదాపు రెండు లక్షల ఐప్యాడ్స్ అమ్ముడయ్యాయి. వీటి అమ్మకాలు కూడా 34 శాతం పెరిగాయి. ఐప్యాడ్స్‌లో ఐప్యాడ్ 9 (వైఫై) ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తర్వాత ఐప్యాడ్ ఎయిర్ 2022, ఐప్యాడ్ 9 (వైఫై+4జీ) మోడల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

Monday, July 25, 2022

10 రూపాయలకే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ !


రూరల్‌ ఏరియాల్లో ఉండే యూజర్లు కేవలం 10 రూపాయిలు చెల్లించి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీని వీక్షించే సౌలభ్యం కలగనుంది. ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ 'పే నియర్‌ బై' సాచెట్ సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో ప్రతి ఒక్క యూజర్లకు రూ.10కే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్‌ మాట్లాడుతూ..పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో "చాటింగ్, కంటెంట్,సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ డేటా ఒకేలా వినియోగిస్తున్నారు.రూరల్‌,సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో పోలిస్తే షాపింగ్, ఎడ్యుకేషన్‌, జాబ్‌ నోటిఫికేషన్‌, మెడిసిన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వినియోగంలో పట్టణ జనాభా ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. అందుకే రూరల్‌ ఏరియాల్ని టార్గెట్‌ చేస్తూ భారత్‌ అనే పేరుతో క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా రూరల్‌ ఏరియా యూజర్లకు రూ.10కే ఒక మూవీని వీక్షించేలా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొని రానున్నాం. ఇందుకోసం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో సంప్రదింపులు జరిపామని, త్వరలోనే తక్కువకే సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ తెలిపారు.


సోనీ నుంచి అత్యంత ఖరీదైన స్మార్ట్ టీవీ !


సోనీ కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్‌ Smart Tvని దేశీయ  మార్కెట్లో విడుదల చేసింది. Sony XR OLED A80K TV సిరీస్ పేరుతో వస్తున్న ఈ మోడల్‌ 55, 65, 77 అంగుళాల సైజుల్లో మూడు వేరియంట్లలో విడుదలైంది. ప్రస్తుతం సోనీ కంపెనీ నుంచి భారత్‌లో అందుబాటులో ఉన్న టీవీల్లో ఈ మోడల్‌ బాగా ఖరీదైనది మరియు టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్‌డ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ టీవీ కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ ఆర్ తో వస్తోంది. ఇది డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు, డాల్బీ విజన్ ఫార్మాట్ హెచ్‌డీఆర్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ టీవీ (3840x2160-pixel) రిసొల్యూషన్‌తో 77 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ OLED స్క్రీన్‌తో వస్తోంది. దీనికి కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్ ను అందిస్తున్నారు. తద్వారా మెరుగైన, అనుకూలమైన పర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తుంది. డాల్బీ విజన్, HDR10 మరియు HLG ఫార్మాట్‌లతో అధిక డైనమిక్ రేంజ్ కంటెంట్‌కు సపోర్ట్ కలిగి ఉంటుంది. అద్భుతమైన సౌండ్ అనుభూతిని పొందేందుకు.. ఈ టీవీకి Dolby Atmos మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ ఫార్మాట్‌లకు కూడా మద్దతు ఉంది. అంతేకాకుండా, Netflix అడాప్టివ్ కాలిబ్రేటెడ్ మోడ్ వంటి ఇతర ఫార్మాట్‌లు మరియు మరిన్ని మెరుగైన ఫీచర్‌లకు కూడా మద్దతు ఉంది. A80K సిరీస్ Android TV సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రధాన స్ట్రీమింగ్ సర్వీస్‌లతో సహా మరిన్ని కీలకమైన యాప్‌లకు సంబంధించి సపోర్ట్ కలిగి ఉంది. ఇంకా గూగుల్ క్రోమ్ కాస్ట్‌తో పాటు, ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను కనెక్టక్ష చేయడానికి యాపిల్ ఎయిర్ ప్లే 2, హోం కిట్ సపోర్ట్ కలిగి ఉంది. రిమోట్ ద్వారా గూగుల్ అసిస్టెన్స్ వినియోగించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. సౌండ్ విషయానికొస్తే, Sony A80K సిరీస్ అకౌస్టిక్ సర్‌ఫేస్‌ ఆడియో మరియు XR సరౌండ్ టెక్నాలజీలను కలిగి ఉంది. 60W సౌండ్‌ అవుట్‌పుట్ అందిస్తుంది. ఆటో లో-లేటెన్సీ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) మరియు ఆటో గేమ్ మోడ్ వంటి గేమింగ్-ఫోకస్డ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ఈ మోడల్ టీవీలు సైజుల ఆధారంగా మూడు వేరియంట్లలో లభిస్తున్నాయి. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 77 అంగుళాలు ఇలా మూడు రకాలుగా లభిస్తున్నాయి. 65 అంగుళాల వేరియంట్ ధర రూ.2,79,990 గా నిర్ణయించారు. కాగా, 77-అంగుళాల వేరియంట్ ధర భారతదేశంలో రూ.6,99,900 గా నిర్ణయించారు. ఈ రెండూ ఇప్పుడు భారతదేశంలోని సోనీ సెంటర్ స్టోర్‌లు, ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లు మరియు ప్రధాన ఇ-కామర్స్ పోర్టల్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. 55-అంగుళాల వేరియంట్ ధర ఇంకా నిర్ణయించబడలేదు మరియు భారతదేశంలో త్వరలో విక్రయించబడుతుందని కంపెనీ పేర్కొంది. కాగా, ఇది భారత్‌లో అందుబాటులో ఉన్న టీవీల్లో ఈ మోడల్‌ బాగా ఖరీదైనది మరియు టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్‌డ్ అని కంపెనీ వెల్లడించింది.

యూట్యూబ్ లో 500 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారా ?


యూట్యూబ్ లో ఛానెల్ ప్రారంభించిన ఎవరైనా ఈ Community Tab Feature ను అందుకోవాలంటే ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే మన ఛానెల్ కమ్యూనిటీ ట్యాబ్ ఫీచర్ ను సాధించాలంటే ముందుగా మన ఛానెల్‌కు తప్పనిసరిగా 500 మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. 500 మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటేనే ఈ ఫీచర్‌ను యూట్యూబ్ లో 500 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారా ? మనకు సిఫారసు చేస్తుంది. లేదంటే చేయదు. సాధారణంగా యూట్యూబ్  అంటే వీడియో మాత్రమే పోస్టులు చేస్తారని అందరికీ తెలుసు. కానీ, ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మన ఛానెల్‌లో మరో రెండు రకాల పోస్టులు చేయవచ్చు. ఫేస్‌బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల మాదిరి హెడ్‌లైన్ డిస్క్రిప్షన్‌తో ఫోటో పోస్టులు చేయవచ్చు. దాంతో పాటుగా పోల్స్ (క్విజ్ మాదిరి) పోటీలు కూడా ఈ Community Tab Feature ద్వారా మన ఛానెల్‌పై నిర్వహణ చేయవచ్చు. ఉదాహరణకు రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. అనే ప్రశ్న ఇచ్చి దానికి నాలుగు ఆప్షన్లను జత చేయవచ్చు. తద్వారా మీ సబ్‌స్క్రైబర్ల అభిప్రాయాలను ఈ పోల్‌లో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కమ్యూనిటీ ట్యాబ్ Youtube క్రియేటర్లకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ సాధించాలంటే ముందుగా మన సబ్‌స్క్రైబర్ కౌంట్ 500 దాటాలి. ఆ తర్వాత మనం కమ్యూనిటీ ట్యాబ్ ఫీచర్‌ను కోరుతూ యూట్యూబ్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ముందుగా యూట్యూబ్  ఛానెల్‌లోకి వెళ్లి  ఎడమ వైపు వివిధ రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని స్క్రోల్ డౌన్ చేస్తే చివరన సెండ్ Feedback అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెండ్ ఫీడ్ బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఒక న్యూ టేబుల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు యూట్యూబ్‌కు ఓ చిన్న డిస్క్రిప్షన్ రాయాలి. "మా ఛానెల్ సబ్‌స్క్రైబర్ కౌంట్ 500 చేరుకుంది. కాబట్టి మాకు కమ్యూనిటీ ట్యాబ్ ఫీచర్ అందించగలరు." అని ఇంగ్లీష్‌లో రాసి సెండ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీ ఛానెల్ కంపెనీ గైడ్‌లైన్స్ అన్ని సక్రమంగా పాటిస్తున్నట్లయితే తప్పకుండా వారం లేదా పది రోజుల్లో కమ్యూనిటీ ట్యాబ్ అందుబాటులోకి వస్తుంది.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అద్భుత చిత్రాలు విడుదల


అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలి ఫుల్ కలర్ ఫొటోని జూలై 12న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కట్టే ఈ ఫొటో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా, ఈ టెలిస్కోప్ ఫాంటమ్ గెలాక్సీ అద్భుతమైన ఫొటోలను తీసి పంపింది. ఈ ఫొటోలను నాసా శనివారం విడుదల చేసింది. బ్లాక్‌హోల్‌తో కలర్‌ఫుల్‌గా ఉన్న ఫాంటమ్ గెలాక్సీ ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతున్నాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన గెలాక్సీ అసలు పేరు మెస్సియర్ 74. దీన్ని 1780లో చార్లెస్ మెస్సియర్ కనుగొన్నారు. ఎన్జీసీ 628గా కూడా పిలిచే ఈ స్పైరల్ గెలాక్సీని అంతరిక్ష ప్రియులు ముద్దుగా ఫాంటమ్ గెలాక్సీ అని పిలుస్తారు. ఇది గ్రాండ్ డిజైన్ స్పైరల్ గెలాక్సీకి సరైన ఉదాహరణ. ఇది నవంబర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోలో గెలాక్సీ చిన్న చిన్న నీలిరంగు నక్షత్రాలను కలిగి ఉంది. ఈ నక్షత్రాలనుంచి వచ్చే అతినీలాలోహిత కాంతితో గెలాక్సీ గులాబీరంగులో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌లోని ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు ఈ గెలాక్సీని అద్భుతంగా, అత్యంత స్పష్టంగా చిత్రీకరించాయి.

ఇదంతా బుద్ధిలేని ప్రచారం !


గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సతీమణి నికోలే షనాహన్‌తో తనకు అఫైర్ ఉందంటూ వస్తున్న కథనాలపై టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్  స్పందించారు. ఇదంతా బుద్ధిలేని ప్రచారమని కొట్టిపారేశారు. పూర్తిగా అవాస్తవమని ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు. '' ఇదంతా బుద్ధిలేని ప్రచారం. సెర్గీ బ్రిన్, నేనూ స్నేహితులం. నికోలేని మూడేళ్ల వ్యవధిలో కేవలం రెండు  సార్లు మాత్రమే చూశాను. ఆ రెండు సందర్భాల్లోనూ చాలామంది అక్కడున్నారు. రోమాంటిక్‌ పనులకు ఆస్కారమే లేదు '' అని తేల్చిచెప్పారు. నికోలేతో మస్క్‌కు అఫైర్‌ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తే వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటివల ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ రిపోర్ట్‌కి ఎలాన్ మస్క్‌ పైవిధంగా సమాధానమిచ్చారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం నికోలేతో మస్క్ అఫైర్ వరకూ సెర్గీ బ్రిన్ - ఎలాన్ మస్క్ స్నేహంగా ఉండేవారని, ఆ తర్వాత స్నేహం తెగిపోయిందని పేర్కొంది. ఈ కథనాలను బలపరిచేలా ఈ ఏడాది జనవరిలో సెర్గీ బ్రిన్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టులో ఫైలింగ్ చేశారు. ఇద్దరిమధ్యా సరిదిద్దలేని విభేదాలు ఏర్పాడ్డాయని డైవర్స్ ఫైలింగ్‌లో సెర్గీ బ్రిన్ పేర్కొన్నారు. డిసెంబర్ 15, 2021 నుంచి దంపతులిద్దరూ దూరంగా ఉంటున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మరోవైపు డిసెంబర్ 2021లో మియామీలో జరిగిన ఆర్ట్ బాసెల్ ఈవెంట్‌లో సెర్గీ బ్రిన్‌కు ఎలాన్ మస్క్ క్షమాపణ చెప్పారని, ఒక మోకాలుని కిందికి వంచి సారీ చెప్పారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు విషయాన్ని తెలిపాయని వెల్లడించింది.

ఆవులకు ఫేస్ రికగ్నిషన్ యాప్


ఆవులకు కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆవుల ముఖకవళికలు గుర్తించే ఈ యాప్‌ను గుజరాత్‌లోని అహమ్మదాబాద్ ఐఐఎం నిపుణులు రూపొందించారు. 'గాయ్ ఆధారిత్ ఉన్నతి' పేరుతో ఉన్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. తాజాగా ఆ పరిశోధనా పత్రాన్ని ఫ్యాకల్టీ మెంబర్ అమిత్ గార్గ్ వెల్లడించారు. పరిశోధనల కోసం ఉత్తర ప్రదేశ్‌లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న గోశాలను ఎంచుకున్నట్టు తెలిపారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌లో గోవుల ముఖ కవళికలను నమోదు చేశామని, తర్వాత వాటికి పేర్లు పెట్టి ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేశామని వివరించారు. తర్వాత 'cow విజన్ యాప్'తో స్కాన్ చేసినప్పుడు 92 శాతం ఖచ్చితత్వంతో గుర్తించగలిగిందని పేర్కొన్నారు. ఇప్పటికీ గ్రామీణ భారతంలో ఆవులు ప్రముఖ పాత్ర పోషిస్తుండడంతో ఈ యాప్ అవసరాన్ని గుర్తించామని చెప్పారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. దేశవ్యాప్తంగా గోశాలల్లో ఉన్న లక్షల ఆవులకు ప్రయోజనం ఉంటుందనీ, దాతలు వాటిని ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాక, ఈ యాప్ ద్వారా ఆవుల దత్తత భారీగా పెరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Sunday, July 24, 2022

ట్విట్టర్‌లో స్పేసేస్ క్లిప్స్ ఫీచర్ ?


ట్విట్టర్‌లో స్పేసేస్ క్లిప్స్ ఫీచర్ వచ్చేసింది. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ట్విట్టర్ యూజర్ల అందరికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ స్పేసేస్ కొత్త క్లిప్పింగ్ టూల్ టెస్టింగ్ చేయడం ప్రారంభించినట్టు కంపెనీ ఇటీవల పేర్కొంది. ఇప్పుడు, ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. టెస్టింగ్ విజయవంతంగా ముగిసింది. iOS, Android వెబ్‌లో ప్రతి ఒక్కరికీ క్లిప్పింగ్‌ని అందించనున్నట్టు కంపెనీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం.. ఈ ఫీచర్ ట్విట్టర్ వెబ్ యూజర్లకు అందుబాటులో లేదు. అతి త్వరలోనే అందరికి వెబ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని నివేదిక వెల్లడించింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఇతరులతో షేర్ చేయడానికి రికార్డ్ చేసిన స్పేస్‌ల నుంచి 30 సెకన్ల ఆడియోను క్రియేట్ చేయొచ్చు. ఈ కొత్త టూల్ యూజర్లకు వారి స్పేస్‌లపై ఆసక్తిని పెంచేందుకు ఇదోక మార్గమని అంటోంది. అదే సమయంలో మొత్తం రికార్డింగ్‌ను షేరింగ్ చేసే టూల్ విషయంలోనూ అప్‌డేట్ చేసింది. ట్విట్టర్ స్పేసేస్ లాంచ్ చేయడానికి ముందే సామాజిక ఆడియో యాప్ క్లబ్‌హౌస్ గత సెప్టెంబర్‌లోనే క్లిప్పింగ్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ పబ్లిక్ రూమ్‌లలో Live Listeners అత్యంత ఇటీవలి 30 సెకన్ల ఆడియోను Snip చేయడానికి ఎక్కడైనా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. ఇంతలో custom-built timelines కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. మొదట The Bacheloretteపై కేంద్రీకరించడం ప్రారంభించిందని తెలిపింది. అమెరికా, కెనడాలోని “Small Group” వ్యక్తుల కోసం వెబ్‌లో “Limited Test” వలె Bachelorette కస్టమ్ టైమ్ లైన్ 10 వారాల పాటు అందుబాటులో ఉంటుంది.

ఐక్యూ 10 సిరీస్‌ నుంచి కొత్త ఫోన్ల విడుదల !


ఐక్యూ 10 సిరీస్‌ నుంచి కొత్తగా ఐక్యూ 10 , ఐక్యూ 10 ప్రో మోడళ్లు చైనాలో తాజాగా లాంచ్ అయ్యాయి. వీటిలో ఐక్యూ 10 ప్రో వేరియంట్ హై లెవల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ సెటప్ 8K వీడియోను రికార్డ్ చేయగలదు. దీంతోపాటు 14.6-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ 150-డిగ్రీ అల్ట్రా వైడ్ సెన్సార్‌ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 100% DCI-P3 రేటింగ్‌ దీని సొంతం. అంటే ఇది RGB కలర్ స్పేస్ మొత్తం స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC చిప్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ అవసరాల కోసం ఫ్రేమ్ రేట్లను పెంచడానికి ఇంటర్‌పోలేషన్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ చిప్‌సెట్ డివైజ్‌లో పవర్‌ను కూడా నియంత్రిస్తుంది, ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. ఈ ఫోన్‌లో 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 4700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది రెండు సెల్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇది ఏకంగా 200W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల్లోనే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని ఐక్యూ తెలిపింది. ఇది 65W వరకు USB పవర్ డెలివరీ ఛార్జ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్టాండర్డ్ వేరియంట్ ఐక్యూ 10 కూడా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.. అదే మెమరీ, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో లభిస్తుంది. ఈ డివైజ్‌లో కూడా 4700mAh స్ప్లిట్ బ్యాటరీ ఉంటుంది. అయితే ఇది 120W ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లో వీటి లాంచింగ్‌పై స్పష్టత లేదు.

డ్రైవర్ లేని రోబో టాక్సీ ?


చైనా లోని ఒక కంపెనీ  డ్రైవర్ లేకుండా ఎలక్ట్రిక్ రోబో టాక్సీలు త్వరలోనే అందుబాటులోకి రానుంది.  ఇది అపోలో గో యాప్‌ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీ నడుపుకుంటుందట. అయితే ఈ టాక్సీ తయారీకి అయిన ఖర్చు రూ.29,54,635 అనగా 37 వేల డాలరర్లు. ఈ టాక్సీ లో సాధారణ కారుల మాదిరిగా స్టీరింగ్ ఉండదు. స్టీరింగ్ ఉండకపోవడంతో ఈ టాక్సీలో ప్లేస్ మరింత విశాలంగా ఉంటుంది. అందులో ప్రయాణించే ప్రయాణికులకు అదనపు స్థలం కూడా లభిస్తుంది. అయితే డ్రైవింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి వాహనాన్ని ఎలా నడుపుతాడో అదే తరహాలో ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ నడుపుతుందని బైడూ సంస్థ వెల్లడించింది. ఇందులో 38 రకాల సెన్సార్లు ఉంటాయట. యాప్‌ నుంచి అందే ఆదేశాల మేరకు నడుచుకుంటుంది. ఈ టాక్సీని 2023 నాటికి మార్కెట్ లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ సంస్థ చెబుతోంది. అయితే ఈ రకం టాక్సీలను కనీసం లక్ష క్యాబ్‌లను తీసుకొస్తామని అంటోంది. రోబో ట్యాక్సీ తయారీ గూగుల్‌కు చైనా ఇచ్చిన సమాధానమని బైడూ సీనియర్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వ్యాఖ్యానించారు. చైనాలో అపోలో గో యాప్‌ను ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. అపోలో ఆర్‌టీ6లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. డోర్ లను కూడా చేతితో తెరవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్‌ కనెక్షన్‌ లేదా యాప్‌ ద్వారా తెరవొచ్చు.చుట్టుపక్కల పరిసరాలను అనుక్షణం గమనించడానికి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లలో 2డీ కెమెరాలు, డెప్త్‌ సెన్సింగ్‌ లైట్‌ డిటెక్షన్, రేంజింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. అయితే మనుషులు అయితే ఎదురుగా వచ్చే కార్లను సిగ్నలను పాటిస్తారు మరి ఈ కార్లు ఎలా పాటిస్తాయి అన్న విషయానికి వస్తే..ఎదురుగా వచ్చే మనుషులు, సిగ్నళ్లు, ప్రమాదాలను కచ్చితంగా గుర్తించడానికి కృత్రిమ మేధ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో సాధారణ ట్యాక్సీ ధరలో సగం ధరకే రోబో ట్యాక్సీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బైడూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్‌ లీ చెప్పారు. కాగా 2025 నాటికి 65 నగరాల్లో, 2030 నాటికి 100 నగరాల్లో రోబో ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని బైడూ యోచిస్తోంది.

Popular Posts