Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, November 30, 2022

డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ నుంచి లావాదేవీలు జరుపుతున్నారా?


మార్కెట్లో కొత్త కొత్త యాప్స్‌ పుట్టకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఆర్థిక లావాదేవీలను సులభతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి యూపీఐ డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో పరిమితులు విధించేందుకు సిద్ధమవుతోంది. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ నుంచి యూపీఐ లావాదేవీలు నిర్వహించడం, ఈ యాప్స్‌ నుంచి లావాదేవీలు 30 శాతం మించి రాకూడదన్న నిబంధనలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే డిజిటల్‌ లావాదేవీల యాప్స్‌ వాడకంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. నెలకు ఇన్ని లావాదేవీలు మాత్రమే జరిపేందుకు అవకాశం ఉంటుదనే నిబంధనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యాప్స్‌ వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డిజిటల్‌ యుగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలు జరుగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేసేందుకు ముఠాలు పుట్టుకొస్తున్నాయి. మొబైల్ పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి అవతలి వ్యక్తి బ్యాంకు అకౌంట్ల వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి. అవి మన అకౌంట్‌కు లింకై ఉండాలి. అప్పుడే డబ్బులు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఇవి అన్ని కూడా ఒక్కఫోన్‌ నెంబర్‌ ఉంటే చాలు ఎవరికైనా డబ్బులు పంపుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ సర్వీసులు అందించే యాప్స్‌ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, వాట్సాప్‌ పే లాంటివి ఉన్నాయి. యాప్స్‌ ద్వారా చేసే లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో రకరకాల కొత్త యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏవి నమ్మాలో.. ఏవి నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది. ముందుగా ప్లేస్టోర్‌ గానీ, యాప్‌ స్టోర్‌లో గానీ ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు యాప్‌కు సరైన రేటింగ్స్‌ ఉన్నాయా? రివ్యూస్‌ ఉన్నాయా వాటివి గమనించాలి. అలాగే యాప్స్‌ లాగి కావడానికి ఎలాంటి నియమాలు ఉన్నాయో గుర్తించాలి. పగడ్బందీగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. అలాగే యాప్స్‌కు బలమైన పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటుందా? లేదా అనేది గమనించాలి. ఫోన్‌ ఓపెన్‌ చేసేందుకు ఇచ్చే పాస్‌వర్డ్‌.. యాప్స్‌ ఓపెన్‌ చేసేందుకు మళ్లీ మళ్లీ పాస్‌వర్డ్‌ అడుగుతుందా అనేది చూడాలి. యాప్‌ నుంచి ఇతరులకు డబ్బులు పంపినా, డబ్బులు వచ్చినా నోటిఫికేషన్స్‌ వస్తున్నాయా? లేదా అనేది గమనించాలి. ఇతరులకు పేమెంట్‌ చేసే ముందు కన్‌ఫర్మేషన్‌ అడుగుతుందా? లేదా చూడాలి. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసే ముందు ఎలాంటి పర్మిషన్లు అడుగుతుంది..? ఇంకా అందులో ఎలాంటి వివరాలు ఉన్నాయో తప్పకుండా గుర్తించాలి.

టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ !


టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల టీవీఎస్ ద్విచక్ర వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటితో పాటుగా ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి సరికొత్త మోడల్స్ ని తీసుకువస్తోంది. ఇలా ఉంటే తాజాగా మార్కెట్ లోకి సరికొత్త లుక్ లో రెండు అపాచీ బైకులను తీసుకువచ్చింది. టీవీఎస్‌ మోటార్‌ 2023 స్పెషల్‌ ఎడిషన్‌ టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ తాజాగా ప్రవేశపెట్టింది. కొత్త కలర్‌, కొత్త అప్‌డేట్స్‌తో స్పెషల్‌గా ఆవిష్కరించింది. 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో 159.7 సీసీ ఆయిల్‌ కూల్డ్, ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజన్‌ తో లభించనుంది. అలాగే ఇది 250 ఆర్‌పీఎం వద్ద 17.39 బీహెచ్‌పీ పవర్, 7250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్‌ లో బ్లాక్ రెడ్ కలర్ అలాగే కొత్త పెర్ల్ వైట్ కలర్ లలో ఈ బైక్ లభించింది. కొత్త సీటు నమూనాతో డ్యూయల్ టోన్ సీటు, ఎడ్జస్టబుల్‌ క్లచ్ అండ్‌, బ్రేక్ లివర్లు, అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్‌మోడ్స్‌ లో లభించనున్నాయి. మార్కెట్లోకి విడుదల చేసిన ఈ బైక్  ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కాగా తాజాగా మార్కెట్లోకి విడుదలైన ఈ బైక్ సరికొత్త లుక్ లో అద్భుతమైన కలర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కాగా బైక్స్ అత్యాధునిక సాంకేతికతతో కస్టమర్ సెంట్రిసిటీలో ఎప్పుడు ముందంజలో ఉన్నాయనీ, అలాగే కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్‌ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై మైక్రోసాఫ్ట్, లింక్డిన్ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్ !


మైక్రోసాఫ్ట్‌, లింక్డిన్‌ కలిసి 50 వేల లెర్నింగ్‌ స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ప్రణాళికలు తయారుచేశారు. హై డిమాండ్‌ ఉన్న జాబ్‌ల కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నాయి. 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కోటి మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది. భారత్‌లో క్రిటికల్‌ సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, డేటా అనలిస్ట్‌లు, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌లు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, కస్టమర్‌ సర్వీస్‌ స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు లింక్డిన్‌ టాప్‌ లెర్నింగ్‌ ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆసియాలో ఇప్పటికే కోటి నలభై లక్షల మంది పాల్గొన్నారు. వీరిలో 70 లక్షల మందికి పైగా భారత్‌ నుంచే ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా నేషనల్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ డాక్టర్‌ రోహిణి శ్రీవత్స మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, వాటికి తగ్గ నైపుణ్యాల విషయంలో గ్యాప్‌ ఉందన్నారు. భారత యువతకు ఇప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం తమ సంస్థ ఇన్వెస్ట్‌ చేస్తోందని తెలిపారు. వెనుకబడిన వారికీ ఈ సేవలను చేరువ చేసి, అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరో 10 లక్షల మందికి తాము సాయపడాలని అనుకున్నట్లు తెలిపారు. కావాల్సిన నైపుణ్యాలను కల్పించడం కోసం వారికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. దీంతో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, విజయాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కోసం తాము లింక్డిన్‌తో కలిసి పని చేస్తున్నామని రోహిణి శ్రీవత్స వెల్లడించారు. దీనితోపాటుగా తమకు లోకల్‌ పార్టనర్లు కార్యక్రమ నిర్వహణలో సహకరిస్తున్నారని చెప్పారు. స్థానిక సంఘాల సహకారం కూడా తమకు ఉందని తెలిపారు. ఈ డిజిటల్‌ ఎకో సిస్టమ్‌ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న స్థితిలో ఉందని దీనికి తగినట్లుగా యువత సిద్ధం అవ్వాలని సూచించారు. అప్పుడే ఈ పోటీ వాతావరణంలో వారికి భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చెప్పారు. అందుకనే తాము నైపుణ్యాలను టీచ్‌ చెయ్యడంపై దృష్టి పెట్టామని తెలిపారు. దీని ద్వారా తాము రెండు రకాలుగా సహాయం చేయగలుగుతున్నామన్నారు. ఒకటి ఉద్యోగార్థులు సరైన అవకాశాలను అందుకునేలా చేస్తున్ననామని, రెండు సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను అందిస్తున్నామని తెలిపారు.

మెక్సికోలో తోకతో జన్మించిన ఆడ శిశువు !


ఈశాన్య మెక్సికోలోని న్యూవో లియోన్ రాష్ట్రంలోని గ్రామీణ ఆసుపత్రిలో ఈ ఆడ శిశువు జన్మించింది. తల్లి ప్రసవం సాధారణ పద్ధతిలో కాకుండా సిజేరియన్‌ జరిగింది. బాలిక తల్లిదండ్రులు 20-30 ఏండ్ల వయసు మధ్య ఉండి, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి రేడియేషన్ లేదా ఇన్ఫెక్షన్‌కు గురికాలేదు. తల్లిదండ్రులకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. వారికి 2.2 అంగుళాల పొడవు తోకతో ఓ ఆడ శిశువు జన్మించింది. కొద్ది సేపటికి మరో 0.8 సెంటీ మీటర్లు పొడవు పెరగడంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. ఇలాంటి కేసులు ప్రపంచంలో 40 మాత్రమే గుర్తించినట్లు వైద్యులు చెప్తున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి తోకను తొలగించారు. బాలికను రెండు నెలల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. చిన్నారి ఆరోగ్యంగా ఉన్నదని మెక్సికో న్యూవో లియోన్‌ వైద్యులు తెలిపారు. జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీలో ప్రచురించబడిన ఈ కేసు నివేదిక ప్రకారం, ఆడ శిశువు తోక పొడవు 5.7 సెం.మీ. దీని వ్యాసం 3-5 మి.మీ. పుట్టినప్పుడు తోక గుండ్రటి కొనతో వెంట్రుకలు కలిగి ఉన్నది. ఆడబిడ్డ పుట్టిన తర్వాత రెండు నెలల పాటు వైద్యులు ఆమెను పర్యవేక్షించారు. ఈ సమయంలో శిశువు సాధారణ పిల్లల్లా పెరుగుతున్నదని గుర్తించారు. బరువు కూడా సాధారణంగానే ఉన్నదని, గుండెలో ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తేల్చారు. చిన్నారి తోకలో ఎముక లేకపోవడంతో మెత్తగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. తోక కదిలించినప్పుడు ఎలాంటి నొప్పి కూడా కలుగలేదు. పలు పరీక్షలు చేసి తోక కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అనంతరం బాలికకు లింబర్గ్‌ ప్లాస్టీ సర్జరీ చేసి శరీరం నుంచి తోకను తొలగించారు. ఇప్పటివరకు మనుషుల్లో రెండు రకాల తోకలను వైద్యులు కనుగొన్నారు. మొదటిది వెస్టిజియల్‌ టేల్‌, రెండోది ట్రూ టేల్‌. ఇంగ్లండ్‌, అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ, జర్మనీలో నిర్వహించిన అధ్యయనాల్లో ఇప్పటివరకు 195 కేసులు నమోదయ్యాయి.

శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ విడుదల !


శాంసంగ్  ఇటీవల గెలాక్సీ డివైజ్‌ల్లో Android 13 ఆధారిత One UI 5.0 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. కొరియన్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేసింది. 2023లోపు అన్ని అర్హత గల అన్ని శాంసంగ్ డివైజ్‌ల కోసం కొత్త Update పూర్తిగా అందించాలని భావిస్తోందని Sammobile నివేదించింది.  వైడ్ రేంజ్ పాటర్న్స్, డిజైన్‌లు, కలర్లతో కొన్ని ఫొటోలను సెట్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఈ కొత్త UI ఫొటోలు, గ్యాలరీ ఫోటోలు, డైనమిక్ లాక్ స్క్రీన్‌ల నుంచి ఒకే చోట ఎంచుకోనేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఆసక్తికరంగా, అప్‌డేట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఎమోజీ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. శాంసంగ్ యూజర్లు గ్యాలరీలో స్టిక్కర్‌లను క్రియేట్ చేయలేరు. AR ఎమోజీలతో క్యాంపిటబుల్ కాల్ మరిన్నింటిని క్రియేట్ చేయవచ్చు. సెక్యూరిటీ ప్రైవసీ పరంగా.. అప్‌డేట్ అదనపు ఫీచర్లను అందిస్తుంది. ఇప్పుడు, (Samsung) యూజర్లు ‘ సెక్యూరిటీ, ప్రైవసీ డ్యాష్‌బోర్డ్ ‘ అనే కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. మైక్రోఫోన్, లొకేషన్ సెట్టింగ్‌లు, కెమెరాకు యాక్సెస్ కలిగిన యాప్‌ల వంటి హ్యాండ్‌సెట్ ప్రైవసీ, సెక్యూరిటీ అంశాలను యూజర్లకు సూచించేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ యూజర్లు తమ డివైజ్ సెక్యూరిటీని మెరుగుపరచడంలో సాయపడుతుంది. అంతేకాదు.. యూజర్లు ఫ్యూచర్‌లో తమ డివైజ్‌ల కోసం మరిన్ని సెక్యూరిటీ ప్యాచ్‌లు, అప్‌డేట్స్ అందుకోవచ్చు.

ఫోటో బ్లర్ చేయడానికి వాట్సాప్ లో కొత్త ఫీచర్ !


స్మార్ట్ ఫోన్/ డెస్క్ టాప్ యూజర్ల కోసం ఫోటో బ్లర్ చేసే కొత్త ఫీచర్ వాట్సాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా అవతలి వ్యక్తికి పంపాలనుకున్న ఫొటోలో కొంత భాగం లేదా మొత్తాన్ని బ్లర్ చేయొచ్చు.
స్మార్ట్ ఫోన్ లో  స్మార్ట్‌ఫోన్‌/ కంప్యూటర్ లో వాట్సాప్ ఓపెన్ చేసి, ఫోటోను ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి చాట్‌ని తెరవండి. అటాచ్‌మెంట్ చిహ్నంపై క్లిక్ చేయండి. గ్యాలరీ ఎంపికకు వెళ్లి చిత్రాన్ని ఎంచుకోండి. ఇప్పుడు వాట్సాప్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ కుడి ఎగువ మూలలో అందుబాటులో ఉన్న పెన్ టూల్‌పై నొక్కండి. తరువాత  స్క్రీన్ దిగువన అందుబాటులో ఉన్న బ్లర్ చిహ్నంపై నొక్కండి. ఫోటోలో అవసరం లేని భాగాన్ని బ్లర్ చేయండి. బ్లర్ చేయడం పూర్తయ్యాక సెండ్ బటన్‌ను నొక్కండి. 

డెస్క్‌టాప్ లో కంప్యూటర్‌లోని డెస్క్‌టాప్ వాట్సాప్ ఓపెన్ చేసి, ఫోటోను ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి చాట్‌ని తెరవండి. అటాచ్‌మెంట్ చిహ్నంపై క్లిక్ చేయండి. గ్యాలరీ ఎంపికకు వెళ్లి చిత్రాన్ని ఎంచుకోండి.తరువాత వాట్సాప్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ పైభాగాన ఉన్న బ్లర్ ఆప్షన్ ఎంచుకోండి. డెస్క్‌టాప్/వెబ్‌ వాట్సాప్ లో ఇమేజ్ బ్లర్ అనేది రెండు విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు దిగువన అందుబాటులో ఉన్న బ్లర్ చిహ్నంపై నొక్కండి. ఫోటో లో అవసరం లేని భాగాన్ని బ్లర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

Tuesday, November 29, 2022

ఎలక్ట్రిక్‌ వాహనం రూ.35 వేలే !


పంజాబ్ కు చెందిన నౌషా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొత్త ఈవీని రూపొందించింది. దీని ధర కేవలం రూ. 35 వేలు మాత్రమే. తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్‌ అనే చెప్పాలి. ఈ స్కూటర్‌ తయారీలో వ్యవసాయ బోర్లలో ఉపయోగించే సబ్‌మెర్సిబుల్ బోర్‌వెల్ మోటారును ఉపయోగించారు. పైన భాగాన్ని తీసేసి లోపలి భాగాన్ని ఈ స్కూటర్‌కు వాడారు. హబ్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్ వంటివి కూడా ఇతర ఈవీల నుంచి తీసుకున్నారు. తాము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా స్క్రాప్ మెటీరియల్స్‌తో తయారు చేశానని, వీటిని గతంలో వాడేందుకు అనర్హమైనదిగా భావించినట్లు నౌషా పేర్కొంది. అయితే కొన్ని స్క్రాప్ మెటీరియల్‌ని ఎంపిక చేసి ఈ స్కూటర్‌కు ఉపయోగించినట్లు నౌషా తెలిపింది. అయితే నౌషా ఎలక్ట్రిక్‌ స్కూటర్ అనేది కంపెనీ కాదు. ఈవీ వాహనాలకు సంబంధించి విడి భాగాలను దిగుమతి చేసుకుని స్కూటర్‌ను తయారు చేస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారు చేయడానికి మొదట రూ.40 వేల వరకు ఖర్చు అయిందట. తర్వాత దీనిని రూ.35కే తయారు చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ స్కూటర్‌కు ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వాహనం కొనుగోలు చేసేందుకు అందుబాటులో లేకపోయినా. త్వరలో అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశాలు న్నాయి. ఈ స్కూటర్‌ బ్లాక్‌, ఎల్లో రంగుల్లో లభించనున్నాయి. ఎల్లో రంగు వాహనం ముందు భాగంలో డ్రమ్‌ బ్రేక్స్‌ ఉండగా, బ్లాక్‌ వేరియంట్‌లో ఉండవని తెలుస్తోంది.

డిసెంబర్ 2 నుంచి బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్ !


బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం ఎలన్ మస్క్ కొత్త పద్ధతి తీసుకొస్తున్నాడు. యూజర్ల బ్లూ చెక్‌మార్క్‌ను రీవెరిఫికేషన్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీని ప్రకారం ఇప్పటికే బ్లూ చెక్‌మార్క్ పొందిన యూజర్లు మరోసారి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎవరైనా బ్లూ చెక్‌మార్క్ పొందేందుకు అర్హులు కాదని భావిస్తే, వారి అకౌంట్ ప్రొఫైల్ నుంచి బ్లూటిక్ మార్క్ తొలగిస్తారు. కొత్త బ్లూ టిక్ రీలాంఛ్ ఫీచర్ ప్రారంభించడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మస్క్ భావిస్తున్నాడు. డిసెంబర్ 2 నుంచి బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. ఇది పూర్తైన తర్వాత నుంచి కొత్త బ్లూటిక్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీనికోసం యూజర్లు నెలనెలా ఛార్జీలు చెల్లించాలి. అలాగే కొత్త చెక్‌మార్క్‌కు బ్లూ కలర్ ఒక్కటే కాకుండా… వేరువేరు కలర్స్ వాడే అవకాశాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. గోల్డ్ కలర్ ప్రైవేటు సంస్థలకు, గ్రే కలర్ ప్రభుత్వ సంస్థలకు, బ్లూ కలర్ వ్యక్తులకు ఇవ్వాలని ట్విట్టర్ భావిస్తోంది.

12 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు !


ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్  సర్వీసులను ఇప్పుడు మరిన్ని భారతీయ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో దాదాపు ప్రతిరోజూ 5G లిస్టులో కొత్త నగరాలను యాడ్ చేస్తున్నాయి. కస్టమర్లకు 5G సర్వీసులను వేగవంతంగా అందించేందుకు ఇప్పుడు కొన్ని విమానాశ్రయాల్లో 5G సర్వీసులను కూడా అందుబాటులో తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, హైదరాబాద్, వారణాసి, ముంబై, నాగ్‌పూర్, చెన్నైతో సహా 12 భారతీయ నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత గురుగ్రామ్, పానిపట్, గౌహతిలో కూడా నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పాట్నా సాహిబ్ గురుద్వారా, పాట్నా రైల్వే స్టేషన్, డాక్ బంగ్లా, మౌర్య లోక్, బైలీ రోడ్, బోరింగ్ రోడ్, సిటీ సెంటర్ మాల్, పాట్లీపుత్ర ఇండస్ట్రియల్ ఏరియా, మరికొన్ని ప్రదేశాలతో సహా పాట్నాలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తమ 5G సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయాల విషయానికొస్తే.. వినియోగదారులు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, పూణేలోని లోహెగావ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పాట్నా విమానాశ్రయంలో ఎయిర్‌టెల్ 5G పొందవచ్చు.

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ ధర తగ్గింది !


షావోమీ ఇండియా ఈ ఏడాది మార్చిలో రెడ్‌మీ 11 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ మొబైల్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో రెడ్‌మీ నోట్ 12 సిరీస్ లాంఛ్ కానుంది. దీంతో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ ధర తగ్గించింది. మూడు వేరియంట్ల ధరల్ని రూ.2,000 వరకు తగ్గించింది. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.1,000 తగ్గగా, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్ల ధర రూ.2,000 తగ్గింది. ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ ధర రూ.22,999. అమెజాన్‌లో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ కొనేవారికి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెక్స్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులపైనే ఆఫర్స్ ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71, మోటో జీ62, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 5.1, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో లభ్యమవుతాయి. 

బిఎస్ఎన్ఎల్ నుంచి బెస్ట్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లు !


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దేశంలోని ప్రతి మూలలో వాయిస్ మరియు ఇంటర్నెట్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ అతిపెద్ద నెట్ వర్క్ తో పాటు, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో ప్రసిద్ధి చెందింది. ఇంకా దేశవ్యాప్తంగా 4G సేవలను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేనప్పటికీ.. తమ యూజర్లకు అద్భుతమైన సేవల్ని అందిస్తోంది. రూ.298 ప్లాన్‌లో 52 రోజుల Eros Now ఎంటర్టైన్ మెంట్, రోజుకు 1GB ఇంటర్నెట్, రోజుకు 100 ఉచిత SMS పొందవచ్చు. మరియు ఢిల్లీ మరియు ముంబైలోని MTNL కవరేజీ ప్రాంతాలతో సహా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్‌లు ఉన్నాయి. 1GB తర్వాత వేగం 40 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్‌ను BSNL వెబ్‌సైట్ లేదా ఇతర ఆన్‌లైన్ రీఛార్జ్ యాప్‌లు లేదా పోర్టల్‌ల ద్వారా వినియోగదారు నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.319 ప్లాన్ లో 65 రోజుల వ్యవధిలో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా BSNL నుండి అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ప్యాకేజీ 300 SMS మరియు మొత్తం 10GB డేటాతో వస్తుంది.

రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 54 రోజుల చెల్లుబాటు వ్యవధి వర్తిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు ప్రతి రోజు 2GB డేటాతో వస్తుంది. రోజువారీ డేటా కేటాయింపు మొత్తాన్ని ఉపయోగించిన తర్వాత, వేగం 40 Kbpsకి తగ్గుతుంది. ప్యాకేజీతో పాటు 100 SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి. M/S ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా ప్రోగ్రెసివ్ వెబ్ APP(PWA)లో ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ యొక్క అదనపు ప్రయోజనం రూ.347 ప్యాకేజీలో చేర్చబడింది. అదనంగా, ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రాంతాల్లో ఉచిత జాతీయ రోమింగ్ ఈ ప్లాన్ యొక్క కాలింగ్ ప్రయోజనాలలో చేర్చబడింది.

రూ.395 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క 71-రోజుల వాలిడిటీ రోజుకు 2GB డేటాను అందిస్తుంది, ఇది 3,000 నిమిషాల ఆన్-నెట్ వాయిస్ కాల్‌లు మరియు 1,800 నిమిషాల ఆఫ్-నెట్ వాయిస్ కాల్‌లకు పరిమితం చేయబడింది. ఉచిత నిమిషాల తర్వాత కాల్ ఛార్జీలు నిమిషానికి రూ. 20 వర్తిస్తాయి. ప్రతిరోజు 2GB డేటా వినియోగించినప్పుడు, డేటా వేగం 40 Kbpsకి తగ్గుతుంది.

నిలిచిన జియో సేవలు !


దేశవ్యాప్తంగా  రిలయన్స్‌ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్‌, మెసేజింగ్‌ లలో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలను నిలిచిపోయాయని పలువురు యూజర్లు తెలిపారు. ఈ విషయంపై పలువురు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. చాలా మంది వినియోగదారులు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు తెలిపారు. కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ సేవలు దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిలిచిపోయినట్లు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. కాలింగ్, మెసేజింగ్‎కు అంతరాయం ఏర్పడిందని, డేటా సర్వీసెస్‌కు ఇబ్బంది కలగలేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. జియో సర్వీసులు నిలిచిపోవడంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌గా మారాయి. మరోవైపు, ఓ యూజన్‌ తన మొబైల్‌లో ఉదయం నుంచి వోల్టీ సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌కాల్స్‌ చేయలేకపోయినట్లు ట్వీట్‌ చేశాడు. సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నించాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown ట్రెండ్‌ అవుతున్నది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు.

Monday, November 28, 2022

హోండా యాక్టివా 7జీ !


హోండా త్వరలో కొత్త యాక్టివాని తీసుకురానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వెర్షన్ తో పోల్చుకుంటే యాక్టివా 7జీ లో చాలా మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ ఇంజిన్‌ తో కంపెనీ 7జీ యాక్టివా లో హైబ్రిడ్ ఇంజిన్‌ అందించవచ్చు. ఈ ఇంజన్ 109 సిసి హైబ్రిడ్ ఇంజన్ కావచ్చు. హైబ్రిడ్‌తో పాటుగా కంపెనీ కొత్త యాక్టివాలో ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. అంటే స్కూటర్ కొద్దిసేపు ఆన్ చేసి ఉంటే ఆగిపోతుంది. మళ్ళీ క్లచ్ నొక్కిన వెంటనే స్టార్ట్ అవుతుంది. అలా యావరేజ్ మైలేజ్ కూడా మెరుగుపరుస్తుంది. ఈ కొత్త యాక్టివా 7జీ లో ఇప్పటికే ఉన్న టైర్ల కంటే కంపెనీ కాస్త పెద్ద టైర్లను ఇవ్వనుంది. పెద్ద వీల్స్, వెడల్పైన టైర్లు స్కూటర్ హ్యాండ్లింగ్ చాలా మెరుగుపరుస్తుంది. యాక్టీవా 7జీ లో కొత్త అండ్ మెరుగైన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వవచ్చు. ప్రస్తుత యాక్టివా అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. కొత్త యాక్టివాలో కంపెనీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇవ్వవచ్చని తెలుస్తోంది.  దీని వల్ల మెరుగ్గా కనిపించడమే కాకుండా ఇతర కంపెనీల స్కూటర్ల లాగానే యాక్టివా కూడా అప్‌డేట్ అవుతుంది. అంతేకాకుండా, కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీ, హైబ్రిడ్ స్విచ్ వంటి ఎన్నో ఇతర ఫీచర్లను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్టివా డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. కాగా ఇప్పటివరకు యాక్టివా స్టాండర్డ్ డిజైన్‌లో కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చేయలేదు. ఫస్ట్ జనరేషన్ యాక్టివా నుండి ప్రస్తుత యాక్టివా వరకు డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

డిసెంబర్ 2న ఐక్యూ నియో 7 SE విడుదల


ఐక్యూ నుంచి కొత్త మిడ్-రేంజ్ అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. వచ్చే డిసెంబర్ 2న అధికారికంగా ఐక్యూ నియో 7 SE స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. అధికారిక ప్రకటనకు ముందే ఐక్యూ నియో 7 SE ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కంపెనీ ఈ ఏడాది మేలో ఐక్యూ నియో 6 SE ని తీసుకొచ్చింది.  ఆరు నెలల తర్వాత, మిడ్-రేంజ్ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. భారతీయ మార్కెట్‌కు కూడా ఈ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు.  ఐక్యూ నియో 6 SE  లాగానే దాదాపు ఒకే ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఐక్యూ నియో 7 కూడా గత నెలలో చైనాలో లాంచ్ అయింది. రెండు ఫోన్‌లు రాబోయే నెలల్లో భారత మార్కెట్లో లాంచ్ అవుతాయా లేదా అందులో ఒకటి మాత్రమే లాంచ్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. రాబోయే వారాల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. రాబోయే ఐక్యూ నియో 7 SE  ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి స్మార్ట్‌ఫోన్ TENAA లిస్టింగ్‌లో గుర్తించారు.ఐక్యూ నియో 7 SE 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుందని వెల్లడించింది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పాటు 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరహాలో షార్ట్ వీడియోస్ కు జియో కొత్త యాప్‌


రిలయన్స్‌ జియో వినియోగదారుల కోసం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరహాలో షార్ట్ వీడియోస్ కోసం ఈ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ ప్రారంభంలో మొదట వంద మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఆ తర్వాత ఇన్విటేషన్ రూపంలో ఇతరులకు ఆహ్వానం పంపిస్తారు. వినోదాన్ని అందించే స్టార్స్‌కు ఇదొక అంతిమ గమ్యం అవుతుంది. గాయకులు, సంగీతకారులు, నటులు, హాస్య నటులు, డ్యాన్సర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్కృతిని ప్రభావితం చేసే సృష్టికర్తలు అందరికీ ఇది గమ్యస్థానం” అని జియో ఫ్లాట్‌ఫామ్స్ ఓ ప్రటనలో తెలిపింది. రిలయన్స్‌ జియో తీసుకువచ్చిన ఈ కొత్త యాప్‌లో షార్ట్‌ వీడియోలు అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియో యాప్ బీటా వెర్షన్‌లో వచ్చింది. పూర్తి స్థాయి వెర్షన్ 2023 జనవరి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అపుడు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ అందరికి అవకాశం ఉండదు. తర్వాత వెర్షన్‌లో అందరికి అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇండియాలో అమెజాన్ హోల్‌సేల్ వ్యాపారం మూసివేత


అమెజాన్ ఇటీవల వరుసగా తన వ్యాపారాలను క్లోజ్ చేస్తోంది. మన దేశంలో అమెజాన్.కామ్ కేవలం వారం రోజుల వ్యవధిలో తన మూడవ వ్యాపారాన్ని మూసివేయటం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. నవంబర్ 24న అమెజాన్ అకాడమీని, నవంబర్ 25న అమెజాన్ ఫుడ్‌ను నిలిపివేసింది కంపెనీ. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం దేశంలో ఖర్చులను తగ్గించుకోవటం కష్టతరంగా మారటంతో మరో వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. హోల్‌సేల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ తాజా నిర్ణయం వల్ల కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, హుబ్లీ నగరాల చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు డిస్ట్రిబ్యూషన్‌ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లు, భాగస్వాములను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని దశలవారీగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశంలో కిరాణా, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, B2B ఆఫర్‌ల వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అమిత్ అగర్వాల్ నేతృత్వంలోని అమెజాన్ ఇండియా.. దాదాపు దశాబ్దపు కార్యకలాపాల్లో లాభదాయకతను పొందడం చాలా కష్టమైంది. భారతదేశంలో అమెజాన్ ఇప్పటి వరకు 6.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టబడింది. అయితే లాభదాయకత అస్పష్టంగానే ఉండటంతో ఇటీవల సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. 

ట్వీట్ సైజ్​ను పెంచనున్న ట్విట్టర్ !


ఎలాన్ మస్క్ సారథ్యంలో ట్విట్టర్ లో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ట్విట్టర్ ను మరింత చురుకైన, మెరుగైన వేదికగా మార్చాలని మస్క్ విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగా ట్వీట్ లో అక్షరాల పరిమితిని పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల యూజర్లు తమ భావాలను మరింత వివరంగా చెప్పే వీలు కలుగుతుంది. ''మస్క్ ట్విట్టర్ 2.0లో తప్పకుండా క్యారెక్టర్ల పరిమితిని 280కు బదులు 420 చేయాలి'' అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చెయ్యగా దానికి మస్క్ స్పందిస్తూ మంచి ఆలోచన అంటూ సమాధానం ఇచ్చారు. దానితో త్వరలోనే ఈ కొత్త అప్డేట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ట్విట్టర్ ఆరంభంలో 140 క్యారెక్టర్లనే ఒక ట్వీట్ లో అనుమతించగా క్రమంగా 2018లో దీన్ని 280 క్యారెక్టర్లకు పెంచింది. ఇప్పుడది తర్వలో 420 క్యారెక్టర్లకు మారనుందని తెలుస్తోంది.

త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ ?


వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని చూపించే ట్యాబ్ రానుందని తెలుస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌ల ద్వారా వాట్సాప్ నుంచి కొత్త కాల్స్ ట్యాబ్ యాప్ సైడ్‌బార్‌లో కనిపించింది. వాట్సాప్ డెస్క్‌టాప్ సైడ్‌బార్‌లో ఉన్న కాల్స్ ట్యాబ్ ప్రస్తుతంజ్ మైక్రోసాఫ్ట్   స్టోర్ నుంచి యాప్ తాజా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవల ఆండ్రాయిడ్, iOS వినియోగదారులపై ఉన్న వినియోగదారులకు వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే టిప్‌స్టర్ షేర్ చేసిన కాల్స్ ట్యాబ్‌లో లేటెస్ట్ కాల్స్‌ను చూపించడం లేదు.వాట్సాప్ ఇంకా ఈ ఫీచర్‌ను ప్రకటించలేదు. వాట్సాప్ ఇటీవల యాప్‌లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది. వాట్సాప్ పోల్స్ గత వారం Android, iOS రెండింటిలోనూ ప్రారంభించారు. వాట్సాప్‌లో ఇటీవలే మరో సరికొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది 'ఎల్లో పేజెస్' తరహా ఫీచర్. ఇది వాట్సాప్‌లో బిజినెస్‌లను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. WhatsApp ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్. బ్రెజిల్‌తో మొట్టమొదటగా "డైరెక్టరీ" ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు WhatsApp శుక్రవారం తెలిపింది, దీని ద్వారా వినియోగదారులు సమీపంలోని స్థానిక చిన్న వ్యాపారాలను బ్రౌజ్ చేయవచ్చు, కనుగొనవచ్చు. డైరెక్టరీని మొదట సావో పాలోలో వాట్సాప్ పరీక్షించింది. పూర్తిగా విజయవంతమైన తర్వాత దీన్ని బ్రెజిల్‌లో విడుదల చేయబోతున్నారు.

Sunday, November 27, 2022

ఆక్టోపస్‌ జీవిత కాలం ఎంత ?


ఆక్టోపస్ అంటే ఎనిమిది కాళ్లు వుండే జీవి. దీనికి వెన్నెముక వుండదు. వెన్నెముక లేని జీవులలో కెల్లా ఆక్టోపస్ చాలా తెలివైనది. ఆక్టోపస్ శరీరం లోపల గానీ బయట గాని అస్తిపంజరం లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రదేశముల్లో కూడా చాలా సులువుగా దూరిపోతుంది. . ఇది ఎక్కువగా సముద్రాల్లో జీవిస్తుంది. కొన్ని ఆక్టోపస్‌లు ఆరు నెలలు మాత్రమే ప్రాణాలతో ఉంటాయి. మగ ఆక్టోపస్‌లు మేటింగ్ తర్వాత కొద్ది నెలలకే చనిపోతాయి. ఆక్టోపస్ శరీరంలో ఉండే రెండు ఆప్టిక్ గ్రంథుల నుంచి వెలువడే ఎండోక్రైన్ స్రావాల వల్ల జన్యుపరంగా ముందుగానే చనిపోతుంటాయి. అయితే శాస్త్రజ్ఞులు ఈ గ్రంథులను ఆపరేషన్ ద్వారా తొలగిస్తే ఆక్టోపస్‌లు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆక్టోపస్‌ల జీవిత కాలం చాలా తక్కువేనని చెప్పాలి. అయితే ఆక్టోపస్‌ల మరణానికి వాటి పునరుత్పత్తే కారణం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అక్టోపస్‌కు ఉండేవి కాళ్ళు అని అనుకుంటారు. కానీ అవి కాళ్లు కాదు. చేతులు. అలాగే దీని ప్రతి చేతిలో మెదడు ఉంటుంది. ఈ జీవికి 9 మెదడులు ఉండటం గమనార్హం. ఇది ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు, దాని రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే ఈ జీవి ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఉండే చేతులు ఎంతో ఉపయోగపడతాయట. ఏ జీవి నుండి అయినా రక్షించడానికి ప్రతి వైపు ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణాన్ని పొందకపోతే అది విసుగు చెందుతుందట. ఆపై తన చేతులను తానే కొరుకుకోవడం ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్టోపస్‌ల నాడీ వ్యవస్థ కాస్త పెద్దగానే ఉంటుంది. సగటున ఒక్కో ఆక్టోపస్‌లో 50 కోట్ల నాడీ కణాలు లేదా మెదడు కణాలు ఉంటాయట. అయితే, శునకాలు, మనుషులు, ఇతర జీవులకు భిన్నంగా ఆక్టోపస్‌లలో ఎక్కువ నాడీకణాలు ‘టెంటకల్స్’ అంటే చేతుల్లో ఉంటాయి. నిజానికి మెదడులో కంటే వాటి టెంటకల్స్‌లోనే రెట్టింపు సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. ఆక్టోపస్ టెంటక్స్‌లోని ప్రతి బొడిపె మీద దాదాపు 10,000 నాడీకణాలు ఉంటాయి. ఇవి స్పర్శ, రుచికి తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక !


ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారి ఫోన్‌లోని సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉన్నదని, గూగుల్, బిట్ డిఫెండర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలు యూజర్లకు పలు సూచనలు చేశాయి. ఆండ్రాయిడ్ ఫోన్లకు షార్క్‌బాట్ అని పిలిచే మాల్‌వేర్ ముప్పు పొంచి ఉంది. ప్లే స్టోర్‌లో ఉన్న ఆరు యాప్‌ల ద్వారా షార్క్‌బాట్ మాల్‌వేర్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోంది. ఎక్స్-ఫైల్ మేనేజర్, ఫైల్ వోయోజర్, ఫోన్ ఎయిడ్, క్లీనర్, బూస్టర్ 2.6, లైట్ క్లీనర్ ఎమ్ అనే ఆరు యాప్స్ ద్వారా షార్క్‌బాట్ మాల్‌వేర్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోంది. అందువల్ల ఈ యాప్స్‌ను యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని సూచించింది. అయితే, ఇది గమనించే లోపే చాలా మంది యూజర్లు వీటిని తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఒకవేళ ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వీటిని డిలీట్ చేయాలి. యూజర్లు వీటిని డిలీట్ చేయడంతోపాటు, తమ ఇతర యాప్స్‌కు సంబంధించిన పాస్ వర్డ్స్, యూజర్ నేమ్స్ మార్చుకోవాలి. ఈ యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది. ఈ యాప్స్ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ల బ్యాంకింగ్ వివరాలు, ఇతర యాప్స్ వివరాల్ని ఆయా సంస్థలు సేకరిస్తున్నాయి. ఈ యాప్స్ బారి నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు ప్లే ప్రొటెక్ట్ సర్వీస్‪ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే ఆండ్రాయిడ్ యాంటీ వైరస్ యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడే యూజర్ల డేటాకు రక్షణ ఉంటుంది.

ప్రత్యామ్నాయ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తా !


అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్‌, గూగుల్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు మస్క్. ఈ రెండు కంపెనీలు తమ యాప్‌ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే గనుక యాపిల్‌ ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పోటీగా తాను ప్రత్యామ్నాయంగా మొబైల్స్‌ తయారీలోకి ప్రవేశిస్తానని అన్నారు. ట్విటర్‌ను తమ యాప్‌ స్టోర్లలో కొనసాగించాలా..? వద్దా..? అనే విషయాన్ని యాపిల్‌, గూగుల్‌ సమీక్షిస్తున్నాయని దానితో ఈ యాప్‌ స్టోర్లు ట్విటర్‌ను తొలగించవచ్చని మస్క్‌ కూడా కొంత ఆందోళన చెందుతున్నారని సమాచారం. అయితే మస్క్ ఈ నిర్ణయానికి రావడానికి ఓ యూజర్‌ ట్వీట్‌ కారణమని చెప్పవచ్చు. ట్విట్టర్ వేదికగా ఓ యూజర్ "ఒకవేళ యాపిల్‌, గూగుల్‌ తమ ప్లే స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే, ఎలాన్‌ మస్క్‌ సొంత స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయాలి. అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్లు తయారు చేసే వ్యక్తికి చిన్న స్మార్ట్‌ఫోన్‌ తయారు చేయడం చాలా సులువు" అంటూ ఆ వ్యక్తి ట్వీట్‌ చేశారు. అందుకు మస్క్‌.. "ఇదెప్పటికీ జరగకూడదని అనుకుంటున్నాను. మరో మార్గం లేని పక్షంలో, ప్రత్యామ్నాయ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తా"నంటూ సమాధానం ఇచ్చారు.

డిసెంబర్ 1 నుంచి హీరో టూ వీలర్స్ ధరల పెంపు !


హీరో మోటొకార్ప్ బైక్, స్కూటర్ ధరలను పెంచినట్లు వెల్లడించింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ తెలియజేసింది. హీరో మోటొకార్ప్ టూవీలర్ ధరలను రూ. 1500 వరకు పెంచింది. ఈ ధరల పెంపు వెహికల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతుంది. అంటే ఒక్కో బైక్ రేటు ఒక్కోలా పెరిగే ఛాన్స్ ఉంది. హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, ప్యాషన్ ప్రో, ఎక్స్‌పల్స్ 200, మ్యాస్ట్రో, ప్లీజర్, డెస్టినీ సహా దేశంలోని మోస్ట్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ బైక్ స్ల్పెండర్ ధర కూడా పైకి చేరింది. మీరు హీరో బైక్ లేదా హీరో స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇంకో మూడు రోజులే మిగిలున్నాయని గుర్తించుకోవాలి. తర్వాతి నుంచి ధరలు పైకి చేరనున్నాయి. హీరో మోటొకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ.. బైక్స్, స్కూటర్లపై దరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వాహన విడిభాగాల రేట్లు కూడా పైకి చేరాయని పేర్కొన్నారు. దీని వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని తెలిపారు. దీంతో డిసెంబర్ 1 నుంచి వాహన ధరలు రూ. 1500 వరకు పైకి చేరనున్నాయి. హీరో స్ల్పెండర్ నెంబర్ 1 మోటార్ సైకిల్‌గా కొనసాగుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో ఈ బైక్ అమ్మకాలు ఏకంగా 2,61,721 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ మోటార్‌సైకిల్ అమ్మకాలను గమనిస్తే.. ఈ బైక్ వాటానే 32.41 శాతంగా ఉంది. రెండో స్థానంలో హోండా సీబీ షైన్ కొనసాగుతోంది. దీని అమ్మకాలు 1,30,916 యూనిట్లుగా ఉన్నాయి.  కంపెనీ వాహన ధరలు పెంచడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం. చివరిగా కంపెనీ సెప్టెంబర్ నెలలో టూవీలర్ ధరలను రూ. 1000 మేర పైకి పెంచేసింది. ఇకపోతే కంపెనీ ఇటీవలనే తొలి ఎలక్ట్రిక్ వెహికల్ విదా వీ1 లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో వంటి మోడళ్లకు ఈ స్కూటర్ పోటీగా మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్కూటర్ రేంజ్ 163 కిలోమీటర్లు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1.45 లక్షలు. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.

చందమామపై చైనా అణుశక్తి ఆధారిత స్థావరం ?


చందమామపై మరో ఆరేండ్లలో అణు విద్యుత్‌ శక్తి ఆధారిత స్థావరాన్ని నిర్మించనున్నట్లు చైనా వెల్లడించింది. చైనా లూనార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రోగ్రామ్‌ చీఫ్‌ డిజైనర్‌ వు వియ్‌రాన్‌ ప్రభుత్వ అధికారిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టంచేసినట్టు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌  తన నివేదికలో స్పష్టంచేసింది. ''మరో ఆరేండ్లలో చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేస్తాం. అది అణు విద్యుత్‌ ఆధారంగా పనిచేస్తుంది. వచ్చే పదేండ్లలో మా వ్యోమగాములు చంద్రుడిపైకి చేరుకుంటారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ల్యాండర్‌, హాపర్‌, ఆర్బిటర్‌, రోవర్‌ అనే నాలుగు కీలక భాగాలుంటాయి.'' వు వియ్‌రాన్‌ స్పష్టం చేశారు. అయితే చంద్రుడిపై స్థావరం కోసం చైనా స్పేస్‌ ఏజెన్సీ ఎలా ప్రణాళికను అనుసరిస్తున్నదో చెప్పేందుకు ఆయన నిరాకరించారు. చైనా చంద్రుడిపై ఏర్పాటు చేయబోయే అణు శక్తి ఆధారిత స్థావరం ఒక మెగావాట్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతుందని, దాంతో ఒక ఏడాదిపాటు వందలాది ఇండ్లకు విద్యుత్‌ను అందజేయవచ్చని SCMP తన నివేదికలో పేర్కొన్నది. చైనా అంచనాల ప్రకారం.. అణు శక్తితో వెలువడే విద్యుత్‌తో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. చంద్రుడిపై వివిధ పరికరాలను ఆపరేట్‌ చేయవచ్చు. నీటిని వెలికితీయవచ్చు. మొత్తానికి 2028 నాటికి చందమామపై చైనా అణు విద్యుత్‌ ఆధారిత స్థావరం పూర్తికానుందని SCMP వెల్లడించింది. ఆ లోగా చంద్రుడిపై నీటి జాడలు, ఇతర అంశాలను అధ్యయనం చేయడం కోసం మానవరహిత లూనార్‌ మిషన్స్‌ను ప్రయోగించాలని చైనా భావిస్తున్నదని తెలిపింది. చంద్రుడి మీది వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనాలు ఎన్నో ఏండ్లుగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి.

గోద్రెజ్‌ ఇన్సులికూల్‌


మధుమేహ రోగుల ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. శరీరంలో చక్కెర స్థాయులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వాటిని నియంత్రించేందుకు తక్షణం ఇన్సులిన్‌ అందించాల్సి ఉంటుంది. అలాంటి అత్యవసర ఔషధాల్ని వెంట తీసుకువెళ్లేందుకు వీలుగా ఇన్సులికూల్‌ వచ్చేసింది. గోద్రెజ్‌ సంస్థ తయారు చేసిన ఈ పరికరం 1.6 కిలోల బరువు ఉంటుంది. చార్జింగ్‌తో పనిచేస్తుంది. దీంట్లో 0.56 లీటర్ల ఔషధాలను నిల్వచేయవచ్చు. అడ్వాన్స్‌డ్‌ థర్మోఎలక్ట్రానిక్‌ కూలింగ్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసే మందులను దీంట్లో పెట్టుకుని తీసుకెళ్లే వీలుంది. ఆన్‌లైన్‌ ధర రూ. 5,999. godrej.comలో పూర్తి వివరాలు చూడవచ్చు.

Saturday, November 26, 2022

మహిళ భద్రత కోసం స్మార్ట్ జాకెట్ !


ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కి చెందిన విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించి మహిళల భద్రత కోసం స్మార్ట్ జాకెట్ తయారు చేశారు. నేటి కాలంలో దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు స్మార్ట్ సొల్యూషన్‌తో ముందుకు వచ్చారు. దుండగులు మహిళలను బలవంతం చేసినప్పుడు, వారిని టచ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తే తగిన గుణపాఠం చెప్పేలా స్మార్ట్ జాకెట్‌ను రెడీ చేశారు. స్మార్ట్ జాకెట్ వేసుకున్న మహిళలపై ఎవరైనా చేయి వేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కరెంటు షాక్ తగులుతుంది. ఇక అవతలి వ్యక్తి బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అదే స్థాయిలో కరెంట్ షాక్‌కు గురౌతాడు. ఒక స్త్రీపై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే లైవ్ రికార్డింగ్ కోసం ఈ స్మార్ట్‌ జాకెట్‌లో చిన్న చిన్న కెమెరాలను కూడా అమర్చారు. దీంతో నిందితుడిని గుర్తించడం కూడా చాలా సులభతరమవుతుంది. ఈ స్మార్ట్ జాకెట్‌ను తయారు చేసేందుకు విద్యార్థులు వైర్లు, సెన్సార్లు, ట్రాన్స్‌మిటర్లు, కెమెరాలు, బ్యాటరీలు, బ్లూటూత్ మైక్రోఫోన్లు, మెటల్ షీట్‌లను వాడటం జరిగింది. ఇది ఉపయోగించే మహిళల భద్రత కోసం, రెండు కెమెరాలు కూడా పెట్టారు. జాకెట్ ముందు వైపు ఒకటి ఇంకా అలాగే వెనుక వైపు మరో కెమెరా అమర్చారు. దుండగులు ఎటువైపు నుంచి వచ్చినా సరే వారిని ఈజీగా గుర్తించేందుకు వీలుగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ జాకెట్ 200 నుండి 4000 వోల్ట్ ల వరకు కరెంట్ షాక్‌లను ఉత్పత్తి చేస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ వినిత్‌రాయ్ తెలిపారు. అర్థరాత్రి సమయాల్లో తమ పనిని ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళల సేఫ్టీనే ప్రధాన ఉద్దేశంగా ఈ జాకెట్లను తయారు చేశామని వీటి రూపకల్పనలో భాగస్వాములైన స్టూడెంట్స్ తెలిపారు. 

వాట్సాప్ డేటా ఉల్లంఘన !


వాట్సాప్  యూజర్ల డేటా ఉల్లంఘనకు గురైంది. ఇప్పటివరకూ జరిగిన ఆన్‌లైన్ యూజర్ల అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఇదొకటి కావచ్చు. దాదాపు 50కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారు. సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో 487 మిలియన్ వాట్సాప్ యూజర్ మొబైల్ నంబర్‌ల 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక ప్రకటనను పోస్ట్ చేశాడు. డేటాబేస్ US, UK, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారత్ సహా 84 వేర్వేరు దేశాల నుంచి WhatsApp యూజర్ల మొబైల్ నంబర్లను కలిగి ఉంది. ఉల్లంఘనకు గురైన డేటాలో ఎక్కువగా ఫిషింగ్ అటాక్స్ ద్వారానే ఉన్నట్టు కనిపిస్తోంది. వాట్సాప్ యూజర్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం మంచిదని సైబర్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ డేటా సెట్‌ లో 32 మిలియన్ల అమెరికన్ వాట్సాప్ యూజర్ల రికార్డ్‌లు ఉన్నాయని గుర్తించారు. అదే విధంగా, వాట్సాప్ ప్రభావిత యూజర్లు ఈజిప్ట్‌లో 45 మిలియన్లు, ఇటలీలో 35 మిలియన్లు, సౌదీ అరేబియాలో 29 మిలియన్లు, ఫ్రాన్స్‌లో 20 మిలియన్లు, టర్కీలో 20 మిలియన్లు ఉన్నారు. డేటాబేస్‌లో దాదాపు 10 మిలియన్ల రష్యన్లు, 11 మిలియన్లకు పైగా యూకే పౌరుల ఫోన్ నంబర్లు ఉన్నాయి. అమెరికా డేటాసెట్‌ను 7,000 డాలర్లకి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్‌ల ధర వరుసగా 2,500 డాలర్లు, 2,000 డాలర్లు గా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన భారీ డేటా సెట్‌లు స్క్రాప్ చేయడం ద్వారా WhatsApp సేవా నిబంధనలను ఉల్లంఘించినట్టు నిర్ధారణ అయింది. అన్ని ఫోన్ నంబర్‌లు మెటా-యాజమాన్య ప్లాట్‌ఫారమ్‌లోని యాక్టివ్ యూజర్‌లకు చెందినవని అంటున్నారు. అసలు వాట్సాప్ డేటాబేస్ ఎలా యాక్సస్ చేశాడనేది మాత్రం వెల్లడించలేదు. వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించడానికి సీక్రెట్ వ్యూహాన్ని ఉపయోగించినట్టు నివేదిక తెలిపింది. 

మార్కెట్లోకి లావా బ్లేజ్ NXT విడుదల


లావా బ్లేజ్ NXT మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 4GB + 64GB సింగిల్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. మీడియాటెక్ హీలియో G37 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. లావా బ్లేజ్ మార్క్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో వచ్చిన ఈ ఫోన్, ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో క్లాసీగా కనిపిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన లావా బ్లేజ్ మోడల్‌కు సక్సెసర్‌గా కంపెనీ కొత్త ఫోన్‌ను రూపొందించింది. ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G37 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. బయోమెట్రిక్స్ కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను లావా అందించింది. ఈ డివైజ్‌లో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది. దీన్ని టైప్-సి పోర్ట్‌ సాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఇది కేవలం 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మాత్రమే లభిస్తుంది. వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌తో ఫోన్ ర్యామ్‌ను 3GB వరకు పెంచుకోవచ్చు.  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీంట్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు ఉంటాయి. ఈ కెమెరా సెటప్ 30 fps వద్ద 1080P ఫుల్ HD వీడియోలను రికార్డ్ చేయగలదు. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కంపెనీ అందించింది. ధర రూ. 9,299గా ఉంది. ఈ ఫోన్ బ్లూ, రెడ్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. కంపెనీ ఈ కొత్త మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది కానీ దీని సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే లావా బ్లేజ్ NXT డివైజ్‌ అమెజాన్ లిస్టింగ్‌లో కనిపించింది. అంటే త్వరలో అమెజాన్‌లో దీని సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు !


సౌత్‌ కొరియాలో ఆవిష్కృతమైన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. నిర్ధారిత రూట్‌లో ఈ బస్సుని రెండు రోజుల క్రితమే ఆవిష్కరించారు. బొమ్మ బస్సులా కనిపించే ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు సాధారణ బస్సులకన్నా ప్రత్యేకంగా ఉంటుంది. డ్రైవర్‌తో పని లేకుండా తన గమ్యస్థానానికి సేఫ్‌గా చేరుకుంటుంది. ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ హుందాయ్ తయారుచేసిన ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు భవిష్యత్తు రవాణా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. టెక్నాలజీని అత్యంత తక్కువ ధరకు అట్టడుగు వర్గాలకు చేరువ చేయడమేనని బస్సు లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో ట్రక్‌లు, ఇతర వాహనాలను కూడా డ్రైవర్‌ రహితంగా తయారుచేయాలని  హుందయ్ కంపెనీ భావిస్తోంది. 

ట్రంప్ ట్వీట్ చేయకపోతే నాకేం ఇబ్బంది లేదు !


అమెరికా మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను అప్పటి ట్విట్టర్ యాజమాన్యం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించాడు. ట్రంప్ ఖాతా అందుబాటులోకి వచ్చి వారం రోజులు కావొస్తున్నా ఆయన ఒక్క పోస్టు కూడా ట్వీట్ చేయలేదు. ట్రంప్ ట్వీట్ చేయకపోవడంపై ఓ నెటిజన్ మస్క్ ని ప్రశ్నించగా, తనదైన శైలిలో మస్క్ సమాధానమిచ్చారు. 'ట్రంప్ ట్వీట్ చేయకపోతే నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే అంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఆయన ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడకపోయినా ఆయన ఖాతాను నిషేధించడం ఘోర తప్పిదం. నేను ఆ తప్పును సరిదిద్దాను. అదే ఇక్కడ అందరూ మాట్లాడుకోవాల్సిన టాపిక్' అన్నాడు మస్క్. ట్రంప్ అధికారంలో ఉండగానే ఆయన ట్విట్టర్ ఖాతాను సిషేధించడంతో అమెరికాలో సగం మంది ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ట్రంప్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయాలా అంటూ ఎలన్ మస్క్ ఓ పోల్ నిర్వహించగా అందులో 15లక్షల మంది పాల్గొన్నారు. వారిలో ఎక్కువమంది ఖాతా పునరుద్ధరణకే ఓటు చేయగా.. మస్క్ ఆ మేరకే నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ట్రంప్ ట్విట్టర్ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ఆయన ఖాతాలో 2021 జనవరి 8న చేసిన చివరి 'బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం లేదు' అంటూ పెట్టిన ట్వీట్ కనిపిస్తోంది. అయితే.. ట్విట్టర్లో ఆయన ఖాతా యాక్టివేట్ కావడం పట్ల ట్రంప్ అయిష్టం వ్యక్తం చేశారు. నాకు సొంతంగా ఓ సోషల్ మీడియా వేదిక ఉంద. దాని పేరు ట్రూత్ సోషల్ ఉందని గుర్తు చేశారు.

బెస్ట్ కెరీర్‌ ఆప్షన్‌ గేమింగ్‌ !


గేమింగ్‌ అనేది హాబీగానే కాదు కెరీర్‌గానూమార్చుకునేందుకు సిద్దమంటున్నారు నేటి మహిళా గేమర్లు. ఈ విషయంపై జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. గురువారం విడుదలైన 'HP ఇండియా గేమింగ్ ల్యాండ్‌స్కేప్ స్టడీ 2022' రెండవ ఎడిషన్ సర్వే వివరాల ప్రకారం.. గేమింగ్‌ని ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ కెరీర్‌ ఆప్షన్లుగా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. భారత్‌లో మహిళా గేమర్లను ఈ విషయంపై అడిగితే 56శాతం మంది దీన్ని తమ ప్రధాన కెరీర్‌ ఆప్షన్‌గా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ అభిరుచిని కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకుని మహిళా గేమర్లు సంతోషంగా సంపాదన కూడా పొందుతున్నారు. 50శాతం మంది మహిళా గేమర్లు దీన్ని సీరియస్‌గా వృత్తిగా తీసుకున్నామని, 45శాతం మంది ఇందులో డబ్బులు కూడా సంపాదిస్తున్నామని చెప్పారు. గేమింగ్ అనేది వినోదం ఇంకా విశ్రాంతి అని 92 శాతం మంది ఒప్పుకొన్నారు. దీని వల్ల మానసికంగా చురుకుగా ఉంటామని 58 శాతం మంది, సోషియలైజింగ్‌గా ఉంటామని 52 శాతం మంది తెలిపారు. గేమర్‌గా మారడం వీరి మొదటి ప్రాధాన్యతే. దానితోపాటు ఇన్‌ఫ్లుయెన్సర్, గేమింగ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారడం వంటి ఆప్షన్లు కూడా వీరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అధిక శాతం మంది గేమర్లు గేమింగ్‌కి పీసీలే బెటర్ డివైజ్‌ అని చెబుతున్నారు. మెరుగైన ప్రాసెసర్‌లు, డిజైన్, గ్రాఫిక్‌లు, డిస్‌ప్లేలతో ఇప్పుడు పీసీలు అందుబాటులో ఉన్నాయి. అందుకే దీనిలో గేమింగ్‌ తమకు సౌకర్యంగా ఉంటుదని మొదటి ఓటు దీనికే వేస్తున్నారు. 68 శాతం మంది గేమర్‌లు PCలకు ఓటు వేయడంతో అవి అత్యంత ప్రాధాన్య పరికరంగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. పీసీ గేమింగ్‌లో ఉన్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని 39శాతం మంది మొబైల్‌ గేమర్లు పీసీ గేమర్‌లుగా మారడానికి ప్రయత్నిస్తున్నారు.PC గేమింగ్ ల్యాండ్‌స్కేప్ యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. వీరికి ప్రముఖ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీ హెచ్‌పీ కూడా మంచి సపోర్ట్‌ని అందిస్తోంది. గేమింగ్‌కి సంబంధించిన నాలెడ్జ్‌, టూల్స్‌, అవకాశాలు, నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం లాంటి వాటిలో గేమర్లకు అండగా నిలుస్తోంది. కమ్యునిటీ ఇనిషియేటివ్‌ ప్రోగ్రాంల ద్వారా గేమర్లకు తాము సపోర్ట్‌ ఇస్తున్నట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌ సిస్టమ్స్‌) విక్రం బేడి తెలిపారు. PC గేమింగ్‌కు బలమైన డిమాండ్‌ ఉండటం తమకు భారీ వ్యాపార అవకాశాన్ని సూచిస్తోందని అన్నారు. భారతదేశంలో అధునాతన గేమింగ్ ఎకో సిస్టంను ప్రారంభించడానికి అవసరమైన ఇంజనీరింగ్‌ ప్లానింగ్‌ చేస్తామని బేడీ చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం చూస్తే ఈ రంగంలోకి వచ్చే వారిలో కేవలం 2 శాతం మంది మాత్రమే గేమింగ్‌లో అధికారిక శిక్షణ పొందారు. చాలా మంది గేమర్‌లు తమ గేమింగ్ పనితీరును అప్‌గ్రేడ్ చేసుకవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో 32 శాతం మంది తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి గేమింగ్ స్టార్‌ను అనుసరిస్తారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ54 ప్రయోగం విజయవంతం


ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్‌ నింగిలోకి ఎగిరింది. ఈ రాకెట్ ప్రయోగానికి శుక్రవారం ఉదయం 10.26 గంటల నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. పీఎస్ఎల్వీ సీ54 ద్వారా కక్ష్యలోకి ఈవోఎస్ 06  సహా మరో ఎనిమిది ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించింది. అయితే ఈవోఎస్ సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహం కాగా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 56వ రాకెట్ ప్రయోగం. ఈవోఎస్ 06 ఉపగ్రహం భూపరిశోధనలు, సముద్ర గర్భంలో అధ్యయనంకోసం ఉపయోగపడుతుంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన తైబోల్ట్‌-1, తైబోల్ట్‌-2, ఆనంద్, ఇండియా-భూటాన్‌ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్‌-2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ -2 పేరుతో నాలుగు శాటిలైట్లను ఇస్రో స్పేస్ లోకి ప్రయోగించింది. ఇస్రో అంతరిక్ష కక్ష్యలోకి పంపించే ఎనిమిది ఉపగ్రహాల్లో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువస్పేస్‌ రూపొందించిన థైబోల్ట్‌ 1, థైబోల్ట్‌ 2 ఉపగ్రహాలుకూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహాలు రేడియో కార్యకలాపాలకు సంబంధించిన పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లనున్నాయి. దాదాపు 20 ఎంఎస్ఎంఈల సహాయంతో ఈ ఉపగ్రహాలను పూర్తిగా హైదరాబాద్‌లోనే నిర్మించామని దృవ స్పేస్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సంజయ్‌ నెక్కంటి తెలిపారు.

Friday, November 25, 2022

ఫాక్స్‌కాన్ నుంచి వైదొలిగిన 20 వేల మంది ఉద్యోగులు !


చైనాలోని జెంగ్‌జౌలో ఫాక్స్‌కాన్ కంపెనీ నుంచి 20 వేల మందికి పైగా వైదొలిగారు. ఐ-ఫోన్ తయారీ దారు ఫాక్స్‌కాన్‌. భారీ స్థాయిలో ఉద్యోగులు వైదొలగడంతో ఈ నెలాఖరుకల్లా పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపట్టాలన్న ఫాక్స్‌కాన్ లక్ష్యం దెబ్బ తినే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించడానికి ఫాక్స్‌కాన్ నిరాకరించింది. తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న ఈ ఫాక్స్‌కాన్ కంపెనీ యాజమాన్యం ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న వారికి 1396 డాలర్లు పరిహారం చెల్లిస్తామని ఆఫర్ చేసింది. నూతన ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతన చెల్లింపుల్లో సమస్య తలెత్తడంతో నిరసనలకు దారి తీసింది. ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు సంస్థ సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణలకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూతన ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో తేడాలకు సాంకేతిక లోపం తలెత్తిందని, అందుకు క్షమాపణ చెబుతున్నట్లు ఫాక్స్‌కాన్ ప్రకటించింది. చెల్లింపుల్లో బకాయిలకు తోడు కఠిన కరోనా ఆంక్షలు కూడా సిబ్బంది రాజీనామా చేయడానికి దారి తీసిందని బాధితులు చెబుతున్నారు. దీంతోనే వర్కర్లంతా తమ లగేజీలతో సొంతిండ్లకు బయలుదేరి వెళ్లేందుకు బస్సుల ముందు బారులు తీరారు. సిబ్బంది రాజీనామా చేశారని పేర్కొన్న ఫాక్స్‌కాన్‌.. ఎంత మంది వైదొలిగారన్న సంగతి వెల్లడించలేదు. ప్రస్తుతానికి ఐ-ఫోన్ల ఉత్పత్తిపై ఉద్యోగుల రాజీనామాలు ప్రతికూల ప్రభావం చూపబోవని ఫాక్స్‌కాన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. కొత్త సిబ్బంది ఇంకా శిక్షణ పొందాల్సి ఉందన్నారు. రికార్డు స్థాయిలో చైనాలో కరోనా కేసులు నమోదు కావడంతోపాటు పదేపదే లాక్‌డౌన్‌లు విధించడం, ఫాక్స్‌కాన్ మేనేజ్‌మెంట్ పట్ల అసంతృప్తి తదితర కారణాలతో సిబ్బంది వైదొలుగుతున్నారని తెలుస్తున్నది.

ఒప్పో నుంచి ఎన్కో ఆర్ ప్రో ఇయర్​ బడ్స్​ విడుదల


ఒప్పో ఎస్కో సిరీస్ నుంచి మరో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌​ లాంచ్ చేసింది. ఒప్పో ఎన్కో ఆర్ ప్రో  టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌​ పేరుతో వీటిని చైనాలో రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలోనే విడుదలైన ఈ డివైజ్‌​లో ప్రీమియం ఫీచర్లను అందించింది. ఎన్కో ఆర్ ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే తాజాగా విడుదలైన ఇయర్‌బడ్స్‌ భిన్నమైన డిజైన్‌తో వచ్చాయి. ఇవి ఇన్-ఇయర్ సిలికాన్ టిప్స్‌​తో వస్తాయి. అయితే, స్టాండర్డ్ మోడల్‌లో మాత్రం సిలికాన్ టిప్‌​ను అందించలేదు. ఎన్కో ఆర్  ప్రో TWS ఇయర్‌బడ్స్ 12.4mm డ్రైవర్స్‌తో వస్తాయి. వీటిని బ్లూటూత్ v5.2 ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఓఎస్ డివైజెస్‌​తో సులభంగా కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌​లో కాలింగ్ కోసం యాంబియంట్ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్  ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, లో లేటెన్సీ గేమింగ్, టచ్ జెస్టర్ కంట్రోల్స్ కూడా చేర్చింది. ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్‌​లో ఉన్నప్పుడు ANC ఆఫ్‌​లో ఉంటుంది. అందువల్ల, 28 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలవు. చైనాలో ఒప్పో ఎన్కో R ప్రో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు CNY 499 (దాదాపు రూ. 5,700) వద్ద విడుదలయ్యాయి. ఈ TWS ఇయర్‌బడ్స్ ప్రీ ఆర్డర్లు ఇప్పటికే చైనాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 24 నుండి ఇవి చైనాలో అందుబాటులోకి వచ్చాయి. అయితే, డెలివరీలు మాత్రం డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయి.

ఎలాన్ మస్క్ కుప్పిగంతులు ?


ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్  నిర్ణయాలు సంస్థ భవితవ్యాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తున్నది. ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే ఈ నెలలోనే వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపి, వారిలో కొందరిని తిరిగి నియమించుకున్నారు. అలా నియమించుకున్న ఉద్యోగుల్లో మరి కొందరికి ఉద్వాసన పలికాడని సమాచారం. అలా తొలగింపునకు గురైన వారిలో హెచ్-1 బీ వీసాపై పని చేస్తున్న ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ హెచ్‌-1బీ వీసా దారుడు సంస్థ ఉద్యోగుల అభిప్రాయాలు తెలిపే బ్లైండ్ అనే సోషల్ మీడియా యాప్‌లో షేర్ చేశాడు. హెచ్‌-1 బీ వీసాపై ఉన్న తాను కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజులే టైం ఉందని, తనకు సాయం చేయమని అభ్యర్థించాడు. ఈ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను పీటర్ యాంగ్ అనే రెడిట్ ఉద్యోగి ట్వీట్ చేయడంతో వైరలైంది. దీంతో మస్క్ తీరు పట్ల నెటిజన్లు మండి పడుతున్నారు. ఈ నెల ఆరంభంలో వేల మందికి ఉద్వాసన పలికిన ట్విట్టర్ నూతన యాజమాన్యం.. తొలగింపునకు గురైన వారికి మూడు నెలల వేతనం ఆఫర్ చేసింది. అలా ఉద్వాసనకు గురైన వారిలో ప్రతిభావంతులుగా ఉన్న కొందరిని నియమించుకున్నది. డాక్యుమెంటేషన్‌, కోడ్ శాంపిల్స్‌లో నా సేవలు అవసరం అని ట్విట్టర్ తీసుకుందని ఆ మాజీ ఉద్యోగి తెలిపాడు. మళ్లీ ఏం జరిగిందో తెలియదు..ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గత రాత్రి తిరిగి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ట్విట్టర్ తెలిపిందని చెప్పాడు. భృతిగా తనకు నాలుగు వారాల వేతనం అందుతుందన్నాడు. హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉన్నానని, సాయం చేయగలిగిన వారు తనను సంప్రదించాలని వేడుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఎలన్‌ మస్క్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

సూపర్ ఎర్త్‌ని గుర్తించిన నాసా !


భూమి లాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయనే విషయాలపై అనేక దేశాల అంతరిక్ష సంస్థలు పరిశోధలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద టెలిస్కోపులను ఉపయోగించి భూమిలాంటి గ్రహాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. అయితే అవన్నీ జీవుల అవసానికి అనువుగా మాత్రం లేవు. అయితే కొన్ని మాత్రం భూమి లాగే నివాసయోగ్యతకు అసవరయ్యే ' గోల్డెన్ లాక్ జోన్'లో ఉన్నాయి. తన మాతృ నక్షత్రం నుంచి భూమిలాగే ఎక్కువ దూరం కాకుండా, మరీ సమీపంగా లేకుండా ఉన్నాయి. అయితే ఇవన్నీ  కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా మరో 'సూపర్ ఎర్త్'ని గుర్తించింది. భూమి నుంచి కేవలం 200 కాంతి సంవత్సరాల దూరంలో ఓ భారీ ఎక్సోప్లానెట్ ని గుర్తించారు. టీఓఐ-1075బీగా పిలువబడే ఈ భారీ భూమి తరహా గ్రహం భూమి కన్నా 1.8 రెట్లు పెద్దదిగా ఉంది. ద్రవ్యరాశి పరంగా చూస్తే భూమి కన్నా 10 రెట్లు ఎక్కువ. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎస్ఎస్) సహాయంతో నాసా ఈ సూపర్ ఎర్త్ ని కనుక్కుంది. భూమి, శుక్రుడు, బుధ గ్రహాల్లాగే ఈ సూపర్ ఎర్త్ కూడా రాతి ఉపరితలాన్ని కలిగి ఉంది. ఇప్పటి వరకు కనుక్కున్న ఎక్సో ప్లానెట్లలో ఇదే భారీ సూపర్ ఎర్త్ కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహంపై మానవుడి బరువు భూమిపై కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 1050 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని, ఉపరితలం అంతా లావాతో కప్పబడి ఉంటుందని చెబుతున్నారు. తన మాతృ నక్షత్రానికి అత్యంత దగ్గరగా ఉన్నందువల్లే ఇలాంటి లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం కనుక్కున్న సూపర్ ఎర్త్ 14.5 గంటల్లో ఒక రోజును పూర్తి చేస్తుంది. హైడ్రోజన్, హీలియంతో కూడిన మందపాటి వాతావరణాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 

సాంసంగ్ గెలాక్సీ A52 !


సాంసంగ్ మొబైల్స్ తక్కువ ధరకే 5జి మొబైల్స్ ని కూడా  విడుదల చేసింది. అలాంటి వాటిలో సాంసంగ్ గెలాక్సీ A52 స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ 5.0 అప్డేట్ ను అందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకు సంబంధించిన బీటా అప్డేట్ కూడా సెప్టెంబర్ మాసంలో విడుదల కాగా ఇప్పుడు స్టేబుల్ అప్డేట్ కూడా చేయబోతుంది. సాంసంగ్ ప్రత్యర్థి కంపెనీలు అయినా రియల్ మీ, షావోమి, వన్ ప్లస్ ,ఐక్యూ బ్రాండ్లు కూడా ఇప్పటికే పలు మొబైల్స్ ని ఆండ్రాయిడ్ 13 అప్డేట్ ను అందిస్తూ ఉన్నాయి. దీంతో ఈ మొబైల్లో కొన్ని పర్సనాలిటీగా చేశాను ఆప్షన్లు కూడా రాబోతున్నాయని తెలుస్తోంది. కొత్త ఫీచర్లలో కొన్ని ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించినవి కాగా కొన్ని వన్ యుఐకి సంబంధించినవి. ఏకంగా ఇందులో 16 కొత్త కలర్స్ థీమ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే మల్టీపుల్ కలర్స్ కూడా హోం స్క్రీన్ లో కంబైన్ ఆప్షన్ కూడా వుంది. వన్ యుఐలో కూడా ఈ కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. అబౌట్ సెట్టింగ్ లోకి వెళ్లి అక్కడ మీ మొబైల్ అప్డేట్ చేసుకోవచ్చు కొన్ని ఐవోఎస్ 16 తరహా ఫీచర్లు కూడా అప్డేట్ తో రావడం జరుగుతోంది. సాంసంగ్ గెలాక్సీ A52 డిస్ప్లే విషయానికి వస్తే పో 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తోపాటు సూపర్ అమోఎల్ ఎల్ఈడి డిస్ప్లే కలదు. 8GB ram +128 GB స్టోరేజ్ కలదు. కెమెరా విషయానికి వస్తే మొబైల్ వెనక్కున నాలుగు కెమెరాలు కలవు. ఇందులో 64 మెగాపిక్సల్ ఉండగా వీటితోపాటు 12 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరాతో పాటు..5 మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా కలదు. ఇక వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సల్ కెమెరా కలదు. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 4500 MAH సామర్థ్యం తో పాటు 25 W చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

853 టెక్ కంపెనీల్లో 1,37,492 మంది తొలగింపు !


ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం వల్ల టెక్ కంపెనీల్లో మరిన్ని ఉద్యోగాల కోతలు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 853 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 137,492 మంది ఉద్యోగులను తొలగించాయి. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 1388 కంపెనీలు 2,33,483 మంది ఉద్యోగులను తొలగించాయని టెక్ లేఆఫ్‌ల క్రౌడ్‌సోర్స్ డేటాబేస్ వెల్లడించింది. 2022వ సంవత్సరం టెక్ రంగానికి గడ్డు పరిస్థితులను మిగిల్చింది. నవంబర్ నాటికి మెటా, ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్, నెట్‌ఫ్లిక్స్, సిస్కో, రోకు, ఇతర సంస్థల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు జరిగాయి. దీని కారణంగా యూఎస్ టెక్ రంగంలో 73,000 కంటే ఎక్కువ మంది కార్మికులు తొలగింపునకు గురయ్యారు. అమెజాన్, పీసీ, ప్రింటర్ మేజర్ హెచ్‌ పీ ఇంక్ వంటి బిగ్ టెక్ కంపెనీలు గ్లోబల్ లేఆఫ్ సీజన్‌లో చేరాయి.ఈ కంపెనీల రాబోయే రోజుల్లో 10వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి.2023 ప్రారంభంలో కంపెనీలో మరిన్ని తొలగింపులు ఉంటాయని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఉద్యోగులను హెచ్చరించారు. పేలవమైన పనితీరు కనబర్చిన ఉద్యోగులను తొలగించడానికి గూగుల్ మాతృసంస్థ సమాయత్తమైంది. బైజూస్, అన్కాడమీ, వేదాంతు, ఎడ్ టెక్ కంపెనీలు 44 స్టార్టప్ ల నుంచి 16వేల మంది ఉద్యోగులను వెళ్లవలసిందిగా కోరాయి.టెక్ స్టార్టప్‌లు, యునికార్న్‌లలో ఒలా, కార్స్24, మీషో, లీడ్, ఎంపీఎల్, ఇన్నోవాక్సిర్, ఉదాన్ కంపెనీల్లోనూ ఉద్యోగాల కోత ఉంది. ఉద్యోగుల వరుస తొలగింపులతో 2022 టెక్కీలకు అత్యంత కఠినమైన సంవత్సరంగా మారింది. గత 12 నెలల్లో శాశ్వత ఉద్యోగుల నియామకాలు గణనీయంగా 61 శాతం తగ్గాయి.

Thursday, November 24, 2022

డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కాల్స్‌ చేసుకునే సౌలభ్యం ?


డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో కాల్స్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించే అప్‌డేట్‌పై దృష్టి పెట్టింది. త్వరలోనే ఫీచర్ వాట్సాప్ అందుబాటులోకి తీసుకు రానున్నది.  వాట్సాప్‌ నుంచి మొబైల్‌ ఫోన్లలో కాల్‌ చేసుకునే సౌకర్యం ఉండగా, డెస్క్‌టాప్‌ బ్రౌజర్లు లేదా యాప్‌లో ఆ అవకాశం లేదు. దీంతో డెస్క్ టాప్‌లో ఈ సేవలను అందించేందుకు సిద్ధమైంది. స్టేటస్‌, చాట్స్‌, ట్యాబ్‌లకు మధ్యలో కాల్స్‌ ట్యాబ్‌ పొందుపరచనున్నారు. ఈ అప్‌డేట్ అందుబాటులోకి వస్తే గూగుల్‌ మీట్‌, జూమ్‌ వంటివాటికి వాట్సాప్‌ పోటీగా ఎదిగేందుకు అవకాశాలున్నాయి. ఈ మధ్యనే వాట్సాప్ ఒకే నంబర్‌తో ఒకే సారి రెండు స్మార్ట్‌ ఫోన్లతో పాటుగా మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి ఓ ఫీచర్‌ని తెచ్చింది. ఈ మోడ్ ని కొన్ని బీటా టెస్టర్‌లకు విడుదల చేసి పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

26న పీఎస్ఎల్వీ - సీ 54 ప్రయోగం


ఈనెల 26 న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ - సీ 54 రాకెట్ ప్రయోగానికి శాస్త్ర వేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రయోగం పై మిషన్ సన్నద్ధత సమావేశం జరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటల 26 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 25 గంటల 30 నిముషాల అనంతరం 26 వ తేదీ ఉదయం 11 గంటల 56 నిముషాలకు శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా EOS-06 అనే ప్రధాన ఉపగ్రహం తోపాటు విదేశాలకు చెందిన మరో 8 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోనికి పంపనుంది ఇస్రో. భారత్, భూటాన్ సంయుక్తంగా డెవలప్​ చేసిన ఎనిమిది నానోశాటిలైట్​లను ఇస్రో నింగిలోకి పంపనుంది. పీఎస్​ఎల్​వీ లాంచ్ వెహికల్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఏడాది అయిదో ప్రయోగాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహాన్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రయోగించనున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ థింపూ పర్యటన తర్వాత అంతరిక్ష ప్రయోగం సంయుక్తంగా చేపడుతుందని ప్రకటించారు.

లోన్ యాప్స్‌తో జాగ్రత్త !


లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొని రెండు మూడు రెట్లు అప్పులు చెల్లించినవారు ఉన్నారు. అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డవారున్నారు. ఇప్పటికీ లోన్ యాప్స్ నిర్వాహకుల అరాచకాలు బయటపడుతున్నాయి. పోలీసుల దగ్గర్నుంచి బ్యాంకుల వరకు అందరూ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్యాంకు కస్టమర్లను హెచ్చరిస్తోంది. లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల పేర్లతో వచ్చే అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదని, మీ సమాచారాన్ని ఎవరితో షేర్ చేయకూడదని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఇలాంటివి వస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరుతోంది. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు ఆ యాప్ విశ్వసనీయతను చెక్ చేయాలి. అనుమానాస్పద లింక్స్‌ని క్లిక్ చేయకూడదు. అనధికార యాప్స్‌ని ఉపయోగించకూడదు. ఈ యాప్స్ మీ డేటా దొంగిలించే అవకాశముంది. డేటా దొంగిలించకుండా యాప్ పర్మిషన్ సెట్టింగ్స్ పరిశీలించాలి. అనుమానాస్పద మనీ లెండింగ్ యాప్స్ గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆర్థిక అవసరాల కోసం https://bank.sbi వెబ్‌సైట్‌ సందర్శించాలి. ఎస్‌బీఐ సూచిస్తున్న ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ డేటా కాపాడుకోవడంతో పాటు, మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడొచ్చు. మీరు రుణాలు తీసుకోవాలనుకుంటే ఆర్‌బీఐ గుర్తించిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలనే ఆశ్రయించాలి. గుర్తుతెలియని వ్యక్తులు, అనధికార యాప్స్‌లో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ షేర్ చేయకూడదు.


హాలిడే సీజన్ ఫ్రాడ్స్‌తో జాగ్రత్త !


స్కామ్స్, ఫేక్ యాంటీవైరస్ వంటి గురించి ఎప్పటికప్పుడు గూగుల్ యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది. తాజాగా హాలిడే సీజన్‌లో ఐదు కీలక స్కామ్స్, స్పామ్స్ గురించి జీమెయిల్ యూజర్లను అప్రమత్తం చేసింది. ప్రధానంగా గిఫ్ట్ కార్డ్, గివ్‌వే ఫ్రాడ్స్, ఛారిటీ రిలేటెడ్ స్కామ్స్, డెమోగ్రాఫిక్ టార్గెటింగ్ స్కామ్స్, సబ్‌స్క్రిప్షన్ రెన్యూవల్స్ ఫ్రాడ్స్, క్రిప్టో స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, హాలిడే సీజన్‌లో వాటికి దూరంగా ఉండాలని గూగుల్ హెచ్చరించింది. సాధారణంగా యూజర్లు పీక్ హాలిడే సీజన్‌లో గిఫ్ట్ కార్డ్, గివ్ వే ఫ్రాడ్స్‌ బారిన పడే అవకాశం ఉంటుందని గూగుల్ తెలిపింది. గిఫ్ట్‌కార్డ్‌ కొనుగోలు చేసేలా బాధితులను మోసం చేయడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నించవచ్చని పేర్కొంది. స్కామర్స్ పరిచయం ఉన్న వ్యక్తుల వలె నటించడం ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌ చెబితే బదులుగా ఉచిత బహుమతిని అందించడం వంటి ద్వారా యూజర్లను మోసం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఛారిటీ-రిలేటెడ్ స్కామ్స్, ఫిషింగ్ ప్రయత్నాల ద్వారా మోసాలకు గురైన బాధితులు, విరాళాల నుంచి ప్రయోజనం పొందే స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఇమెయిల్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని గూగుల్ కోరింది. లోకల్ పేరెంట్ - టీచర్ అసోసియేషన్(PTA) బోర్డు సభ్యులు పంపే మెయిల్స్ రూపంలో కొన్ని ఫేక్ మెయిల్స్ ఉండవచ్చు. లేదా నిర్దిష్ట ఏజ్ గ్రూప్స్‌ను లక్ష్యంగా చేసుకోని ఫేక్ ఈమెయిల్స్‌తో మోసం చేయడానికి ఆస్కారం ఉందని గూగుల్ పేర్కొంది. మెంబర్‌షిప్ రెన్యూవల్‌తో కూడిన స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గూగుల్ సూచించింది. సెక్యూరిటీని మరింత పెంచుతాయనే హామీతో బాధితులను ఆకర్షించే ప్రయత్నంలో ఫేక్ యాంటీవైరస్ సర్వీస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. దీంతో మెయిల్ లోని సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని గూగుల్ పేర్కొంది. క్రిప్టో-బేస్డ్ మోసాలు తరచుగా వివిధ రూపాల్లో ఉంటాయి. బాధితులను బెదిరించి వారి నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించడం, బ్లాక్‌మెయిల్ చేయడం.. వంటి మోసాలను ఎదుర్కోవాలని గూగుల్ చెబుతోంది. కొంతమంది స్కామర్స్, వారు పంపే మెసేజ్‌లను అద్భుతమైన స్కిల్స్‌తో ఇతరులు నమ్మేలా చేస్తారు. అందుకే యూజర్లు ఎల్లప్పుడూ తమకు వచ్చిన ఇమెయిల్‌ను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పుగా అనిపిస్తే, అది నకిలీది కావచ్చు. వాటిని వెంటనే డిలీట్ చేయాలి. టెక్ దిగ్గజం రోజుకు 15 బిలియన్ల అన్ వాంటెడ్ మేసేజస్ నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేస్తోంది. అంతేకాకుండా స్పామ్, ఫిషింగ్, మాల్వేర్లకు సంబంధించి దాదాపు 99.9 శాతానికి పైగా బ్లాక్ చేస్తున్నట్లు కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.

అసూస్ నుంచి కొత్త ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు !


దేశీయ మార్కెట్లోకి Asus A3 సిరీస్ క్రింద రెండు కొత్త డెస్క్‌టాప్‌ కంప్యూటర్ లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లైనప్‌లో Asus A3402 మరియు A3202 మోడల్ డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు ఉన్నాయి. మరియు ఇవి రెండూ 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ల ద్వారా పనిచేస్తాయి. వీటిలో, A3402 మరింత ప్రీమియం, మరియు ఇది 23.8-అంగుళాల పూర్తి-HD డిస్‌ప్లేతో వస్తుంది, అయితే ఆసుస్ A3202 మోడల్ 21.45-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ రెండు PC ల యొక్క గ్రాఫిక్స్ Intel Iris Xe GPU ద్వారా పని చేస్తుంది. Asus A3 సిరీస్ కలిగి ఉన్న రెండు మోడల్ లు A3202 మరియు A3402 డెస్క్‌టాప్‌ల ధరలు పరిశీలిస్తే, Asus e-shops ఆఫ్‌లైన్ స్టోర్‌లలో వరుసగా రూ. 54,990 మరియు రూ. 65,990 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఈ PC లను కొనుగోలు చేయవచ్చు.  ఈ PC 23.8-అంగుళాల పూర్తి-HD (1920x1080) IPS LCD డిస్‌ప్లే 100 శాతం మరియు 250నిట్‌లతో వస్తుంది. దీని డిస్‌ప్లే యాంటీ-గ్లేర్ కోటింగ్‌ను కలిగి ఉంది మరియు కస్టమర్‌లు టచ్-సపోర్ట్ వేరియంట్‌ ని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‌లో 720p వెబ్‌క్యామ్ కూడా ఉంది మరియు కనెక్టివిటీ ఎంపికలలో మూడు USB 3.2 Gen 1 టైప్-A, సింగిల్ USB 3.2 Gen 1 Type-C, సింగిల్ USB 2.0 టైప్-A, గిగాబిట్ ఈథర్‌నెట్ పోర్ట్ ఉన్నాయి ఇంకా రెండు HDMI పోర్టులు కూడా కలిగి ఉంది. అదేవిధంగా రెండవ మోడల్ అయిన A3202, పూర్తిగా 100 శాతం sRGB 100 మరియు 250 nits ప్రకాశంతో చిన్న 21.45-inch Full-HD (1920x1080) IPS LCD డిస్‌ప్లేతో వచ్చినప్పటికీ, Asus A3202 ఎక్కువ లేదా తక్కువ సారూప్య వివరణలతో వస్తుంది. ఈ PC 12వ తరం ఇంటెల్ కోర్ i5-1235G7/ 12వ తరం ఇంటెల్ కోర్ i3-1215G7 CPUల ద్వారా శక్తిని పొందుతుంది. Asus A3202 లోని కనెక్టివిటీ ఎంపికలు మరియు స్పీకర్ సిస్టమ్ మొదటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.ఈ A3202 మోడల్ కంప్యూటర్ 4.48 కిలోలు బరువు కలిగిఉంది. A3402 PC యొక్క 5.40 kg ల కంటే ఇది తేలికైనది.

ఫేస్‌బుక్‌లో 4 కేటగిరీలను తొలిగించేందుకు నిర్ణయం !


మెటా కంపెనీ అధీనంలో  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ఉన్న విషయం తెలిసిందే. మెటాగా మారిన తర్వాతి నుంచి ఆ సంస్థ సోషల్ మీడియాకి సంబంధించి అప్‌డేట్లు తీసుకురావడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో అంతా ముఖ్యంగా ఉపయోగించేది ఫేస్‌బుక్‌. అందుకే మెటా కూడా దానిపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. ఫేస్‌బుక్‌ ఖాతాలు  చాలా మందికి ఉన్నాయి. ఫేస్‌బుక్‌ లేని వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచే సమయంలో ఒక ప్రక్రియ ఉంటుంది. మీ పేరు, ఊరు, జాబ్, జెండర్, అడ్రస్‌, అభిరుచులు, రాజకీయ, మతపరమైన, అలవాట్లు ఇలా అబ్బో ఒకటి కాదు, రెండు కాదు ఒక 20 ప్రశ్నలు వరకు అడుగుతారు. అవన్నీ మీరు ఫిల్‌ చేసుకుంటూ పోవాలి. వాటిలో కొన్ని ప్రశ్నలకు స్కిప్‌ ఆప్షన్‌ ఉంటుంది. కానీ, చాలా ప్రశ్నలను మీరు తప్పకుండా ఫిల్‌ చేయాల్సిందే. అలాగే ఫ్రెండ్‌ రిక్వెస్టులు పెట్టడం, కొత్త వారిని ఫ్రెండ్స్‌ చేసుకోవాలి అని చెప్పడం చేస్తుంటారు. అయితే ఇలా చేసేందుకు సదరు యూజర్‌కు చాలా సమయం పడుతుంది. ఇప్పుడు  మెటా సంస్థ ఆ ప్రశ్నలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. మీరు కొత్తగా ఖాతా ఓపెన్‌ చేసే సమయంలో మిమ్మల్ని అడిగే కొన్ని ప్రశ్నల్లో ఓ 4 కేటగిరీలను తొలిగించేందుకు నిర్ణయం తీసుకుంది. అవేంటంటే.. వారి చిరునామా, ప్రొఫైల్‌ మతపరమైన, రాజకీయ పరమైన అంశాలు, జెండర్‌ వంటి అంశాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఒక యూజర్‌ ప్రొఫైల్‌లో ఇలాంటివి మరో వ్యక్తికి తెలియాల్సిన అవసరం కూడా లేదని మెటా భావిస్తోంది. అందుకే వాటిని నింపేందుకు యూజర్‌ తన సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి అనే ప్రశ్నతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Wednesday, November 23, 2022

బ్లాక్ ఫ్రైడే సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు !


నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ జరగనుంది. ఇందులో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung తన ఫ్లాగ్‌షిప్‌లు, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ సిరీస్ S22 రూ.60,000 లోపు అందుబాటులోకి రానుంది. గెలాక్సీ ఎస్22 ప్రస్తుతం రూ.67,999 ధరకు అందుబాటులో ఉంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో Galaxy S22 Ultra, Galaxy S22+ స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. శాంసంగ్ ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక టీజర్‌ను పోస్ట్ చేసి, బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. Samsung Galaxy Z Flip 4 ధర ప్రస్తుతం రూ. 89,999గా ఉంది. ఇది అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 80,999 ధరకే అందుబాటులో ఉంటుంది. Samsung Galaxy Z Flip 3 ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే సేల్‌లో అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.60,000 లోపు ధరకే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. Samsung Galaxy Z Fold 4 కూడా రూ. 10,000 తగ్గింపును అందించనున్నారు. ఇందులో బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.బ్లాక్ ఫ్రైడే సేల్ లో Apple MacBook, iPhone మోడళ్లపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. పేమెంట్ సమయంలో రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో Apple Macbook Air 2022ని రూ.1,05,090కే కొనుగోలు చేయవచ్చు. Apple iPhone 13 128 జీబీ మోడల్‌ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.3,000 క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ధరను రూ.4,000 వరకు తగ్గించనున్నారు.

ఐవోమి ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్


దేశీయ మార్కెట్లో 'ఐవోమి ఎనర్జీ' కొత్గా త 'ఎస్1' ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను విడుదల చేసింది. వీటి స్టార్టింగ్ ధరలు రూ. 69,999 (ఎక్స్-షోరూమ్), ఇక టాప్ మోడల్ ధర రూ. 1.12 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్త ఐవోమి ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్స్ లో మనకు అందుబాటులో ఉంటుంది. అవి ఎస్1 80, ఎస్1 200 ఇంకా ఎస్1 240 వేరియంట్లు. ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2022 డిసెంబర్ 01 నుంచి కంపెనీ అన్ని అఫీషియల్ డీలర్షిప్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా ఈజీగా కొనుగోలు చేయవచ్చు.ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక సింగిల్ ఛార్జ్ తో మాక్సిమం 240 కిలోమీటర్ల (ఎస్1 240 వేరియంట్) రేంజ్ ని అందిస్తాయని కంపెనీ వెరిఫై చేసింది. అలాగే ఇందులో 4.2 కిలోవాట్ ట్విన్ బ్యాటరీ ప్యాక్ ఇంకా 2.5 కిలోవాట్ల మోటార్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎస్1 80 వేరియంట్ ఒక సింగిల్ ఛార్జ్ తో మాక్సిమం 80 కిమీ రేంజ్ అందిస్తుంది.ఈ ఎస్1 80 వేరియంట్ లో 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మాక్సిమం గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళుతుంది. ఇక ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా స్టాండర్డ్ గా మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటాయి. అవి ఎకో మోడ్, రైడర్ మోడ్ ఇంకా స్పోర్ట్ మోడ్స్. కంపెనీ పాత S1 మోడల్‌ కూడా రూ. 85,000 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది.ఈ ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మొత్తం మూడు కలర్ ఎంపికలో అందుబాటులో ఉంటాయి. అవి పీకాక్ బ్లూ, నైట్ మెరూన్ ఇంకా డస్కీ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో GPS ట్రాకర్ ఇంకా మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు కొత్త 'ఫైండ్ మై రైడ్' అనే లేటెస్ట్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ రెప్లికా బైక్ !


రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతి ఏటా రైడర్ మేనియా కమ్యూనిటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కంపెనీ ఈసారి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500’ మోడల్ తరహాలో లాంచ్ చేసింది.  ఈ రెప్లికా బైక్ ధర రూ. 67,990 మాత్రమే. దీని బరువు 8.5 కిలోలు కాగా, పొడవు 2.5 ఫీట్లు, వెడల్పు 1.25 ఫీట్లు, ఎత్తు 0.85 ఫీట్లు ఉంటుంది. 250 కంటే ఎక్కువ విడిభాగాలను కలిపి చేతితో తయారు చేయడం దీని ప్రత్యేకత. కాకుంటే ఇది నడపలేరు. ఇది రెప్లికా. షోపీస్‌లుగా పెట్టుకోవడానికి దీన్ని లాంచ్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ ఎడిషన్ బరువులో ఇది 1:3 నిష్పత్తిలో ఉంటుంది. అందుకే దీన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ 1:3 స్కేల్ మోడల్‌ అని పిలుస్తున్నారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. రూ.2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. టిల్ గ్రీన్, గన్ గ్రే, క్రోమ్ బ్లాక్, రెడ్ డిచ్, రెడ్ మెరూన్, క్రోమ్ బ్యాటిల్, గ్రీన్ డిసర్ట్, స్టార్మ్ జెట్ బ్లాక్ ఇలా 18 రంగుల్లో లభిస్తోంది.

బాల ఆధార్ కార్డుపై కొత్త మార్గదర్శకాలు !


బాల ఆధార్‌కు సంబంధించి విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ  కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ డేటాలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ తప్పనిసరి చేస్తూ అథారిటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు UIDAI ట్విట్టర్‌లో వెల్లడించింది. 5-15 సంవత్సరాల మధ్య పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసినట్టు తెలిపింది. ఈ ప్రక్రియ ఉచితంగానే ఉంటుందని తెలియజేసింది. దాంతో పాటు బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదని UIDAI మరో ట్వీట్‌లో ప్రకటించింది. తల్లిదండ్రులు ఫారమ్‌ను నింపడానికి వారి పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని కోరింది. UIDAI అధికారిక పోస్ట్‌లో పిల్లల ఆధార్‌కు రెండు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు అవసరమని తెలియజేసింది. పిల్లలకి 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత15 ఏళ్ల వయస్సులో రెండవది చేయాలి. 12-అంకెల ఆధార్‌ను నియంత్రించే UIDAI 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్‌ను జారీ చేస్తుంది. పుట్టినప్పటి నుంచి పిల్లలకు డిజిటల్ ఫోటో గుర్తింపు రుజువుగా వివిధ సంక్షేమ ప్రయోజనాలు, విధులకు కార్డ్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వేలిముద్రల వంటి బయోమెట్రిక్‌లు స్పష్టంగా కనిపించవు. కాబట్టి. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ డేటా బాల్ ఆధార్ కార్డ్‌లో చేర్చరు. కాబట్టి పిల్లలు ఐదేళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సాధారణ ఆధార్ నుంచి బాల్ ఆధార్‌ను వేరు చేసేందుకు UIDAI 0-5 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బ్లూ కలర్ ఆధార్ కార్డ్‌లను జారీ చేస్తుంది. బిడ్డకు 5 ఏళ్లు వచ్చిన తర్వాత బ్లూ కలర్ బాల్ ఆధార్ చెల్లదు. ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వారి బయోమెట్రిక్‌లతో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలి. పిల్లల ఆధార్‌లో బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసేందుకు uidai.gov.inని విజిట్ చేయండి. పిల్లల ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేయండి.  పిల్లల జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు రుజువు, చిరునామా డాక్యుమెంట్లతో ఆధార్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేయండి. బాల్ ఆధార్ కార్డ్‌ని రిజిస్టర్ చేసేటప్పుడు లేదా అప్‌డేట్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా తమ ఆధార్ కార్డ్‌ని సమర్పించాలి. ఆధార్ ఎగ్జిక్యూటివ్ పిల్లల ఫేస్ ఫొటో, వేలిముద్రల వంటి బయోమెట్రిక్‌లను యాడ్ చేస్తారు. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఆధార్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన రసీదు స్లిప్‌ను జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. 

Popular Posts